25, ఫిబ్రవరి 2020, మంగళవారం

సమస్య - 3291 (శిష్టుల వేధించె...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"శిష్టుల వేధించె ధర్మశీలుం డలుకన్"
(లేదా...)
"విలసద్ధర్మపరాయణుండు మిగులన్ వేధించె శిష్టాత్ములన్"

38 కామెంట్‌లు:


  1. నడిరేయి సరదా పూరణ:

    బలుపౌ వోటులు కోరుచున్ వడివడిన్ బంగారు కొండన్ వలెన్
    చలిలో జందెము నూనుచున్ వెడలుచున్ జంబమ్ముగా కోవెలన్
    కలిలో సత్యము ధర్మమంచు ప్రజలన్ కవ్వించి నవ్వించుచున్
    విలసద్ధర్మపరాయణుండు మిగులన్ వేధించె శిష్టాత్ములన్

    రిప్లయితొలగించండి

  2. ఆటవిడుపు సరదా పూరణ:
    (జిలేబి గారికి అంకితం)

    కలనున్ గాంచని మేకపాలు కొనుచున్ గారాబుగా త్రాగుచున్
    మొలనున్ గోచిని దోపుచున్ వెడలుచున్ ముంజేతినిన్ కఱ్ఱతో
    కలిలో సత్యమహింసయంచు ప్రజలన్ కష్టమ్ములన్ బెట్టుచున్
    విలసద్ధర్మపరాయణుండు మిగులన్ వేధించె శిష్టాత్ములన్ 😊

    రిప్లయితొలగించండి
  3. దుష్టులు మారీచాదులు
    శిష్టుల వేధించె,ధర్మశీలుం డలుకన్
    శిష్టాస్త్రంబులను గొని ని
    కృష్టాత్ముల సంహరించె క్రీడగ వనమున్

    రిప్లయితొలగించండి


  4. స్పష్టంబధర్మ మేనా
    శిష్టుల వేధించె; ధర్మ శీలుం డలుకన్
    స్ప్రష్టముతో బాధపడగ
    దుష్టుల సంహరణ జేయ దునిమెను హరియే


    జిలేబి

    రిప్లయితొలగించండి
  5. సమస్య :-
    "శిష్టుల వేధించె ధర్మశీలుం డలుకన్"

    *కందం**

    దుష్టపు నరకాసురుడిల
    శిష్టుల వేధించె; ధర్మశీలుం డలుకన్
    సృష్టించగా సమరమున్
    కష్టపడక సత్యభామ కాటికి పంపెన్
    .....................✍చక్రి

    రిప్లయితొలగించండి


  6. కలయో వైష్ణవ మాయయో యనగ నా కార్పణ్యమే తోడుగా
    పలురీతుల్ కడగండ్ల తోసి సిసులన్ ప్రాణాంతకమ్మై సదా
    విలసద్ధర్మపరాయణుండు మిగులన్ వేధించె శిష్టాత్ములన్,
    ఫలితంబాయెను మోక్షమున్ పరమమున్ ప్రత్యంతమైచేరగా!


    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు

    1. Deuteronomy 6:3 - King James Bible -


      And he humbled thee, and suffered thee to hunger, and fed thee with manna, which thou knewest not, neither did thy fathers know; that he might make thee know that man doth not live by bread only, but by every word that proceedeth out of the mouth of the LORD doth man live.


      Amen
      జిలేబి

      తొలగించండి
  7. వెలిగాజేసెను రైతుసోదరుల తావేధించగానెంచుచున్!
    తెలివేలేనటువంటిమూర్ఖులకు,నీతేదీలనేముండులే
    కొలువేకష్టముగానుయెంచితిరి,నీకొత్తైన నేతన్ సదా
    విలసద్ధర్మ పరాయణుండు,మిగులన్ వేధించె సిద్ధాత్ములన్

    రిప్లయితొలగించండి
  8. భ్రష్టుడగుకార్త వీర్యుని
    శిష్టుడుజమదగ్నిసుతుడు శిక్షించుతరిన్
    దుష్టక్షాత్రకులపుయవ
    శిష్టుల వేధించె ధర్మశీలుం డలుకన్

    రిప్లయితొలగించండి
  9. దుష్టులు వారే ధర్మ
    భ్రష్టులని యెఱంగి ధర్మ పాలన కొరకై
    కష్టమనుచు తలవక నవ
    శిష్టుల వేధించె ధర్మశీలుం డలుకన్

    రిప్లయితొలగించండి
  10. మైలవరపు వారి పూరణ

    నారాయణ.. నారాయణ..

    జలజాతాసనసూనుడెల్లజగముల్ సంచారమున్ జేసి., శ్రీ
    లలనారాజ్యమధాంధదైత్యగణగర్వంబున్ ప్రచోదించుచున్
    కలహాహారుడటన్న సాకున
    జగత్కల్యాణమున్ గోరుచున్
    విలసద్ధర్మపరాయణుండు మిగులన్ వేధించె శిష్టాత్ములన్ !!

    మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

    రిప్లయితొలగించండి
  11. కష్టములనుకలిగించుచు
    శిష్టుల వేధించె, ధర్మశీలుం డలుకన్
    దుష్టులురక్కసులదునిమె -
    శిష్టులు మునివరులు, దునిమె శ్రీరాముండే!

    రిప్లయితొలగించండి
  12. దుష్టుల దునిమియు గాచును
    శిష్టుల :వేధించు ధర్మ శీ లుం డ లు న్
    స్పష్టము గా శిక్షించును
    కష్టము కలిగించు జనుల గర్వము న ణ చ న్

    రిప్లయితొలగించండి
  13. కష్టమని పూర్తి జేయక
    నష్టమగునని తెలిపినను నమ్మిక లేకన్
    యిష్టమయినటుల విడువగ
    శిష్టుల వేధించె ధర్మశీలుం డలుకన్

    రిప్లయితొలగించండి
  14. తలలో నాలుకవోలె మెల్గుచునుతాతాదాత్మ్యమున్ జెందుచున్
    కలలోవైష్ణవమాయగానవగ యీకాలాన దౌష్ట్యమ్మనన్
    కులుకుల్ మానగజేసెనేప్రభువు,యీ కోటానకోట్లన్ తనే
    విలసద్ధర్మపరాయణుండు,మిగులన్ వేధించె సిద్ధాత్ములన్.

    రిప్లయితొలగించండి
  15. నిన్నటి పూరణ

    కొమరుని పెండ్లి సంబరము కోసము ధారణ జేయనెంచగన్
    రమకయి హారమందిడిరి ఱంపము గత్తియు రాజ హంసముల్
    యమరిన మాల నొక్కపరి యద్దము నందునజూసి దాల్చగన్
    రమణి కుచంబుపైఁ గలవు ఱంపముఁ గత్తియు రాజహంసమున్

    రిప్లయితొలగించండి
  16. కలికాలంబిది ధర్మపాలనమిటన్ గాంక్షించగా నౌనె తా
    నలఘుఖ్యాతిని బొంది సజ్జనునిగా నందెన్ ప్రభుత్వంబు వా
    డిలనొక్కండధికారపీఠమహిమాహిన్ జిక్కి దర్పంబుతో
    "విలసద్ధర్మపరాయణుండు మిగులన్ వేధించె శిష్టాత్ములన్"

    రిప్లయితొలగించండి
  17. అందరికీ నమస్సులు 🙏

    *కం||*

    ఇష్టములు తెలుపక, పడెడి
    కష్టములు మఱచి సతతము ఖఠినము తోడన్
    నిష్టగ విద్యను నేర్చెడి
    *"శిష్టుల వేధించె ధర్మశీలుం డలుకన్"*

    *కళ్యాణ్ చక్రవర్తి, ముంబాయి*
    🙏🙏

    రిప్లయితొలగించండి
  18. దుష్టుడు రాజై నిరతము
    శిష్టుల వేధించె; ధర్మశీలుం డలుకన్
    దుష్టుని పరిమార్చగ నిక
    కష్టము దొలగెను జనులకు గాంచిరి ముదమున్

    రిప్లయితొలగించండి
  19. మిత్రులందఱకు నమస్సులు!

    చలముం బూని, పరీక్షసేయఁగ హరిశ్చంద్రున్ సతీపుత్రులన్,
    గలిమిం బూర్తిగ నూడ్చి, వెచ్చమునకై కాంక్షించి, కాశీపుర
    స్థలమం దక్కటికంబు సంతనిడి, విశ్వామిత్రమౌనీంద్రుఁ డన్

    విలసద్ధర్మపరాయణుండు మిగులన్ వేధించె శిష్టాత్ములన్!

    రిప్లయితొలగించండి
  20. కలుషాత్ముండయి దక్షుడాగ్రహము విక్రాంతంబు నొందంగ ని
    ష్ఫలదంబైన నిరీశ్వరంబగు మఖప్రస్థా పనంబే ర్చుచో
    జ్వలితావేశిత వీరభద్రుడగుచు న్భర్జించె నాహూతు లన్
    విలసద్ధర్మపరాయణుండు మిగులన్ వేధించె
    శిష్టాత్ములన్"

    రిప్లయితొలగించండి
  21. శిష్టులబేరనబరగుచు
    గష్టములనుగలుగజేయుకఠినాత్ములుగా,
    దుష్టునివోలెనునుండెడు
    శిష్టులవేధించెధర్మశీలుండలుకన్

    రిప్లయితొలగించండి
  22. శిష్టాచరణము నెరుగని
    భ్రష్టుల సవరింప గురువు పధకము తోడన్ కష్టములనిడుచు బూటక
    "శిష్టుల వేధించె ధర్మశీలుం డలుకన్"

    రిప్లయితొలగించండి
  23. సమస్యాపూరణం సమస్య:

    విలసద్ధర్మపరాయణుండు మిగులన్ వేధించె శిష్టాత్ములన్
    ........ .... .....
    ఇలఁరక్షింపగదీక్షఁబూనవలెప్రావిణ్యంబులుప్పొంగగన్

    విలసద్ధర్మపరాయణుండు, మిగులన్ వేధించె శిష్టాత్ములన్

    ఖలుడుద్దండతమీఱనోర్వగనశక్యంబైనక్రూరక్రియన్

    తలపన్ పూరణమిట్లుతోచెనదిపద్యంబయ్యెనీరీతిగన్

    గాదిరాజు మధుసూదన రాజు

    రిప్లయితొలగించండి
  24. కం:

    ఇష్టము రీతిని తూగుచు
    భ్రష్టులుగా లోకమెల్ల భావించంగన్
    కష్టము నోపగ లేనని
    శిష్టుల వేధించె ధర్మ శీలుండలుకన్

    తూగుట: నడవడి

    వై. చంద్రశేఖర్

    రిప్లయితొలగించండి
  25. మత్తేభవిక్రీడితము
    అల లంకాపురి సీత వీడ రజకుండాడంగ ద్రోసెన్ వనిన్
    యిలవేల్పంచును రామదాసు గుడి కట్టించంగ ద్రోసెన్ జెరన్
    గలనైనన్ విడ బోడు ధర్మమనఁ బేర్గాంచంగ సంక్లిష్టతన్
    విలసద్ధర్మపరాయణుండు మిగులన్ వేధించె శిష్టాత్ములన్

    రిప్లయితొలగించండి
  26. కందం
    ఇష్ట సఖి నడవులనిడి వి
    శిష్టత గుడిఁ గూర్చ వాని చెరలో నుంచెన్
    కష్టమ్మైనన్ రాముఁడు
    శిష్టుల వేధించె ధర్మశీలుం డలుకన్

    రిప్లయితొలగించండి
  27. ..............🌻శంకరాభరణం🌻...............
    ..................🤷🏻‍♂సమస్య 🤷‍♀....................
    విలసద్ధర్మపరాయణుండు మిగులన్ వేధించె
    శిష్టాత్ములన్"

    సందర్భము: రాముడు సీతా లక్ష్మణులతో వనవాసానికి వెళ్ళిపోయాడు. దశరథుడు కన్ను మూశాడు. భరతుడు మేనమామ వూరినుంచి తిరిగివచ్చాడు. జరిగిన గందరగోళానికి ఎంతో విలపించాడు.
    అప్పు డొక పౌరు డిలా అన్నాడు మిత్రునితో..
    "రాముని వన గమనాన్ని తండ్రి (వరా లిచ్చినప్పటికీ) ఒప్పుకోనేలేదు. తల్లి ముందే వద్దన్నది. తమ్ముడు వద్దన్నాడు. ఏ పుత్రుని కోసమైతే కైక పట్టుపట్టిందో ఆ భరతుడే వద్దన్నాడు. పురజనులూ వద్దన్నారు. బలే మంచివా డండీ! రాము డింత మందిని కాదని బయలుదేరినాడు. ఇంతమంది శ్రేయోభిలాషులను, శిష్టాత్ములను వేధించటం చాలా బాగుంది."
    ఆ విలసత్ (ప్రకాశిస్తున్న) ధర్మ పరాయణుండు.. అని మాత్రమే గాక.. ఆవిల సత్ ధర్మ పరాయణుండు.. అని కూడ విడదీసుకోవచ్చు. అప్పుడు కలుషితమైన..మంచి.. ధర్మము.. అని అర్థం చెప్పవచ్చు. ఇందరు వద్దంటున్నారు వనవాసం. రాము డొక్కడే పట్టుబట్టి బయలుదేరాడు.
    "పదుగు రాడు మాట పాటియై ధరజెల్లు.."గదా! అందువల్ల పితృవాక్య పరిపాలనం అతని దృష్టిలో ఎంత గొప్ప పని యైనా సత్ ధర్మమే అయినా ఆవిలమైనదే (కలుషితమైనదే) అయింది.
    అందుకే ఆ పౌరుడు రాముణ్ణి సుజనుడు.. అని అధిక్షేపించినాడు సున్నితంగా.
    "భలే మంచి వాడ వయ్యా!" అంటే మంచివాడు కా డని కదా ధ్వని! "ఏం పెద్దమనిషి వయ్యా!" అనే సందర్భాలలోనూ అదే ధ్వని.
    ఏదేమైనా అవతార ప్రణాళిక మాత్రం అంతుపట్టేది కాదు గదా!
    ~~~~~~~~~~~~~~~~~~~~~~~

    *అవతార ప్రణాళిక*

    తొలుతన్ దల్లియు వ ద్దనెన్.. బిదప నా
    తోబుట్టువా వ ద్దనెన్..
    గల పౌరావళి వ ద్దనెన్ నగరిలోఁ..
    గైకేయి సూనుండు వ
    ద్దిలఁ గానన్ జనరా దనెన్.. సుజనుడౌ
    లే! యేగె నా రాము.. డా
    విలసద్ధర్మపరాయణుండు మిగులన్
    వేధించె శిష్టాత్ములన్

    ✍️~డా.వెలుదండ సత్యనారాయణ
    పరమార్థ కవి
    25.02.20
    -----------------------------------------------------------

    రిప్లయితొలగించండి
  28. ఇలశిష్టుండుగదామెలంగుచునుదానేలోకనాధుండునై
    నలవోకంబుగబాధవెట్టుచునునత్యానందముంబొందగా
    విలసద్ధర్మపరాయణుండుమిగులన్వేధించెశిష్టాత్ములన్
    నలఘుఖ్యాతినిబొందగాదగునుదానర్ధమ్ముదానంబుతోన్

    రిప్లయితొలగించండి
  29. శిష్టార్తుల రక్షణకై
    పృష్ట విహీనతఁ జెలంగి పృథివీపతి తా
    దుష్టుల సంతత తాడిత
    శిష్టుల వేధించె ధర్మశీలుం డలుకన్


    విల యార్థంబ చరింత్రు దుష్టజను లుర్వీ భార దుర్వీర్యులై
    లలనాసక్తుఁడు రావణాసురుఁడు పౌలస్త్యుండు యక్షానుజుం
    డిలలో బ్రాహ్మణ వంశ జాతుఁ డయి లంకేశుండు కామప్రభా
    విలసద్ధర్మపరాయణుండు మిగులన్ వేధించె శిష్టాత్ములన్

    రిప్లయితొలగించండి
  30. కలలోనైనను ధర్మమున్ విడని సత్కారుణ్య ధర్మజ్ఞుడే
    ఖలు ద్యూతమ్మున సర్వసంపదలు ప్రఖ్యాతుండ్రూ భీమాది భ్రా
    తలఁ భామా మణి ద్రౌపదిన్ బణముగా తానొడ్డుటన్ గాంచినన్
    విలసద్ధర్మ పరాయణుండు మిగులన్ వేధించె శిష్టాత్ములన్.

    రిప్లయితొలగించండి
  31. ఇలలోనెవ్వరికేమియిక్కటులునేయేరీతులన్గల్గిన
    న్నెలమిన్ తానొనరించురక్షణనుతానేమైనలక్షింపకన్
    విలసద్ధర్మపరాయణుండు, మిగులన్ వేధించె శిష్టాత్ములన్
    కలుషాత్ముండగుదుర్జనుండవనిలోకాఠిన్యచిత్తంబుతో

    రిప్లయితొలగించండి
  32. రొష్టును బెట్టగ దప్పిక,
    కష్టము దోచి మది, పాముకట్టె మునిమెడన్
    దుష్ట పరీక్షితు డునిచెను!
    శిష్టుల వేధించె ధర్మశీలుండలుకన్!

    రిప్లయితొలగించండి
  33. ఇష్టము తో నేర్వుడనుచు
    శిష్టుల వేధించెధర్మశీలుండలుకన్
    కష్టము గాదు హరికృపా
    వృష్టియు కురియంగమీకు విశ్వమునందున్

    రిప్లయితొలగించండి