7, జనవరి 2020, మంగళవారం

సమస్య - 3244(పరకాంతాసక్తుల...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"పరకాంతాసక్తుల కగు వరసంపత్తుల్"
(లేదా...)
"పరకాంతారతులైన వారలకు సంపత్సిద్ధి గాకుండునే"

68 కామెంట్‌లు:

  1. అందరికీ నమస్సుమాంజలి 🙏🙏

    *పరకాంతాసక్తుల కగు వరసంపత్తుల్*

    *కం||*

    సరిగా పలుకుట రాదా
    అరకొర జ్ఞానము వలదుగ యన్నిటి యందున్
    పరువును తీయకెటుల చూ
    *పర, కాంతాసక్తుల కగు వరసంపత్తుల్*

    *కళ్యాణ్ చక్రవర్తి, ముంబాయి*
    🙏🌹🙏🌹🙏

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. విరివిగ పల్కిన యెపుడును
      పరువును తీసెడు పలుకులు పదుగురి తోడన్
      మరియొక మారన కిట యే
      *పరకాంతాసక్తుల కగు వరసంపత్తుల్*?

      *కళ్యాణ్ చక్రవర్తి, ముంబాయి*
      🙏💐🙏💐🙏

      తొలగించండి
    2. అరెరే! మరచిర సీతను
      పరిణయమాడ తలచిన యవమ్మానమ్ముల్
      సరికాదిటుల పలుకగన్
      *పరకాంతాసక్తుల కగు వరసంపత్తుల్*

      🙏🌹🙏🌹🙏

      తొలగించండి

  2. నడిరేయి సరదా పూరణ:

    పరువుల్ పెట్టుచు నిడ్లి దోసెలనుభల్ వడ్డించి చట్నీలతో
    సరియౌ రీతిని ప్రాణనాథునిచటన్ సంతోషమున్ గొల్చుచున్
    వరలక్ష్మిన్ కడు చేసి పూజలనహో భాగ్యమ్ములన్ గోరుటన్
    "పరకాంతా"! రతులైన వారలకు సంపత్సిద్ధి గాకుండునే?

    రిప్లయితొలగించండి

  3. ఆటవిడుపు సరదా పూరణ:
    (జిలేబి గారికి అంకితం)

    కరుణామూర్తిగ ప్రీతినిన్ గొలిచెడిన్ కల్యాణియౌ దారయే
    పరమాత్మన్ వడి జేరగా;...కలతలే బాధించి సాధింపగా...
    త్వరగా సంపద కల్గినట్టి సుదతిన్ దాహమ్మునన్ కూడుచున్
    పరకాంతారతులైన వారలకు సంపత్సిద్ధి గాకుండునే 😊

    రిప్లయితొలగించండి
  4. అందరికీ వందనములు !
    అందరి పూరణలూ అలరించు చున్నవి !
    అలరించ నున్నవి !

    A-1)
    అపరకాంతాసక్తుల కగు :
    __________________________

    వర గర్వితుడగు రావణు
    శిరమును ఖండించ లేదె - శ్రీరాముడనిన్
    స్థిరమది యెన్నటి కైన; న
    పరకాంతాసక్తుల కగు - వరసంపత్తుల్ !
    __________________________
    పర = అన్యము, అపర = అన్యముకానిది = స్వ

    వసంత కిశోర్ (కవులూరు రమేష్)

    రిప్లయితొలగించండి
  5. A-2)
    అపరకాంతాసక్తుల కగు :
    __________________________

    అరరే దుశ్శాసనుడే
    వర వేదిజ జుట్టు లాగి - పడిపోయెనుగా
    నెఱియది గనగా; ప్రీతి, న
    పరకాంతాసక్తుల కగు - వరసంపత్తుల్ !
    __________________________
    పర = అన్యము, అపర = అన్యముకానిది = స్వ

    వసంత కిశోర్ (కవులూరు రమేష్)

    రిప్లయితొలగించండి
  6. A-3)
    అపరకాంతాసక్తుల కగు :
    __________________________

    పర వనితల చెఱపట్టిన
    నరకుడు కంసారి వలన - నాశన మయ్యెన్
    నరి నెరుగుచు మురిపెముగ, న
    పరకాంతాసక్తుల కగు - వరసంపత్తుల్ !
    __________________________
    పర = అన్యము, అపర = అన్యముకానిది = స్వ
    నరి = హద్దు

    వసంత కిశోర్ (కవులూరు రమేష్)

    రిప్లయితొలగించండి
  7. A-4)
    అపరకాంతాసక్తుల కగు :
    __________________________

    ఖరువున భస్మాసురుడే
    మరణించెను గాదె వలచి - మాయాంగననే !
    పరకాంతల వలదనుచు, న
    పరకాంతాసక్తుల కగు - వరసంపత్తుల్ !
    __________________________
    పర = అన్యము, అపర = అన్యముకానిది = స్వ

    వసంత కిశోర్ (కవులూరు రమేష్)

    రిప్లయితొలగించండి
  8. A-5)
    అపరకాంతాసక్తుల కగు :
    __________________________

    చురగా, నహల్య దమికొని
    పరిరంభము వలన గాదె - పాకారి చెడెన్
    సరికల మెడలో నుంచి, య
    పరకాంతాసక్తుల కగు - వరసంపత్తుల్ !
    __________________________
    పర = అన్యము, అపర = అన్యముకానిది = స్వ
    చుర = దొంగతనము

    వసంత కిశోర్ (కవులూరు రమేష్)

    రిప్లయితొలగించండి
  9. చెరసాలయె నొక విడిదిగ
    పరకాంతాసక్తుల కగు ; వరసంపత్తుల్
    దొరకు పరకాంత మాతగ
    పరిగణన సలిపి గరువపు భావము జూపన్

    రిప్లయితొలగించండి
  10. ( మండోదరి రావణునితో )
    వరదైవంబుగ మిమ్ము గొల్చెదను ; నా
    ప్రాణేశ !యాలింపుమా !
    పరకాంతారతులైన వారలకు సం
    పత్సిద్ధి గాకుండు ; నే
    చరణం బంటెద ; రుద్రవీణ వలనన్
    సంతుష్టు గౌరీశుచే
    వరముల్ బొందిన ధీర ! రామునకు నీ
    వైదేహి నర్పింపుమా !!
    ( రుద్రవీణ - రావణుని ప్రేగులే తంత్రులైన వీణ )

    రిప్లయితొలగించండి


  11. అరరే జారుల్లారా
    పరుగెత్తవలదు వడివడి పడతులకై! ఆ
    నరకమ్మే మరి తప్పక
    పరకాంతాసక్తుల కగు వరసంపత్తుల్!


    జిలేబి

    రిప్లయితొలగించండి


  12. అరెరే జారులు! మాట నాది వినుడీ! ఆ నైతలమ్మేయికన్
    పరుగెత్తంగ జిలేబు లంచు వెనుకన్ ప్రారబ్ధమైదోచునా
    పరకాంతారతులైన వారలకు; సంపత్సిద్ధి గాకుండునే
    పరమాత్మన్ తలు వంగ మీకు? వినుడీ పాటించుడీ విజ్ఞతన్!


    జిలేబి

    రిప్లయితొలగించండి


  13. పరుపున పరుండనొకతయె
    నరకమ్మగు జీవితము! వినండి దొరకు నా
    పరుపున వివిధ సుఖములే
    పరకాంతాసక్తుల కగు వరసంపత్తుల్!

    ఆపై చేరుమా ఆసుపత్రి :)


    జిలేబి

    రిప్లయితొలగించండి


  14. పరిశోధింపగ ముక్తి య
    పరకాంతయగు! దొరకదు గభాలున ! దొరకం
    గ రతి యుపరతి సహితమా
    పరకాంతాసక్తుల కగు వరసంపత్తుల్!


    జిలేబి

    రిప్లయితొలగించండి
  15. విరించి.

    *రావణునితో విభిషణుని మాటలుగా*


    నరకమె గమ్యస్థానము
    పరకాంతాసక్తుల కగు, వరసంపత్తుల్
    శరణము వేడుచు రాముని
    చరణము లను దాకఁ గలుగు సద్గుణ శ్రేష్ఠా!

    రిప్లయితొలగించండి
  16. వరగర్వంబున నొక్కరక్కసు డిటుల్ పాపాత్ముడై యంతటన్
    సురలం దూరుచు సంచరించుచు ననెన్ "శూరుండ నన్నిచ్చటన్
    సిరి తానై వరియించుచుండె కనరే ఛీ మీరు భీతాత్మకుల్,
    పరకాంతారతులైన వారలకు సంపత్సిద్ధి గాకుండునే"

    రిప్లయితొలగించండి
  17. రిప్లయిలు
    1. పరవిత్తమ్ములు దోచగన్ దురితముల్ ప్రాప్తించు, నింద్యమ్మునౌ
      పరకాంతారతి పాపహేతువగు, సంపన్నాశకార్యమ్ము,, దు
      ష్పరిణామమ్ములు దాపురించు, రుజముల్ బాధించురా!, భర్తృత
      త్పరకాంతారతులైన వారలకు సంపత్సిద్ధి గాకుండునే.

      తొలగించండి
  18. మైలవరపు వారి పూరణ

    ధర ధర్మార్జితమైన సంపదయె ప్రాప్తంబంచు భావించుచున్
    కరుణాస్వాంతులుగా చరించుచు జగత్కల్యాణమున్ గోరుచున్
    పరధర్మంబు భయావహంబనుచు భావంబందు చింతించుచున్
    పరకాంతారతులైన వారలకు సంపత్సిద్ధి గాకుండునే?!

    (పరకాంతా+అరతులైన)

    మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

    రిప్లయితొలగించండి
  19. *రావణుడు సీతతో*

    పరితాపమెందు కింకను
    తరుణి దనుజ జాతికిదియె ధర్మమ్మగునే
    దరిజేర రమ్ము వేగమె
    పరకాంతాసక్తుల కగు వరసంపత్తుల్

    రిప్లయితొలగించండి
  20. పరమునిహముకాంతలలో
    పరకాంతాసక్తుల కగు వరసంపత్తుల్
    పరమునుమరచుచుమనుజుడు
    నిరతమునిహసౌఖ్యములను నియతిగదలచున్

    రిప్లయితొలగించండి
  21. పర కాంతా సంగమమే 
    కరుణించెనుగా  సురపతి  కన్నులు వేయిన్ 
    వరమయ్యెన్  చంద్రునికిని 
    పర కాంతాసక్తులకగు వర సంపత్తుల్ 

    రిప్లయితొలగించండి
  22. దరిజేరఁగ బరకాంతను
    తరియించగ జన్మమింక దలపకు మెపుడున్
    మరి గోరెడు వంశ పరం
    పర కాంతాసక్తులకగు వరసంపత్తుల్

    రిప్లయితొలగించండి
  23. నరకము తథ్యము గా దే
    పర కాంతా స క్తుల : కగు వర సంపత్తు ల్
    స్మరణము జేయుచు నిరతము
    శరణము జొఛ్చి న శివునిని సన్మతి కెపుడున్

    రిప్లయితొలగించండి
  24. నిరతము శంకరు గొల్చుచు
    పరమార్థము గాంచునట్టి పడతిని గౌరిన్
    గురుతర పరిణతి పొందు త
    తత్పర!కాంతాసక్తులకగు వర సంపత్తుల్.

    రిప్లయితొలగించండి
  25. గురిగొని యఙ్ఞము దానము
    మరిమరి జేకొంచు నెపుడు మరువక హరినే
    విరివిగ బూజించెడు నా
    పర కాంతాసక్తుల కగు వరసంపత్తుల్
    పరకాంత = స్వర్గంలో దొరికే రంభ,ఊర్వశి మొదలైనవారు

    గురిగొని శాంతము దాంతము
    మరిమరి బాటించి నెపుడు మరువక హరినే
    విరివిగ బూజించెడు నా
    పరకాంతా సక్తులకగు వరసంపత్తుల్
    పరకాంత = ముక్తికాంత

    రిప్లయితొలగించండి
  26. చెరసాలయె చిరునామా
    పరకాంతాసక్తుల కగు; వరసంపత్తుల్
    స్థిరమగు మగువల గాచెడి
    పురుషోత్తములకు నిజముగ పుణ్యప్రదమై

    రిప్లయితొలగించండి


  27. స్వరమాధుర్యమ్ములజో
    రరె వారికి సొత్తు సూవె రమణి జిలేబీ
    పరకాళా ధరియించుట
    పరకాంతాసక్తుల కగు వరసంపత్తుల్!


    జిలేబి

    రిప్లయితొలగించండి


  28. పరుపుల దొరలు సుఖమ్మదె
    పరకాంతాసక్తుల కగు; వరసంపత్తుల్
    పరుగున దరి చేరగ వా
    రరయని సంగతులు లేవు రమణి జిలేబీ

    జిలేబి

    రిప్లయితొలగించండి


  29. పరిచయమయిన మరు నిముష
    మరరె షికారులకరుగ రమణిని బిలిచెడా
    పరమ దయాళుత్వమదే
    పరకాంతాసక్తుల కగు వరసంపత్తుల్! :)


    జిలేబి

    రిప్లయితొలగించండి


  30. గురువులమని నిత్యానం
    ద రసజ్ఞులమని విభుని యెదయె పరమానం
    ద రహస్యమని బిలుచుటయె
    పరకాంతాసక్తుల కగు వరసంపత్తుల్!

    ఇవ్వాళ శతకానికి పోదామా సై యంటూ :)


    జిలేబి

    రిప్లయితొలగించండి
  31. కందం
    నిరతము దేవుని దలఁచుచు
    వరునకు షట్కర్మలొసఁగు వధువుల వెదుకన్
    దొరుకఁగ సద్వంశ పరం
    పర, కాంతాసక్తుల కగు వరసంపత్తుల్

    రిప్లయితొలగించండి


  32. మురిపెమ్ములతోడా బం
    గరు చైనుల తోడు వచ్చి గాట్టిగ వాటే
    సి,రసికత చూపు ఘనతయె
    పరకాంతాసక్తుల కగు వరసంపత్తుల్!


    జిలేబి

    రిప్లయితొలగించండి
  33. పరుషంబైనను నాదు మాట వినుమా వంశమ్ము రక్షింపుమా
    కరువౌ నిద్దుర దూరమౌను సుఖముల్ ఖర్వమ్మగున్ సర్వమున్
    పరకాంతారతులైన వారలకు; సంపత్సిద్ధి గాకుండునే
    వరమందార మరంద పానమగు దైవారాధనాసక్తతన్

    రిప్లయితొలగించండి


  34. చురచుర చూచెడు భార్యను
    మరచుచు ప్రియసఖియె తనను మరులుకొలుపు కి
    న్నెర యనుకొను పెన్నిధియే
    పరకాంతాసక్తుల కగు వరసంపత్తుల్!

    జిలేబి

    రిప్లయితొలగించండి


  35. కురులను ముంగురులను సం
    తరించుచు రమణుల తోడు తరియించుచు బే
    షరతుగ లొంగక నొంగుట
    పరకాంతాసక్తుల కగు వరసంపత్తుల్!


    జిలేబి

    రిప్లయితొలగించండి


  36. మరిమరి నిన్నే మొరలిడి
    తి రమణి వయ్యారి రావె తియతీపివి నీ
    వె రమా యని ముదమారుట
    పరకాంతాసక్తుల కగు వరసంపత్తుల్!


    జిలేబి

    రిప్లయితొలగించండి


  37. వరుడను నేను వనితవీ
    వరయగ ధరణి మనదే సువాయింతురుగా
    పరిచయగీతిక! ప్రణయమె
    పరకాంతాసక్తుల కగు వరసంపత్తుల్!


    జిలేబి

    రిప్లయితొలగించండి


  38. అరయగ వారు నిరాడం
    బరులోయ్! తాము తమదనెడు స్వార్థత లేదోయ్
    పరమాప్తులా రమణులే
    పరకాంతాసక్తుల కగు వరసంపత్తుల్!


    జిలేబి

    రిప్లయితొలగించండి


  39. చురుకైనవారు! మీదుగ
    పరిచయముల పెంచుకొనెడు భావజుని పరం
    పరవారిది! సున్నితమే
    పరకాంతాసక్తుల కగు వరసంపత్తుల్!

    జిలేబి

    రిప్లయితొలగించండి
  40. చెరసాలలోన మగ్గుచు
    కరకు పనుల్జేసితిగద కాయము కృశియిం
    చెర రూకలనిచ్చెనయో
    పరకాంతాసక్తుల కగు వరసంపత్తుల్

    రిప్లయితొలగించండి


  41. కొరుకుడు పడని వనితల కు
    దురుగ తమదరిని బిలిచి వదురుట వలదటం
    చు రహస్యమ్ముల దాచుట
    పరకాంతాసక్తుల కగు వరసంపత్తుల్!

    జిలేబి

    రిప్లయితొలగించండి
  42. పరువంబొప్ప వరింపవయ్య ప్రవరా! భాను ప్రభా భాసురా!
    దొరసానుల్ వరియింప కోర్కెలిడుటన్ దోషంబు కాదెంతయున్
    దరహాసంబున చెంతనిల్చి తను వాత్సల్యంబునుం జూపెడిన్
    పరకాంతారతులైన వారలకు సంపత్సిద్ధి గాకుండునే

    రిప్లయితొలగించండి
  43. ..............🌻శంకరాభరణం🌻...............
    ..................🤷🏻‍♂సమస్య 🤷‍♀....................
    "పరకాంతారతులైన వారలకు
    సంపత్సిద్ధి గాకుండునే"

    సందర్భము: లక్ష్మీం క్షీర సముద్ర రాజ తనయాం శ్రీ రంగధామేశ్వరీమ్.. అంటూ లక్ష్మీ దేవిని స్తుతించడం పరిపాటి.
    లక్ష్మణుడు సీతా వియోగంతో విలపిస్తున్న రామునితో ఇలా అన్నాడు.
    "అన్నా! నీవే వందారు మందారమవు. (కోరినవారి కోరికలు తీర్చే కల్పవృక్షానివి.) ని న్నీ కాంతార దురంత వాసం వరించింది.
    ఐనా ఈ వేదన కొన్నాళ్ళదే సుమా! చిరకాలంనుంచి (వంశాచారంగా) అర్చించబడిన దేవతల అర్చన లూరకే పోవు. శ్రీ రంగనాథుని దేవేరి యైన లక్ష్మీదేవి నర్చించు.. (సతీ వియోగ బాధ తీరుతుంది.)"
    ఇక్ష్వాకుల కులదైవం శ్రీ రంగనాథు డన్నది ప్రసిద్ధం
    దురంతము = అంతము లేనిది, చెడ్డది
    సంపత్తు = శ్రేయస్సు
    ~~~~~~~~~~~~~~~~~~~~~~~

    *శ్రీ రంగ ధామేశ్వరి*

    వర కాంతార దురంత వాస మిటులన్
    వందారు మందారమౌ

    నరపాలున్ వరియించి మించినది య
    న్నా నిన్ను!.. కొన్నాళ్ళదే!

    చిర కా లార్చల గూర్చి చింతిల గదే!
    శ్రీ రంగ రంగేశ త

    త్పర కాంతా రతులైన వారలకు సం
    ప త్సిద్ధి గాకుండునే!

    ✍️~డా.వెలుదండ సత్యనారాయణ
    పరమార్థ కవి
    7.01.20
    -----------------------------------------------------------

    రిప్లయితొలగించండి
  44. పరకాంతలగూడినచో
    విరివిగనొడలెల్లబెచ్చులుగలుగన్
    నెఱుగనిజబ్బులెయనునవి
    పరకాంతాసక్తులకగువరసంపత్తుల్

    రిప్లయితొలగించండి
  45. ఒక తండ్రి కోడుకునకు చేయు బోధ
    అరయన్ సీతను రావణుండు వొలి రామాగ్నిన్ గతాత్ముండయెన్
    సురరాట్ప్రీతిని గోరగా మునిసతిన్ శౌర్యంబు గోల్పోయెగా
    పరకాంతా పరులైన వారలకు సంపత్సిద్ధి గాకుండు; నే
    మరకన్ ధర్మము నేకపత్నిగొని సమ్మార్జించు పుణ్యంబిలన్
    వొలి = దొంగలించి

    రిప్లయితొలగించండి


  46. కురిసింది వాన! మదిలో
    విరజాజులు విరియ బూసె! విభుని వలె ప్రియం
    పు రసికతయు పలుకులె పో
    పరకాంతాసక్తుల కగు వరసంపత్తుల్!

    జిలేబి

    రిప్లయితొలగించండి
  47. పరజన మాన హరణముం
    బర విత్తాపహరణమ్ము వద్దుర మోడ్తుం
    గర యుగ్మ మిట్లనకు మా
    పర కాంతాసక్తుల కగు వరసంపత్తుల్

    [అనకుము +ఆపర = అనకు మాపర]

    వరలక్ష్మీ సతి లోకమాత నిడె సత్పాత్రంబుగా నెమ్మిఁ దా
    నరవిందాక్షుఁడు వక్ష మందు మఱి దేహార్ధంబులో నింకయున్
    శిరమం దుంచెను శంకరుండు సతులన్ స్వీయాంతరంగస్థి తా
    పర కాంతారతులైన వారలకు సంపత్సిద్ధి గాకుండునే

    [స్థిత +అపర =స్థి తాపర; అపరము = ఇతరము కానిది, స్వీయము]

    రిప్లయితొలగించండి


  48. ఉరుకుల శ్రమణుల హృదయము
    పరుగిడ పరిపరి విధముల వడివడి తనరం
    గ రమణునిగ వెలుగుట భళి
    పరకాంతాసక్తుల కగు వరసంపత్తుల్!


    జిలేబి

    రిప్లయితొలగించండి

  49. ఈ నాటి శంకరాభరణము సమస్య

    పరకాంతారతులైన వారలకు సంపత్సిద్ధి గాకుండు ,నే


    ఇచ్చిన పాదము మత్తేభములొ నా పూరణము సీసములొ

    ఊర్వసిని గాంచి అర్జునుడు పలికిన పలుకులు స్వర్గ లోకములో


    తల్లీ వలదు చెడు తలంపు మనమున,సురలోక పతి నాకు సుతి,తలచగ
    నాతని ప్రోయాలు నాకు జనని గాదె నియమము గలగిన నేను స్వప్న
    మందైన తలచను మాతా సమానురాలైన స్త్రీ నెచ్చోట నైనను నవ
    ల, పరకాంతారతు లైన వారలకు సంపత్సిద్ధి గాకుండు ,నే త్సర మన


    సు గలవాడను కానుగా ,సుద్యు పాస్య,
    వలచి పిలచిన కూడని వాడి ననుచు
    షండు డవు కమ్మని శపించ సంతసముగ
    స్వీకరింతునని కిఱీటి చెప్పె నపుడు



    సుతి = తండ్రి ప్రోయాలు భార్య లేదా ప్రేయసి , త్పర = వక్రముగ వెడలు, సుద్యుపాస్య లెదా నవల = స్గ్త్రీ ,షండుడు = నపుంసకుడు

    రిప్లయితొలగించండి
  50. మత్తేభవిక్రీడితము
    వరుడై జోడగు కన్యకై వెదకగన్ భావ్యమ్ము కాదందురే?
    కరమున్ భక్తి ప్రపత్తులన్గలిగి షట్కర్మల్ దగన్ జేయఁగన్
    వరమై యింటికి దీపమై మెరయ సద్వంశంపు శోభా పరం
    పర, కాంతారతులైన వారలకు సంపత్సిద్ధి గాకుండునే!

    రిప్లయితొలగించండి
  51. కరుడుంగట్టినదుష్టబుద్ధులవియెక్కాలంబునందుందగున్
    బరకాంతారతులైనవారలకు,సంపత్సిద్ధిగాకుండునే
    నిరతంబచ్యుతుగొల్చుచోభువినినానీరేజభవ్యుండుతో
    వరలున్ దప్పక,సందియంబునికవేపారంగబోద్రోచుమా

    రిప్లయితొలగించండి


  52. అరమోడ్పుకనుల జూచుచు
    వరదుని వలె గాన్పడుచు యవనికను తొలగిం
    చి రయముగా దోచు మనసు
    పరకాంతాసక్తుల కగు వరసంపత్తుల్!


    జిలేబి

    రిప్లయితొలగించండి


  53. అరయగ నాథుడతడె! చ
    క్కెరంపు గుమ్మా యటంచు కెంజాయిని చే
    ర్చి రతనమై మది దోచుట
    పరకాంతాసక్తుల కగు వరసంపత్తుల్!


    జిలేబి

    రిప్లయితొలగించండి


  54. కురిపింతురు తేనెలొలుకు
    పురిగొల్పెడు పల్కులన్ గబుక్కున తృటిలో
    పరిచయముచేసుకొని! భళి
    పరకాంతాసక్తుల కగు వరసంపత్తుల్!


    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు

    1. సమూహములో నేను ఉంచిన:

      "తాజా కబురు:

      నేటి సమస్యకు శంకరాభరణం బ్లాగులో కనిపించిన జిలేబి గారి పూరణల సంఖ్య:

      21 (అక్షరాలా ఇరవై ఒక్కటి)

      మాత్రమే...

      తొలగించండి
    2. మైలవరపు వారి స్పందన:

      "దత్తవృత్తసమస్యాపాదంలోని అక్షరాలకంటె అక్షరాలా ఒకటి పెచ్చు... సెబాస్... 🙏అభినందనలమ్మా 🙏🙏🙏"

      తొలగించండి
    3. హమ్మయ్య ఓ క్వార్టర్ అయిపోయిందండి :)



      జిలేబి

      తొలగించండి
  55. మ:

    సరిరా రెవ్వరువారికిన్ గనగ సంసారంబు గిట్టించ గన్
    పరిపోషింపగ దుష్ట సాధనములే ప్రాపౌ గదా నెప్పుడున్
    సిరి యున్నంతనె మాట లేదనగ నిస్తేజంబు యా జీవనమ్
    పరకాంతా రతులైన వారలకు సంపత్సిద్ధి గాకుండునే

    వై. చంద్రశేఖర్

    రిప్లయితొలగించండి


  56. సరిరారెవ్వరును సుమీ
    కరుణయె మారూపమంచు కవ్వింపులతో
    సురలన్ దేల్చెడు శక్తియె
    పరకాంతాసక్తుల కగు వరసంపత్తుల్!

    జిలేబి

    రిప్లయితొలగించండి


  57. గురిచూసి విసురుదురు వల
    నిరువైపుల పడిన పడతిని తమోలోక
    మ్మిరు వైపుల దేల్చు పటిమ
    పరకాంతాసక్తుల కగు వరసంపత్తుల్!


    జిలేబి

    రిప్లయితొలగించండి


  58. మురుగా యెండ్రు మనిదనై
    కరుణై కడలాయ్ నినైక్క కణ్ణమ్మా యెం
    డ్రరిగిర్కు వందు నిర్కుమ్
    పరకాంతాసక్తుల కగు వరసంపత్తుల్!


    జిలేబి

    రిప్లయితొలగించండి


  59. వరుమానము లేకున్నను
    పరిణితి చెందిన మనుజుల వలె తామగుపిం
    చి రతియనుచు దరి చేరుట
    పరకాంతాసక్తుల కగు వరసంపత్తుల్!


    జిలేబి

    రిప్లయితొలగించండి


  60. ధరలో పరితాపంబే
    పరకాంతాసక్తులకగు,వరసంపత్తుల్
    పరమాత్ముని సేవవలన
    నిరతంబొనగూడుననుట నిక్కము సుమ్మీ.

    రిప్లయితొలగించండి