సందర్భము: సీతా వియోగంతో బాధపడే రాముణ్ణి లక్ష్మణు డోదారుస్తూ ఇలా అన్నాడు. అలం వీర వ్యథాం గత్వా న త్వం శోచితు మర్హసి శోచతో వ్యవసీదంతి సర్వార్థా విదితం తు తే (కి.కాం. 27-34) వీరుడా! నీ విలా దుఃఖిస్తూ బాధపడడం తగదు. దుఃఖించే వానికి అన్ని పనులూ చెడిపోతా యని నీకు తెలియంది కాదు. లక్ష్మణు డింకా ఇలా అన్నాడు. భవాన్ క్రియాపరో లోకే..35 నీవు లోకంలో పౌరుషా న్నవలంబించే కార్యము లాచరించేవాడవు. శోకించవద్దు. లోకంలో ప్రతి ఒక్కరికీ దుఃఖం వస్తూనే వుంటుంది. అది సహజమే! కాని ప్రతి ఒక్కడూ తనకు మాత్రమే దుఃఖం కలిగిం దని భ్రమపడుతుంటాడు. అదే మాయ. దుఃఖితులైన వారిలో కొందరు మాత్రమే జ్ఞాన మనే ఖడ్గంతో ఆ దుఃఖాన్ని చక్కగా ఖండించివేయగలరు. "అలా ఖండించివేయబడిన దుఃఖమే వధూటి (సీతయొక్క) రతము (కలయిక)ను కూరుస్తుంది." అన్నాడు లక్ష్మణుడు. తూలు = నశించు రతము = సంయోగము కలయిక విదళితము = మిక్కిలి ఖండించబడినది ~~~~~~~~~~~~~~~~~~~~~~~
*జ్ఞాన ఖడ్గము*
దుఃఖపడు వాని పను లెల్లఁ దూలు సుమ్ము!
పౌరుషం బవలంబించి పైకి లెమ్ము..
ప్రాకట జ్ఞాన ఖడ్గ ధారా విదళిత
దుఃఖమే కూర్చుఁ గాదె వధూటి రతము!
✍️~డా.వెలుదండ సత్యనారాయణ పరమార్థ కవి 10.01.20 -----------------------------------------------------------
రిప్లయితొలగించండినడిరేయి సరదా పూరణ:
దుఃఖమొసంగ హర్షులిట దూఱుచు నిచ్చిరి కైపదమ్మయో:
"దుఃఖము గాదె చక్కని వధూటి రతంబు విదగ్ధకోటికిన్"
దుఃఖము తీర దిద్దవలె దోషము ముద్రణమందు నిట్టులన్:
"దుఃఖము గాదు చక్కని వధూటి రతంబు విదగ్ధకోటికిన్"
ముద్రణా స్ఖాలిత్యం విషయంగా మీ సరదా పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండి🙏
తొలగించండి
రిప్లయితొలగించండిఆటవిడుపు సరదా పూరణ:
(జిలేబి గారికి అంకితం)
దుఃఖము మీర జేబులను దుడ్డుల నన్నియు కోలుపోవగా
దుఃఖమునిచ్చు రోగములు తోరపు రీతిని పొందుచుండ వే
దుఃఖము లెన్నియో పడసి దుండగు డిట్టుల రోదనంబిడెన్:
"దుఃఖము గాదె చక్కని వధూటి రతంబు విదగ్ధకోటికిన్"
మీ ఆటవిడుపు పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి🙏
తొలగించండిదుఃఖములో మునింగి సరి దోషములెంచుటె జీవనంబ? యా
రిప్లయితొలగించండిదుఃఖమె వీడి సంతసముతో చరియించుటె స్వర్గతుల్యమౌ!
దుఃఖమునన్ జయించుటయె తోరఁపు బుద్ధికి లక్ష్యమైన నా
"దుఃఖము గాదె చక్కని వధూటి రతంబు విదగ్ధకోటికిన్"
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిమదిని మైకము నింపుచు మధువు గ్రోలి
రిప్లయితొలగించండివార కాంతల చెంతకు కోరి కోరి
మంచి చెడులను మరచిన మసక ముసుగు
దు:ఖమే కూర్చుఁ గాదె వధూటి రతము
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి
రిప్లయితొలగించండివలదు! మాట విను! యెపుడు బడిన యపుడు
చేయ జంతువుల వలె కచేరిలోన
గొంతు చించుకొనుచు గోల గోలలేను
దుఃఖమే కూర్చుఁ గాదె వధూటి, రతము!
జిలేబి
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి"విను మెపుడు బడిన నపుడు" అనండి.
రిప్లయితొలగించండిదుఃఖమ దేల స్నేహితుడ! దూరకు చట్టని సందుగొందులన్
దుఃఖము తీరదయ్య! నిను త్రోయును మాయని మాటు వేయుచున్
దుఃఖము పుట్టె చట్టని వధూటియు వెన్కయె బుట్టె మానవా
దుఃఖము గాదె చక్కని వధూటి, రతంబు, విదగ్ధకోటికిన్!
జిలేబి
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి'వెన్కనె' అనండి.
( అందం వెనక హాలాహలం ఉందని
రిప్లయితొలగించండిమిత్రునికి మరొక మిత్రుని హితబోధ ) దుఃఖమయమ్ము లోకమిది ;
దుష్టలు భ్రష్టలు నిండియుందురే !
దుఃఖముపాలు జేసెదరు ;
దుర్భరరోగము లెన్నొ దాగెలే !
దుఃఖములోన ముంచు నిను ;
దూరము కావవి యెన్నిమందులన్ ;
దుఃఖము గాదె చక్కని వ
ధూటిరతంబు విదగ్ధకోటికిన్ .
(దుర్భర - భరించలేని; విదగ్ధకోటి - మేధావిసమూహం)
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండిఅజ్ఞాత కవి పూరణ......
రిప్లయితొలగించండిగీఃఖననంబులేల?పరికించి వచించెద నొక్కమాట జా
రాః ఖలు పాపినోయని తిరంబుగ పల్కెడి చాందాసోక్తులన్
భాః ఖచితోక్తులంబలె మనంబున నెంచకుడీ,నిరస్తధీ
దుఃఖముగాదె చక్కని వధూటిరతంబు విదగ్ధకోటికిన్.
వారకాంతల కడకేగివచ్చి నపుడు
రిప్లయితొలగించండిదుఃఖమే కూర్చుఁ గాదె వధూటి రతము
యుిప్పుడింతగ వగచిన యేమిఫలము
పెద్దల పలుకుల నెపుడు వినవలెగద
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి"వగచిన నేమి..." అనండి.
🙏🏽
తొలగించండివాః ఖరదండకోమలము భామ! కుచద్వయసీమ,ఊరువుల్
రిప్లయితొలగించండిబాః ఖచితాసనంబులన స్వర్గసుఖమ్ముల చేరబిల్వగా
గీః ఖననంబులేల సఖి!కేళిని సల్పగదే! నిరస్తధీ
*దుఃఖముగాదె చక్కని వధూటిరతంబు విదగ్ధకోటికిన్*
తిరుక్కోవళ్ళూరు శ్రీహర్ష
వాః= దప్పిక తీర్చునది
ఖరదండకోమలము=కమలము వలె కోమలమైనది
బాః ఖచితాసనంబులు=వెలుతురులు పొదగబడిన అసనములు
గీః ఖననంబులేల =మాటలు త్రవ్వుకోవడం ఎందుకు(ఈ సమయంలో)
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండిమంచి చెడుల విచక్షణ మాని మాన
రిప్లయితొలగించండివత్వమన్నది విడనాడి పశువు వోలె
నతివల బలవంతమ్ముగా ననుభవింప
దుఃఖమే కూర్చుఁ గాదె వధూటి రతము.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిఎంత చెప్పిన వినకుండ చింత లేక
రిప్లయితొలగించండిమద్యపానము చేసిన మత్తులోన
చేయరానట్టి దోషము చేయుకతన
దుఃఖమే కూర్చు గాదె వధూటి రతము
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిమైలవరపు వారి పూరణ:
రిప్లయితొలగించండితస్మాత్ జాగ్రత జాగ్రత !!
దుఃఖము ధాత్రి జన్మమతి దుఃఖమునౌ జర., యెంచి చూడగా
దోఃఖగ బంధనమ్మగును తొయ్యలి కౌగిలి., నష్టమౌను రే
తఃఖనిజమ్ములెన్నొ., ఘనతామసమే మదినిండి కాల్చెడిన్
దుఃఖము గాదె చక్కని వధూటి రతంబు విదగ్ధకోటికిన్!
మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి
మైలవరపు వారి పూరణ అద్భుతంగా ఉన్నది.
తొలగించండికోరిక ల దుపు జేయని కుజను లక ట
రిప్లయితొలగించండిమంచి చెడ్డలు తెలియ క మసలు చుండి
రోగగ్రస్తు లు గా మారి రోయుచు కడు
దుఃఖ మే గూర్చు గాదె వధూటి రతము
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి..............🌻శంకరాభరణం🌻...............
రిప్లయితొలగించండి..................🤷🏻♂సమస్య 🤷♀....................
*"దుఃఖమే కూర్చుఁ గాదె వధూటి రతము"*
సందర్భము: సీతా వియోగంతో బాధపడే రాముణ్ణి లక్ష్మణు డోదారుస్తూ ఇలా అన్నాడు.
అలం వీర వ్యథాం గత్వా
న త్వం శోచితు మర్హసి
శోచతో వ్యవసీదంతి
సర్వార్థా విదితం తు తే
(కి.కాం. 27-34)
వీరుడా! నీ విలా దుఃఖిస్తూ బాధపడడం తగదు. దుఃఖించే వానికి అన్ని పనులూ చెడిపోతా యని నీకు తెలియంది కాదు.
లక్ష్మణు డింకా ఇలా అన్నాడు.
భవాన్ క్రియాపరో లోకే..35 నీవు లోకంలో పౌరుషా న్నవలంబించే కార్యము లాచరించేవాడవు. శోకించవద్దు.
లోకంలో ప్రతి ఒక్కరికీ దుఃఖం వస్తూనే వుంటుంది. అది సహజమే! కాని ప్రతి ఒక్కడూ తనకు మాత్రమే దుఃఖం కలిగిం దని భ్రమపడుతుంటాడు. అదే మాయ. దుఃఖితులైన వారిలో కొందరు మాత్రమే జ్ఞాన మనే ఖడ్గంతో ఆ దుఃఖాన్ని చక్కగా ఖండించివేయగలరు.
"అలా ఖండించివేయబడిన దుఃఖమే వధూటి (సీతయొక్క) రతము (కలయిక)ను కూరుస్తుంది." అన్నాడు లక్ష్మణుడు.
తూలు = నశించు
రతము = సంయోగము కలయిక
విదళితము = మిక్కిలి ఖండించబడినది
~~~~~~~~~~~~~~~~~~~~~~~
*జ్ఞాన ఖడ్గము*
దుఃఖపడు వాని పను లెల్లఁ దూలు సుమ్ము!
పౌరుషం బవలంబించి పైకి లెమ్ము..
ప్రాకట జ్ఞాన ఖడ్గ ధారా విదళిత
దుఃఖమే కూర్చుఁ గాదె వధూటి రతము!
✍️~డా.వెలుదండ సత్యనారాయణ
పరమార్థ కవి
10.01.20
-----------------------------------------------------------
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండిదుఃఖములో నిరంతర మధోగతి బొందుచు నున్నవాడునై
రిప్లయితొలగించండిదుఃఖమె జీవనమ్మనుచు దోరపు చింతను సంచరించుచున్
దుఃఖితుడైనవా డొకడు తొల్లి వచించెను శూన్యచిత్తుడై
"దుఃఖము గాదె చక్కని వధూటి రతంబు విదగ్ధకోటికిన్"
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండి
రిప్లయితొలగించండినీహారికాజీ
ఇక్కడి కవీశ్వరుల దుఃఖానికి కొంత వూరట కలిగించేటట్లు కొంత "స్వాంతన వచనమ్ములు" పల్కడానికి రావలసినదిగా వేడుకోలు
ఇట్లు
నారదాయ నమః
జిలేబి
జిలేబీ పూరణలే కాక నీహారిక పూరణలు కూడానా? హతోఽస్మి!
తొలగించండి
తొలగించండిబుచికీవి కాడా..
తొలగించండినీహారిక గారు శతముఖి సమ్మార్జకమునకు పేరెన్నిక గన్నవారు . వచ్చినచో కొంత స్వాంతము కలుగు నని .. మా సదుద్దేశము నారదులవారి మనోరథము :)
నారాయణ
జిలేబి
కాపురమ్మున కలతలుఁగలుగజేసి
రిప్లయితొలగించండిఅత్త మామల దూరుచు నలుకఁబూని
కర్రపెత్తన మొనరించు కలికి యుండ
దుఃఖమే గూర్చుఁగాదె వధూటి రతము.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిThank you sir
తొలగించండిఅందరికీ శుభోదయం 🙏🙏
రిప్లయితొలగించండిఈరోజు సమస్య
*దుఃఖమే కూర్చుఁ గాదె వధూటి రతము*
*తే గీ* 🌹
అడిగిన వెపుడు నీయక యాకలియన
లక్షలనొదలక నెపుడు లక్ష్యమనుచు
వేష మేయగ బోయిన వేశ్యల దరి
*దుఃఖమే కూర్చుఁ గాదె వధూటి రతము*
*కళ్యాణ్ చక్రవర్తి, ముంబాయి*
🙏💐🙏💐🙏
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి'లక్షల వదలక యెపుడు...' అనండి.
ధన్యుణ్ణి శంకరార్యా ధన్యుణ్ణి 🙏🙏
తొలగించండిఫేసు బుక్కులో ఫ్రెండ్షిప్పు, పేరు తోడ
రిప్లయితొలగించండివలను వేచి రహస్య ముల్ తెలుసు కొనును,
దేశ రక్షణ కిటుకులు తెలుప కున్న
దేహ మైన నర్పించుచున్
దేహి యనును
రతిసు ఖములోన మునుగుచు రక్షణ లొసుగు
లన్ని చేరవేసి చెరసాలకు వెడలుచు
తలచు చుండుచు మదిలోన తప్పు లన్ని
భరత దేశజనుడిటుల బాధ తోడ
దుఃఖమే గూర్చు గాద వధూటి రతము
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి'రక్షణ లొసుగులు' దుష్టసమాసం.
దుఃఖితమతి మండోదరి దుర్మతియగు
రిప్లయితొలగించండివిభుని పరసతి రతమును వెక్కిరించి
హెచ్చరించుచు నాథునకిట్లు బలికె
దుఃఖమే కూర్చుఁ గాదె వధూటి రతము"
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిఉత్పలమాల
రిప్లయితొలగించండిదుఃఖమటన్న కశ్యపుడు దుఃఖ మటన్న వరాహమూర్తియున్
దుఃఖమటన్న విశ్వవసు తోయలులెంచ ప్రదోషవేళలన్
దుఃఖము గూర్చువారిఁ గని దుఃఖము నందిరి, కాని వేళలో
దుఃఖము గాదె చక్కని వధూటి రతంబు విదగ్ధకోటికిన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండినిక్కమీమాట నమ్ముడో నేటి యువత
రిప్లయితొలగించండిచక్కనైనట్టి వయసులో చదువుకొనక
తిక్క పాశ్చాత్య సంస్కృతి తీరులేల
దుఃఖమే కూర్చుఁ గాదె వధూటి రతము
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిఇచ్ఛ లేకున్న మగువలనిష్టపడుచు
రిప్లయితొలగించండికామవాంఛకు బలిజేయనేమిసుఖము?
పశువులైనను సిగ్గిల్లు పనులవేల?
దుఃఖమే కూర్చుఁ గాదె వధూటి రతము?
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిదుఃఖమదేల నీకనుచు ధూర్తపు మాటలనింక నాపుమా
రిప్లయితొలగించండిదుఃఖము గాదె చక్కని వధూటి రతంబు విదగ్ధకోటికిన్
దుఃఖమునందునా యువతి దుర్భర వేదన జెందుచుండగా
దుఃఖము దీర్చుటన్ మరచు దుష్టుడవైతివిదేమి ఖర్మమో
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిపూలుకోయగవచ్చినబోటిజూచి
రిప్లయితొలగించండిగోడచాటునగలయట్టికొంటెవాడు
మీదబడగనుబాదెను నదయతోడ
దుఃఖమేకూర్చుగాదెవధూటిరతము
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిమూడవ పాదంలో ప్రాసయతి తప్పింది. సవరించండి.
మెడనువంచి
తొలగించండిదుఃఖపుహేతువైనిలుచు దోషపు చింతన మానవాళిలో
రిప్లయితొలగించండిదుఃఖముగూర్చునెప్పుడును దూషణఁజేసిన సచ్చరిత్రులన్
దుఃఖముగల్గితీరుతనతోషణకై చెడుదారి బోవుచో
దుఃఖము గాదె చక్కని వధూటి రతంబు విదగ్ధకోటికిన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండినరుల కెంచ నగును మిత్ర నాశనమ్ము
రిప్లయితొలగించండిబ్రహ్మచారుల కగు ఘోర పాతకమ్ము
మోక్ష కాములకు నగుఁ బుణ్యక్షయమ్ము
దుఃఖమే కూర్చుఁ గాదె వధూటి రతము
దోః ఖన నావట మ్మగును దుశ్చరితమ్ములు పూడ్చఁ దన్నిఁకన్
దుః ఖుర శస్త్ర సంయుత సుదుస్సహ రోష మదాంధ మైన ప్రా
తః ఖర పాద తాడన వితాన విచార సమాన మందు నీ
దుఃఖము గాదె చక్కని వధూటి రతంబు విదగ్ధకోటికిన్
[వధూటి = కోడలు]
8/01/2018 నాటి సదృశ సమస్యా పూరణము:
తొలగించండినిఃఖలతా మనో రుచిర నిర్వ్యసన ద్యుతి వెల్గు వానికిన్
దోఃఖరమండలాగ్ర రిపు దుస్సహ వీర వరేణ్యులందుఁ బ్రా
తః ఖురలీ విలాస వసుధాపతు లందుఁ దలంచగం బ్రజా
దుఃఖ మెఱుంగువానికె యథోచిత తుష్టి కలుంగు నెయ్యెడన్
[నిఃఖలత =దౌష్ట్యము లేమి; ఖురలి = సైనికుల సాము ]
మీ మూడు పూరణలు అద్భుతంగా ఉన్నవి. అభినందనలు.
తొలగించండిపూజ్యులు శంకరయ్య గారికి నమః పూర్వక ధన్యవాదములు.
తొలగించండి10, జనవరి 2020, శుక్రవారం
రిప్లయితొలగించండిసమస్య - 3247 (దుఃఖము గాదె...)
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"దుఃఖము గాదె చక్కని వధూటి రతంబు విదగ్ధకోటికిన్"
ఉత్పలమాల
దుఃఖమునొందునోటమినెదుర్కొనమాన్యుడుపెక్కుమారులున్
దుఃఖముకల్గునోటమినెదుర్కొన పందెము లందు పెద్దకున్
దుఃఖముమించునోటమినెదుర్కొనువేళమహా సభాస్థలిన్
దుఃఖము గాదె చక్కని వధూటి రతంబు విదగ్ధకోటికిన్
గాదిరాజు మధుసూదన రాజు
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండితే.గీ.
రిప్లయితొలగించండివిఫల మవజూచు విద్యార్థి విద్య గరప
ప్రాణ సంకట రోగాల బారి పడగ
తీరు విధమగు కష్టాలు తెచ్చు కొనగ
దుఃఖమే కూర్చు గాదె వధూటి రతము
వై. చంద్రశేఖర్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి'అవ' ప్రయోగం 'మూడవ, నాల్గవ..' మొదలైన వాటిలోనే. "విఫలముం జూచు" అనండి.
తేటగీతి
రిప్లయితొలగించండిదూకుడుగ దిశ మానమ్ము దోచివైచి
నామ రూపాలు లేకుండ నాశ మైరి
తల్లిగా పరస్త్రీ మూర్తిఁ దలఁచ రేని
దుఃఖమే కూర్చుఁ గాదె వధూటి రతము
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిదుఃఖితులైరి పూర్వులిల దుర్గతి పాలయిరెందరో గనన్
రిప్లయితొలగించండిదుఃఖము నొందె రావణుడు దుర్మతియై పర కాంతఁ గోరి తా
దుఃఖితు డయ్యె కీచకుడు తొయ్యలి ద్రౌపది పొందుగోరుచున్
దుఃఖము గాదె చక్కని వధూటి రతంబు విదగ్ధకోటికిన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిదుఃఖముగాదెచక్కనివధూటిరతంబువిదగ్ధకోటికిన్
రిప్లయితొలగించండిదుఃఖముగాదెనాయనగదోచదుమాకికమాటలాడగన్
దుంఖమెయౌనుగారతముదుర్జనుదోడనుగల్గుచోధరన్
దుఃఖముగాదులేసుజనుదోడనుచక్కగజర్గుచోరతిన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి