కవిమిత్రులారా,
ఈరోజు నా పుట్టినరోజు. కవిమిత్రులు నా 'సప్తతి ఉత్సవం' ఘనంగా చేయాలనుకున్నారు. కాని కరోనా కారణంగా ఆ అవకాశం లేకుండా పోయింది.
'మెతుకుసీమ సాహితీ సాంస్కృతిక సంస్థ' పూనికొని అవుసుల భానుప్రకాశ్ గారి సంపాదకత్వంలో సర్వాంగ సుందరంగా 'శంకరాభరణం' పేరుతో 240 పేజీల నా సప్తతి సంచిక సిద్ధమయింది. పరిమితంగా ఆహ్వానింప బడిన కవిమిత్రుల సమక్షంలో, మా ఆశ్రమంలోనే ఈరోజు పుస్తకావిష్కరణ జరుగనున్నది. ఈ సంచిక కోసం వ్యాసాలు, పద్యాలు వ్రాసిన అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. నా యీ సాహితీ ప్రయాణం ఇలాగే కొనసాగడానికి తగిన ఆయురారోగ్యాలను ప్రసాదించ వలసిందిగా చదువుల తల్లి సరస్వతీ దేవిని వేడుకుంటున్నాను.