13, జనవరి 2020, సోమవారం

సమస్య - 3250 (పురిటి నొప్పులు...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"పురిటి నొప్పులు తప్పవు పూరుషులకు"
(లేదా...)
"పురుషుల్ పొందెద రెప్పుడున్ బురిటినొప్పుల్ దప్ప దీభూమిపై"
(కళ్యాణ్ చక్రవర్తి గారికి ధన్యవాదాలతో...)

76 కామెంట్‌లు:


 1. నడిరేయి సరదా పూరణ:

  విరసంబందున మీదమీద పడుచున్ వేధించి సాధించుచున్
  పరువుల్ పెట్టుచు జాడుతో తరుముచున్ బంగారు హారాలకై
  తరుణుల్ దీదిని కాపికొట్టుచునయో తాడించి కోపించగా
  పురుషుల్ పొందెద రెప్పుడున్ బురిటినొప్పుల్ దప్ప దీభూమిపై...

  రిప్లయితొలగించండి
 2. జన్మనీయగ జక్కని జానుతెలుగు
  కావ్యకన్యకు దల్లియై కాగితమును
  కలము బట్టుచు రచియింప కష్టమైన
  పురిటి నొప్పులు తప్పవు పూరుషులకు

  రిప్లయితొలగించండి
 3. అందరికీ నమస్సుమాంజలి 🙏🙏

  *తే గీ:*
  పరుగు బెట్టగ వనితలు వణుకు మనకు
  బెరుకు లేమియు లేకను వెలుగు చుండ
  కరకు మాటల తోడను కఠిన మవ్వ
  *పురిటి నొప్పులు తప్పవు పూరుషులకు*

  *శంకరార్యులకు ధన్యవాదములతో* 🙏🙏

  *కళ్యాణ్ చక్రవర్తి, ముంబాయి*
  🙏🌹🙏🌹🙏

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'అవ్వ' అన్న క్రియారూపం సాధువు కాదు.

   తొలగించండి
  2. ధన్యోస్మి ఆర్యా 🙏🙏
   మార్చే ప్రయత్నం చేసెదను 🙏🙏

   తొలగించండి

 4. ఆటవిడుపు సరదా పూరణ:
  (జిలేబి గారికి అంకితం)

  అమిత్ షా ఉవాచ:

  పరువుల్ పెట్టుచు పాకులన్ తరుముచున్ పండించి నా పంటలన్
  కరవుల్ తీర్చెడి రీతినిన్ కలుపగా కాశ్మీరు రాష్ట్రమ్మునున్
  బరువౌ తిట్టుల మోడినిన్ కఱచుచున్ పాపమ్ములన్ జేయు కా
  పురుషుల్ పొందెద రెప్పుడున్ బురిటినొప్పుల్ దప్ప దీభూమిపై....

  రిప్లయితొలగించండి
 5. రామకథ వ్రాయ బూనితి రమ్యముగను
  తేట గీతి నాటవెలది తేలదయ్యె
  వృత్తపద్యములు కుదుర వేకువయ్యె
  పురిటి నొప్పులు తప్పవు పూరుషులకు

  రిప్లయితొలగించండి


 6. అలివేణులకు పురిటి నొ
  ప్పులు తప్పవు పూరుషులకు బ్రువ్వట బాబా
  పలువిధముల తిప్పలు గూ
  డి లబ్జుగా గుండె వడివడి దడయు వర్తీ!


  జిలేబి


  రిప్లయితొలగించండి
  రిప్లయిలు


  1. అలివేణులకు పురిటి నొ
   ప్పులు తప్పవు పూరుషులకు బ్రువ్వట బాబా
   పలువిధముల తిరుగుడు తి
   ప్పలున్ను కల్యాణ చక్రవర్తి వినవయా!


   జిలేబి

   తొలగించండి
  2. మీ రెండు విధాల పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించండి


 7. అరయన్ పొందెదరెప్పుడున్ సుడిని కల్యాణంబుకాగన్ సుమా
  పురుషుల్; పొందెద రెప్పుడున్ బురిటినొప్పుల్ దప్ప దీభూమిపై
  గరితల్ పెండ్లియె కాగ జీవితములో కర్పూరగన్ధీ జిలే
  బి!రహస్యమ్ము విధాత రాత యిది శోభిల్లంగ భూస్పృక్కులే!


  జిలేబి

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు

  1. వాట్సప్ సమూహములో పండితుల ఆజ్ఞ:
   (కంది సారు పట్టించుకొనరు)

   పరువుల్ పెట్టుచు శంకరాభరణనున్ వ్రాయంగ పద్యమ్ములన్
   తరుణుల్ తాత జిలేబులున్ పురుషులున్ తప్పించుకో గోరుచున్
   విరువన్ గూడదు కైపదమ్ములికనున్ విడ్డూరమౌ రీతినిన్
   బరువుల్ మోసి సమస్యనున్ చివరనున్ పాదమ్ముగా నుంచుడీ!

   తొలగించండి
  2. జిలేబి గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   *****
   శాస్త్రి గారూ,
   కైపదం కచ్చితంగా చివరి పాదంలోనే ఉంచాలన్న నియమాన్ని నేను అంతగా పట్టించుకోను.

   తొలగించండి
 8. నెలతుకలకు నీ భువిలోన నెల సరియును

  పురిటి నొప్పులు తప్పవు,పూరుషులకు

  నెలకునొక్కమారైనను నెఱకు ఖండ

  నంబు తప్పదు నిలలోన నమ్మ కముగ

  రిప్లయితొలగించండి
 9. ఈ నాటి శంకరా భరణము వారి సమస్య
  పురుషుల్ పొందెద రెప్పుడున్ బురిటినొప్పుల్ దప్పదీభూమిపై
  ఇచ్చిన పాదము మత్తేభము నా పూరణము సీసములో

  ప్రసవ సమయము దగ్గిర బడుచుండగా పురితి నొప్పులు స్త్రీలకె కాదు పురుషులకు కూడ ఉన్నాయి. వాలి సుగ్రీవుల తల్లి వృక్ష రాజు అను గంధర్య్వుడు .ఇంద్రుదు సూర్యుడు కూడగా వాలి సుగ్రీవులు పుట్టారు. పురుషుడైన హరి మోహిని అయి హరిహర సుతునికి జన్మ నిచ్చాడు విష్ణువు చెవుల నుంచి పుట్టిన వారు మధు కైటభులు . బ్రహ్మ నాభినుంచి పుట్టాడు.జననము యోని నుంచియే కాక ఇతర భాగముల నుంచి కూడా అయిన సందర్భములు అనేకము అనుచు తన భార్యకు ఒకడు సరదాగ చెప్పిన నిజమైన పురాణ సంఘటనలు


  స్నానమాడదలచి సరసులోకి దిగిన వృక్ష రాజుకు తోయ జాక్షి రూపు
  వచ్చె, కాంచి రవియు వజ్ర ధరులుకూడ నెలదప్పి యాతడు నీలకవరు
  లౌ వాలి సుగ్రీవు లకు‌జన్మ‌ నిచ్చెగా,శివుడు మోహినితోడ చెలిమి‌వేయ
  కలిగెగా నయ్యప్పయిలలోన నేతకున్ ఘనముగ, నిజమిది వినుము సుంద
  రి, (పురుషుల్ పొందెద రెప్పుడున్ బురిటినొప్పుల్ దప్పదీభూమిపై) దివిజుడు

  శ్రీ హరికి పుట్టె నాభి నుంచి కమలజుడు
  కర్ణజులు మధుకైటభుల్ కంబు పాణికి
  తరచి చూడ ననుచు బల్కి ధర్మపత్ని
  శంక తీర్చెగా నొక్కడు సరస గతిని

  నీలకము కొతి

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   సీసం నాల్గవ పాదం ఉత్తరార్ధంలో ప్రాసయతి తప్పింది.
   ఎత్తుగీతి రెండవ పాదంలో గణభంగం.
   సవరించండి.

   తొలగించండి
 10. అరయ నేపనినైన సహనము తోడ
  జరుప మొదలిడి యతనము జాస్తి జేయ
  పరిసమాప్తి యగునపుడు పరిపరిగనె
  పురిటి నొప్పులు తప్పవు పూరుషులకు

  పురుడు = ఈర్ష్య (ఇతరుల ఓర్వమి)
  నొప్పులు = బాధలు

  రిప్లయితొలగించండి
 11. సుఖముల్ దుఃఖవిధాయకమ్ములగుచున్ శోచ్యస్థితిన్గూర్చి, స
  మ్ముఖునిం జేయుచు పాపకర్మలకు వ్యామోహాంధకారమ్ములో,
  సఖియా! నిర్మలభక్తిలభ్యమగు మోక్షాప్తిన్నిరోధించు త
  త్సుఖ సంపత్తులు లభ్యమయ్యె ననుచున్ శోకింప నొప్పున్ దగన్

  రిప్లయితొలగించండి
 12. ఆడ పిల్లకు మగనిని కూడ బెట్ట 
  అష్ట కష్టాలు పడుగాదె ఆమె తండ్రి 
  ఆడ పిల్లను కనగను అవనియందు 
  "పురిటి నొప్పులు తప్పవు పూరుషులకు"  

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'కనగను+అవని' అన్నపుడు సంధి నిత్యం. విసంధిగా వ్రాయరాదు. "కనగానె యవనియందు" అనండి.

   తొలగించండి
 13. మైలవరపు వారి పూరణ


  సరసక్రీడలఁ దేలునప్పుడు రతిశ్రాంతత్వమున్ పొంది.,త...
  ద్వరమై గర్భముదాల్చ భార్య., మురిపింపన్ ప్రయత్నించి.,దు...
  ష్కరమౌ ఆర్థికబాధ డెందమున మ్రింగంజూచి యేకాకులై
  పురుషుల్ పొందెద రెప్పుడున్ బురిటినొప్పుల్ దప్పదీభూమిపై!!

  మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మైలవరపు వారి పూరణ ప్రశస్తంగా ఉన్నది.
   రెండవ పాదంలో గణభంగం.

   తొలగించండి
  2. శ్రీ కంది వారికి వేవేల వందనములు 🙏

   మురిపింపంగన్ బ్రయత్నించి... అని ఉండాలి...

   సరసక్రీడలఁ దేలునప్పుడు రతిశ్రాంతత్వమున్ పొంది.,త...
   ద్వరమై గర్భముదాల్చ భార్య., మురిపింపంగన్ ప్రయత్నించి.,దు...
   ష్కరమౌ ఆర్థికబాధ డెందమున మ్రింగంజూచి యేకాకులై
   పురుషుల్ పొందెద రెప్పుడున్ బురిటినొప్పుల్ దప్పదీభూమిపై!!

   మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

   తొలగించండి
 14. రాణి వానాన వసియించు రాణికైన
  తల్లి గావలె ననుకొన్న తరుణమందు
  పురుటి నొప్పులు తప్పవు, పూరుషులకు
  తెలియ రాదయ్యె నీబాధ యిలను జూడ.

  రిప్లయితొలగించండి
 15. అరటి కూరను తినగోరి యావ గలిపి
  వండి తినబెట్ట సతికేమొ మెండు గాను
  తినక కానుపు కఠినము తీవ్ర మవగ
  పురిటి నొప్పులు తప్పవు పూరు షులకు

  రిప్లయితొలగించండి
 16. వనిత తల్లియగుటకు నీ వసుధపైన
  పురిటి నొప్పులు తప్పవు, పూరుషులకు
  సాధ్య మగునె వంశము నిల్పు సంతు బడయ
  స్త్రీలు సహకరింపక మరు కేళిలోన

  రిప్లయితొలగించండి

 17. జీపీయెస్ -
  వాట్సప్ సమూహములో పండితుల ఆజ్ఞ:
  (కంది సారు పట్టించుకొనరు )


  పద్య పూరణ చేయుచు పాట్లు పడుచు
  కథలకా జిమిక్కులు సమకట్టు చేసి
  యాఖరుని పాదమదె శోభలలర చేయ
  పురిటి నొప్పులు తప్పవు పూరుషులకు!  జిలేబి

  రిప్లయితొలగించండి


 18. పాదాంతము గా కైపదము కావాలన్న జీపీయెస్ వారి " ఆజ్ఞ " ననుసరించి స్వల్ప అడ్జస్ట్ మాడి :)


  గరితల్ కాదని త్రోయ వీలగునకో కర్పూరగన్ధీ జిలే
  బి!రహస్యమ్ము విధాత రాత యిది శోభిల్లంగ నారీమణుల్
  కరుణా మూర్తులు తల్లులై వెలుగగా కల్యాణమై, తోడవన్
  పురుషుల్, పొందెద రెప్పుడున్ బురిటినొప్పుల్ దప్పదీ భూమిపై!  జిలేబి

  రిప్లయితొలగించండి


 19. ఏమండోయ్ కంది వారు

  నిన్నటి పద్యము సరియా లేదా తెలుపగలరు - చాలా కుస్తీల్ పట్డి పేర్చి నది సవరణ తెలిపినచో నేర్చి మరిన్ని జిలేబీలను వేయుటకు ప్రయత్నము చేసెద :)

  మఖవంతజాలమహిమా
  దిఖలుసువర్ణమిళితబృహదితిగణితమహా....

  రిప్లయితొలగించండి
 20. రాజధానికి పొలములు రాసియిచ్చి
  నేతజేసినతీరుతో నెయ్యముడిగి
  వీధికీడ్చిన నేతల వీపుబగులు
  పురిటినిప్పులు తప్పవు పూరుషులను

  రిప్లయితొలగించండి
 21. తల్లి కావలె నన్నచో తరుణి కిలను
  పురుటి నొప్పులు తప్పవు :పూ రు షుల కు
  నా ర్థి కంబగు స్తోమత లవ స రంబు
  వైద్య ఖర్చులు భరియింపఁ వలసి నపుడు

  రిప్లయితొలగించండి
 22. సరసపు జిలుగులన్జిమ్ము సత్కృతులను
  నలుగురు గురుతించుచునింపన రచియింప
  గల్గు పుంభావగీర్వాణి కవులకిలను
  పురిటి నొప్పులు తప్పవు పూరుషులకు

  రిప్లయితొలగించండి
 23. సత్యభామకు కృష్ణుడు చరణములను
  పట్టుకొని శాంతి కలిగించె- పట్టు వీడి
  లేమ విహరించె సంతోష సీమ యందు
  పురురుటి నొప్పులు తప్పవు పూరుషునకు.

  రిప్లయితొలగించండి
 24. కార్యనిర్వాహకులకెప్డుగలుగు శ్రమము
  పూర్తియగునంతవరకునునార్తివిడదు
  బాధ్యతానిర్వహణమందుసాధ్యపడక
  పురిటి నొప్పులు తప్పవు పూరుషులకు

  రిప్లయితొలగించండి
 25. సరితూగున్ గద మల్లియల్ తనకు తత్సౌగంధ్యలాలిత్యముల్

  ధరియించెన్ తొలి గర్భమున్
  ముదిత బాధన్ సైపనెట్లోర్చునో...

  హరి ! నీవే కరుణించవాడవని
  తామాందోళనన్ చెంది సత్

  పురుషుల్ పొందెదరెప్పుడున్ పురుటినొప్పుల్ దప్పవీభూమిపై.

  ��లోకాజగన్నాథశాస్త్రీ��

  రిప్లయితొలగించండి
 26. కొత్త కాపుర మూరించు కోరికలనె
  యింటి వసతికిని మఱియు నితరములకు
  పదుల సంఖ్యలో నుండును పనులు పాట్లు
  పురిటినొప్పులు దప్పవుపూరుషులకు

  రిప్లయితొలగించండి
 27. క్రొవ్విడి వేంకట రాజారావు:

  మానవాళికి శుభమిడు మనసు కలిగి
  పెనుపు గూర్చుచు వారికి పెచ్చులిచ్చు
  సవ్య పథకమ్ము లల్లెడి సమయమందు
  పురిటి నొప్పులు తప్పవు పూరుషునకు.

  రిప్లయితొలగించండి
 28. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

  రిప్లయితొలగించండి
 29. క్రొవ్విడి వేంకట రాజారావు:

  పద్యరచన చేయదలచు భావ మమరి
  పరుషమౌ గణ యతి సూత్ర బంధములవి
  నభ్యసించి చెలగు తరుణమ్ము నందు
  పురిటి నొప్పులు తప్పవు పూరుషునకు.

  రిప్లయితొలగించండి
 30. క్రొవ్విడి వేంకట రాజారావు:

  ముఖమున హృషి జూపె నతడు
  సుఖసంపద లందెనంచు; శోకింప దగున్
  సుఖమిడు విభవము నతడే
  సఖునకు కలిగింపలేని సమయమునందున్.

  గురువు గారికి నమస్కారములు. పై నిన్నటి పూరణను పరిశీలించ గలరు.

  రిప్లయితొలగించండి
 31. కావ్య రచనకు బూనిన గలుగుసుమ్ము
  భావసంపద గణములబంధమనెడు
  పురిటినొప్పులు తప్పవుపూరుషులకు
  నటుల యింతులకునుధర నార్య గాదె!

  రిప్లయితొలగించండి
 32. అందరికీ నమస్సుమాంజలి 🙏🙏
  నా మరో పూరణ 🌹🌹
  *తే గీ::*

  తరుణి మణులిల మెరియగ ధరణి నేల
  పురుష పుంగవులు వడకి యూపిరి విడ
  బెరుఁగు తోడుగ నడుగులు వెనుక వేయ
  *పురిటి నొప్పులు తప్పవు పూరుషులకు*
  🙏🌹🙏🌹🙏

  రిప్లయితొలగించండి
 33. తేటగీతి
  ఎన్నికల యూబిలో దిగి మన్నుకఱచి
  యోటు తాడుతో గట్టుపై చోటు కొఱకు
  కలిమి పంచఁగ ఫలితంపు జలదరమున
  పురిటి నొప్పులు తప్పవు పూరుషులకు

  రిప్లయితొలగించండి
 34. పెట్ట వలెనన్న నుత్పత్తి వేశ్మ తతులు
  యంత్ర చాలన మ్మింక భృత్య సముపార్జ
  నమ్ము పాలక జన సమ్మతమ్ము లనఁగఁ
  బురిటి నొప్పులు తప్పవు పూరుషులకు


  వరమై యొప్పును మాతృ భావ మిల సంభావ్యమ్ము సంసార సా
  గర లబ్ధోత్తమ రత్న రాజములు నిక్కంబీ శరీరోద్భవుల్
  తరుణీ రత్నము లం,గ జార్దిత మనస్తా పార్తులై చేరఁగాఁ
  బురుషుల్ పొందెద రెప్పుడున్ బురిటి నొప్పుల్ దప్ప దీ భూమిపై

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. తరుణీ రత్నము లంగ జార్తలు మహత్సంయోగ కేళీ మహా
   పురుషల్ అనవలసి రావడముతో విరమించాను.

   తొలగించండి
 35. నా పేరుతో పూరణ జేసిన జిలేబి గారికి హృదయ పూర్వక ధన్యవాద సహిత నమస్సులతో 🙏🙏🙇‍♂🙇‍♂

  *తే గీ:*

  పూరణ నెరుగని కవులెవురుర నిచట
  పురిటి నొప్పులు తప్పవు, పూరుషులకు
  నేల, దొరుక పూరణలు జిలేబియముగ
  పేరును కలుప మనకది ప్రేరణ గద


  (అన్వయము కుదిరినదో లేదో తెలియక వచ్చెను గదా పురిటి నొప్పులు..)😀😀

  *కళ్యాణ్ చక్రవర్తి, ముంబాయి**
  🙏🙏

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. పలువురు కవులిచట తెలుపంగ నాకు
   ఆలొచించెడి యట్టి యవసర మేల
   నిగ్గు తేల్చి చెబితిరిగ నిజమని యది
   పురిటి నొప్పులు తప్పవు పూరుషులకు
   🙏🙏

   తొలగించండి
 36. వరమౌ సంతు జనించుటీ పుడముపై వంశమ్మునిల్పన్ సదా
  తరుణుల్ పొందుచు నుందురెప్పుడయినన్ తాపమ్మునా సృష్టిలో
  పెరుగన్ వైద్యపు ఖర్చు లన్ని కొనగా విత్తమ్ము శీఘ్రమ్ముగా
  పురుషుల్ పొందెద రెప్పుడున్ బురిటినొప్పుల్ దప్ప దీభూమిపై

  రిప్లయితొలగించండి
 37. రిప్లయిలు
  1. మత్తేభవిక్రీడితము
   మురిపెమ్ముల్ కలబోసినంత వలపుల్ పూయంగ, సంతానపున్
   స్మరణన్ దేలుచు నూహలందు నవమాసమ్ముల్ సమీపించి సీ
   జెరియన్ తప్పదటంచు వైద్యుడనినన్ జెల్లించు మూల్యమ్ముకై
   పురుషుల్ పొందెద రెప్పుడున్ బురిటినొప్పుల్ దప్ప దీభూమిపై!

   తొలగించండి
 38. మ:

  తరుణుల్ పొందన బిడ్డ పుట్టుకన తద్వత్తైన సంవేదనల్
  తరుణం బూనగ దెచ్చు కోవలయు తాదాత్మ్యంబు కర్మంబుగా
  పరిణామంబగు కష్ట సాధ్యముల సాఫల్యంబు సిద్ధింపగన్
  పురుషుల్ పొందెదరెప్పుడున్ పురిటి నొప్పుల్ దప్పదీ భూమిపై

  వై. చంద్రశేఖర్

  రిప్లయితొలగించండి
 39. *విరజ అనే స్త్రీతో నొకడు చెప్పేమాటలుగా*

  విరజా! స్త్రీలకు నొక్కసారెగద యాబీలమ్మదే కాన్పులో
  పరివారమ్మును సాకువానికిలలో పాట్లెన్నియో గాంచగన్
  ధర సంసారమె సాగరమ్మదిగదా! తానీద గానిత్యమున్
  బురుషుల్ పొందెద రెప్పుడున్ బురిటినొప్పుల్ దప్ప దీభూమిపై

  రిప్లయితొలగించండి
 40. బిడ్డ డడ్డముతిరుగగభీతిజెంది
  ఇంటిదైవమునెన్నుచు యిహముమరచి
  కంటనీరది కరుగకగకరుడుగట్టు
  పురుటినొప్పులుదప్పవు పూరుషులకు
  ++++++++++++++++++++
  రావెలపురుషోత్తమరావు

  రిప్లయితొలగించండి
 41. క్రొవ్విడి వేంకట రాజారావు:

  సరవిన్ గూడిన రీతినిన్ సుఖము లొసంగు ననేకమ్ములౌ
  సిరులందించు ప్రణాళికల్ ఘనముగా జేసి జనాకర్షణన్
  వరుసన్పొందగ గోరుచున్ ప్రజకు నుపాస్తిని సాగించుచో
  పురుషుల్ పొందెద రెప్పుడున్ బురుటి నొప్పుల్ దప్పదీ భూమిపై.

  రిప్లయితొలగించండి
 42. ..............🌻శంకరాభరణం🌻...............
  ..................🤷🏻‍♂సమస్య 🤷‍♀....................
  "పురిటి నొప్పులు తప్పవు పూరుషులకు"

  సందర్భము:ఉత్తర రామాయణంలో రాముడు లక్ష్మణ భరతుల కీ కథ చెప్పాడు.
  ..చంద్రశేఖరుడు
  గిరిజా సమేతుడై క్రీడానురక్తి
  చరియింప దలచి యా చపలాక్షికొరకు
  పరిచరులును తాను భామినీ మూర్తు
  లరుదార ధరియించి..
  (రంగనాథ రామాయణం ఉ.కాం.)
  గౌరి కోరికతో శివుడు స్త్రీ రూపం దాల్చి శరవణభవుడు జన్మించిన వనంలో గౌరితో నివసిస్తున్నాడు. అక్కడ పశు పక్ష్యాదులూ స్త్రీలే! ("తెలియ కిం దెవ్వ రేతెంచిన వారు వనితలై వసుధపై వర్తింతు" రన్నాడు శివుడు.)
  తెలియక ఇలు డనే రాజు ఆ వనంలోకి వేటకు వెళ్ళాడు. అతడు, అనుచరులు స్త్రీలైపోయారు. రాజు శివుని వేడుకుంటే "అది తప్ప ఇంకొక టడుగు" అన్నాడు.
  రాజు పార్వతిని ప్రార్థించినాడు. "ఎన్నాళ్లు స్త్రీగా వుంటావో అన్నాళ్ళు పురుషునిగా వుంటావు. ఎన్నాళ్ళో కోరుకో" అని కొంత సడలించింది. "ఐతే ఒక నెల స్త్రీగా ఒక నెల పురుషునిగా వుండేట్టు అనుగ్రహించు" మన్నాడు రాజు. పార్వతి "సరే!" నన్నది.
  "ఇల"గా మారిన "ఇలుని" మోహించినాడు చంద్రుని పుత్రుడైన బుధుడు.
  ఇల రాజుయొక్క సఖులు సఖులై ఇలా అన్నారు..
  "సకియలైతే పురుషులకు పురిటినొప్పులు తప్పవు గదా! (ఎప్పుడో ఒకసారి ఏ పురుషునివల్లనో గర్భవతి కావలసివస్తుంది.)

  సఖులు = సఖులు
  (సఖుడు.. కు బహువచనం)
  సఖులై = సఖులై
  (సఖి..కి బహువచనం)
  సకియ = స్త్రీ
  ~~~~~~~~~~~~~~~~~~~~~~~
  సర్వమంగళతోడ చంద్రశేఖరు డుండు
  నామె కోరిక దీర నతివ యౌచు
  నయ్యడవిని జీవు లందరు నతివలే!
  ఎఱుగక జొరె నందు "నిల నరపతి"
  వేటకై.. మారెను వెలదిగా.. వేడగా
  శివు డియ్యకొనడయ్యె, శివ నడిగెను..
  "ఎన్నాళ్ళు సతి వౌదు వన్నాళ్ళు మగవాడ
  వౌదు..వెన్నాళులో యడుగు" మనియె..
  "నొక మాస మతివగా నొక నెల మగవాడ
  నై యుందు" ననె.. "తథా" స్తనియె గౌరి..
  రా జయిన "యిలు" డైనాడు రాణి "యిల"గ..
  మోజు పడె బుధుం.. డా "యిల"రాజుయొక్క
  సఖులు సఖులై పలికి రిట్లు "సకియలైన
  పురిటి నొప్పులు తప్పవు పూరుషులకు"

  ✍️~డా.వెలుదండ సత్యనారాయణ
  పరమార్థ కవి
  13.01.20
  -----------------------------------------------------------

  రిప్లయితొలగించండి
 43. తరుణుల్ నీరముబోసికొందిరనువార్తన్ ,మోదమున్ దాముగా
  పురుషుల్ పొందెదరెప్పుడున్ ,పురుటినొప్పుల్ దప్పదీభూమిపై
  యరయన్ స్త్రీలకుగర్భమున్గలుగ,నిందాశ్చర్యమేలేదుగా
  వరదామోదర!వింటివాయిదియయప్పారావుజెప్పెన్సుమా

  రిప్లయితొలగించండి
 44. తరమే?యెవ్వరికైన యీ భువిన నే తాటించగామేరువున్
  వరమైనిల్చుటదన్నసత్యమవు సంవాదంపు సం రంభమున్
  కొఱతల్ మెండవు ,కోరుకోర్కెలవియే కొండాడగా జూచుచో
  పురుషుల్, పొందెద రెప్పుడున్ బురిటినొప్పుల్ దప్పదీ భూమిపై!

  రిప్లయితొలగించండి
 45. తిరమై సంపదలెట్లు నిల్చునిల యేతీర్ధమ్ములన్ జేసినన్
  కొరతైయుండును కోర్కె తంపటులవే కోర్కెల్ పిసాళించుచో
  కరమున్ దాల్చగనెట్లు సాధ్యమవు,రా కాంక్షల్ మదిన్ గాల్చుచో
  పురుషుల్, పొందెద రెప్పుడున్ బురిటినొప్పుల్ దప్పదీ భూమిపై!

  రిప్లయితొలగించండి
 46. జన్మ నొసగవలయునన్న సక్రమముగ
  తల్లికెప్పుడు సహజము ధరణి యందు
  పురిటి నొప్పులు,తప్పవు,పూరుషులకు
  చదువు సంతుకు నేర్పంగ చక్కగాను

  రిప్లయితొలగించండి
 47. వేటకు వెడలి రాజది వెదుకులాడె
  దప్పికగొని పాయసమును త్రాగెనదియె
  శివవరమబున మాంధాత శిశువును గనె
  పురిటి నొప్పులు తప్పవు పూరుషులకు

  రిప్లయితొలగించండి
 48. తరుణి యొప్పుగ గర్భమ్ము దాల్చినంత
  పురిటి నొప్పులు తప్పవు; పూరుషులకు
  పరమ సంతోషమే గాని వంశవృద్ధి
  బరువు బాధ్యత దప్పునే వారలకును

  రిప్లయితొలగించండి