9, జనవరి 2020, గురువారం

సమస్య - 3246 (సమ్మెలె సాధనమ్ములు...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"సమ్మెలె దేశప్రగతికి సాధనము లగున్"
(లేదా...)
"సమ్మెలె సాధనమ్ములు నిజమ్ముగ దేశపురోభివృద్ధికిన్"

94 కామెంట్‌లు:

  1. అందరికీ నమస్సుమాంజలి 🙏🙏
    నా పూరణ 🌹

    *కం||*

    కమ్మని భవితను చూపుచు
    నమ్మని నిజములు తెలుపుచు నటియించిన తా
    పొమ్మని వారిని జేసెడి
    *సమ్మెలె దేశప్రగతికి సాధనము లగున్*

    *కళ్యాణ్ చక్రవర్తి, ముంబాయి*
    🙏🌹🙏🌹🙏

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. నా మరో పూరణ 🌹🌹

      సమ్మెలు జేయఁగ నాపుచు
      సొమ్ములు జేయఁగ తలచుచు సొంతము యనుచున్
      కొమ్ములు కాయగ జేసెడి
      *సమ్మెలె దేశప్రగతికి సాధనము లగున్*

      🙏🌹🙏🌹🙏

      తొలగించండి
    2. మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
      రెండవ పూరణలో 'సొంతము+అనుచున్' అన్నపుడు సంధి నిత్యం. యడాగమం రాదు. "సొంతమె యనుచున్/సొంత మటంచున్" అనండి.

      తొలగించండి

  2. నడిరేయి సరదా పూరణ:

    దుమ్మును రేపుచున్ వడిగ
    దుష్టుల మాటలు నమ్మి చేయుటన్
    వమ్ముర! బస్సులన్ విడుచు బంగరు రాష్ట్రపు నాయకుండనౌ
    సుమ్ముగ నాదు మాటవిని సుందర రీతిని మానివేయగా
    సమ్మెలె సాధనమ్ములు నిజమ్ముగ దేశపురోభివృద్ధికిన్

    రిప్లయితొలగించండి

  3. ఆటవిడుపు సరదా పూరణ:
    (జిలేబి గారికి అంకితం)

    సుమ్ముగ దాడి దువ్వుచును సుందర రీతిని టోపి పెట్టుచున్
    దమ్మును పట్టి బిగ్గరగ దగ్గక తుమ్మక కూతవేయుచున్
    కుమ్ముచు మోడి షా లనిక కూడుచు చేసెడి హైద్రబాదునన్
    సమ్మెలె సాధనమ్ములు నిజమ్ముగ దేశపురోభివృద్ధికిన్

    సమ్మె = కట్టుపాటు (శబ్దరత్నాకరము)

    రిప్లయితొలగించండి
  4. రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'అవిసేయుతలు'?

      తొలగించండి
    2. సమ్మెలసమ్మతి దెల్పు వి
      ధమ్ములవశ్య మవిసేయ ధర్మమె యగుటన్
      సమ్మతినందరు పాల్గొన
      "సమ్మెలె దేశప్రగతికి సాధనము లగున్"

      తొలగించండి

  5. జేజేలు జననేత జగనన్న కి - శ్రీకారానికి‌ నేడే రాక!

    అమ్మ ఒడి యే ప్రగతికి మూలము

    అమ్మో! ఏమన్నారూ ?
    సమ్మెలె దేశప్రగతికి సాధనము లగున్?
    నమ్మము కందివరార్యా
    కమ్మని "అమ్మ ఒడి" యే ప్రగతికి కుదురగున్


    వస్తాయి పదేనువేలు
    తెస్తాయి భోగభాగ్యాలు :)


    జాంగ్రి

    రిప్లయితొలగించండి


  6. తమ్మిని బమ్మి గా నిలిపి తప్పుడు మాటల కాంగ్రెసీయులే
    సమ్మెలె సాధనమ్ములు నిజమ్ముగ దేశపురోభివృద్ధికిన్
    నమ్మమటంచు దేశపు జనాళిని మోసము చేసిరెల్ల‌ కా
    లమ్ము! జిలేబి! అమ్మ ఒడి లబ్ధియె యూనిక వృద్ధి చెందగాన్!

    జిలేబి

    రిప్లయితొలగించండి
  7. నమ్మకమే పోగొట్టిరి 
    సమ్మెలె దేశ ప్రగతికి సాధనము లగున్ వమ్ముగ మాటలు పల్కిరి 
    దిమ్మతిరిగె సమ్మెచేయ తెలగానమునన్ 

    రిప్లయితొలగించండి
  8. సమ్మె లుపకరణము లవి య
    సమ్మతి తెల్పుచు జనాళి సంకల్పమునే
    యిమ్మహిఁ సాధించునవీ
    సమ్మెలె దేశప్రగతికి సాధనము లగున్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'ఇమ్మహి' తరువాత అర్ధానుస్వారం అవసరం లేదు.

      తొలగించండి
  9. నమ్మిన వారిని జనులట
    ఇమ్ముగ మోసమ్ము జేసి నిలలో నెపుడున్
    నెమ్మిని స్నేహము జేసెడి
    సమ్మెలె దేశప్రగతికి సాధనము లగున్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అక్కయ్యా,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      "...జేసి యిలలో..." అనండి.

      తొలగించండి
  10. నిన్నటి శంకరా భఱణము వారి సమస్య

    పారిరి గద పూరణమన వరకవులెల్లన్

    ఇచ్చిన పాదము కందము నా పూరణము సీసములొ


    కోడి కూయదు గదా గొంతెత్తి, శాస్త్రిగారు సమస్య తనువును రుద్దకున్న,
    ప్రొద్దు పొడవ బోదు పూరించ కున్నజిలేబి సమశ్యలన్ లేడి వోలె
    పరుగులిడుచు, శశి మరుగు కాబోడుగా జంధ్యాల శ్రేష్టుడు జార్చకున్న
    కావ్య తుంపరలను, కామేశు వారి పద్య మణుల వెలుగు దర్శ నమ్ము
    చేసిగాని యినుడు చేరబోడు పడమటి గిరుల చెంత, నట్టివి వరుసగ
    కనుచు యే (పారిరి గద పూరణమన వరకవులెల్లన్‌ శంకరార్యు ఘనత
    నుకొని యాడుచున్, పెరుగుచు నున్న ముదిమి
    గూర్చి కలవరము పడక కొత్త చిక్కు
    లెన్నియోకూర్చి బ్లాగుకు వన్నె నిడెడు
    శంక రార్యమీకు నతుల శతము చేతు

    ఏపారు అతిశయించు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. బ్లాగు మిత్రులను ప్రస్తావించిన మీ సీసపద్య పూరణ బాగున్నది. అభినందనలు.
      "కనుచు నే పారిరి..." అనండి.

      తొలగించండి

  11. దేనికైనా రామాయణమే :)

    విభీషణుడు రావణునితో సమ్మె - నిబంధన - కట్టుపాటులె వలయు నని పల్కు సందర్భములో


    అమ్మణ్ణి లక్ష్మి యా సీ
    తమ్మను విడుమయ్య మనకు తనకలి చేర్చున్!
    తమ్ముని మాటవినుమయా
    సమ్మెలె దేశప్రగతికి సాధనము లగున్!


    సమ్మె - నిబంధన కట్టుపాటు ఆంధ్ర భారతి ఉవాచ



    జిలేబి

    రిప్లయితొలగించండి
  12. M.V.R. వామన్ కుమార్ గారి పూరణ......

    దొమ్మికి రమ్మనగా, మీ
    సమ్మును ద్రిప్పుచు నిల్చెడు శక్తియు, మరి తా
    పమ్మును, మిక్కిలి యగు రో
    సమ్మెలె దేశప్రగతికి సాధనములగున్.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'రోసమ్ములె' అనడం సాధువు కదా? 'రోసమ్మెలె'?

      తొలగించండి
    2. మిమ్మల్ని శంకరాభరణం వాట్సప్ సమూహంలో చేర్చాను.

      తొలగించండి
  13. క్రమ్మిన కష్టపు మబ్బులు,
    చిమ్మెడు విష వాయువుల్ గ్రసింపగ బ్రతుకుల్,
    క్రమ్మర నధర్మములపై
    సమ్మెలె దేశ ప్రగతికి సాధనములగున్.

    రిప్లయితొలగించండి

  14. అమ్ముడుపోవు పాలకులకాశ్రయమిచ్చుచునుండినన్ విరో
    ధమ్ముల పెట్టు పౌరులకు! దైన్యవిశిష్టపథంబునన్ విడన్
    కమ్మని దేశభక్తినిడు కష్టమెయైనను సత్యమార్గమున్
    సమ్మెల సాధనమ్ములు నిజమ్ముగ దేశ పురోభివృద్ధికిన్

    రిప్లయితొలగించండి
  15. మిమ్ముల సాకెద నేనని
    నమ్మబలికి గద్దె దొరకిన పిదప మరువన్
    గమ్మున నుండక జేసెడి
    సమ్మెలె దేశప్రగతికి సాధనము లగున్

    రిప్లయితొలగించండి
  16. ఎమ్మెయి హక్కులు పొందెడి
    నమ్మకమున కార్మిక తతి నైజ పు శక్తిన్
    కమ్మని యే కత జూపెడి
    సమ్మె యె దేశ ప్రగతికి సాధనము లగున్

    రిప్లయితొలగించండి
  17. సమ్మతి తోడపాలకులు చట్టముదెత్తురు గాని కొండొకన్
    గ్రమ్మన వానిదుష్ఫలిత కారణముల్గనకుందురట్టిచో
    నెమ్మెయి జక్కసేయుటకు నివ్విధినెల్లరు సేయ నొక్కటై
    సమ్మెలె సాధనమ్ములు నిజమ్ముగ దేశపురోభివృద్ధికిన్"

    రిప్లయితొలగించండి
  18. అందరికీ నమస్సులు 🙏🙏
    నా మరో పూరణ 🌹🌹🌹

    ఇమ్మని యడిగిన వీయక
    నిమ్మకు నీరెత్తినట్టు నిల నిలబడ గా
    అమ్మని తలపించెడి పలు
    *సమ్మెలె దేశప్రగతికి సాధనము లగున్*

    *కళ్యాణ్ చక్రవర్తి, ముంబాయి*
    🙏🌹🙏🌹🙏

    రిప్లయితొలగించండి
  19. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  20. ఈ నాటి శంకరా భరణము వారి సమస్య

    సమ్మెలె దేశప్రగతికి సాధనము లగున్

    ఇచ్చిన పాదము కందము నా పూరణము సీసములో

    మధ్య పానమ్ముతో మారణ హోమంబు
    జరుగు చున్నదనుచు తరుణు లెల్ల

    తలచి గృహములందు త్రాగు బోతులకు భో
    జనమును పెట్టక సమ్మె జేసి

    హోటళ్ళు మూయించి ధాటిగా చేసిరి
    దాడులన్ బార్లపై , ధర్మ మైన

    తెలిగంట్ల సమ్మెలె దేశప్ర గతికి సా
    ధనముల గున్గదా, త్రాగు బోతు



    లెల్ల భయముతోడ వణికి తల్లు లార
    మమ్ము కాచంగ వలయును మాని వేతు
    మిప్పుడే త్రాగుడు ననుచు మించు గంట్ల
    పదములను తాకి వేడిరి బాధ పడుచు

    మించుగంటి , తెలిగంటి = స్త్రీ



    రిప్లయితొలగించండి
  21. నమ్ముడు మీరటంచు నొక నాయకు డిట్లనె సభ్యకోటితో
    "నిమ్మహి విప్లవమ్మె మన కెల్లసుఖంబులు గూర్చు భాగ్యముల్
    గ్రమ్మగ సాగు డుద్యమ మఖంబున వేగిర ముత్సహించుచున్
    సమ్మెలె సాధనమ్ములు నిజమ్ముగ దేశపురోభివృద్ధికిన్"

    రిప్లయితొలగించండి
  22. క్రొవ్విడి వేంకట రాజారావు:

    ఇమ్మగు మాటల తోడను
    నమ్మకముగ పదవి నొంది నైకృతికుండై
    ద్రిమ్మరు పెద్దన్వంచెడు
    సమ్మెలె దేశ ప్రగతికి సాధనములగున్.

    రిప్లయితొలగించండి
  23. క్రొవ్విడి వేంకట రాజారావు:

    గురువు గారికి నమస్కారములు. మొన్నటి నిన్నటి పూరణలను పంపుతున్నాను. దయతో పరిశీలించ గలరు.

    07-01-2020:

    పరిభవ మెప్పటి కైనను
    పరకాంతా సక్తులకగు; వరసంపత్తుల్
    దొరుకును ధరణిని భక్తిగ
    సిరివరణుని పూజలెంచు శ్రేష్ఠులకెల్లన్.

    08-01-2019:

    తీరగు పద్యము లల్లగ
    నోరిమితో శంకరులిడు నూహల తోడన్
    సూరులుగా చెలగుచు నిం
    పారిరి గద! పూరణమున వరకవులెల్లన్.

    రిప్లయితొలగించండి
  24. చిమ్ముచు విద్వేషమ్ములు
    దొమ్మీ విధ్వంసములును దోపిడి గాకన్
    ఉమ్మడి నిరసన దెలిపెడి
    సమ్మెలె దేశప్రగతికి సాధనము లగున్

    రిప్లయితొలగించండి
  25. చెమ్మగిలు దీనజన నయ
    నమ్ములలో వెలుగునింప న్యాయపు పోరా
    టమ్ములు ధర్మాగ్రహపుం
    సమ్మెలె దేశప్రగతికి సాధనములగున్
    జమ్మెలె??

    రిప్లయితొలగించండి
  26. ఉత్పలమాల
    ఉమ్మడి లాభనష్టముల నోరిమి తోడను చర్చఁ జేయుచున్
    సమ్మతిఁ బొందఁ గార్మికులు సాదర రీతిని యాజమాన్యమే
    యిమ్ముగ పెచ్చు జీతము సహేతుకమౌనన నీయ వీడెడున్
    సమ్మెలె సాధనమ్ములు నిజమ్ముగ దేశ పురోభివృద్ధికిన్

    రిప్లయితొలగించండి
  27. కందం
    నమ్ముచు సాయి ప్రబోధము
    నిమ్ముగ పనిజేయు వానికీయఁగ పెచ్చౌ
    సొమ్ము మురిపించ, వీడెడు
    సమ్మెలె దేశప్రగతికి సాధనము లగున్

    రిప్లయితొలగించండి
  28. సమ్మెట కోలల నుండియు
    సమ్మెట వరకున్ మనుజులు సకలము నేర్వన్
    సమ్మెట వెట్టుట వర్తిల
    సమ్మెలె దేశప్రగతికి సాధనము లగున్

    రిప్లయితొలగించండి
  29. షమ్మీ!యెఱుగుమయీయది
    సమ్మెలెదేశప్రగతికిసాధనములగున్
    సమ్మెలు సేయుచునుండిన
    నిమ్ముగబనిజేయుబ్రభుతయెక్కాలమునన్

    రిప్లయితొలగించండి
  30. సమ్మె యసమ్ముతిన్ దెలుపు జాయువదే కద రక్తమించుకన్
    చిమ్మని భండనమ్మదియె స్వేచ్ఛ హరించిన తెల్లవారలన్
    బొమ్మని భారతీయులిల బోరును సల్పి విజేతలైరిరా
    సమ్మెలె సాధనమ్ములు నిజమ్ముగ దేశపురోభివృద్ధికిన్

    రిప్లయితొలగించండి
  31. ఉ:

    నమ్ముము సొమ్ము జేసుకొన నాకము నెంచగ నివ్విధంబునన్
    గ్రమ్మగ కుక్కుటమ్ములను గంపన క్రిందగ శైలి నిక్కమున్
    ముమ్మర మెంత గూర్చ జనమూ కలనుంగుగ లబ్ది బొందగా
    సమ్మెలె సాధనమ్ములు నిజమ్ముగ దేశ పురోభి వృద్ధికిన్

    వై. చంద్రశేఖర్

    రిప్లయితొలగించండి
  32. అందరికీ నమస్సులు 🙏🙏

    నా మరో పూరణ 🌹🌹🌹🌹
    *కం||*

    క్రమ్మిన యహమును వీడక
    నమ్మిన జనులకవహేళన తగుననెడి యా
    దుమ్మును దులుపగ తలచెడి
    *సమ్మెలె దేశప్రగతికి సాధనము లగున్*

    *కళ్యాణ్ చక్రవర్తి, ముంబాయి*

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అందరికీ నమస్సులు 🙏🙏

      నా మరో పూరణ 🌹🌹🌹🌹🌹
      సమ్మె టపాసు లెపుడొ కడు
      నమ్మిన దారుల మనలను నడిపించెను గా
      కిమ్మని యూఱకె యుండిన
      *సమ్మెలె దేశప్రగతికి సాధనము లగున్*

      *కళ్యాణ్ చక్రవర్తి, ముంబాయి*
      🙏🌸🙏🌸🙏

      తొలగించండి
  33. క్రమ్మును వేశ్మముల విచా
    రమ్ములు పెల్లుగ నిరంతరమ్ము తలఁచుమా
    యెమ్మెయి నైనను మానిన
    సమ్మెలె దేశప్రగతికి సాధనము లగున్


    రమ్మివి చూడు మిత్రమ కరమ్ముపయుక్తము లెల్ల కార్ష కా
    యమ్మున కిందు సందియ మయా వల దెట్టిది నన్ను నమ్ముమా
    యిమ్ముగ యంత్రరాజముల, నిట్టివి, కోరఁగ నాకు రామదా
    సమ్మెలె, సాధనమ్ములు నిజమ్ముగ దేశపురోభివృద్ధికిన్

    [రామదాసు +అమ్మెలె = రామదా సమ్మెలె]

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ రెండు పూరణలు అద్భుతంగా ఉన్నవి. అభినందనలు.
      రెండవ పూరణ విరుపు వైవిధ్యంగా ఉన్నది.

      తొలగించండి
    2. పూజ్యులు శంకరయ్య గారికి నమః పూర్వక ధన్యవాదములు.

      తొలగించండి
  34. నమ్ముము నాదు మాట విను నాశము జేయు ప్రజా వికాసమీ
    సమ్మెలె; సాధనమ్ములు నిజమ్ముగ దేశపురోభివృద్ధికిన్
    సమ్మతమైన కోర్కెలను చక్కగ దీర్చెడి సత్ప్రణాళికల్
    నమ్మకమైన నాయకుల న్యాయవిధానపు పాలనమ్ములున్

    రిప్లయితొలగించండి
  35. సొమ్ముల కాశపడుచు పా
    పమ్ముల చేయుచును నేత పాలన చేయన్
    ఇమ్మును గూర్చి ప్రజాళికి
    సమ్మెలె దేశప్రగతికి సాధనము లగున్

    రిప్లయితొలగించండి
  36. ..............🌻శంకరాభరణం🌻...............
    ..................🤷🏻‍♂సమస్య 🤷‍♀....................
    సమ్మెలె సాధనమ్ములు నిజమ్ముగ
    దేశ పురోభివృద్ధికిన్

    సందర్భము: కైక వరాలు కోరగా రాముడు వనాల కేగాడు. ఏ భరతునికై కైక కోరరాని వరాలు కోరిందో ఆ భరతుడే ఆమెను దూషించి రాముణ్ణి మళ్ళీ నగరానికి తీసుకువస్తా నని బయలుదేరాడు.
    ఒక్కడే కాదు. సైన్యమూ వెంట నడచింది. సైనికుల భార్య లంతా సంతోషంతో తమ పతులను త్వరపెట్టినారు. (82-25). ఇక పౌరు లందరూ కదిలారు.
    తతః సముత్థాయ కులే కులే తే
    రాజన్య వైశ్యా వృషలా శ్చ విప్రాః
    అయూయుజన్ ఉష్ట్ర ఖరాన్ రథాంశ్చ
    నాగాన్ హయాంశ్చైవ
    కుల ప్రసూతాన్82-32
    (అయో.కాం.)
    ఇంటింటినుండి బ్రాహ్మణులు క్షత్రియులు వైశ్యులు శూద్రులు ఒంటెలు గాడిదలు రథములు ఏనుగులు గుఱ్ఱముల నెక్కి ప్రయాణమైరి. రాముడు రాజు కాకముందే సైనికుల పౌరుల ప్రేమాభిమానాలను చూరగొన్న తీరు అమోఘం.
    ఆయన ఉన్నట్టుండి తమ నడుమనుండి వెళ్ళిపోతే అయోధ్యా పౌరులు కొందరు రాముడు తిరిగి వచ్చిందాకా సమ్మెలు కొనసాగించా లని ఇలా అంటున్నారు.
    వమ్ము = వ్యర్థం
    ఇమ్ముగ = కుదురుగా, సౌకర్యంగా
    దబ్బున = వెంటనే (ఉమ్మడి పాలమూరు జిల్లా మాండలికం)
    ~~~~~~~~~~~~~~~~~~~~~~~
    నమ్మిన యట్టి పౌరులము
    నాటికి నేటికి.. నేటినుండియే
    సమ్మె లొనర్చు వారలము..
    స్వామియె కావలె మాకు.. సీతతో
    తమ్మునితోడ రాఘవుడు
    దబ్బున రావలెఁ.. దప్ప దింక.. మా
    సమ్మెలె సాధనమ్ములు ని
    జమ్ముగ దేశ పురోభివృద్ధికిన్ 1

    వ మ్మనబోక రాఘవుడు
    వచ్చినచోఁ బదునాలుగేండ్ల ముం
    దిమ్ముగ రామరాజ్య మది
    యిమ్మహి వచ్చును.. మేలు గల్గుఁ..గై
    కమ్మకు నోరు మూతవడుఁ..
    గాగల కార్యముకోసమైన మా
    సమ్మెలె సాధనమ్ములు ని
    జమ్ముగ దేశ పురోభివృద్ధికిన్ 2

    ✍️~డా.వెలుదండ సత్యనారాయణ
    పరమార్థ కవి
    9.01.20
    -----------------------------------------------------------

    రిప్లయితొలగించండి
  37. సమ్మెయనునాయుధమ్మది
    యిమ్ముగ ప్రతివారిహక్కుయేనాడయినన్
    సమ్మతి నొందునిమిత్తము
    సమ్మెలె దేశప్రగతికి సాధనము లగున్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'హక్కు+ఏనాడు' అన్నపుడు సంధి నిత్యం.

      తొలగించండి
  38. నమ్ముముసోదరా!ప్రగతినంజువడంగనుగారణంబులుల్
    సమ్మెలె,సాధనమ్ములునిజమ్ముగదేశపురోభివృద్ధీకిన్
    నెమ్మిగదోడుగామసలినేతలుపౌరులున్యాయబద్ధత
    న్నిమ్ముగసేవజేయగనునైచ్ఛికబుద్ధినినుండగాదగున్

    రిప్లయితొలగించండి
  39. అమ్మలు తమ్ములున్ గలసి యాదరమొప్పగ నోట్లువేసినన్
    దమ్మును జూపుచున్ దరిమి దాడినిదాల్చు మహమ్మదీయులన్
    ఇమ్ముగ హిందురాజ్యమును యేర్పడజేతుము రమ్మురమ్మనన్
    సమ్మెలె సాధనమ్ములు నిజమ్ముగ దేశ పురోభివృద్ధికిన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'రాజ్యమును+ఏర్పడ' అన్నపుడు సంధి నిత్యం. యడాగమం రాదు. "హిందు రాజ్య మిటు లేర్పడ..." అనండి.

      తొలగించండి
    2. ధన్యవాదములు గురుదేవా!నమస్సులు!
      హిందురాజ్యమిక నేర్పడజేతుము అనిన సరిపోవుననుకొందును!

      తొలగించండి


  40. 1.కమ్మగ మాటల నాడుచు
    ద్రిమ్మరి వలె నేత యెపుడు తిరుగుచు నుండన్
    వమ్మవ గానట చర్చలు
    సమ్మెలె దేశ ప్రగతికి సాధనములగున్

    2.కమ్మగ ముప్పొద్దుల తిని
    తమ్మీ చెల్లీ యటంచు తప్పుకు తిరగన్
    నిమ్ముగ బుద్ధిని చెప్పగ
    సమ్మెలె దేశ ప్రగతికి సాధనములగున్.

    3.కొమ్మల చెరచెడు వారల
    కమ్మగ కాపాడనెంచు కపటపు నేతన్
    నిమ్ముగ శిక్షించనిచో
    సమ్మెలె దేశ ప్రగతికి సాధనము లగున్.

    మరొక పూరణ

    4.సొమ్మును దాచుకొంచుమరి సుద్దులు కొల్లలు చెప్పుచున్ సదా
    యిమ్ముగ దోచుచున్ ప్రజల నెల్లను సాగెడి దుష్టనేతకున్
    కమ్మగ బుద్ధి చెప్ప నిల గట్టిగ నెంచుచు చేయునట్టి యా
    సమ్మెలె సాధనమ్ములు నిజమ్ముగ దేశపురోభివృద్ధికిన్.

    రిప్లయితొలగించండి