17, ఫిబ్రవరి 2020, సోమవారం

సమస్య - 3283 (రణ సంకల్పము...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"రణమే పరమార్థమందురా దూత కహో"
(లేదా...)
"రణసంకల్పము కంటె లేదు పరమార్థం బెన్నగన్ దూతకున్"
(వద్దిపర్తి పద్మాకర్ గారి చెన్నై అష్టావధానంలో సమస్య)

84 కామెంట్‌లు:


  1. పణముగ బెట్టిన దారను
    గణుతించ తరము గాదు కాలుని కైన
    న్నణకువ గలిగిన సతి కా
    రణమే పరమార్ధ మందు రాదూత కహో


    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అక్కయ్యా,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      రెండవ పాదంలో గణభంగం. "గణుతించ తరమ్ము గాదు..." అనండి.

      తొలగించండి

  2. నడిరేయి సరదా పూరణ:

    నారదీయము:

    వ్రణముల్ లేకయె రాజ్యముల్ వెలయుచున్ వాదోడు చేదోడుగా
    గణుతిన్ కెక్కగ శాంతి సౌఖ్యములతో కాట్లాడి పోట్లాడకే
    రణముల్ గానని చోటులన్ మనమునన్ రంజిల్లుటన్ లేకయే...
    రణసంకల్పము కంటె లేదు పరమార్థం బెన్నగన్ దూతకున్

    రిప్లయితొలగించండి

  3. ఆటవిడుపు సరదా పూరణ:
    (జిలేబి గారికి అంకితం)

    Afghan-Taliban-Iran-Korea etc

    ప్రణతుల్ కోరెడు దూతగా పలుకుచున్ పాకీయులే రోయగా
    క్షణమున్ మారెడు డీలునున్ తెలుపుచున్ కంగారునున్ లేపుచున్
    గణుతిన్ కెక్కిన నేతగా తలచుచున్ గర్జించెడిన్ ట్రంపుకున్...
    రణసంకల్పము కంటె లేదు పరమార్థం బెన్నగన్ దూతకున్

    డీలు = Deal (లావాదేవి)

    రిప్లయితొలగించండి
  4. రిప్లయిలు
    1. శ్రీమతి సత్యభామ బహు చిత్రముగాప్రసవించె చూ
      డగా
      నేమన రాశి కన్యకయు నింపుగ తారన స్వాతి యయ్యెనా
      వ్యోమమునందునాడు చెలువొందుచు జేరిరి వింతగా, నభో
      భామయు భామయున్ గలువ, బాలుఁడు పుట్టెను సత్యభామకున్"

      నేటిసమస్య

      పణమున ధర్మజుడోడగ
      వనముల జనిమ రలివచ్చి వైరిని గోరన్
      వనమాలినంప దూతగ
      రణమే పరమార్థమందురా దూత కహో

      గురువు గారు కృతజ్ఞతలు. సవరించిన పద్యం చిత్తగించండి

      తొలగించండి
  5. రిప్లయిలు
    1. మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
      రెండవ పూరణ... కందం రెండవ పాదాన్ని దీర్ఘాక్షరంతో ప్రారంభించారు. సవరించండి.

      తొలగించండి
  6. ( రాయబారిగా వెళ్లి ఏదో విధంగా సంధి
    జరపమంటున్న ధర్మజునితో శ్రీకృష్ణుడు )
    పణముం బెట్టితి వీవు దుర్ముఖుడు ; పా
    పాత్ముండు ; రారాజు దా
    రుణమౌ ద్యూతపు సంబరంబునకు గా
    రుణ్యంబు గోల్పోయి కా
    రణశూన్యంబుగ ద్రౌపదిన్ ; గడచె ; ధీ
    రాకారమున్ దాల్పు ; మా
    రణసంకల్పము కంటె లేదు పరమా
    ర్థం బెన్నగన్ దూతకున్ .
    (పణము - పందెము ; మారణసంకల్పము -
    సంహరణ సముద్దేశము )

    రిప్లయితొలగించండి


  7. రాయబారిగా నేగుచున్న కృష్ణునితో ద్రౌపది

    పణముగ నిడగా నాదు
    ర్వినీతు డుననుస భకీడ్చి వేధిం పంగన్
    ననిలో న చంపకనివా
    రణమే పరమార్థమందురాదూత కహో


    రిప్లయితొలగించండి
  8. రణమది లోకవినాశము
    వినయముతో విన్నవించి విద్వేషము తా
    నణచుచు నిక యుద్ధనివా
    రణమే పరమార్థమందురా దూత కహో

    రిప్లయితొలగించండి


  9. గుణమది మంచిది కావలె
    క్షణమైనను విడువక మనుగడకై ప్రేరే
    పణలన్ సంధికొరకు గుర
    రణమే పరమార్థమందు రా దూత కహో!


    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'గుర రణమే'?

      తొలగించండి


    2. గుణమది మంచిది కావలె
      క్షణమైనను విడువక మనుగడకై ప్రేరే
      పణలన్ సంధికొరకిక గు
      రణమే పరమార్థమందు రా దూత కహో!


      జిలేబి

      తొలగించండి
  10. రణము నివారణ మొనరుపఁ
    దనవిజ్ఞతను పటిమను ప్రదర్శించగ, రా
    వణునెడ నంగదుని వలె, గు
    రణమే పరమార్థమందురాదూత కహో!
    (గురణము=యత్నము)

    రిప్లయితొలగించండి


  11. గుణముల్ వర్తనముల్ విధానములు నిగ్గుల్వారగా నెప్పుడున్
    రణమే ముఖ్యము కాదటంచు విధిగా ప్రార్థించి క్షేమమ్మె ధో
    రణిగా, సంధియె ముఖ్య కారణముగా ప్రాధాన్యతన్ గూర్చు ప్రే
    రణ సంకల్పము కంటె లేదు పరమార్థం బెన్నగన్ దూతకున్!


    జిలేబి

    రిప్లయితొలగించండి
  12. మైలవరపు వారి పూరణ

    శ్రీకృష్ణుని దౌత్యమును గాంచిన కౌరవసభలోని ఒక భటుడిలా అనుకొంటున్నాడు...

    వ్రణమున్ బొడ్చెడి కాకి చందమనగా వర్ణించి సంభాషణా...
    చణుడై పాండవశక్తియుక్తుల బ్రశంసన్ జేసి., కోపాగ్నులన్
    కణమజ్జ్వాలలు రేగునట్లు పలుకన్ కౌరవ్యదైన్యస్థితిన్!
    రణసంకల్పము కంటె లేదు పరమార్థం బెన్నగన్ దూతకున్ !!

    మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

    రిప్లయితొలగించండి
  13. గుణహీనుండ్రగు కౌరవాధములు సంకోచమ్మునే వీడి స
    ద్గుణశీలాంభుది కృష్ణనట్లు సభలో కొంచెమ్మునే జేయ భీ
    షణమౌ పూనికఁ బూనితిన్ గదర నా సంవిత్తు నీడేర్పగా
    రణసంకల్పము కంటె లేదు పరమార్థం బెన్నగన్ దూతకున్

    రిప్లయితొలగించండి
  14. .... శంకరాభరణం.... 17/02/2020 ,సోమవారం

    సమస్య.
    *******
    రణ సంకల్పము కంటె లేదు పరమార్థం బెన్నగన్ దూతకున్

    నా పూరణ.
    ** *** *****

    ధర్మరాజు శ్రీ కృష్ణుని రాయభారానికి పంపుచూ.. యుద్ధము కంటె సంధియే మేలంటు... ఇలా వచిస్తున్నాడు.

    మత్తేభ విక్రీడితము :
    ***** **** ******

    రణమే నాశ మొనర్చు జీవుల సదా ప్రాణమ్ములన్ దీసి?..యా

    రణమే ధ్వంసము జేయు సంపదల... నే లాభమ్ము లేదయ్య... కా

    రణమేదైనను గాని... నే సతము గోరన్ బోరు.. బావా!... నివా

    రణ సంకల్పము కంటె లేదు పరమార్థం బెన్నగన్ దూతకున్


    🌱 ఆకుల శాంతి భూషణ్ 🌱
    🌷 వనపర్తి 🌷

    రిప్లయితొలగించండి
  15. పణముగబెట్టెనురాజ్యము
    ననుమానములేదుశకునిననబనిలేద
    ప్పణముగనందిరిధర్మజు
    రణమేపరమార్థమందురాదూతకహో

    రిప్లయితొలగించండి
  16. పని సానుకూల మొనరుప
    మని పంప, రిపుండు పరుషమో మాటలనం
    గను యుక్తాయుక్తవిచా
    రణమే పరమార్థమందు రాదూతకహో!

    రిప్లయితొలగించండి
  17. వణికించెడు జ్యాలలెగయు
    నణుబాంబులు పొంచియుండ నంతమునాపన్
    గణుతింపగ సంయమ ప్రే
    రణమే పరమార్ధమందురా దూతకహో

    రిప్లయితొలగించండి
  18. అందరికీ నమస్సులు 🙏🙏🌹
    నా పూ *రణ* ప్రయత్నం

    *కం||*

    అణిగి మణిగి నుండక మా
    రణ హోమము జేసిన, జన రక్షణ కొరకై
    గుణ పాఠము నేర్పగ యా
    *రణమే పరమార్థమందురా దూత కహో"*

    *కళ్యాణ్ చక్రవర్తి, ముంబాయి*
    🙏🌹🙏🌹🙏

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మరో పూరణ ప్రయత్నం 🌹🌹

      *కం||*

      మణి మాణిక్యములిచ్చెద
      రణ మాపగ జూడమనుచు రాజీ పడ మా
      రణ హోమమె సరియనినన్
      *రణమే పరమార్థమందురా దూత కహో"*!!

      *కళ్యాణ్ చక్రవర్తి, ముంబాయి*
      🙏🌸🙏🌸🙏

      తొలగించండి
    2. మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
      మొదటి పూరణలో "... మణగి యుండక.. నేర్పగ నా.." అనండి.
      రెండవ పూరణలో "...జూడుమనుచు" అనండి.

      తొలగించండి
  19. గుణవంతులు పాండవులను
    ఫణముమున నధర్మవిధుల వనముల కంపన్
    అణికాడే సంధికరిగె
    రణమే పరమార్థమందురా దూత కహో!

    అణికాడు-మర్మజ్ఞుడు

    రిప్లయితొలగించండి
  20. రణములు నాశ మొనర్చుచు
    వణికించుచు లోకములకు బాధలు గూర్చున్
    గుణవంతు లందు రు ని వా
    రణమే పరమార్థ మందు రా దూత క హో !

    రిప్లయితొలగించండి
  21. మిత్రులందఱకు నమస్సులు!

    [కౌరవ సభకు రాయబారిగాఁ బోవుచున్న శ్రీకృష్ణునితో ధర్మరాజు పలికిన సందర్భము]

    "గుణసంయుక్త! మురారి! కృష్ణ! యట మాకున్ వచ్చు భాగ మ్మకా
    రణ శత్రుత్వముఁ బూని, ’యీయ’ మనుచోఁ, బ్రార్థించి, యైదూళ్ళనై
    నను నిమ్మంటయె కాదె నీకు సరియౌ న్యాయమ్మగున్! యుద్ధ వా

    రణసంకల్పము కంటె లేదు పరమార్థం బెన్నఁగన్ దూతకున్!"

    రిప్లయితొలగించండి
  22. అణుమాత్రంబును వీడకుండ బహుళాహంకార భావమ్ములన్
    క్షణికానందమె శాశ్వతమ్మనుచు లోకంబందు బాంధవ్యముల్
    తృణతుల్యమ్ముగనెంచి కుందు జనులన్ దెల్పంగ సౌజన్య పూ
    రణసంకల్పము కంటె లేదు పరమార్థం బెన్నగన్ దూతకున్.

    రిప్లయితొలగించండి
  23. రణమును వారింపగ త
    క్షణమే దా రాయబారిగా మారె గదా
    గుణ సంపన్నుడు దనకున్
    రణమే పరమార్థమందురా దూత కహో

    రిప్లయితొలగించండి
  24. శ్రీ కృష్ణుడు రాయబారమునకు పోవు ముందు పాండవులతో అనినట్లుగా..

    కం:

    తృణమైనను చాలందుర !
    గణ మెంచగ సమమనుకొన కయ్యము సరియా ?
    గొణుగుట యేలన తేల్చుడి
    రణమే పరమార్థమందురా; దూత కహా

    వై. చంద్రశేఖర్

    రిప్లయితొలగించండి
  25. రిప్లయిలు
    1. శ్రీకృష్ణరాయబార సందర్భమున రారాజు సుయోధనుడు....

      కందం
      క్షణమైన మము వినరొకో!
      తృణీకరించిమముఁ బాండు తేజముఁ బొగడే
      గుణమున సంధియె? కృష్ణా!
      రణమే పరమార్థమందురా దూత కహో!!

      మత్తేభవిక్రీడితము
      క్షణమైనన్ గురురాజునే వినక మీగానాంబుధిన్ దేల్చుచున్
      దృణభావంబునఁ, బాండుపుత్రులనిలో జృంభింతురన్ రేగుచున్
      వణికించన్ భయమంది లొంగెదమె గోపాలా? విలోకించగన్
      రణసంకల్పము కంటె లేదు పరమార్థం బెన్నగన్ దూతకున్!!

      తొలగించండి
    2. మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
      'పొగడే' అనడం వ్యావహారికం.

      తొలగించండి
    3. గురుదేవులకు ధన్యవాదములు. సవరించిన పూరణను పరిశీలించ ప్రార్థన

      కందం
      క్షణమైన మము వినరొకో!
      తృణీకరించిమముఁ బాండు తేజముఁ బొగడన్
      బొనరునె సంధియె? కృష్ణా!
      రణమే పరమార్థమందురా దూత కహో!!

      తొలగించండి
  26. క్షణమొకమాటనుబలుకుచు
    నణువణువునుబాధవెట్టునరిజనమునకున్
    వణకునుగలుగుటకొఱకై
    రణమేపరమార్ధమందురాదూతకహో

    రిప్లయితొలగించండి
  27. ..............🌻శంకరాభరణం🌻...............
    ..................🤷🏻‍♂సమస్య 🤷‍♀....................
    "రణమే పరమార్థమందురా దూత కహో"

    సందర్భము: ఇంద్రజిత్తు ఆంజనేయుని బంధించి రావణ సభలోకి తీసుకువచ్చాడు. రావణుడు చంపివేయం డన్నాడు. విభీషణుడు "దూతను చంపరా" దన్నాడు. అప్పు డింద్రజిత్తు ఇలా అన్నాడు.
    "ఇతనికి కోతులకు సహజమైన గుణమే లేదు. ఏవో నాలుగు కొమ్మలు విరిచి నాలుగు పండ్లు తింటే ఏదో పోనీలె మ్మనుకోవచ్చు. పెద్ద పెద్ద చెట్లనే అకారణంగా పెకలించి పడవేసినాడు. పండ్లు తిన్న జాడ లేనే లేదు. భయంకరాకారులైన రాక్షసుల జూసి వణికిపోతా రెవరైనా. వీడు వణకడం లేదు. గింజుకోవడం వారించడం లేనే లేదు కట్టివేస్తున్నప్పుడు కూడ.
    పైగా రాక్షసవీరు లెందరినో మట్టుపెట్టినాడు. రావణు డన్నా వీడికి భయమే లేదు. ఇదొక యుద్ధోన్మాదం. యుద్ధోత్సాహమే కాని దూతకు సహజం కాదు. లోకంలో ఏ దూతా ఎప్పుడూ ఇలాంటి పనులు చేయనే లేదు.
    దూత అంటున్నారే! దూతకు పరమార్థం యుద్ధమే అంటారా! అస లితడు దూత అనే అంటారా మీరు!"
    (ఇంద్రజిత్తు మాటల సారాంశ మీ పద్యం.)
    ~~~~~~~~~~~~~~~~~~~~~~~

    *కోతి దూత*

    "గుణ మేదీ కపియే యన?

    వణకడు రక్కసులఁ జూచి, వారింపడు.. రా

    వణు డన్నను భయ మేదీ?

    రణమే పరమార్థమందురా దూత కహో!"

    ✍️~డా.వెలుదండ సత్యనారాయణ
    పరమార్థ కవి
    17.02.20
    -----------------------------------------------------------

    రిప్లయితొలగించండి
  28. ప్రణుతిని దార నొసగిక శ
    రణు కోరుమనిన,దునమగ రావణు డెంచెన్
    గుణహీ నుండై నంగదు
    రణమే పరమార్థమందురా దూత కహో

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'ఒసగి+ఇక' అన్నపుడు సంధి లేదు. యడాగమం వస్తుంది. "దార నొసగియు" అనండి. అలాగే "గుణహీనుండై యంగదు.." అనండి.

      తొలగించండి
  29. రణమునివారణకు నుపక
    రణముగదౌత్యముగరపుటరణనీతి, నివా
    రణకు ప్రయత్నము సలుపక
    రణమే పరమార్థమందురా దూత కహో?

    రిప్లయితొలగించండి
  30. కస్తూరి శివశంకర్సోమవారం, ఫిబ్రవరి 17, 2020 11:28:00 AM

    గుణ ధీమంతుల సూక్తులే శుభములై కోరే ప్రియంబైన ప్రే
    రణ పొందెన్, సుఖశాంతులే నిరతమై ప్రార్దింపగా శాంతికై
    ప్రణతుల్ చేయచు సౌఖ్యమే పుడమిలో భావ్యంబు; "చింతా నివా
    రణసంకల్పము కంటె లేదు పరమార్థం" బెన్నగన్ దూతకున్

    కస్తూరి శివశంకర్

    రిప్లయితొలగించండి
  31. మణులున్ ప్రాణములెల్ల పూజ్యమగు సుమ్మా!సౌధముల్ గూలు దా
    రుణమౌ రీతిని సస్యసంపదలు నిర్మూలమ్ములౌ మేదినిన్
    గుణమౌ శాంతియటంచు శాత్రవులకున్ కూర్మిన్ దొరా!మాన్పగన్
    రణసంకల్పము కంటె లేదు పరమార్థం బెన్నగన్ దూతకున్

    రిప్లయితొలగించండి
  32. .... శంకరాభరణం.... 17/02/2020 ,సోమవారం

    సమస్య.
    *******
    రణ సంకల్పము కంటె లేదు పరమార్థం బెన్నగన్ దూతకున్

    నా పూరణ : మత్తేభ విక్రీడితము
    ***** ****

    సర్వము తెలసిన కృష్ణా! నీకు చెప్పేటంత వాడిని కాను..అయుననూ నిన్ను దూతగా పంపుతున్నాను కాబట్టి చెబుతున్నాను..అంటూ ధర్మరాజు శ్రీ కృష్ణునికి చెబుతున్న సందర్భం...



    గుణసాంద్రా!యధువంశ భూష!ప్రభువా!గోపాల!శ్రీ కృష్ణుడా!

    రణమో..?సందియొ..? మేలనర్చు ఘన కార్యంబేదియో..? నీకు బో

    ధనజేయన్ దగు జ్ఞాని గాను...నయినన్ ధర్మంబుగా నెంచుచున్

    వినతిన్ జేసెద సాహసించి వినుమా విశ్వేశ్వరా...! యుద్ధ వా

    రణ సంకల్పము కంటె లేదు పరమార్థం బెన్నగన్ దూతకున్


    🌱 ఆకుల శాంతి భూషణ్ 🌱
    🌷 వనపర్తి 🌷

    రిప్లయితొలగించండి
  33. గుణ మగు శాంత మనిశము ధ
    రణి నుభయక్షేమమే వరము, శాంతికిఁ గా
    రణ మగునే మానుపు మీ
    రణమే, పరమార్థ మందురా దూత కహో


    అణు మాత్రమ్మవకాశమున్న నిలఁ దార్క్ష్యస్థూరి సైన్యోగ్ర వా
    రణ సంఘాత సమేత సంఘటిత భూ రా డ్వ్రాత భీభత్స మా
    రణ సంయోగ మనోభిలాష కృత భద్రఘ్నంపు సంగ్రామ వా
    రణ సంకల్పము కంటె లేదు పరమార్థం బెన్నఁగన్ దూతకున్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ రెండు పూరణలు అద్భుతంగా ఉన్నవి. అభినందనలు.

      తొలగించండి
    2. పూజ్యులు శంకరయ్య గారికి నమఃపూర్వక ధన్యవాదములు.

      తొలగించండి
    3. అయ్యా..మీ పూరణలు బాగున్నవి..మా బోటి వారికి అర్థం అయ్యేటట్లు తాత్పర్యం కూడా వివరిస్తే బాగుంటుంది...

      తొలగించండి
    4. తార్క్ష్య స్థూరి సైన్య ఉగ్ర వారణ సంఘాత సంఘటిత : రథ బలము, అశ్వబలము, కాల్బలము, మహాగజ బలముల సమూహముతో(చతురంగ బలములు) ఘటింపఁ బడి నట్టి ,
      భూ రాట్ వ్రాత భీభత్స మారణ సంయోగ మనోభిలాష కృత : భూపాలకులైన రాజ సమూహముల భీభత్సమైన మారణములతోఁ గూడుకున్న కోరికల వలనఁ జేయఁబడిన యట్టి,
      భద్ర ఘ్నంపు : భద్రమును నాశనము జేయు నట్టి,
      సంగ్రామ వారణ సంకల్పము : యుద్ధమును నివారించుటకుఁ జేయు సంకల్పము.
      ఇప్పుడు సులభగ్రాహ్యమని యెంచెదను. ధన్యవాదములు.

      తొలగించండి
  34. అణువంతైననుజాలిలేకయునుబాహాటంబుగాఢీకొనన్
    రణసంకల్పముకంటెలేదుపరమార్ధంబెన్నగన్దూతకున్
    రణముల్సేయుచుబోవుచోనరయయీరత్నావతేగ్రుంగుగా
    బ్రణతుల్సేయుదుదూతయార్యునకుదారాకన్ సుకార్యంబుకై

    రిప్లయితొలగించండి
  35. రణమన్నన్జననష్టదాయకమెయారంభించకన్ మున్నె వా
    రణమార్గంబులజూడమేలగునుసంరక్షింప సర్వోన్నతిన్
    రణమేతప్పదటన్నశాత్రవులబీరంబుల్ నివారింపగన్
    రణసంకల్పము కంటె లేదు పరమార్థం బెన్నగన్ దూతకున్

    రిప్లయితొలగించండి
  36. మరొక పూరణ
    ధర్మరాజు కృష్ణునితో

    రణమే తప్ప మరొక్క దారియు గనన్ రాదా మదిన్నెంచుమా
    రణమే చేయు దలంచినన్ మిగలబోరంచున్ నికన్దల్చగా
    గణనంబే మొదలయ్యెనా మనము నన్ గాఢం బుగానీ నివా
    రణసంకల్పము కంటె లేదు పరమార్థంబెన్నగన్ దూతకున్

    రిప్లయితొలగించండి