24, జనవరి 2020, శుక్రవారం

సమస్య - 3260 (పండుగనాఁడు...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"పండుగనాఁడు పలికె సతి వండ నటంచున్"
(లేదా...)
"పండుగనాఁడు వండనని భామ వచించెను కచ్చితమ్ముగా"
(కళ్యాణ్ చక్రవర్తి గారికి ధన్యవాదాలతో...)

119 కామెంట్‌లు:


  1. నడిరేయి సరదా పూరణ:

    వండుచు రాత్రినిన్ పవలు వారము వారము బోరుకొట్టగా
    మెండుగ పిజ్జలున్ బరువు మీరిన కోడుల బిర్యనిన్నహో
    దండిగ నింటికిన్ పనుపు దాతలు నుండగ హైద్రబాదునన్
    పండుగనాఁడు వండనని భామ వచించెను కచ్చితమ్ముగా

    రిప్లయితొలగించండి

  2. ఆటవిడుపు సరదా పూరణ:
    (జిలేబి గారికి అంకితం)

    దండిగ కోడలిన్ సణిగి దారుణ రీతిని బాధపెట్టగా
    మండుచు కోపమందునను మారణ హోమము జేసి కొంపనున్
    చండిని వోలుచున్ కసిరి జాస్తిగ మొట్టుచు నత్తగారినిన్
    పండుగనాఁడు వండనని భామ వచించెను కచ్చితమ్ముగా

    రిప్లయితొలగించండి
  3. మెండుగ వంటల నొండితి
    దండుగ నావలన కాదు దయ చూపంగన్
    దండిగ యలసితి గావున
    పండుగ నాడు పలికె సతి వండ నటంచున్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      "వంటల వండితి... దండిగ నలసితి.." అనండి.

      తొలగించండి
    2. మెండుగ వంటల వండితి
      దండుగ నావలన కాదు దయ చూపంగన్
      దండిగ నలసితి గావున
      పండుగ నాడు పలికె సతి వండ నటంచున్

      తొలగించండి


  4. No holidays get to job my hubby



    గుండమ్మా! సెల వీయవె
    వండను నేనొక్కనాడు పతినే! వినవే!
    మెండుగ వేడంగ పతియె
    పండుగనాఁడు పలికె సతి వండ నటంచున్!



    జిలేబి

    రిప్లయితొలగించండి


  5. పిండిని రుబ్బినాడను ప్రవీణత చూపుచు పొద్దుగూకులన్
    దండిగ వండి వార్చితి నిదానము గా రుచిగాను రుచ్యుడన్!
    భండిలుపై దయన్ గొనుమ! ప్రార్థన చేయగ త్రోసివేయుచున్
    పండుగనాఁడు వండనని భామ వచించెను ఖచ్చితమ్ముగా!


    జిలేబి

    రిప్లయితొలగించండి
  6. నిండుగ గర్భము దాల్చితి
    మెండుగనికవంటజేయ మేలది యగునా?
    పండుగ తీపి పదార్ధము
    పండుగనాడుపలికె సతి వండనటంచున్.


    పెండిలి నాడెజెప్పితిని పేర్మిగ నాయసమర్ధతంతయున్
    కుండలు బద్దలాయెనట కుట్రకుతంత్రములేని దాననే
    ఉండగవీలులేదనిన ,ఊరికివెళ్ళెద సంతసమ్ముగా
    పండుగనాడువండనని, భామవచించెను కచ్చితమ్ముగా!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
      రెండవ పూరణలో 'అసమర్థత+అంత' అన్నపుడు సంధి లేదు. అక్కడ "నా యసమర్థతన్ దగన్...బ్రద్దలాయె... లేదనిన నూరికి నేగెద..." అనండి.

      తొలగించండి
  7. కండలు యుండెనీకనుచు,కాంతయెబల్కునుమాటిమాటికిన్
    తిండియుతిప్పలన్ననవి,తీరుగజేసెడువాడవీవుగా!
    వండగలేనునేననుచు,వాస్తవమన్నదిజెప్పుచుంటి యీ
    పండుగనాడువండనని, భామవచించెను కచ్చితమ్ముగా!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'కండలు+ఉండె' అన్నపుడు సంధి నిత్యం, యడాగమం రాదు. "కండలు గల్గె.." అనండి.

      తొలగించండి
  8. పండిన దన కడుపున గల
    పండును బోలిన శిశువును భరియించునెడన్
    నిండెను నెలలనుచు
    పండుగనాఁడు పలికె సతి వండ నటంచున్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      మూడవ పాదంలో గణభంగం. "నిండెను నాకు నెల లనుచు" అనండి.

      తొలగించండి
  9. దుండికి పెనిమిటి చెప్పెను
    దండిగ బంధువులు వచ్చెదరట గదసఖీ!
    వండుము మాంసమ్మనుచును
    పండుగనాఁడు, పలికె సతి వండనటంచున్.

    రిప్లయితొలగించండి
  10. నిండెను మాసముల్ కడుపు నిండుగ పండును బోలుబిడ్డ లో
    నుండగ నూరకన్దిరుగ నొల్లగనైతిని నొప్పులప్పుడే
    మెండుగ వచ్చుచున్నవని మిక్కిలి బాధ వహింప లేకనా
    పండుగనాఁడు వండనని భామ వచించెను కచ్చితమ్ముగా"

    రిప్లయితొలగించండి
  11. నిండుమనంబుతోడ కడు నిష్ఠను బూనుచు బ్రాణనాథ! వే
    దండముఖాధిసేవితుని దన్మయతన్ శివరాత్రి యౌటచే
    దండములంచు గొల్వదగదా? యుపవాసము చేసి కాన నా
    పండుగనాఁడు వండనని భామ వచించెను కచ్చితమ్ముగా.

    రిప్లయితొలగించండి
  12. ఎండిన చేపల దెచ్చితి
    వండుము నాకిష్టమనుచు భర్తయె పలుకన్
    ఖండించుచు పతి మాటల
    పండుగ నాఁడు పలికె సతి వండ నటంచున్.

    రిప్లయితొలగించండి
  13. దండిగ సేవించి మధువు
    చెండికి బలియిచ్చికోడిఁ జేయమనంగన్
    కండగల కోడి కూరను
    పండుగనాఁడు పలికె సతి వండ నటంచున్

    రిప్లయితొలగించండి
  14. కస్తూరి శివశంకర్శుక్రవారం, జనవరి 24, 2020 5:56:00 AM

    దండగ వలదని పల్కుగ
    వండిన వంటలని తినక వదిలిన పతిపై
    మండిన నాడే నుడివెద
    పండుగనాఁడు పలికె సతి వండ నటంచున్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కస్తూరి శివశంకర్శుక్రవారం, జనవరి 24, 2020 6:09:00 AM

      నిండుమనంబున సతియే
      పండుగ నాడు యుపవాస వ్రత మొనరింపఁన్
      మెండైన దీక్ష జేయగ
      పండుగనాఁడు పలికె సతి వండ నటంచున్

      తొలగించండి
    2. మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
      మొదటి పూరణలో "దండుగ వలదని" అనండి.
      రెండవ పూరణలో 'నాడు+ఉపవాస' మన్నపుడు సంధి నిత్యం. యడాగమం రాదు. "పండుగనాడె/నాటి యుపవాస..." అనండి.

      తొలగించండి
    3. కస్తూరి శివశంకర్శుక్రవారం, జనవరి 24, 2020 7:02:00 AM

      చాలా చక్కటి సూచన గురువర్యా ������

      తొలగించండి
  15. ' పండుగనాడు కూడ కనఁ బాతమగండ! నవీనవస్త్రముల్
    మెండు ధరించమే!' యనెడు మీరనుమీరిన చిత్తవృత్తిలో
    చండిక వోలె, భీషణవచశ్శరవిద్వదమేయురాలునై
    పండుగనాఁడు వండనని భామ వచించెను కచ్చితమ్ముగా

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
      "మీరను/మేరను మీరిన" టైపాటు అనుకుంటాను.

      తొలగించండి
    2. అవునండి మార్పుతో

      ' పండుగనాడు కూడ కనఁ బాతమగండ! నవీనవస్త్రముల్
      మెండు ధరించమే!' యనెడు మేరనుమీరిన చిత్తవృత్తిలో
      చండిక వోలె, భీషణవచశ్శరవిద్వదమేయురాలునై
      పండుగనాఁడు వండనని భామ వచించెను కచ్చితమ్ముగాఈ

      తొలగించండి
  16. వండెదకోరినవన్నియు
    మెండుగ ననుదినమునందు మేటిగ మీకున్
    వండను నేడేకాదశి
    పండుగనాడు పలికెసతి వండనటంచున్

    రిప్లయితొలగించండి
  17. మైలవరపు వారి మడి పూరణ

    శంకరాభరణం.. సమస్యాపూరణం..

    పండుగనాఁడు వండనని భామ వచించెను కచ్చితమ్ముగా !

    "వండితివెన్నొ వంటలను., పాత్రల దోమి శ్రమించినావు! కూ...
    ర్చుండుము! కొంతసేపిటు పరుండుము రమ్మని "భర్త పిల్వగా,
    పొండటు రాను! మీ రసికబుద్ధినెరుంగనె యిన్నినాళ్లుగా!
    పండుగనాఁడు వండనని భామ వచించెను కచ్చితమ్ముగా !

    (నాఁడు+పండనని.. గసడదవాదేశం)

    మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మైలవరపు వారి పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.

      తొలగించండి
    2. అధ్భుతమైన సరదా పూరణ !!నమోనమః!

      తొలగించండి
    3. 🙏🙏శ్రీమతి సీతాదేవి గారికి.. మీకు.. నమోనమః 🙏🙏

      తొలగించండి


    4. ఈ గసడదవాదేశం అనగానేమి ? భూగోళములో ఈ దేశమెచట వున్నది ?



      జిలేబి

      తొలగించండి

    5. యణాదేశ మెచట గలదు ?

      ఈ రెండు దేశముల ప్రాముఖ్యత వివరించుడీ



      జిలేబి


      జిలేబి

      తొలగించండి
  18. దండుగ యాయెను నాశ్రమ 
    వండిన వంటలు తినకను పడియుండంగా
    వండెదనా నేడనుచును  
    "పండుగనాఁడు పలికె సతి వండ నటంచున్"  

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'తినక' అన్నది కళ. ద్రుతాంతం కాదు. "తినకయె" అనండి.

      తొలగించండి
  19. పండుగనాడున కూడను
    దండిగ చాకిరి సలుపగ వలదని పించన్
    మెండగు యలసట తోడన
    పండుగనాఁడు పలికె సతి వండ నటంచున్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'మెండగు నలసట తోడను' అనండి.

      తొలగించండి
    2. క్షమించండి , రెండవ పాదంలో గణదోషమైనది.
      'బండెడు చాకిరి' అనవచ్చా ?

      తొలగించండి
    3. గణదోషం కాదు, యతిదోషం.
      మీ సవరణ బాగున్నది.

      తొలగించండి
  20. కండలుగల్గెనీకనుచు కాంతయుబల్కెను మాటిమాటికిన్
    తిండియుతిప్పలన్నియును,తీరుగజేసెడువాడవీవెగా
    వండగలేనునేననుచు,వాస్తవమన్నదిజెప్పుచుంటి యీ
    పండుగనాడువండనని భామ వచించెనుకచ్చితమ్ముగా
    ++++++++++++++++++
    రావెలపురుషోత్తమరావు

    రిప్లయితొలగించండి
  21. కందం

    పండుగ గిండుగ లెంచకె
    కండ యనఁగ నిష్టమనుచు గండడుఁ గోరన్
    గొండలరాయని సాక్షిగఁ
    బండుగనాడు పలికె సతి వండనటంచున్

    రిప్లయితొలగించండి
  22. నిండు మనంబున నన్నియు
    వండుట లో సహకరింప వలసిన రీతి న్
    వండెద ననుచున్ బతితో
    పండుగ నాడు సతి పలికె వండ నటంచు న్

    రిప్లయితొలగించండి
  23. సమస్య :-
    పండుగనాఁడు పలికె సతి వండ నటంచున్

    *కందం**

    మెండుగ మద్యము త్రాగుచు
    నిండు నిషా తో సతతము నృత్యము జేయన్
    తిండిని మగనికి బెట్టక
    పండుగనాఁడు పలికె సతి వండ నటంచున్
    ..................✍చక్రి

    రిప్లయితొలగించండి
  24. తుండముగల్గిన వేలుపు
    పండుగనాడు బలికెసతి వండనటంచున్
    మెండుగ తామసమిచ్చు ప
    లాండువు,బెల్లపు కుడుములు లావుగవండెన్
    పలాండువు = ఉల్లి,వెల్లుల్లి

    రిప్లయితొలగించండి
  25. నిండుగ ప్రాణికోటి అవనీస్థలి జాగృతి నొందగా తగున్
    పండుగనాడు ' యన్వి 'నెటు వండుదు? తప్పగు జీవితేశ్వరా!
    పండుగనాడు వండనని భామ వచించెను కచ్చితంబుగా
    "పండుగ పండుగే! వసుధ శాంతి సుఖంబులు పర్వగా వలెన్."

    రిప్లయితొలగించండి
  26. పెండిలి నాడెజెప్పితిని పేర్మిగ నాయసమర్ధతన్ దగన్
    కుండలు బ్రద్దలాయెనట కుట్రకుతంత్రములేని దాననే
    ఉండగవీలులేదనిన ,నూరికివెళ్ళెద సంతసమ్ముగా
    పండుగనాడువండనని, భామవచించెను కచ్చితమ్ముగా!
    (సవరణ పాఠము ధన్యవాదాలతో)
    రావెలపురుషోత్తమరావు

    రిప్లయితొలగించండి
  27. 24/01/2020
    అందరికీ నమస్సులు 🙏

    *కం ||*

    మెండుగ తిండిని కడుపుకు
    నిండుగ బెట్టితి నిరతము నిజమిది యనుచున్!
    వండగ మేయుట చాలును
    *"పండుగనాఁడు పలికె సతి వండ నటంచున్"*

    *కళ్యాణ్ చక్రవర్తి, ముంబాయి*
    🙏🌷🙏🌷🙏

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. 24/01/2020
      నా మరో పూరణ 🌹🌹😃

      *కం ||*
      వండను స్వగృహము నందున
      నుండగ స్వగృహా మిఠాయి యూరింపగనే
      దండగ కాదది యనుచున్
      *"పండుగనాఁడు పలికె సతి వండ నటంచున్"*

      *కళ్యాణ్ చక్రవర్తి, ముంబాయి*
      🙏🙏

      తొలగించండి
  28. ( ఒక శ్రీమతి ప్రపంచ మహిళా దినోత్సవం నాడు తన శ్రీవారితో అంటున్నది )
    " అండగ నిల్చి యుండవు ; స
    మాంతరదృష్టిని చూడవెన్నడున్ ;
    దండుగమారి ఖర్చులను
    దండిగ జేతువు ; కాంత లందరున్
    నిండుగ స్త్రీదినోత్సవము
    నేడిట నింపుగ జేసికొందు; రీ
    పండుగనాడు వండ " నని
    భామ వచించెను కచ్చితమ్ముగా .
    ( సమాంతరదృష్టి - సమానమైన చూపు )

    రిప్లయితొలగించండి
  29. పండుగనాఁడు పలికె సతి
    వండ నటంచున్ పలలము; భక్తిని శుచిగా
    వండెద శాకాహారము
    నిండుగ నైవేద్యము నిడ నీశ్వరునకనెన్
    (పలలము = మాంసము)

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సమస్యను స్థానభ్రంశం చేసి చెప్పిన మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.

      తొలగించండి
  30. నిండుగ ప్రతిదినమందున
    దండిగ వంటలను జేసి తాంతియె గల్గన్
    సండే శలవని, జెండా
    పండుగ నాడు పలికె సతి వండనటంచున్!!!


    రిప్లయితొలగించండి
  31. ఉత్పలమాల
    పండగ మానసమ్ము లిరువంకల నే కులమంచు నెంచకే
    పెండిలి యాడి శాకముల వీడక నేను, పలమ్ము మీకనన్
    వండుచు నుంటి నిష్టమని, పాడియె వత్తిడిఁ జేయనన్నిలన్
    పండుగ నాడు వండనని భామ వచించెను కచ్చితమ్ముగా

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      "...యొత్తిడిఁ జేయ నన్నిటుల్..." అనండి.

      తొలగించండి
    2. గురుదేవులకు ధన్యవాదములు. సవరించిన పూరణ :

      ఉత్పలమాల
      పండగ మానసమ్ము లిరువంకల నే కులమంచు నెంచకే
      పెండిలి యాడి శాకముల వీడక నేను, పలమ్ము మీకనన్
      వండుచు నుంటి నిష్టమని, పాడియె యొత్తిడిఁ జేయనన్నిటుల్
      పండుగ నాడు వండనని భామ వచించెను కచ్చితమ్ముగా

      తొలగించండి
  32. పండుగపనులెన్నియొయిట
    నుండగదెచ్చితె?పతివర!పృధురోమమునున్
    చెండికిమడిగా కావున
    పండుగనాడుపలికెసతివండనటంచున్

    రిప్లయితొలగించండి
  33. రిప్లయిలు
    1. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

      తొలగించండి
    2. ఈ రోజు శంకరా భరణము వారి సమస్య


      పండుగనాఁడు పలికె సతి వండ నటంచున్

      ఇచ్చిన పాదము కందము నా పూరణము సీసములో


      ఉదయంబు నొకరికి నుప్మా, కోరు నొకరు బిస్కెట్లు తోడుగ బ్రెడ్డు,జాము,
      రాగుల జావ సరసముగ నొకరికి , దండిగ నొకరికి యెండి నట్టి
      ఫలములు గింజల మొలకులు, నిడ్లీలు బూస్టు,కోరు నొకరు, బ్రూ నొకరికి
      ముడి బియ్య పు పితువున్ ముదముగ నొక్కరు కోరును, చప్పిడి కూర,పప్పు
      వంటలు నొకరికి, వండ వలెను సన్న బియ్యపు టన్నము బిరుసు గాను
      గుత్తి వంకాయల కూర తిన రొకరు తోటకూ రయె పడదుగ నొకరికి
      పులిహోర నొకరికి, పూర్ణాలు నొకరికి తినలేడు స్వీట్లేమి పెనిమిటి, కొని
      నవి మామ తినబోడు, నరకము చూపించు గా సతతము పండుగ దినము, పొద
      లిక కోరి పండుగ నాఁడు పలికె సతి వండన టంచున్విభజన ముగల


      వంట నీ దినముననేను, వండు చుంటి
      నొక్క టే వంట నీ రోజు నిక్క మిదియె
      ననుచు తల్లి పలికి నంత నచ్చెరువును
      బడసి రెల్లరు నాతల్లి బాధ జూసి

      పొదలిక = సంతోశము, పితువు = భోజనము

      తొలగించండి
    3. మీ సీసపద్య పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  34. చండికమాతకున్నిపుడుచక్కెరపొంగలివండుచుండగా
    కొండొకకోడికూరపతికోరగవెంటనెబల్కెబత్నిదా
    పండుగనాడువండననిభామవచించెనుకచ్చితమ్ముగా
    బండుగలైనపిమ్మటనువండుదుగోడినికూరగాప్రియా!

    రిప్లయితొలగించండి
  35. తుండము నేకదంతమును తోరపుబొజ్జయు వామహస్తునిన్
    పండుగనాడు వండనని భామవచించెను కచ్చితమ్ముగా
    మెండుగ తామసమ్మిడెడు మ్లేచ్ఛులకందము కూరలందునన్
    వండుచు బెల్లపుంగుడుము భక్తిని స్వామి నివేదనంబుగన్
    మ్లేచ్ఛులకందము = వెల్లుల్లి

    రిప్లయితొలగించండి
  36. చెండుం దుఱిమి సిగ పయిన్
    బెండలు గిండ లన రోఁత బింబాధరమే
    యుండంగఁ గాంచ మెఱసెడు
    పండుగ నాఁడు పలికె సతి వండ నటంచున్


    ఒండొరు లేమి పండు గని యూరక పల్కుచు వత్తు రెల్లరుం
    గండలు లేవు వండ నిట కాయము నందుఁ గనంగ దండిగన్
    మెండుగ బంధు మిత్ర తతి మించి చొరంబడ భీత చిత్తయై
    పండుగనాఁడు వండనని భామ వచించెను గచ్చితమ్ముగా

    రిప్లయితొలగించండి
  37. దండిగధనమున్నప్పుడు
    పండుగజరిపిన తగునని పతిదేవునితో
    దండగ పనులెందుకనుచు
    పండుగనాఁడు పలికె సతి వండ నటంచున్

    రిప్లయితొలగించండి
  38. ఉ:

    దండిగ జేరు బంధుగులు దార సుతోదర లోక మెల్లరున్
    కుండెడు పాలు పెర్గులను గూర్చగ ప్రొద్దుట బద్దకమ్మవన్
    బండెడు నంట్లు తోముటయు భర్తయు పిల్లల గోల నెంచుచున్
    పండుగ నాడు వండనని భామ వచించెను కచ్చితమ్ముగా

    వై. చంద్రశేఖర్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'అవన్' అన్న ప్రయోగం సాధువు కాదు.

      తొలగించండి
  39. పండుగ చేయగాతగును పంట సమృద్ధిగ పండియింటిలో
    దండిగ గాదులన్నిటను ధాన్యపురాసులు వచ్చిచేరగా
    పంటలులేకరైతు కడుబాధలనొందగ పిండివంటలన్
    పండుగనాఁడు వండనని భామ వచించెను కచ్చితమ్ముగా

    రిప్లయితొలగించండి
  40. నా మరో పూరణ 🌹🌹🌹

    *కం ||*

    అండగ నీకును మమ్మీ
    యుండగ తోడుగ మనకిక నుపయోగపడున్
    మొండిగ యడుగకు నన్నని
    *"పండుగనాఁడు పలికె సతి వండ నటంచున్"*

    *కళ్యాణ్ చక్రవర్తి, ముంబాయి*
    🙏

    రిప్లయితొలగించండి
  41. నా మరో పూరణ 🌹🌹🌹🌹
    (చచ్చింది గొర్రె)😀

    *కం|*

    ఫ్రెండుగ తలచిన పతితో
    *పండుగనాఁడు పలికె సతి, వండ నటంచున్*
    నుండగ నీవే తోడుగ
    తిండికి లోటేమి మనకు తినిపించమనెన్!!

    *కళ్యాణ్ చక్రవర్తి, ముంబాయి*
    🙏😃

    రిప్లయితొలగించండి
  42. మండెడు యెండలు చచ్చె ను
    గుండిగ వండుచును దించ గుండెలుబగులున్
    రెండవసాయము లేకను
    పండుగనాడుబలికె సతి వండన టంచున్
    **************************
    రావెలపురుషోత్తమరావు

    రిప్లయితొలగించండి
  43. మిత్రులందఱకు నమస్సులు!

    ఎండిన చేఁపలన్ మగఁడు హెచ్చిన సంతస మందుచున్ దగన్
    దండిగ భార్య కిచ్చి, "యివి దబ్బున వండు!" మటంచుఁ గోరఁగా,
    మండుచు నామె, "యీ దినము మాన్య సుపర్వము! మాంస మిప్పు డీ

    పండుగనాఁడు వండ!" నని భామ వచించెను కచ్చితమ్ముగా!

    రిప్లయితొలగించండి
  44. ఎండలు మండువేళ కడు హీనుడు మిత్రులు వెంటరాగ కో
    దండము చేతబూని చనె దావము మాపటి కూటి కోసమై
    గండడు తెచ్చినట్టి శశకమ్మును గాంచిన యంత మాంసమున్
    పండుగనాఁడు వండనని భామ వచించెను కచ్చితమ్ముగా

    రిప్లయితొలగించండి
  45. ..............🌻శంకరాభరణం🌻...............
    ..................🤷🏻‍♂సమస్య 🤷‍♀....................
    పండుగనాఁడు వండనని భామ వచించెను
    కచ్చితమ్ముగా

    సందర్భము: శ్రీ రాముడు సముద్ర తీరానికి చేరుకున్నాడు...
    దూతిన్హ సన సుని పురజన బానీ
    మందోదరీ అధిక అకులానీ
    రహసి జోరి కర పతి పగ లాగీ
    బోలీ బచన నీతి రస పాగీ
    (శ్రీ రామచరిత మానసము)
    పురజనుల మాటలను దూతల ద్వారా విని మందోదరి మిక్కిలి వ్యాకులపడింది. ఏకాంతంలో రావణుని పాదాలపైబడి వేడుకొని నీతి వచనాలు పలికింది.
    లంకా మహా సామ్రాజ్య పట్టమహిషి భర్తయైన రావణుని మేలు గోరే పతివ్రతా శిరోమణి మండోదరి ఒక శివరాత్రి పండుగనాడు ఉపవాస జాగరములతో శివుని సేవింతా మని మృదూక్తులతో పలికింది పద్యంలో చెప్పిన విధంగా.
    వండడం లేదా వంటవాండ్లతో వండించడం ఈరోజు చేయ నంటోంది మండోదరి. అలుకతో స్వప్రయోజనంకోసమో ఓపలేనితనంతోనో అలసత్వంతోనో కాదు. భర్త కోసం వంశ గౌరవంకోసం సమస్త లంకారాజ్య సంక్షేమంకోసం శివభక్తి మనస్సులో నిండారగా భర్తతో ప్రేమతో చెబుతున్నది.
    రాక్షసుల దైవతం శివుడే అని అతని నారాధిస్తే సర్వారిష్టాలూ తొలగిపోతాయనీ మేలు కలుగుతుం దనీ ఆ సాధ్వి భావన. అదీ గాక ఆమెకు ప్రాణనాథుడు గదా రావణుడు! ఆతని ప్రాణానికి ముప్పు వాటిల్లుతుందో యేమో అని ఆమె భయం. ఆ ముప్పు తొలగి మేలు కలుగా లని ఆమె ప్రగాఢమైన ఆకాంక్ష.
    ~~~~~~~~~~~~~~~~~~~~~~~

    *పతివ్రత మండోదరి*

    "నిండు మనంబులన్ శివుని
    నిల్పి భజింపగ ప్రాణనాథ! రా
    రం.. డిది ముఖ్య మౌను శివ
    రాత్రికి.. నే డుపవాస జాగరా
    లుండిన మేలు రావణ వి
    భూ! వినుమా!" యని ప్రేమతోడ "నీ
    పండుగనాఁడు వండ" నని
    భామ వచించెను కచ్చితమ్ముగా

    ✍️~డా.వెలుదండ సత్యనారాయణ
    పరమార్థ కవి
    24.01.20
    -----------------------------------------------------------

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఆర్యా మీ పూరణలు ఓ అద్భుతం ..
      ఏ సమస్యని అయినా రామాయణంతో ముడిపెట్టి చేస్తారు ..
      🙏🙏🙏🙏

      తొలగించండి
  46. రిప్లయిలు
    1. ఈ రోజు శంకరా భరణము వారి సమస్య


      పండుగనాఁడు పలికె సతి వండ నటంచున్

      ఇచ్చిన పాదము కందము నా పూరణము సీసములో


      దశరధా గ్రజుడు కో దండము జేబూని దశకంఠుని దునిమి ధరణి సుతను
      కాపాడి యా పుష్పకములోన సౌమిత్రి, హనుమ ,సుగ్రీవులు ననుసరించ
      నయోధ్య చేరి యీ నాడు జరుపచుండె పట్టాభి షేకపు పండుగ, “ విను,
      మగడా పిలిచెనుగా మనలను విందుకున్ వెడలంగ వలయును వేడుకలను
      చూడ నీ పండుగ నాఁడు, పలికె సతి వండ నటంచున్ ని వాసమందు

      నెట్టి వంటలీ దినమున, నెలమి తోడ
      మనము వెడలంగ వలయు , మారు పలుక
      వలదు ,సిద్ధము కమ్మని తెలిపె నొకడు
      తల్లి తండ్రులను గనుచు మెల్లగాను






      తొలగించండి
  47. నిండుమనమ్ముతోనిలిచి,మెండుగనుండెడు రాజధానికై
    పండు పొలాలనిచ్చితిమి,పావనమౌనని మాదుజీవికల్
    గుండెలమీదగుద్దితిరి,కూటమి గట్టుచుకొత్తనేత,లీ
    పండుగనాడువండనని, భామవచించెను కచ్చితమ్ముగా!

    రిప్లయితొలగించండి
  48. మెండగురాజధానికయి,మేలుగబండు పొలాలనివ్వగా!
    మొండిగకొత్తపాలకులు,మోసముజేసితిరయ్య వంచకుల్
    నిండుగసున్నజేసితిరి,నిందలువేయుచు యాడువారిపై
    పండుగనాడువండనని భామవచించెను కచ్చితమ్ముగా!

    రిప్లయితొలగించండి
  49. పండును మూడుపంటలిట,పావనమౌయమరావతిన్ సదా!
    గుండెలనిండ ప్రేమమెయి,గుట్టుగనమ్ముచునివ్వక్షేత్రముల్
    దండుగమారినేతలిట,దాతలనందరి దిట్టిపోయ నీ
    పండుగనాడువండనని,భామవచించెను కచ్చితమ్ముగా!

    రిప్లయితొలగించండి
  50. పండుగ పూటనె పతియే
    మెండుగ మాటాడగాను మితిమీరంగన్
    ఎండుద మీరోజు మనము
    పండుగనాఁడు పలికె సతి వండ నటంచున్!!

    రిప్లయితొలగించండి
  51. బండికి మిత్రులెల్లరును వచ్చెదరింటికినాదరమ్ముతో
    పండుగనాటియట్లుగను పాయసమాదిగ పిండివంటలను
    వండుమనంగతా పలికె వాసిగ నండజవాహు పర్వమీ
    పండుగ నాడు వండనని భామ వచించెను ఖచ్చితముగా

    రిప్లయితొలగించండి
  52. కం.
    చండాలము దెస్తివనుచు !
    బండుగనాడు పలికె సతి వండనటంచున్ !
    మండుచు కొరకొర జూచుచు !
    దండగ జేస్తివి ధనమని తన్నెను గురువా !!

    రిప్లయితొలగించండి