11, ఏప్రిల్ 2020, శనివారం

సమస్య - 3336

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"గాడిదను వివాహమాడెఁ గాంత ముదమునన్"
(లేదా...)
"గాడిదనున్ వరించి యొక కాంత ముదమ్మునఁ బెండ్లియాడెరా"

77 కామెంట్‌లు:


  1. ఆడది గాడిదమ్మ కడు హాయిని పొందుచు ముత్తుకూరినిన్
    పోడిమి మీరగా వెదకి ప్రొద్దున రాతిరి వాడవాడలన్
    పాడుచు నాడుచున్ మురిసి పండుగ చేయుచు మేలు పున్స్త్వ పున్
    గాడిదనున్ వరించి యొక కాంత ముదమ్మునఁ బెండ్లియాడెరా

    రిప్లయితొలగించండి
  2. అందరికీ నమస్సులు 🙏🙏

    *కం ||*

    చూడగ చక్కని యువకుడు
    తోడుగ నుండుట కొరకని దొరికిన తడవే
    వేడుకలో గనబడిన మ
    *"గాడి, దను వివాహమాడెఁ గాంత ముదమునన్"!!*

    *కళ్యాణ్ చక్రవర్తి, ముంబాయి*
    🙏🌹🙏🌹🙏

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అందరికీ నమస్సులు 🙏🙏

      *కం||*

      వేడుక చూచిన తదుపరి
      మాడెను పదుగురి ముఖములు యాపలుకులతో
      రూఢీగా యంటిరిటుల
      *"గాడిదను వివాహమాడెఁ గాంత ముదమునన్"!!*

      *కళ్యాణ్ చక్రవర్తి, ముంబాయి*
      🙏🌸🙏🌸🙏

      తొలగించండి
    2. అందరికీ నమస్సులు 🙏🙏

      *సరదా పూరణ* 🙏🙇‍♂️🙅‍♂️

      *కం||* 🌹🌹🌹

      గాడు కుదిర్చిన పెండ్లిగ
      మేడు ఫరీచథరు యనక మెంటలు గాళ్ళే
      తోడా పుచ్చుకు యనిరట
      *"గాడిదను వివాహమాడెఁ గాంత ముదమునన్"!!*

      *కళ్యాణ్ చక్రవర్తి, ముంబాయి*
      🙏🙏🙏

      తొలగించండి
    3. మీ మూడు పూరణలు బాగున్నవి. అభినందనలు.
      మొదటి పూరణలో 'గాడి దను' అని విడగొట్టడం కుదరదు. 'తాను'ను 'తను' అనరాదు.
      రెండవ పూరణలో 'ముఖములు+ఆ' అన్నపుడు యడాగమం రాదు.
      మూడవది సరదా పూరణ అన్నారు కనుక అందలి దోషాలు పట్టుంచుకోనక్కరలేదు.

      తొలగించండి
    4. ధన్యోస్మి ఆర్యా 🙏🙏

      తప్పులెక్కువ వచ్చినందుకు క్షంతవ్యుణ్ణి 🙏🙏😥

      తొలగించండి
  3. చూడగ జాతకమున నొక
    బోడిదియౌ దోషముండెఁ! బోవును చేయన్
    గాడిదతో తొలిపెండ్లన,
    గాడిదను వివాహమాడెఁ గాంత ముదమునన్!

    రిప్లయితొలగించండి
  4. చూడగ చక్కని రూపం
    బీడూ జోడూ కుదిరినదింపులరంగా!
    కీడెరుగక తండ్రిదెలుప
    గాడిదను వివాహమాడెఁ గాంత ముదమునన్.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      "ఈడును జోడును కుదిరిన దింపలరంగన్" అనండి.

      తొలగించండి

  5. ఆటవిడుపు సరదా పూరణ:
    (జిలేబి గారికి అంకితం)

    కూడుచు పాఠశాలనహ కూరిమి మీరగ హస్తినాపురిన్
    మేడలు మిద్దెలన్ గనుచు మేదిని మీదను నొక్కరుండగున్
    తోడుగ క్రైస్తవుండనుచు తోరపు హాయిని సార్థవాహుడౌ
    గాడిదనున్ వరించి యొక కాంత ముదమ్మునఁ బెండ్లియాడెరా

    రిప్లయితొలగించండి
  6. వీడగజాతక దోషము
    గాడిదతోబెండ్లియాడగానయెమొదటన్
    వేడుకదీరినతోడ,మ
    గాడి;దనువివాహమాడెకాంతముదమునన్
    +++++++++++++++
    రావెలపురుషోత్తమరావు

    రిప్లయితొలగించండి
  7. గాడిద యాడుది , యొక మగ
    గాడిదను వివాహమాడెఁ ; గాంత ముదమునన్
    వేడుకను జరిపె జక్కని
    జోడు కుదిరెనని , యిదియొక చోద్యము గాదే

    రిప్లయితొలగించండి
  8. బూడిద పూసుకు శివుడట
    వేడుకగా మసన మందు వెఱ్ఱిగ తానై
    ఆడుచు పాడుచు గెంతుచు
    గాడిదను వివాహమాడెఁ గాంత ముదమునన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      అక్కయ్యా, ఆరోగ్యమెలా ఉంది?

      తొలగించండి
    2. నమస్కారములు
      ఆయాసం బాగా వస్తోంది. కొంచం సేపు బాగుంటే మరికొంచం సేపు బాగుండదు. రాత్రి ఒక్క క్షణం నిద్ర ఉండదు ఈ కరోనా గోల ఒకటి. పిచ్చిగా ఉంటుంది. ప్చ్ ! ఏంచెయ్యాలో తోచదు.
      మీ అందరి అభిమానానికి ధన్య వాదములు

      తొలగించండి
  9. (పూర్వజన్మస్మృతి గల మానవగార్దభి తనకు తలవని తలంపుగా
    తారసపడిన మానవగార్దభుని గ్రహించి వరించింది )
    వేడుక మీరగా తనదు
    వెన్కటి జన్మము గుర్తెరుంగుచున్
    నేడొక మానవాంగనగ
    నీటుగ పుట్టిన నీరజాక్షియే
    పోడిమి తోడ గన్పడిన
    పూరుషుడౌ ;తన పూర్వనాథుడౌ
    గాడిదనున్ వరించి యొక
    కాంత ముదమ్మున బెండ్లియాడెరా !
    (నీటుగ -అందముగా ;పోడిమి-సొగసు )

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. జన్మాంతర వివాహంతో మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.

      తొలగించండి
  10. కం//
    చేడియ దొరకక రమణుడు
    గాడిదను వివాహమాడెఁ, గాంత ముదమునన్ !
    వేడుక జూచుచు తదుపరి
    తాళిని గట్టించుకొనెను దర్పముతోడన్ !!

    రిప్లయితొలగించండి


  11. తేడా రాన్ మాకు కుదుర
    దాడంబరముగ వివాహమవ్వాలె సుమా
    వాడుక కట్నంబివ్వగ
    గాడిదను, వివాహమాడెఁ గాంత ముదమునన్!


    జిలేబి

    రిప్లయితొలగించండి
  12. మైలవరపు వారి పూరణ

    గాడిదతోడ పెండ్లి జరుగన్ తొలగున్ గ్రహపీడ యీమెకున్
    కీడును దొల్గునంచన నొకింత మనమ్మున కుంది కుందనం..
    బేడు సవర్లఁ దండ్రి గ్రహియించెను గాడిదబొమ్మ., స్వర్ణపుం...
    గాడిదనున్ వరించి యొక కాంత ముదమ్మునఁ బెండ్లియాడెరా!!

    మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

    రిప్లయితొలగించండి


  13. హమ్మయ్య ! ఏమి యెండలో!


    ఏడిద వారి పెండ్లియట! వేడుక వాడుక కట్నమీయగా
    గాడిదనున్, వరించి యొక కాంత ముదమ్మునఁ బెండ్లియాడె, రా
    చూడగ పోయి వత్తుమని సోదరి బిల్వగ బండి యెక్కియే
    ర్పేడున నెండ తీండ్రము సురీల్మను వేళని చేరినామయా


    జిలేబి

    రిప్లయితొలగించండి
  14. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  15. తోడయియున్నవాని నొక తుంటరి హేళన చేసి యిట్లనెన్
    వీడొక వ్యర్థజీవి యతివేదన జెందిన దౌను సత్యమీ
    గాడిదనున్ వరించి యొక కాంత, ముదమ్మునఁ బెండ్లియాడెరా
    చూడుము దానియందమును జుర్రుచు నీతడదృష్టవంతుడై.

    రిప్లయితొలగించండి
  16.  వాడో తుంటరె యయినా  
    ఏడో తరగతి చదివిన ఏబ్రాసయినా 
    వీడక  రక్షగ నుండు మ  
    "గాడి దను వివాహమాడెఁ గాంత ముదమునన్"

    రిప్లయితొలగించండి
  17. నేడు శుభమ్ము పండెనట, నిశ్చయతాంబులమయ్యె, పుత్రుడే
    యేడడుగుల్ నిటారుగ నయించెను, పేరుకు నిందిరాధనుష్
    వాడుక ముద్దుపేరు "దను", వామిలుడున్ గుణవంతుడైన తా
    గాడి దనున్ వరించి యొక కాంత ముదమ్మునఁ బెండ్లియాడెరా౹౹

    రిప్లయితొలగించండి
  18. వాడు చదువు లేని చవట
    వీడకు నాచేయి ననుచు వేవిధములుగా
    వేడగ, గాలికి తిరుగెడి
    గాడిదను వివాహమాడెఁ గాంత ముదమునన్.

    రిప్లయితొలగించండి
  19. శంకరాభరణం
    శనివారం....11/04/2020

    సమస్య:

    "గాడిదనున్ వరించి యొక కాంత ముదమ్మునఁ బెండ్లియాడెరా"


    నా పూరణ. ఉ.మా.
    **** **** **

    వేడుక దండ్రి పుత్రికకు బెండిలి గోరుచు
    శాస్త్రి జేరగన్!

    జూడగ జాతకమ్ము గనె సొచ్చెము దోషము పంతులున్;మునున్

    గీడు తొలంగ బెండ్లి సుతకున్ పశురమ్మునకంచు దెల్పగన్...

    గాడిదనున్ వరించి యొక కాంత ముదమ్మున బెండ్లియాడెరా"


    -- ఆకుల శాంతి భూషణ్
    వనపర్తి

    రిప్లయితొలగించండి
  20. ఆడిన మాటకు లోబడి
    పాడియు గాదని తెలిసియు బంధువు సూను న్
    తేడాగా వర్తించె డు
    గాడిదను వివాహ మాడె గాంత ముదము నన్

    రిప్లయితొలగించండి


  21. చేడియ! జిలేబి! వలదే
    చాడీల్! నిన్ను వలదన ప్రచారమ్ములకో
    వాడో వెధవాయ్! వాడిని
    గాడిదను, వివాహమాడెఁ గాంత ముదమునన్!


    జిలేబి

    రిప్లయితొలగించండి
  22. పోడిమి యెరుగని కన్యక
    వీడగ కన్నెచెర, తలచె విధిలేక యనన్
    తోడుగ నుండుగ నొకమగ
    "గాడిదను వివాహమాడెఁ గాంత ముదమునన్"
    (పోడిమి - సంపద )

    రిప్లయితొలగించండి
  23. నేటి శంకరా భరణము సమస్య

    గాడిదను వివాహమాడెఁ గాంత ముదమునన్"

    ఇచ్చిన పాదము కందము నా పూరణ సీసములో

    నూట యాభై సంవత్సరములక్రితము పురుషులకు స్త్రీలు దొరికేవారు కాదుట. వివాహం ఆడవలెనన్న ఓలి (కన్యాశుల్కము) ఇవ్వ
    వలసి వచ్చేదిట. పిండికొద్ది రొట్టే. ఎక్కువ ఓలి ఇస్తే చక్కని స్త్రీ తొ వివాహము అయ్యేది. తక్కువ ఓలి ఇస్తే గుడ్డిదో కుంటిదో దొరికేదిట . ఒక చాకలి కుమ్మరి స్నేహితులు . చాకలి ఓలి క్రింద గాడిదను ఇచ్చి అందమైన భార్యను తెచ్చుకొన్నాడు. కుమ్మరి ఎక్కువ వోలి ఇచ్చు కోలేక ఒక గుడ్డి స్త్రీని వివాహము ఆడుతాడు. ఇంటికి వచ్చిన తర్వాత ఆ స్త్రీకి కనులు కనిపించక అటు ఇటు తిరుగుచు కుమ్మరి చేసుకున్న కుండలు అన్ని పగుల గొట్టేదిట
    అందుకే ఒక సామెత మన వాళ్ళు పెట్టాఱు

    ఓలి తక్కువ అని గుడ్డి దాన్ని పెండ్లాడితే కుండలు అన్ని పగులగొట్టినదట

    అని ఆ భావన తో ఈ పూరణము


    నాటి దినము లందు నారీ మణుల సంతు
    తక్కు వాయెనట నీ ధరణి లోన,

    పరిణయ మాడంగ పురుష పుం
    గవులకు కష్టముల్ కలుగు చుండె,

    నోలి నివ్వ దొరకు నీలవేణు లనుచు
    దెల్ప రేవడొకడు తీయ బోడి

    తండ్రి నడుగ చెప్పె “దస్రంబు నొక్కటి
    నోలి కింద నిడగ నాలి యగును

    తనదు సుతనుచు” నతని తోడ,రజకుడు
    వెతలు బడుచు తెచ్చి నతని కివ్వ

    గాడిదను, వివాహమాడెఁ గాంత ముదము
    నన్ పదుగు రెదుట, నాతి కొరకు


    నొక్క కుమ్మరి ఘనముగ నోలి నివ్వ

    లేక పెండ్లాడ నొక గుడ్డి లేమను,తను

    చూడ లేక తిరుగుచు రోజుకొక మారు

    కుండ లన్నింటిని పగుల గొట్టు చుండె


    రేవడు= చాకలి, దస్రము = గాడిద

    రిప్లయితొలగించండి
  24. వాఁడు దరిద్రుడనిఁ దెలిపి
    తోడుగ వలదంచునడ్డఁ దోయలి మామల్
    దాడికి బెదరక దృతి నత (జత)
    గాఁడిఁ దను వివాహమాడెఁ గాంత ముదమునన్

    రిప్లయితొలగించండి
  25. వీడునుగ్రహదోషంబులు
    వేడుకగాధూసరమ్ముబెండ్లాడంగన్
    గూడునుసౌభాగ్యమ్మన
    గాడిదనువివాహమాడెగాంతముదంబునన్

    రిప్లయితొలగించండి
  26. ఉ:

    మోడలు భర్త నెంచుకొన మ్రొక్కుచు దేవుని వేట సల్పగన్
    వాడును వీడు వీడనగ వంకర బద్ధులె గాన వచ్చుట
    న్నీడును దాటు నంత నిక నిష్టము గాదు నగత్యమంచనన్
    గాడిదనున్ వరించి యొక కాంత ముదమ్మున బెండ్లి యాడెరా

    మోడల్: Model , వాడును, వీడు, వీడనగ : selection process

    వై. చంద్రశేఖర్

    రిప్లయితొలగించండి
  27. చూడవసంతుడో యజుని సూనుడు మన్మథుడో యతండెగా
    వేడెను వేవిధమ్ములుగ వీడకు నాకరమున్ సఖీ సదా
    నీడగ యుందు నీకని పనేమియు లేనివివేక శూన్యుడౌ
    గాడిదనున్ వరించి యొక కాంత ముదమ్మునఁ బెండ్లియాడెరా.

    రిప్లయితొలగించండి
  28. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  29. వేడెవసుదేవుడెవనిని?
    చూడగగొనిపోయివిష్ణుచోద్యంబనగన్,
    పాడినరాగంబువినుచు
    గాడిదను,వివాహమాడ,ఁ గాంతముదమునన్
    కొరుప్రోలు రాధాకృష్ణారావు

    రిప్లయితొలగించండి
  30. వీడగనెందఱోసుతులువేదనదోడనునుండునామెకున్
    వేడుకదీరగాగలుగబ్రీతినిబెట్టెనుగార్దభంబనిన్
    దోడుగనుండునేయనుచుదోరముగల్గెడువేడ్కతోడనీ
    గాడిదనున్వరించియొకకాంతముదమ్మునబెండ్లియాడెరా

    రిప్లయితొలగించండి
  31. మిత్రులమధ్య సంభాషణ : తీసి పారవైచిన వారే రాశులవుతారంటారంటూ...

    కందం
    గాడిద వీవనుచున్'హరి'
    గాడిని మును పారవైచ ఘనుడై నేడే
    ఱేడయె నొక సంస్థకు నా
    గాడిదను వివాహమాడెఁ గాంత ముదమునన్!

    ఉత్పలమాల
    వాడొక మొద్ద టంచు మునుఁ బల్కుచు గాడిదటంచుఁ దిట్టుచున్
    వీడితె! దైవ దీవెనఁ బ్రవీణత నొంది ప్రయోజకుండునై
    నేడొక సంస్థ నేర్పరచి నిల్పెను వందల జీవితాల నా
    గాడిదనున్ వరించి యొక కాంత ముదమ్మునఁ బెండ్లియాడెరా!

    రిప్లయితొలగించండి
  32. గురువు గారికి నమస్సులు.
    అడిగిన భత్యము లేదను
    వడివేలయనునరహీనువదిరే మనుజున్
    బిడియము లేకయె యిలనన్
    గాడిదను వివాహమాడె గాంత ముదమునన్

    రిప్లయితొలగించండి
  33. ఆడిన మాటను దప్పిన
    వాడినిబెండ్లాడుటేల?వలదని జెప్పన్
    మేడలుమిద్దెలుగలయొక
    గాడిదనువివాహమాడె కాంతముదమునన్
    +++++++==++++
    రావెలపురుషోత్తమరావు

    రిప్లయితొలగించండి
  34. వాఁడికి మన సున్నది కడు
    నీడ యనఁగఁ చెలఁగి తనకు నిత్యంబుండం
    దోడుగ మానవ రూపపు
    గాడిదను వివాహమాడెఁ గాంత ముదమునన్


    వాఁడు కరమ్ము సుందరుఁడు భద్రము సేకురు జీవితమ్మునం
    దోడుగ నుండఁ బెండ్లి యయి తోరము సౌఖ్యము లబ్బు నంచునున్
    వాఁడిగఁ దల్చు చివ్విధిని వానిని, నుండఁగ నొప్పిదంపుఁ బ్రో
    గాడి దనున్ వరించి, యొక కాంత ముదమ్మునఁ బెండ్లియాడెరా

    [ప్రోగు +ఆడి = ప్రోగాడి; ఆడి= బాతు; తనున్ = తన్ను ; ఆడబాతు తన్ను వరించి యుండఁగఁ దాను సుందరునిఁ బెండ్లి యాడె నని భావము]

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అనుదిన ప్రత్యేకతలన్
      దనరుచు తమపద్యముండ ధన్యులమగుచున్
      గనుచుంటిమి సంతసమున
      వినయమ్మున మ్రొక్కచుంటి విబుధవరేణ్యున్

      ఆర్యా! నమస్సుమాంజలి. గాడిఁద కాదని అక్కడ తనున్ రాదని గురుదేవుల ఉవాచ. దయతో వివరించ ప్రార్థ

      తొలగించండి
    2. ఆడి విశేష్యము ప్రథమా విభక్తి. అర్థము బాతు కనుక గసడదవా దేశ సంధి వచ్చినది.
      వరించి యుండంగ క్రియకు ఆడి కర్తృ పదము. ఇక్కడ ఆడిన్ అని ద్వితీయా విభక్తిలో లేదు. కనుక నరసున్న యుండదు.
      “ఆడి తనున్ వరించి” , “ఆడి దనున్ వరించి” యని రెండు రూపములు సాధువులు. గసడదవా సంధి బహుళము గనుక.

      తొలగించండి
    3. సుకవులు పోచిరాజువారికి నమస్సులు!

      మీ రెండు పూరణాలూ అద్భుతంగా వున్నాయి! అభినందనలు!
      మొదటి పూరణలో
      వాఁడు+కి=వానికి అవుతుంది గదా!
      వాఁడికి అని మీరు పూరించడంలో అంతరార్థమేమైనా వున్నదా...తెలుపగలరు.
      అన్యధా భావింపవలదని మనవి.

      తొలగించండి
    4. అవునండి వ్యావహారిక పదము ప్రమాద వశమున వచ్చినది. ధన్యవాదములు. సవరించెదను.

      తొలగించండి
    5. పాడిగ మన సున్న మొఱకు
      నీడ యనఁగఁ జెలఁగి తనకు నిత్యంబుండం
      దోడుగ మానవ రూపపు
      గాడిదను వివాహమాడెఁ గాంత ముదమునన్

      తొలగించండి
  35. చూడట వింతగ గాడిద
    వేడుకగా జరుగు పెండ్లి వేదిక జేరెన్,
    దౌడాయింపగ జనులా
    గాడిదను, వివాహమాడెఁ గాంత ముదమునన్

    రిప్లయితొలగించండి
  36. వాడునెలఱేనితోసరి
    జోడగు, పూవింటిజోదు జూడగనతడే
    పోఁడిమి మీరగనా జత
    గాడిఁ దను వివాహమాడెఁ గాంత ముదమునన్

    రిప్లయితొలగించండి
  37. వీడుల వాడలం దిరిగి వేవురి యిండ్లను సొచ్చి రాత్రులన్
    బైడిని దొంగి లించి తెలవార నమాయకభంగి నుండు సో
    గ్గాడిని సొత్తుఁ గూర్చిన మగాడిని నీడగు వాడ టంచు దొం
    గాడి దనున్ వరించి యొక కాంత ముదమ్మునఁ బెండ్లియాడెరా.

    కంజర్ల రామాచార్య
    వనస్థలిపురము

    రిప్లయితొలగించండి
  38. మిత్రులందఱకు నమస్సులు!

    ఉత్పలమాలిక:
    వేడుక నొక్క రాజు కొక పిల్లఁడు పుట్టగఁ, బ్రేమఁ బెంచఁ, దా
    నాడుచుఁ బాడుచున్ దినములన్నియు నూఱక పుచ్చి, విద్యలం
    దీడుకుఁ జొప్పడం గలుగు నెద్దియు నేర్వక, యొక్క మౌనికిన్
    దోడుగ నున్నయట్టి యొక దుప్పినిఁ గొట్టెను; మౌని కోపియై
    "గాడిదవై చరించు"మని గర్హణచే శపియించె; మాన్పఁగా
    వేడఁగ, శాంతముం గొనియుఁ, "బ్రేమను నుద్వహమైన కాంతచే
    గాడిద రూప మేఁగి, నరగాత్రము వచ్చు" నటంచుఁ జెప్పెఁ; దా
    నేడుచుచుండఁగానె యతఁ డించుక యించుక గాడ్దెరూపు రాన్,
    దోడుగ నున్న నెచ్చెలుఁడు తొందరగాఁ జని, వాని తండ్రికిన్
    గూడిన యన్ని యంశములు గోడున నేడ్చుచుఁ జెప్పె; రాజు న
    వ్వాడల వాడలందుఁ దగ "వాని వరించియుఁ బెండ్లియాడఁగా
    వేడిన కాంత యున్న, నతి వేగమె పెండిలి సేసె"దంచు నా
    నాఁ డతఁ డుగ్గడింపఁగ, వినంగనె వేగమె రాజుఁ జేరి, యా

    గాడిదనున్ వరించి, యొక కాంత ముదమ్మునఁ బెండ్లియాడె; రా
    పాడుచు నామె తాఁకఁ దన భర్తను, వెంటనె వాని కప్పు డా
    గాడిద రూపమేఁగె; వడి జ్ఞానియునై, సుఖియించె నామెతో!

    రిప్లయితొలగించండి
  39. గాఢపు జాతకదోషము
    వీడగ పంచాంగకర్త వివరించినటుల్
    పీడా నివారణమునకు
    గాడిదను వివాహమాడె గాంత ముదమునన్

    వేడుక చాకలింట దొలి పెండ్లికి గూడగ గార్ధభమ్ములే
    ఆడుచు పాడుచున్ మిగుల హ్లాదమునొందుచు వాహనమ్ములై
    వాడల ద్రిప్పగా కదల వైభవమొప్పగ క్రొత్తజంటనే
    గాడిదనున్ వరించి,యొకకాంత ముదమ్మున బెండ్లియాడెరా!

    రిప్లయితొలగించండి
  40. గాడిద కాళ్ళువాడతడు కాసులు దండిగ నున్నవాడులే
    బాడుగ భారమౌగ తను బాధల కోర్చెడి బీదరాలు నౌ
    వేడగ ఏడుకొండలును వేగమె వారికి బెండ్లిగూర్చగా
    గాడిదనున్ వరించి యొక కాంత ముదమ్మున బెండ్లియాడెరా

    రిప్లయితొలగించండి
  41. చూడగ చుక్కవంటియొకచొక్కపు రూపము గల్గినట్టి పూ
    బోడిమనంబునందునొకపుష్పశరాసనుబోలు వానిపై
    గాఢపు ప్రేమగల్గెనతగాడునిరక్షరకుక్షి యట్టియా
    గాడిదనున్ వరించి యొక కాంత ముదమ్మునఁ బెండ్లియాడెరా!

    రిప్లయితొలగించండి
  42. పైడయ్యకొడుకొకగాడిద
    వీడికిబెండ్లామురాదు విరక్తిచెందన్
    చూడగవిపరీతంబది
    గాడిదను వివాహమాడెఁ గాంత ముదమునన్

    రిప్లయితొలగించండి


  43. వీడును దోష మటంచును
    నాడంగ పురోహితుండు నాదర మొప్పన్
    కీడును బాపుకొనంగను
    గాడిదను వివాహమాడెగాంతముదమునన్

    రిప్లయితొలగించండి
  44. కవిమిత్రులు మన్నించాలి.
    ఉదయం నుండి విపరీతమైన తలనొప్పి. అందువల్ల మీ పూరణలను సమీక్షించలేకపోతున్నాను.

    రిప్లయితొలగించండి