26, జులై 2020, ఆదివారం

సమస్య - 3438

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"వంచకులకు మాధవుఁ డిడు వరమోక్షమ్మున్"
(లేదా...)
"వంచన సేయువారల కవారిత మోక్షము మాధవుం డిడున్"

55 కామెంట్‌లు:


 1. నడిరేయి సరదా పూరణ:

  దంచుచు మెండు భాషణల దాహము తీరక కాంగ్రెసందునన్
  కొంచెము గూడ సిగ్గువిడి కోరుచు సీటులు మంత్రి మండలిన్
  పంచను జేరి భాజపది పైకము నొందుచు రాహులయ్యనున్
  వంచన సేయువారల కవారిత మోక్షము మాధవుం డిడున్

  మాధవుడు = Madhavrao Jivajirao Scindia

  రిప్లయితొలగించండి

 2. ఆటవిడుపు సరదా పూరణ:
  (జిలేబి గారికి అంకితం)

  మంచిగ నేర్చి ఛందమును మక్కువ జూపుచు పద్యమందునన్
  సంచుల నన్యదేశ్యములు చక్కగ వాడుచు పూరణంబులన్
  కొంచెము గూడ సిగ్గువిడి కోతలు కోయుచు రాజనీతినిన్
  వంచన సేయువారల కవారిత మోక్షముమాధవుండిడున్

  ఉమాధవుడు = శంకరయ్య (కంది వారు)

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ ఆటవిడుపు పూరణ బాగున్నది. అభినందనలు.
   మీరు ఏదో అడపా దడపా తప్ప సంచులకొద్ది అన్యదేశ్యాలు ప్రయోగించడం లేదు లెండి!

   తొలగించండి
 3. మించిన యధికారముతో
  సంచాలకు లపహరణము సలిపిన గూడన్
  అంచెలుగ దిద్దుకొన , నా
  వంచకులకు మా ధవుడిడు వరమోక్షమ్మున్

  ధవుడు= రాజు

  రిప్లయితొలగించండి


 4. సంచితమగు కర్మ సుమా
  వంచకులకు, మాధవుఁ డిడు వరమోక్షమ్మున్
  పంచన చేరి కృపకొరకు
  వంచిన తలయెత్తకనిక ప్రార్థింపగనే!


  జిలేబి

  రిప్లయితొలగించండి


 5. కందోత్పల


  సముచితముగాను కైవ
  ల్యము, వంచన సేయువారల కవారిత మో
  క్షము, మాధవుండిడున్ విడు
  వము కృష్ణా నిన్నటంచు ప్రార్థింపగనే


  జిలేబి

  రిప్లయితొలగించండి
 6. సమస్య :-
  "వంచకులకు మాధవుఁ డిడు వరమోక్షమ్మున్"

  *కందం**

  మంచి జరగదెపుడైనను
  వంచకులకు, మాధవుఁ డిడు వరమోక్షమ్మున్
  మంచిని జేసెడివారికి,
  నించుక మానవతయున్న నిల శ్రేష్ఠుండౌ
  .......................✍️చక్రి

  రిప్లయితొలగించండి
 7. క్రొవ్విడి వెంకట రాజారావు:

  త్రుంచును దైవము ముక్తిని
  వంచకులకు; మాధవుడిడు వరమోక్షమ్మున్
  మంచిని పెంచెడు కర్మలు
  మించుగ జేసెడి ఘనులకు మెల్పగు తీరున్.

  రిప్లయితొలగించండి
 8. క్రొవ్విడి వెంకట రాజారావు:

  మంచిని పెంచు కర్మలు సమంచితమైన విధానమందునన్
  మించుగ జేయబూనుచు నమేయముగా పరమాత్మ నెంచుచున్
  కొంచెముచేయు బూటకము కుత్సితబుద్ధి యధర్మవర్తనన్
  వంచనసేయు వారల కవారిత మోక్షము మాధవుండిడున్.

  రిప్లయితొలగించండి
 9. ఎంచగ నరకముతప్పదు
  వంచకులకు, మాధవుఁ డిడు వరమోక్షమ్మున్
  మంచిని సలిపెడుజనులకు
  సంచితమగుకర్మఫలము సంవేద్యంబౌ

  రిప్లయితొలగించండి


 10. కొంచెము కూడ నా విభుడు క్రోధము నొందడు వేచి యుండు దా
  నెంచిన మార్గమందు చన నిచ్చును వారిని, స్వీయమై నరుల్,
  త్రుంచుచు కీడుసేసెడు దురూహల, నించుక మంచి, చేయకన్
  వంచన, సేయువారల కవారిత మోక్షము మాధవుం డిడున్


  జిలేబి

  రిప్లయితొలగించండి
 11. ఎ౦చగ నరకము తప్పదు
  వంచకులకు, మాధవుఁ డిడు వరమోక్షమ్మున్
  స౦చితముగ పుణ్యములను
  వ౦చన లేకను నిరతము వర్ధిల్లినచోన్

  రిప్లయితొలగించండి
 12. మైలవరపు వారి పూరణ

  ఎంచగ తథ్యమెల్లరికినెప్పుడొ యప్పుడు తప్పదిద్ధరన్
  మంచికి మారుపేయగుచు మాన్యులుగా వెలుగొందువారికిన్
  ముంచెడు వారికిన్ సతతమోహనిమగ్నులకట్లె లోకులన్
  వంచన సేయువారల కవారిత మోక్షము మాధవుం డిడున్!!

  మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

  రిప్లయితొలగించండి
 13. కం//
  పంచాయతనమును గొలుచు
  కుంచితమగు బుద్ధిగలుగు కుంకలు దిట్టన్ l
  సంచిత పాపము దొలగిన
  వంచకులకు మాధవుఁ డిడు వరమోక్షమ్మున్ ll

  రిప్లయితొలగించండి
 14. సంచిత పాపముల్దొలగ సత్యపరాయణ ధర్మనిష్ఠతో
  వాంఛల గెల్చి నిల్చి భవబంధము లన్నియు దాటి నిత్యమున్
  మంచిని పెంచి పంచు ఋజు మార్గ నివారణ శత్రువర్గమున్
  వంచన సేయువారల కవారిత మోక్షము మాధవుం డిడున్

  రిప్లయితొలగించండి

 15. నా పూరణ. ఉ.మా.
  *** ********

  వంచన బుద్ది తోడ శిశుపాలుడు రావణుడాది వారు ధూ

  షించగ భూరి సంతతము శ్రీహరినిన్..,గడు గోపచిత్తుడై

  త్రుంచుచు జక్రి వారలను దొల్గగజేయుచు మౌని శాపమున్

  సంచిత పాపకర్మలను జక్కగ బాపుచు ముక్తి నీయడే??

  వంచన సేయువారల కవారిత మోక్షము మాధవుం డిడున్"


  -- 🌱 ఆకుల శాంతి భూషణ్ 🌱
  🌷 వనపర్తి🌷

  రిప్లయితొలగించండి
 16. మంచిని జేయగ బూనియు
  నెంచక దోషముల సతత మిచ్చా రతితో
  సంచిత యరి షడ్వ ర్గ పు
  వంచకులకు మాధవు డిడు వర మోక్ష మ్మున్

  రిప్లయితొలగించండి
 17. వంచన జన్మహేతువగు వాంఛితకార్యసముద్భబంబునై
  వంచనఁ జేయరే జనితవర్ధనపోషణ కోసమైన ని
  ర్వంచనకార్యమేది బువి? రాగవిలుప్తనిమిత్తమాత్రమై
  వంచన సేయువారల కవారిత మోక్షము మాధవుం డిడున్

  కంజర్ల రామాచార్య
  కోరుట్ల

  రిప్లయితొలగించండి
 18. ఈ నాటి శంకరాభరణ సమస్య

  వంచకులకు మాధవుడిడు వరమోక్షమ్మున్

  ఇచ్చిన పాదము కందము నా పూరణము సీసములో

  శిశుపాలు డెప్పుడు చెలిమితో నిచ్చకముల నాడ కున్నను ముక్తి నిచ్చి

  నావు,కుచేలుడు నమ్మినాడని నీవు గర్భ యాచకునికి కలిమి నొసగి

  నావు మారీచుడు,నాతి పూతన, ధేను కాసురులకును మోక్షము నిడితివి,

  మహిని వంచకులకు మాధవు డిడు వర మోక్షమ్ము నెప్పుడున్ ముదము తోడ


  ననెడి నపవాదును బడసి నావు గాదె,

  యేల కనికరమును వీడి జాలి చూప

  కుంటి వయ్య నీవిపుడని కంటనీరు

  గార్చె రామదాసా బంది ఖాన లోన

  రిప్లయితొలగించండి
 19. చంచలమానస చోరుని
  కంచుకి పానుపు గలిగిన కమలాక్షుని పూ
  జించెడు వారిని కాదని
  వంచకులకు మాధవుఁ డిడు వరమోక్షమ్మున్?

  రిప్లయితొలగించండి
 20. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

  రిప్లయితొలగించండి
 21. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

  రిప్లయితొలగించండి
 22. అంచితమైన జీవితమునన్యులుమెచ్చెడిరీతి సాగుచున్
  కాంచుచుతృప్తి నెప్పుడు సుకార్యములందున శౌరిఁ గొల్చుచున్
  మంచితనమ్ముగల్గి యొక మౌనియొసంగిన శాపకర్మచే
  వంచన సేయువారల కవారిత మోక్షము మాధవుం డిడున్

  రిప్లయితొలగించండి
 23. 26.07.2020
  అందరికీ నమస్సులు 🙏

  నా పూరణ..

  *కం*

  కించితు మనమున నాలో
  చించుచు భగవంతుడు పలు చింతలు దీర్చున్
  ఎంచక మంచిని మరి నెటుల
  *"వంచకులకు మాధవుఁ డిడు వరమోక్షమ్మున్"?*

  *కళ్యాణ్ చక్రవర్తి ముంబాయి*
  🙏

  రిప్లయితొలగించండి
 24. మంచిని జేయు నెపమ్మున
  సంచుల కొలదిగ నిధులను సవరింతురికన్
  పంచినఁ గాన్కల నెటులా
  వంచకులకు మాధవుఁ డిడు వరమోక్షమ్మున్

  రిప్లయితొలగించండి
 25. సంచితకర్మవశంబున
  ఎంచినపాపమువలననువేదనముట్టన్
  అంచునహరినేచూడగ
  వంచకులకుమాధవుడిడువరమోక్షమ్మున్

  రిప్లయితొలగించండి
 26. కంచుకి పాన్పుగా గలిగి కల్పము బ్రోచెడు వాడు ధర్మినిన్
  జంచల ప్రాణనాథుని విచారము నందున మున్గి భక్తిఁ బూ
  జించెడు భక్తులన్ విడిచి శ్రీహరి లోకము నందు పాపులౌ
  వంచన సేయువారల కవారిత మోక్షము మాధవుం డిడున్?

  రిప్లయితొలగించండి
 27. మంచిదికాని కాలమిది మానవులెల్ల కలిప్రభావమున్
  ద్రుంచగలేక పోవుతరి దుష్కరమయ్యును కొందరెట్టులో
  కొంచెమునైన శ్రీహరిని
  కోరిభజించుచు యుక్తితో కలిన్
  వంచనసేయువారల క
  వారిత మోక్షము మాధవుండిడున్.


  రిప్లయితొలగించండి
 28. ఎంచక నొజ్జటంచు దన నేమర జేయ నసత్యమాడెనే
  మంచికి మారు పేరనుచు మన్నన నొందిన ధర్మజుండయో?
  మంచిని సేయు బూనికను మర్మముగా నొక మాట బొంకినన్
  వంచన సేయువారల కవారిత మోక్షము మాధవుం డిడున్

  రిప్లయితొలగించండి
 29. మంచితనంబుతో జనులమన్ననపొందుమహానుభావులున్
  వంచనసేయువారుభగవానునిబిడ్డలు నిశ్చయమ్ముగా
  సంచితపాపకర్మములుసాంతముదూఁకొనినంతపిమ్మటన్
  వంచన సేయువారల కవారిత మోక్షము మాధవుం డిడున్

  రిప్లయితొలగించండి
 30. మించిన పాపము కలుగును
  వంచకులకు;మాధవుఁడిడు వర మోక్షంబున్
  ఎంచక దోసంబుల సే
  వించెడు ధర్మంబు సల్పు విజ్ఞులకెపుడున్

  రిప్లయితొలగించండి

 31. పిన్నక నాగేశ్వరరావు.

  పంచును తగు శిక్షలు నయ
  వంచకులకు; మాధవుడిడు వరమోక్షమ్మున్
  మంచిగ ననుదినమున్ సే
  వించెడు భక్తులకు సర్వ వేళల యందున్.

  రిప్లయితొలగించండి
 32. కుంచితమనసులెయుండును
  వంచకులకు,మాధవుడిడువరమోక్షమ్మున్
  నంచితపుణ్యముగలిగెడు
  నంచితుడగువానికెపుడుహర్షముగలుగన్

  రిప్లయితొలగించండి
 33. అంచిత పాదాబ్జమ్ముల
  నెంచి సతము వీత నిజ దురీప్సిత తతికిం
  బంచత నొంద విసర్జిత
  వంచకులకు మాధవుఁ డిడు వరమోక్షమ్మున్


  ఎంచ మనమ్ము నందుఁ బగ నెన్నఁడుఁ గాంచన భుక్తి నేత్రులన్
  మించి యెదిర్చ ద్వేషమున మేదిని రావణ కుంభకర్ణులం
  బంచకుఁ జేర్చితే నృగణపా శిశుపాలక దంతవక్త్రులన్
  వంచన సేయువారల కవారిత మోక్షము మాధవుం డిడున్

  రిప్లయితొలగించండి
 34. మంచిని దైత్యులెన్నడును మన్నన సేయ నిరాకరించి పో
  రెంచిరి వాసుదేవుసరి రేబవలందుల దుర్మదాంధమున్
  మించ వికారచేష్టలిటు మిక్కుటమవ్వగ విష్ణుభక్తులన్
  వంచన సేయువారల కవారిత మోక్షము మాధవుం డిడున్

  రిప్లయితొలగించండి
 35. ఉ:

  కంచెను చేను మేయనిట గానమె నీ విధి కెవ్వరూతమో
  లంచము దంచు వారలకు లక్షలు గూడగ తోడుయెవ్వరౌ
  యించుక తప్పులేదు సరియెంచగ చింతన నిట్లనంగనన్
  వంచన జేయు వారల కవారిత మోక్షము మాధవుండిడున్

  వై. చంద్రశేఖర్

  రిప్లయితొలగించండి
 36. మంచితనంబెయుండదిలమానసమంతయునుండుకుళ్ళుతో
  వంచనసేయువారలక,వారితమోక్షముమాధవుండిడున్
  సంచితపుణ్యముండునెడశాంతినిసౌఖ్యముగల్గజేయుచున్
  నంచితుడైనవానికగుహర్షముసౌఖ్యములెల్లవేళలన్

  రిప్లయితొలగించండి
 37. వంచకి పూతన మొదలిడి
  నంచెలుగ పలు పొలదిండ్ల నంతముజేసెన్
  ద్రుంచెను కంసుని,దయతో
  వంచకులకు మాధవుడిడు వరమోక్షమ్మున్

  వంచనజేయ దావమున బంగరుజింకగ తాటకిత్మునిన్
  వంచనతోడ జానకిని బందిగజేయగ రావణుండనే
  వంచకుడైన వాలినొక బాణపు వేటున సంహరింపగన్
  వంచన జేయువారల కవారిత మోక్షము మాధవుండిడున్

  చంచలమైనవై భ్రమలజాలము నందున జిక్కునట్లుగా
  వంచనజేయుచున్ సతము బాధలగూర్చెడు నింద్రియమ్ములన్
  వంచన జేయువారి కవారిత మోక్షము మాధవుండిడున్
  సంచిత పుణ్యపాపములు సంక్షయమొందగ యోగమార్గమున్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. తాటకాత్మునిన్ ? – తాటకాత్మజున్ అనండి బాగుంటుంది.

   తొలగించండి
  2. అవునండీ,తాటకాత్మజున్ అనే నాభావన!ఎలాగో పొరపాటు జరిగింది.సవరించినందుకు కృతఙ్ఞతలు!నమస్సులు!

   తొలగించండి
 38. కందం
  ద్రుంచఁగ చన్గుడిపిన, నిం
  దించినఁ గైవల్యమిడఁగఁ దృప్తిన్ దగ మో
  దించరె! స్పృశించి నంతనె
  వంచకులకు మాధవుఁ డిడు వరమోక్షమ్మున్!

  ఉత్పలమాల
  ద్రుంచఁగ వచ్చి చన్గుడిపి తొయ్యలి పూతన మోక్షమందె నిం
  దించిన నా కృతఘ్నుడును దివ్యపదమ్మునుఁ బొందెఁ గూలి శో
  ధించఁగ స్పర్శతోడఁ దన దివ్య కరాంబుజ నాయుధమ్ములన్
  వంచన సేయువారల కవారిత మోక్షము మాధవుం డిడున్

  రిప్లయితొలగించండి
 39. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

  రిప్లయితొలగించండి
 40. ఎంచగ నరకమె తప్పదు
  వంచకులకు, మాధవుడిడు వరమోక్షమ్మున్
  సంచిత పుణ్యము కొలదియె
  మంచియె పుణ్యంబుదూగు మార్గము భువిలోన్.

  రిప్లయితొలగించండి