25, ఏప్రిల్ 2020, శనివారం

సమస్య - 3350

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"ఎలుక పాము నెమలి యెద్దు కపులు"
(లేదా...)
"ఎలుక భుజంగమున్ నెమలి యెద్దు గజమ్ము మృగేంద్రమున్ కపుల్"

69 కామెంట్‌లు:


  1. నడిరేయి సరదా పూరణ:

    తలవకు దోషమంచునిట తప్పుగ నెన్నక హాస్యరీతినిన్:
    కులుకుచు మూడు వత్సములు కూరిమి నొందుచు వెళ్ళబుచ్చగాన్
    పలికితి శంకరాభరణ ప్రాంగణ మందున నున్న విచ్చటన్:
    ఎలుక భుజంగమున్ నెమలి యెద్దు గజమ్ము మృగేంద్రమున్ కపుల్

    రిప్లయితొలగించండి

  2. ఆటవిడుపు సరదా పూరణ:
    (జిలేబి గారికి అంకితం)

    తలచుచు వారి లాభములు తన్నుకు చచ్చుచు నచ్చటిచ్చటన్
    పలువురు వేరు రీతులను పల్కుచు మెచ్చుచు సోనియమ్మనున్
    కలిగిరి రాజతంత్రమున కౌగిలి గూడుచు కాంగ్రెసందునన్
    ఎలుక భుజంగమున్ నెమలి యెద్దు గజమ్ము మృగేంద్రమున్ కపుల్

    రిప్లయితొలగించండి
  3. ఎల్ల గణముల కధిపతి నెక్కునెద్ది?
    పరమ పావనుడెవనిపై పవ్వళించె?
    భరత దేశపు జాతీయ పక్షి యెద్ది?
    గడ్డి తింటు నన్నమిడెడి ఘనుడెవండు?
    వారథిని గట్టి లంకకు చేరిరెవరు?
    ఎలుక పాము నెమలి యెద్దు నింక కపులు!

    రిప్లయితొలగించండి
  4. కోవిడంచు వచ్చె కొత్త రోగమొకటి
    జనము చేరిరింట జడిసి కొనుచు
    జీవ జాలమెల్ల స్వేచ్ఛగా తిరుగాడ
    ఎలుక పాము నెమలి యెద్దు కపులు.

    రిప్లయితొలగించండి
  5. విలువలులేని సంఘమిది,వేత్తలుగూడను క్రూరసాములై
    కులుకులు కుమ్మరించుచునె,కూటమిగట్టుదురయ్య కుట్రలన్
    పలుకరదొక్కరైన తమ పట్టునువీడరు పంచతంత్రమున్
    ఎలుక భుజంగమున్ నెమలియెద్దు గజమ్ము మృగేంద్రముల్ కపుల్
    +++++++++++++++++
    రావెలపురుషోత్తమరావు

    రిప్లయితొలగించండి
  6. (చందమామ సంచికలో బొమ్మలకోసం చిత్రకారులను
    పిలిచిన సంపాదకులు )
    మెలకువ లెన్నియో తెలుపు
    మేలిమి బాలల "చందమామ"లో
    సలలితసంచికన్ మిగుల
    చక్కని "రాక్షసికోన"గాథకై
    ఎలుక భుజంగముల్ నెమలి
    యెద్దు గజమ్ము మృగేంద్రముల్ కపుల్
    వెలయగ బొమ్మగీయుటకు
    బిల్చిరి చిత్రను శంకరున్ బుధుల్ .
    (చిత్ర ,శంకర్ -ప్రఖ్యాతచిత్రకారులు)

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
      నాకు తెలిసినంత వరకు చందమామలోని ఒక సీరియల్ కు చిత్ర బొమ్మలు వేస్తే, మరొక సీరియల్ కు శంకర్ వేసారు. ఇద్దరు కలిసి బొమ్మలు వేసిన సీరియల్ లేదు.

      తొలగించండి
    2. నిజమేనండీ !కాని సమస్కందులైన ఆ యిద్దరు చిత్రకారులను స్మరించాలని అలా భావించాను .
      ధన్యవాదాలండీ !

      తొలగించండి
  7. కొల్లగొట్టువారు, గూఢపు పగ పూను
    వారు, నాట్యమాడు భామినులును,
    ఫలము తృణమె యైన బండచాకిరిఁ జేయు
    వారు, వెకిలి పనులు వలదనినను
    పూని చేయు వారు, పోలికఁ గ్రమమున
    నెలుక పాము నెమలి యెద్దు కపులు!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మిత్రమా ఆట వెలది నాలుగు పాదాల కే పరిమితము

      తొలగించండి
    2. మీ పద్యానికి నా సవరణ....
      కొల్లగొట్టువారు, గూఢపు పగ పూను
      వారు, నాట్యమాడు భామినులును,
      ఫలము తృణమె యైన బండచాకిరిఁ జేయు
      తృణము మేయువాడు, తెలివి మాలినవార
      లెలుక పాము నెమలి యెద్దు కపులు!

      తొలగించండి
  8. కలయిది కాదు వాస్తవము కణ్వమహర్షితపోవనంబునన్
    వలపువహించి జన్మగతవైరము మాని పరస్పరం బటన్
    మెలగుచునుండె జీవములు మేదిని పైనను "బిల్లి కుక్క యా
    యెలుక భుజంగమున్ నెమలి యెద్దు గజమ్ము మృగేంద్రమున్ కపుల్"

    రిప్లయితొలగించండి
  9. సమస్య :-
    "ఎలుక పాము నెమలి యెద్దు కపులు"

    *ఆ.వె**
    1.
    మానవాళి నంత మట్టుబెట్టు కరోన
    కాలు బయట పెట్టక భయపెట్టె
    ఎలుక పాము నెమలి యెద్దు కపులు కాక
    జీవరాశి కంత స్వేచ్ఛ గలిగె

    2.
    ఎలుక పాము నెమలి యెద్దు కపులు కాక
    కుక్క పిల్లి చిరుత నక్క చిలక
    జింక గద్ద యుడత సింహమేనుగులన్ని
    సంబరముగ మేము సర్కస్ లొ చూశాము
    ...............‌.✍చక్రి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
      రెండవ పూరణ నాల్గవ పాదంలో గణభంగం. "సంబరముగ గంటి సర్కసు జని" అనండి.

      తొలగించండి
  10. పిల్లి వైరి ఏది,బిలవాసి యెవరొకొ,

    శిఖి యనగ నేమి,శీభ్య మనగ


    నేమి,లంక చేరె నెవరు వారది కట్టి,

    ఎలుక,పాము,నెమలి,ఎద్దు,కపులు

    రిప్లయితొలగించండి
  11. జనుల నుండి సోకు జబ్బు కరోనను
    దొలగియుండుటెట్లు దొరకకుండ
    యనుచు దలచ నచట నడవిన గూడిరి
    యెలుక పాము నెమలి యెద్దు కపులు"

    రిప్లయితొలగించండి


  12. ఏదన్నా దత్తపది యాండి ? :)


    వందనమిడి దత్తపది పదములనిచ్చి
    "ఎలుక పాము నెమలి యెద్దు కపులు"
    సీత కష్టములను చెప్పగోరెను పృచ్ఛ
    కుడు జిలేబిని పదుగుండ్రు చూడ



    జిలేబి

    రిప్లయితొలగించండి
  13. బలిమినిఁ జంపి జంతుతతిఁ బాశవికమ్మునఁ దిందురంచు నా
    తులువలఁ గూల్చఁ దత్క్రిమినిఁ ద్రోలె శివుండు కరోనఁ బైకొనన్
    దలుపు బిగించ నా జనులు దారిఁ జరించెను భీతి వీడి చి
    ట్టెలుక భుజంగమున్ నెమలి యెద్దు గజమ్ము మృగేంద్రమున్ కపుల్.

    కంజర్ల రామాచార్య
    వనస్థలిపురము.

    రిప్లయితొలగించండి


  14. భళారే చిత్రం :)


    మెలకువ గాంచె కాననము మెంగతనమ్మును వీడె ధాటిగా
    పలికె జిలేబి యాంగ్లమున బాలల డిస్ని వరల్డు చిత్రమం
    దు లసుకు తోడు మానవుడు దొమ్మిని చేయగ మంథరమ్ముతో
    డెలుక భుజంగమున్ నెమలి యెద్దు గజమ్ము మృగేంద్రమున్ కపుల్!


    జిలేబి

    రిప్లయితొలగించండి
  15. ఆ.వె//
    పర్ణశాల లందు వర్ణ వైవిధ్యమౌ
    ఎలుక పాము నెమలి యెద్దు కపులు !
    వైర బుద్ధి వదలి వైషమ్యము మరచి
    దివ్య భూమినందు దిరుగుచుండె !!

    రిప్లయితొలగించండి
  16. మైలవరపు వారి పూరణ

    ఇల జడబుద్ధులైన యమరేంద్రుని బుత్రుల విష్ణుశర్మ ధీ...
    కలితుల జేయ వ్రాసెనొక గ్రంథము నీతికథామతమ్ము., ప...
    క్షులు మరి జంతువుల్ పలుకుచుండును., గన్పడు పంచతంత్రమం...
    దెలుక భుజంగమున్ నెమలి యెద్దు గజమ్ము మృగేంద్రమున్ కపుల్ !!

    మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి.

    రిప్లయితొలగించండి
  17. చైనదేశ మందు చంపుకు తినుచున్న
    ఎలుక పాము నెమలి యెద్దు కపులు
    చచ్చి పోవు చున్న జనులను చూడంగ
    కోవిడందు, వదిలెజీవ హింస

    రిప్లయితొలగించండి
  18. కలుగులోనయుండి పలువస్తువులు తిను 
    సహజ వైరమున్న జంతులేవి?
    శివుని వాహనమ్ము చెప్పుకొనుము 
    అడవిలోన రాము నాదుకొనెను
    "ఎలుక పాము నెమలి యెద్దు కపులు"  

    రిప్లయితొలగించండి
  19. బొరియ నుండు నేది? బుసలు కొట్టు న దేది?
    నాట్య మాడు నేది? నంది యేది?
    రణము నం ద దెవరు రాముని సేనయో?
    ఎలుక ' పాము ' నెమలి ' యెద్దు ' క పులు

    రిప్లయితొలగించండి


  20. మా శివయ్యే గొప్పోడు.



    శివుని యింట నుండె చీకుచింతయులేక
    యెలుక, పాము నెమలి యెద్దు, కపులు
    రాముని కెడ చేరి శ్రమ బడిరి! హరుని
    కొలువె మేల్మి పట్టుగొమ్మ మనకు!


    జిలేబి

    రిప్లయితొలగించండి
  21. శంకరాభరణం
    శనివారం...25/04/2020

    సమస్య:

    "ఎలుక భుజంగమున్ నెమలి యెద్దు గజమ్ము మృగేంద్రమున్ కపుల్"

    నా పూరణ. చం.మా.
    **** **** *

    ఇల గన వాసి పర్వమన నెన్నుక జేతురు సంకురాత్రినిన్

    తలపగ మేటి ఘట్టమన దప్పక బొమ్మల కొల్వులే గదా!

    పిలిచెను ప్రక్క వారలను బేరిచి భామయె యిట్టి బొమ్మలన్

    "ఎలుక ,భుజంగమున్ ,నెమలి, యెద్దు, గజమ్ము, మృగేంద్రమున్ ,కపుల్"


    -- ఆకుల శాంతి భూషణ్
    వనపర్తి

    రిప్లయితొలగించండి
  22. గళమున నింపి క్ష్వేళమును గంగనె యౌదల దాల్చి పార్వతిన్
    నిలిపియు నర్ధ భాగమున నీశుడు కాపురముండు కొండపై
    చెలిమిని జేయుచుండె భళి చిత్రమనంగను వైరివర్గమే
    *యెలుక భుజంగమున్ నెమలి యెద్దు గజమ్ము మృగేంద్రమున్ కపుల్*

    తిరుక్కోవళ్ళూరు శ్రీ హర్ష

    రిప్లయితొలగించండి


  23. కరిముఖుండు నెక్కు, కమలాక్షు పానుపు
    గుహుడు దేనినెక్కు కూర్మి తోడ
    శివుని వాహనమ్ము శ్రీరాము బంట్లన
    ఎలుక,పాము,నెమలి యెద్దు కపులు

    రిప్లయితొలగించండి
  24. కప్పపాముపీత గబ్బిలంబునుకుక్క
    ఎలుక పాము నెమలి యెద్దు కపులు
    బేధ మెరుగకుండ మేయుచైనీయులు
    పగకరోన నిపుడు పంపె మనకు.

    రిప్లయితొలగించండి
  25. కొలిచిరి వాహనంబులయి కొక్కురవున్ మనసాసతిన్ నభో
    దళపతి రుద్రులన్ దశశతాక్షుని దుర్గ ననన్య భక్తితో
    నెలుక భుజంగమున్ నెమలి యెద్దు గజమ్ము మృగేంద్రమున్! కపుల్
    అలుగక వెద్కుచుండెనె యనాదిగ చోదకుడెవ్వడాయనిన్౹౹

    రిప్లయితొలగించండి
  26. ఆఖు వనగ నేమి? యధిజిహ్వ మననేమి?
    యర్జున మననేమి? హంతువేమి?
    బాహుక మననేమొ వరుసగా చెప్పెదన్
    ఎలుక, పాము, నెమలి, యెద్దు, కపులు.

    రిప్లయితొలగించండి
  27. చలువ కొండ పైన గొలువు దీరిన స్వామి
    చిలువతాల్పు గొలువు చెలువమొప్పు
    నెలత గౌరి సుతులు బలగమ్ము దోడుగ
    నెలుక పాము నెమలి యెద్దు కపులు

    రిప్లయితొలగించండి
  28. మిత్రులందఱకు నమస్సులు!

    [నేను తెలుఁగు బోధించిన పాఠశాలలో విద్యార్థులకు వారి ప్రవర్తన ప్రకారము జంతువుల పేర్లిడి పిలిచిన సందర్భము]

    కలరయ శిష్యు లిచ్చటను గాంచఁగ నొక్కొక రీతి నుండ్రు! నే
    బిలిచితి వారి చేష్టలకుఁ బ్రేమనుఁ బేరిడి! జంతుబృందముల్
    గలిగె నిజంబు! నన్ గురువుగారని పిల్తురు! వారి పేర్లివే
    యెలుక భుజంగమున్ నెమలి యెద్దు గజమ్ము మృగేంద్రమున్ కపుల్!

    రిప్లయితొలగించండి
  29. కానరానియాకరోనమనలజేర
    యెలుకపామునెమలియెద్దుకపులు
    తప్పతిరుగనోపరెప్పటికిజనులు
    నెవరిభయమువారినిండ్లనునిచె

    రిప్లయితొలగించండి
  30. ఇలనుగరోనచుట్టగనునీయదియాయదినాకరాష్ట్రముల్
    విలవిలలాడుచుండుచునుభీతినినిండ్లనునంటియుండగా
    నెలుకలుభుజంగమున్నెమలియెద్దుగజమ్ముమృగేంద్రమున్ కపుల్
    బిలబిలయొక్కసారిగనుబేర్మినిగానలనుండివచ్చెరో

    రిప్లయితొలగించండి
  31. అడవి కేఁగ నేల నరయంగ వీటిని
    జంతు శాల కేల సనుదు చెపుమ
    పల్లె పల్లె లందుఁ బన్నుగ నుండవె
    యెలుక పాము నెమలి యెద్దు కపులు


    లలిత మనస్కులై ధర మెలంగఁగ నోపుఁ బరోపకారులై
    కలుష విదూరులై నిజము గాంచఁగ మానవు లౌదు రిద్ధరం
    బలువురు నిమ్న దత్తములు బాములు తీరఁగఁ గర్మ పక్వమై
    యెలుక భుజంగమున్ నెమలి యెద్దు గజమ్ము మృగేంద్రముం గపుల్

    రిప్లయితొలగించండి
  32. చం:

    సులభము దీనిజెప్పగను సుంతయు కష్ట తరంబు గాదిటన్
    పలువిధ జీవులన్ వరుస వాటున గానగ నార్థమౌనుగా
    సులువుగ, కేకి యొక్కటియె సొంపగు పక్షి తతిమ్మ జంతువుల్
    ఎలుక భుజంగమున్ నెమలి యెద్దు గజమ్ము మృగేంద్రమున్ కపుల్

    వై. చంద్రశేఖర్

    రిప్లయితొలగించండి
  33. పంచతంత్రమందు పలికించె కవిరాజు
    మౌక్తికములవంటి సూక్తి సుధలు
    ఎలుక పాము నెమలి యెద్దు కపులునందు
    మనుజభాషయందు మాటలాడె

    రిప్లయితొలగించండి
  34. ఆటవెలది
    నీతి నడత నేర్చి చేతనత్వముఁగొని
    బ్రతుకు దిద్దుకొనఁగ బాలలంత
    పంచతంత్రకథల పాత్రలయ్యె మిగుల
    నెలుక పాము నెమలి యెద్దు కపులు

    చంపకమాల
    తెలుగున గద్యమన్న తొలి దీర్చిన వారలు చిన్నయార్యులే
    పలుకులు నేర్చు బాలలకు వార్చెను నీతిని పంచతంత్రమన్
    లలి చిగురించు గాథల! విలాసము పంచఁగ పాత్ర లయ్యె నా
    యెలుక భుజంగమున్ నెమలి యెద్దు గజమ్ము మృగేంద్రమున్ కపుల్!



    రిప్లయితొలగించండి
  35. భక్తిఁగల్గు వారు పరమాత్ము నొడిఁజేరి
    పరవశమ్ము నొందు భక్త గణము
    జంతుజాలమందు చక్కగ లేరొకో!
    ఎలుక,పాము,నెమలి,యెద్దు,కపులు.

    రిప్లయితొలగించండి
  36. వనములు తెగ నరుకు స్వార్థ పరుల కింక
    బుద్ధి చెప్ప దలచి పోడు లోన
    జంతువులట కొన్ని చర్చింప వచ్చెనే
    యెలుక పాము నెమలి యెద్దు కపులు.

    రిప్లయితొలగించండి
  37. ఇలుకమనంగనేమి? మరిహీరమనంగను చెప్పు, చిత్రమే
    ఖలమన నేమియో? తెలుపు కంబళి యన్నను కుంజరమ్మనన్,
    దెలిమెక మన్నచెప్పుమిక ధీమతి వైహరు లన్న నేమిటో?
    ఎలుక భుజంగమున్ నెమలి యెద్దు గజమ్ము మృగేంద్రమున్ కపుల్

    రిప్లయితొలగించండి
  38. పొలములనిండ్లయందునను పొంచి పదార్థము దోచునెద్ది? తా
    కులుకుచునీలకంథరునికుత్తుకనుండునదెద్ది? దానికిన్
    బలమగుశత్రువెద్ది? హరువాహనమెద్ది? వనాంతరమ్ములన్
    పలలముగాకశాకముల పల్లవముల్ దినునెద్ది? దానికిన్
    కలతలుగూర్చునెయ్యది? కకావిక కొమ్మలదూకునెవ్వియో?
    ఎలుక భుజంగమున్ నెమలి యెద్దు గజమ్ము మృగేంద్రమున్ కపుల్

    రిప్లయితొలగించండి
  39. క్రమాలంకార పూరణ

    కలుగున దూరునెయ్యది ? సుఖంబుగ నీశుని కంఠహారమై
    వెలుగునదేది ? గౌరిసుతు వేగమె నెక్కెడు వాహనంబులా
    వల హరు శక్రు పార్వతుల వాహనమెయ్యవి రామబంటులే
    ఎలుక భుజంగమున్ నెమలి యెద్దు గజమ్ము మృగేంద్రమున్ కపుల్

    రిప్లయితొలగించండి
  40. సమస్య: ఎలుక పాము నెమలి యెద్దు కపులు
    పూరణ :
    ఆటవెలది
    ఎలుక, పాముఁ ఎఱుక ఎఱుగనిదై చచ్చె
    నెమలి యాట వెనుక పాము నలిగె
    యేరు పార యెద్దు లుఱుక కపులు దిరు
    గ విఱులు విరియ యిల గఱువు దీఱె

    రిప్లయితొలగించండి
  41. నేటి సమస్యకు నా పూరణములు:

    గణపతికిని బంటు, గరళకంఠుని గూడు,
    మబ్బుజూచి యాడు నబ్బురమున,
    శివుని వాహనంబు, శ్రీరాము సేవింత్రు,
    ఎలుక, పాము, నెమలి, యెద్దు, కపులు!

    ఎలమిని సంకురాతిరికి
    నిష్ఠగ బొమ్మల కొల్వు నందునన్,
    జెలగ విచిత్ర రూపముల
    చిత్రములుంచిరి చూడ, వేదికన్
    గలగల పారు నేరులును
    గంతుల నాడు తురంగ రాజు రా
    చిలుకలు కృష్ణమూర్తియును చిందులనాడెడి గొల్లభామలున్
    "ఎలుక భుజంగమున్ నెమలి యెద్దు గజమ్ము మృగేంద్రమున్ కపుల్!"

    రిప్లయితొలగించండి
  42. అడ్డుయదుపులేకయన్నింటినితినగ
    కోవిడొచ్చిజనులకొంపముంచె
    బాధపడగమానవాళియంతశపించె
    ఎలుకపామునెమలియెద్దుకపులు

    రిప్లయితొలగించండి
  43. మరో ప్రయత్నం...

    చంపకమాల
    విలువలెఱింగి విశ్వమున ప్రేమను బంచుచు సర్వజీవులన్
    దలచెడు భూమి జీవన విధానమె కాని మతమ్ము కాదనన్
    గొలచెడు వేల్పులున్ జనులుఁ గూడి చరించఁగ భాగమైనవే
    యెలుక భుజంగమున్ నెమలి యెద్దు గజమ్ము మృగేంద్రమున్ కపుల్


    రిప్లయితొలగించండి