4, జనవరి 2020, శనివారం

సమస్య - 3241 (నూతన వత్సరమ్మున...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"నూతన సంవత్సరఁపు వినోదము లేలా"
(లేదా...)
"నూతన వత్సరమ్మున వినూత్న వినోద విహార మెందుకో?"

72 కామెంట్‌లు:


 1. నడిరేయి సరదా పూరణ:

  చేతుల గాజులున్ జతగ చెవ్వుల కమ్మలు వజ్రహారమున్
  ప్రీతిని పట్టుచీరలను పేరిమి మీరగ నీకునిత్తునన్
  పాతవి కోతలన్ వినగ పక్కున నవ్వెడు జీతగానికిన్
  నూతన వత్సరమ్మున వినూత్న వినోద విహార మెందుకో!!!

  రిప్లయితొలగించండి

 2. ఆటవిడుపు సరదా పూరణ:
  (జిలేబి గారికి అంకితం)

  చేతులు కాల భాజపకు చెన్నుగ భోపలు పంజబందునన్
  వాతలు పెట్టగా ప్రజలు వాసిగ ముంబయి రాయపూరునన్
  భీతిని నోడగా కడకు భిల్లుల దేశపు ఝాడుకండునన్
  నూతన వత్సరమ్మున వినూత్న వినోద విహార మెందుకో!

  రిప్లయితొలగించండి
 3. అందరికీ వందనములు !
  అందరి పూరణలూ అలరించు చున్నవి !
  అలరించ నున్నవి !

  A-1)
  అమరావతిలో :
  __________________________

  యాతన పడుచుండె జనులు
  నీతిని విడనాడి నేత - నిష్ఠూరముగా
  గోతిని దోయగ కుందుచు
  నూతన సంవత్సరఁపు వినోదము లేలా
  __________________________

  వసంత కిశోర్ (కవులూరు రమేష్)

  రిప్లయితొలగించండి
 4. A-2)
  అమరావతిలో :
  __________________________

  నీతిని మాలిన నేతయె
  రైతుల నగరమును గూల్చ - రాక్షసు డైనన్
  చేతలు దక్కిన జనులకు
  నూతన సంవత్సరఁపు వినోదము లేలా
  __________________________
  చేత = పని, తక్కు = విడుచు

  వసంత కిశోర్ (కవులూరు రమేష్)

  రిప్లయితొలగించండి
 5. A-3)
  అమరావతిలో :
  __________________________

  తాతల, తండ్రుల, భూములు
  దాతల వలె దానమిడిన; - దయనీయముగా
  చేతికి చిప్పయె మిగిలిన
  నూతన సంవత్సరఁపు వి - నోదము లేలా ?
  __________________________

  వసంత కిశోర్ (కవులూరు రమేష్)

  రిప్లయితొలగించండి
 6. A-4)
  అమరావతిలో :
  (కారుణ్య మరణమునకు అనుమతి నిమ్మంటున్నారు)
  __________________________

  మాతలు పిల్లలు పురుషులు
  తాతలతో గూడి నేడు - ధర్నా సేయన్
  నూతిని పడదామనవుడు
  నూతన సంవత్సరఁపు వి - నోదము లేలా ?
  __________________________

  వసంత కిశోర్ (కవులూరు రమేష్)

  రిప్లయితొలగించండి
 7. A-5)
  అమరావతిలో :
  (కారుణ్య మరణమునకు అనుమతి నిమ్మంటున్నారు)
  __________________________

  కోతలు కోసెడి నేతలు
  కోతను కోయుట మొదలిడ - గుండెల నన్నీ
  కోతకు గురియగు వారికి
  నూతన సంవత్సరఁపు వి - నోదము లేలా ?
  __________________________

  వసంత కిశోర్ (కవులూరు రమేష్)

  రిప్లయితొలగించండి
 8. B-1)
  అమరావతిలో :
  [ఉట్టి కెగరలేనమ్మ ...స్వర్గాని కెగురుతా నన్నట్టు
  మూడు కాదు ముప్పది మూడట-కోతలే కోతలు]
  __________________________

  తాతల నాటి భూములను - దానము జేసిరి రాజధానికిన్
  దాతల నెత్తి నెత్తుకొని - ధర్మము, పూజల సేయగా తగున్ !
  కోతలు కోయు నేతలదె - గుండెల పైబడి తన్నుచుండగా
  ఘాతపు గాత దిన్న పసి - కాకము వోలె నిరాస్పదంబుగా
  ఘాతము నొంది రైతులట - గద్గదికంబుగ నేడ్చు చుండగా
  నూతన వత్సరమ్మున వి - నూత్న వినోద విహార మెందుకో ?
  __________________________
  ఘాతము = బాణము ,దెబ్బ ; గాత = దెబ్బ
  వసంత కిశోర్ (కవులూరు రమేష్)

  రిప్లయితొలగించండి

 9. చూతము దూరవాణినను చొక్కపు రీతిన ఆటపాటలన్
  చూతము' వాటుసప్పు'నను చోద్యములన్నియు మాటిమాటికిన్
  ఆతత' ఫేసుబుక్కు'నను అన్నము నీరుయు లోకమవ్వగా
  నూతన వత్సరమ్మునవినూత్నవిహారవినోదమెందుకో?
  కొరుప్రోలు రాధాకృష్ణారావు,మీర్ పేట,రంగారెడ్డి  రిప్లయితొలగించండి
 10. ఆకాశవాణికి పంపిన పూరణ అకనాలెడ్జెమెంట్ రాలేదు

  రిప్లయితొలగించండి
 11. చేతము జిత్తులన్ పొదిగి జేబుల దోచెడి తాయిలమ్ములే
  ప్రీతిని గొల్పు రీతులను విత్తము మాధ్వులు కొల్లగొట్టగా
  జీతము చాలదయ్యె నిక జీవితభాగిని పిల్లపాపకున్
  నూతన వత్సరమ్మున వినూత్న వినోద విహార మెందుకో?

  మాధ్వులు-వ్యాపారులు
  చాలని జీతం, వ్యాపారుల దోపిడీ

  రిప్లయితొలగించండి
 12. పాతదగు వత్సరంబున
  రోతలు లేకనె గడచెను ; జరుగగ బోయే
  యాతనలగూర్చి నెరుగక
  నూతన సంవత్సరఁపు వినోదము లేలా

  రిప్లయితొలగించండి
 13. ఉ:

  నూతన వత్సరమ్మున వినూత్న వినోద విహార మెందుకో
  పాతర వేయుమా మనకు పశ్చిమ పద్ధతు లేల యందువా
  నీతులు చాలు చాలు నటనేలయ దాగుడు మూతలాటలన్
  బ్రీతిన సిద్ధ ముండు మిక పెట్టెను సర్దు విహార యాత్రకై

  వై. చంద్రశేఖర్

  రిప్లయితొలగించండి
 14. ప్రీతిగ జేరిరెల్లరును వేడ్కలఁ జేయదలంచి మిత్రులున్

  భ్రాతలు బంధు జాలము శుభాగమనమ్మని నమ్ముచున్ వడిన్

  నూతన వత్సరమ్మున, వినూత్న వినోద విహార మెందుకో

  యేతల వ్రాత మార్చునని యింతటి సందడి చేయ నేలకో.


  రిప్లయితొలగించండి


 15. Come we go :)


  బాతాము పోయెదము రా
  నూతన సంవత్సరఁపు వినోదము లే, లా
  తీ,తరుణి, కాదు కదుటే!
  చూతాస్త్రుండు తిరుగాడు చువ్వన నచటన్


  జిలేబి

  రిప్లయితొలగించండి
 16. పాతవి బాధలన్ మరచి వాసిగ శాంతిని కోరుచున్ మదిన్
  ఖాతరు జేయకుండ గను కష్టము లన్ భరియించి నంతనే
  రాతలు మారిపోవు నని రాజస మొప్పగ సంతసం బునన్
  నూతన వత్సరమ్మున వినూత్న వినోద విహార మెందుకో

  రిప్లయితొలగించండి


 17. ఆకాశవాణికి పంపినది

  వయసొచ్చిన మనవడితో ఓ బామ్మ

  జాతర బోవు కైపుల ప్రచారపు మాధ్యమ వార్త జూచి,యా
  పోతము నెక్కి సీమను కపోతపు రీతిని దాటి, క్రొత్తగా
  నూతన వత్సరమ్మున వినూత్న వినోద విహారమెందుకో
  తాత! శివాలయమ్మున సదాశివుడిన్ కొలువంగ మేలగున్!


  జిలేబి

  రిప్లయితొలగించండి
 18. నిన్నటి పూరణ

  జలకములాడు గోపికలు సంబరమందు మునుంగ వారి దు
  వ్వలువలు దాచె, యుట్టిపయి పాలను నెయ్యిని మ్రుచ్చిలెన్, గటా!
  బలువురఁ బెండ్లియాడె, యదువంశశిరోమణి మాయ యేదొ? యా
  విలువలు మృగ్యమౌటఁ గని విజ్ఞులు మెచ్చిరి మోదమందుచున్.

  రిప్లయితొలగించండి
 19. జాతక ములుమారు ననుకొని
  వేతన ములుపెరి గినంత వేలకు వేలౌ
  గీతలు చెరుపగ బ్రమలో
  నూతన సంవత్సరఁపు వినోదము లేలా

  రిప్లయితొలగించండి
 20. తాతలనాటి మూతులను, తాగగనేలర? నేటికాలమున్?
  పూతనవంటిరాక్షసులు, పుట్టిరి భారతమాత కుందగా
  సూతమహర్షి రావలెన? సూక్తులుజెప్పగనిట్టివారికిన్
  నూతన వత్సరమ్మున ,వినూత్న వినోదవిహారమేలకో??

  రిప్లయితొలగించండి
 21. తాతలనాటి యోచనలు,ధన్యతనివ్వవునేటిరోజులన్
  చేతననీని పండుగల చేతికినిచ్చిరి తెల్లవారలే
  పూతమెరుంగులో పసిడి పొందగసాధ్యమయెప్పుడేనియున్
  నూతనవత్సరమ్మున వినోదవిహారవినూత్నమేలకో?

  రిప్లయితొలగించండి
 22. ప్రాతను త్రోసిరాజనకఁ బక్వము వాయని వాని నిల్పుచున్
  నూతన భావదీప్తులు మనోకుహరమ్మున వెల్గు నింపగా
  చేతన తోడ మెల్గుచు విశేషపు మార్గమునెంచి సాగుమా!
  నూతన వత్సరమ్మున వినూత్న వినోద విహార మెందుకో?

  రిప్లయితొలగించండి
 23. మైలవరపు వారి పూరణ

  భూతలవాసివైతి గతపుణ్యముచే ., హరినామచింతనా
  పూతమనస్కతన్ మెలగి పొందగనెంచుము ముక్తి., మృత్యు జీ..
  మూతము పొంచియున్నదదె ముంగిట.,! తగ్గుచునుండెనాయువున్!
  నూతన వత్సరమ్మున వినూత్న వినోద విహారమేలనో.
  !

  మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

  రిప్లయితొలగించండి
 24. తాతలనాటి యోచనలు,ధన్యతనివ్వవునేటిరోజులన్
  చేతననీని పండుగల చేతికినిచ్చిరి తెల్లవారలే
  పూతమెరుంగులో పసిడి పొందగసాధ్యమయెప్పుడేనియున్
  నూతనవత్సరమ్మున వినోదవిహారవినూత్నమేలకో?

  రిప్లయితొలగించండి
 25. పాతను పారిపొమ్మనుచు,పావన ధాత్రిన బల్క ధర్మమా?
  కోతలరాయులందరును,కొద్దిగ కోసిరికేకుముక్కలన్
  నీతలనెట్లు మార్చునిక,నెయ్యముజేయగ మద్యపాన మీ
  నూతన వత్సరమ్మున,వినూత్న వినోద విహారమేలనో?

  రిప్లయితొలగించండి
 26. తాతలు తండ్రులు హిందులు 
  ఈ తరమునఁ నీవు మారి యేసుని తలచన్ 
  తాతల నవమానించుట 
  నూతన సంవత్సరపు వినోదము లేలా ? 

  రిప్లయితొలగించండి
 27. చేతము లుల్లసిల్లుగతి శ్రీప్రదుడై శుభమందజేయు నా
  భూతగణాధినాయకుని బూజ్యుని గొల్చుచు దీనదేహులన్
  బ్రీతిగ సాకుచున్ ధనము విజ్ఞత జూపుచు బంచు టొప్పగున్
  నూతనవత్సరమ్మున వినూత్న వినోద విహార మెందుకో?

  రిప్లయితొలగించండి
 28. నీతికి బాహ్యమై. నిలుచు నేతల చేతుల పాలనమ్మిడన్
  కోతికి కొబ్బరాయెనిక,కొంపలుముంచెడు వారితీరుతో
  పాతరవేసినట్లయెను,పావనధాత్రిన నిట్టిమూకతో
  నూతన వత్సరమ్మున,వినూత్న వినోద విహారమేలనో?

  రిప్లయితొలగించండి
 29. తాతలు తగదనిజెప్పిరి
  నీతిగమనబ్రతుకునీద,నిట్టివి తగునా?
  తాతకు తలనొప్పగు నివి
  నూతన సంవత్సరపు వినోదములేలా?

  రిప్లయితొలగించండి
 30. ప్రేతములవోలె దిరుగుచు
  రాతిరి, మద్యమతి భీకరముగ గ్రోలన్
  రోతగ కొంపలజేరెడు
  నూతన సంవత్సరఁపు వినోదము లేలా"

  రిప్లయితొలగించండి
 31. చేతల లో మంచి తనము
  నాతత సేవా గుణంబు లందరి లోన న్
  బ్రీతి జనిం ప డంబపు
  నూతన సంవత్స ర పు వినోదము లేలా ?

  రిప్లయితొలగించండి


 32. ఏతావాతా వినవోయ్
  నూతన సంవత్సరపు వినోదములే, లా
  వై తరముగ నెక్కొను నరు
  డా! తాగుము మదిర గడగడ నిపుడె వినవోయ్

  జిలేబి

  రిప్లయితొలగించండి
 33. ముందుగా సామాజిక పూరణ

  ఉ||

  జాతిని చక్కదిద్దుటకు సాధననెల్లరు జేసినన్ సదా

  నీతిగనర్థకామములనెప్పటికప్పుడు పొందినన్, మదిన్

  పాతగ తోయదేదినము! పండుగగా ప్రతిరోజు మారినన్

  నూతన వత్సరంబున వినూత్న వినోదవిహారమెందుకో


  తాత్పర్యము : ప్రతిరోజూ ఎల్లరూ జాతిని చక్కదిద్దటానికి పూనిన, రోజూ అర్థకామములని నీతిమంతంగా పొందుటకు కృషించినప్పుడూ, ఏ ఒక్కరోజూ పాతగ తోయదు కదా, ప్రతిరోజూ పండుగేకదా, అప్పుడు నూతన వత్సరంబున వినూత్న వినోదవిహారమెందుకో.  2. నా రొండవ పూరణ - వ్యంగ్యం

  ఉ||

  పాతొకరోతయంచు యుగపగ్గముబట్టిన జవ్వనుల్ మహా

  జాతర బోలు క్రీడలను సంపదలొడ్డుచు జేయుటేలనీ

  యాతనలెల్లయున్ మరల యవ్వనమొందిన వృద్ధులన్ వలెన్

  నూతన వత్సరంబున వినూత్న వినోదవిహారమెందుకో


  తాత్పర్యము:

  పాతొక రోత అని యుగపగ్గములు పట్టిన యువతీయువకులు పెద్ద జాతర వలె డబ్బు ఖర్చుబెట్టి ఎందుకు జేయడం, పోయిన యవ్వనము తిరిగి వచ్చిన ముసలివారిలా ఈ పండుగలేంటో!!

  Rohit 🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  రిప్లయితొలగించండి
 34. రాతిరసభ్యనృత్యములు రంకెల వేయుచు నాడి పాడుచున్
  ద్యూతము మాంసమద్యములదూలుచు వాగుచు సోలిపోవుచున్
  వేతనమంతయున్దనను వీడనచేతనులన్జేయుచో
  "నూతన వత్సరమ్మున వినూత్న వినోద విహార మెందుకో?"

  రిప్లయితొలగించండి
 35. నేడు ఆకాశవాణిలో ప్రసారం:
  నూతనవత్సరోత్సవము నూతన రీతిచెలంగిజేయు సం
  కేతమటంచు దుండగులు కేకలువైచుచు వాహనాలపై
  గీతము లాలపించుచును గెంతుచుఁ ద్రుళ్ళుచు బీరుఁ గ్రోలుచున్
  నూతన వత్సరమ్మున వినూత్న వినోద విహార మెందుకో!

  రిప్లయితొలగించండి
 36. పూతమెరుంగులద్దుచును ,పుణ్యపుభాషణలన్నిజెప్పుచున్
  నీతులుబోధలైనిలువ,నిమ్మకునీరునుయెత్తునేతలే
  చేతలుశూన్యమై ప్రజల,చేతులచిప్పలనిచ్చుకాలమున్
  నూతనవత్సరమ్మున,వినూత్నవినోదవిహారమేలనో??
  +++++++++++++++++++++++
  రావెలపురుషోత్తమరావు

  రిప్లయితొలగించండి
 37. వచ్చేవారం ఆకాశవాణి వారి సమస్య ...

  *నిందారోపణముల్ హితమ్ము లొసగున్ నీరేజ పత్రేక్షణా*

  గురువారం సాయంత్రం లోగా చేరేట్టుగా padyamairhyd@gmail.com కు పంపవలెను.

  రిప్లయితొలగించండి
 38. శీతల కాలమున్నిటుల చేతన గూర్చెడి వేడుకౌనిదే
  నూతన భావ వీచికల నోలలనాడుచు నాశ నింపెడిన్
  కైతల నల్లుటే కవులకందరకున్ గడు మోదమౌనుగా
  నూతన వత్సరమ్మున వినూత్న వినోద విహార మెందుకో
  (ఆకాశవాణికి పంపినది)

  రిప్లయితొలగించండి
 39. నూతన భావావేశము
  నూతన కాలమునకు దగు నుడికారములున్
  నూతన చైతన్య మిడని
  నూతన సంవత్సరఁపు వినోదము లేలా

  రిప్లయితొలగించండి
 40. (శ్రీకర్ తన మిత్రుడు శేఖర్ తో )
  నీ తలపేమి శేఖరుడ ?
  నిష్ఠురమౌ కొరమాలినట్టి యీ
  జాతర లెందుకోయి ! నిశి
  జాగరణల్ , మరి మందుచిందులున్ ,
  ఖాతరు లేని ఖర్చులును ,
  కార్డులు గీకుట , లాంగిలేయమౌ
  నూతనవత్సరమ్మున వి
  నూత్నవినోదవిహారమేలనో ??
  ( జాతరలు - హడావిడులు ; ఖాతరు లేని -లెక్క లేని )

  రిప్లయితొలగించండి
 41. నూతనవత్సరమ్మునవినూత్నవినోదవిహారమెందుకో
  శీతలవాయువుల్ మదినిసేదనుదీర్చుచునుత్సహించగా
  నూతనవత్సరమ్మదివినోదమునిచ్చుటగారణంబునన్
  భ్రాతలయింటియొద్దనిలబండుగజేయుటనుత్తమంబగున్

  రిప్లయితొలగించండి
 42. వ్రాతల వత్సరమ్ము తల వ్రాతల మార్చగ లేని రీతులన్
  యాతన బెట్ట నెంచ ధర లాకస మందుచు నుండ నీ గతిన్
  వేతన జీవికిన్ బ్రతుకు వేదనయై జన నేడు మేదినిన్
  నూతన వత్సరమ్మున వినూత్న వినోద విహార మెందుకో!

  రిప్లయితొలగించండి
 43. క్రొవ్విడి వేంకట రాజారావు:

  గురువుగారికి నమస్కారములు. నాలుగు పూరణలను పంపుతున్నాను. దయతో పరిశీలించగలరు.

  01-01-2020:

  కాంతుల నెల్లెడ నిలుపుచు
  నెంతయు సుఖసంపదలిడి నిరతము మీకున్
  సంతసమేర్పరుచుచు ని
  ర్వంతల నిడుగాత! నూత్నవత్సర మింకన్.

  02-01-2020:

  ఆత్మశుద్ధిని గూడుచు ననవరతము
  నిశ్చలమ్మగు భక్తితో నీలగళుని
  స్థిరముగా గొల్చి నంతట సిద్ధి యనెడి
  కలిమి గలుగు వసించిన గాననమున

  03-01-2020:

  ఖలులున్న నేటి జగతిని
  విలువలు మృగ్యములయ్యె; విజ్ఞులు మెచ్చన్
  కెలయుచు సుజనత నెల్లెడ
  వెలయించుచు మెలిగినంత బెడదలు మాయున్.

  04-01-2020:

  రీతిని గూడిన బ్రదుకును
  యాతన లుంచక సుఖమిడు యసుధారణమున్
  బాతిగ నిలుపని సీమను
  నూతన సంవత్సరపు వినోదము లేలా?

  రీతిగ చైత్రము నందున
  బాతిని సంవత్సరాది పాటించు వడి
  న్నీతీరున నాంగ్లేయుల
  నూతన సంవత్సరపు వినోదము లేలా?

  రిప్లయితొలగించండి
 44. మాతనువీడినమనలకు
  నూతనసంవత్సరపువినోదములేలా
  భూతేశునినేవేడెద
  మాతకుమోక్షమ్మునిమ్ముమాపైదయతోన్

  రిప్లయితొలగించండి
 45. కందం
  చేతన వినోద మిచ్చు న
  చేతనమునఁ ద్రాగి తూగి చిందులు ద్రొక్కన్
  రీతియె? మూర్ఖత గాక! 'వి
  నూతన' సంవత్సరఁపు 'వినోదము లేలా' ?

  రిప్లయితొలగించండి
 46. ఉత్పలమాల (నేడు ఆకాశవాణి యందు ప్రసారమైనది)

  పాత సమస్య లెల్ల నిను బాధలు పెట్టుచు నుండ మౌనివై
  జాతకమంచు నమ్ముచును సాయమదెవ్వరొ జేతు రంచు నీ
  చేతలు శూన్యమై మివుల చెల్లునె? బూనిక లేమి లేక యీ
  నూతన వత్సరమ్మున వినూత్న వినోద విహారమెందుకో?

  రిప్లయితొలగించండి


 47. నేటి ఆకాశవాణి విశేషములు తెలియ చేయగలరు


  రిప్లయితొలగించండి
  రిప్లయిలు

  1. పలమనేరు నుండి మీ పేరుపై ఎవరో పంపిన పూరణ చదువబడినది...

   తొలగించండి


  2. నారదులవారయ్యుంటారు :)
   తీర్థ యాత్ర లో వున్నట్టున్నారు.

   ఈ వారానికేవూరో వచ్చే వారము తెలియును :)

   నెనరుల్స్
   జిలేబి

   తొలగించండి


 48. సాతానులవలె తిరుగు
  ళ్లా! తాగుచు తందనమ్ములా ! మారండ
  ర్రా! తరమై నిలవని యీ
  నూతన సంవత్సరఁపు వినోదము లేలా ?


  జిలేబి

  రిప్లయితొలగించండి
 49. యాతనలెల్లవైదొలఁగఁనాతతసౌఖ్యమునిచ్చునిచ్ఛతో
  నూతనవత్సరాంగన వినూత్న సుసంపదలందజేయ సం
  జాతమునొందువేళ మనుజావళి మత్తున మున్గుటేలనో
  నూతన వత్సరమ్మున వినూత్న వినోద విహార మెందుకో!

  రిప్లయితొలగించండి
 50. ..............🌻శంకరాభరణం🌻...............
  ..................🤷🏻‍♂సమస్య 🤷‍♀....................
  "నూతన వత్సరమ్మున వినూత్న వినోద
  విహార మెందుకో?"

  సందర్భము: ఫాల్గుణంలో రాముడు రావణుని వధించి అయోధ్యకు మరలివచ్చినాడు.
  దృష్ట్వా యయుర్మోద మతీవ పుణ్యాః
  (అధ్యాత్మ రామాయణం యు. కాం.15-24) అయోధ్యలోని పుణ్యాత్ములైన ప్రజ లెంతో సంతోషించినారు.
  నూతన సంవత్సరంలో రాముని పట్టాభిషేకం జరిగింది. అయోధ్యా నగర వాసులు సంబరాలు జరుపుకుంటూ ఇలా అనుకున్నారు.
  "ఒక్క ఏడే (సంవత్సరమే) కాదు కొత్తది. అయోధ్యకు రాముని రాక కూడా కొత్తదే! (ఎన్నో సంవత్సరాల తర్వాత కదా!)
  అతడు రాజు కావడంకూడా కొత్త విషయమే! ఎప్పుడో పద్నాలుగేండ్ల కింద రాముడు రాజు కావాలనుకున్నాం.. ఇప్పుడు రా జయ్యాడు కదా!
  లోకంలో ఇంతకు ముందు లేనటువంటి.. కొట్టొచ్చినట్టు కనిపిస్తున్న ప్రశాంతత కూడా సరికొత్తదే! ఎందుకంటే లోకకంటకులైన రావణ కుంభకర్ణాది అనేక రాక్షసులు రాముని చేతిలో హతులైనారు.
  అందుకని ఇలా అనరాదు.. "నూతన వత్సరమ్మున వినూత్న వినోద విహార మెందుకో?" "
  ఏదేమైనా అయోధ్య పౌరులకు 14 ఏండ్ల కోరిక తీరినందుకు సంబరాలు, రాముడు రాజైనందుకు సంబరాలు, నూతన వత్సరం వచ్చినందుకు సంబరాలు.. మూడూ కలగలిసిపోయినవి.
  ఇంత అర్థవంతమైన సంబరాలా మన కొత్త ఏడు సంబరాలు???
  ~~~~~~~~~~~~~~~~~~~~~~~
  నూతన మేడె కాదు సుమ!
  నూతనమైనది రాము రాకయున్,
  నూతన మౌను రా జగుట,
  నూతనమైనది విశ్వశాంతి య
  య్యాతత లోక కంటకుల
  యంతమువల్ల... ననంగ రా దిటుల్
  "నూతన వత్సరమ్మున వి
  నూత్న వినోద విహార మెందుకో!"

  ✍️~డా.వెలుదండ సత్యనారాయణ
  పరమార్థ కవి
  4.01.20
  -----------------------------------------------------------

  రిప్లయితొలగించండి
 51. ఆకాశవాణి ప్రసారమైన నా పూరణ

  ఉ.మా.

  నాతుల దాడిచేయుదురు న్యాయము నెంచక దుష్టశీలులే

  రాతలు మారలేదెపుడు రాశిగ సాలులు వచ్చి పోయినన్

  మాతగ పూజలందుకునె మానిని రక్షణ జేయలేనిచో..

  నూతన వత్సరమ్మున వినూత్న వినోద విహారమెందుకో

  -- ఆకుల శాంతి భూషణ్

  వనపర్తి

  రిప్లయితొలగించండి
 52. చేతన మందుసంబరము చిందులు వేయుచు నుండగా మదిన్
  కాతురమొప్పగా వడిగ గైకొని బండ్లను సాగుచుందురే
  భీతియు లేకమానవులు వేగము గాపలు కాలకించకన్
  నూతన వత్సరమ్మున వినూత్న వినోద విహార మెందుకో*

  కూతలిడుచు నిశిరేయిన
  *నూతన సంవత్సరఁపు వినోదము లేలా"*
  చేతము నందు సతము శ్రీ
  మాతను సేవించనిడును మానుగ వరముల్

  రిప్లయితొలగించండి
 53. అందరికీ నమస్సుమాంజలి 🙏🙏
  నా పూరణ 🌹
  *కం||*

  పాతవి పాపములింకను
  లేతగ మన కనుల యెదుట లేవనుకొని యా
  కోతుల చేష్టలు పెంచుకు
  *నూతన సంవత్సరఁపు వినోదము లేలా*?

  *కళ్యాణ్ చక్రవర్తి, ముంబాయి*
  🙏🌹🙏🌹🙏

  రిప్లయితొలగించండి
 54. అందరికీ నమస్సుమాంజలి 🙏🙏
  *నా రెండవ పూరణ* 🌹🌹

  మొదటి *ఉత్పల మాల* ప్రయత్నం 🙇‍♂🙇‍♂🙇‍♂🙇‍♂
  *ఉ::*
  కూతలు పెట్టగన్ జనులు క్రూరము గా నిల నాపగా నెటుల్
  రోతయు పెంచగన్ మనకు రోడ్డున బళ్లను త్రిప్పువా నరుల్
  వాతలు బ్రెట్టినా వినరు పాపము వారిని యేమియున్ యనన్
  *నూతన వత్సరమ్మున వినూత్న వినోద విహార మెందుకో?*

  *కళ్యాణ్ చక్రవర్తి, ముంబాయి*
  🙏🌹🙏🌹🙏

  రిప్లయితొలగించండి
 55. రిప్లయిలు
  1. పాతాళ తలాతల సు మ
   హాతల సు వి తల రసాత లాతల తీరా
   తీ తాశ్చర్యమ్ములు భూ
   నూతన సంవత్సరఁపు వినోదము లేలా


   ఏ తరి నైన హర్షము లహీనముగా విరియంగ మానవ
   వ్రాతము సేయ నొప్పుఁ గద పండుగ లింపుగ నేకమై యిలన్
   ధాతృ పరంపరాగత విధాన విశేష విహీన రాశియౌ
   నూతన వత్సరమ్మున వినూత్న వినోద విహార మెందుకో?

   తొలగించండి
 56. పాతొక రోతయయ్యెనని భాషలమార్చిరి బోధనాంశమున్
  పాతరబెట్టిరంటపలు భాసలరీతుల భావసంపదల్
  కోతలు గోసినారెతెలుగోడి చరిత్రల గొప్పగా వినన్
  నూతన వత్సరమ్మున వినూత్న వినోద విహారమెందుకో!!

  రిప్లయితొలగించండి
 57. నీతినిజాయితీలనిట, నిప్పుగనెంచెడు భారతమ్ములో
  పాతగు మంచిపద్ధతుల పాతరబెట్టెడుకొత్తయోచనల్
  ఈతరమందు బెంచుటది,యీర్ష్యనసూయలకుంపటైజనున్
  నూతనవత్సరమ్మున వినూత్న వినోదవిహారమేలకో?

  రిప్లయితొలగించండి
 58. తాతల కాలము నుండియు
  భూతలమును చేరునట్టి ప్రోయాలిదియే
  రాతము వచ్చెడి దానికి
  నూతన సంవత్సరఁపు వినోదము లేలా.

  రిప్లయితొలగించండి
 59. పాతరలోకి దించిరిట పావనధాత్రినమాతృభాషనే
  ఈతరమందు దుష్టులగు ఇవ్విధి వారల నెంచ పాపమే
  ఏతరినైనపిల్లలకు ఎంతటికష్టముదెచ్చి బెట్టు నీ
  నూతనవత్సరమ్మున వినూత్న వినోదవిహారమేలకో?

  రిప్లయితొలగించండి
 60. పాతరలోకి దించిరిట పావనధాత్రినమాతృభాషనే
  ఈతరమందు దుష్టులగు ఇవ్విధి వారలు జేయు పాపమే
  ఏతరినైనపిల్లలకు ఎంతటికష్టముదెచ్చి బెట్టు నీ
  నూతనవత్సరమ్మున వినూత్న వినోదవిహారమేలకో?

  రిప్లయితొలగించండి


 61. తాతా!వూతునకో? యీ
  నూతన సంవత్సరఁపు వినోదము లే, లా
  వై తైతక్కల మనుమడ!
  రాత్రియు తెలవార్లు పగలు రాద్ధాంతములా‌!


  జిలేబి

  రిప్లయితొలగించండి

 62. చేతిలొపైసలు లేకయు
  నూతనవత్సర పువేడ్క నోరూరించన్
  చేతము ఘనముగ ననిరట
  నూతన సంవత్సరఁపు వినోదము లేలా!

  రిప్లయితొలగించండి
 63. ..............🌻శంకరాభరణం🌻...............
  ..................🤷🏻‍♂సమస్య 🤷‍♀....................
  "నూతన వత్సరమ్మున వినూత్న వినోద
  విహార మెందుకో?"

  సందర్భము: కృతయుగంలో రావణునికి సనత్కుమారు డనే మహర్షి విష్ణు పారమ్యాన్ని గొప్పగా వివరించి ఇలా అన్నాడు.
  "సాధారణ దేవతలచే నిహతులైన వారు స్వర్గానికి పోయి భోగక్షయం కాగానే భూమిపై మళ్ళీ పుడుతారు.
  విష్ణునా యే హతాస్తే తు
  ప్రాప్నువంతి హరే ర్గతిమ్ 3-40
  విష్ణువుచే ఎవరు వధింపబడుతారో వారు విష్ణుపదం పొందుతారు. మళ్ళీ పుట్టరు."
  దానితో రావణుడు విష్ణువు చేతిలోనే మృత్యువు పొందాలని నిర్ణయించుకున్నాడు.
  అథవా ద్రష్టు మిచ్ఛా తే
  శ్రుణు త్వం పరమేశ్వరమ్
  త్రేతాయుగే స దేవేశో
  భవితా నృప విగ్రహః 3-54
  "అతణ్ణి చూడదలిస్తే త్రేతాయుగంలో రాముడై పుడుతాడు." అనీ అన్నాడు.
  ఈ వృత్తాంతం అగస్త్యుడు రామునికి చెప్పినాడు.
  (అధ్యాత్మ రామాయణం ఉ.కాం. 3 వ సర్గ)
  ఫాల్గుణంలో రావణుడు హతుడు కాగా కొత్త ఏడు వచ్చింది. ఏదో ఒక మిషతో భర్తృ వియోగ దుఃఖిత మతియైన మండోదరి మనస్సును దారి మళ్ళించి ఊరడించా లని చెలులు ప్రయత్నించగా ఆమె ఇలా అన్నది.
  విష్ణు దేవ హస్త అతిశయ = విష్ణు దేవుని
  చేతిలో గొప్పదైన
  అవసాన మహిత ఆశయుడు =
  మృత్యువునకై గొప్ప ఆశయం గలవాడు
  ~~~~~~~~~~~~~~~~~~~~~~~
  సీతను దెచ్చిపెట్టుకొనె
  ఛీ! ఛి! యనంగ.. సనత్కుమార వా
  క్ ప్రీతిఁ దలిర్ప నింతపని
  కిన్ దగఁ పాల్పడె.. విష్ణుదేవ హ
  స్తాతిశయావసాన మహి
  తాశయు డౌచును గొంప ముంచెనే!
  నూతన వత్సరమ్మున వి
  నూత్న వినోద విహార మెందుకో??

  ✍️~డా.వెలుదండ సత్యనారాయణ
  పరమార్థ కవి
  4.01.20
  -----------------------------------------------------------

  రిప్లయితొలగించండి