22, జనవరి 2020, బుధవారం

సమస్య - 3258 (పతి యనఁగ...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"పతి యనఁగ నర్థమిడె సతి వ్యర్థుఁ డనుచు"
(లేదా...)
"పతి యన నర్థముం దెలిపె వ్యర్థుఁ డటంచును ధర్మపత్నియే"
(కళ్యాణ్ చక్రవర్తి గారికి ధన్యవాదాలతో...)

85 కామెంట్‌లు:


 1. నడిరేయి సరదా పూరణ:

  మితమును లేని హింసలను మ్రింగక రోకలి చేతబూనుచున్
  సతమత మౌచు పోరునిడ సంతస మొందుచు గేలిసేయుచున్
  మతియును లేక సైయనుచు మంచిగ దూరెడి తల్లి కొంగునన్
  పతి యన నర్థముం దెలిపె వ్యర్థుఁ డటంచును ధర్మపత్నియే!

  రిప్లయితొలగించండి
 2. కస్తూరి శివశంకర్బుధవారం, జనవరి 22, 2020 12:28:00 AM

  తే.గీ :
  మధురమంజుల భావనా సుధలుకురియ
  మానితంబైన కార్యమునందు నేను
  కృతి రచించు కోరిక తెల్ప కాంతపల్కె
  పతియనఁగ నర్థమిడె సతి వ్యర్థుఁ డనుచు

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. కస్తూరి వారు రెండు మూడు పాదాలాలో యతి భంగము సరి చేయండి

   తొలగించండి
  2. కస్తూరి శివశంకర్బుధవారం, జనవరి 22, 2020 5:33:00 AM

   తే.గీ
   మధురమంజుల భావనా సుధలుకురియ
   మానితంబైన కార్యమే మౌక్తికంబు
   కృతిరచించు కోరికతెల్ప గృహిణి పల్కె
   పతియనఁగ నర్థమిడె సతి వ్యర్థుఁ డనుచు

   తొలగించండి
  3. సవరించిన మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'గృహిణి, సతి' పునరుక్తి. "...కోరిక దెల్ప గేలి సేసి । పతి యనఁగ..." అందామా?

   తొలగించండి
  4. కస్తూరి శివశంకర్బుధవారం, జనవరి 22, 2020 7:11:00 AM

   గురువర్యులు శ్రీ కంది శంకరయ్య గారికి, ఆచార్య శ్రీ పూసపాటి వారికి నమస్సులు.
   నిజమే పునరుక్తి గురించి ఆలోచించలేదు.
   మీ ఆత్మీయ సూచనలకు ధన్యుడను���������� సవరించిన పద్యము ��

   తే.గీ
   మధురమంజుల భావనా సుధలుకురియ
   మానితంబైన కార్యమే మౌక్తికంబు
   మాధురీ భావసురభి సంపదలు పొంగ
   కృతి రచించు కోరిక తెల్ప గేలి సేసి
   పతియనఁగ నర్థమిడె సతి వ్యర్థుఁ డనుచు

   తొలగించండి

 3. ఆటవిడుపు సరదా పూరణ:
  (జిలేబి గారికి అంకితం)

  స్తుతమతి యౌచు స్వార్థమును చూచుచు కాంగ్రెసు నందు చేరుచున్
  తతగము నెంచి లెక్కనిడి త్రాడును పేడును త్రెంచి పార్టినిన్
  మతిగొని జంపుజేయుచును మంత్రిగ వర్ధిల లేని మూర్ఖుడౌ
  పతి యన నర్థముం దెలిపె వ్యర్థుఁ డటంచును ధర్మపత్నియే

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ ఆటవిడుపు పూరణ బాగున్నది. అభినందనలు.
   'తతగము నెంచి' అంటే మీ ఉద్దేశంలో 'గాలివాటున' అనియా?

   తొలగించండి
  2. 🙏

   అవును సార్!

   Weather vane...

   హవా బదల్ గయా..

   తొలగించండి


 4. పేరు రాజుగారయ్యెను! వేష్టితముగ
  కొలువు దీరియుండుననుచు కోరి పెండ్లి
  యాడె! చూడగా భావరాజాయె నరరె
  పతి యనఁగ నర్థమిడె సతి వ్యర్థు డనుచు!


  జిలేబి

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   ఇక్కడ 'భావరాజు' అంటే భావుకుడని మీ భావమా?

   తొలగించండి


 5. మగరాజైనట్టి పతి య
  నఁగ నర్థ మిడె సతి, వ్యర్థు డనుచు భళారే
  జగడములకు కాణాచి! గ
  డగడయనుచు నారుదూఱు డంకతనముతో!


  జిలేబి

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. తేటగీతి పాదానికి మీ కందపద్య పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించండి
 6. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

  రిప్లయితొలగించండి
 7. సతతము తన హృదయ మందు స్ధాన మిడుచు

  సర్వ వేళలందు తనకు
  సంశ్ర యంబు

  నిడగ వలయు పతి, కినుక నిడక, మౌని

  తనను తాడనమునుజేయ మనసు చంపు

  కొనుచు చేసెగా సేవలు మునికి తాను,

  పతి యనఁగ నర్థమిడె సతి వ్యర్థుఁ డనుచు"


  హరిని భృ గు మహర్షి లక్ష్మి దేవి నివసించు చోటుపై తన్నగా ఆ లక్ష్మి దేవి భావన

  రిప్లయితొలగించండి
 8. నిన్నటి రోజు శంకరాభరణము వారి సమస్య

  కందులు రోదింప మిగుల గలగిరి పడతుల్  ఇచ్చిన పాదము కందము

  నా పూరణము సీసములో  కైక తన సుతుడు భరతుని కన్నా మిన్నగా రాముని పెంచింది. రాముడు ఎక్కువగా కైక అంటే ప్రెమగా ఉండేవాడు. ఆట్టి సంధర్భములొ చిట్టి బాల్య క్రీడ
  చిన్న భావన


  నాదు తల్లి యనుచు నారీ శిరోమణి
  కైక చెంతను జేరె కన్న తల్లి


  కౌసల్య వలదని గారాల రాముడు,
  మాతల్లి కైకమ్మ, మాట లాడ


  తగదని భరతుడు తగవు లాడుచు నెట్టి
  వేసెను రాముని విసురు గాను,

  సౌమిత్రి యది కాంచి, సంజ్వరము బడసి
  భరతుని వెనుకకు పట్టి లాగె,


  సమయము చూసి నా శతృఘ్నుడు జవమున్
  కైక పై కెక్కెగా , కాంచి నట్టి  మువ్వురు యేడుపు మొదలు పెట్టిరి ,
  నాదినాది యనుచు నలుగురు నిడె


  రొద, పసి కందులు రోదింప మిగుల
  గలగిరి పడతుల్దికమక పడుచు


  దశరధుం డది కాంచిముదముగ పలికె
  నిటుల “కనుమిది చంద్రుడు నింగినుంచి
  నిటకు వచ్చె చూడగ రమ్మని “ పిలచె నొక
  మంకురములోన చంద్రుని, మంకు నాప

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ సీసపద్య పూరణ బాగున్నది. అభినందనలు.
   "సమయము జూచి యా శత్రుఘ్నుడు వడిగ (జవమునన్.. అనవలసింది 'జవమున్' అన్నారు)... మువ్వురు నేడుపు మొదలు పెట్టిరి గద (గణభంగం)... నలుగు రిడిరి.." అనండి. సీసం చివరి పాదం పూర్వార్ధంలో గణభంగం. సవరించండి.

   తొలగించండి
 9. అతడొక సిం హమై దుముకు ,ఆగక పాలకపక్షనేతపై
  పతనము చెంతజేరుదురు, పావన ధాత్రిన దుష్ట నేతలే
  హితమును గోరి దీక్షలను, హేతువుగానటనెంచి నారులే
  పతియనయర్ధమున్ దెలిపె,వ్యర్ధుడటంచును ధర్మపత్నియే

  రిప్లయితొలగించండి
 10. హితమునుగోరు కావ్యములు,హింసను నేర్పవు శ్రేయభావమున్
  సతతము హింసనే గెలుకు , సాహసమెవ్వరు జేయబూనినన్
  స్తుతమతిలేనిముఖ్యులిల,సూక్ష్మపుబుద్ధినిగోలుపోవ,భూ
  పతియనయర్ధమున్ దెలిపె,వ్యర్ధుడటంచును ధర్మపత్నియే.

  రిప్లయితొలగించండి
 11. (కీచకుని బారినుండి బయటపడటానికి
  రాజాస్థానానికి పరుగున వచ్చిన సైరంధ్రిని
  "నర్తకిలా యెందుకలా చేతులూపుతా " వన్న కంకుభట్టుతో ఆమె అంటున్నది .)
  "సతికెపుడున్ సమంజసపు
  చర్యల రక్షణనిచ్చు నాతడే
  పతియన నొప్పు చుండుగద
  పాండితినీతివిచక్షణేక్షణా !
  మతిగతి లేని ద్యూతమున
  మత్తిలు మత్పతి " యంచు నామెయే
  పతియన నర్థముం దెలిపె
  " వ్యర్థు " డటంచును ధర్మపత్నియే .
  (సైరంధ్రి - ద్రౌపది ; కంకుభట్టు - ధర్మరాజు )

  రిప్లయితొలగించండి
 12. పతినెడబాయగా గలరె??, పావన ధాత్రిన నారులెవ్వరున్
  సతతము సౌఖ్యసంపదల,సన్నిహితత్వముగోరు రైతులే
  హితమునుగోరిజేయుదురు,హింసనుగోరనిదీక్షలింక క్ష్మా
  పతియనయర్ధమున్ దెలిపె,వ్యర్ధుడటంచును ధర్మపత్నియే.

  రిప్లయితొలగించండి
 13. పానశౌరుడు జూదరి పల్లవికుడె
  భర్తగా గలిగిన యింతి బాధ తోడ
  సఖియతోడ ముచ్చటలాడు సమయమందు
  పతి యనఁగ నర్థమిడె సతి వ్యర్థుఁ డనుచు.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   "పానశూరుడు" అని ఉండాలనుకుంటాను.

   తొలగించండి
 14. పెత్తనంబునుచేయగపెద్దయతడు
  సంతు క్షేమమునరయడు సుంతయేని
  పెండ్లమన్ననుమదిలోన ప్రేమలేని
  పతి యనఁగ నర్థమిడె సతి వ్యర్థుఁ డనుచు

  రిప్లయితొలగించండి
 15. సతియెడనెల్లవేళలను సఖ్యతజూపెడువాడుభర్త యా
  పతినిలదైవమంచుసతి పాయకజేయు సపర్యలన్నియున్
  సతతము సానియిండ్లకడ సౌఖ్యమునొందగజూచునట్టియా
  పతి యన నర్థముం దెలిపె వ్యర్థుఁ డటంచును ధర్మపత్నియే

  రిప్లయితొలగించండి
 16. అగ్నిసాక్షిగ నొకయింతి నాదరించి
  బతుకునంతయు యేలెడివాడె యనుచు
  పతి యనఁగ నర్థమిడె సతి ; వ్యర్థుఁ డనుచు
  పూన్చు నీమము తప్పిన పురుషునెపుడు

  రిప్లయితొలగించండి
 17. మైలవరపు వారి పూరణ

  శంకరాభరణం.. సమస్యాపూరణం..

  పతి యన నర్థముం దెలిపె వ్యర్థుఁ డటంచును ధర్మపత్నియే !!

  *పోలిక*😃

  అతులితమౌ ధనార్జనమె యాతని లక్ష్యము., వంట చేయబో...
  డుతుకడు బట్టలన్., తరుగనోపడు కూరల భార్య కోరుచో!
  ప్రతిపనినామె చేయవలె పాపము ! మిమ్ముల బోలడా యుమా...
  పతి యన నర్థముం దెలిపె వ్యర్థుఁ డటంచును ధర్మపత్నియే !!

  మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

  రిప్లయితొలగించండి
 18. మనసు నెరుగని భర్తయై మసలు చుండి
  సతము బాధించు నని తన సఖియ తోడ
  పతి యనగ న ర్థ మిడె వ్యర్థు డనుచు
  తన దు కష్టము దెలిపి తా పనవు చ పు డు

  రిప్లయితొలగించండి

 19. Before and after :)


  స్థితిపదుడంచు కాలుపడి శ్రీమతియై పలు మార్లు వందన
  మ్ము తనకు జేయు తొల్లి దినముల్! కొమరుండొకడే జనించగా
  మతికలదాయటంచు పదిమార్లను శ్రీపతికైన తప్పదే!
  పతి యన నర్థముం దెలిపె వ్యర్థుఁ డటంచును ధర్మపత్నియే!


  జిలేబి

  రిప్లయితొలగించండి
 20. వెతలనుఁదీర్చి కాపురము పెంపు వహింపగ నిల్పు వాడుగా
  పతి యన నర్థమున్ఁదెలిపె పంతులు గారు వివేకవంతుడై--
  పతి యన నర్థమున్ఁదెలిపె వ్యర్థుడటంచును ధర్మపత్నియే
  చితికిన కాపురంబుఁగని 'చీ' యని రోసియు వ్యాకులంబునన్.

  రిప్లయితొలగించండి
 21. రిప్లయిలు
  1. అందరికీ నమస్సుమాంజలి 🙏🙏
   *తే గీ:*

   రాజకీయమునందు తా రాజు బిడ్డ
   ఓటు వేయగ జనులకు పోటు నిచ్చె
   పూజజేయగ తలచిన వద్దని యన
   *"పతి యనఁగ నర్థమిడె సతి వ్యర్థుఁ డనుచు"*

   *కళ్యాణ్ చక్రవర్తి, ముంబాయి*
   🙏🌷🙏🌷🙏

   తొలగించండి
 22. రాజసభలోకి పత్నిని రాక్షసముగ
  నీడ్చుకొనివచ్చి వలువల నూడ్చుచుండ
  యదియె కనులార జూచుచు మెదలకుండు
  పతి యనగ నర్ధమిడె సతి వ్యర్థుఁడనుచు!!!

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   ".. నూడ్చుచుండ నదియె..." అనండి.

   తొలగించండి
 23. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

  రిప్లయితొలగించండి
 24. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

  రిప్లయితొలగించండి
 25. చం:

  సతతము చీట్లపేకలును సారయు ద్రాగుచు కూటమందునన్
  మతిచెడ సాగుచుండ నవమానము లేక భరింప రానటుల్
  కుతకుత లాడు చుండు సరి కూడదు యన్న పరాన్నభుక్కు యా
  పతియన నర్థముందెలిపె వ్యర్థుడ టంచును ధర్మపత్నియే

  వై. చంద్రశేఖర్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   "కూడదు + అన్న = కూడదన్న" అవుతుంది. యడాగమం రాదు. "కూడదటన్న" అనండి. అలాగే "పరాన్నభుక్కు నా..." అనండి.

   తొలగించండి
 26. ఎంచ భరియించు వాఁ డగు నెన్నఁ డేని
  భర్త తాళి కట్టిన నేమి ఫలము దలఁచఁ
  గొంచె మైనను భార్యఁ బోషించ లేని
  పతి యనఁగ నర్థమిడె సతి వ్యర్థుఁ డనుచు


  తత గృహ వాస సంచలిత దార తిరస్కృత భర్త లోభ పూ
  రిత హృద యాగ్ర్య ఋక్తపతి రిక్త జలాప్పతి నాఁగ నాథులన్
  సతత విలాస భోగ రతి సంగత భూపతి ధర్మహీన ధీ
  పతి యన నర్థముం దెలిపె వ్యర్థుఁ డటంచును ధర్మపత్నియే

  రిప్లయితొలగించండి
 27. హితముగ దెల్పెదన్ వినుమిదే యని జెప్పుచు నమ్మునీంద్రుడే
  "చతురుడు భార్య బిడ్డలను చక్కగ జూచు వివేకవంతుడే"
  పతి యన నర్థముం దెలిపె; వ్యర్థుఁ డటంచును "ధర్మపత్నియే
  పతి యన గౌరవమ్మిడని వాడగు లోకువ లోకమంతకున్"

  రిప్లయితొలగించండి
 28. జీవితాంతము భరియించు చేవయుతుగ
  బతియనగనర్ధమిడెసతి,వ్యర్ధుడనుచు
  బలికె,గాపాడలేనట్టి భర్త యుంట
  భార్యకోరునురక్షణ భర్తనుండి

  రిప్లయితొలగించండి
 29. పతియనునాతడెప్పుడునుభార్యకురక్షణనీయలేనిచో
  బతియననర్ధముందెలిపెవ్యర్ధుడటంచునుధర్మపత్నియే
  పతులనురక్తిగోరుదురుబ్రాపునునిమ్మనిధర్మపత్నులుల్
  బతినెడబాయయింతులిలభద్రతతోడనునుండలేరుగా

  రిప్లయితొలగించండి
 30. అతివను దుర్మదాంధుడు సభాంతరమందు పరాభవింపగా
  నతిబలశాలురైన పతులైదుగురుండియు నిష్ఫలమ్మయెన్
  బ్రతిమల వోలె నిల్చితమ భామను గాంచిరటంచు చెప్పుచున్
  బతి యన నర్థముం దెలిపె వ్యర్థుఁ డటంచును ధర్మపత్నియే

  రిప్లయితొలగించండి
 31. జన్మనిచ్చిపోషించెడు జనని ,అక్క
  చెల్లెలా దిగ నెల్లరు స్త్రీలటంచు
  మరచి ఆడ పిల్ల జనించె మరల ననెడి
  పతి యనగ నర్థమిడె సతి వ్యర్థు డనుచు


  మరొక పూరణ

  అప్పుచేసి పేకాడుచు, ననవరతము
  తప్పతాగుచు తిరుగుచు ధరణి యందు
  ధనమొసగుమని హింసించు త్రాష్టుడనుచు
  పతి యనఁగ నర్థమిడె సతి వ్యర్థుఁ డనుచు"*

  రిప్లయితొలగించండి
 32. ..............🌻శంకరాభరణం🌻...............
  ..................🤷🏻‍♂సమస్య 🤷‍♀....................
  పతి యనఁగ నర్థమిడె సతి వ్యర్థుఁ డనుచు

  సందర్భము:
  అంభోజిన్యా శ్శిశిర సరసం
  కాసరీవాచ్చమంభః
  కైకేయ్యాస్సాహృదయ మదయం
  మంథరా నిర్మమంధ..
  నిర్మల జలాలతో పద్మాలతో అలరారే చల్లని సరోవరాన్ని ఒక గేదె కలచివేసినట్టు కైక మనసును మంథర కలచివేసింది. (భోజుడు.. అయోధ్య..20)
  ఒక మామూలు అంతఃపుర దాసి రాజ్య చరిత్రనే ఎలా తారుమారు చేయగలదో చూపించే ఘట్టం మంథర సన్నివేశం.
  మంథరా కైకా సంభాషణం..
  "దేవాసుర సంగ్రామంలో దేవేంద్రునికి సహాయంగా దశరథుడు నీతో కలిసి వెళ్ళి తిమిధ్వజు డనే రాక్షసునితో తలపడి మూర్ఛిల్లగా రథాన్ని సురక్షిత స్థలానికి చేర్చి రక్షించినావు. రాజు తృప్తితో రెండు వరా లిచ్చినాడు. నీవు తర్వాత స్వీకరిస్తా నన్నావు. అవి ఇప్పుడు కోరుకో!
  ఒకటి రామునికి పదునాలుగేండ్లు వనవాసం, భరతునికి పట్టాభిషేకం.."
  తౌ వరం యాచ భర్తారం
  భరతస్యాభిషేచనమ్
  ప్రవ్రాజనం తు రామస్య
  త్వం వర్షాణి చతుర్దశ
  అయోధ్య కాం. 9-20
  "అట్లే అడుగుతాను. (అడుగడంలో తప్పు లేదు కదా!)ఆడిన మాట తప్పేట్టయితే అతడే జనాలముందు వ్యర్థుడు.. అంటే పనికిమాలిన వా డనిపించుకుంటాడు."
  ఆవిధంగా "భార్య కోరిక తీర్చలేని భర్త"ను ఒక వ్యర్థుని కింద పరిగణించింది కైక.
  ~~~~~~~~~~~~~~~~~~~~~~~

  *మంథర*

  కుబ్జయౌ మంథర కోమలి కైకతో
  భాషించె నీ రీతి బహు విధములఁ..
  "దరుణి! నీ పతి దేవ దానవ రణములో
  వరము లిచ్చెను రెండు వరుస నీకు..
  వానిఁ గోరక భర్త వద్దనే యుంచితి
  వా నా, డిపు డడుగవచ్చు గాదె!
  వనవాస మనుము రామునికి పద్నాల్గేండ్లు,
  పట్టాభిషేకంబు భరతుని కను.."
  మనిన విని కైక "నే నట్లె యడుగు దాన..
  నాడి తప్పిన నాతడే వ్యర్థు" డనెను..
  "తెఱవ కోరిక యేదైన తీర్చలేని
  పతి" యనఁగ నర్థ మిడె సతి
  "వ్యర్థుఁ" డనుచు..

  ✍️~డా.వెలుదండ సత్యనారాయణ
  పరమార్థ కవి
  22.01.20
  -----------------------------------------------------------

  రిప్లయితొలగించండి
 33. ఆలుబిడ్డల పోషణ మరయ నట్టి
  సిగ్గు జెందక మందుడై నెగ్గు నట్టి
  సతత మధుపాన చిత్తుడై సంచ రించు
  పతి యనఁగ నర్థమిడె సతి వ్యర్థుఁ డనుచు.

  రిప్లయితొలగించండి
 34. సతిని చులకన చేయుచు సంతతమ్ము
  పనుల నేమి చేయక బసవన్న పగిది
  త్రాగి వీధులందున చేరి వాగుచున్న
  పతి యనఁగ నర్థమిడె సతి వ్యర్థుఁ డనుచు

  రిప్లయితొలగించండి
 35. సతతము ధర్మపాలనము సత్యము శాంతము నిర్మమత్వమున్
  చతురపు భాషణమ్ముల నజాతవిరోధి ప్రశస్తినొందియున్
  కుతుకము జూదమందునను గూడగ సర్వముగోలుపోవగా
  పతియన నర్ధముందెలిపె వ్యర్ధుడటంచును ధర్మపత్నియే!  రిప్లయితొలగించండి
 36. ఖడ్గతిక్కన నేపథ్యం...

  తేటగీతి
  పతికి మంచమ్ము చాటుంచి పసుపు నుంచి
  స్నానమాడెడు విధమిది చానలకని
  వ్యంగ్యమున నని వెన్నిచ్చి వచ్చెడున్నృ
  పతి యనఁగ నర్థమిడె సతి వ్యర్థుఁ డనుచు

  చంపకమాల
  ప్రతిఘుల తోడ పోరున పరాభవ మెంచక ఖడ్గతిక్కనే
  గతివిడి వెన్నుజూపి తిరుగాడుచు నింటికి జేర మంచమున్
  జతనిడి చాటుకున్ పసుపు స్నానము స్త్రీవలె జేయనొప్పెడున్
  పతి యన నర్థమున్ దెలిపె వ్యర్థుఁ డటంచును ధర్మపత్నియే

  రిప్లయితొలగించండి
 37. సతతము సంతుకై బిలువ,సన్నిహితత్వమె వద్దుపొమ్మనున్
  కతిపయ కార్యమేలయని,కాళ్ళనుబట్టెడు నిట్టిభర్తతో
  బ్రతుకన సౌఖ్యసంపదను ,బాధ్యతలన్నియునింటి చాకిరై
  పతియనయర్ధమున్ దెలిపె, వ్యర్ధుడటంచును ధర్మపత్నియే

  రిప్లయితొలగించండి