సందర్భము: సర్వప్రియకర స్తస్య రామస్యాపి శరీరతః లక్ష్మణో లక్ష్మి సంపన్నో బహిః ప్రాణ ఇవాపరః బా.కాం. 18-28,29 లక్ష్మణుడు రామునికి త్రికరణాలతో తన శరీరానికన్న మిన్నగా ప్రియం చేసేవాడు. రామునికి (శరీరానికి) బయట వున్న (ఆరవ) ప్రాణమా అన్నట్టు వుండేవాడు. దండకారణ్యంలో మునుల తపస్సులకు భంగం కలిగించే రాక్షసుల నందిరినీ నిర్మూలిస్తా నని హామీ ఇచ్చినాడు రాముడు. రామాశ్రయమే (రాముని వెన్నంటి వుండడమే) తన భాగ్య మని భావించే లక్ష్మణు డప్పు డిలా అనుకున్నా డని సందర్భం.
ప్రాకట ధర్మ నిష్ఠ... రాముని పరంగా.... ప్రాకటమైన ధర్మ నిష్ఠతో రాముడు పూనుకొన్నా డని ఒక అర్థం. మునుల పరంగా.... ప్రాకటమైన ధర్మ నిష్ఠ గల మునుల రక్షణకై రాముడు పూనుకొన్నా డని మరో అర్థం.
నిత్య అకలుష ఆత్ముడు = ఎల్లప్పుడూ పుణ్యాత్ముడు.. నిత్య పరిశుద్ధుడు ~~~~~~~~~~~~~~~~~~~~~~~
*సుమిత్రా సుపుత్రుడు*
ప్రాకట ధర్మ నిష్ఠ ముని రక్షణ కంకణ బద్ధు డాయె ని త్యాకలుషాత్ముడైన తన యన్న రఘూద్వహు, డట్టివాని ప్రా పే కద నైజ భాగ్య మని యెంచి సుమిత్ర సుపుత్రు డి ట్లనెన్ "నా కిది యాదివార మయి నన్ సెలవే లభియింప దెందుకో!"
✍️~డా.వెలుదండ సత్యనారాయణ పరమార్థ కవి 5.01.20 -----------------------------------------------------------
చక్కెర పొంగలి సరదాల దాగుచు దవడ నొప్పినిడు పద్యాలు కొన్ని కొట్ట శతకమును పట్టి సమస్యను దండను ఝులుపు పద్యాలు కొన్ని చాంతాడు వివరణ చాటున మణులను త్రవ్విదీయమను పద్యాలు కొన్ని నానార్థముల ద్రవ్వి నలుగురి కెడమగు దారిలో నులిపి పద్యాలు కొన్ని
సందర్భము: భరత స్యాపి శత్రుఘ్నో లక్ష్మణావరజో హి సః ప్రాణైః ప్రియతరో నిత్యం తస్య చాసీత్ తథా ప్రియః బా.కాం. 18-31 శత్రుఘ్నుడు (లక్ష్మణుని సహోదరుడే కాబట్టి) భరతునకు ప్రాణాలకన్న ప్రియమైన వాడై యుండేవాడు. భరతుడూ అతని పట్ల అలాగే వుండేవాడు. (అన్నను అనుసరించే గుణం లక్ష్మణునిలో లాగే శత్రుఘ్నునిలోనూ వుంది.) ఏకస్మిన్ ఏకస్మిన్ ప్రత్యేకం.. సూర్యులు పన్నెండుగురు. (నెల కొకరు మారుతూ వుంటారు.) అందరినీ విడివిడిగా పూజించడమూ వుంది. ద్వాదశాదిత్యులు.. ధాత, అర్యముడు, మిత్రుడు, వ(అ)రుణుడు, ఇంద్రుడు, వివస్వంతుడు, పూష , పర్జన్యుడు, అంశుమంతుడు, భగుడు, త్వష్ట , విష్ణువు
శత్రుఘ్ను డన్నాడు.... "నాకూ ఆదివారం సెలవే! భరతుడు ఆరోజు ప్రత్యేకంగా చాలాసేపు (వంశకర్తయైన) సూర్య భగవానుణ్ణి (పూజాగదిలో) ఆరాధిస్తూ వుంటాడు. నేను చేసే దేమీ లేదు. కాని ఈరో జేమో ఎక్కడికో వెళుతా డని విన్నాను. (ఎక్కడికో ఎందుకో తెలీదు. ఇంకా నావరకు రాలేదు.) నేను మాత్రం వెంట వెళ్ళవలసివుంది. (చిన్నప్పటినుంచి భరతుణ్ణి అనుసరించటం నా కలవాటు కాబట్టి.)" ఆదివారం సెలవుండేది ఇదివరకు.. ఇప్పుడు మాత్రం (ప్రత్యేక పరిస్థితిలో) లేదు.. అని భావం.. కడక= పూనిక, యత్నం ~~~~~~~~~~~~~~~~~~~~~~~
*సూర్యారాధనము*
నాకును నాదివార మని నన్ సెలవే! భరతుండు పూజ ప్ర త్యేకముఁ జేసెడిన్ రవికి.. నే నొనరింపగ నేమి లేదు.. నే డో.. కడకన్ గమించు నెట కో.. యని వింటిని.. వెంటఁ బోవలెన్.. నా కిది యాదివార మయి నన్ సెలవే లభియింప.. దెందుకో!"
✍️~డా.వెలుదండ సత్యనారాయణ పరమార్థ కవి 5.01.20 -----------------------------------------------------------
రిప్లయితొలగించండినడిరేయి సరదా పూరణ:
స్వీయ చరిత్ర:
వాకబు జేయుచున్ చదివి వార్తల పత్రికలందు హాయిగా
కాకుల కూతలన్ వలెను కష్టము నెంచక కావుకావుమన్
జోకుగ జేయ పూరణలు షోకులు మీరగ రాత్రిరాత్రినిన్
నాకిది యాదివార మయినన్ సెలవే లభియింప దెందుకో😊
మీ సరదా పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి
రిప్లయితొలగించండిఆటవిడుపు సరదా పూరణ:
(జిలేబి గారికి అంకితం)
కంది వారి మనోగతం:
తేకువ మీరగా వలచి తీయని పద్యపు పోషణమ్మునన్
సాకులు చెప్పకే పగటి సందడి లోనను రాత్రినందునన్
వేకువ జామునన్ వెదకి వేలను గూర్చగ కైపదమ్ములన్
నాకిది యాదివార మయినన్ సెలవే లభియింప దెందుకో!
మీ ఆటవిడుపు పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిఒక గృహిణి యావేదన
రిప్లయితొలగించండితాకటుబెట్టి జీవితము తాళినిదాల్చగ కంఠమందునన్
చీకటితోడ నిద్దురకు చెప్పుచు నామతి మగ్నమవ్వగా
నాకలి దీర్చెడున్ బనుల యాదికిరాదుగ వారమేదియో
నాకిది యాదివార మయినన్ సెలవే లభియింపదెందుకో
ఆమతి=వీడుకోలు యాదికి=గుర్తుకు
తొలగించండిపిజ్జాలూ, బిరియానీ, ఇంటికి పంపే స్విగ్గీలూ. జొమాటోలూ ఉన్నాయి కదా
😊
ఆవిడ పాతతరం గృహిణిలే!!
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిఅందరికీ నమస్సుమాంజలి 🙏🙏
రిప్లయితొలగించండినా సరదా పూరణ 🙏 తప్పులున్న మన్నించ ప్రార్ధన 🙏🙏
*ఉ:*
వేకువ జామునే పరుగు వేగము గానిట తీయుచున్ హరా
పాకుచు డేకుచున్ వెళుచు పట్టుకు ట్రైనులు బస్సులున్ యహో
చాకిరి చేయుచున్ యచట చావగ వారము నంతయున్, యెలా
*నాకిది యాదివార మయినన్ సెలవే లభియింప దెందుకో*
*కళ్యాణ్ చక్రవర్తి, ముంబాయి*
🙏🌹🙏🌹🙏
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి'వెళుచు' అనడం వ్యావహారికం. అక్కడ "చనుచు" అనండి. 'బస్సులున్ + అహో, చేయుచున్ + అచట, అంతయున్ + ఎలా' అన్నపుడు యడాగమం రాదు. "బస్సు లయ్యయో...చేయు చక్కడనె... నంత యెట్టులో..." అనండి.
సరదా ప్రయత్నం గురువర్యా
రిప్లయితొలగించండి🙏🙏😞
*ఉ::*
లేకను నిద్రయే నిజము లేటుగ జేరగ నింటికిన్ యహో
ఆకలి తీరగా తినుచు యాగితి జూచుచు బ్లాగునే నిలన్
ఏకముగానిటన్ మనకు యెన్నియు పూరణ లిచ్చినన్ హరా
*నాకిది యాదివార మయినన్ సెలవే లభియింప దెందుకో*
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి"..నింటి కే యహో...తినుచు నాగితి... మనకు నెన్నియు.." అనండి.
శ్రీకరమైన సూచనలు,సిద్ధముసేయగనొప్పరెవ్వరున్
రిప్లయితొలగించండినీకిదియాదివారమని ,నీతులుజెప్పకుమన్నభార్యతో
దూకుడుదూకుపిల్లలను, దువ్వగ జూచెడుతండ్రికెప్పుడున్
నాకదియాదివారమయినన్,సెలవేలభియింపదెందుకో?
++++++++++++++++++++++++++++===+
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిసోకులనద్దుమాకనుచు,సొంతగుసంతుయె గోలసేయగా
రిప్లయితొలగించండిభీకరమైనపోకడలు,,భీతిలజేయునటంచుజెప్పగా
పోకిరిబుద్ధినీదనుచు పొందుకురాననిజెప్పుభార్యతో
నాకిదియాదివారమయినన్,సెలవేలభియింపదెందుకో?
++++++++++++++++++++++
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిభార్యనుండి ప్రేమ బడయు వారమునందు
రిప్లయితొలగించండినాదివారమె ; సెలవందదేల
మిగత దినములందు మేలు కలుగునట్లు
తెలియ జెప్పుమయ్య తెలుగువాడ
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండివేకువజామునే పిలువ ,వెచ్చని నెచ్చెలి రాదదెందుకో?
రిప్లయితొలగించండిఆకలితీరగానగును,ఆకృతి జూసినలాభమేమగున్
రేకలు విచ్చు పూవువలె,రేతిరి వచ్చెదనంచుజెప్పెనే
నాకదియాదివారమయినన్,సెలవేలభియింపదెందుకో?
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిDhanyavaadaalu guruvaryaa
తొలగించండిఅందరికీ వందనములు !
రిప్లయితొలగించండిఅందరి పూరణలూ అలరించు చున్నవి !
అలరించ నున్నవి !
A-1)
ఒక గృహిణి మరొక గృహిణితో :
__________________________
ఆకలి కడుపునకు - నాహారమును జేయ
వార వర్జ్యములకు - దారి లేదు
గుఱ్ఱ మెట్టి దైన - గుగ్గిళ్ళు వలయుగా
ఆదివారమె సెల - వందదేల
__________________________
వసంత కిశోర్ (కవులూరు రమేష్)
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిA-2)
రిప్లయితొలగించండిశంకరాభరణ సభ్యులు ఒకరితో ఒకరు :
__________________________
ఆది వార మందు - నత్యంత కఠినమౌ
వృత్తముల నిచటను - వ్రాయ వలయు
శంకరాభరణపు - సాధనమును జేయ
ఆదివారమె సెల - వందదేల
__________________________
సాధనము = సాధించుట
వసంత కిశోర్ (కవులూరు రమేష్)
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిసవరణతో :
తొలగించండిA-2)
శంకరాభరణ సభ్యులు ఒకరితో ఒకరు :
__________________________
ఆది వార మందు - నత్యంత కఠినమౌ
పద్యములను పెక్కు - వ్రాయ వలయు
శంకరాభరణపు - సాధనమును జేయ
ఆదివారమె సెల - వందదేల
__________________________
సాధనము = సాధించుట
వసంత కిశోర్ (కవులూరు రమేష్)
రిప్లయితొలగించండిసూర్యావారి మనోరథము
తిరుగు చుంటిని ప్రతి దినము గగనమున
నాంగ్ల భాషలోన నాదు పేరు
బెట్టిరి దినమునకు! భేషుసెలవనిరి!
ఆదివారమె సెలవందదేల?
జిలేబి
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిA-3)
రిప్లయితొలగించండిఒక కూలీ మరొకనితో :
__________________________
ఆటవిడుపె యనుచు - నాదివారము నాడు
పనిని మాని వేయ, - పస్తె మిగులు !
భార్య పిల్లలకు ను - పాసము దప్పింప
ఆదివారమె సెల - వందదేల
__________________________
ఉపాసము = ఉపవాసము
వసంత కిశోర్ (కవులూరు రమేష్)
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిA-4)
రిప్లయితొలగించండిసర్వమున్ బని జేయు :
__________________________
మానవునకు దప్ప - మరి యెవ్వరికి లేదు
యాదివారమునకు - నాటవిడుపు
సకల సృష్టి లోన - సర్వమున్ బని జేయు
ఆదివారమె సెల - వందదేల
__________________________
వసంత కిశోర్ (కవులూరు రమేష్)
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి
రిప్లయితొలగించండితేకువ తో ఖజాకమున తీరుగ వెల్గును చేర్చినాడ నే
వేకువ జాముగా మొదలు వేడిని వారికి చేర్చినాడ చే
నాకుగ ! నాదు పేరిడి జనాళి దినమ్ము విరామమందురే
నాకిది యాదివార మయినన్ సెలవే లభియింప దెందుకో!
సూర్యారావుగారి సణుగుడు
జిలేబి
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండినిన్నటి పూరణ
రిప్లయితొలగించండికోతయె జీవనమ్మున నొకొక్క క్షణమ్ము గతించు కాలమై
చేతునటంచుఁ దల్చినవి జేసితొ!, యే ఘనకార్యకర్తవై
ఖ్యాతి వహించితో?, యరయ నార్జితమెంతొ? విమర్శవేళలో
నూతన వత్సరమ్మున వినూత్న వినోద విహార మెందుకో
కంజర్ల రామాచార్య.
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండిA-5)
రిప్లయితొలగించండిఒక విద్యార్థిని మరొకరితో :
__________________________
పాడు పంతులయ్య - ప్రత్యేక పాఠము
లాదివార మందు - బోధచేయు
చలన చిత్రమునకు - సాగుద మనుకొంటి
ఆదివారమె సెల - వందదేల
__________________________
వసంత కిశోర్ (కవులూరు రమేష్)
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండివంట పనుల యందు వడలిన భార్యకు
రిప్లయితొలగించండిఆదివార మె సెల:వంద దేల
భర్త తోడు నిలిచి వలసిన సాయము
జేయు గనుక తాను చెంత జేరి
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిఅందరికీ వందనములు !
రిప్లయితొలగించండిఅందరి పూరణలూ అలరించు చున్నవి !
అలరించ నున్నవి !
B-1)
ఒక విద్యార్థి :
__________________________
పోకిరి చిత్రమున్ గనగ - బోవుచు నుండిరి స్నేహబృందమే
నాకిది యాదివార మయి - నన్ సెలవే లభియింప దెందుకో
కూకటి పీకగా వలయు - గుత్తముగా నుపదేశి కీ యెడ
న్నేకము నాదివార మని - యెంచక నెక్కుడు బోధ చేయుటన్ !
__________________________
వసంత కిశోర్ (కవులూరు రమేష్)
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండినాకులకాంత యొక్కెడను నాథ! వినుండని పల్కె నీగతిన్
రిప్లయితొలగించండిమీకును బిల్లవాండ్రకు నమేయముదాకరమన్నిరీతులన్
జేకొన విశ్రమం బిటను జెప్ప దరంబె త్వదీయసేవచే
నాకిది యాదివార మయినన్ సెలవే లభియింప దెందుకో"
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండిసెలవటంచు నింట చెల్వుడుఁ బిల్లలు
రిప్లయితొలగించండిబద్దకమ్ము తోడ పడక దిగక
పలు రుచులను గోర వండిపెట్టెడు తల్లి
కాదివారమె సెలవందదేల?
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండితెల్లవారకుండ దినమున కొక్క స
రిప్లయితొలగించండిమస్య నిచ్చు పనిని మాననైతి
నెండ వానలు రుజ లెట్లు బాధించిన
నాదివారము సెల వందదేల?
నిక్కము వక్కాణించితిరి శంకరయ్యగారూ! శుభాభినందనలు!
తొలగించండిక్రొవ్విడి వేంకట రాజారావు:
రిప్లయితొలగించండిప్రతి దినమ్ము పనిని పాటించ కుండుచో
సతిని పిల్లల నెటు సాక గలను?
కూడు కొఱకు విరతి గూడని యప్పుడు
ఆదివారమె సెలవందదేల?
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి(సుందరి తన భర్త సుందరమూర్తికి , బిడ్డలకి చేసే నిర్విరామసేవ తలచుకొని..)
రిప్లయితొలగించండివేకువనందె మేల్కొనెద ;
బిల్లల నింటిని దిద్దితీర్తునే !
యాకలి దీర్పగన్ టిఫెను
లందరినోళ్లకు నందజేతునే !
సోకుగ కాలెజీ కరుగు
సుందరమూర్తి కమర్చి పంపుదున్ !
నాకిది యాదివారమయి
నన్ సెలవే లభియింప దెందుకో ??
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండికూలి కొరకు వస్తి కూటికి లేకను
రిప్లయితొలగించండివెట్టి చాకిరయ్యె మట్టి బ్రతుకు
అసలు శాంతి లేదు అవమానమె మిగిలె
ఆదివారము సెలవందదేల
వారమంతచదివ వదలడు సెల్ఫోను
రిప్లయితొలగించండిశంకరార్యుకెంత శక్తిగలదు
పూరణమ్ములన్ని పూర్తిగ చదువును
ఆదివారమెసెలవందదేల
+++++++++++***********
రావెలపురుషోత్తమరావు
రిప్లయితొలగించండికంది వారి మనోరధము నారదాయనమః
చాకిరి చేయు చుంటిగద ఛందపు పూరణ లన్గనండి రం
డీ! కవనమ్మిదేయనుచు డెక్కల చప్పుడు చేసి బిల్వసు
మ్మీ కవి వర్యులెల్లరు సమీక్షల చేయమటంచు పొద్దుటే
నాకిది యాదివార మయినన్ సెలవే లభియింప దెందుకో!
జిలేబి
గృహిణి కేడ సెలవు? గృహమేగ చెరసాల !
రిప్లయితొలగించండివార, వర్జ్యమయిన వంక లేక |
వండి వార్చు, సుంత వ్యవధి యెరుగదయో|
ఆదివారమె సెలవందదేల?
' భాను వార 'మిదియ ప్రవిమల మగురోజు
రిప్లయితొలగించండిగ్రహ విరాజమాన కాంతి రోజు
కాల గమన వేగ ఘట్టనమేమొకో
ఆదివారమె సెలవందదేల!
చీకటి చెత్తకుప్ప రవి చిమ్మక పూర్వమె వెల్గు చీపురై
రిప్లయితొలగించండిఆకలిదీర్ప పొయ్యియగు నద్భుత యంత్రము తానెనన్నిటై
చాకిరి జేయ తీరికకు సందును చిక్కక దల్చు కుందుచున్
"నాకిది యాదివార మయినన్ సెలవే లభియింపదెందుకో"
అలుపు లేక సూర్యు డలరించు జగతిని
రిప్లయితొలగించండిచంద్రుడిచ్చు కాంతి జాగు లేక
పరుల సేవ జేయు పావను లడుగరు
ఆదివారమె సెలవందదేల?
మైలవరపు వారి పూరణ
రిప్లయితొలగించండిఆవిడా! మా ఆవిడే!
వేకువజాము లేచు, తన పిల్లల బట్టలఁ దెచ్చి గుట్టగా
చాకలివోలె శుభ్రపరచన్ మది గోరు.,మహానసమ్ములో
పాకము జేయబోవు! చెయిఁబట్టి తటాలున దూర్చ దుప్పటిన్
నాకిది యాదివారమ., యినన్ సెలవే !! లభియింప దెందుకో?
మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి.
చీకటిపాఱదోలి జన జీవన మెల్లయు గాంతి నింపగా
రిప్లయితొలగించండిలోకులు నన్ను గొల్చుచు విలోకన చేయుచు లోకనాథుడా
నీకది భానువారమని నీమము జేసిరిపో హతోస్మి హాఁ
నాకిది యాదివార మయినన్ సెలవే లభియింప దెందుకో
ఆది నుండి నీకి దలవాటుగా మారె
రిప్లయితొలగించండికాదనంగ లేక గట్టి గాను
జేదమంటివి గద జెప్పెద వేలిటు
"లాదివారమె సెలవందదేల"
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండివారమునకు నొక్క వాసర మీవలె
తొలగించండినెవ్వ రేని సెలవు నొవ్వు చుండి
చేయుచుంటిఁ జేయఁ జేయఁ గడచి పోయె
నాది! వారమె సెల వంద దేల?
చీఁకటి క్రమ్మి నంతటనె శీఘ్రమ నిద్దుర వోవు నంగముల్
వీఁకను గొంతు నిండఁగను వెఱ్ఱిగఁ గ్రుక్కుచు మెక్క వింత గా
నీ కడు పిట్టు లెప్పుడు సహించుచు నీండ్రము లుండ న్యాయమే
నా కిది యాదివార మయినన్ సెలవే లభియింప దెందుకో
విసుగు జెంకుండ విశ్రాంతి యేలేక
రిప్లయితొలగించండియూడి గమ్ము జేసి యుస్సురనుచు
భార్య నిష్టురముగ భర్తతో నిట్లనె
"ఆదివారమె సెలవందదేల ?"
పాలకుండు జెప్పె పగలు రేయనకను
రిప్లయితొలగించండిబేరమాడుకొండి బేగిరమున
వారమేమిలేక వారాంతమైనట్టి
ఆదివారమె సెలవందదేల!!
చండశాసనుండు జగమొండిమాబాసు
రిప్లయితొలగించండిపవలురేయియనక పనులఁజెప్పు
ఇంటిపనులుజేయనిల్లాలు పోరును
ఆదివారమె సెలవందదేల
గురుదేవులు శ్రీకందిశంకరయ్య గారి మానసం...
రిప్లయితొలగించండిఉత్పలమాల
వేకువ లేచి ముఖ్యమగు వేదిక నెక్కఁగ నేడు పోవలెన్
జేకురి నట్టి పండితులఁ జేయుడు బద్యసమీక్షలంచనన్
దాకరు రాతిరైన నికఁ దప్పదు బ్లాగున వాట్సపాదిగన్
నాకిది! యాదివార మయినన్ సెలవే లభియింప దెందుకో?
వేకువ జాము నుండి మరి పిల్లలు రాతిరి పవ్వళించునన్
రిప్లయితొలగించండిదాక నిదే ప్రయాసమిక దాచునదేమి చెలీ, యిదే గదా
లోకపు రీతి దప్ప దిటులుండగ బాధ్యతలన్ని భారమై
నాకిది యాదివార మయినన్ సెలవే లభియింప దెందుకో
నాకలలన్నికల్లలయె నాగతి యేమని విన్నవించెదన్
రిప్లయితొలగించండిలోకమునందునెల్లరకు రోజయినన్ లభియించు శ్రాంతియే
నాకిది యాదివార మయినన్ సెలవే లభియింప దెందుకో
యాకలి దప్పులంగననియన్యులకొల్వది బానిసత్వమే
..............🌻శంకరాభరణం🌻...............
రిప్లయితొలగించండి..................🤷🏻♂సమస్య 🤷♀....................
"నా కిది యాదివార మయినన్ సెలవే
లభియింప దెందుకో"
సందర్భము:
సర్వప్రియకర స్తస్య రామస్యాపి శరీరతః
లక్ష్మణో లక్ష్మి సంపన్నో బహిః ప్రాణ ఇవాపరః
బా.కాం. 18-28,29
లక్ష్మణుడు రామునికి త్రికరణాలతో తన శరీరానికన్న మిన్నగా ప్రియం చేసేవాడు. రామునికి (శరీరానికి) బయట వున్న (ఆరవ) ప్రాణమా అన్నట్టు వుండేవాడు.
దండకారణ్యంలో మునుల తపస్సులకు భంగం కలిగించే రాక్షసుల నందిరినీ నిర్మూలిస్తా నని హామీ ఇచ్చినాడు రాముడు. రామాశ్రయమే (రాముని వెన్నంటి వుండడమే) తన భాగ్య మని భావించే లక్ష్మణు డప్పు డిలా అనుకున్నా డని సందర్భం.
ప్రాకట ధర్మ నిష్ఠ...
రాముని పరంగా....
ప్రాకటమైన ధర్మ నిష్ఠతో రాముడు పూనుకొన్నా డని ఒక అర్థం.
మునుల పరంగా....
ప్రాకటమైన ధర్మ నిష్ఠ గల మునుల రక్షణకై రాముడు పూనుకొన్నా డని మరో అర్థం.
నిత్య అకలుష ఆత్ముడు = ఎల్లప్పుడూ పుణ్యాత్ముడు.. నిత్య పరిశుద్ధుడు
~~~~~~~~~~~~~~~~~~~~~~~
*సుమిత్రా సుపుత్రుడు*
ప్రాకట ధర్మ నిష్ఠ ముని
రక్షణ కంకణ బద్ధు డాయె ని
త్యాకలుషాత్ముడైన తన
యన్న రఘూద్వహు, డట్టివాని ప్రా
పే కద నైజ భాగ్య మని
యెంచి సుమిత్ర సుపుత్రు డి ట్లనెన్
"నా కిది యాదివార మయి
నన్ సెలవే లభియింప దెందుకో!"
✍️~డా.వెలుదండ సత్యనారాయణ
పరమార్థ కవి
5.01.20
-----------------------------------------------------------
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిసీస పద్యంలో పూరణ:
రిప్లయితొలగించండివిన్నపం:మనసులో తోచింది వ్రాశా
తప్పనిపిస్తే మన్నించండి.
చక్కెర పొంగలి సరదాల దాగుచు
దవడ నొప్పినిడు పద్యాలు కొన్ని
కొట్ట శతకమును పట్టి సమస్యను
దండను ఝులుపు పద్యాలు కొన్ని
చాంతాడు వివరణ చాటున మణులను
త్రవ్విదీయమను పద్యాలు కొన్ని
నానార్థముల ద్రవ్వి నలుగురి కెడమగు
దారిలో నులిపి పద్యాలు కొన్ని
శంకరాభరణము సార్థకమయ్యెగా
పూరణముల నిడివి,బుసల; కాని
కంది వార లమృత మందుచు యననేల
"ఆదివారమె సెలవందదేల?"
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిరోకటి పోటులోర్ఛుకొని రుబ్బెడు రాయిగ, గానుగట్లు, యం
రిప్లయితొలగించండిత్రాకృతిఁ దాల్చుచున్ క్షణవిరామమెఱుంగక యింటి వారికై
చాకిరిఁ జేయుచున్ పతికి సంతతికిన్ సెలవుండి యచ్చటుల్
నాకిది యాదివార మయినన్ సెలవే లభియింప దెందుకో.
ఆటవెలది
రిప్లయితొలగించండిపుట్టినది మొదలుగ ముదమార జీర్ణించఁ
గుడిచి నట్టి దెల్లఁ గుక్షినౌచు
మానమనిన విడని మాంసంపు భారాన
నాది వారమె సెలవందదేల?
ఆదివారమెసెలవందదేలననగ
రిప్లయితొలగించండిసెలవునీయయాగుశీఘ్రముగను
జేయవలసిననిక వ్రాయవలసినవి
యందువలననెసెలవందదార్య!
నాకిదియాదివారమయినన్ సెలవేలభియింపదెందుకో
రిప్లయితొలగించండిమీకదిశాపమోయరయమీరనిభక్తియొచింతజేయుమా
చాకిరిజేయుచుందువుగసంధ్యనుజూచెడువేళయంతకున్
దేకువతోడనీమనసుతీరునుమార్చుములభ్ధిపొందగన్
రిప్లయితొలగించండిపాలుగారునట్టి వయసునందు బడికి
పంపి బరువు మోపి బాధలిడుచు
చదువుకొమ్మటం
చు చననీరు బయటకు
నాదివారమెసెలవంద దేల.
మరొక పూరణ
వాకిలి ముందు చిమ్ముచును వాడుక మేరకు నెల్లకార్యముల్
యేకబిగిన్నిటన్ సతతమిష్టము తోడను చేయుచుంటినే
కోకను పైకికట్టుకొని కూర్చుచు వేళకు నెల్ల వారికిన్
*నాకిది యాదివార మయినన్ సెలవే లభియింప దెందుకో"*
ప్రతిదినమ్ము పనులు హితముగా జేయుచు
రిప్లయితొలగించండివంటగదిని మగ్గుచుంటి నేను
పద్య కైత వ్రాయ హృద్యమ్ముగా నొక్క
ఆదివారమె సెలవందదేల?!!!
వేకువరాకమున్నె నువు వెన్నెల వెల్గుల దీపకాంతివే
రిప్లయితొలగించండిసోకులనద్ది ముంగిటను సోయగమొప్పెడు రంగవల్లివై
నాకనులందునిల్చుచును,నవ్వుల పువ్వులు పూయగానికన్
నాకిది యాదివారమయినన్,సెలవేలభియింపదెందుకో!
..............🌻శంకరాభరణం🌻...............
రిప్లయితొలగించండి..................🤷🏻♂సమస్య 🤷♀....................
"నాకిది యాదివార మయినన్ సెలవే
లభియింప దెందుకో"
సందర్భము:
భరత స్యాపి శత్రుఘ్నో
లక్ష్మణావరజో హి సః
ప్రాణైః ప్రియతరో నిత్యం
తస్య చాసీత్ తథా ప్రియః
బా.కాం. 18-31
శత్రుఘ్నుడు (లక్ష్మణుని సహోదరుడే కాబట్టి) భరతునకు ప్రాణాలకన్న ప్రియమైన వాడై యుండేవాడు. భరతుడూ అతని పట్ల అలాగే వుండేవాడు. (అన్నను అనుసరించే గుణం లక్ష్మణునిలో లాగే శత్రుఘ్నునిలోనూ వుంది.)
ఏకస్మిన్ ఏకస్మిన్ ప్రత్యేకం.. సూర్యులు పన్నెండుగురు. (నెల కొకరు మారుతూ వుంటారు.) అందరినీ విడివిడిగా పూజించడమూ వుంది.
ద్వాదశాదిత్యులు.. ధాత, అర్యముడు, మిత్రుడు, వ(అ)రుణుడు, ఇంద్రుడు, వివస్వంతుడు, పూష , పర్జన్యుడు, అంశుమంతుడు, భగుడు, త్వష్ట , విష్ణువు
శత్రుఘ్ను డన్నాడు....
"నాకూ ఆదివారం సెలవే! భరతుడు ఆరోజు ప్రత్యేకంగా చాలాసేపు (వంశకర్తయైన) సూర్య భగవానుణ్ణి (పూజాగదిలో) ఆరాధిస్తూ వుంటాడు. నేను చేసే దేమీ లేదు.
కాని ఈరో జేమో ఎక్కడికో వెళుతా డని విన్నాను. (ఎక్కడికో ఎందుకో తెలీదు. ఇంకా నావరకు రాలేదు.) నేను మాత్రం వెంట వెళ్ళవలసివుంది. (చిన్నప్పటినుంచి భరతుణ్ణి అనుసరించటం నా కలవాటు కాబట్టి.)"
ఆదివారం సెలవుండేది ఇదివరకు.. ఇప్పుడు మాత్రం (ప్రత్యేక పరిస్థితిలో) లేదు.. అని భావం..
కడక= పూనిక, యత్నం
~~~~~~~~~~~~~~~~~~~~~~~
*సూర్యారాధనము*
నాకును నాదివార మని
నన్ సెలవే! భరతుండు పూజ ప్ర
త్యేకముఁ జేసెడిన్ రవికి..
నే నొనరింపగ నేమి లేదు.. నే
డో.. కడకన్ గమించు నెట
కో.. యని వింటిని.. వెంటఁ బోవలెన్..
నా కిది యాదివార మయి
నన్ సెలవే లభియింప.. దెందుకో!"
✍️~డా.వెలుదండ సత్యనారాయణ
పరమార్థ కవి
5.01.20
-----------------------------------------------------------
మాకిది యాదివారమని మమ్మిక లేపుట మానుమంచునా
రిప్లయితొలగించండిపోకిరి పిల్లలన్ మగడు మూర్ఖత వీడక బద్దకించినన్
జాకిరి తప్పదయ్యె గద స్వస్థతతో పని లేదు లేదికన్
నాకిది యాదివార మయినన్ సెలవే లభియింప దెందుకో
ఉ:
రిప్లయితొలగించండిఆకస మందు నేను తిరుగాడుచు నుందుగ నిత్య నూత్నమై
నే కన రాకయున్న నిలనెంతయొ భీతిని నంగలార్చునో
వేకువ ఝాముగా మొదలు వెల్గుల బంచుచు గావగా బ్రజన్
నాకిది యాదివారమయినన్ సెలవే లభియింప దెందుకో
వై. చంద్రశేఖర్