ధన్యవాదములండీ నాపద్య భావము నచ్చినందులకు! శుభాలూ,పోషణా యిచ్చేవారికి కూడ భోగితో సంబంధం ఉన్నది కదా!ముక్తి కావాలన్నా దొరుకుతుంది. అయినా జనులకు పామంటే భయం అని నా భావన! నమస్సులు!
సందర్భము: రజో రాగాత్మకం విద్ధి తృష్ణాసంగ సముద్భవమ్ తన్నిబధ్నాతి కౌంతేయ! కర్మ సంగేన దేహినమ్ 7 (గీత - గుణత్రయవిభాగ యోగం) రజోగుణం విషయాలతో ఆత్మను రంజింప జేస్తుంది. విషయాభిలాషవలన ఫలాపేక్షతో కర్మ లంపటుణ్ణి చేస్తుంది. ఇంకా తృష్ణ , లోభం, ప్రవృత్తి, అశాంతి భోగవాంఛ మొదలైన వెన్నో ఎడతెగకుండా చుట్టుముట్టుతాయి. (12 వ శ్లో) వీటన్నిటి ఫలం దుఃఖమే! (రజసస్తు ఫలం దఃఖమ్) రావణుడే యిందుకు ప్రతీక. నిర్విరామంగా శక్తి యుక్తులను, తెలివి తేటలను, ధనాన్నీ అన్నిటినీ విచ్చలవిడిగా ఐహికంకోసమే వాడేస్తూ తమను తా మెంతో గొప్పవాళ్ళ మనుకుంటూ ఆముష్మికాని కేమీ మిగిలించుకోలేని ఆధునికులకు ఫల మేమిటో! కొంత కష్టపడితే రజోగుణాన్ని విడువ వచ్చు. శాశ్వత సుఖాన్ని పొందవచ్చు. కాని రావణుడు విడువలేదు. తనలోనే దాచుకున్నాడు. తనువు ఎంత కష్టపడ్డా శాశ్వతంగా వుండేది కాదు. కాని తనువును విడువలే నని, అది ఎప్పటికీ వుండా లని తపస్సు చేసినాడు. దానికై భోగాలన్నీ విడిచిపెట్టినాడు తాత్కాలికంగా. అట్టి రావణుని చూచి జనులకు భయం పుట్టింది. ఎందుకంటే ఇతడెంత గొప్ప తపస్సు చేస్తే అంత గొప్పగా జనాలను పీడిస్తా డని భయం. తపః ఫలాన్ని త్యాగంతో లోక కళ్యాణానికి కాకుండా స్వార్థంతో లోక పీడకై వాడుతా డని భయం. ఎంత గొప్ప వరాలు పొందినా తనువు మాత్రం శాశ్వతంగా నిలువనే లేదు. అంటే తపస్సంతా వ్యర్థ మయినట్టే కదా! రజోగుణాన్ని జీవితాంతం విడువలేకపోతే ఎన్ని భయంకరమైన పరిణామాలు లభిస్తాయో అన్నీ తప్పకుండా లభించితీరుతా యనీ రావణుని జీవితంలో నిరూపించబడింది కదా! రజస్సు = రజోగుణం ప్రాకట తపః ఫలార్థ = గొప్పదైన తపః ఫలంకోసం దూరీకృత వర భోగి = దూరం చేసుకున్న మంచి మంచి భోగాలు గలవాడు ~~~~~~~~~~~~~~~~~~~~~~~ తన రజస్సును విడలేక దాచి, విడను
తనువు ననువాడు రావణు డనినయంత
ప్రాకట తపః ఫలార్థ దూరీకృత వర
భోగి యనినంత జనులకుఁ బుట్టు భయము
✍️~డా.వెలుదండ సత్యనారాయణ పరమార్థ కవి 14.01.20 -----------------------------------------------------------
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండి
రిప్లయితొలగించండినడిరేయి సరదా పూరణ:
Muthukur, 1952 (Home Service)
రాగనె కత్తి తీయుచును రక్కసి రూపున సానపట్టుచున్
దాగుచు జేరి వెన్కనహ దగ్గుచు నెత్తిని గంట్లువెట్టుచున్
పోగుల వెంట్రుకల్ దులిపి మోమున జల్లుచు తుమ్ములిచ్చెడిన్
భోగి యనంగనే భయముఁ బొంది వడంకెద రెల్ల భూజనుల్
భోగి = మంగలి (శబ్దరత్నాకరము)
వెలుచ గనినంత కొందరు వీగి పోవు
రిప్లయితొలగించండిభక్తి మీరగ ఎందరో ముక్తి కొఱకు
కొలిచి పాలను పండ్లను గొంతు నింపి
భోగి యనినంత జనులకుఁ బుట్టు భయము
రిప్లయితొలగించండిఆటవిడుపు సరదా పూరణ:
(జిలేబి గారికి అంకితం)
Lower Middle Class Woes (1970s):
రాగనె మూడు రోజులకు రంపము పెట్టగ కూతురల్లుడున్
తేగల తోడ హారమును తెమ్మని పోరుచు చేతివాచితోన్
దాగుడు మూతలొప్పకయె ధ్వంసము జేయగ దుడ్డునంతనున్
భోగి యనంగనే భయముఁ బొంది వడంకెద రెల్ల భూజనుల్
సమస్య :-
రిప్లయితొలగించండి"భోగి యనినంత జనులకుఁ బుట్టు భయము"
*తే.గీ**
అవసరము లేని వస్తువులన్ని పేర్చి
మంట పెట్ట కాగితముకై నింటవున్న
పుస్తకముల నెక్కడ మంట పోతురనియు
భోగి యనినంత జనులకుఁ బుట్టు భయము
.....................✍చక్రి
రిప్లయితొలగించండిజోగుచు నిదుర మత్తుల జోష బోవు
వేడి పుట్టి జీవనమును వేగ వంత
ముగ గడిపెడు దినములిక ముందు పడును
భోగి యనినంత జనులకుఁ బుట్టు భయము
జిలేబి
పాము పగబట్టిన యెడల వదలకుండు
రిప్లయితొలగించండితనకు హాని చేసిన వాని దనుకయేను ;
రాష్ట్రమెల్ల దుడిచిపెట్టు రాజకీయ
భోగి యనినంత జనులకుఁ బుట్టు భయము
భోగి = పాము
రాగవిరాగముల్ గలిగి,రాజసమన్నదిలేని రాష్ట్రమున్
రిప్లయితొలగించండిదాగుడుమూతలేమిటికి? దాడిని మానుడు రాజధానిపై
వేగమె సాహసించియిక వేదనమాన్ పగ జూడకున్న యీ
బోగియనంగనే భయము బొందివడంకెదరెల్ల భూజనుల్.
జనుల మాటను వినక, స్వ జనులు చేయు
రిప్లయితొలగించండిదుష్ట కార్యము లకెపుడు నిష్ట పడుచు
కప్పములు మాత్రమే గోరు కామి, యేక
భోగి యనినంత జనులకు పుట్టు భయము
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిభక్తి వచనాలు ప్రవచించి ముక్తి నొసగు
రిప్లయితొలగించండిపథము జూపెదననుచును పలుకు యోగి
చాటు గానుశృంగారమున్ సల్పునట్టి
భోగి యనినంత జనులకుఁ బుట్టు భయము
భోగములెవ్వి శాశ్వతము??,భగ్నముజెయును శాంతిజీవికన్ !
రిప్లయితొలగించండిరాగలకాలమందు నువు రాజుగ మరిన యేమిగొప్పవున్
తీగగసాగు సమ్మెలివి ,తీపిని చేదుగ మార్చబోకు, యీ
భోగియనంగనే భయము బొందివడంకెదరెల్ల భూజనుల్.
మంట చూడంగ జామాత కంట నీరు
రిప్లయితొలగించండిబుగ్గి యయెనంట వారిల్లు భోగినాడు
కథను విన్నట్టి జనులెల్ల కలత చెంది
"భోగి యనినంత జనులకుఁ బుట్టు భయము"
రిప్లయితొలగించండిహచ్ హచ్ హచ్ ఒకటే తుమ్ములు హచ్ హచ్ హచ్
జోగుట చాలటంచు భళి జోరుగ చట్టని లేచి మంటలన్
భోగియటంచు ద్రోయుదురు పొద్దుటె హచ్చని తుమ్ములొచ్చునే
వేగము గాను నక్రమున వేడికి వాసన దూరగానరే!
భోగి యనంగనే భయముఁ బొంది వడంకెద రెల్ల భూజనుల్!
ఇంతకూ ఈ దినానికి భోగి అనే పేరెట్లా వచ్చిందో తెలిసిన వారు చెప్పగలరు .
జిలేబి
("భోగి" అంటేసర్పమనీ ,సుఖలాలసుడనీ పండుగ అనీ అర్థాలు )
రిప్లయితొలగించండిభోగి యనంగ బాముకద ;
పొంతన లేమిని కాటులౌ కదా !
భోగి యనంగ వైభవపు
పొంగును పొందిన రోగియౌ కదా !
భోగి యనంగ బండుగది
పోడిమి వస్తులు మంటపాల్గదా !
"భోగి "యనంగనే భయము
బొంది వడంకెద రెల్ల భూజనుల్ !!
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిమైలవరపు వారి పూరణ
రిప్లయితొలగించండిరోగిని గాంచి జాలిపడు లోకులు సాయము చేయనెంత్రు.., బై...
రాగిని గాంచి భక్తియుతులై పదముల్ భజియింతురట్టులే
త్యాగిని మెచ్చుకొంద్రు., ధనదాహముతో బ్రజ దోచి కుల్కునా
భోగి యనంగనే భయముఁ బొంది వడంకెద రెల్ల భూజనుల్!!
మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి
పంట లెండియు నప్పుల బాధ హెచ్చ
రిప్లయితొలగించండిజీవనంబు లు భారమై చీకు చింత
లందు మున్గిన తరుణాన నరుఁగు దెంచు
భోగి యని నంత జనులకు బుట్టు భయము
రాగల శీతలానిల పరాక్రమ భీకర ధాటికిన్ భయో
రిప్లయితొలగించండిద్వేగ మనస్కులై పలుచ దీగల బోలుచు నల్లలాడుచున్
దాగుదురుష్ణపున్దరుల దాన గడుంగడు చింతనొందుచున్
భోగి యనంగనే భయముఁ బొంది వడంకెద రెల్ల భూజనుల్"
రాగలకాలమున్ దెలియ వ్రాసిన బ్రహ్మము తెల్పె నీగతిన్
రిప్లయితొలగించండిసాగు మనోరథంబులిట సంపద లందవు వస్తుమూల్యముల్
వేగమె తాకునభ్రమును విస్తృతవాంఛలతాడనంబునన్
"భోగి యనంగనే భయముఁ బొంది వడంకెద రెల్ల భూజనుల్"
రిప్లయితొలగించండి... శంకరాభరణం... 14/1/2020 ...మంగళవారం
సమస్య.
*** *** **
భోగి యనంగనే భయముఁ బొంది వడంకెద రెల్ల భూజనుల్"
నా పూరణ. ఉ.మా.
** *** *
(మొదటి భోగి ..పాము ,రెండవ భోగి ...పండగ )
ఏగుచు నింటికిన్ బడగలెత్తుచు బుస్సని పైకి వచ్చె డా
భోగి యనంగనే భయముఁ బొంది వడంకెద రెల్ల భూజనుల్
ఏగుచు నింటికిన్ గళము నెత్తుచు నల్లుడు గాంక్ష దెల్పగన్
భోగి యనంగనే భయముఁ బొంది వడంకెద రెల్ల భూజనుల్
🌱 ఆకుల శాంతి భూషణ్ 🌱
🌷 వనపర్తి 🌷
భోగియె పానుపై తనరు పోషణనిచ్చెడు విష్ణుమూర్తికిన్
రిప్లయితొలగించండిభోగియె హారమై మెరయు భూరిశుభంబుల గూర్చు శంభుకున్
భోగియె యోగమున్ నిలుపు ముక్తినొసంగుచు యోగి కేలనో
భోగియనంగనే భయము బొంది వడంకెద రెల్లభూజనుల్
రెండవ పాదము చివర శూలికిన్ గా చదువ ప్రార్ధన!
తొలగించండిచాలా బాగుందండి మీ పూరణ భావము. గార్హస్థ్యభోగములు లేక ముక్తి లభించదు!
తొలగించండిధన్యవాదములండీ నాపద్య భావము నచ్చినందులకు! శుభాలూ,పోషణా యిచ్చేవారికి కూడ భోగితో సంబంధం ఉన్నది కదా!ముక్తి కావాలన్నా దొరుకుతుంది. అయినా జనులకు పామంటే భయం అని నా భావన! నమస్సులు!
తొలగించండి
రిప్లయితొలగించండిచంక లెత్తగ నీయదు చలిపులి యిల
సంబరాలకు నెలవగు సంకురాత్రి
వేడు కలనాడు తగినంత వేడి లేక
భోగి యనినంత జనులకుఁ బుట్టు భయము
భోగిమంటలు వేయంగ భూజనంబు
రిప్లయితొలగించండిఇండ్లలోపాతకుర్చీలు యితరములను
దొంగిలించుచువేతురు భోగిమంట
భోగి యనినంత జనులకుఁ బుట్టు భయము
భోగము భాగ్యముల్ గలుగు భూమిని నమ్మిన రైతుకందురే
రిప్లయితొలగించండిభోగి యనంగనే; భయముఁ బొంది వడంకెద రెల్ల భూజనుల్
త్యాగము జేసినన్ దగని యాతనలన్ బడదోసినట్టి యా
ఓగులవాని దౌష్ట్యముల కోపగ లేక నిదేమి ఖర్మమో
(ఓగులవాడు = దుష్టుడు, అధమాధముడు)
..............🌻శంకరాభరణం🌻...............
రిప్లయితొలగించండి..................🤷🏻♂సమస్య 🤷♀....................
భోగి యనినంత జనులకుఁ బుట్టు భయము
సందర్భము:
రజో రాగాత్మకం విద్ధి
తృష్ణాసంగ సముద్భవమ్
తన్నిబధ్నాతి కౌంతేయ!
కర్మ సంగేన దేహినమ్ 7
(గీత - గుణత్రయవిభాగ యోగం)
రజోగుణం విషయాలతో ఆత్మను రంజింప జేస్తుంది. విషయాభిలాషవలన ఫలాపేక్షతో కర్మ లంపటుణ్ణి చేస్తుంది.
ఇంకా తృష్ణ , లోభం, ప్రవృత్తి, అశాంతి భోగవాంఛ మొదలైన వెన్నో ఎడతెగకుండా చుట్టుముట్టుతాయి. (12 వ శ్లో)
వీటన్నిటి ఫలం దుఃఖమే! (రజసస్తు ఫలం దఃఖమ్) రావణుడే యిందుకు ప్రతీక.
నిర్విరామంగా శక్తి యుక్తులను, తెలివి తేటలను, ధనాన్నీ అన్నిటినీ విచ్చలవిడిగా ఐహికంకోసమే వాడేస్తూ తమను తా మెంతో గొప్పవాళ్ళ మనుకుంటూ ఆముష్మికాని కేమీ మిగిలించుకోలేని ఆధునికులకు ఫల మేమిటో!
కొంత కష్టపడితే రజోగుణాన్ని విడువ వచ్చు. శాశ్వత సుఖాన్ని పొందవచ్చు. కాని రావణుడు విడువలేదు. తనలోనే దాచుకున్నాడు.
తనువు ఎంత కష్టపడ్డా శాశ్వతంగా వుండేది కాదు. కాని తనువును విడువలే నని, అది ఎప్పటికీ వుండా లని తపస్సు చేసినాడు. దానికై భోగాలన్నీ విడిచిపెట్టినాడు తాత్కాలికంగా. అట్టి రావణుని చూచి జనులకు భయం పుట్టింది.
ఎందుకంటే ఇతడెంత గొప్ప తపస్సు చేస్తే అంత గొప్పగా జనాలను పీడిస్తా డని భయం. తపః ఫలాన్ని త్యాగంతో లోక కళ్యాణానికి కాకుండా స్వార్థంతో లోక పీడకై వాడుతా డని భయం.
ఎంత గొప్ప వరాలు పొందినా తనువు మాత్రం శాశ్వతంగా నిలువనే లేదు. అంటే తపస్సంతా వ్యర్థ మయినట్టే కదా! రజోగుణాన్ని జీవితాంతం విడువలేకపోతే ఎన్ని భయంకరమైన పరిణామాలు లభిస్తాయో అన్నీ తప్పకుండా లభించితీరుతా యనీ రావణుని జీవితంలో నిరూపించబడింది కదా!
రజస్సు = రజోగుణం
ప్రాకట తపః ఫలార్థ = గొప్పదైన తపః ఫలంకోసం
దూరీకృత వర భోగి = దూరం చేసుకున్న మంచి మంచి భోగాలు గలవాడు
~~~~~~~~~~~~~~~~~~~~~~~
తన రజస్సును విడలేక దాచి, విడను
తనువు ననువాడు రావణు డనినయంత
ప్రాకట తపః ఫలార్థ దూరీకృత వర
భోగి యనినంత జనులకుఁ బుట్టు భయము
✍️~డా.వెలుదండ సత్యనారాయణ
పరమార్థ కవి
14.01.20
-----------------------------------------------------------
ఉ:
రిప్లయితొలగించండివేగమె మర్లు టంచు తగు పెందలకాడన గ్రామమేగుటై
బీగము వేయనింటికిని బింకము బోతిని యేమి కాదనిన్
లోగిలి కొల్ల గొట్టిరిక లోపలి పస్తువులెల్ల గుల్లగాన్
భోగి యనంగనే భయము బొంది వడంకెద రెల్ల భూజనుల్
వై. చంద్రశేఖర్
చుట్టు ప్రక్కల నిండ్ల నున్నట్టి వారు
రిప్లయితొలగించండిబిట్టు రట్టులఁ దిట్టుచుఁ జుట్టు ముట్టఁ
గట్టె లుండ వక్కట నింట నెట్టు లింక
భోగి యనినంత జనులకుఁ బుట్టు భయము
సాగర సప్త వేష్టిత విశాల ధరాతల పాల నోత్థి తా
వేగ మనో ప్రవృత్తి జన భీకర కార్య వితాన తప్తులై
రాగ విహీన సంతత విలాస విలగ్న ధరేశుఁ డా మహా
భోగి యనంగనే భయముఁ బొంది వడంకెద రెల్ల భూజనుల్
చిన్నపెద్దలు మోదానమిన్నుదాకు
రిప్లయితొలగించండిపెద్దపెద్దగమంటలువేయుకతన
భోగియనినంతజనులకుబుట్టుభయము
నిల్లుభవనాలభద్రతనెంచిమదిని
భోగములన్ని వీడుచు ముముక్షులమై చరియించునట్టి బై
రిప్లయితొలగించండిరాగుల మంచు చెప్పుచును రాతము చెంతను శిష్యకోటిగా
బాగరి కాంతలన్ గలిగి పైసర కార్యము నందు మున్గు సం
భోగి యనంగనే భయముఁ బొంది వడంకెద రెల్ల భూజనుల్
రాగమునుల్లసిల్లగసరాగముతోడనుబెద్దపెద్దగా
రిప్లయితొలగించండిభోగిదినంబునన్ నెగయుభూరిగమంటలుమిన్నునంటగా
భోగీయనంగనేభయముబొందివడంకెదరెల్లభూజనుల్
యాగనిమంటలన్ గనుచునాతృతనొందుచువారలయ్యెడన్
గురుదేవులకు మరియు కవిమిత్రులకందరకూ భోగి పర్వదిన శుభాకాంక్షలు.
రిప్లయితొలగించండిసంక్రాంతి పండుగకు తమ తమ అదృష్టము పరీక్షించుకునే నిమిత్తము ప్రముఖ హీరోలందరి సినిమాలు విడుదలై....
ఉత్పలమాల
మూగగ పెక్కు చిత్రములు ముచ్చటఁ గొల్పుచు నొక్కసారిగా
నేగఁగ నింట బంధువులు నిష్టముఁ జూపఁగ మల్టి ప్లెక్సులన్
రేగినదౌ టికెట్టు ధర ప్రేల్చఁగ జేబుల పర్వమైన నా
' భోగి' యనంగనే భయముఁ బొంది వడంకెద రెల్ల భూజనుల్!
వంట కొరకని దాచినవంట చెరుకు
రిప్లయితొలగించండిచుట్టు పక్కల పిల్లలు గుట్టుగాను
తీసు కొనివెళ్ళి మంటలో తోసివేయ
భోగి యనినంత జనులకు బుట్టు భయము
తేటగీతి
రిప్లయితొలగించండిధరణి రేపటి సంక్రాంతి పురుషుడెట్లుఁ
దీరి వచ్చునో యను చింతఁ దెల్లవారు
భోగి యనినంత జనులకుఁ బుట్టు భయము
మంటలెన్నైన కాల్చునే మఱచిపోవ?
భోగిని పాన్పు జేసుకొని పొంగును శ్రీహరి సంతతమ్ము దా
రిప్లయితొలగించండిభోగుల మేన దాల్చి సువిభూషణు డా హరుడున్ జెలంగు నా
భోగియె సూత్రమై చెలగు మూషిక వాహను, డేమి భక్తులో
భోగి యనంగనే భయముఁ బొంది వడంకెద రెల్ల భూజనుల్.
పాలు పోసి పెంచిన యట్టి వారినెపుడు
రిప్లయితొలగించండికాపు వేయసిద్ధమగుచు కాచు కొనుచు
నచట యేడు పడగలతో నడల జేయు
*భోగి యనినంత జనులకు బుట్టు భయము