అందరికీ వందనములు ! అందరి పూరణలూ అలరించు చున్నవి ! అలరించ నున్నవి !
A-1) వంకాయ వంటి కూరయు పంకజ ముఖి సీత వంటి - భామా మణియున్ శంకరుని వంటి దైవము లంకాధిపు వైరి వంటి - రాజున్ కలడే. అన్నారు గదా ! అందుచేత నిస్సందేహంగా కూరలలో రాజు వంకాయే కావున అది తిన్నవాడు వంద్యుడే అని బీర్బల్ అక్బరుతో చెప్పు సందర్భం : __________________________
అందరికీ వందనములు ! అందరి పూరణలూ అలరించు చున్నవి ! అలరించ నున్నవి ! B-1) వంకాయ వంటి కూరయు పంకజ ముఖి సీత వంటి - భామా మణియున్ శంకరుని వంటి దైవము లంకాధిపు వైరి వంటి - రాజున్ కలడే. అన్నారు గదా ! అందుచేత నిస్సందేహంగా కూరలలో రాజు వంకాయే కావున అది తిన్నవాడు వంద్యుడే అని బీర్బల్ అక్బరుతో చెప్పు సందర్భం : __________________________
లంకాధీశుని జంపినట్టి ఘనుడౌ - రాముండె రాజన్నచో పంకేజానన సీత వంటి మహిళే - పద్మాక్షులన్ మేటియౌ వంకాయే కడు గొప్పదైనది యగున్ - పాకంబు లన్నింటిలో శంకించన్ దగునా ప్రభూ భువిని ని - స్సందేహ నిర్వ్యాజమున్ వంకాయన్ గడుఁ బ్రీతిఁ దిన్న నరుఁడే - వంద్యుండగున్ వేగమే __________________________ వంద్యుఁడు = నమస్కరింపదగినవాడు వంధ్య = గొడ్రాలు వంధ్యుడు-ఈ పదము శబ్దరత్నాకరము,ఆంధ్రభారతి నిఘంటువులలో లేదు
కవిమిత్రులు మన్నించాలి. సంతానం లేని స్త్రీ వంధ్య అయినపుడు అటువంటి పురుషుడు వంధ్యుడు అవుతాడని భావించి సమస్యను సిద్ధం చేసాను. వసంత కిశోర్ గారు 'వంధ్యుడు' అన్న పదం నిఘంటువులో లేదని చెప్పగానే ఆ శబ్ద సాధుత్వం విషయమై ఇద్దరు సంస్కృత పండితులతో చర్చించాను. పురుషుడు వంధ్య శబ్ద వాచ్యుడు కాడు అని తెలిసింది. అందువలన 'వంధ్యుడు' శబ్దాన్ని 'భ్రష్టుడు' గా మార్చాను. ఈమార్పు వల్ల ఇంతవరకు వచ్చిన పూరణలలో చాల వరకు ఇబ్బంది లేదు. ఆ శబ్దాన్ని మార్చుకుంటే అన్వయం కుదురుతున్నది. వసంత కిశోర్ గారికి ధన్యవాదాలు.
ఈసారి తణుకు రావడం వీలుకాదు. ఆదివారం ఉదయం రాజమండ్రి చేరి అదేరోజు రాత్రి తిరుగు ప్రయాణం. 'ప్రజ-పద్యం' వారి ఆత్మీయ సమావేశం 'ఋషి సంస్కృత విద్యా ధ్యానకేంద్రం, త్యాగరాజ నగర్, రాజమండ్రిలో జరుగుతుంది. పద్యకవులందరికీ ఆహ్వానం. మీరూ రావచ్చు. కొందరు శంకరాభరణం మిత్రులు కలుస్తారు.
Garikapati Narasimha Rao About Importance Of Telugu Language : https://www.youtube.com/watch?v=qzQcQMIz1tE&feature=push-u-sub&attr_tag=CPuiwKdrJt83pRye%3A6
సందర్భము: ప్రసంగేనాపి శ్రీ రామ నామ సత్యం వదంతి యే తే కృతార్థా మునిశ్రేష్ఠ సర్వ దోషాద్గతాః సదా ప్రసంగవశంచేతనైనా నిత్యం రామనామాన్ని పలికేవారు సదా సర్వ దోషాలనుండి ముక్తులై కృతార్థు లౌతారు. (విష్ణు పురాణం) వంకాయ బెండకాయ ఆప్తమిత్రులు. రామలక్ష్మణుల లాంటి వాళ్ళు. వంకాయకు క్రమంగా మంచి పేరు వచ్చింది. బెండకాయ ఓర్వలేకపోయింది. "వంకాయను దిన్న నరుఁడు భ్రష్టుఁ డగుఁ గదా!" అని శపించింది. కొందరు ప్రాజ్ఞులు (వంకాయమీది ప్రేమతో) వంకాయకు దోష మంటిం దని భావించి, అది రాముని దయతో (త్వరలోనే) తొలగిపోవా లని ఆకాంక్షించారు. దోష మేమంటారా! అదే.. "వంకాయను దిన్న నరుఁడు భ్రష్టుఁ డగుఁ గదా!" మొదటి పద్యం లౌకిక విషయక పూరణం..రెండవది రామ ప్రసక్తి గలిగిన పూరణం. ఇతివృత్తం ఒక్కటే కాబట్టి ఒకే దగ్గర చేర్చబడినవి. సమస్యకు పరిష్కార మిది. వంకాయ బెండ లవి యక లంకపు సోదరులు రామ లక్ష్మణు లటు.."లే దింక నెరసు.. రామా.. యని కొంకక తినవచ్చు" ననిరి కొందరు ప్రాజ్ఞుల్ వాళ్ళిద్దరూ రామ లక్ష్మణులలాంటి వాళ్ళు కాబట్టి రామ.. అంటూ వంకాయను తింటే ఆ దోషం తొలగిపోతుం దని తీర్మానించారు. (లక్ష్మణా! అనకున్నా సరే! బెండకాయను తినేటప్పుడు. దాని కే దోషమూ లేదు కదా!) ~~~~~~~~~~~~~~~~~~~~~~~
రిప్లయితొలగించండినడిరేయి సరదా పూరణ:
వంకాయందున పుచ్చులన్ తరుగకే వండంగ వంటావిడే
బింకమ్మున్ గొని కండ్లుమూసి తినగా వీర్యమ్ము కోల్పోవుటన్
శంకన్ వీడుచు శంకరార్యులిచటన్ శాస్త్రోక్తమై పల్కిరే:
"వంకాయన్ గడుఁ బ్రీతిఁ దిన్న నరుఁడే వంధ్యుం డగున్ వేగమే"
మీ సరదా పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి'వంకాయ+అందున=వంకాయ యందున' అవుతుంది. అక్కడ "వంకాయన్ గొని పుచ్చులన్..." అనండి.
🙏
తొలగించండి
రిప్లయితొలగించండిఆటవిడుపు సరదా పూరణ:
(జిలేబి గారికి అంకితం)
వంకల్ చూపక వారణాసి పురినిన్ పందెమ్మునన్ గెల్చుటన్
చంకల్ కొట్టుచు భోజనంపు ప్రియుడే జాప్యమ్మునున్ జేయకే
బింకమ్మున్ గొని చేరుచుండి గయలో వీడంగ శాస్త్రోక్తమై
వంకాయన్;... గడుఁ బ్రీతిఁ దిన్న నరుఁడే వంధ్యుం డగున్ వేగమే
మీ ఆటవిడుపు పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి🙏
తొలగించండిమీ రెండు పూరణలలో వంధ్యుడు భ్రష్టుడైనా అన్వయలోపం లేదు.
తొలగించండిఅందరికీ వందనములు !
రిప్లయితొలగించండిఅందరి పూరణలూ అలరించు చున్నవి !
అలరించ నున్నవి !
A-1)
వంకాయ వంటి కూరయు
పంకజ ముఖి సీత వంటి - భామా మణియున్
శంకరుని వంటి దైవము
లంకాధిపు వైరి వంటి - రాజున్ కలడే.
అన్నారు గదా ! అందుచేత నిస్సందేహంగా కూరలలో రాజు వంకాయే
కావున అది తిన్నవాడు వంద్యుడే అని
బీర్బల్ అక్బరుతో చెప్పు సందర్భం :
__________________________
శంకను విడువుడు మీరదె
వంకాయే గొప్పది కద - వ్యంజనములలో
లెంకని మాటలు నమ్ముడు
వంకాయను దిన్న నరుఁడు - వంద్యుఁ డగుఁ గదా !
__________________________
వంద్యుఁడు = నమస్కరింపదగినవాడు
వంధ్య = గొడ్రాలు
వంధ్యుడు-ఈ పదము శబ్దరత్నాకరము,ఆంధ్రభారతి నిఘంటువులలో లేదు
వసంత కిశోర్ (కవులూరు రమేష్)
సమస్యను సవరించుకున్న మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిమీ సూచనతో సమస్యలో 'వంధ్య' శబ్దాన్ని 'భ్రష్ట'గా మార్చాను. ధన్యవాదాలు.
శంకరార్యా ! ధన్యవాదములు !
తొలగించండిటెంకాయ టెక్కుపెంచును
రిప్లయితొలగించండివంకాయను దిన్న నరుఁడు వంధ్యుఁ డగుఁ గదా"
ఎంకీ యెవ్వరు తెలిపిరి
శంకేల?తినదగునెపుడు సంతోషముగన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి'శంక+ఏల' అన్నపుడు సంధి లేదు. యడాగమం వస్తుంది. అక్కడ "శంకింపక తినగ దగును సంతోషమునన్" అనండి.
వంకాయకూర మధురము,
రిప్లయితొలగించండిపంకజ వదనా తినెదను పరవశ ముగనే
శంకను వీడుచు,పందిటి
వంకాయను దిన్న నరుఁడు వంధ్యుఁ డగుఁ గదా"
పందిటి వంకాయ = చంద్రకాంత.
చంద్రకాంత గింజలు మిరియము గింజలు వలె నల్లగా ఉండును అవితినిన వీర్య కణముల ఉత్పత్తి తగ్గును
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఅందరికీ వందనములు !
రిప్లయితొలగించండిఅందరి పూరణలూ అలరించు చున్నవి !
అలరించ నున్నవి !
B-1)
వంకాయ వంటి కూరయు
పంకజ ముఖి సీత వంటి - భామా మణియున్
శంకరుని వంటి దైవము
లంకాధిపు వైరి వంటి - రాజున్ కలడే.
అన్నారు గదా ! అందుచేత నిస్సందేహంగా కూరలలో రాజు వంకాయే
కావున అది తిన్నవాడు వంద్యుడే అని
బీర్బల్ అక్బరుతో చెప్పు సందర్భం :
__________________________
లంకాధీశుని జంపినట్టి ఘనుడౌ - రాముండె రాజన్నచో
పంకేజానన సీత వంటి మహిళే - పద్మాక్షులన్ మేటియౌ
వంకాయే కడు గొప్పదైనది యగున్ - పాకంబు లన్నింటిలో
శంకించన్ దగునా ప్రభూ భువిని ని - స్సందేహ నిర్వ్యాజమున్
వంకాయన్ గడుఁ బ్రీతిఁ దిన్న నరుఁడే - వంద్యుండగున్ వేగమే
__________________________
వంద్యుఁడు = నమస్కరింపదగినవాడు
వంధ్య = గొడ్రాలు
వంధ్యుడు-ఈ పదము శబ్దరత్నాకరము,ఆంధ్రభారతి నిఘంటువులలో లేదు
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిశంకరార్యా ! ధన్యవాదములు !
తొలగించండిఎంకీ నాయుడు బావకు
రిప్లయితొలగించండిజుంకీ లనుధరి యించి సోయగ మొప్పన్
సంకించక వండి పెట్టకు
వంకాయను దిన్న నరుఁడు వంధ్యుఁ డగుఁ గదా
అక్కయ్యా,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
రెండవ, మూడవ పాదాలలో గణభంగం. "జింకీల ధరించి మించి... శంకించి వండి పెట్టకు" అనండి.
ఎంకీ నాయుడు బావకు
తొలగించండిజింకీ లధరించి మించి సోయగ మొప్పన్
శంకించి వండి పెట్టకు
వంకాయను దిన్న నరుఁడు వంధ్యుఁ డగుఁ గదా
టెంకాయ గొట్ట జెడుయగు ,
రిప్లయితొలగించండివంకాయను దిన్న నరుఁడు వంధ్యుఁ డగుఁ గదా !
బొంకకు మీరీతి నెపుడు
సంకటమే యేపనులను సలుప దలచినన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి
రిప్లయితొలగించండిటెంకాయ దాని తోడుగ
వంకాయను దిన్న నరుఁడు వంధ్యుఁ డగుఁ గదా
బొంకెడు వారల పల్కులు
వంకలు వాగులనుదాటి వారిధి చేరున్
జిలేబి
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి
రిప్లయితొలగించండికందివారివ్వాళ సెలవా :)
పింకూబాయి, జిలేబియున్ బెరయుచున్ పీహెచ్డి పట్టమ్ముకై
టెంకాయన్ సయి వంగకాయ పయి ధాటీచేసి స్థాపించి రీ
శంకాతంకములేని రీతి, పడతుల్ జాగ్రత్త గా వండుడీ
వంకాయన్ గడుఁ బ్రీతిఁ దిన్న నరుఁడే వంధ్యుం డగున్ వేగమే!
జిలేబి
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిసెలవా? లేదు తల్లీ! అయినా సందేహ మెందుకు వచ్చింది?
శంకరుని వ్రాయమంటిని
రిప్లయితొలగించండివంకాయను దిన్న నరుఁడు వంద్యుఁ డగుఁ గదా!
పెంకితనముఁ దా వ్రాసెను
వంకాయను దిన్న నరుఁడు వంధ్యుఁ డగుఁ గదా
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిమైలవరపు వారి పూరణ
రిప్లయితొలగించండివంకాయన్ దలదన్ను కూర, యటులే వామాక్షి సీతమ్మకున్
పొంకమ్మౌ గతి సాటియైన సతి., రామున్ మించు దైవమ్ము., ని..
శ్శంకన్ లేరిల లేరు లేరు ! కవిరాజా! యిట్లనన్ జెల్లునే ?
"వంకాయన్ గడుఁ బ్రీతిఁ దిన్న నరుఁడే వంధ్యుం డగున్ వేగమే"!!
మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి
మైలవరపు వారి పూరణ ప్రశస్తంగా ఉన్నది.
తొలగించండిశంకరాభరణం.. సమస్యాపూరణం..
తొలగించండి"వంకాయన్ గడుఁ బ్రీతిఁ దిన్న నరుఁడే భ్రష్టుండగున్ వేగమే"!!
వంకాయన్ దలదన్ను కూర, యటులే వామాక్షి సీతమ్మకున్
పొంకమ్మౌ గతి సాటియైన సతి., రామున్ మించు(ధీరుండు) దైవమ్ము., ని..
శ్శంకన్ లేరిల లేరు లేరు ! కవిరాజా! యిట్లనన్ జెల్లునే ?
"వంకాయన్ గడుఁ బ్రీతిఁ దిన్న నరుఁడే భ్రష్టుండగున్ వేగమే"!!
మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి
రిప్లయితొలగించండిఈ సమస్యకు రామాయణానికి వెలుదండ వారు యెట్లా లంకె పెడతారో క్యూరియస్
జిలేబి
పొంకపు గారడీ విద్యను
రిప్లయితొలగించండిఅంకిత భావమున నేర్చి యలరె డి కరణి న్
కొంకక నొసగ గ నయ్యెడ
వంకాయ ను దిన్న నరుడు భ్రష్టు డ గు గదా
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి"గారడి విద్యల । నంకితభావమున..." అనండి.
శంక విడు వంకాయను
రిప్లయితొలగించండిపంకజముఖి వండుమమ్మ పాకంబొప్పన్
వంకర మాటలె, వినకుము
"వంకాయను దిన్న నరుఁడు భ్రష్టుఁ డగుఁ గదా"
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిమొదటి పాదంలో గణభంగం. 'శంక విడుము వంకాయను...' అనండి.
కవిమిత్రులు మన్నించాలి.
రిప్లయితొలగించండిసంతానం లేని స్త్రీ వంధ్య అయినపుడు అటువంటి పురుషుడు వంధ్యుడు అవుతాడని భావించి సమస్యను సిద్ధం చేసాను. వసంత కిశోర్ గారు 'వంధ్యుడు' అన్న పదం నిఘంటువులో లేదని చెప్పగానే ఆ శబ్ద సాధుత్వం విషయమై ఇద్దరు సంస్కృత పండితులతో చర్చించాను. పురుషుడు వంధ్య శబ్ద వాచ్యుడు కాడు అని తెలిసింది. అందువలన 'వంధ్యుడు' శబ్దాన్ని 'భ్రష్టుడు' గా మార్చాను. ఈమార్పు వల్ల ఇంతవరకు వచ్చిన పూరణలలో చాల వరకు ఇబ్బంది లేదు. ఆ శబ్దాన్ని మార్చుకుంటే అన్వయం కుదురుతున్నది.
వసంత కిశోర్ గారికి ధన్యవాదాలు.
శంకరార్యా ! ధన్యవాదములు !
తొలగించండిఅందరికీ వందనములు !
రిప్లయితొలగించండిఅందరి పూరణలూ అలరించు చున్నవి !
అలరించ నున్నవి !
A-1)
వంకాయ కూర తిని రుగ్మత పాలైన అక్బరుతో బీర్బల్ :
__________________________
శంకను విడువుడు మీరదె
వంకాయే చెడ్డది కద - వ్యంజనములలో
లెంకని మాటలు నమ్ముడు
వంకాయను దిన్న నరుఁడు - భ్రష్టుఁ డగుఁ గదా !
__________________________
వసంత కిశోర్ (కవులూరు రమేష్)
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండివసంత కిశోర్ గారూ,
తొలగించండిఎక్కడున్నారు? నేను ఎల్లుండి రాజమండ్రిలో ఉంటాను.
శంకరార్యా ! నేను తణుకు లోనే ఉన్నాను !
తొలగించండిఎన్నో సార్లు పిలిచాను మా ఇంటికి రమ్మనమని
తణుకు, రా వీలౌతుందా మీకు
నన్నే రాజమండ్రి రమ్మంటారా
ఎక్కడుంటారు రాజమండ్రిలో
ఈసారి తణుకు రావడం వీలుకాదు. ఆదివారం ఉదయం రాజమండ్రి చేరి అదేరోజు రాత్రి తిరుగు ప్రయాణం. 'ప్రజ-పద్యం' వారి ఆత్మీయ సమావేశం 'ఋషి సంస్కృత విద్యా ధ్యానకేంద్రం, త్యాగరాజ నగర్, రాజమండ్రిలో జరుగుతుంది. పద్యకవులందరికీ ఆహ్వానం. మీరూ రావచ్చు. కొందరు శంకరాభరణం మిత్రులు కలుస్తారు.
తొలగించండిమిస్సన్న గారు, తోపెల్ల బాలసుబ్రహ్మణ్యం గారు, మాచవోలు శ్రీధర రావు గారు, విట్టుబాబు, కొనకళ్ళ ఫణీంద్ర రావు గారలు మరికొందరు శంకరాభరణం మిత్రులు వస్తున్నారు.
తొలగించండి
తొలగించండిహైలెస్సా తిరుపతి తరువాయి రాజమండ్రిలో కలవచ్చన్న మాట కంది వారిని.
మరో సెల్ఫీ ఫార్ ష్యూర్ :)
జిలేబి
మధ్యలో కర్నూలులో కలిశారు కదా
తొలగించండి(వంకాయకూర తినవద్దని ఎవరో చెప్పిన మాట వింటున్న నాయుడుబావతో యెంకి)
రిప్లయితొలగించండిశంక విడు ; మహాబలుడగు
వంకాయను దిన్న నరుడు; భ్రష్టుడగుగదా!
వంకల యుత్తరు వోలెన్
జంకుచు వంకాయదినని చచ్చుమనుజుడే!
(శంక - సందేహం; వంక - వక్రపు మాట)
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిఅందరికీ వందనములు !
రిప్లయితొలగించండిఅందరి పూరణలూ అలరించు చున్నవి !
అలరించ నున్నవి !
B-1)
వంకాయ కూర తిని రుగ్మత పాలైన అక్బరుతో బీర్బల్ :
__________________________
వంకాయే కడు చెడ్డదైనది యగున్ - పాకంబు లన్నింటిలో
వంకాయే కడు నల్లనైనది గనన్ - భంగమ్ము నుత్పాలికిన్
శంకించన్ దగునా ప్రభూ భువిని ని - స్సందేహ నిర్వ్యాజమున్
వంకాయన్ గడుఁ బ్రీతిఁ దిన్న నరుఁడే - భ్రష్టుం డగున్ వేగమే !
__________________________
వసంత కిశోర్ (కవులూరు రమేష్)
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిGarikapati Narasimha Rao About Importance Of Telugu Language :
రిప్లయితొలగించండిhttps://www.youtube.com/watch?v=qzQcQMIz1tE&feature=push-u-sub&attr_tag=CPuiwKdrJt83pRye%3A6
అందరికీ నమస్సుమాంజలి 🙏🙏
రిప్లయితొలగించండినా పూరణ 🌹
*కం||*
వంకాయను దినిన మనకు
సంకోచము లేమి లేవు దంచును దురదల్
ఇంకా నెవరో యనిరట
*"వంకాయను దిన్న నరుఁడు భ్రష్టుఁ డగుఁ గదా"*
కళ్యాణ్ చక్రవర్తి, ముంబాయి
🙏🌹🙏🌹🙏
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిశంకరార్యులకు శతాధిక వందనములు 🙏🙏
తొలగించండిఇంకెందుకు తెచ్చితివా
రిప్లయితొలగించండివంకాయలు, హెచ్చు దిన్న వ్యాధులె వచ్చున్
శంకర వినరా యతిగా
వంకాయను దిన్న నరుఁడు భ్రష్టుఁ డగుఁ గదా
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి
రిప్లయితొలగించండిఅద్భుత పాకోపగీత అను మహా కావ్యము లో
టెంకాయమ్మ ఉవాచ -
వెంకాయమ్మా మేలగు
వంకాయను దిన్న నరుఁడు, భ్రష్టుఁ డగుఁ, గదా
రంకాయలన్ కలుపగా
రంకెలు వేసి దరిచేరు రతగురువగునే!
జిలేబి
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండినా మరో పూరణ 🌹🌹
రిప్లయితొలగించండి*కం||*
వంకాయను వండదగును
నింకయు నెన్నో రకములు నిజమిది గదరా
ఇంకా నెవరో యనిరట
*"వంకాయను దిన్న నరుఁడు భ్రష్టుఁ డగుఁ గదా"*
*కళ్యాణ్ చక్రవర్తి, ముంబాయి*
🙏🌹🙏🌹🙏
నా మరో పూరణ 🌹🌹🌹
తొలగించండి*కం ||*
వెంకాయమ్మను యడిగితి
వంకాయను వండమనుచు పరి పరి విధముల్
వంకలు వెతుకుచు యనెనది
*"వంకాయను దిన్న నరుఁడు భ్రష్టుఁ డగుఁ గదా"*
*కళ్యాణ్ చక్రవర్తి, ముంబాయి*
🙏🌸🙏🌸🙏
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
తొలగించండి*శంకరార్యులు చేసిన సవరణతో*🙏🙏🙇♂🙇♂
తొలగించండి*కం||*
వంకాయను *వండగ దగు*
*నింకను పెక్కు రకములుగ నిది నిజము గదా*
*యింక నెవరొ యిటు లనిరట*
*"వంకాయను దిన్న నరుఁడు భ్రష్టుఁ డగుఁ గదా"*
ధన్యుణ్ణయితిని .. ఇక ఈ కూర నేను తినేయవచ్చు...😀😀
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
తొలగించండివంకాయన్ పచనంబు చేసి తినినన్ బ్రహ్మాండమంచున్ సదా
రిప్లయితొలగించండిశంకన్ వీడి భుజించునట్టి బుధుఁడున్ స్వాస్త్యంబు కోల్పోవు, నే
వంకన్ జూడ దురంతమైన దురదల్ ప్రాప్తించుటన్ జేసి యా
వంకాయన్ గడు ప్రీతిఁ దిన్న నరుఁడే భ్రష్టుండగున్ వేగమే.
చింతా రామకృష్ణారావు.
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండివంకరటింకరపలుకిది
రిప్లయితొలగించండివంకాయనుదిన్ననరుడుభ్రష్టుడగుగదా
శంకనువీడుముశంకర!
బొంకులుబలుకంగదగునె?బుడ్డడువోలెన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిఇంకను గావలెననుగా
రిప్లయితొలగించండివంకాయను దిన్న నరుఁడు; భ్రష్టుఁ డగుఁ గదా
వంకాయను వలదని తన
కింకేదో కావలెనని యేడ్చెడి వాడే
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండివంకాయే తన కిష్టమంచు సతతంబాకూరనే కోరుచున్
రిప్లయితొలగించండివెంకాయమ్మ సుపుత్రుడే తినగనే వెన్వెంటనే వానికిన్
జంకల్ గజ్జల లోన తీవిరమె సాక్షాత్కారమయ్యెన్ గదా
వంకాయన్ గడుఁ బ్రీతిఁ దిన్న నరుఁడే భ్రష్టుం డగున్ వేగమే
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి
రిప్లయితొలగించండిటెంకాయను తినకండీ
వంకాయను దిన్న నరుఁడు భ్రష్టుఁ డగుఁ గదా!
శంకటమే గోంగూరయు!
వంకల విదురులు వెతికిరి పరిపరి విధముల్ :)
జిలేబి
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి'శంకటమే'?
పంకజ ముఖియే వండఁగ
రిప్లయితొలగించండిసంకటములు తీరు నింక శంక లుడుగుమా
వంకర మాటే యగు నిది
వంకాయను దిన్న నరుఁడు భ్రష్టుఁ డగుఁ గదా
తంకా హీనము వీత కార్యముల నిత్యంబుండి మోహాంధతన్
శంకం జెందక యన్న పానము లిఁకం జాలించి రేయింబవల్,
కంకాళమ్మయి, దోర దోరగను వేఁగన్ ముంచి మద్యంబులో
వంకాయన్ గడుఁ బ్రీతిఁ దిన్న నరుఁడే భ్రష్టుం డగున్ వేగమే
మీ రెండు పూరణలు అద్భుతంగా ఉన్నవి. అభినందనలు.
తొలగించండివంకాయన్ గడుబ్రీతిదిన్ననరుడేభ్రష్టుండగున్ వేగమే
రిప్లయితొలగించండిబొంకుల్ గల్గెడుమాటలట్లుగదగన్ మూర్ఖుండువోలెన్ భళా
జంకున్ బొందకమాటలాడగరమా!స్థైర్యంబు,ధైర్యమ్మునే?
శంకన్నొందకకూరవండుముసుమీసాయంత్ర భోజ్యమ్ముకై
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిపొంకమ్ముగనిగనిగమను
రిప్లయితొలగించండివంకాయలఁగోయ కూర వండుటకొరకై
వంకాయలన్ని పుచ్చులె
వంకాయను దిన్న నరుఁడు భ్రష్టుఁ డగుఁ గదా
పూరణ బావుంది
తొలగించండిఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
రిప్లయితొలగించండివంకాయన్ గడుఁ బ్రీతిఁ దిన్న నరుఁడే భ్రష్టుం డగున్ వేగమే
వంకాయన్ గని రెడ్డిగారటుల జిహ్వాశావిలోలాత్ముడై
సంకీర్ణంబొనరించెపాకమును మాంసాహారహస్తంబుచేన్
సంకోచంబికలేదుమాఘమిది సాక్ష్యంబేను గుహ్యంబహో
వంకాయన్ గడుఁ బ్రీతిఁ దిన్న నరుఁడే భ్రష్టుం డగున్ వేగమే
గాదిరాజు మధుసూదన రాజు
లంకేశు వైరి ప్రభుత
రిప్లయితొలగించండిశంకరు దైవత్వము కుజ సచ్ఛీలతలా
నెంక నిలిచెడిదనఁగ నే
వంకాయను దిన్న నరుఁడు భ్రష్టుఁ డగుఁ గదా?
...... గుండా వెంకట సుబ్బ సహదేవుడు
వెంకమ్మ హాస్యపిలుపున
రిప్లయితొలగించండివంకాయల్ సజ్జరొట్టి వండితిమామా
జంకేలతినగరమ్మన
వంకాయను దిన్న నరుడు బ్రష్టు డగుగదా!( హాస్యపుపలుకులు)
శా:
రిప్లయితొలగించండివెంకాయమ్మను కోరగా కుడుపు సందేహమ్ము నీకేలనో
వంకే లేని రుచిన్ దినన్ ముదముతో వడ్డించు నేవేళన
న్నింకే ముండ నషా యలమ్ము నపుడా నింపారు నావస్థనున్
వంకాయన్ గడు బ్రీతి దిన్న నరుడే భ్రష్టుండగున్ వేగమే
వై. చంద్రశేఖర్
శంకించకు గొప్పరుచియె
రిప్లయితొలగించండివంకాయను దిన్న; నరుడు భ్రష్టుడగు గదా
కంకాళముపై గూర్చుని
ఓంకారము బల్క నక్క ఊళలువేయన్
మొదటి పాదమున
తొలగించండిఅంకించును గొప్పరుచియె గా చదువ ప్రార్ధన!
అంకించు = కలిగించు (ఆం.భా.)
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిపూజ్యులు శంకరయ్య గారికి వందనములు. వంధ్య శబ్దమును సమాస బద్ధము జేసి పురుషునకు వర్తింపఁ జేయ వచ్చు నని నా యభిప్రాయము. పరికించండి. వంధ్యము సమసించ మహచ్ఛబ్ద మగును.
తొలగించండివంకాయం దమిఁ దిన్నఁ బూరుషుఁ డసభ్య ప్రాప్త వంధ్యుండగున్
రిప్లయితొలగించండివెలుదండవారిదింకా రాలేదేమిటి ?
జిలేబి
..............🌻శంకరాభరణం🌻...............
రిప్లయితొలగించండి..................🤷🏻♂సమస్య 🤷♀.................... "వంకాయను దిన్న నరుఁడుభ్రష్టుఁ డగుఁ గదా"
సందర్భము:
ప్రసంగేనాపి శ్రీ రామ
నామ సత్యం వదంతి యే
తే కృతార్థా మునిశ్రేష్ఠ
సర్వ దోషాద్గతాః సదా
ప్రసంగవశంచేతనైనా నిత్యం రామనామాన్ని పలికేవారు సదా సర్వ దోషాలనుండి ముక్తులై కృతార్థు లౌతారు. (విష్ణు పురాణం)
వంకాయ బెండకాయ ఆప్తమిత్రులు. రామలక్ష్మణుల లాంటి వాళ్ళు. వంకాయకు క్రమంగా మంచి పేరు వచ్చింది. బెండకాయ ఓర్వలేకపోయింది.
"వంకాయను దిన్న నరుఁడు భ్రష్టుఁ డగుఁ గదా!" అని శపించింది.
కొందరు ప్రాజ్ఞులు (వంకాయమీది ప్రేమతో) వంకాయకు దోష మంటిం దని భావించి, అది రాముని దయతో (త్వరలోనే) తొలగిపోవా లని ఆకాంక్షించారు. దోష మేమంటారా! అదే.. "వంకాయను దిన్న నరుఁడు భ్రష్టుఁ డగుఁ గదా!"
మొదటి పద్యం లౌకిక విషయక పూరణం..రెండవది రామ ప్రసక్తి గలిగిన పూరణం. ఇతివృత్తం ఒక్కటే కాబట్టి ఒకే దగ్గర చేర్చబడినవి.
సమస్యకు పరిష్కార మిది.
వంకాయ బెండ లవి యక
లంకపు సోదరులు రామ లక్ష్మణు లటు.."లే
దింక నెరసు.. రామా.. యని
కొంకక తినవచ్చు" ననిరి కొందరు ప్రాజ్ఞుల్
వాళ్ళిద్దరూ రామ లక్ష్మణులలాంటి వాళ్ళు కాబట్టి రామ.. అంటూ వంకాయను తింటే ఆ దోషం తొలగిపోతుం దని తీర్మానించారు. (లక్ష్మణా! అనకున్నా సరే! బెండకాయను తినేటప్పుడు. దాని కే దోషమూ లేదు కదా!)
~~~~~~~~~~~~~~~~~~~~~~~
*రామ నామ మహిమ*
వంకాయ బెండకాయలు
బంక సఖులు.. పేరు రాగ వంకాయకుఁ దా
జంకకను బెండ యిటు లనె..
"వంకాయను దిన్న నరుఁడు
భ్రష్టుఁ డగుఁ గదా" 1
వంకాయ కంటె దోషం..
బింకఁ దొలగు రాముని దయ..
నెది దోష మనన్
జంకని బెండ పలికె నిటు..
"వంకాయను దిన్న నరుఁడు
భ్రష్టుఁ డగుఁ గదా!" 2
✍️~డా.వెలుదండ సత్యనారాయణ
పరమార్థ కవి
17.01.20
-----------------------------------------------------------
ఈరోజు పనులలో పడి బ్లాగ్ లో వుంచడం విస్మరించినందుకు మన్నించాలి. (వాట్సప్ లో పెట్టాను.)
రిప్లయితొలగించండి