20, జనవరి 2020, సోమవారం

సమస్య - 3256 (ధార్మిక రీతులన్...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"ధార్మిక రీతుల నెఱుఁగని ధన్యులము గదా"
(లేదా)
"ధార్మిక రీతులన్ విడిచి ధన్యత నందిన వారమైతిమే"
(కళ్యాణ్ చక్రవర్తి గారికి ధన్యవాదాలతో...)

42 కామెంట్‌లు:


 1. నడిరేయి సరదా పూరణ:

  స్వయంకృతాపరాధము:

  నిర్మల రీతినిన్ పెరిగి నేర్చుచు గీతను ముత్తుకూరునన్
  కర్మయె కాలగా వడిగ ఖర్గపురమ్మున చిన్ననాడునన్
  శర్మలు శాస్త్రులే చనగ చంకలు గొట్టుచు చేపనొల్లుచున్
  ధార్మిక రీతులన్ విడిచి ధన్యత నందిన వారమైతిమే!

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు


  1. బెంగాలు లో చేపలు తినకు‌‌న్న ధార్మిక రీతి విడిచి నట్లు కాదు సుమండీ :)

   మేమొప్పు కోమండీ :)

   జిలేబి

   తొలగించండి

  2. 1965: మా ముత్తుకూరు ధార్మిక రీతులు:

   ఇడ్లి, దోసె, పెసరట్, ఉత్తపం, కొబ్బరి చట్నీ, సాంబార్, పులిహోర, కూటు, మజ్జిగ పులుసు, దధ్యోజనం, ఆవకాయ, మాగాయ, చింతపండు పచ్చడి, కంది పచ్చడి, కాఫీ, వగైరా వగైరా...

   ఇవేవీ బెంగాలులో ఉండేవి కాదు...

   తొలగించండి

 2. ఆటవిడుపు సరదా పూరణ:
  (జిలేబి గారికి అంకితం)

  అమిత్ షా ఉవాచ:

  మర్మము లెన్నియో గఱచి మారణ కాండను లెక్కజేయకే
  ధర్మపు పోరునన్ గెలిచి దారుణ రీతిని డింపులయ్యదౌ
  కర్మము తీర నెన్నుకొని గారపు మోడిని; రోమియోలవౌ
  ధార్మిక రీతులన్ విడిచి ధన్యత నందిన వారమైతిమే

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. *ఆర్యులు శ్రీ జీ పీ శాస్త్రి గారికి నమస్సులు*..

   ఈ సమస్యకు విత్తనము మీరు వేసినదే ..
   మొన్నటి *ముక్కోటి ఏకాదశి* పర్వదినమున మీరు అన్న మాటలే 🙏🙏🙏🙏🙇‍♂

   స్వీకరించిన మన *విశ్వ గురువర్యులు శ్రీ కంది శంకరార్యులకు* వినమ్ర నమస్సుమాంజలి 🙏🙏🙇‍♂🙇‍♂

   తొలగించండి
 3. నిర్మల వేదవాంగ్మయవనీస్థలి బూచిన పుష్ప సంపదల్
  పేర్మిని భారతీ పద నివేదన జేసి ముదంబునందగా
  మార్మికరీతినేడు నిది మాసె,గనంగవిచిత్రమయ్యె నా
  ధార్మిక రీతులన్ విడిచి ధన్యత నందిన వారమైతిమే" ?

  రిప్లయితొలగించండి


 4. చైంచిక్ ! జాల్రా :)  శర్మాజీ! శాస్త్రీజీ
  వర్మా జీ! రెడ్డి గారు! బంధువు లారా!
  అర్మిలి యెరిగిన వారమ
  ధార్మిక రీతుల నెఱుఁగని ధన్యులము గదా  జిలేబి

  రిప్లయితొలగించండి

 5. Ball back to the court :)


  మర్మము లేదు! కల్లయు సుమా మన వారికి లేదు! శంకరుల్
  హర్మిక మున్ కవీశులకు హార్దము పేర్మియు మేళవింపగా
  నర్మిలి తోడు కట్టిరి! సనాథుఁల మైతిమి! చక్రవర్తి! యే
  ధార్మిక రీతులన్ విడిచి ధన్యత నందిన వారమైతిమే?  జిలేబి

  రిప్లయితొలగించండి
 6. శర్మమునే గోరుచునిల
  ధర్మాధర్మమ్ము లనక ద్రవ్యము కొరకై
  కర్మిష్ఠులమైతిమిగద
  ధార్మిక రీతుల నెఱుఁగని ధన్యులము గదా?

  రిప్లయితొలగించండి
 7. మైలవరపు వారి పూరణ

  అంతర్మథనం...

  శర్మ ! యిదేమిరా ! పలుకజాలము శ్రీహరి మంత్రరాజమున్ !
  వర్మమనన్ హిరణ్యకశిపప్రభుకీర్తనమయ్యె ! యాగపుం
  గర్మము మానినాము బ్రతుకన్ ! గడు దీనత వైదికమ్ములౌ
  ధార్మిక రీతులన్ విడిచి ధన్యత నందిన వారమైతిమే !!

  మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

  రిప్లయితొలగించండి
 8. మర్మము లెఱిఁగినవారము 
  కర్మములను మానినాము, కనకము, కాంతల 
  నిర్మోహులమనువారల 
  ధార్మిక రీతుల నెరుగని ధన్యులముగదా 

  రిప్లయితొలగించండి
 9. ధర్మాధర్మము లనుచును
  కర్మలపై యాంక్షలున్న కష్టంబౌరా
  శర్మము గోరెడు వారము
  ధార్మిక రీతుల నెఱుఁగని ధన్యులము గదా!

  రిప్లయితొలగించండి


 10. తీర్మానమ్ముగ హిందూ
  ధర్మమ్మును నాఱఁగట్టు దండధరులమై
  నర్మటు కాంగీయులమై
  ధార్మిక రీతుల నెఱుఁగని ధన్యులము గదా!  జిలేబి

  రిప్లయితొలగించండి
 11. ..............🌻శంకరాభరణం🌻...............
  ..................🤷🏻‍♂సమస్య 🤷‍♀....................
  "ధార్మిక రీతుల నెఱుఁగని ధన్యులము గదా"

  సందర్భము: విభీషణుడు రావణునికి హితవు చెప్పినాడు. అతడు వినలేదు. నలుగురు మంత్రులతో కలిసి రాముని వద్దకు వచ్చినాడు. ఆకాశంలో నిలిచినాడు.
  తమాత్మ పంచమం దృష్ట్వా
  సుగ్రీవో వానరాధిపః
  వానరైః సహ దుర్ధర్ష
  శ్చింతయామాస బుద్ధిమాన్
  ఎవ్వరికీ ఎదిరింపరానివా డగు వానరరాజు సుగ్రీవుడు తన నలుగురు మంత్రులతో కలిసివస్తున్న విభీషణుణ్ణి చూసి బుద్ధిమంతుడు కాబట్టి యి ట్లాలోచించినాడు. యు.కాం.17-3
  విభీషణుడు స్వవిషయం చెప్పుకున్నాడు. రామునికి చెప్పుమన్నాడు. సుగ్రీవుడు వెళ్ళి రామునితో ఇలా చెప్పినాడు.
  "రావణస్యానుజో భ్రాతా
  విభీషణ ఇతి శ్రుతః
  చతుర్భిః సహ రక్షోభిః
  భవంతం శరణం గతః" 17-17
  రాము డభయ మిచ్చినాడు. అప్పుడు విభీషణుని మంత్రు లిలా అనుకుంటున్నారు.
  "ఇన్నాళ్ళు దుర్మార్గుల నడుమ నుంటిమి.. ఈనాడు రాముని దయ గంటిమి.. (ఎంతైనా) రాక్షసులలో మనమే నిర్మల గుణం గలవారము. అధార్మిక రీతుల నెరుగని వారము."
  అందుకే "విభీషణస్తు ధర్మాత్మా న తు రాక్షస చేష్టితః.." అని ప్రశంసింపబడినాడు.
  ~~~~~~~~~~~~~~~~~~~~~~~

  *ధర్మాత్ముడు*

  దుర్మార్గులలో నుంటిమి,

  ధార్మిక విగ్రహుని రాము
  దయఁ గంటిమిలే!

  నిర్మల గుణ గణ్యులము, న

  ధార్మిక రీతుల నెఱుఁగని
  ధన్యులము గదా!

  ✍️~డా.వెలుదండ సత్యనారాయణ
  పరమార్థ కవి
  20.01.20
  -----------------------------------------------------------

  రిప్లయితొలగించండి
 12. కర్మ లనంతలౌకికసుఖాలసపాపవిధాయకమ్ములన్
  నిర్మలవైదికోక్తమహనీయమునీశ్వరమార్గవైరులన్
  నర్మిలి నాచరించితివి నా కడుపుం జెడఁ బుట్టితక్కటా!
  ధార్మిక రీతులన్ విడిచి ధన్యత నందిన వారమైతిమే!

  రిప్లయితొలగించండి
 13. కర్మలజేయుచు నిరతము
  నర్మిలితో నీశుగొల్చి హాయిగ బ్రతుకున్
  శర్మమునొందుచు నెట్టి య
  ధార్మికరీతుల నెరుగని ధన్యులముగదా!

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మర్మము విత్తమార్జనమె మానము న్యాయము నెంచకుండ నే
   మార్మిక భంగినేనియు నమాయక జీవుల మభ్యపెట్టు వే
   కర్మల నాచరించుచును కాయముకందక మంత్రివర్యులై
   ధార్మికరీతులన్ విడచి ధన్యతజెందిన వారమైతిమే !

   తొలగించండి
 14. కర్మల మంచిగ జేయుచు
  ధర్మము పాటించి సతము దైవ స్మరణ న్
  నిర్మల చిత్తము తోడ న
  ధార్మిక రీతుల నెరుగని ధన్యులము గదా

  రిప్లయితొలగించండి
 15. శర్మముఁ బొందగోరినను సంపద యొక్కటె మార్గమంచు దు
  ష్కర్మల నెల్ల జేయుచును గద్దఱు లెల్ల ధనాఢ్యులైరిలన్
  ధార్మిక రీతులన్ విడిచి, ధన్యత నందిన వారమైతిమే
  ధర్మపథమ్ము వీడని యుదాత్తుడు రాముని సేవ జేయుచున్.

  రిప్లయితొలగించండి
 16. ధర్మనిబద్ధసుకర్మల
  మర్మములెరుగక యిహసుఖ మగ్నులయి సదా
  దుర్మతు లైన మనమిపుడు
  ధార్మిక రీతుల నెఱుఁగని ధన్యులము గదా"

  రిప్లయితొలగించండి
 17. కార్మిక,కర్షక,జనముల
  కూర్మినిఁగావంగలేక గొడవలు పెరుగన్
  'నార్మల్'గా నుంటి మహో!
  ధార్మిక రీతుల నెఱుగని ధన్యులముజ్ఞఁగదా.

  రిప్లయితొలగించండి
 18. కర్మమె కారణమ్ము 'ఘనకార్యము' లెన్నియొ జేసినన్, సదా
  శర్మము వీడకుండ మనసార హసింపగ జేసి యెల్లరన్
  మర్మములే యెఱింగి గరిమన్ బ్రతుకీడ్చుచు 'నొంటివారమై'
  "ధార్మిక రీతులన్ విడిచి ధన్యత నందిన వారమైతిమే"
  😃🙏🏻

  రిప్లయితొలగించండి
 19. మిత్రులందఱకు నమస్సులు!

  [ముముక్షువులు తా మొనర్చిన కృతములఁ గూర్చి దైవమునకు విన్నవించుట]

  "మర్మము వీడి, దౌష్ట్యముల మార్గము వీడియు, ద్రవ్యమొందు దు
  ష్కర్మలు వీడి, మానసము గాఢముగాఁ బరమందు నిల్పియున్,
  నిర్మలమైన సన్మతిని నిచ్చలు ధ్యాన మొనర్చుచుండి, దు

  ర్ధార్మిక రీతులన్ విడిచి, ధన్యత నందిన వారమైతిమే!"

  రిప్లయితొలగించండి
 20. మర్మ మనగ మేమెరుగము
  నర్మమయిన బతుకు నెపుడు నడిపించెదమే
  ఖర్మంవీడక నుందుము
  ధార్మిక రీతుల నెఱుఁగని ధన్యులము గదా

  నర్మము = సంతోషము
  ఖర్మం = పౌరుషము

  రిప్లయితొలగించండి
 21. మర్మములనెఱుగకెప్పుడు
  నిర్మలమగుమనసుతోడనియతినిశివునిన్
  బేర్మిని మ్రొక్కెడివారమ
  ధార్మికరీతులనెఱుగని ధన్యులముగదా

  రిప్లయితొలగించండి
 22. కందం
  దుర్మార్గులు ధాటిగ దు
  ష్కర్మల ప్రజల హృదయాల గాయపఱుచగా
  నోర్మి నెదిరించి బ్రతుకు న
  ధార్మిక రీతుల నెఱుఁగని ధన్యులము గదా!?

  రిప్లయితొలగించండి
 23. అందరికీ నమస్సుమాంజలి 🙏🙏

  *కం||*
  ధర్మము నకు తల వొగ్గను
  కర్మమునకు భయపడనుగ కలలోనైనన్
  నిర్మల మనసును గలిగిన
  *"ధార్మిక రీతులు తెలియని ధన్యులము కదా*

  *కళ్యాణ్ చక్రవర్తి, ముంబాయి*
  🙏🌸🙏🌸🙏

  రిప్లయితొలగించండి
 24. ధర్మాచరణముసల్పుచు
  నర్మిలిపెంపుగమసలుచునానందముతో
  మర్మమెరుంగకనిరతమ
  ధార్మిక రీతుల నెఱుఁగని ధన్యులము గదా

  రిప్లయితొలగించండి
 25. ధర్మపథంబులోనడచి ధన్యతనొందగ నీధరిత్రిపై
  మర్మమువీడియెల్లరును మంచితనమ్మును ప్రోదిచేయగన్
  నిర్మలజీవనంబొదవు నిశ్చయమియ్యది, యెన్నడేనియున్
  ధార్మిక రీతులన్ విడిచి ధన్యత నందిన వారమైతిమే?

  రిప్లయితొలగించండి

 26. నిర్మలమార్గమున్గనుచునీమముదప్పకవేడికంటికిన్
  బేర్మినిమానసంబునెని వేదనజేయుచునెల్లవేళలన్
  మర్మపుమార్గమున్జనకమంచినిజేయుచునీతిదూరమౌ
  ధార్మికరీతులన్విడిచిధన్యతనందినవారమైతిమే

  రిప్లయితొలగించండి
 27. మర్మము నుడువును హైందవ
  ధర్మము మోక్ష పథమునకుఁ దత్పరులైనన్
  దుర్మద పాషండ మతపు,
  ధార్మిక! రీతుల నెఱుఁగని ధన్యులము గదా


  కర్మ ఫలాశ ముక్త నర కాయము వొందదు కర్మబంధమున్
  నిర్మల బుద్ధిఁ జేయవలె నిత్యము మెండుగ దానధర్మముల్
  నిర్మమకార సంయుత వినిశ్చయ సన్మతి వేదబాహ్య దు
  ర్ధార్మిక రీతులన్ విడిచి ధన్యత నందిన వార మైతిమే

  రిప్లయితొలగించండి
 28. దుర్మతులందరున్ గలిసి ధూర్త విధానములంచు బ్రేలుచున్
  మర్మమెరుంగలేక దమ మాయను జిక్కిన జాతినిట్లు దు
  ష్కర్మల పాలు జేయు విష సంస్కృతిలో బడదోయుచుండగా
  ధార్మిక రీతులన్ విడిచి ధన్యత నందిన వారమైతిమే

  రిప్లయితొలగించండి
 29. ధర్మము ధర్మమటంచును
  శర్మమదియె లేక చిక్కి శల్యమ్మాయెన్
  శర్మ, సుఖము బడయు మనము
  ధార్మిక రీతుల నెఱుఁగని ధన్యులము గదా

  రిప్లయితొలగించండి
 30. కర్మమె ముఖ్యమటంచుకు
  మర్మము లెరుగక జనములు మహిలో నెపుడున్
  ధర్మముతో సాగుచును ,న
  ధార్మిక రీతుల నెరుగని ధన్యులము గదా.

  రిప్లయితొలగించండి
 31. ఈ నాటి శంకరా భరణము వారి సమస్య

  ధార్మిక రీతుల, నెరుగని ధన్యులముగదా

  ఇచ్చిన పాదము కందము నా పూరణము సీసములో  ఇది భారతములో ఒక కధ .కౌశికుడు అను విప్రుడు వేద వేదాంగములు చదివి వడ బోసినవాడు.ఒక నాడు అతను చెట్టు క్రింద కూర్చొనగా ఒక కొంగల జంట అతనిపై రెట్టలు వేస్తాయి. కోపముతో ఆ కౌసికుడువాటిని చూడగా అవి కాలి పోతాయి. తర్వాత బిక్షాటనకు బయలు దేరిన విప్రుడు ఒక ఇంటి ముందు ఆగుతాడు. ఆ యింటి ఇల్లాలు ఇప్పుడె బిక్ష తెస్తానని లొపలికి వెళుతుంది. దొడ్డి గుమ్మము నుంచి ఈ లోపు ఆ యిల్లాలు భర్త వస్తాడు. ఈ యిల్లాలు పతికి కాళ్ళు కడుగుకొనుటకు నీరిచ్చి అతనికి భోజనము పెట్టి తాఁబూల చర్వణము అనంతరము బిక్ష తీసుకొని వస్తుంది. అప్పటి దాకా ఆక్క్డడె ఉన్న విప్రుడు కొపముతో ఆ యిల్లాలును చూస్తాడు, ఆప్పుడు ఆ సాధ్వి చలించక విప్రోత్తమా మీకు ఇంతకోపము తగదు. మీ తీక్షణ దృష్టికిమాడి పోయిన కొంగను కాను నేను. నా పతి సేవ నాకు ముఖ్యము వాటి తర్వాతే ఏదైన మీరు తెలుసుకోవల్సిన ధర్మ శస్త్రములుఎన్నొ ఉన్నాయి. ధర్మ వ్యాధుడు అనె ఉత్తముదు కొన్ని మైళ్ల దూరములో ఉన్నాడు వారి వద్దకు వేల్లి ధర్మ జ్ననము నేర్చుకొ అని మందలిస్తుంది. బ్రాహ్మణుడు అడవిలో జరిగిన ఈ విషయము ఈవిడకు ఎలా తెల్సిందా అని నివ్వర బోయి తల దించుకొని ధర్మ వ్యాధుని చిరునామా కనుక్కొని అచటకు వెళతాడు. ధర్మ వ్యాధుడు కటిక వాడు. విప్రుడుని చూడగానె విప్రొత్తమా పరమ పతి వ్రత నిన్ను ఇక్కడకు పంపినది గదా ఆవిడ కుశలమా అని అడుగుతాడు. ఈతని దూర దృష్టికి నివ్వెర బోయి కౌసికుడు తను వక్చిన
  పని వివరిస్తాడు. ధర్మ వ్యాధుడు ఆ విప్రుని కూర్చుండ బెట్టి వ్యాపరము ముగించుకొని తన తండ్రికి భొజనము తదితర సేవలు చేసి అప్పుడు కౌసికుని తో మాట్లాడుటకు వస్తాడు. విప్రొత్తమా నాకు ధార్మిక రీతులు తెలియవు నేను మాంసము అమ్ము కొనువాడను నేను ఏ వేదములు నేర్చుకోలేడు నాకు తెలిసిన ధర్మమల్లా నా తల్లి తండ్రులకు సేవచేయుటే అది లేకున్న ఎన్ని ధర్మ శాస్త్రములు చదివినా వృధా అని చెబుతాడు. దానితో కను విప్పు కలిగి కౌశికుడు తన పురము వెడలి తన జననీ జనకులుకు సేవ చెసి సద్గతులు పొందు తాడు.
  విప్రోత్తమా రమ్ము,వెరచక వచ్చిన పనిని తెలిపితివి, పరమ సాధ్వి
  నిను పంపె నిచటకు నను కలయంగ వలెనని, తెలియవు ఘనమగు
  ధర్మశాస్త్రమ్ములు, తరచి చూడగ నేను కటికవాడను ,వేద గ్రంధ ములను
  చదువ కుంటి నెపుడు, ముదమగు మానవ నీతుల తెలియవు, నేర్ప కుంటి
  రెవ్వరు ధార్మిక రీతుల, నెరుగని ధన్యులముగదా,విధాత చేసి

  నట్టి సృష్టి లో ఘనులు జననము నిచ్చి
  నట్టి జననీజనకులు మనకు నెపుడును
  వారి సేవాదర్మముతప్ప మారు లేదు
  నాకనుచు ధర్మ వ్యాధుడు నమ్మ బలికె
  రిప్లయితొలగించండి
 32. ఉ:

  ఓర్మిన నేర్వ గానమును యుప్పెన మాదిరి పొంగి పొర్లగా
  కర్మ మదేమొ గాని యొక కమ్మని గీతము భక్తిమీరగన్
  ధర్మము సేయనైతిని కదా యన కూటము నాశ్రయింపగా
  ధార్మిక రీతులన్ విడచి ధన్యత నందన వారమైతిమే

  వై. చంద్రశేఖర్

  కూటము =club పాటలు పాడు కొరకు

  రిప్లయితొలగించండి
 33. ఉత్పలమాల
  శర్మము నందగన్ శకుని సల్పిన జూదము గెల్వ కౌరవుల్
  ధార్మిక రీతులన్ విడచి, ధన్యత నందిన వారమైతిమే
  మర్మముఁ దెల్పి కృష్ణ పరమాత్ముడు గూడుచు యుద్ధమందునన్
  గర్మలు నంటకుండు నయగారము నన్ జయమంద జేయఁగన్

  రిప్లయితొలగించండి
 34. కర్మమె ముఖ్యమటంచుకు
  మర్మము లెరుగక జనములు మహిలో నెపుడున్
  ధర్మముతో సాగుచును ,న
  ధార్మిక రీతుల పెరుగుని ధన్యులము గదా.

  రిప్లయితొలగించండి