12, ఏప్రిల్ 2020, ఆదివారం

సమస్య - 3337

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"కవితతికిన్ సామ్యతయె మృగములకుఁ గలిగెన్"
(లేదా...)
"కవితతికిన్ మృగంబులకుఁ గల్గెను సామ్యము చిత్రమేటికిన్"

86 కామెంట్‌లు:


  1. నడిరేయి సరదా పూరణ:

    భవుభవుమంచు కూయుచును వాడల వాడల నేరుకొంచు భల్
    చవిగొని గూడు గట్టెదరు చక్కగ పుల్లలు కూడ బెట్టుచున్
    కవియన నీటి కాకియని గమ్మున జూచితి నాంధ్రభారతిన్...
    కవితతికిన్ మృగంబులకుఁ గల్గెను సామ్యము చిత్రమేటికిన్

    రిప్లయితొలగించండి
  2. కవితా ప్రతిభా మతులకు
    కవిశార్దూల కవిసింహ కవివృషభుండం
    చు విశిష్టమౌ బిరుదులిడ
    కవితతికిన్ సామ్యతయె మృగములకుఁ గలిగెన్

    రిప్లయితొలగించండి

  3. ఆటవిడుపు సరదా పూరణ:
    (జిలేబి గారికి అంకితం)

    నవులగ గ్రాసమున్ విరివి నందము నొందుచు నిద్రతీయుచున్
    కవితతి యందు కూడగను కమ్మని యష్టవధానమందునన్
    చవిగొని జింక వోలుచును జంకున చూచుచు భీతి నొందగా
    కవితతికిన్ మృగంబులకుఁ గల్గెను సామ్యము చిత్రమేటికిన్

    రిప్లయితొలగించండి
  4. కం//
    నవకవితాఝరి నందున
    పవళించియు సేదదీరు ప్రౌడపు లలనన్ !
    చవిగొను మకర‌ము గాంచగ
    కవితతికిన్ సామ్యతయె మృగములకుఁ గలిగెన్ !!

    రిప్లయితొలగించండి
  5. అందరికీ నమస్సులు 🙏🙏

    నా పూరణ ప్రయత్నం..

    *కం||*

    నవ విద్యా చదువులలో
    కవి వర్యుల పద్యమన్న గానరె జనులే
    వివరింపక జెప్పు నొక, కు
    *"కవితతికిన్ సామ్యతయె మృగములకుఁ గలిగెన్*!!

    *కళ్యాణ్ చక్రవర్తి, ముంబాయి*
    🙏🌸🙏🌸🙏

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'విద్యా చదువులు' దుష్టసమాసం. "విద్యల నేర్చుటలో" అనండి.

      తొలగించండి
  6. కం//
    కవులున్న రాజసభలో
    వివరము దెలవక వదరుచు వికృతపుచేష్టన్ !
    కవితా చమకృతి లేని, న
    కవితతికిన్ సామ్యతయె మృగములకుఁ గలిగెన్ !!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      "వివరము దెలియక' అనండి.
      'చమత్కృతి'ని 'చమకృతి' అన్నారు.

      తొలగించండి


  7. ఈ తతి యేమో తెలియదు :) ఔనౌనని ఒప్పేసుకుంటే నన్ను కూడా సెహబాషని మెచ్చేసుకుంటారు :) కాబట్టి జాల్రా యే సరి :)


    అవునా? సరియేనాండీ?
    అవునవును సరిసరి యే సుమా విను‌డయ్యా
    కవిరాట్టులనన్ సరియే
    కవితతికిన్ సామ్యతయె మృగములకుఁ గలిగెన్!



    జిలేబి

    రిప్లయితొలగించండి


  8. అవునవు నోయ్ జిలేబి సరియన్న కవీశ్వరు లెల్ల మెత్తురే
    కవులకు జాల్ర వేయుమిక కాదన కోయ్ సరి జోదు నిల్వగా
    నవసర మైన తెక్నికు సనాతన మైనది స్తోత్ర పాఠముల్
    కవితతికిన్ మృగంబులకుఁ గల్గెను సామ్యము చిత్రమేటికిన్


    జిలేబి

    రిప్లయితొలగించండి
  9. కవు లవధానాధ్వరమున
    వివిధ పద సమిధలను వేయ వెదకెడు వేళన్
    కవులు నెమరు వేయుదురట
    *కవితతికిన్ సామ్యతయె మృగములకుఁ గలిగెన్*

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      రెండవ పాదంలో గణభంగం. "సమిధల వేయ" అనండి.

      తొలగించండి

  10. కవి వృషభుండనుటయు గన
    కవితతికిన్ సామ్యతయె మృగములకుఁ గలిగెన్"_*
    కవి శార్దూలం బనుచును
    భువిలో కవులకు మృగాల పోలిక యొప్పెన్.

    రిప్లయితొలగించండి
  11. కవితతి వేఱువేఱుగను కయ్యము లాడవధానమందునన్
    బవరము నందు జంతువులు వాదము లేకనె కొట్టు లాడవా
    కవులు పదాల నేర హృది గాడ్పు పటాణి తృణంబు చేనిలో
    *కవితతికిన్ మృగంబులకుఁగల్గెను సామ్యము చిత్రమేటికిన్*

    రిప్లయితొలగించండి
  12. (కవులు ప్రయోగించే శబ్దాలకు,ప్రసరింపజేసే భావాలకు,కల్పించే
    సన్నివేశాలకు జంతువులకు ఎంతటి సంబంధమో కదా !)
    కవనమునందు శబ్దములు
    గంతులు వైచును జింకలట్టులన్ ;
    నవనవమైన భావములు
    నాట్యమొనర్చును సర్పరీతిగన్ ;
    చవులనుగొల్పు ఘట్టములు
    శార్డులసింధురభంగి నొప్పెడిన్ ;
    కవితతికిన్ మృగంబులకు
    గల్గెను సామ్యము చిత్రమేటికిన్ ?
    (సింధురము -ఏనుగు;చవులు -రుచులు )

    రిప్లయితొలగించండి
  13. చంపకమాల
    అవనిని సర్వజీవులకు నాకలి యుండుట కాదనందురే?
    యవియు మృగమ్ములున్ జెలఁగి యాకలి దీరఁగ వేటనెంచెడున్
    కవనపు టాకలిన్ జెలఁగి కావ్యపు వస్తువు నందు వేటలోఁ
    గవితతికిన్ మృగంబులకుఁ గల్గెను సామ్యము చిత్రమేటికిన్

    రిప్లయితొలగించండి

  14. మైలవరపు వారి పూరణ

    ప్రవిమల సాహితీ కవన రమ్య వనాంతర నిత్యచారులై
    వివిధపురస్కృతుల్ గొనెడి వేళ గృహమ్ములనుంట., బోనులో
    జవబలవన్మృగేంద్రమదె జాలిగ చిక్కిన రీతి దోచెడిన్!
    కవితతికిన్ మృగంబులకుఁ గల్గెను సామ్యము చిత్రమేటికిన్!!

    మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి.

    రిప్లయితొలగించండి
  15. రవి యుదయించుమొ దలుకొని
    కవితతికిన్ సామ్యతయె మృగములకుఁ గలిగెన్
    నవియివి యెంచుచు తమతమ
    జవులను దీర్చుగొనుచు గొనసాగుటయందున్

    రిప్లయితొలగించండి
  16. కువలయమందున ఘనులగు
    కవులకు మత్తేభమంచు గౌరవమొప్పన్
    వివరణ లింకేటికిఁ గన
    కవితతికిన్ సామ్యతయె మృగములకుఁ గలిగెన్

    రిప్లయితొలగించండి
  17. కవనము సేసి కట్టులను గావ్యము లల్లుట పోల్చి చూడగా
    వివిధములైన జంతువులు వింతగ సర్కసులోన నాడుటే
    బవరము సేయుచున్ చవులు వారెడుఁ బద్యము లల్లునట్టి యా
    "కవితతికిన్ మృగంబులకుఁ గల్గెను సామ్యము చిత్రమేటికిన్"

    రిప్లయితొలగించండి
  18. దివిజుల వాహనము లగుచు
    స్తవనీయపు బూజ లంద సన్మానింప న్
    భువి పాటించె దాని న్
    కవి త తికి న్ సామ్యత యె మృగముల కు గలి గె న్

    రిప్లయితొలగించండి
  19. వివిధములగు రచనలలో 
    కవికి కల స్వేఛ్చ మాకు కలిగె  ననంగా 
    అవి తిరుగసాగె బాటల
    "కవితతికిన్ సామ్యతయె మృగములకుఁ గలిగెన్"  

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      "కవికి కలుగు స్వేచ్ఛ..." అనండి. లేకుంటే గణభంగం.

      తొలగించండి
  20. కవనము లల్లెడి రసికులు
    భవబం ధములను వీడి పరవశ మందున్
    వివరిం పగనెవరి తరమె
    కవితతికిన్ సామ్యతయె మృగములకుఁ గలిగెన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      "భవబంధమ్ములను వీడి..." అనండి. లేకుంటే గణభంగం.

      తొలగించండి

  21. నవరస భావముల్ తొలక నవ్య ప్రసిద్ధి సుకావ్య సృష్టికై

    కవికులమే మనోహర ప్రకాశ పదాలకు వేట సేయరే

    భువిని చతుష్పదమ్ములవి భుక్తికి వేటను జేయు నట్టులన్ ??

    కవితతికిన్ మృగంబులకు గల్గెను సామ్యము చిత్రమేటికిన్


    -- ఆకుల శాంతి భూషణ్
    వనపర్తి

    రిప్లయితొలగించండి
  22. కందం
    కవిశార్దూలము మరియున్
    కవి మత్తేభమ్మటంచు ఘనముగ బిరుదుల్
    కవనపు గతుల నిడంగన్
    కవితతికిన్ సామ్యతయె మృగములకుఁ గలిగెన్

    రిప్లయితొలగించండి
  23. పవలనకుండ రేయనక బ్లాగున నేను సమస్యలిత్తు, నా
    కవనపుఁ దీరుఁ జూడనగుఁ గాక యటం చవధాన కార్యమం
    దెవరిటు దింపిరొక్కొ? భయమే కలిగెన్ గద, పృచ్ఛకాళియౌ
    కవి తతికిన్ మృగంబులకుఁ గల్గెను సామ్యము చిత్రమేటికిన్?

    రిప్లయితొలగించండి
  24. నేటి శంకరా భరణము సమస్య

    గాడిదను వివాహమాడెఁ గాంత ముదమునన్"

    ఇచ్చిన పాదము కందము నా పూరణ సీసములో

    నూట యాభై సంవత్సరములక్రితము పురుషులకు స్త్రీలు దొరికేవారు కాదుట. వివాహం ఆడవలెనన్న ఓలి (కన్యాశుల్కము) ఇవ్వ
    వలసి వచ్చేదిట. పిండికొద్ది రొట్టే. ఎక్కువ ఓలి ఇస్తే చక్కని స్త్రీ తొ వివాహము అయ్యేది. తక్కువ ఓలి ఇస్తే గుడ్డిదో కుంటిదో దొరికేదిట . ఒక చాకలి కుమ్మరి స్నేహితులు . చాకలి ఓలి క్రింద గాడిదను ఇచ్చి అందమైన భార్యను తెచ్చుకొన్నాడు. కుమ్మరి ఎక్కువ వోలి ఇచ్చు కోలేక ఒక గుడ్డి స్త్రీని వివాహము ఆడుతాడు. ఇంటికి వచ్చిన తర్వాత ఆ స్త్రీకి కనులు కనిపించక అటు ఇటు తిరుగుచు కుమ్మరి చేసుకున్న కుండలు అన్ని పగుల గొట్టేదిట
    అందుకే ఒక సామెత మన వాళ్ళు పెట్టాఱు

    ఓలి తక్కువ అని గుడ్డి దాన్ని పెండ్లాడితే కుండలు అన్ని పగులగొట్టినదట

    అని ఆ భావన తో ఈ పూరణము


    నాటి దినము లందు నారీ మణుల సంతు
    తక్కు వాయెనట నీ ధరణి లోన,

    పరిణయ మాడంగ పురుష పుం
    గవులకు కష్టముల్ కలుగు చుండె,

    నోలి నివ్వ దొరకు నీలవేణు లనుచు
    దెల్ప రేవడొకడు తీయ బోడి

    తండ్రి నడుగ చెప్పె “దస్రంబు నొక్కటి
    నోలి కింద నిడగ నాలి యగును

    తనదు సుతనుచు” నతని తోడ,రజకుడు
    వెతలు బడుచు తెచ్చి నతని కివ్వ

    గాడిదను, వివాహమాడెఁ గాంత ముదము
    నన్ పదుగు రెదుట, నాతి కొరకు


    నొక్క కుమ్మరి ఘనముగ నోలి నివ్వ

    లేక పెండ్లాడ నొక గుడ్డి లేమను,తను

    చూడ లేక తిరుగుచు రోజుకొక మారు

    కుండ లన్నింటిని పగుల గొట్టు చుండె


    రేవడు= చాకలి, దస్రము = గాడిద

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      ఈ పద్యంపై నిన్నటి వాట్సప్ సమీక్షను గమనించండి.

      తొలగించండి
  25. చవులూరించెడు కీర్తిని
    చవిజూడగ దానివెంట జనియెడు విధమున్
    అవలోకింప మరీచియె
    కవితతికిన్ సామ్యతయె మృగములకు గలిగెన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'విధమున్ అవలోకింప' అని విసంధిగా వ్రాయరాదు. "జను రీతిని నే నవలోకింప..." అనండి.

      తొలగించండి
    2. ధన్యవాదములు గురుదేవా,సవరించెదను!

      తొలగించండి
  26. కవికంఠీరవయనుచును
    కవిశార్దూలుండనుచునుకడువేడుకతో
    కవులనుకీర్తింతురిలను
    కవితతికిన్ సామ్యతయె మృగములకుఁ గలిగెన్

    రిప్లయితొలగించండి
  27. గురువు గారికి నమస్సులు.
    నవపల్లవకోమలయగు
    కవనంబులు రస ప్రసాద కావ్యంబగున్
    సువర మగు వ్యాకరణమే
    కవితతికిన్ సామ్యతయె మృగములకు గలిగెన్.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      రెండవ పాదం చివర గణభంగం. "కావ్యంబె యగున్" అనండి.
      'సువరమగు'?

      తొలగించండి
  28. కవియను కావ్యకర్త మది గంతులు వేయదె జింకవోలె తా
    గవితను సృష్టిజేయుతరి, గ్రాసము కోసము దేవులాడు ఖే
    ళి విధము కైతగాడు విహ రించును భావతరంగమున్ గనన్
    కవితతికిన్ మృగంబులకుఁ గల్గెను సామ్యము చిత్రమేటికిన్

    రిప్లయితొలగించండి
  29. వివిధంబగుమృగములచే
    వివరంబుగసభనునిల్పెవిష్ణువుకధలన్,
    కవిసమ్మేళనజూడగ
    కవితతికిన్ సామ్యతయె మృగములకుఁ గలిగెన్
    కొరుప్రోలు రాధాకృష్ణారావు

    రిప్లయితొలగించండి
  30. కవిసింహాకవిబెబ్బులి
    కవిగజమనిబిరుదులివ్వ కారణమేమౌ
    కవితలు రాయక పోయిన
    కవితతికిన్ సామ్యతయె మృగములకుఁ గలిగెన్

    రిప్లయితొలగించండి
  31. శ్రీ మాత్రే నమః

    కవులు సమాజమందు నిజ కల్మషముల్ నిరసించు యోధులే    
    కవన సుధాఝరీ హొయల గంధములన్, సుమ భావనంబులన్      
    భువనమునందు దిగ్గజపు పొంకము జూపిన  పద్యమందునన్ 
    నవ కవనంబులన్ లతల నందన వీధుల కానలందునా  
    కవి తతికిన్ మృగంబులకుఁ గల్గెను సామ్యము చిత్రమేటికిన్?
     
    కస్తూరి శివశంకర్

    రిప్లయితొలగించండి
  32. కం:

    రవికోటిధామ మయమై 
    నవకాంచన సంగతపద  నందన వనమున్ 
    వివశత్వములేనట్టి కు   
    కవితతికిన్ సామ్యతయెమృగములకుగలిగెన్

    కస్తూరి శివశంకర్

    రిప్లయితొలగించండి
  33. రవికాననిచోటులయును
    గవిచూచునుదప్పకుండకవనమువలనన్
    కవియనగకాకియగుటను
    గవితతికిన్ సామ్యతయెమృగములకుగలిగెన్

    రిప్లయితొలగించండి
  34. కవులనువారలెప్పుడునుగావ్యమువ్రాయగనిచ్చగింతురే
    మృగములుగూడనాకలికిమేదినినంతయుదిర్గుచుండుచున్
    గవితతికిన్మృగంబులకుగల్గెనుసామ్యముచిత్రమేటికిన్
    నవనినిజూడగాగలుగునందరియందుననౌత్సుకంబునున్

    రిప్లయితొలగించండి
  35. రవమది సింహపు గర్జన
    జవమది యశ్వంపు ధాటి సమముగ నొప్పున్
    అవకరముల నెదిరించెడి
    కవితతికిన్ సామ్యతయె మృగములకుఁ గలిగెన్

    రిప్లయితొలగించండి
  36. అవసరమైన వేళ మఱి అల్ల నమాజును చేయుమన్న వే
    ళ వెనుకముందులాడకను ప్రార్థనలన్ జరిపించిరే! కరో
    న విషపు వ్యాధి నడ్డుకొననన్న మతోన్మదులున్నదౌ ఘనా
    కవితతికిన్ మృగంబులకుఁ గల్గెను సామ్యము చిత్రమేటికిన్౹౹
    (ఘన+అకవి=ఘనాకవి=పరమ మూర్ఖుడు)

    రిప్లయితొలగించండి
  37. అవి, దుష్ట రాజ తతి కృత
    వివి ధాకృత్యముల నాప విలసిల్లెడు స
    త్కవి తతి ముఖేరిత వచన
    కవి తతికిన్ సామ్యతయె, మృగములకుఁ గలిగెన్

    [కవి = కవి, కళ్లెము; అవి = ఆ కళ్ళెములు]


    కవి మృగముల్ విచార మది కల్గఁ గవిత్వ గళస్రవద్ధ్వనుల్
    కవి మృగముల్ ముదమ్ము మదిఁ గల్గఁ గవిత్వ గళస్రవద్ధ్వనుల్
    కవి మృగముల్ వరాసన సుఖస్థిర సానుల నుండి చేయఁగాఁ
    గవితతికిన్ మృగంబులకుఁ గల్గెను సామ్యము చిత్రమేటికిన్

    రిప్లయితొలగించండి
  38. ఉ:

    ఎవరెటు వ్రాసినన్ మకరి యేనుగు పోరును మోక్ష గాథగా
    వివరణ దెల్పియుండిరట వేల్పును వేడుచు తా గజేంద్రుడై
    కవనము సాధ్యమే యనన కాయము నాగతి మార్పు బొందుటన్
    కవితతికిన్ మృగంబులకు గల్గెను సామ్యము చిత్రమేటికిన్

    కాయము : స్వభావము

    వై. చంద్రశేఖర్

    రిప్లయితొలగించండి
  39. సవరణతో 🙏
    కం//
    కవులున్న రాజసభలో
    వివరము దెలియక వదరుచు వికృతపుచేష్టన్ !
    కవితా చమత్కృతి లేని, న
    కవితతికిన్ సామ్యతయె మృగములకుఁ గలిగెన్ !!

    రిప్లయితొలగించండి
  40. అవి కనరాని చోటులను గాంచు కవీశ్వరు లందు రార్యులున్
    కవిగొని చుట్ట గౌచును మృగంబులు గాంచును సర్వ దిక్కులున్
    కవులకు లేడి చేష్టలవి కావ్యము లౌను సమూహ మందునన్
    కవితతికిన్ మృగంబులకు గల్గెను సామ్యము చిత్రమేటికిన్

    రిప్లయితొలగించండి
  41. అవనిని పాండితీగరిమ నందరిముందర జాటెడున్ జవిన్
    కవనవనంబునన్ జెలగి కావ్యపులక్షణ రీతులెంచుచున్
    కవిగజరాజ కేసరుల కందళమోయను వాగ్వివాదమున్
    కవితతికిన్ మృగంబులకు గల్గెను సామ్యము చిత్రమేటికిన్

    రిప్లయితొలగించండి
  42. మిత్రులందఱకు నమస్సులు!

    [కవివృషభుఁడు, కవిశార్దూలుఁడు అను బిరుదములచే యొప్పు కవులు, వారుపయోగించు ఛందములును జంతువులు, పక్షులు, పుష్పముల నామములతో విలసిల్లు కతమున వారికిని, జంతువులకును సామ్యమేర్పడినదనుట]

    కవివృషభాలు, పద్యముల గణ్యపు ఛందము నెన్న నద్ది జం
    తువుల ద్విజమ్ములన్ మఱి మనోజ్ఞసుమమ్ముల నామ కోటిచే
    నవనవలాడుచున్ మనకు నాణ్య కవిత్వము నిచ్చెఁ గాన, నా

    కవితతికిన్ మృగంబులకుఁ గల్గెను సామ్యము చిత్రమేటికిన్!

    రిప్లయితొలగించండి