అందరికీ వందనములు ! అందరి పూరణలూ అలరించు చున్నవి ! అలరించ నున్నవి !
A-1) పెద్ద పండుగ యని దీని ముద్దు పేరు : __________________________
మకర లగనము భానుడు - మరలి వచ్చు ! ఉత్తరాయణం మొదలగు - నుత్తమముగ ! బోగి తరువాత; కనుమకు - ముందు వచ్చు ! పెద్ద పండుగ యని దీని - ముద్దు పేరు ! __________________________ రాశి=లగనము వసంత కిశోర్ (కవులూరు రమేష్)
క్రోధపు ద్వేషపూరితపు గొబ్బియ లెల్లెడ కాన్పడంగ మా వీధిని గంగిరెద్దు తన వీపుని మోయుచు కాన రాలె! నా వేధయు దాగె మబ్బులను వీడక పబ్బపు వేళ నైన నా రాధన మీయ వయ్య యని రాకుని వేడెద మీ దినమ్మునన్!
శుభాకాంక్షలతో విశ్వము దేశము రాష్ట్రము సుభిక్షమవుగాక
..............🌻శంకరాభరణం🌻............... ..................🤷🏻♂సమస్య 🤷♀.................... నిషిద్ధాక్షరి 'సకార' ప్రయోగం లేకుండా సంక్రాంతి పర్వదినాన్ని గురించి స్వేచ్ఛా ఛందంలో పద్యం
సందర్భము: రఘు వంశానికి మూల పురుషుడు సూర్య భగవానుడు కాబట్టి రాముడు భక్తి గౌరవాలతో సంక్రాంతి పర్వదినాన్ని ప్రత్యేక శ్రద్ధతో జరుపుకున్నాడు. రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు మంత్రాలూ స్తోత్రాలూ పఠించినారు. మంత్రాలు = సూర్య సూక్తం మున్నగునవి. పొగడిక = స్తోత్రం.. ఆదిత్య హృదయం.. సూర్య మండల స్తోత్రం, భాస్కర దండకం మొదలైనవి వెలుగు ఱేడు = సూర్యుడు అపుడు = సంక్రాంతి నాడు ~~~~~~~~~~~~~~~~~~~~~~~
*సూర్యారాధనము*
అరయ రఘుకు లాన్వయ మూల పురుషు డినుడు మకర రాశిన్ బ్రవేశించు మంగళ కర పర్వదినము నప్పుడు నేత్ర పర్వముగను జరిపె రాముండు ప్రత్యేక శ్రద్ధతోడ 1
కం. వచ్చెను భానుడు మకరము
రిప్లయితొలగించండిమెచ్చుతు నుత్తర మువైపు మెండుగ నికపై
పచ్చని పంటలు పండగ
వచ్చెను లేక్రాంతికాంతి వరముల మయమై.
తే.గీ.
రిప్లయితొలగించండియముని దిక్కున నరయేడు యాత్ర పిదప
'పగ'లుఁ ద్రుంచగ ధాత్రికి 'పగలుఁ' బెంచ
కొడుకు పగవాడు మందుని కొంపఁజేరి
పగటి రేడు కుబేరుని బాటఁబట్టె
మకరి లోనకు రవి కోరి మరలు వేళ
రిప్లయితొలగించండిధాన్య లక్ష్మి గృహములకు దరలు వేళ
పౌష్య కన్నియ హేమంతు బట్టు వేళ
జయము జయమని బల్కెద జనుల కెల్ల
తే.గీ :
రిప్లయితొలగించండిపగడముల శుభనగవులు పొంగనిండు
వేయి భావాల తావుల వెల్లువముల
నూత్న సుధలతో పొంగార నూత్న శాంతి
భోగ భాగ్యాల నిండైన భోగి వెలుగు
పుష్య మాసపు లక్ష్మివై పుట్టి నింట
తెలుగు లోగిళ్ళలో నిండు వెలుగు పంచు
స కారము పడ్డది మిత్రమా మాసపు సుధలతో మార్చి వ్రాయండి
తొలగించండిమీ సవరణకు సూచనలకు ధన్యవాదములు ఆచార్యా ������
తొలగించండితే.గీ
వేయి భావాల తావుల వెల్లు వైన
పగడముల శుభనగవులు పొంగ నిండు
నూత్న సుధలతో పొంగార నూత్న శాంతి
భోగ భాగ్యాల నిండైన భోగి వెలుగు
పుష్యమీ నెల శోభవై పుట్టినింట
తెలుగు లోగిళ్ళలో నిండు వెలుగు పంచు
మీ సవరణకు సూచనలకు ధన్యవాదములు ఆచార్యా. చిన్న మార్పు ����������
తొలగించండితే.గీ
వేయి భావాల తావుల వెల్లు వైన
పగడముల శుభనగవులు పొంగ నిండు
నూత్న తేజమై పొంగార నూత్న శాంతి
భోగ భాగ్యాల నిండైన భోగి వెలుగు
పుష్యమీ నెల శోభవై పుట్టినింట
తెలుగు లోగిళ్ళలో నిండు వెలుగు పంచు
రిప్లయితొలగించండికంది శంకరయ్య గారు
(సమూహములో):
ప్రభాకర శాస్త్రి గారి కోసం ప్రత్యేక సమస్య....
"ప్రారంభంబగు దక్షిణాయనము సంక్రాంతిన్ ముదం బొప్పగన్"
మీరూ ప్రయత్నించండి.
తొలగించండి🙏
నడిరేయి సరదా పూరణ:
(కంది గురువులకు అంకితం)
చేరంగా రవి యిందుభమ్మునను భల్ శ్రేష్ఠంబునౌ రీతినిన్
ప్రారంభంబగు దక్షిణాయనము;...సంక్రాంతిన్ ముదం బొప్పగన్
శూరత్వమ్మున కోళ్ళనున్ దునుముచున్ జొప్పించి రంగమ్మునన్
బీరున్ ద్రాగెడి మత్తునన్ మురియుచున్ విత్తమ్మునున్ గెల్వుడీ!
ఇందుభము :
ఆంధ్రశబ్దరత్నాకరము (చెలమచెర్ల రంగాచార్యులు) 1966
సం.వి.అ.న.
1. కర్కటరాశి.
తొలగించండి🙏
ఆటవిడుపు సరదా పూరణ:
(జిలేబి గారికి అంకితం)
### ఉవాచ:
చేరంగా రవి యిందుభమ్మునను భల్ శ్రేష్ఠంబునౌ రీతినిన్
ప్రారంభంబగు దక్షిణాయనము;...సంక్రాంతిన్ ముదం బొప్పగన్
మారామున్ మరి చేయకుండ నికనున్ మద్యమ్మునున్ గ్రోలుచున్
శూరత్వమ్మున సమ్మెలన్ తగులకే చొచ్చండి మీ బస్సులన్!
ఇందుభము :
ఆంధ్రశబ్దరత్నాకరము (చెలమచెర్ల రంగాచార్యులు) 1966
సం.వి.అ.న.
1. కర్కటరాశి.
తొలగించండిఆహా! శార్దూలమా ! నువ్వొస్తానంటే నేవద్దంటానా :)
సారంబొప్పెడు రీతి నాకనుచు మాస్టారూ దయన్ చూపి రే!
కారాడింప ప్రభాకరుండు మెలపున్ కర్కాటకంబందహో
ప్రారంభంబగు దక్షిణాయనము, సంక్రాంతిన్ ముదం బొప్పగన్,
సారూ!మేల్మిని నుత్తరాయణమగున్ సంభావనీయంబుగా
జిలేబి
👌
తొలగించండిఅళియ వచ్చెను పండుగ కేళి యనగ
రిప్లయితొలగించండిఅత్త వండెను ప్రియముగా క్రొత్త రుచులు
దరిని జేరెను దారయె విరులు తురిమి
భోగ భాగ్యాలు దెచ్చెను భువికి నేడు
( ఇటూ అటూ భోగి - కనుమ సేవింపగా
రిప్లయితొలగించండినడుమన మకరసంక్రాంతి పండుగ )
వేవెలుంగుల రాయడు వేడ్కతోడ
నడుగు పెట్టెను మకరాన నయ్యలార !
పాడిపంటల మనలకు పంచిపెట్టు
బొమ్మపండుగ విచ్చేసె నమ్మలార !
( వేవెలుంగుల రాయడు- సహస్రకిరణుడైన సూర్యుడు)
నాల్గవ పాదంలో "విచ్చేసె " బదులుగా "యేతెంచె "అని చదువ
రిప్లయితొలగించండిమనవి .
రిప్లయితొలగించండిసంక్రాంతి శుభాకాంక్షలందరికీ !
మకరమ్మున కాలిడె నరు
ణకిరణుడిదె పబ్బ మాయెనమ్మ జిలేబీ
ప్రకృతికి వందనములతో
డు కరుణ చూపమని కోరెడు హరిమ యిదియే!
జిలేబి
నిషిద్ధాక్షరి :-
రిప్లయితొలగించండి*స* కార' ప్రయోగం లేకుండా
సంక్రాంతి పర్వదినాన్ని గురించి
స్వేచ్ఛాఛందంలో పద్యం వ్రాయండి.
*ఆ.వె**
1.
పంటలన్ని పండి పంటచేతికి రాగ
గాదెలన్ని నిండి కలిగెముదము
ముచ్చట గొలిపేటి ముంగిట ముగ్గులు
పల్లె నందు పొంగె పాలపొంగు
2.
భోగి మంటలిచ్చు భోగభాగ్యమ్ములు
పశుల పూజ లిచ్చు పాడిపంట
కొత్త నూపునిచ్చు కోడిపందెమ్ములు
చూడముచ్చటాయె చూచునంత
3.
మకర రాశి లోకి మారునర్కని కక్ష్య
నుత్తరాయణమ్మ కొత్త కాంతి
పుణ్య కాలమనియు పూజ్య భీష్ముండును
వేచిచూచి పలికె వీడుకోలు
...................✍చక్రి
అందరికీ వందనములు !
రిప్లయితొలగించండిఅందరి పూరణలూ అలరించు చున్నవి !
అలరించ నున్నవి !
A-1)
పెద్ద పండుగ యని దీని ముద్దు పేరు :
__________________________
మకర లగనము భానుడు - మరలి వచ్చు !
ఉత్తరాయణం మొదలగు - నుత్తమముగ !
బోగి తరువాత; కనుమకు - ముందు వచ్చు !
పెద్ద పండుగ యని దీని - ముద్దు పేరు !
__________________________
రాశి=లగనము
వసంత కిశోర్ (కవులూరు రమేష్)
నిగ్గు లొల్కెడు ముగ్గులు నేర్పు మీర
రిప్లయితొలగించండినింతు లల్ల గ కళకళ లినుమడించె
కోడి పందాలు జరిగెను కోర్కె గాను
తెలుగు వారికి పండుగ తెచ్చె ముదము
రిప్లయితొలగించండిక్రోధపు ద్వేషపూరితపు గొబ్బియ లెల్లెడ కాన్పడంగ మా
వీధిని గంగిరెద్దు తన వీపుని మోయుచు కాన రాలె! నా
వేధయు దాగె మబ్బులను వీడక పబ్బపు వేళ నైన నా
రాధన మీయ వయ్య యని రాకుని వేడెద మీ దినమ్మునన్!
శుభాకాంక్షలతో
విశ్వము దేశము రాష్ట్రము సుభిక్షమవుగాక
జిలేబి
మైలవరపు వారి పూరణ
రిప్లయితొలగించండి💐💐శంకరాభరణం సమూహసాహితీమిత్రమండలికి సంక్రాంతి శుభాకాంక్షలు 🙏
పండిన ధాన్యాలు బండ్లపైకెక్కించి
తెచ్చి గాదెల నింపు తీరు జూడ .,
వివిధవర్ణాలతో వీథుల రంగుల
అందాల ముగ్గుల విందు జూడ.,
వంటింటపొయ్యిపై
బామ్మవండుచునున్న
తియ్యని వంటల తీరు జూడ.,
కొంటె మాటలతోడ నింట బావలనాట
పట్టించు మరదళ్ల పథము జూడ
కోడి యెద్దుల పందెముల్,కోట్ల ధనము
చిల్లరగ మార్చి యాటాడు చీట్లపేక !
తెలుపుచున్నది గాంచుడీ
తెలుగునేల
వచ్చి నిలిచినదిదె *పెద్దపండుగ* యని !!
మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి
రంగవల్లులు,గొబ్బెమల్,గంగిరెద్దు,
రిప్లయితొలగించండిమంచి పొంగళ్ళు,బంతి చేమంతి విరులు,
కోడి పోరు,పతంగులు,'కొలువు ' చెలువు,--
పెద్ద పండుగ వచ్చె శోభించి మించి.
కొలువు=బొమ్మల కొలువు
అద్రి జేరు మకరరాశి యందు నిపుడు
రిప్లయితొలగించండికొత్త పంటయు మనయింటి కొచ్టి జేరు
నుత్తరాయణ మరుదెంచు నుత్తమముగ
పండుగలలోన నతి పెద్ద పండుగ యిది
భువి నిండగ ధాన్యములను,
రిప్లయితొలగించండిరవి దా చేరెను మకరము, రయ్ రయ్ మనుచున్
దివి కెగయ పతంగమ్ములు,
దివిజులు దీవించ ప్రజయు దేదీప్యమవన్
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిపాడి పంటల పిండి వంటల పండుగే యిది చూడుమా!
రిప్లయితొలగించండివాడ వాడల ముగ్గులెన్నియొ వారిజాక్షులు వేయగా
వేడికై చలిమంటలెన్నియొ వేయగా నులి వెచ్చగా
నాడి పాడిరి బాల బాలిక లంంఱున్ గడు వేడుకన్.
బంగరు కాంతులన్ పుడమి పచ్చని పైరుల శోభలీనగా
రిప్లయితొలగించండిముంగిట రంగవల్లికలు ముచ్చటగా కనువిందు జేయగా
పొంగటి పండుగంచు దమ పుత్రులు పౌత్రులు చెంతజేరగా
నింగిని దాకు హర్షమున నెల్లరి యుల్లము లూయలూగుగా
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండితే.గీ.
రిప్లయితొలగించండిమకరరాశికి మార్తాండు డకలుషమతి
యరుగుదెంచెడి కాలమీ యవనిలోన
పర్వములయందు ముఖ్యమై బహుళగతుల
హర్షమును నింపు మదులందు ననవరతము.
మిత్రులందఱకు మకర సంక్రాంతి పర్వదిన శుభాకాంక్షలు!
రిప్లయితొలగించండితరలము (ధ్రువకోకిలావృత్తము):
మకర రాశినిఁ జొచ్చి యర్కుఁడు మాన్యుఁడై వెలుఁగొందఁ; జే
ని కడ ధాన్యముఁ దెచ్చి రైతులు నింప గాదెలు పొంగఁగా;
ముకుర రీతిఁ గొమల్ బ్రియమ్మునఁ బొంగళుల్ మఱి వండ; బా
లికలు ముంగిట మ్రుగ్గు లద్దియుఁ బ్రేమ గొబ్బిళులుంచఁ; గొం
డ్రికలు మింటఁ బతంగు లుంచియుఁ బ్రీతిఁ బోరఁగఁ దా; మనూ
నక జనాల్ గన గంగిరెద్దుల నవ్య భిక్షులె యాడ; వ
చ్చి కనువిందొనరించెఁ బర్వము శ్రీలు పొంగఁగ నుర్వికిన్!
[ఏఁడు గుఱ్ఱముల బండిపయిఁ బయనించుచు వేవెలుఁగుల దొర మకర రాశిలోఁ బ్రవేశించినప్పు డేర్పడిన పండుగ కావున నేఁడు పాదముల తరలమును రచించితిని]
తెల్ల వారెనని యరిచె తల్లికోడి,
రిప్లయితొలగించండిగిరుల మధ్యలో మెల్లగా శిరము నెత్తి,
తూర్పు దిక్కున దినమణి తొంగి చూచె,
చలి వణుకు బెట్టు చుండగ జ్వాల చుట్టు
జనులు చేరి నారుగ వెచ్చ దనము కోరి ,
భోగి మంటలు దయమున భోగ మిడగ,
తలగడుగు నొనరించిరి తనివి దీర,
పిల్ల పాపల తో కూడి నెల్ల జనులు
గుడుల లో పూజలు చరించి కోర్కె లన్ని
వేల్పు లెదుట బెట్టి శుభంబు వేడినారు,
మాపు వేళ గొబ్బెమ్మలన్ మగువు లెల్ల
పెట్టి కేరింతల నిడుచు నట్టె మాడె,
చిన్నిపాపల తలలపై చెలిమి తోడ,
రేగు పండ్లు జార్చితిరి పూ రెక్కల బెర
యించి, తాతమ్మ దీవెనల్ పంచు కొనుచు
జరిపితిరి భోగి పండుగ జన్య తోడ
దినమణి = సూర్యుడు, తలగడుగు= తలస్నానము , నట్టె = నాట్యము , బెరయించి = మేళవించి
జన్య= సంతోషము
మకరరాశికిభానుడుమారుకతన
రిప్లయితొలగించండినుత్తరాయణమనబడుపుణ్యదినము
క్రాంతిగలిగించబ్రజలకుకరముభువిని
వచ్చెనీరోజుశుభములబడయుకొఱకు
ఎచ్చోట జూచిన నింపుగ హరిదాసు
రిప్లయితొలగించండికీర్తనతో జేయు నర్తనములె
ఎచ్చోట జూచిన నెనయు మధురమైన
జానపదుల లోని గానమధువె
ఎచ్చోట జూచిన నచ్చెరవు జనించు
కోలాట రవముల మేలుగతులె
ఎచ్చోట జూచిన హెచ్చైన శ్రుతి యందు
చెక్కభజనల యొక్క చెలగు ధ్వనులె
తే . గీ. రంగురంగుల రంగవల్లరుల కాంతి
రంగరింపగ నంగనల్ ప్రాంగణమున
కర్షకులు తడియగ హర్షవర్షమందు
వచ్చె సంక్రాంతిలక్ష్మి శోభాయముగను
గు రు మూ ర్తి ఆ చా రి
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
పడతుల రంగవల్లులవి పంచగ నేలకు కౌతుకమ్మునే,
రిప్లయితొలగించండిబుడతల చే పతంగులవి పూన్చగ నింగిన వేల్పువిల్లులన్,
నడుమన కోడి పందెముల నాటెడు వక్రపు కోడె 'దూకుడుల్'(మీసముల్)
యడఁగిన నాడె వచ్చునహొ నచ్చపు పొంగటి పండువిచ్చటన్
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండికందం
తొలగించండిఆ గొబ్బి పర్వమనఁగన్
భోగి కనుమ మధ్య, భువిని మూగగ పంటల్
దాగనని ధనూరాశిని
రాగమునఁ గిరణుఁడు మకర రాశిని జేరున్
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిమీకు మీ కుటుంబ సభ్యులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు.
రిప్లయితొలగించండిచంపకమాల:
చకచక నాకసానబడి సాగి ధనుస్సును దాటి వేడ్కతో
మకరపు రాశి జేర మరి మాకిక పండుగ గాదు సూర్యుడా!
తికమక లన్నిమారి సరి తేజము పొంగుచు తెల్గునేల క్షే
మకరపు రాశిజేరిననె మాకది "భోగి"యు "పొంగలౌ"గదా!
---గోలి.😐
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిముంగిట మ్రుగ్గులు నిండును
రిప్లయితొలగించండిహంగుగ నట్టిళ్ళు నిండు నతిథులతోడన్
పొంగల్ పండుగ నాడు ప
తంగులు యాకాశమందు ధాటిగ నిండున్.
గగన భాగం బెల్లఁ గప్పుకొనంగ నరుణ కాంతులు దనరి మణి నిభమ్ము
రిప్లయితొలగించండిజనలోక మెల్ల హర్ష జలధి మునుగంగఁ బంట లంద భృశము తొంటి యట్ల
జలరాశు లెల్లయుఁ జారుతరమ్ములై నిండంగ నెల్లెడ మెండుగాను
నిజ తనూభవ కమనీయ కాంతుల నిజకాంతునిఁ గూడి రా గంతు లిడుచుఁ
జలి పులి కులికి చలిమంట చెలఁగ నింట
వడివడిఁ దడబడక నెడఁ బరుగు లిడుచుఁ
గనుడు కను డంచు ననుచుండ దినకరుండు
మించి వచ్చెను మకరంపు మంచి క్రాంతి
14-1-2018 నాటి "శ,ష,స" ల నిషేధముతో సంక్రాంతి సంబరముల వర్ణన:
తొలగించండిమండలి మంచి క్రమణము మకర మందు నుత్తరాయణ మగు నుర్వి యందు
కాంతులు వెదజల్లు కలుగఁ బంటలు హాలికులకును భోగిమంట లలరుఁ బురి
రంగవల్లుల నెల్ల రమణీమణు లలరుదురు పూజ లింపుగ జరుగు నిండ్ల
గాలిపటములు నాకమునఁ జెలంగుఁ బ్రభల తీర్థములు తమిఁ బరిఢవిల్లు
భోగిపళ్ళ గొబ్బెమ్మలఁ బుడమి నిండు
పిండివంటల ఘుమఘుమ లుండు నెల్ల
క్రొత్త బట్టల నింపుగఁ జిత్త మలరు
మంచి క్రాంతి ముదకరమ్ము మానవులకు
సుకవులు పోచిరాజువారికి నమస్సులు!
తొలగించండిమీ పూరణ వృత్త్యనుప్రాసతో చాల బాగున్నది. అభినందనలు.
సీసం మూడో పాదంలో ఎల్ల(న్) ద్రుతాంతమనుకొందును. యు కన్న ను వేయడమే సమంజసమనిపించుచున్నది. ఏమందురు?
కవి పుంగవులు మధుసూదన గారు ధన్యవాదములు. అవునండి. ఇది ప్రమాద పతితము.
తొలగించండిగగన భాగం బెల్లఁ గప్పుకొనంగ నరుణ కాంతులు దనరి మణి నిభమ్ము
తొలగించండిజనలోక మెల్ల హర్ష జలధి మునుగంగఁ బంట లంద భృశము తొంటి యట్ల
జలరాశు లెల్లను జారుతరమ్ములై నిండంగ నెల్లెడ మెండుగాను
నిజ తనూభవ కమనీయ కాంతుల నిజకాంతునిఁ గూడి రా గంతు లిడుచుఁ
జలి పులి కులికి చలిమంట చెలఁగ నింట
వడివడిఁ దడబడక నెడఁ బరుగు లిడుచుఁ
గనుడు కను డంచు ననుచుండ దినకరుండు
మించి వచ్చెను మకరంపు మంచి క్రాంతి
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిముంగిలులు రంగురంగుల రంగవల్లు
రిప్లయితొలగించండిల నునిచి హళది కుంకుమల చిలికించి
ఆవు పేడ గొబ్బెమ్మలు పూవు లుంచి
తలలపై కన్నెపిల్లలు దాల్చి ఓణి
పరికిణీల తిరుగు చుంద్రు పరవశించి
ఈ రోజు శంకరా భరణము వారి సమస్య స అను అక్షరము దానిగుణింతములు రాకుండా సంక్రాంతి వర్ణన
రిప్లయితొలగించండిభోగి పండుగ తలపు కన్పోడ్పు కలుగ
తెల్ల వారెను లెమ్మనెన్ దినకరుండు,
శుక కపోత చటక గణ శోభిత పచ
రిత జనిత పవనపు రెప రెపల తోడ
కోవెల ధ్వజ కంబపు కొండిక మగు
గంట లు రవము లిడగ ప్రాం గణము లందు,
గుళ్ల లోన విరతి లేక కొట్టు చుండె
గంట లన్ని హారతులును కనుచు జనము ,
కోడి పందెము లొకచోట ,కొత్త జంట
లొక్కచోట, నూయలు లూగు నొక్క చోట,
గొబ్బి పాటలు నొక చోట, గుమ్మ పాల
నురుగు లొకచోట , పరికిణీ పరుగు లొక్క
చోట, హరిని కీర్తించెడు పాట లొక్క
చోట, బియ్యపు పొంగళ్ల ఘాటు నొక్క
చోట, బొమ్మల కొలువుల తోటి వెలుగు
చుండు పల్లెలో నిండ్లన్ని చూడ చూడ,
గోమయము చల్లి వాటిపై కొమ్మలెల్ల
రంగ వల్లులు వేయంగ హంగు నిచ్చు
చుండు గా యిళ్ళ ముంగిట శోభ తోడ,
తెలుగు జనులకు నెప్పుడు వెలుగు నిచ్చు
పెద్ద పండుగ గాయిది పేర్మి తోడ
రిప్లయితొలగించండిచేరన్ భానుడుకర్కటంబునకుదాశీఘ్రంబుగానప్పుడున్
బ్రారంభంబగుదక్షిణాయనము,సంక్రాతిన్ ముదంబొప్పగన్
వీరున్ వారలుగాకనందఱుదగన్ బేకాటలాడంగ దా
బారంబొందగజూతురయ్యెడసుమావాత్సల్యమింపారగన్
తే. గీ.
రిప్లయితొలగించండిఉత్తరాయణ పుణ్యకాలోద్భవమున
మకర చంక్రమణపు రవి మహిని జీవ
కోటి కిడుగాక శుభముల కోటి నిత్య
మానుచు కాంక్షింతు మనమున ననఘులార.
ఉ.
రంగుగ రంగవల్లులను రాజిలు గొబ్బియలుంచి కన్నియల్
హంగగు పట్టు పుట్టముల నాడుచు పాడుచు పూజచేయుచున్
పొంగుచు పొంగలిన్ దినెడి పొల్పగు చంక్రమణంపు వేళలో
ముంగిలి పర్వ శోభలను మోదము గూర్చెడు నెల్లవారికిన్.
ఉ.
వందన మాచరింతు నపవర్గతృషీతుల కంజలించెదన్
ముందుగ మాకు నందరికి పూర్వులు పూజ్యులు భక్తి పొంగులౌ
చందము దివ్యమౌ మకరచంక్రమణమ్మున తర్పణంబులన్
పొందుగ నిచ్చి దీవెనల పొందెద వృద్ధిని పొంద హర్షముల్.
...నిత్య మనుచు కాంక్షింతు...
రిప్లయితొలగించండి..............🌻శంకరాభరణం🌻...............
రిప్లయితొలగించండి..................🤷🏻♂సమస్య 🤷♀....................
నిషిద్ధాక్షరి
'సకార' ప్రయోగం లేకుండా
సంక్రాంతి పర్వదినాన్ని గురించి
స్వేచ్ఛా ఛందంలో పద్యం
సందర్భము: రఘు వంశానికి మూల పురుషుడు సూర్య భగవానుడు కాబట్టి రాముడు భక్తి గౌరవాలతో సంక్రాంతి పర్వదినాన్ని ప్రత్యేక శ్రద్ధతో జరుపుకున్నాడు.
రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు మంత్రాలూ స్తోత్రాలూ పఠించినారు.
మంత్రాలు = సూర్య సూక్తం మున్నగునవి.
పొగడిక = స్తోత్రం.. ఆదిత్య హృదయం..
సూర్య మండల స్తోత్రం,
భాస్కర దండకం మొదలైనవి
వెలుగు ఱేడు = సూర్యుడు
అపుడు = సంక్రాంతి నాడు
~~~~~~~~~~~~~~~~~~~~~~~
*సూర్యారాధనము*
అరయ రఘుకు లాన్వయ మూల
పురుషు డినుడు
మకర రాశిన్ బ్రవేశించు మంగళ కర
పర్వదినము నప్పుడు నేత్ర పర్వముగను
జరిపె రాముండు ప్రత్యేక శ్రద్ధతోడ 1
మంత్రముల పఠించి మైమరపున మించి,
పొగడికల పఠించి పులకరించి
రామ లక్ష్మణులు భరతుడు శత్రుఘ్నుండు
వెలుగు ఱేని నపుడు కొలిచినారు 2
✍️~డా.వెలుదండ సత్యనారాయణ
పరమార్థ కవి
15.01.20
-----------------------------------------------------------
కందం
రిప్లయితొలగించండిమూగెడు ధాన్యపు గలగల,
రాగమ్ముల గొబ్బిపాట, రగిలెడు మంటల్
భోగి దినమ్మున తాకఁగ
వేగమె రవి మకరమేగు వేడుక శుభమౌ
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండి
రిప్లయితొలగించండిమత్తకోకిల
రంగవల్లుల గొబ్బివేడుక ప్రాకటమ్మగు పర్వమున్,
భంగపాటులు భోగిమంటల భగ్నమౌ మది శుభ్రతన్
ముంగిటన్ హరి కీర్తనమ్ముల, మూగివచ్చిన పంటలన్
గంగిరెద్దుల దీవెనమ్ముల గాదెనిండెడు హర్షమున్
నింగినంటిన కౌతుకమ్ములు నేలఁ జూచు పతంగమై
పొంగు మోదము నాల్గు దిక్కుల మూడునాళ్లుగ ముచ్చటై
రంగనాథుడు మిమ్ము బ్రోవఁగ ప్రార్థనమ్ముల వేడెదన్
*15, జనవరి 2020, బుధవారం*
రిప్లయితొలగించండి*నిషిద్ధాక్షరి - 49*
*'స* కార'ప్రయోగం లేకుండా
*సంక్రాంతి* పర్వదినాన్ని గురించి
*స్వేచ్ఛాఛందంలో* పద్యం వ్రాయండి
*కం||*
ధాటిగ మకరపు చెంతన
నేటికి భానుడు నెలవగు నిక్కము సుమ్మీ
మేటిగ పంటలు పండను,
పోటీ కోళ్లిచటను బహు పొగరును జూపున్
*కళ్యాణ్ చక్రవర్తి, ముంబాయి*
🙏🎋🙏🎋🙏
కవివర్యులందరికి పేరుపేరునా సంక్రాంతి శుభాకాంక్షలతో నమస్సులు 🙏🙏
తొలగించండినిషిద్దాక్షరి *స*
*తే గీ*
మూడు రోజుల పండుగ ముచ్చటగను
భోగి నాడు గలుగుచుండు భోగమెపుడు
మకరమున భానుఁడిచ్చును మహిమలిలను
కనుమన గలవు పందెముల్ ఘనముగాను!
*కళ్యాణ్ చక్రవర్తి, ముంబాయి*
🙏🎋🙏🎋🙏
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిచలిపులి జృంభించి జగతిని వణికింప
రిప్లయితొలగించండి. మార్తాండుడేగెనే మకరమునకు
నుత్తరాయణమది యుర్వినేలగ వచ్చె
. పుణ్యకాలంబని పుడమి జనులు
పితృదేవతలకిల విమలభక్తిని గల్గి
. తర్పణాలువదులు తరుణమిదియె
హరిలొరంగా యంచు హరినామ కీర్తనల్
. వినిపించు నూరూర వీధివీధి
పౌరుషమ్ము తోడ ప్రాణాలకు తెగించి పోరు జేయు కోడి పుంజు లెన్నొ
తెలుగు దనమొలికెడు పలువిధ వర్ణాలు
వెల్లివిరియు రంగ వల్లులెన్నొ.
.
రిప్లయితొలగించండిఆ.వె:భోగభాగ్యములను భూరిగా నిడనెంచి
ధనువు రాశి వీడి తరణి తాను
మకర మందు చేరి మనలను దీవించ
వేగ తరలి వచ్చె వేకువందె.
తే.గీ:జనవరి నెలలో ప్రతియింట జగతి యందు
ముదితలు కలాపి జల్లుచు ముగ్గులిడుచు
రంగవల్లికలందున రంగు నింపి
పరవశమ్మున గడిపెడి పర్వమిదియె.
తే.గీ:వాన కురియంగ చక్కగా వలజ యందు
నన్నదాతల కెల్లను హర్ష మొదవ
బంధుమిత్రుల రాకతో పర్వ శోభ
యినుమ డించుచుండెను గదా యింటి యందు
ఆ.వె:రమణిమణులు చేరి రామణీయకముగ
రంగవల్లుల నిడి రంగు నింపి
పిండివంటలెల్ల ప్రేమతో వండంగ
నావురావురంచు నారగింత్రు.
ఆ.వె: పండుగనుచు నేడు పక్వాన్నమును వండి
తినుచు నుందు రెల్ల దేశమందు
కొత్త వలువలుకొని కూరిమి తోదాల్చి
మురియు చుందురు ప్రజ పుడమి యందు
మత్తకోకిల
రిప్లయితొలగించండిక్రొత్తకాంతుల క్రాంతినొందగ గోపతే మకరంబునన్
చిత్తశుద్ధిని పెద్దలన్ శుచి జేకొనంగ స్మరించుచున్
ఉత్తమంబగు పూజలన్ గొని నుత్తరాయణ కాలమున్
విత్తమెంతయు జేరగా నిలు భృత్యులందరు గూడగన్
క్రొత్తధాన్యము క్రొత్తబట్టలు కోరినంతగ నిచ్చుచున్
క్రొత్తబియ్యము క్రొత్తబెల్లపు కోరులన్ జెలివండగా
చిత్తమారగ క్రొత్తముగ్గులు చేడియల్ దగగూర్చగా
క్రొత్తయానము బంధుమిత్రుల కూర్పుతో యరుదెంచెడిన్
భోగిపండుగ
తొలగించండిచెత్తనంతను భోగిమంటల జిందులేయుచు గాల్చుచున్
గుత్తగుంపుగ నాడపిల్లలు గొబ్బిపాటలు పాడగా
చిత్తమందున గోదదేవిని జిత్తజుండగు పెన్మిటిన్
తత్తరంబుగ గోరుచున్ దగు తన్మయత్వము నొందగా
క్రొత్తయల్లుడు మేలమాడెను కొప్పునంటుచు ప్రేమగా
..............🌻శంకరాభరణం🌻...............
రిప్లయితొలగించండి..................🤷🏻♂సమస్య 🤷♀....................
'సకారం' లేకుండా సంక్రాంతి గురించి
స్వేచ్ఛాఛందంలో పద్యం.
సందర్భము: శ్రీరాముడు వేదాధ్యయనం చేశాడు. కేవలం కంఠస్థం చేయడమే కాదు. తగినంత విడమరచి చెప్పే సామర్థ్యమూ వుంది. ఒక సూర్య సూక్తాని కర్థం చెప్ప మని సంక్రాంతి నాడు పౌరు లడిగితే చెప్పగా వా రాశ్చర్యపోయారు.
లక్ష్మణుడు "ఆయన వేదం చదువు కున్నాడు. వింత ఏమున్న?" దన్నాడు. పౌరు "లౌ నౌ" నన్నారు.
రాముడు వేదాధ్యయనం చేసినా డనడానికి ఆధారాలు.. నారదుని మాటల్లో...
వేదవేదాంగ తత్త్వజ్ఞో
ధనుర్వేదే చ నిష్ఠితః.. బా.కాం.1- 14
(వేదాలు నాలుగు..వేదాంగాలు.. అంటే శిక్షా వ్యాకరణ ఛందో జ్యోతిష నిరుక్త కల్పములు ఎఱిగిన వాడు, ధనుర్వేదంలో నిష్ణాతుడు)
సర్వ శాస్త్రార్థ తత్త్వజ్ఞః..
స్మృతిమాన్ ప్రతిభానవాన్1-15
(అన్ని శాస్త్రాలూ చదువడమే గాక అర్థం కూలంకషంగా తెలిసినవాడు, తెలిసిన వానిని మరువనివాడు, ప్రతిభాశాలి)
నల్గురు సోదరులూ వేదం చదువుకున్నా రనడానికి ..
వైదికాధ్యయనే రతాః.. బా.కాం 18-35
మకరాన నినుడు జొచ్చిన నాడు = మకరరాశిలో సూర్యుడు ప్రవేశించిన నాడు సంక్రాంతి నాడు
రవి గూర్చి వేదాన రమ్యఫణితి చెప్పబడినట్టి మంత్రాలు = బుగ్వేదంలోని సూర్య సూక్తాలు
~~~~~~~~~~~~~~~~~~~~~~~
"మేల్కొని లోకమున్ మేల్కొల్పి మిత్రావ
రుణు లన్న కనుదోయి నణచు నిరులఁ..
గంధియే ఘన పతాకము భంగి నింగిలో
నన్ నిల్వ జగతిని నడుపుచుండుఁ
దన ఋజు మార్గానఁ దా నెప్పుడుఁ జరించుఁ..
గొడుకులన్ మనుమలన్ గూర్చి మించు.."
ననుచును మకరాన నినుడు జొచ్చిన నాడు
"రవిఁ గూర్చి వేదాన రమ్య ఫణితిఁ
జెప్పబడినట్టి మంత్రాల విప్పి చెప్పు
చుండె రాముం డహో!" యనఁ జూచి లక్ష్మ
ణుండు "వేదంబుఁ జదివె రాముం డెఱుగరె!..
వింత యే" మన "నౌ" నని రంత నచట..
✍️~డా.వెలుదండ సత్యనారాయణ
పరమార్థ కవి
15.01.20
-----------------------------------------------------------