8, జనవరి 2020, బుధవారం

సమస్య - 3245 (పూరణమన్న సత్కవులు...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"పారిరి గద పూరణమన వరకవులెల్లన్"
(లేదా...)
"పూరణమన్న సత్కవులు భూరిభయమ్మునఁ బారిరంతటన్"
(విట్టుబాబు గారికి ధన్యవాదాలతో...)

55 కామెంట్‌లు:

  1. ప్రేరణగొని పద్యరచన
    తేరగ నేర్పెడు గురువుల ధీసభ యందుమన్
    తీరుగ వ్రాయ కవిత లిం
    పారిరి గద పూరణమన వర కవులెల్లన్
    ఇంపారు = సంతోషించు తేరగ = ఉచితముగ

    రిప్లయితొలగించండి

  2. నడిరేయి సరదా పూరణ:

    తీరిక లేక శాలువలు తెచ్చుట మానగ రాజమండ్రినిన్
    కోరిక తీర పాలకులు గుండుల మీదను పాలు పోయగా
    తూరుపు దిక్కు దండమును తొందరగానిడి కైపదమ్మునన్
    పూరణమన్న సత్కవులు భూరిభయమ్మునఁ బారిరంతటన్

    రిప్లయితొలగించండి
  3. ప్రేరణపొందుటన్ రచన ప్రీతిన జేయుచు దల్చెనొక్కడున్
    వారక తెల్గుసంస్కృతపు వైరము కూడి సమాసమల్లుటన్
    కారణమేమిలేదనుచు కావ్యసభన్ యెలుగెత్తి చాటగన్
    "పూ-రణమన్న" , సత్కవులు భూరిభయమ్మున బారిరంతటన్

    ఆదిపూడి వెంకట రోహిత్🙏🏻🙏🏻🙏🏻

    ఒక కొత్తకవి ప్రయోగమన్న పేరిట పూవుల రణము అనడానికి పూరణము అని తెలుగు సంస్కృతము కలిపి చెప్పిన తరువాత అందరూ సత్కవులు భయం వేసి పారిపోతిరి

    రిప్లయితొలగించండి

  4. ఆటవిడుపు సరదా పూరణ:
    (జిలేబి గారికి అంకితం)

    తీరుగ విందుబోనమున తియ్యగ చేరుచు సంకురాతిరిన్
    మీరిన భీతినిన్ కనగ మెండుగ కర్చున టెక్కలందునన్
    కోరిక తీర పాచకులు కూరగ నుల్లులు మోదకాలలో
    పూరణమన్న సత్కవులు భూరిభయమ్మునఁ బారిరంతటన్

    గమనిక:

    సంకురాతిరి, టెక్కలి, విట్టుబాబుగారి శ్రీకాకుళం జిల్లా పదములు

    రిప్లయితొలగించండి
  5. నోరూరు భక్షకములవి
    గారెలు బూరెలు జిలేబి కారపు బూందీ
    కోరక చరవాణి కొఱఁకు
    పారిరి గద పూరణమన వరకవులెల్లన్

    రిప్లయితొలగించండి
  6. తీరుగ నేర్చుచున్ కవిత ధీసభ నందున శంకరార్యుదౌ
    ప్రేరణ బొందుచున్ మిగుల ప్రేమగ వ్రాయగ తోషమందరే
    పూరణమన్న సత్కవులు;భూరిభయమ్మున బారిరంతటన్
    ఘోరపు కష్టప్రాసలను గూర్చగలేకయె పద్యమందునన్

    రిప్లయితొలగించండి
  7. కారణము తెలిసి నంతనె
    చేరగ నొకదరిని కవులు సంతస మందున్
    మీరిన పదజా లములట
    పారిరి గద పూరణమున వరకవు లెల్లన్

    రిప్లయితొలగించండి


  8. హోరని పద్యమ్ములికన్
    జీరకపోవును జిలేబి జింతాతాజిమ్
    జోరుగ వచ్చెనటంచున్
    పారిరి గద పూరణమన వరకవులెల్లన్! :)


    జిలేబి

    రిప్లయితొలగించండి


  9. చేరె జిలేబి కూటమిని, చేవయు కల్గిన సత్కవీశులన్
    చేరెను, పద్యమిద్దియని చీల్చుచు పేర్చెను కైపదమ్ములన్
    వారికి కందపాద మయవారదె నీయ! పఠింప దానినే
    పూరణమన్న సత్కవులు భూరిభయమ్మునఁ బారిరంతటన్


    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. భూరిగ వచ్చిన యతిధులు
      పారిరి గద పూరణమన ; వరకవులెల్లన్
      తీరికగ సమస్యలను
      పూరణ జేయుచు సలిపిరి భోజనతినుటన్

      తొలగించండి
  10. కోరగ నార్థిక సాయము
    పారిరి గద, పూరణమన వరకవు లెల్లన్
    జేరిరొకచోట యనుచును
    సౌరత్యముతో నడిగిన శ్రామము నందున్.

    రిప్లయితొలగించండి
  11. మారెను శరీర తత్వము,
    మూరుచు నుండె మధుమేహము ,పెరుగు నుగదా
    కూరము భుజించిన యనుచు
    పారిరి గద పూరణమన వరకవులెల్లన్

    రిప్లయితొలగించండి
  12. కోరిరి ధన స౦పాదన నేరముగా నె౦చుదురిల నీతిగ బ్రతకన్ పేరెక్కడ పోవునొయని పారిరిగద పూరణమున వరకవులెల్లన్

    రిప్లయితొలగించండి
  13. (ఛందస్సు తెలిసినవారికి సమస్యాపూరణ
    ఇష్టం - తెలియని నీరసులకు కష్టం )
    మేరలు లేని ప్రీతి మెయి
    మెచ్చుచు , బోధకు నాత్మ నెంచుచున్
    గోరిక పొంగ దూకిరదె
    " కో " యని చేయ సమస్యలన్నిటిన్
    బూరణమన్న సత్కవులు ;
    భూరిభయమ్మున బారిరంతటన్
    ధారయు ఛందమున్ మదిని
    దాల్పని నీరసభావులందరున్ .
    ( బోధకుడు - గురువు ; ధార - ప్రవాహం )

    రిప్లయితొలగించండి
  14. వైరులు వీరుల దెబ్బకు
    పారిరి గద : పూరణ మన వర కవు లెల్లన్
    చేరిరి బ్లాగున చెంతకు
    ప్రేరణ తో చేయగ బూని ప్రీతిగ మిగుల న్

    రిప్లయితొలగించండి
  15. *అప్పారావు ను అప్పూ అని సంబోధిస్తూ ఒక తెలుగు భాషాభిమాని పలుకులు*

    తీరని నష్టమే కలిగె తీయతెనుంగుకు రాష్ట్రమందునన్
    బోరును సల్పగా వలెను మూర్ఖులమాత్యుల నిర్ణయమ్మునే
    దూరుచు, నుద్యమించగను దూకక తప్పదటంచు బిల్వ య
    ప్పూ! రణమన్న సత్కవులు భూరిభయమ్మునఁ బారిరంతటన్.

    రిప్లయితొలగించండి
  16. మైలవరపు వారి పూరణ

    పూరణమన్న సత్కవులు భూరిభయమ్మునఁ బారిరంతటన్!

    ధారుణి పిచ్చివాడొకడు దాతను నేనను కీర్తిపొంద పం...
    దేరము చేసి సొమ్ములననేకము., బీదగ మారి., సూరులన్
    "నేరిచి మీరు బొక్కసము నిండెడి రీతిగ జేయగావలెన్
    పూరణ"మన్న సత్కవులు భూరిభయమ్మునఁ బారిరంతటన్!

    మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఆరసి చూడనక్షరములైనను చక్కగ పల్కలేడు, గం..
      భీరగళమ్ము లేదు., రసవిద్వదభావము మెండు., ఛందమున్
      నేరిచియుండలే.., దయిన నేనవధానమునందు జేసెదన్
      పూరణ"మన్న సత్కవులు భూరిభయమ్మునఁ బారిరంతటన్.!!

      మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

      తొలగించండి
  17. కోరికతోడ జేరిరట గొల్లలుగా బహురుచ్యభక్ష్యముల్
    తోరముగా భుజించి కడు తుష్టిని గాంచగ, స్పష్టమయ్యె నా
    హారములోన కల్మషము లౌర విచిత్రము దానితోడ క్షుత్
    "పూరణమన్న సత్కవులు భూరిభయమ్మునఁ బారిరంతటన్"

    రిప్లయితొలగించండి
  18. మారిన లోకపు తీరుల
    కారణమే దలచుకొనుచు కటకట యనుచున్
    దారుణ వేదన నొందుచు
    పారిరి గద పూరణమన వరకవులెల్లన్

    రిప్లయితొలగించండి
  19. తీరుగ సత్కవీశ్వరుల తీరులు తెన్నులెరింగి వారికిన్
    భూరివిరాళముల్ వొసగ బూనుచు ముందుగ సాధికారతన్
    వారల యర్హతల్దెలుపు పత్రములన్నియు నాంగ్లమందు సం
    పూరణమన్న సత్కవులు భూరిభయమ్మునఁ బారిరంతటన్"

    రిప్లయితొలగించండి


  20. అన్నయ్యగారు , అక్కయ్య గారు చెల్లమ్మా తమ్ముడూ అంటూ ఒప్పారిరి :)


    సోరణి దివ్వెల వెల్గు‌న
    ధారణ తో పద్యముల వధానము చేయం
    గా రమ్మని బిలువగ నొ
    ప్పారిరి గద పూరణమన వరకవులెల్లన్!



    జిలేబీయము

    ఒప్పారి - అన్న' 'తమ్ముడు' వరస చేసి కొని పిలుచుకునే ఇద్దరిమధ్య ఉండే సంబంధంవంటి నామ మాత్ర సంబంధం

    ఆంధ్ర భారతి ఉవాచ :)

    రిప్లయితొలగించండి
  21. చేరిరి బీరములాడుచు
    జోరుగ పద్యములు వ్రాసి జూపెదమంచున్
    మీరిడిన సమస్యను గని
    పారిరి గద పూరణమన వరకవులెల్లన్

    రిప్లయితొలగించండి


  22. మీరగ ప్రాస యతులనే
    కోరలు చాపి తెఱనోరు కొందల పడుచున్
    మీ రక్తము త్రాగుననన్
    పారిరి గద పూరణమన వరకవులెల్లన్!


    జిలేబి

    రిప్లయితొలగించండి
  23. సారమతిన్బలుకవనా
    ధారసమస్యలనుదీర్తురవలీలగతిన్
    వారే గృహబాధలనన్
    పారిరి గద పూరణమన వరకవులెల్లన్

    రిప్లయితొలగించండి
  24. పూరణదెలియనివారలు
    నేరరుపూరించువిధము నియమముతోడన్
    గోరికగలవారైనను
    పారిరిగదపూరణమునవరకవులెల్లన్

    రిప్లయితొలగించండి
  25. ..............🌻శంకరాభరణం🌻...............
    ..................🤷🏻‍♂సమస్య 🤷‍♀....................
    పూరణమన్న సత్కవులు భూరిభయమ్మునఁ
    బారిరంతటన్

    సందర్భము:
    రాఘవస్యాభిషేకార్థం
    చతుస్సింధు జలం శుభం శుభమ్
    ఆనేతుం ప్రేషయస్వాశు
    దూతాం స్త్వరిత విక్రమాన్ 34-15
    (అధ్యాత్మ రామాయణం)
    భరతుడు సుగ్రీవునితో "రాము నభిషేకించడానికి నాల్గు సముద్రాల మంగళ తీర్థాన్ని కొనితేవడానికి వేగ విక్రములైన వారిని పంపు" మన్నాడు. అతడు పంపి తెప్పించినాడు.
    ఆ నాడు వైభవంగా రామ చంద్రుని పట్టాభిషేకం జరుగబోతోంది. కవులు తమ కవితా రూపంలో దీవన లీయడాని కేతెంచినారు (భూరి దక్షిణలు గైకొనవ చ్చనే ఆశతో)..
    వంటశాల మీదుగా వారు రాజ మందిరం ప్రవేశిస్తుండగా వంట శాలలో బూరెలలో నింపడానికి పప్పు బెల్లం నూరి ముద్ద చేసి పూరణం చేస్తున్నారు మహిళలు. ఆ ప్రాంతంలో తచ్చాడుతున్న మంథరమీద కవుల దృష్టి పారింది (ప్రసరించింది).
    "అదే" మని వారు మహిళల నడిగినారు. "పూరణ" మన్నారు. ఏదో (విష ప్రయోగ మనే) శంక (వారిలో) బయలుదేరింది.
    వారు సంభావనలు వద్దు బాబోయ్ బ్రతుకు జీవుడా అంటూ భయంతో పారిపోయినారు.
    పూరణము = బూరెలు మున్నగు పిండి వంటల్లో చేర్చే నూరిన పప్పు బెల్లం ముద్ద
    పారు = ప్రసరించు.. పారిపోవు
    ~~~~~~~~~~~~~~~~~~~~~~~
    చేరి రయోధ్యకున్ గవులు
    శీఘ్రమె దీవన లీయఁ గైతలన్..

    బూరెలకై సతీమణులు
    పూరణమున్ గొను చోట మంథరన్

    బారెను చూపు.. రాఘవుని
    పట్టము నా డెదొ శంక.. "యే" మనన్

    "బూరణ" మన్న సత్కవులు
    భూరి భయమ్మునఁ బారి రంతటన్

    ✍️~డా.వెలుదండ సత్యనారాయణ
    పరమార్థ కవి
    8.01.20
    -----------------------------------------------------------

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు


    1. అద్భుతము! ఏదన్నా రామాయణం లోనే చెప్పడం మీకే చెల్లు !


      జిలేబి

      తొలగించండి
  26. అందరికీ నమస్సులు 🙏🙏

    నా *సరదా పూరణ*, *జిలేబి గారికి* అంకితం 🙏🙏🙇‍♂🙇‍♂

    *కం||* 🌹

    వారెవరో హ *జిలేబి* ట
    పూరణ లెన్నో మనమిట వూహించకనే
    కారణ మిది గాదా మరి
    *పారిరి గద పూరణమన వరకవులెల్లన్*

    *కళ్యాణ్ చక్రవర్తి, ముంబాయి*
    🙏🌹🙏🌹🙏

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు


    1. వారెవరో కలరో మరి
      లేరో యని రాన్ తృటిని జిలేబీయములే
      పారగ వణుకుచు బెదురుచు
      పారిరి గద పూరణమన వరకవులెల్లన్!


      జిలేబి

      తొలగించండి
    2. అందరికీ నమస్సులు 🙏🙏

      నా *సరదా పూరణ*, *రెండవ* పూరణ

      *కం||* 🌹🌹

      చీరలు సారెలు సతులకు
      పూరణ జేసిన గలవిట పూనుకొమనినన్
      భారము తోడుగ వలదని
      *పారిరి గద పూరణమన వరకవులెల్లన్*

      *కళ్యాణ్ చక్రవర్తి, ముంబాయి*
      🙏🌹🙏🌹🙏

      తొలగించండి


    3. అబ్బే కుదరదండీ ఫ్రీగా యిస్తారంటే పారి వస్తాము రయ్యన పుచ్చుకోవడానికి :)



      చీరలు సతులకు మీకున్
      బూరెలు తప్పక నుచితము పూరింపగ రం
      డీ రయమనగా చట్టని
      పారిరి గద పూరణమన వరకవులెల్లన్


      జిలేబి

      తొలగించండి
    4. సరదా పూరణ, తప్పులున్న మన్నించవలెను..🙏🙏🙇‍♂

      మారెను మాటలు చప్పున
      పూరణ జేయఁగ దొరుకవు వూరికె నిచటన్
      బూరెలు లేవని చెప్పిన
      పారిరి గద పూరణమన వరకవులెల్లన్

      తొలగించండి
    5. అందరికీ నమస్సులు 🙏🙏
      నా మరో పూరణ (self-declaration) 😀😀

      *కం ||*

      సారము లేనివి కొన్నియు
      పూరణ నే జేతు ననుచు వూదర గొట్టన్
      కారణ మిది గాదా మరి
      *పారిరి గద పూరణమన వరకవులెల్లన్*

      *కళ్యాణ్ చక్రవర్తి, ముంబాయి*
      🙏😀🙏😀🙏

      తొలగించండి


    6. అబ్బే ! మేమొప్పు కోమండి :)

      సకృత్ప్రజపు డింభకము సకృత్ప్రజమునకు పూసకజ్జము :)


      సారంబొప్పెడు రీతిని
      తీరుగ నే జేయ పూర్తి దీనినికన్ మిం
      చారంగ చేయ లేమని
      పారిరి గద పూరణమన వరకవులెల్లన్!


      సెల్ఫుడబ్బా కొట్టుకోవాలె కార్పొరేటు వరల్డ్ లోనైన కంది వారి సభలో నైన సుదతీ :)


      జిలేబి

      తొలగించండి
    7. మీకు నా నమస్సుమాంజలి 🙏🙏

      బేరము లేమియు లేవిక
      నేరుగ మీ చెంత చేరి నేర్వగ పదముల్
      బూరెలు సారెలు దీసుకు
      *పారిరి గద పూరణమన వరకవులెల్లన్*

      🙏🙏🙏😀🙏🙏🙏

      తొలగించండి
    8. భలే! భలే!!
      చంధోభాషణము, పూరణములలో...
      😀🙏🙏

      తొలగించండి
    9. మీరు చూడడం నా అదృష్టం ..
      నాకు చాలా సంతోషకరమైన రోజు ఈరోజు .. జిలేబి గారితో ఈ సరదా పూరణ రణములు
      🙏🙏🙏🙏🙏🙏

      తొలగించండి
  27. పూరణమన్ననర్ధమునుబూర్తిగనేరనిగారణంబునన్
    బూరణమన్నసత్కవులుభూరిభయమ్మునబారిరంతటన్
    బూరణజేయరాదుపరిపూర్ణపుఛందమునేర్వకుండుచో
    బూరణజేయగల్గుదురుపూర్వసువాసననుండుచోధరన్

    రిప్లయితొలగించండి
  28. కూరిమి ఛందమున్ దెలిసి గూర్చి గణమ్ములు ప్రాసలున్ యతుల్
    తీరుగ పద్యముల్ నుడువ దివ్యవకాశముగా దలంతురే
    పూరణమన్న సత్కవులు; భూరిభయమ్మునఁ బారిరంతటన్
    పేరును గోరి జేరి యట బీరములాడిన వారలందరున్

    రిప్లయితొలగించండి
  29. తూఱిరి కొందరు గృహముల
    దూఱుచు ధాతను గరమ్ము తోచక బుద్ధిన్
    మీఱఁగ దుష్టపుఁ బ్రాసయె
    పాఱిరి గద పూరణ మన వరకవు లెల్లన్


    దారుణ మైన వార్త నవదాన్య ధరేశు నెఱింగి రంత రాఁ
    గోరఁగఁ జక్రవర్తిఁ దమ గోరిక లింపుగ నౌర లే విలన్
    మేరలు రాజశాసనము మీఱఁగ శక్యమె విత్త పేటికా
    పూరణమన్న సత్కవులు భూరిభయమ్మునఁ బాఱి రంతటన్

    రిప్లయితొలగించండి
  30. పూరణకై సమస్యనిడి పూరముఁ జేయ నిమేషమందు "ని
    ర్ధారితవేళ నైన నెడఁ దప్పక నిత్తుసహస్రరూప్యముల్
    పూరణ పూర్తిఁ జేయని కవుల్ ద్విగుణమ్మునొసంగు" డన్న నా
    బూరణమన్న సత్కవులు భూరిభయమ్మునఁ బారిరంతటన్

    రిప్లయితొలగించండి
  31. ఉ:

    సారముగూడి పద్యముల సాధన జేయుమటంచు కోరగన్
    నీరసమావహించుటయు నిక్కము గూర్చ గణాలు యెప్పగన్
    భారము దించుకొందుమన పట్టున గాదని చెప్ప నెందరో
    పూరణ మన్న సత్కవులు భూరి భయమ్మున బారి రంతటన్

    వై. చంద్రశేఖర్

    రిప్లయితొలగించండి
  32. మిత్రులందఱకు నమస్సులు!

    నేరుగ రాజమండ్రికిని నేర్పునఁ బోవుచు శంకరార్యులే
    వారక యీయ దుష్కరపుఁ బ్రాస సమస్యను; కాంచి, లేకయున్
    బ్రేరణ; శంకరాభరణ బృందమునందునఁ జేయునట్టి యా

    పూరణమన్న, సత్కవులు భూరిభయమ్మునఁ బారిరంతటన్!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు


    1. సెబాసో !


      ప్రేరణ లేకయు జీవిత
      సారము లేకయు యుసూరు సాగెడు పదమం
      జీరములిడ మనసొప్పక
      పారిరి గద పూరణమన వరకవులెల్లన్!


      జిలేబి

      తొలగించండి
  33. కందం
    సూరుని కంటెను ముందుగఁ
    బేరుచఁగ గురులు సమస్యఁ బృచ్ఛకులగుచున్
    దీరగు భావమ్ముల నే
    పారిరి గద పూరణమన వరకవులెల్లన్

    రిప్లయితొలగించండి
  34. చేరగ తన సంఘమునను
    సారించుచు ఛందములను శంకరవర్యుల్
    తీరిక తోనేర్పగ, నే
    పారిరి గద పూరణమన వరకవులెల్లన్

    రిప్లయితొలగించండి
  35. ఉత్పలమాల
    సూరుని కంటె ముందుగనె సొంపగు మేటి సమస్యనీయగన్
    వారల దారిలో విరుపొ,ప్రశ్నయొ,సక్రమమైనదౌ యలం
    కారమొ, తత్సమర్థనమొ కమ్మగఁ జప్పెడు మూర్తులుండ నే
    పూరణమన్న సత్కవులు భూరిభయమ్మునఁ బారిరంతటన్?

    రిప్లయితొలగించండి
  36. పూరణమనగానదియె మ
    హారణమని తెలియనైతి హా! పరమాత్మా!
    వారణ నెరుగక సరగున
    పారిరి గద పూరణమన వరకవులెల్లన్

    రిప్లయితొలగించండి
  37. పూరణ లెన్నొ వచ్చెనుగ! పొందెను మోదము విట్టుబాబు! తా
    పూరణ చేయకున్న తన భోగములందు మునింగి, సత్కవుల్
    పూరణ చేయగా నిటను పోఁడిమిగా తన కైపదమ్ముకున్
    "పూరణమన్న సత్కవులు భూరిభయమ్మునఁ బారిరంతటన్"

    రిప్లయితొలగించండి