6, ఫిబ్రవరి 2020, గురువారం

సమస్య - 3273 (దుష్టులు శిష్టులౌట..)

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"దుష్టులు శిష్టులుగ మార దుఃఖింత్రు జనుల్"
(లేదా...)
"దుష్టులు శిష్టులౌటఁ గని దుఃఖముఁ బొందెద రెల్ల మానవుల్"
(డా. జి. సీతాదేవి గారికి ధన్యవాదాలతో...)

81 కామెంట్‌లు:


  1. నడిరేయి సరదా పూరణ:

    "Let Jesus guide you the right way"

    కష్టము నష్టమున్ మరచి క్రైస్తవ ధర్మపు వక్తలెల్లరున్
    పుష్టిగ రూకలన్ గొనుచు పోపును మోసము చేసి వచ్చుచున్
    దుష్టుల బ్రోచు వృత్తిగొని దూరపు దేశము భారతమ్మునన్
    దుష్టులు శిష్టులౌటఁ గని దుఃఖముఁ బొందెర రెల్ల మానవుల్

    రిప్లయితొలగించండి
  2. రిప్లయిలు
    1. ఆటవిడుపు సరదా పూరణ:
      (జిలేబి గారికి అంకితం)

      Election Time:

      దృష్టిని మంత్రిమండలిని తీరుగ నిల్పుచు, వాడవాడలన్
      సుష్టుగ బీరు పోయుచును శోకము తీర్చెడి బిర్యనిన్ భళా
      పుష్టిగ పంచి వోటరుల పూజలు చెసెడి నేతలెల్లరున్
      దుష్టులు; శిష్టులౌటఁ గని దుఃఖముఁ బొందెర రెల్ల మానవుల్

      తొలగించండి
    2. మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.

      తొలగించండి
  3. సమస్య :-
    "దుష్టులు శిష్టులుగ మార దుఃఖింత్రు జనుల్"

    *కందం**

    కష్టము తెలియని రౌడీ
    దుష్టులు తము రాజకీయ తొడుగుల తోడన్
    పుష్టిగ జేయుదు భువినని
    దుష్టులు శిష్టులుగ మార దుఃఖింత్రు జనుల్
    .....................✍చక్రి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'తాము'ను 'తము' అనరాదు. అక్కడ "తమ" అనండి.

      తొలగించండి
  4. అష్టమ బిడ్డడు వెన్నుడు
    దుష్టుల శిక్షించ గోరి దోహద పడగన్
    కష్టముల మునుగు జగతిని
    దుష్టులు శిష్టులుగ మార దు:ఖింత్రు జనుల్

    రిప్లయితొలగించండి
  5. ఇష్టపడుదు రెల్లజనులు
    దుష్టులు శిష్టులుగ మార ; దుఃఖింత్రు జనుల్
    శిష్టులు దుష్టులయినయెడ
    తుష్టులగుదు రెల్లజనులు తొలివిధమవగన్

    రిప్లయితొలగించండి
  6. (దుర్జనులను సజ్జనులనుకొని నెత్తి కెత్తు
    కొంటే జరుగుతున్నదేమిటి ?)
    నష్టము లేని పాలనను
    నాణ్యత నిండగ జేతుమంటిరే ?
    యిష్టము తెచ్చిపెట్టుకొని
    యేలగ మిమ్ముల నెన్నుకొంటిమే ?
    తిష్టను వేసి రాష్ట్రమున
    తీగల గోడలు గట్టుచుండిరే ?
    దుష్టులు శిష్టులౌట గని
    దుఃఖము బొందెద రెల్ల మానవుల్ .

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
      'చేతుము' అన్నది సాధుప్రయోగం కాదంటారు. అక్కడ "నిండ నొనర్తుమంటిరే" అందామా?

      తొలగించండి
  7. కష్టము లెన్నియో గలుగు కాలము మారగ లోకమందు నా
    డిష్టముగా వెలుంగు నిట నెల్లెడ కల్మష మార్యకోటికిన్
    జేష్ట లుడుంగు భావినని చెప్పెను బ్రహ్మము సూక్తులీగతిన్
    దుష్టులు శిష్టులౌటఁ గని దుఃఖముఁ బొందెద రెల్ల మానవుల్

    రిప్లయితొలగించండి
  8. కష్టము నిష్టురమ్ముగని,కాంక్షలదీర్చుదురంచు నమ్మగా
    ఇష్టముగాని రీతులిల ,యింతటి దుష్టులు పీఠమెక్కిరే
    పుష్టిగనున్నపాలనము,పూర్తిగమార్చిరియారునెళ్ళలో
    దుష్టులు శిష్టులౌటగని,దు:ఖముబొందెదరెల్లమానవుల్
    ++++++++++++++++++++==+++++++
    రావెలపురుషోత్తమరావు



    రిప్లయితొలగించండి
  9. కష్టమె కదరా కాంచగ
    దుష్టులు శిష్టులుగ మార, దుఃఖింత్రు జనుల్
    నష్టమపారమ్మిలలో
    దుష్టులు చెలరేగ బతుకు దుర్లభ మనుచున్

    రిప్లయితొలగించండి
  10. ఇష్టపడరె జనులందరు
    దుష్టులు శిష్టులు గ మార : దుఃఖంత్రు జను ల్
    శిష్ట లి హ లోక వాంఛలు
    దుష్టత తో బొంద నెంచ దుర్మద యుక్తి న్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. విరుపుతో మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      "శిష్టు లిహలోక..."టైపాటు.

      తొలగించండి
  11. దుష్టులు మన నాయకులై
    శిష్టులుగా మారినట్లు జీవిక దాల్చన్
    కష్టములు తరుగనందున
    దుష్టులు శిష్టులుగ మార దుఃఖింత్రు జనుల్

    రిప్లయితొలగించండి
  12. ఈ నాటి శంకరా భరణము వారి సమస్య

    దుష్టులు శిష్టులుగ మార దు:ఖింత్రు జనుల్

    ఇచ్చిన పాదము కందము నా పూరణము సీసములో


    రాయ భారమునకు వెళ్ళిన కృష్ణుడు భీష్మ పితమహునితో
    పలికిన పలుకులు

    (జ)న్మించె నసుర వం(శ)మున విభీషణుం
    (డున్), రావణాసురు(డు) ధరణిజను

    (ప)ట్టగ వలదని (వా)రించి రాముని
    (చెం)తను చేరెగా ( చె)లిమి కోరి

    (యెం)చగ నీ చర్య (నె)ప్పుడు నెల్లరి
    (స్వాం)తమ్ములన్ కడు (సం)తసము క

    (లు)గునే దుష్టులుశిష్టు(లు)గ మార, దు:ఖింతు
    (జ)నులీ జగమునందు (స)త్ప్ర వర్త

    (న)ము కలవారలు (న)యనములను మూసి
    (దు)ష్ట కార్యములకు (దో)హదమ్ము


    (ని)డగ, గాంగేయ ,తలచుము (నీ)వు నొక్క
    (మా)రు పాప పంకిలమగు (మ)నసు మార్చు
    (కొ)నుము, నీ పాండు సుతులకు (కూ)డుదలను
    (జే)యమని కృష్డుడు పలికె (చిం)త తోడ

    కూడుదల = మేలు


    రిప్లయితొలగించండి
  13. మైలవరపు వారి పూరణ

    ఇష్టము వచ్చినట్లు వచియించుచు భారతధర్మమర్మముల్
    భ్రష్టులు నీతిబాహ్యులిల రంగులబొమ్మలపెట్టెలన్ సమా...
    కృష్టధనేచ్చఁ గాముకనికృష్టులు క్రొత్తముసుంగు దాల్చగా
    దుష్టులు శిష్టులౌటఁ గని దుఃఖముఁ బొందెర రెల్ల మానవుల్

    మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మైలవరపు వారి పూరణ అద్భుతంగా ఉన్నది. అభినందనలు.

      తొలగించండి
    2. అమ్మో!అంత కోపమే!!రంగుల పెట్టెలనగా దూరదర్శనియా?
      చక్కని పూరణ!అభినందనలు అవధానిగారూ!నమస్సులు!

      తొలగించండి
  14. శ్రేష్టమటంచు రామసుధ సేవన జేయుచు మర్త్యకోటి వి
    స్పష్టతబొంద మోక్షమును సైపక రాక్షసులెల్ల ఖిన్నులౌ
    దుష్టులు శిష్టులౌటఁ గని దుఃఖముఁ బొందెద, రెల్ల మానవుల్
    స్రష్ట శరీరకర్తనిల ద్రష్టలనంగనుగొల్వ తుష్టులై

    తిరుక్కోవళ్లూరు శ్రీహర్ష

    రిప్లయితొలగించండి
  15. రిప్లయిలు
    1. నష్టవిశిష్టదాయకవినాశకదుర్గుణసంగతార్తిసం
      క్లిష్టనిరంతరాయవిజిగీషులు సజ్జను లట్లుఁ దోచినన్,
      స్పష్టత లేని మార్పుల విషాంతరకుంభపయోముఖాంచితుల్
      దుష్టులు శిష్టులౌటఁ గని దుఃఖముఁ బొందెద రెల్ల మానవుల్

      తొలగించండి
    2. మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.

      తొలగించండి
  16. భ్రష్టతనొందగ నైతిక
    నిష్ట,దురాచారులవగ నేతలు,కడువి
    స్పష్టము భూభారమెయౌ
    దుష్టులు శిష్టులుగమార దుఃఖింత్రు జనుల్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'నిష్ఠ' కదా?

      తొలగించండి
    2. ధన్యవాదములు గురుదేవా! అవును నిష్థయే! పొరపాటైనది!ట,ఠ లకు ప్రాస వేయవచ్చునా?

      తొలగించండి
  17. మిత్రులందఱకు నమస్సులు!

    దుష్టులు కష్టనష్టములఁ దోరముగా నిడుచుండి, దౌష్ట్యముల్
    స్పష్టపడంగఁ జేయుచును, సంపద లెల్లనుఁ గొల్లగొట్టఁగా,
    నష్టము లేదటంచు నిల నాయక వర్యులు వారిఁ బేర్కొనన్,
    దుష్టులు శిష్టులౌటఁ గని దుఃఖముఁ బొందెద రెల్ల మానవుల్!

    రిప్లయితొలగించండి
  18. ఉ:

    గోష్టుల జ్ఞాతమయ్యె నది గోముఖ వ్యాఘ్రపు దుష్ఠచర్యగన్
    కష్టము నెంచ శాసనము కప్పములాగుట కీడుబొందగ
    న్నిష్టము యున్న లేకయును నీప్సిత సౌఖ్యము లొందగోరుటై
    దుష్టులు శిష్టులౌట గని దుఃఖము బొందెద రెల్ల మానవుల్

    వై. చంద్రశేఖర్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'గోష్ఠుల... దుష్ట' టైపాట్లు. 'ఇష్టము+ఉన్న' అన్నపుడు యడాగమం రాదు.

      తొలగించండి
  19. నష్టము మాకని నేతలు
    దుష్టులు శిష్టులుగ మార దుఃఖింత్రు; జనుల్
    దుష్టత వీడిన వారల
    నిష్టముగా మది దలంతురిదె సత్యంబౌ

    రిప్లయితొలగించండి
  20. కష్టంబులతొలగించెద
    మిష్టంబులఁగూర్చెదమని యెందరొ నీచ
    భ్రష్ట కపట బాబాలై
    దుష్టులు శిష్టులుగ మార దుఃఖింత్రు జనుల్.

    రిప్లయితొలగించండి
  21. కథలో దుష్టులు మేకవన్నెపులులనంగ మంచివారిగా నటించుచు సాధు జనులకు కష్టములు కలిగించగా, నాటకాలు, సినిమాలు మరియు సీరియల్లు చూసే జనులెల్లరు సహజసిద్ధమైన బాధతో దుఃఖిస్తారను భావనతో....

    ఉత్పలమాల
    నిష్టగ చిత్రమున్ గనుచు, నీచులు సాధు జనంపు పంచలో
    నిష్టత మేకవన్నెపులు లింపొన గూరుచు మెల్లమెల్లగన్
    గ్లిష్టత స్వార్థచిత్తులుగ క్లేశము పంచు నటానురక్తులై
    దుష్టులు శిష్టులౌటఁ గని దుఃఖముఁ బొందెద, రెల్ల మానవుల్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'నిష్ఠగ'

      తొలగించండి
    2. గురుదేవులకు ధన్యవాదములు. సవరించిన పూరణ :

      కథలో దుష్టులు మేకవన్నెపులులనంగ మంచివారిగా నటించుచు సాధు జనులకు కష్టములు కలిగించగా, నాటకాలు, సినిమాలు మరియు సీరియల్లు చూసే జనులెల్లరు సహజసిద్ధమైన బాధతో దుఃఖిస్తారను భావనతో....

      ఉత్పలమాల
      నిష్ఠగ చిత్రమున్ గనుచు, నీచులు సాధు జనంపు పంచలో
      నిష్టత మేకవన్నెపులు లింపొన గూరుచు మెల్లమెల్లగన్
      గ్లిష్టత స్వార్థచిత్తులుగ క్లేశము పంచు నటానురక్తులై
      దుష్టులు శిష్టులౌటఁ గని దుఃఖముఁ బొందెద, రెల్ల మానవుల్

      తొలగించండి
  22. పూరింపవలసిన సమస్య ఇది...


    స్పష్టముగానెఱింగియపచారులటంచునుతామెసాక్షిగా
    దుష్టదురాగతంబులను దుందుడుకొప్పగజేయువారలౌ
    భ్రష్టులలంచగొండ్లుగుణవంతులటంచుధృవీకరింపగా
    దుష్టులు శిష్టులౌటఁ గని దుఃఖముఁ బొందెద రెల్ల మానవుల్

    (ఎలక్షన్ల సందర్భంగా అభ్యర్థుల ధృవీకరణ గురించి)
    గాదిరాజు మధుసూదనరాజు

    రిప్లయితొలగించండి
  23. దుష్టపు నేత యానతిని దుండగ మూకలు పెచ్చరిల్లుచున్
    కష్టము కల్గజేయగను కాల్చుచు కూల్చుచు పంటలన్నియున్
    ఇష్టము లేకయే ప్రభుత కిచ్చిరి భూములు రైతులెందరో
    నష్టనివారణమ్మనుచు నాణ్యపు మాటలు పల్కు చుండగా
    దుష్టులు శిష్టులౌటఁ గని దుఃఖముఁ బొందెద రెల్ల మానవుల్

    రిప్లయితొలగించండి
  24. తుష్టినిబొందుదురందఱు
    దుష్టులు శిష్టులుగమార,దుఃఖింత్రుజనుల్
    దుష్టులుశిష్టులెయగునెడ
    కష్టములొకదానివెంటకలుగునువరుసన్

    రిప్లయితొలగించండి
  25. కష్టములెన్నెదురైనను
    శిష్టులునియతివిడరుతమ శీలమునందున్
    కష్టముతీరుటకొరకై
    దుష్టులు శిష్టులుగ మార దుఃఖింత్రు జనుల్

    రిప్లయితొలగించండి
  26. కష్టములెన్నివచ్చిననుకాలమెగాలమువైచిలాగినన్
    శిష్టులుధర్మమార్గమును, శీలగుణమ్ములు వీడరెన్నడున్
    కష్టముదాపురించగనె గట్టుకుజేరగమోసబుద్ధితో
    దుష్టులు శిష్టులౌటఁ గని దుఃఖముఁ బొందెద రెల్ల మానవుల్

    రిప్లయితొలగించండి
  27. దుష్ట వచనములు విన, మా
    యిష్టపు రీతినిఁ జనంగ నెట్లుందు మిఁకన్
    నష్ట మగు ననిరి కుజనులు
    దుష్టులు శిష్టులుగ మార, దుఃఖింత్రు జనుల్


    కష్టమె యర్థ మౌట గురు కావ్యము లందలి పద్యరాజముల్
    స్పష్టము కాదె యీ నుడువు శబ్దము లింపుగఁ బేర్చి చూడు నీ
    పృష్టపు సంశయం బుడుగుఁ బేర్చుమ యుత్తర మింక నాదినిన్
    దుష్టులు శిష్టులౌటఁ గని దుఃఖముఁ బొందెద రెల్ల మానవుల్

    [పద విభజనమున నుత్తర పదము శిష్టులు మొదట నుంచ: శిష్టులు- దుష్టులు-ఔట ]

    రిప్లయితొలగించండి
  28. తుష్టినిబొందెరందఱునుదుఃఖములన్నియుదీరెనంచుగా
    దుష్టులుశిష్టులౌటగని,దుఃఖముబొందెరెల్లమానవుల్
    శిష్టులుదుష్టులైమనినచెప్పగలేమనియీతిబాధలన్
    దుష్టులదూరముంచవలెదుర్జనులౌటనుశిష్టరక్షకై

    రిప్లయితొలగించండి
  29. కందం
    స్పష్టత కొరవడ నమ్మి యు
    ధిష్టరుఁడట జూదమాడి తేజము వీడన్
    నష్టమొనర ధర్మజునకు
    దుష్టులు శిష్టులుగ మార దుఃఖింత్రు జనుల్

    రిప్లయితొలగించండి
  30. మొదట ప్రచురించిన పద్యము లో గురువుగారు సూచించిన "typo" సరి చేసి , పద్యములో కొన్ని మార్పులతో తిరిగి జత చేస్తున్నాను.

    ఉ:

    భ్రష్టులు, జ్ఞాతమయ్యె తమ పాపపు బుద్ధులు దుష్ట చర్యలున్
    కష్టము నెంచ శాసనము కప్పములాగుట కీడుబొందగ
    న్నిష్టతయున్న లేకయును నీప్సిత సౌఖ్యము లొందగోరుటై
    దుష్టులు శిష్టులౌట గని దుఃఖము బొందెద రెల్ల మానవుల్

    వై. చంద్రశేఖర్

    రిప్లయితొలగించండి
  31. దుష్టులు నేతలైననిక దోచుగ రాజ్యము నీతిదూరులై
    దుష్టులు శిష్టులౌటగని దుఃఖము బొందెద రెల్లమానవుల్
    దుష్టులు బుద్ధిమార్చుకొని తుంటరితత్వము మానివేయగా
    దుష్టులు శిష్టులౌటగని తోషమునొందెద రెల్లమానవుల్!

    రిప్లయితొలగించండి
  32. అందరికీ నమస్సులు 🙏
    *చిరు ప్రయత్నం*

    *కం||*

    దుష్టులు దుష్టులు యనుచున్
    కష్టము పెట్టుచు పదుగురు కరుణయె లేకన్
    బెష్టుగ బ్రతుక తలచియిక
    *"దుష్టులు శిష్టులుగ మార దుఃఖింత్రు జనుల్"*

    *కళ్యాణ్ చక్రవర్తి, ముంబాయి*
    🙏💐🙏💐🙏

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'దుష్టులు+అనుచు' అన్నపుడు యడాగమం రాదు. "దుష్టులటంచును" అనండి.

      తొలగించండి
    2. ధన్యోస్మి ఆర్యా 🙏🙏
      *సవరణతో*

      దుష్టులు దుష్టు *లటంచును*
      కష్టము పెట్టుచు పదుగురు కరుణయె లేకన్
      బెష్టుగ బ్రతుక తలచియిక
      *"దుష్టులు శిష్టులుగ మార దుఃఖింత్రు జనుల్"*
      🙏

      తొలగించండి
  33. దుష్టదురాత్మ చిత్తులను దుడ్డులఁ గైకొని యెన్నికటిరే
    యిష్టము తోడ నేతలుగ, హీనులు జేరి భజించినంత పా
    పిష్టులఁ నీతిమంతులుగ పేర్కొని హారతి పట్టుచుండగా
    దుష్టులు శిష్టులౌటఁ గని దుఃఖముఁ బొందెర రెల్ల మానవుల్

    రిప్లయితొలగించండి
  34. ..............🌻శంకరాభరణం🌻...............
    ..................🤷🏻‍♂సమస్య 🤷‍♀....................
    "దుష్టులు శిష్టులుగ మార దుఃఖింత్రు జనుల్"

    సందర్భము:
    "త్యజ దుర్జన సంసర్గం భజ సాధు సమాగమం.."
    అన్నారు. "దుర్జన సాంగత్యం విడిచిపెట్టు. సాధు సహవాసం చెయ్యి." గుర్తు పెట్టుకోదగిన సూక్తి యిది.
    చాలామంది అనుకోకుండానే దుర్జనులకు సన్నిహితు లౌతారు. చెడ్డవా రని తెలుసుకునే లోపుననే వారితో ఒకరకమైన అనుబంధం పెనవేసుకుంటుంది. వద్దనుకున్నా తప్పించుకోలేని పరిస్థితులు ఏర్పడుతాయి. ఇక ఏండ్ల తరబడి ఆ సహవాసం కొనసాగుతూనే వుంటుంది.
    1.రావణుని నమ్ముకొన్న పరిజనుల నడుమ సంభాషణం మొదటి పూరణం..
    "పరిజను లే మౌతారు?
    "దుఃఖిస్తారు?"
    ఎందుకంటే దుష్టులు వున్నపళంగా మంచివారిగా మారితే పూర్వాశ్రమంలో శత్రువులై అవకాశంకోసం చూస్తున్న వాళ్ళు "ఇక వీరు చేతకాక విరమించుకున్నా" రని దాడిచేసి చీల్చి చెండాడుతారు. (ఫ్యాక్షనిస్టులు నక్సలైట్ల జీవితాలే అందుకు సాక్ష్యాలు.) అందుకని ఆ జీవితాలు చివరివరకూ అలాగే వుండిపోవాలని, వుండిపోతేనే తమ పబ్బం గడుపుకోవచ్చు నని.. వారిని ఆశ్రయించిన పరిజనులు భావిస్తూ వుంటారు. వారు మారితే తమ అఘాయిత్యాలు సాగవు. అసాంఘిక కార్యాలకు అలవాటు పడివుండటంవల్ల చట్టబద్ధమైన శిక్షలనుంచి తప్పించే నాయకుడు లేకపోవడంవల్ల తలెత్తుకోలేక పోతుంటారు. (తమ మీద కూడా ఒత్తిడి పెరుగుతుంది కదా!)
    2. రావణుడి పరిజనులయొక్క భయం రెండవ పూరణం.. విభీషణుని మాటలు విని రావణుడు మారిపోతాడో ఏమో అని వారి భయం.. అందుకని రావణునితో ఇలా అంటున్నారు..
    ~~~~~~~~~~~~~~~~~~~~~~~

    *రావణ పరిజనము*

    "దుష్టులు శిష్టులు కాగా
    నిష్టము గల పరిజన మ్మ దేమి యగునొకో!"
    "కష్టమ్ముల పా లగుఁ గద!..
    దుష్టులు శిష్టులుగ మార దుఃఖింత్రు జనుల్" 1

    "శిష్టుడు తమ్ముడు చెప్పగ
    శిష్టుడవైపోదువేమొ! ఛీ! పరిజనమున్
    కష్టమ్ముల పడుచున్నది..
    దుష్టులు శిష్టులుగ మార దుఃఖింత్రు జనుల్" 2

    ✍️~డా.వెలుదండ సత్యనారాయణ
    పరమార్థ కవి
    6.02.20
    -----------------------------------------------------------

    రిప్లయితొలగించండి