13, ఫిబ్రవరి 2020, గురువారం

సమస్య - 3279 (ప్రసవించును బావ...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"ప్రసవించును బావ యింకఁ బదిదినములలో"
(లేదా...)
"నయముగ బావ యీ పది దినమ్ములలోఁ బ్రసవించుఁ జూడుమా"

66 కామెంట్‌లు:


  1. నడిరేయి సరదా పూరణ:

    రయముగ పుట్టినింటికిని లాగుకు వచ్చుచు సేవజేసితిన్
    ప్రియముగ పాలలో కలిపి పెక్కులు కుంకుమ పూలనిచ్చితిన్
    నియమపు తొమ్మిదౌ నెలలు నిండగ నేటికి నాదు చెల్లెలే
    నయముగ బావ! యీ పది దినమ్ములలోఁ బ్రసవించుఁ జూడుమా

    రిప్లయితొలగించండి

  2. ఆటవిడుపు సరదా పూరణ:
    (జిలేబి గారికి అంకితం)

    అమిత్ షా నరేంద్ర మోడితో:

    భయమును వీడి పోరుచును భండన మందున హస్తినమ్మునన్
    జయమును పొంది మఫ్లరును చక్కగ సర్దుచు గుండు మీదనున్
    ప్రియముగ మెండు మంత్రులను పిల్లిని పోలుచు కేజ్రివాలహో
    నయముగ బావ! యీ పది దినమ్ములలోఁ బ్రసవించుఁ జూడుమా

    రిప్లయితొలగించండి
  3. విసుగొందనేల! అక్కకు
    మాసమ్ములు తొమ్మిదియును మళ్ళినవిగదా
    పసిడిన్బోలెడు శిశువును
    ప్రసవించును బావ, యింకఁ బదిదినములలో"

    రిప్లయితొలగించండి
  4. వసుమతికి నెలలు నిండెను
    వసతిని సమకూర్చు కొనుట బాద్యత కాగా
    వసపోయగ పసి వానికి
    ప్రసవించును బావ యింకఁ బది దినములలో

    రిప్లయితొలగించండి
  5. శంకరాభరణం... 13/02/2020 ,బుధవారం

    సమస్య.
    *******

    "ప్రసవించును బావ యింకఁ బదిదినములలో"

    నా పూరణ.
    ** *** ***** కం!!

    విసుగు వలదయ్య ..విను..నీ

    దు సతికి నిండెను శుభముగ తొమ్మిది నెలలే!

    పసిడివలె మెఱియు శిశువునె

    ప్రసవించును బావ... యింక బదిదినములలో

    .🌱 ఆకుల శాంతి భూషణ్ 🌱
    🌷 వనపర్తి 🌷

    రిప్లయితొలగించండి
  6. (మొదటిసారిగా తండ్రి కాబోతున్న శ్రీకరుడు తన బావమరది శ్రీకరునితో
    పలికిన పలుకులు ; అతని ప్రతివచనం )
    " అయినవి మాసముల్ పదియు ;
    నామెకు నొప్పులు రావు ; గుండె లో
    నయినది చింతకున్ ; జటిల
    మైనది యాఫిసువర్కు ; లీవులున్
    సయితము లేవికన్ ; కఠిన
    శాసను డచ్చట బాసు ; శ్రీధరా ! "
    " నయముగ బావ ! యీ పది ది
    నమ్ములలో బ్రసవించు జూడుమా ! "
    ( నయముగ -సుఖముగా ; బాసు - అధికారి )

    రిప్లయితొలగించండి
  7. బసవయ్య కూతు రొక్కతె
    ముసలిని పెండ్లాడె నయ్యొ మురిపము తో నా
    కుసుమకు పొద్దులు నిండెను
    ప్రసవించును, బావ యింకఁ బదిదినములలో.

    రిప్లయితొలగించండి


  8. పిసరంతయు సందియ మా
    బసిపై వలదు కడిమి గల పసిడి కళుకుతో
    డసలు సిసలైన పిల్లను
    ప్రసవించును బావ, యింకఁ బదిదినములలో!


    జిలేబి

    రిప్లయితొలగించండి

  9. మైలవరపు వారి పూరణ

    శ్రీకృష్ణార్జునీయం...

    క్రియ మదినూహ జేసిన ఫలించునె ? యత్నము జేయువానికే
    జయమగునర్జునా! చని ప్రసన్నమతిన్ మన ద్వారకాపురిన్,
    ప్రియముగ దాల్చి చూడు యతి వేషము., నీకు శుభమ్ము శ్రేయమున్
    నయముగ బావ! యీ పది దినమ్ములలోఁ బ్రసవించుఁ జూడుమా !

    మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి.

    రిప్లయితొలగించండి
  10. సమస్య :-
    "ప్రసవించును బావ యింకఁ బదిదినములలో"

    *కందం**

    పసిడి మెరుపొసగు సోదరి
    ప్రసవించును, బావ యింకఁ బదిదినములలో
    వసుధన తండ్రిగ మారును
    ముసిముసి హసనమున మీసమును దిప్పునులే
    ........................✍చక్రి

    రిప్లయితొలగించండి


  11. మయికొను తప్పకన్, వలదు మల్లడి యీశ్వరి చేర్చు దార్ఢ్యమున్
    భయమిక లేదు! జబ్బదియు ఫట్టున వీడెను పుంజుకొంచు చే
    వయు తొడరంగ సౌరి యిక బంగరు దూడను సమ్మదమ్ముతో
    నయముగ బావ! యీ పది దినమ్ములలోఁ బ్రసవించుఁ జూడుమా!


    జిలేబి

    రిప్లయితొలగించండి
  12. ..............🌻శంకరాభరణం🌻...............
    ..................🤷🏻‍♂సమస్య 🤷‍♀....................
    "ప్రసవించును బావ యింకఁ బదిదినములలో"
    "నయముగ బావ యీ పది దినమ్ములలోఁ
    బ్రసవించుఁ జూడుమా"

    సందర్భము: ఊర్మిళ పశువుల శాలకు వెళ్ళి పరిశీలించి సంతోషంతో తిరిగి వస్తుండగా అనుకోకుండా రాము డెదురైనాడు. రామ లక్ష్మణులకు జున్నుపాలంటే మహాప్రీతి అని ఆమెకు తెలుసు. అందుకని ఆమె ఇట్లన్నది.
    "ఇక తొందరలోనే ఎంచక్కా తీయని జున్ను తినవచ్చు మనం. ఎలాగంటే మన ఆవుల్లో కొన్ని యింకా పది దినాలలోనే ప్రసవించబోతున్నాయి. (ఈనబోతున్నాయి.)"
    ~~~~~~~~~~~~~~~~~~~~~~~

    *జున్ను రుచి*

    పసులఁ బరికించి రాముని
    దెసఁ గని యూర్మిళ యనె నిటు
    "తిందుము జున్నున్..
    బస గలుగు కొన్ని యావులు
    ప్రసవించును బావ! యింకఁ బది దినములలో.." 1

    భయమును భక్తియున్ గలుగు
    భామిని యూర్మిళ రాము నిట్లనెన్
    "స్వయముగ జూచితిన్ బసుల
    చక్కని జున్నుల తాగవచ్చులే!
    ప్రియమగు జున్ను మీ కనుచు
    పెద్దలుఁ జెప్పిరి.. కొన్ని ధేనువుల్
    నయముగ బావ! యీ పది ది
    నమ్ములలోఁ బ్రసవించుఁ జూడుమా!" 2

    ✍️~డా.వెలుదండ సత్యనారాయణ
    పరమార్థ కవి
    13.02.20
    -----------------------------------------------------------

    రిప్లయితొలగించండి
  13. ప్రసవమునకని జనిన సతి
    వసుమతి స్వాస్థ్యము గురించి వ్యాకుల పడగా
    బసవనికి మరిది యిటులనె:
    "ప్రసవించును బావ ! యింకఁ బదిదినములలో"

    రిప్లయితొలగించండి
  14. కసి మానుమయా కంసా
    యసిధారావ్రతము జేసి యసువులదీయన్
    పసికూనలనే! దేవకి
    ప్రసవించును! బావ యింక పదిదినములలో.

    రిప్లయితొలగించండి
  15. ఇసుమంతయు భయము వలదు కసుకందదు నీదు పత్ని కలలో నైనన్ మిసమిసలాడుచు నుండెను ప్రసవించును, బావ! యింక పదిదినములలో

    రిప్లయితొలగించండి
  16. విస విస తిరిగెడు వనితను
    వెస గర్భ వ తిని గనియును వెలుదులు బతితో
    గుసగుస లాడుచు బల్కిరి
    ప్రసరించును బావ ! యింక పది దినములలో

    రిప్లయితొలగించండి
  17. కుసుమా! దెల్పుము నక్కయె
    ప్రసవించును నెప్పుడనుచు బలికిరి వైద్యుల్?
    పసివాడికి డోల కొనుము
    ప్రసవించును బావ! యింక పదిదినములలో!!!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      "...దెల్పవె యక్కయె" అనండి. లేకుంటే నక్క ప్రసవిస్తుందన్న అర్థం వస్తుంది.

      తొలగించండి
  18. అందరికీ నమస్సులు 🙏🙏
    సమస్య : *"ప్రసవించును బావ యింకఁ బదిదినములలో"*

    *పూరణ*

    *|కం|*

    ముసిముసి నవ్వులు రువ్వగ,
    నస బెట్టక జెప్పమనిన నా మరదలు తో
    నిసి రాతిరి యనె, యక్క
    *"బ్రసవించును బావ, యింకఁ బదిదినములలో"*!

    *కళ్యాణ్ చక్రవర్తి, ముంబాయి*
    🙏💐🙏💐🙏

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. *మరో పూరణ ప్రయత్నం* 🌹🌹

      *|కం|*

      అసువులతో నటియించి, స
      రసముగ మరదలు బలుకుచు రణమును జేయన్
      నసవలదన, దెలిపె నిటుల
      *"ప్రసవించును బావ యింకఁ బదిదినములలో"*

      *కళ్యాణ్ చక్రవర్తి, ముంబాయి*
      🙏🌹🙏🌹🙏

      తొలగించండి
    2. మరో పూరణ ప్రయత్నం 🌹🌹🌹

      *కం||*

      మసలుట తెలియదు నీకును
      కసురు గొనక యక్క నిన్ను కనుగొన నిజమున్
      విసిగింపక జెప్పుమిటుల
      *"ప్రసవించును బావ యింకఁ బదిదినములలో"*
      🙏

      తొలగించండి
  19. రిప్లయిలు
    1. పార్థునితో శ్రీకృష్ణుడు

      రయమునఁ బూన్చు తేరువుఁ బరాకదియేలనొ? లెమ్ము ,బంధుసం
      చయమని, యుద్ధమేల?యని, చాపము వీడుట యోగ్యమౌన? క్ష
      త్రియకులసంభవుండవిట తేకువ జూపు,జయమ్ము చూలియై
      నయముగ బావ! యీ పది దినమ్ములలోఁ బ్రసవించుఁ జూడుమా

      తొలగించండి
  20. వసివాడనిరీతి ననుజ
    ప్రసవించును బావ యింక పదిదినములలో
    పసివాడగు భావిని దన
    యసమాన పరాక్రమమున యభిమన్యుడుగన్

    రిప్లయితొలగించండి
  21. మిత్రులందఱకు నమస్సులు!

    [మఱఁదలు తన బావతో నిండు చూలాలైన తన యక్క పది దినములలోఁ బ్రసవించి, చక్కని పసికందుతోఁ దిరిగివచ్చునని వచించు సందర్భము]

    భయమదియేల? యక్కయె శుభంకరమౌ పసివానితోడుతన్
    రయమున వచ్చుఁగాద! విసరమ్మగు కీర్తిని నీకుఁ బెంచఁగా
    స్వయముగ నేఁగుదెంచు నిఁకఁ! జక్కఁగ వేచియునుండ నక్కయే

    నయముగ బావ! యీ పది దినమ్ములలోఁ బ్రసవించుఁ జూడుమా!

    రిప్లయితొలగించండి
  22. కుసుమకు నిండెను నెలలిక
    ప్రసవించును; బావ యింకఁ బదిదినములలో
    కసుగాయకు దండ్రి యగును
    పసివానిని చంకనెత్తి పరవశుడగులే

    రిప్లయితొలగించండి
  23. నిన్నటి సమస్యకు నా పూరణ పరిశీలింప మనవి:
    (అభిమన్యుని పరాక్రమమును దుర్యోధనునికి వివరిస్తున్న భావములో)
    కదనమందున బాలునేకాకి జేసి
    గలయ జుట్టగ దా దినకరుని వోలె
    జెలగె నధిపా పిన వయసు సింగమతడు
    కనగ లేవా విజయు సుతు గరిమ నీవు

    రిప్లయితొలగించండి
  24. పసివానిని మా సోదరి
    ప్రసవించును బావ, యింక బది దినములలో!
    ప్రసరింప రహిని రావలె
    ముసిముసి నగవులు చిలుకుచు పురిటికి మునుపే!

    రిప్లయితొలగించండి
  25. పసగలిగిన నోగిరమును
    బిసరంతయువదలకుండ బ్రేమనుదినుటన్
    మిసమిసలాడగ నక్కయె
    ప్రసవించునుబావ!యింకపదిదినములలో

    రిప్లయితొలగించండి
  26. వసనమునందునె సోదరి
    ప్రసవించును బావ యింక పదిదినములలో
    వ్యసనపడగనికనేటికి
    హసనమువహియింపుమీవుహాయిగనింకన్

    రిప్లయితొలగించండి
  27. మిసమిస లాడు మెయి వెగటు
    కసవునఁ జెప్పకయుఁ జెప్పుఁ గద జున్నిఁకఁ బా
    యసము లలర మా ధేనువు
    ప్రసవించును బావ యింకఁ బదిదినములలో


    పయనము నెంచు మింక వడిఁ బన్నుగ నింటికి సంతసమ్మునన్
    భయపడ రా దొకింతయును బావ సుఖప్రసవంబ యౌను సం
    దియ మది యించు కేనియు నదృష్టమ వైద్యులు చెప్పి రక్కకున్
    నయముగ బావ! యీ పది దినమ్ములలోఁ బ్రసవించుఁ జూడుమా

    రిప్లయితొలగించండి
  28. ఈ నాటిశంకరా భరణము వారి సమస్య

    (ప్రసవించును బావ,యింకఁబది దినములలో)

    ఇచ్చిన పాదము కందము నా పూరణము సీసములో

    తెనాలి రామకృష్ణకవి వికటకవి అని తెలిసిన విషయము ఒకనాడు శ్రీ కృష్ణ దేవరాయలు రామకృష్ణ కవికి పరీక్ష పెట్టాడు. ఒక వాక్యము చెప్పాలి దానిలో ఐదు భాషలు ఉండాలి అర్ధము అన్నిటికి సమానముగా ఉండాలి ఇది ప్రశ్న వారము రోజులు గడువు ఆరు రొజులు గడిచాయి. సమస్య కు పరిష్కారము దొరక లేదు. రామ లింగ కవికి అనేక ఆవులు ఉండెడివి రక రకాల వర్ణములతో. ఒకరోజు రాత్రిపూట తుఫాను గుడ్డి దీపము మిణుకు మిణుకు మంటున్నది. ఆవుల శాల లొంచి ఆవు దీనముగా అరుస్తోమ్ది రామలింగయ్యకు వెళ్ళి చూసె ఓపిక లేక పక్కన ఉన్న మరిదిని పిలిచి చూసి రమ్మన్నాడు. అతను చూసి వచ్చి బావా ఆవు ఈనింది అన్నాడు. అప్పుడు కపిల ఆవా లేకా ఎర్ర ఆవా లేక తెల్ల ఆవా అని అడిగాడు. ఆప్పుడు అతను
    (ఏ ఆవొ రా బా వా)
    చూడలేదు అని మరల వెళ్ళి చూచి వచ్చి ఎర్ర ఆవు ఈనినది కపిల ఆవు పది రోజులలో ఈనును అని తెలుపుతాడు. ఆ పలుకు తోటి రామలింగడి బుర్ర లో విద్యుల్లత మెరుస్తుంది బావ నీ మాట నాకు చాల మేలు చెసింది రెపు రాజ ఆస్ధానములొ గెలుస్దాను అని సంతోషముతొ చెప్పు సందర్భము

    ఏ = కొంకిణి భాష లో రా అని అర్ధము
    ఆవొ = హిందిలో రా అని అర్ధము
    రా తెలుగులొ రా అని అర్ధము
    బా కన్నడములో రా అని అర్ధము
    వా తమిళములో రా అని అర్ధము

    ఆ సంధర్భము నూహించి ఈ పద్య రచన



    తెల్లావు యీనెను తెల్లవారుసమయ
    మందున, దానికి మంధి యనుచు


    పేరిడి ప్రేమతో పెంచు చుంటివి గదా!
    యిప్పు డీనెను గాదె యెర్ర పెయ్య,


    కపిల వర్ణము గల కళ్యాణి యీనునె
    పుడనుచు కలవర పడవలదు, స


    విత్రి హాళిగ (ప్రసవించును బావ, యిం
    కఁ బది దినములలో)" ఘనము గాను,


    ననుచు “యే ఆవొ రా బావ” వినుమని తెలి

    పితివి ముందుగా నీవు , ప్రాప్తించె నాకు

    నొక్క యోచన ఘనముగ , చిక్కు వీడె

    ననుచు రామలింగడు బల్కె నంద గలిగి

    మంధి = సూర్య్దుడు కళ్యాణి ,సవిత్రి = ఆవు ,
    హాళి,నంద = సంతోషము

    రిప్లయితొలగించండి
  29. చంపకమాల (పంచపాది)

    శయనము వీడవే కడుపు చల్లఁగ పండిన నాటి నుండియున్
    నియతిని ముఖ్యమౌ నడక నేరక కాన్పెటు తేలికౌ చెలీ!
    భయపడగన్ సిజేరియను వాంఛిత మంచును డబ్బుగుంజు వై
    ద్య యతనమందు లోనఁ దగ యాకటి నీవును బైట బిక్కయై
    నయముగ బావ యీ పది దినమ్ములలోఁ బ్రసవించుఁ జూడుమా!




    రిప్లయితొలగించండి
  30. నియమముదప్పకెప్పుడునునీరజనాభునిసేవజేయుచున్
    రయమునరోజులొక్కటిగరాతిరిప్రొద్దులుసాగుచుండ,దా
    నయముగబావ!యీపదిదినమ్ములలోప్రసవించుజూడుమా
    భయమునుబొందకుండుమికభార్గవిరక్షణజూచుభర్గుడే

    రిప్లయితొలగించండి
  31. దయగల వారలుండిరట దక్కును సాయమె తప్పకుండగా
    వ్యయమది భారమైన నిట వైద్యులు పెక్కురు నుండగా యికన్
    భయమును వీడుమంటి ప్రియ భామిని కిచ్చట నందు వైద్యమే
    నయముగ, బావ! యీ పది దినమ్ములలోఁ బ్రసవించుఁ జూడుమా

    రిప్లయితొలగించండి
  32. జంబ లకిడి పంబ ను అనుకరిస్తూ....

    కం.
    విసరున జన్యువు మార్పిడి
    నొసగెను గర్భము నిలుపన నుపకరణమును
    న్నసదృశ చర్యల వలనే
    ప్రసవించును బావ యింక బది దినములలో

    వై. చంద్రశేఖర్

    రిప్లయితొలగించండి
  33. పసిదా ననోయి బావా
    కసిచూపులుచూడకోయి, కలచకు మోయీ
    పసివానినొకని ఎంకీ
    ప్రసవించును బావ, యింకఁ బదిదినములలో"
    (ఎంకి నాయుడు బావల రసమయ సంసారం ఊహించి)

    రిప్లయితొలగించండి
  34. అసలు నడువ నెంచని నీ
    కు సిజేరియననుచు లోన గుంజఁగ ధనమున్
    రుసరుసల బైట బిక్కగ
    ప్రసవించును బావ యింకఁ బదిదినములలో

    రిప్లయితొలగించండి
  35. నిసిలో వలపుల ఝరిలో
    పసిడి నగవుల మరదలు సొబగుల కనులతో
    గుసగుసలాడుచు పలికే
    ప్రసవించును బావ యింకఁ బదిదినములలో

    రిప్లయితొలగించండి
  36. దసరా లోపల యక్కయు
    ప్రసవించునటంచుతెలిపె వైద్యుడు నేడే
    ‌నిసియో పగలో యెరుగను
    *ప్రసవించును బావ యింక బది దినములలో*

    మరొక పూరణ

    పసికందును నీకొసగగ
    *ప్రసవించును ,బావ యింక బదిదినములలో*
    నిసుగును అక్కయు తొలగు
    విసుగంతయు క్షణము నందె విను నామాటన్

    రిప్లయితొలగించండి
  37. వసుదేవుండని పిత, యూ
    ర్వసి యని సతి, పోరి, పేర్లు ప్రతిపాదించన్
    అసలు తెలిసె కవలలుగా
    ప్రసవించును, బావ, యింక పది దినములలో.

    రిప్లయితొలగించండి
  38. వసుదేవుండని పిత, యూ
    ర్వసి యని సతి, పోరి, పేర్లు ప్రతిపాదించన్
    అసలు తెలిసె కవలలుగా
    ప్రసవించును, బావ, యింక పది దినములలో.

    రిప్లయితొలగించండి
  39. జయమగుమీకునెల్లరకుచక్కదనంబులపట్టిపుట్టగన్
    ప్రియముగగేహమందునొకపిల్లచరించుటదెంత భాగ్యమో
    రయమునకాన్పువచ్చుసుకరంబుగనక్కకు నన్ను నమ్మవా
    నయముగ బావ యీ పది దినమ్ములలోఁబ్రసవించుఁ జూడుమా

    రిప్లయితొలగించండి