4, ఫిబ్రవరి 2020, మంగళవారం

సమస్య - 3271 (కలు సేవింపుఁడని...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"కలు సేవింపుఁడని గాంధి గణ్యుం డయ్యెన్"
(లేదా...)
"కలు సేవింపుఁ డటంచు గణ్యతఁ గనెన్ గాంధీ మహాత్ముం డిలన్"

96 కామెంట్‌లు:

  1. అందరికీ నమస్సులు 🙏🙏
    సరదా పూరణ ..

    *కం||*

    తలచిరి పలువురు సతులున్
    తలచిరి తడబడు పతులను త్రాగుచు నుండన్
    పిలచిరి చెప్పగ నిట చుర
    *"కలు సేవింపుఁడని, గాంధి గణ్యుం డయ్యెన్"*

    *కళ్యాణ్ చక్రవర్తి, ముంబాయి*
    🙏🌸🙏🌸🙏

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అందరికీ నమస్సులు 🙏🙏
      *అందరికీ విద్య*

      *కం||*

      పలువురు చదువగ దేశము
      వెలుగుల తోడవిరజిల్లు వేవిధములుగన్
      నిలలో నిజమిది యన పలు
      *"కలు సేవింపుఁడని గాంధి గణ్యుం డయ్యెన్"*

      *కళ్యాణ్ చక్రవర్తి, ముంబాయి*
      🙏🌸🙏🌸🙏

      తొలగించండి
    2. మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
      మొదటి పూరణలో సతుల చురలకు, గాంధీకి సంబంధం?
      రెండవ పూరణలో "వేవిధములుగా నిలలో..." అనండి.

      తొలగించండి
    3. ధన్యోస్మి ఆర్యా🙏, సవరణ చేసికొందును 🙏

      సంబంధం అంటే మద్యం సేవించతగదని బాపూజీ మాటగా ఆర్యా 🙏🙏

      తొలగించండి

  2. నడిరేయి సరదా పూరణ:

    "Simple Living High Thinking":

    తలపుల్ తిండిని త్రాగుటందు విడుచున్ ధర్మంబునన్ త్రిప్పుచున్
    పలుకుల్ సత్యమహింసనందు నిడుచున్ వైరాగ్యమున్ పెంచుటన్
    విలువౌ సన్నని బియ్యమున్ కొనకనే వేయించి చల్లార్చి నూ
    కలు సేవింపుఁ డటంచు గణ్యతఁ గనెన్ గాంధీ మహాత్ముం డిలన్

    రిప్లయితొలగించండి

  3. ఆటవిడుపు సరదా పూరణ:
    (జిలేబి గారికి అంకితం)

    "Simple Living High Thinking":
    (Modern Style)

    తలపుల్ తిండిని త్రాగుటందు విడుచున్ తాదాత్మ్యమై నెన్నికన్
    పలుకుల్ కాంగ్రెసు నీతులందు నిడుచున్ వడ్డించుచున్ మోడినిన్
    విలువౌ విస్కిని వైనునున్ కొనకనే ప్రీతంపు కాటేజిదౌ
    కలు సేవింపుఁ డటంచు గణ్యతఁ గనెన్ గాంధీ మహాత్ముండిలన్

    రిప్లయితొలగించండి
  4. తలచెను యీసుం డొకపరి
    మలచగ లోకంబు లెల్ల మైకము నుండన్
    విలవిల లాడెను సురలట
    కలు సేవింఁపుఁడని గాంధి గణ్యుండయ్యెన్

    రిప్లయితొలగించండి
  5. పలురకముల దొరకెడు శన
    గలు సేవింపుఁడని గాంధి గణ్యుం డయ్యెన్
    కలల విహరింప జేసెడి
    తలపులనిడు నోటనమలు తరుణము నందున్

    రిప్లయితొలగించండి
  6. ( మన సోదరరాష్ట్ర ముఖ్యమంత్రి తన
    ప్రజలతో )
    " కలిగెన్ గాంధిని బోలు నావలన నిం
    కన్ రాష్ట్రమే మీకు ; మీ
    కలలే పండెను ; రండు రం" డనుచు మూ
    గన్ బల్కెగా కేసియార్
    " కలు సేవింపు "డటంచు ; గణ్యత గనెన్
    గాంధీమహాత్ముం డిలన్
    "కలు సేవింపకు"డంచు భారతమహా
    కారుణ్యపాథోధియై .

    రిప్లయితొలగించండి
  7. విలువిద్యలేమి యెరుగడు
    కలుషపుమార్గములులేవు కల్లలు లేవే
    సులువుగ జీర్ణించెడునూ
    కలుసేవింపుడని గాంధిగణ్యుండయ్యెన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      "జీర్ణంబగు నూకలు..." అంటే బాగుంటుందేమో?

      తొలగించండి
    2. విలువిద్యలేమి యెరుగడు
      కలుషపుమార్గములులేవు కల్లలు లేవే
      సులువుగ జీర్ణంబగు నూ
      కలుసేవింపుడని గాంధిగణ్యుండయ్యెన్
      ------------------------------
      [సవరణ పాఠము ధన్యవాదాలతో]

      తొలగించండి
  8. మనది పేద దేశము డబ్బున్నవాడు పంచ భక్ష్య పరమాన్నములు భుజించి లేని వాడు పస్తులతో చచ్చిపోతే దేశ ప్రగతి కుంటు బడుతుంది. అందువల్ల. డబ్బు న్న వాడు కూడా ఇతరులతో సమానముగా నూకలన్నము తినిన ప్రజాస్వామ్య మునకు అర్దం చెప్పి న వారము అవుతాము అని చెప్పాడు గాంధి ధనవంతుల నుద్దెశించి

    (దీనిలో ఇంకో అంతరార్థం కూడా గలదు డబ్బు ఉన్నవాడు రోజు పోషక విలువలు లేని భక్ష్య ములతో భోజనము చేయ జబ్బుల పాలు అవుతారు కాబట్టి పోషక విలువలు కలిగి ని అంబలి నూకలు తీసుకున్న అనారోగ్యం దరిచేరదు అని భావన)

    కలదని వలద మృతఘటి

    కలు ,సతతము తినగరాదు కలవారెపుడున్,

    విలువగు నంబలి యును నూ

    కలు సేవింపుడని గాంధి గణ్యండయ్యెన్


    అమృత ఘటికలు = భక్ష్య విశేషములు

    రిప్లయితొలగించండి


  9. వలయును సత్యాగ్రహముల్
    వలయు నిరశనములు చూప వలెను స్థిమితబు
    ద్ధులను కనుక యంబటిపర
    కలు సేవింపుఁడని గాంధి గణ్యుం డయ్యెన్!


    జిలేబి

    రిప్లయితొలగించండి
  10. ఇల గోవులపాలందుర
    మలమందరు కాని తత్సమమ్ము సుమీ మే
    కలపాలు! నిండగా పీ
    కలు, సేవింపుడని గాంధి గణ్యుండయ్యెన్.
    - కవితా ప్రసాద్

    రిప్లయితొలగించండి
  11. ఇలలో జన్మధరిత్రికన్న ఘనమా యింకొక్కటన్యంబు మీ
    రలసత్వంబును జూపబోకుడు జనుల్ హర్షంబు చేకూరు ని
    ర్మలచిత్తంబున నేడు నావచనముల్ మన్నించుచున్ వీడి శం
    కలు సేవింపుఁ డటంచు గణ్యతఁ గనెన్ గాంధీ మహాత్ముం డిలన్.

    రిప్లయితొలగించండి
  12. ఇలలో దేవుం డొకడే
    సలుపుట రాముడు రహీము సరణుల భేదం
    బులు తప్పు లేక యరమరి
    కలు సేవింపుఁడని గాంధి గణ్యుం డయ్యెన్.

    రిప్లయితొలగించండి
  13. పలువిధ భక్ష్యము లేలర
    నలతకు మూలం బగునని నానుడి వినరే
    సుళువుగ జీర్ణంబగు పు
    ల్కలు సేవింపుఁడని గాంధి గణ్యుండయ్యెన్.

    రిప్లయితొలగించండి
  14. రిప్లయిలు
    1. హేరామ్
      వలదో యధర్మ వర్తన!
      కలిగియు సమదృష్టి నెపుడు కలిమిని లేమిన్
      వెలిగెడి మూర్తిగ రాముని
      "కలు సేవింపుఁడని గాంధి గణ్యుం డయ్యెన్"

      కలు = శిల

      తొలగించండి
  15. ఇలపై సత్యము వీడక
    కలకాలము మనుచు జనులు కరుణాపరులై
    మెలగఁగ సతతంబు ను మొల
    కలు సేవింపు డ ని గాంధి గణ్యుo డయ్యెన్

    రిప్లయితొలగించండి
  16. మైలవరపు వారి పూరణ

    శంకరాభరణం.. సమస్యాపూరణం..

    కలు సేవింపుఁ డటంచు గణ్యతఁ గనెన్ గాంధీ మహాత్ముం డిలన్ !!

    కలితార్యాతులసేవనశ్రవణలక్ష్యార్థమ్ము., దీవ్యన్మహో...
    జ్జ్వలసత్యామలమార్గబోధకహరిశ్చంద్రీయవైశిష్ట్యమున్,
    దలపన్ గ్రామపథమ్ములున్., మధుర
    గీతాసారపుం గొన్ని చు..
    క్కలు సేవింపుఁ డటంచు గణ్యతఁ గనెన్ గాంధీ మహాత్ముం డిలన్ !!

    మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. G P Sastry (gps1943@yahoo.com)అక్టోబర్ 02, 2018 5:50 AM

      మైలవరపు వారి పూరణ

      అల సేవారతి నేర్వగా శ్రవణపుత్రాఖ్యానమున్., శాంత్యహిం...
      సల, సత్యంపు మహత్వమున్ గన హరిశ్చంద్రీయమున్ ., సుంత మే...
      నలుపుంబొంద శమంబునందుటకు గీతార్థమ్ములన్ తేనె చు...
      క్కలు సేవించుట శిష్టకార్య మనుచున్ గాంధీ యశంబున్ గనెన్ !!

      మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

      తొలగించండి
    2. మైలవరపు వారి రెండు పూరణలు అద్భుతంగా ఉన్నవి. అభినందనలు.

      తొలగించండి
  17. మిత్రులందఱకు నమస్సులు!

    "ఇలలో దేవతలౌదురయ్య సతులే! యేమాత్రమున్ వారి కు
    త్తలపాటున్ గలిగించరాదు! భువి మాతల్ గష్టముల్ వొందియున్,
    దొలఁగింపంగను జూతురయ్య! మిగులన్ బూజ్యార్హ లీ యమ్మల

    క్కలు! సేవింపుఁ!" డటంచు గణ్యతఁ గనెన్ గాంధీ మహాత్ముం డిలన్!

    రిప్లయితొలగించండి
  18. కలరా ప్లేగులు చెలగగ
    విలవిలలాడెడు జనులను వేగిరపడుచున్
    వెలినెంచక పేదల పా
    కలు సేవింపపుడని గాంధి గణ్యుండయ్యెన్

    రిప్లయితొలగించండి
  19. పలుపూజల పని లేదుగ
    సులువుగ భక్తులు సలుపరె శుభముల నొసగన్ |
    నిల రాముని నామమనెడి
    "కలు సేవింపుఁడని గాంధి గణ్యుం డయ్యెన్"

    రిప్లయితొలగించండి
  20. రిప్లయిలు


    1. కలుఁ త్రావంగ నిషేధమున్, దళితసంఘాస్పృశ్యనిర్మూలమున్,
      బలు సామాజికరుగ్మతల్ దొలగగన్ స్వాతంత్ర్యముం గోరుచున్,
      జలికిన్ మండెడు నెండకుం దగిన నశ్రాంతమ్ము చేనేత కో
      కలు సేవింపుఁ డటంచు గణ్యతఁ గనెన్ గాంధీ మహాత్ముం డిలన్

      తొలగించండి
    2. మీ పూరణ అద్భుతంగా ఉన్నది. అభినందనలు.

      తొలగించండి
  21. కలవర మైనను మనమున
    పలుచింతలుయావరించి బాధలు పెట్టన్
    కలనైన విడక శ్రీహరి
    కలుసేవింపుడని గాంధి గణ్యుండయ్యెన్

    కలు:శిల/

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'చింతలు+ఆవరించి' అన్నపుడు సంధి నిత్యం. యడాగమం రాదు. "చింతలె యావరించి" అనండి.

      తొలగించండి
  22. మత్తేభవిక్రీడితము
    బలవంతంబున బాల్యమందు మనువుల్ బాధాకరంబుల్ కదే!
    మొలకన్ పండిడ మంచు మొత్తుకొనినన్ మూర్ఖమ్ము కాదందురే?
    పలుపున్ గట్టిన వృద్ధుడున్ జనఁగ నిర్భాగ్యాన శోకించ కుం
    కలు, సేవింపుఁడ టంచు గణ్యతఁ గనెన్ గాంధీ మహాత్ముం డిలన్

    రిప్లయితొలగించండి
  23. ..............🌻శంకరాభరణం🌻...............
    ..................🤷🏻‍♂సమస్య 🤷‍♀....................
    "కలు సేవింపుఁడని గాంధి గణ్యుం డయ్యెన్"

    సందర్భము:
    జగతి విశద మంత్రం జానకీ ప్రాణ మంత్రం
    విబుధ వినుత మంత్రం విశ్వ విఖ్యాత మంత్రం
    దశరథ సుత మంత్రం దైత్య సంహార మంత్రం
    రఘుపతి నిజ మంత్రం రామ రామేతి మంత్రం
    (శ్రీ రామ కర్ణామృతం.. 54)
    అని ఆదిశంకరులు వేనోళ్ళ స్తుతించినారు.
    అట్టి రఘు పతి మీదనే ఆధారపడి జీవితా న్నర్పించుకున్న ధన్యాత్ముడు గాంధీ. అందుకే..
    రఘుపతి రాఘవ రాజారామ్
    పతిత పావన సీతారామ్..
    అని రామనామ సంకీర్తన చేసిన మహాత్ముడు గాంధీ. అంతేగాక "హే రామ్" అంటూ దివికేగిన కారణజన్ముడు గాంధీ..
    ట్రాన్స్ వాలాలో ఒకడు పొరుగు వాణ్ణి చంపి నేరంనుండి బయటపడవేయమంటే.. వేయి రూ. ఫీజు ఇస్తా నన్నా వాదించ నన్నాడు గాంధీ. అతడు వేరే లాయరును పెట్టుకొని నిర్దోషిగా బయటపడ్డాడు. చూశావా!.. అన్నాడు.
    గాంధీ ప్రశాంతంగా.. నీవు గెలుస్తా వని నాకు తెలుసు సత్యాన్ని నిజాయితీని చంపటం ద్వారా.. అన్నాడు.
    మన దేశంలోని బ్రిటిష్ వాళ్ళు చనిపోతే చంపిన వాళ్ళే పాలకులౌతారు. పాలనలో మార్పే గాని ప్రవృత్తిలో రాదు. బ్రిటిషు వారిపై విసిరిన బాంబులు వారు లే రని తెలిసినప్పుడు వారి స్థానంలో వున్న భారతీయులపైనే పడుతాయి.. అంటాడు గాంధీ అహింసను గూర్చి చెబుతూ..
    ~~~~~~~~~~~~~~~~~~~~~~~

    *గాంధీ..*

    ఇలలో రాముని చరణ
    మ్ముల సేవింపు డని, సత్యము
    నహింసయు ప్రే
    మ లనునవే యమృతపు వా
    కలు.. సేవింపుఁ డని గాంధి
    గణ్యుం డయ్యెన్ 1

    కలిలో రాముని స్మరణ
    మ్ములు ఘన సంసార రోగమును దొలగింపన్
    బల మగు నౌషధపుం గుళి
    కలు.. సేవింపుఁడని గాంధి
    గణ్యుం డయ్యెన్ 2

    ✍️~డా.వెలుదండ సత్యనారాయణ
    పరమార్థ కవి
    4.02.20
    -----------------------------------------------------------

    రిప్లయితొలగించండి
  24. పిలకలబోలుపెసరమొల
    కలుసేవింపుడనిగాంధిగణ్యుండయ్యెన్
    గలిబొలిమాటలెయనకను
    లలనలుబాటించునెడలలబ్ధులుగలుగున్

    రిప్లయితొలగించండి
  25. కందం
    విలువైనమూలికల చిగు
    రుల మేయుచు స్వాస్థ్యతనిడు రుచికరమయెడిన్
    పలచని పాలనిడఁగ మే
    కలు, సేవింపుఁడని గాంధి గణ్యుం డయ్యెన్

    రిప్లయితొలగించండి
  26. తొలగింపగ దారిద్ర్యము
    బలముగ నిలుపంగ వలయు పల్లెలనంచున్
    తలచుచు దైవనుగా నర
    కలు సేవింపుఁడని గాంధి గణ్యుం డయ్యెన్

    రిప్లయితొలగించండి
  27. పూరణము -2

    ఇలఁ గారే జను లస్పృ
    శ్యులు! సమభావమ్ము తోడ చూడుడు వారిన్!
    వలదు సుమీ హింసల పో
    కలు, సేవింపుడని గాంధి గణ్యుండయ్యెన్.
    - కవితా ప్రసాద్

    రిప్లయితొలగించండి
  28. ఇలలో నారోగ్యమ్మును
    నెలకొల్పగనొక్కదారి నిరతము మనుజుల్
    తెలివిగ పాలకొరకుమే
    కలు సేవింపుఁడని గాంధి గణ్యుం డయ్యెన్

    రిప్లయితొలగించండి
  29. కం.

    పలువిధముల మేలగుటన
    సులభము క్షీరము బడయగ శోషణ దీర్చున్
    తలుపగ తల్లికి మరు మే
    కలు సేవింపుడని గాంధి గణ్యున్డయ్యెన్

    వై. చంద్రశేఖర్

    రిప్లయితొలగించండి
  30. రిప్లయిలు
    1. మీ పూరణ అద్భుతంగా ఉన్నది. అభినందనలు.

      తొలగించండి
    2. ఆర్యా!ఇచ్చిన సమస్య మత్తేభపాదము,మీ పూరణ చంపకమాల!గమనింపగలరు!

      తొలగించండి
    3. పూరింపవలసిన సమస్య ఇది...

      "కలు సేవింపుఁ డటంచు గణ్యతఁ గనెన్ గాంధీ మహాత్ముం డిలన్"

      తలపన్ గ్రామముదాటిదీనులుదరిద్రావస్థలన్ మ్రగ్గుచున్
      వెలివేయంబడిక్షుద్వ్యథార్థులయిజీవింపంగపోరాడువా
      రలుగుర్తింప వసింతురాహరిజనారామాలెగుళ్ళౌనుపా
      కలు సేవింపుఁ డటంచు గణ్యతఁ గనెన్ గాంధీ మహాత్ముం డిలన్

      గాదిరాజు మధుసూదన రాజు

      తొలగించండి
  31. కలుషంబేమియులేనిదుగ్ధమది మేకల్ బెంచినన్ లభ్యమౌ
    విలువంగట్టగసాధ్యమామనుజులేవేళన్ విచారింప మే
    కలు గోవుల్ మనకన్నివేళలను సౌఖ్యంబున్ ప్రసాదించు మే
    కలు సేవింపుఁ డటంచు గణ్యతఁ గనెన్ గాంధీ మహాత్ముం డిలన్

    రిప్లయితొలగించండి
  32. కలుగును మత్తక్కట మతి
    చలించు మానము ధనమ్ము శాంతియుఁ గరువౌ
    కలు సేవింపకుఁడీ నూ
    కలు సేవింపుఁడని గాంధి గణ్యుం డయ్యెన్


    అల నాంగ్లేయుల శాంతి మంత్రమున సత్యా ఖ్యాగ్రహ ప్రాభవ
    మ్ముల నిశ్చేష్టులఁ జేసి చిత్రముగ సద్బోధాత్మకుండయ్యె మీ
    యిలులన్ నేయుఁడు బట్ట లెల్ల నిజ దేశీయంపు సుక్షారపుం
    గలు సేవింపుఁ డటంచు గణ్యతఁ గనెన్ గాంధీ మహాత్ముం డిలన్

    [కలు = రాయి]

    రిప్లయితొలగించండి
  33. పలు భక్ష్యంబులఁ దిన్నవారలకు సంప్రాప్తించు రోగమ్ములే
    పలురీతుల్ నిజమే గదా! కలుగగన్ స్వాస్థ్యమ్ము కై మానవుల్
    బలమారోగ్యము నిచ్చి యాయువునదే వర్ధిల్లగా జేయు పు
    ల్కలు సేవింపుఁ డటంచు గణ్యతఁ గనెన్ గాంధీ మహాత్ముం డిలన్

    రిప్లయితొలగించండి
  34. కలనైనన్ననృతమ్ము బల్కడుగ వాక్పారుష్యమున్నేర్వడే
    తలపండెవ్వరి కేనియున్ జెరుపు సత్యాన్వేషణమ్మే సదా
    బలమైనట్టివి భారతీయవిలువల్ భావింపగా తేనె వా
    కలు సేవింపుడటంచు గణ్యతగనెన్ గాంధీమహాత్ముండిలన్

    రిప్లయితొలగించండి
  35. వెలివేయుండిదె యంటరానితనమావేశించె భూతమ్మునై
    కులతత్వమ్ముల కూల్చివేయుడికపై కూర్మిన్ ప్రబోధించుడీ
    పలుగున్ పాఱయుబట్టి స్వచ్ఛతను సంపాదించగన్ *పూరిపా*
    *కలు సేవింపుఁ డటంచు గణ్యతఁ గనెన్ గాంధీ మహాత్ముం డిలన్*

    తిరుక్కోవళ్ళూరు శ్రీహర్ష

    రిప్లయితొలగించండి
  36. కలగానయ్యెనునాకుసామియిదియక్కాలంపుదగ్గట్టెయ
    క్కలుసేవింపుడటంచుగణ్యతగనెన్ గాంధీమహాత్ముండిలన్
    కలు నాయర్ధముజూడగానగుటముఖ్యంబయ్యెగాగల్లుగా
    బలవంతంబుగద్రాగువారలికనేవారుండుమానండుసూ

    రిప్లయితొలగించండి
  37. అందరికీ నమస్సులు 🙏
    *దానమే ధ్యానము*

    *కం||*

    మొలలో గోచీ ధారణ
    నిలలో కీర్తిని గడించె నిజమిది గదరా
    కలుగగ కీర్తిని పలు రూ
    *"కలు సేవింపుఁడని, గాంధి, గణ్యుం డయ్యెన్"*

    *కళ్యాణ్ చక్రవర్తి, ముంబాయి*
    🙏💐🙏💐🙏

    రిప్లయితొలగించండి
  38. పలుకుల్ ధర్మపు మార్గమై నిలెచెనే ప్రారంభమే గొప్పవన్
    ములుకుల్ గుచ్చగనేరనెప్పుడును,తామూర్ఖత్వమున్ జూపగా
    తలపుల్ శాంతిని సౌఖ్యమైగెలుచు సంతాపమ్మదే బోవగ నూ
    కలు సేవింపు "డటంచు ; గణ్యత గనెన్ గాంధీ మహాత్ముండిలన్.

    రిప్లయితొలగించండి
  39. సులభము శాంతిజపించుట
    కలతలతో క్రుంగనేల కాలమునందున్
    విలువలు వీడని మనపా
    కలుసేవింపుడని గాంధిగణ్యుండయ్యెన్

    రిప్లయితొలగించండి
  40. కలుషిత భావన లెరుగని
    విలువల విజ్ఞానపరుల వేదన జందే
    పలుదేశభక్తి గల మూ
    కలు సేవింపుడని గాంధి గణ్యుండయ్యెన్

    రిప్లయితొలగించండి