22, ఏప్రిల్ 2020, బుధవారం

సమస్య - 3347

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"కన్నవారినిఁ దల్లియే కాటికంపె"
(లేదా...)
"అంత మొనర్చె సంతతిని నమ్మయె మిక్కిలి సంతసించుచున్"

73 కామెంట్‌లు:


  1. పంతము మీర పట్టుచును వాడుక వీడక పుర్వులన్ వడిన్
    కొంతయు తిండి లేనపుడు కోరిక తీరగ విడ్డురమ్ముగా
    చెంతకు రాగనే నగుచు చెంగున గంతుచు నూర్ణనాభియే
    యంత మొనర్చె సంతతిని నమ్మయె మిక్కిలి సంతసించుచున్

    రిప్లయితొలగించండి
  2. కంద. భాగవతంలో
    భరతుని భార్యలు మువ్వురు
    వరుసం బుత్రకులఁ గాంచి వల్లభుతోడన్
    సరిగారని తోడ్తోడను
    శిరములు దునుమాడి రాత్మ శిశువుల నధిపా!

    పాలనమొనర్చె గొప్పగ భరతుడవని,
    తండ్రి శౌర్యమ్ము కనరాక తరచి జూడ
    ముగ్గురునుపుత్రులకలిపి మొగ్గరమున
    కన్నవారినిఁ దల్లియే కాటికంపె

    రిప్లయితొలగించండి
  3. పనులు లేకయుప్రస్తుత పస్తులుండ
    ఆత్మ గౌరవ మునబిక్షఅడగ లేక
    సంతతెక్కువై తనపసికందులైన
    కన్నవారినిఁ దల్లియే కాటికంపె

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'ప్రస్తుత' అని ము ప్రత్యయం లేకుండా ప్రయోగించరాదు. "...లేక ప్రస్తుతము తా పస్తులుండ" అనండి. 'సంతతి+ఎక్కువై' అన్నపుడు సంధి లేదు. ఆ పాదంలో యతి తప్పింది. సవరించండి.

      తొలగించండి

  4. ఆటవిడుపు సరదా పూరణ:
    (జిలేబి గారికి అంకితం)

    గంతులు వేసి మూయుచును గట్టిగ వల్లభు వక్త్రమున్ సదా
    సుంతయు బుద్ధినిన్ గొనక సుందరు లంచును ముద్దుజేయుచున్
    చింతను జేయకే తనరి చెన్నుగ నిచ్చుచు స్పోర్ట్సు బైకు;...తా
    నంత మొనర్చె సంతతిని;...నమ్మయె మిక్కిలి సంతసించుచున్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అడిగారు కదా అని ముందు వెనుకలు ఆలోచించకుండా కొడుకులకు స్పోర్ట్ బైక్ కొనిచ్చి, వారిని పోగొట్టుకొని ఏడ్చినవారు ఎందరో ఉన్నారు.
      మీ ఆటవిడుపు పూరణ ఎంతో బాగుంది. అభినందనలు.

      తొలగించండి
  5. తే.గీ//
    అందచందాల బంగరు సుందరాంగి
    పెంపుజేసెను వ్యసనపు యింపులోన !
    కన్న వారినిఁ , దల్లియే కాటికంపె
    దుష్ట బుద్ధులై దరిచేరి తూలనాడ !!

    రిప్లయితొలగించండి
  6. శంకరాభరణం
    బుధవారం...22/04/2020

    సమస్య:

    "అంత మొనర్చె సంతతిని నమ్మయె మిక్కిలి సంతసించుచున్"

    నా పూరణ. ఉ.మా.
    **** **** *

    (కరోనా కారణమున పని లేక పిల్లల ఆకలి తీర్చలేక ఒక తల్లి బిడ్డలను చెరువులో వేసిన యదార్థ గాధ ఆధారంగా ఈ పూరణ....)

    ఉ.మా.ఐ

    చింతిలె నొక్కతల్లి పనిఁ జేయ లభించక లాకుడౌనులో...

    ఎంతనొ బిడ్డ లేడ్చిరయొ ఏమియు లేక భుజించ నింటిలో

    సుంతయు దారిలేక తన సూనలఁ జెర్వుని ద్రోసి వేసి తాఁ

    నంత మొనర్చె సంతతిని నమ్మయె మిక్కిలి సంతసించుచున్


    -- ఆకుల శాంతి భూషణ్
    వనపర్తి

    రిప్లయితొలగించండి
  7. చెంతన జేరి భార్య మరి చెప్ప దొడంగెను వింతగాదు నే
    సంతకు బోవు మార్గమున సంకటపెట్టెడు ఘోరమాయె హా
    యంత మొనర్చె సంతతిని నమ్మయె మిక్కిలి సంతసించుచున్
    చింతన నీకదేలమరి జిహ్మగముల్ తమ యండముల్ దిను
    స్వాంతము లేని జీవములు స్వస్థత నొందగ నూరడించితిన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'తిను స్వాంతము' అన్నపుడు 'ను' లఘువే. "తమ యండముల్ దినున్" అనండి.

      తొలగించండి
  8. తనను ప్రార్థించి వరమంది తనయులౌచు
    శాప వశమునఁ బుట్టిన సప్తవసువు
    లఁగొని పోయి ముంచెగద జలమున గంగ!
    కన్నవారినిఁ దల్లియే కాటికంపె

    రిప్లయితొలగించండి
  9. వింతగురోగమొచ్చెనట, వీధికినీడ్చగకాపురమ్ములన్
    అంతట తిండిలేకకడు,ఆత్రముజూపెడుపిల్లలన్నచో
    సుంతయు జాలిజూపకను,శూన్యపుదృక్కులవేగలేకతా
    నంతమొనర్చె సంతతిని ,నమ్మయెమిక్కిలిసంతసించుచున్
    +++++++++++++++++++++++++++
    రావెలపురుషోత్తమరావు




    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'సంతసించుచున్'?
      'వచ్చె'ను 'ఒచ్చె' అనరాదు. "వంతగ వచ్చె రోగమట" అనండి.

      తొలగించండి
  10. దేశ రక్షణ సేయగ దీక్షఁబూని
    సైన్యమందుఁ జేరగ తల్లి జంకు వడక
    నున్న పిల్లలిర్వురఁబంప, యుద్ధమందు
    వీర మరణమ్ముఁ బొందిరి వారలిర్వు
    రనుచు వార్త తెలియ నూరిజనములనిరి
    "కన్నవారినిఁ దల్లియే కాటికంపె!"

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కుదించి:

      ఉన్న కొడుకులనిర్వుర నొక్కతల్లి
      సైన్యమునఁ జేర్చె దేశరక్షణము సేయ
      యుద్థమున వారు మరణింప నూరనియెను
      "కన్నవారినిఁ దల్లియే కాటికంపె!"

      తొలగించండి
    2. మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.

      తొలగించండి



  11. జన్మ‌ నిడిన పులి‌ రయమన్ చంపి తినును

    తనదు కూనలన్,సర్పమున్ దాళ లేక

    నాకలికి చంపి తినును తన శిశువులను,

    కన్న వారిని తల్లియే కాటి కంపె

    సృష్టి ధర్మమది తరచి చూడ నిచట

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'రయమన్'? "జన్మ నిడి పులి రయమున జంపి తినును" అనండి.

      తొలగించండి
  12. కన్న వారిని తల్లియే‌ కాటి కంపె

    వింత యే కాదు చూడంగ, సంతు ను గని

    చంపె రయముగ గంగమ్మ ,సత్య బామ

    నరకుని కడ తేర్చెను గదా తరచి చూడ

    రిప్లయితొలగించండి
  13. (సుతసప్తకంగా పుట్టిన వసుసప్తకాన్ని గంగార్పణం కావిస్తున్న
    శంతనుమహారాజు రాణి గంగాదేవి )
    వంతను సుంతయైన తన
    వాక్కున మోమున దోపకుండగా
    జంతయు బోలె వర్తిలుచు
    చంచలరీతిని సాగిపోవుచున్
    జెంతనె నిల్చి శంతనుడు
    చేష్టలు కోల్పడి చూచుచుండగా
    నంతమొనర్చె సంతతిని
    నమ్మయె మిక్కిలి సంతసించుచున్ .
    (జంత -ధూర్తురాలు ;చంచలరీతి -మెరుపువలె )

    రిప్లయితొలగించండి
  14. ఉ॥
    ఎంతగ నందమైన సుతులింతికి గంగకు నుద్భవించగా
    సుంతనె జాలి లేక కడు చోద్యము చెందగ భర్త శంత నుం
    డెంతనొ దుఃఖమున్ మునుగ యేడుగురిన్ నదిలోన వేసెగా
    నంత మొనర్చెసంతతిని నమ్మయె మిక్కిలి సంతసించుచున్ .

    రిప్లయితొలగించండి
  15. చిక్కున బడితిమి కరోన శిష్టియందు ,
    రెండు నెలలుగ తిండియె లేదు , మాకు
    చావె సరియని దాను విషముదిని , తను
    కన్నవారినిఁ దల్లియే కాటికంపె

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'తాను'ను 'తను' అనరాదు. "తన కన్నవారిని" అనవచ్చు.

      తొలగించండి


  16. కతల్రాయడమెలా :)


    కావలెను సినిమాకొక కథ జిలేబి
    యనగ వ్రాసెను చప్పున నద్భుతముగ
    ట్యాగు లైనుబెట్టె భళి తటాలు‌ నిటుల
    "కన్నవారినిఁ దల్లియే కాటికంపె"!



    జిలేబి

    రిప్లయితొలగించండి


  17. వింతగ వ్రాయవే కథ పవిత్రత గాన్పడ గా జిలేబి యొ
    ళ్ళంతయు గర్జనమ్మున తలారిగ వేషము వేసి తీర్పుగా
    నంత మొనర్చె సంతతిని నమ్మయె మిక్కిలి సంతసించుచున్
    వంతులవారిగా పడతి బైసిని వారలె తీయ ద్రోహులై!



    జిలేబి

    రిప్లయితొలగించండి
  18. మైలవరపు వారి పూరణ

    కుపుత్రో జాయేత..
    క్వచిదపి కుమాతా న భవతి..

    అంతము జేయునన్నది యథార్థము., కాని కవీ ! మనంబునన్
    సంతసమందుచున్ జనని సంపదు దైత్యులనేని వారు లో...
    కాంతకులేని., అమ్మతనమట్టిది! నమ్మను నీదు పల్కులె....
    ట్లంతమొనర్చె సంతతిని నమ్మయె మిక్కిలి సంతసించుచున్ ???

    మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

    రిప్లయితొలగించండి
  19. పంతులు భార్య యప్పిడిన పాపి దురాత్ముడు నిత్య మచ్చటన్
    "గాంతుడు దాను జీవనము గాంచగ గోరిన జంపగావలెన్
    చింతను వీడి నీ"వనుచు జెప్పగ వానికి భీతిచెంది తా
    నంత మొనర్చె సంతతిని నమ్మయె మిక్కిలి సంతసించుచున్

    రిప్లయితొలగించండి
  20. సరిజేసితిని గురూజీ 🙏
    తే.గీ//
    అందచందాల బంగరు సుందరాంగి
    పెంపుజేసెను వ్యసనపు టింపులోన !
    కన్న వారినిఁ , దల్లియే కాటికంపె
    దుష్ట బుద్ధులై దరిచేరి తూలనాడ !!

    రిప్లయితొలగించండి
  21. సంతసమేమియున్నదిట ,సాహసమాయెగజీవితమ్మదే
    వింతగు రోగబాధలవి ,వేనకువేలుగ మృత్యుఘోషలై
    పంతముబట్టిపోషణను ,పట్టుగజేయగలేనిబాధతో
    యంతమొనర్చె సంతతిని, నమ్మయెమిక్కిలిసంతసించుచున్
    ++++++++++€€€+€+++
    రావెలపురుషోత్తమరావు

    రిప్లయితొలగించండి
  22. గురువుగారికి నమస్సులు
    ధనమడగనట్టివిశాలధర్మనిరతి
    ప్రాణమిచ్చికాపాడినప్రాణమిత్ర
    నట్టిసుగుణరాశియుతల్లినంతుజూడ
    కన్నవారిని,దల్లియే కాటికంపె.

    రిప్లయితొలగించండి
  23. *శంతనుని మనో వేదన*

    మాట యిచ్చితి నలనాడు మగువ కనుచు
    నోరు మెదపని వాడనై యూరుకుంటి
    మనసు కలచి వేసెను గదా కనగ నిదియె
    కన్నవారినిఁ దల్లియే కాటికంపె

    రిప్లయితొలగించండి
  24. మెంతియు పాలకూర యును మేలుగ చిక్కుడు బీర దొండలా
    యింతియె లాలపోసి మురిపించియు పెంచియు మూడునాళ్ళు తా
    గొంతులు కోసి చంపెనయ కూరలు వండగ వాని పెర్మితో
    *నంత మొనర్చె సంతతిని నమ్మయె మిక్కిలి సంతసించుచన్*

    తిరుక్కోవళ్ళూరు శ్రీ హర్ష

    రిప్లయితొలగించండి
  25. కాళ రూపు కరో న తా కాటు వేయ
    విషము గ్రక్కుచు లోకాన విస్తరింప
    పిన్న పెద్దలు మరణింప విధిగ తనదు
    కన్న వారిని తల్లియే కాటి కంపె

    రిప్లయితొలగించండి
  26. కామ ధేనువు జూడగ కన్నుగుట్టె
    తస్క రించగ నెంచుచూసాగిరచట
    శాప వశమున వసువుల సాగనంప
    కన్న వారినితల్లియెకాటికంపె
    కొరుప్రోలు రాధాకృష్ణారావు

    రిప్లయితొలగించండి
  27. మిత్రులందఱకు నమస్సులు!

    [అష్టవసువులు వసిష్ఠుని కామధేనువు నపహరించి, శప్తులైన వృత్తాంతము నిట ననుసంధానించుకొనునది]

    చింతన లేక దోసమని, చెంత గమించెడు కామధేనుఁ దా
    మంతట దొంగిలింప, ముని "మర్త్యులు కం" డన, వేడ, "గంగకున్
    సంతతిగా జనించియు, వెసన్ మరణింపుఁ" డనంగ, గంగ ’తా
    శంతను రాణియై, వెస స్వజన్ములఁ జంపఁగ’ నొప్పె! నట్టులే

    యంత మొనర్చె సంతతిని నమ్మయె మిక్కిలి సంతసించుచున్!

    రిప్లయితొలగించండి
  28. వింతగు వైరసున్ దగిలి పిల్లలు నల్లలలాడ నంత మా
    చింతల దీర్చుమంచు దగ జేయగ పూజలు దైవమా క్రిమిన్
    అంత మొనర్చె; సంతతిని నమ్మయె మిక్కిలి సంతసించుచున్
    చెంతకు జేరదీసె, వికసించెను మోమున మందహాసమే

    రిప్లయితొలగించండి
  29. శంకరాభరణం
    బుధవారం...22/04/2020

    సమస్య:

    "అంత మొనర్చె సంతతిని నమ్మయె మిక్కిలి సంతసించుచున్"

    నా పూరణ. ఉ.మా.
    **** **** *

    కొంతయు జాలిలేక నరకుండు సమస్తపు లోకవాసులన్

    జింతిల జేయచున్..,మిగుల జెల్గుచు క్షోభల నిచ్చె వారికిన్

    అంతట భద్ర కాళి వలె నాజిని రేగుచు సత్యభామ.,తా

    నంత మొనర్చె సంతతిని నమ్మయె మిక్కిలి సంతసించుచున్


    -- ఆకుల శాంతి భూషణ్
    వనపర్తి

    రిప్లయితొలగించండి
  30. పూజ్యులకు ప్రణామాలు🙏

    ఉచ్ఛ నీచము లెరుగక మచ్చ తెచ్చె
    యబలను చెరచగ దురిత యసుర భంగి
    యమ్మ కాళిగ మారగ యంతు జూడ
    యసుర నరకుని చెండాడు నంబ రీతి
    *కన్న వారిని దల్లియె కాటి కంపె*

    వాణిశ్రీ నైనాల

    రిప్లయితొలగించండి
  31. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  32. శంకరాభరణం గ్రూపు వారిచ్చిన సమస్యకు నా పూరణలు

    డా.బల్లూరి ఉమాదేవి.

    తే.గీ:అష్ట వసువులు వేడగ యమర తటని
    తల్లి యయ్యెను వారికి ధరణి యందు
    శాప ముడుపగ పెంచినా జవము గాను
    *కన్నవారినిఁ దల్లియే కాటికంపె"

    మరొక పూరణ

    ఉ.మా:అంతమొనర్తువంటగద యందరి పాపము లెల్ల వేగమే
    చెంతకుచేరి మ్రొక్కితిమి శీఘ్రమె మాకిక తల్లివై వడి
    న్నంతము చేయుమమ్మయని నాశగవేడిన యంతనొప్పుచున్
    అంత మొనర్చె సంతతిని నమ్మయె మిక్కిలి సంతసించుచున్"

    రిప్లయితొలగించండి
  33. *శంతనుని మనో వేదన*

    ఇంతికి నాడె నే వచనమిచ్చితి నంచును మిన్నకుంటి తా
    నింతటి ఘోరకృత్యముల నెవ్విధి జేయదొడంగెనో కదా
    పంతము బూనినట్లు పసి పాపలటంచును చూడకుండ తా
    నంత మొనర్చె సంతతిని నమ్మయె మిక్కిలి సంతసించుచున్

    రిప్లయితొలగించండి
  34. ప్రీతితో పాయసము జేసె పిల్లలు తిన
    బల్లి పడె నెరుగదు కన్నతల్లి యకట
    విషపు కూడు బలిగొనెను వెతకలుగగ
    "కన్నవారినిఁ దల్లియే కాటికంపె"

    రిప్లయితొలగించండి
  35. పొదిగి గుడ్లను ప్రేమతో భోగి యొకటి
    యాకలియడర ఆహార మందకున్న
    క్షుత్తు నోర్చువిధమ్ము చేకూరక వడి
    కన్నవారిని తల్లియే కాటికంపె

    రిప్లయితొలగించండి
  36. కూలిపనులేవియునులేమికూడులేక
    పస్తులుండగవారలుభారమగుట
    కన్నవారినిదల్లియేకాటికంపె
    మాయదారికరోనయడాయుకతన

    రిప్లయితొలగించండి
  37. కాంతను కామభోగపు సుఖంబులనిచ్చెడి యాటబొమ్మగా
    నెంతయొ దల్చునట్టి మతి హీనులు శుంభనిశుంభులన్ సదా
    శాంతము నొప్పు హైమవతి చండుని ముండుని యుద్ధమందు దాఁ
    నంత మొనర్చె సంతతిని నమ్మయె మిక్కిలి సంతసించుచున్

    రిప్లయితొలగించండి
  38. వింతగురోగమైయిదియబిడ్డలజెంతకుజేరభీతితో
    నంతమొనర్చెసంతతినినమ్మయెమిక్కిలిసంతసించుచున్
    జింతనజేయగానగునుచేడియలైననుదూరముంచుచో
    జింతలుబోయియెప్పటికిసేమముతోడనునుండవీలగున్

    రిప్లయితొలగించండి
  39. ఎప్పు డెయ్యది యేరికి ముప్పు తెచ్చు
    నెవ్విధిని నెచ్చట నెఱుంగు నవ్విధాత
    మాయదారి కీట మ్మిట మత్సరించఁ
    గన్నవారినిఁ దల్లియే కాటికంపె


    వింతలు గావు దేవతల భీకర కృత్యము లెంచ భావి భూ
    శాంతికిఁ గారణమ్ము లగుఁ జాలదు మానవ మేధ నేర్వఁగన్
    శంతన పుత్ర సప్త వసు సంఘముఁ దీర్చఁ బ్రతిజ్ఞ గంగ తా
    నంత మొనర్చె సంతతిని నమ్మయె మిక్కిలి సంతసించుచున్

    రిప్లయితొలగించండి
  40. శంతను రాజుచే గొనగ చక్కనిమాటను నడ్డుచెప్పనన్
    వింతగ సప్తసూనులను వేగము గంగను పారవేసి తా
    నంతమొనర్చె సంతతిని నమ్మయె మిక్కిలి సంతసించుచున్
    చింతిత శాపమోచనము శీఘ్రమునొందగ నష్టదేవతల్

    రిప్లయితొలగించండి
  41. తేటగీతి
    గాలి వానల వరదల్ల గట్టుఁ జేర్చ
    బిడ్డ లిరువురి చంకల బిగిసి పట్టి
    పడవ నీటిని వాలఁగ పట్టుదప్పి
    కన్న వారినిఁ దల్లియే కాటికంపె


    ఉత్పలమాల
    ఎంతటి కట్టుదిట్టముగ నింటిని దీర్చిన నెల్క సంతతుల్
    కంతలు బెట్టి ధాన్యమును గాదెల భంగమొనర్చ పెంటికల్
    చింతలు బెట్ట బోనొకటి సిద్ధముఁ జేయుచు మందు తోడనే
    యంత మొనర్చె సంతతిని నమ్మయె మిక్కిలి సంతసించుచున్

    రిప్లయితొలగించండి
  42. వింతగుజీవి పూని కడు వేదన పెట్టగ మానవాళినే
    సుంతయు మార్గమున్ కనక, సోకు నడంచగ కోరగా శివన్,
    శాంతి నొసంగ, నెంచుచును చండి కరోనను దుష్ట సంతుగా,
    నంత మొనర్చె సంతతిని నమ్మయె మిక్కిలి సంతసించుచున్

    రిప్లయితొలగించండి
  43. ఉ:

    సుంతయు తల్లడిల్లకనె సూటిగ సైన్యము నందు జేరగన్
    పంతము నెగ్గె యంచనన;;; భారత హద్దుల పంపనెంచిరై
    పొంతన లేని యుద్ధమున పోకిరి శత్రు శతఘ్ని కాల్పులం
    దంత మొనర్చె సంతతిని; ;;
    నమ్మయె మిక్కిలి సంతసించుచున్

    వై. చంద్రశేఖర్

    రిప్లయితొలగించండి
  44. తెలుసు నీ కరోన వ్యాప్తి కలదటంచు
    తెలిసి పిల్లల బయటకు తిరుగనంపె
    తగులగ కరోన వారికి తగ్గకున్న
    కన్నతల్లియె వారిని కాటికంపె

    రిప్లయితొలగించండి
  45. [4/22, 15:10] shankargdabbikar999: వింతగదే వచించుటిటు వేల్పులు నమ్మను సృష్టిజేయరే
    చెంతన నుండ లేము మనసే హృదయంబయి ప్రేమరూపమై
    సంతులచింతబాపిమనసావచసాశిరసావసించునేవిధిన్

    యంతమొనర్చె సంతతిని నమ్మయె మిక్కిలి సంతసించుచున్
    [4/22, 15:16] shankargdabbikar999: అంతకుడయ్యెలోకములకంతముజేసెదనంచుసత్యయే
    పంతముబూనివల్లభునిభవ్యవిహంగమునెక్కిస్రుక్కతా
    నంతటతానెబోయిరణమందునకంసునిగూల్చెభూమిజున్
    యంతమొనర్చెసంతతినినమ్మయెమిక్కిలిసంతసించుచున్
    [4/22, 15:24] shankargdabbikar999: సంతతిమంచిచెడ్డలనుసాధ్వియజూచునటంచువేల్పులే
    శాంతముదాంతియున్శమముచారువిశాలపుడెందుమందురా
    కాంతయెగంగయయ్యుపసిగందులశాపమునూడ్చనిర్దయన్
    యంతమొనర్చె సంతతిని నమ్మయె మిక్కిలి సంతసించుచున్
    [4/22, 15:32] shankargdabbikar999: వింతయెసృష్టియంతటనుబిల్లులుపాములుక్రూరజంతువుల్
    సంతతిగల్గునంతటనెచావనియాకటిచెంతజేరదా
    నంతమొనర్చెసంతతినినమ్మయెమిక్కిలిసంతసించుచున్
    సంతదిశేషమేమిగులుశాపముగాదిదిదైవవాక్కగున్

    రిప్లయితొలగించండి
  46. శంతనుని భార్య గంగయె వింతగాను
    సంతు గలిగిన వెంటనే చింతలేక
    నీటముంచుచు నేడ్గుర నిర్దయగను
    కన్నవారిని తల్లియే కాటికంపె!!!

    రిప్లయితొలగించండి
  47. వింతజాడ్యము ప్రబలెను విశ్వమందు
    పిట్టలట్టుల నెందరోమట్టియందు
    నొరిగి పోయిరివారియందొకరియింట
    కన్నవారినిఁ దల్లియే కాటికంపె

    రిప్లయితొలగించండి
  48. తండ్రి తుది యాత్ర లోనుండ దగును మీకు
    పోము మేమని మీరలు పో‌రదేల?
    మనదు ధర్మమార్గమెపుడు మరువకుడని
    కన్నవారినిఁ దల్లియే కాటికంపె

    రిప్లయితొలగించండి