12, జులై 2020, ఆదివారం

సమస్య - 3425

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"దుర్వ్యాపారంబె జనుల దుఃఖముఁ ద్రోఁచున్"
(లేదా...)
"దుర్వ్యాపారము క్షేమదాయకము సంతోషంబు పౌరాళికిన్ "

38 కామెంట్‌లు:

  1. డా. సి.వి. సుబ్బన్న శతావధాని గారి పూరణ.....

    మీర్వ్యుత్పన్నులు మీర్గురుప్రవర సామీప్యమ్మునన్ బెక్కు విం
    దు ర్వ్యాఖ్యానము, లాత్మవత్సకలజంతువ్రాతమన్మాట లం
    తర్వ్యూఢోజ్జ్వలధర్మవృత్తి సలుపన్ వచ్చున్ జనుల్ మెచ్చుకొం
    దు ర్వ్యాపారము క్షేమదాయకము సంతోషంబు పౌరాళికిన్.

    రిప్లయితొలగించండి
  2. నిర్వ్యాసంగము మానవున్ జెఱచు, సందేహమ్ము లేనాటికిన్
    దుర్వ్యూహమ్ముల కాటపట్టగును, శ్రాంతుం జేసి యెల్లప్పుడున్
    నిర్వ్యూఢమ్మగు కార్యముల్ మిగుల నందించున్ గదా కీడు లే
    దుర్వ్యాపారము క్షేమదాయకము సంతోషంబు పౌరాళికిన్?

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఈ ర్వ్యా ప్రాసమ్మిచ్చిన
      మీ ర్వ్యాససమానులంచు మెత్తురె విబుధుల్?
      నిర్వ్యాజ మైత్రితో నం
      దు ర్వ్యాపారంబె జనుల దుఃఖముఁ ద్రోఁచున్.

      తొలగించండి
  3. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  4. స్వర్వ్యాపిన మునకలిడిన
    నిర్వ్యాజము మానలేరు నీవెరు గనిదే
    దుర్వ్యామోహము దప్పం
    దుర్వ్యాపారంబె జనుల దుఃఖముఁ ద్రోఁచున్

    స్వర్వ్యాపిన-గంగలో
    నిర్వ్యాజము-సహజగుణము

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. 'సర్వ్యాపి' అంటే గంగ అనే అర్థమున్నదా? ఉన్నా 'సర్వ్యాపిని' అనడం సాధువు.

      తొలగించండి
  5. కం॥
    దుర్వ్యసనాలకు లోనై
    నిర్వ్యాపారముగ చరించ నిందలు పడగా
    నుర్వ్యరియై తలచె నొకడు
    "దుర్వ్యాపారంబె జనుల దుఃఖము ద్రోచున్".

    (ఉర్వి+అరి=ఉర్వ్యరి)

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      రెండవ పాదంలో గణభంగం. "నిర్వ్యాపారముగ నడువ..." అనండి.

      తొలగించండి
  6. ఇల దుర్వ్యాపారంబె జ
    నుల దుఃఖముఁ ద్రోఁచునంచు నుడువగ సరియౌ
    పలుకా? శంకర! దుఃఖం
    బులఁ బడద్రోచునన నిక్కపు పలుకగు సుమీ!

    (ఇలా పూరించుట సబబేయగునా ఆర్యా?!)

    రిప్లయితొలగించండి
  7. దుర్వ్యవధానము నొందుచు
    దుర్వ్యవకలనమున కొరతదుడ్డు నడుగుచున్
    దుర్వ్యవసాయము జేసెడి
    దుర్వ్యాపారంబె జనుల దుఃఖముఁ ద్రోఁచున్

    వ్యవధానము = విశ్రాంతి
    వ్యవకలనము = తీసివేత (గణితము)
    వ్యవసాయము = ప్రయత్నము

    రిప్లయితొలగించండి
  8. దుర్వ్యసనంబదియునునొక
    దుర్వ్యాపారంబె, జనుల దుఃఖముఁ ద్రోఁచున్
    నిర్వ్యాజమైన ప్రేమయు
    నిర్వ్యధనంబైనయాత్మనిర్భరతసుఁడీ!

    రిప్లయితొలగించండి

  9. ఇచ్చిన కందపాద మెక్కడే జిలేబి ?
    కంది వారివ్వాళ బిజి బిజి యా :)



    నిజమును గ్రహింపుమోయీ
    తుజుగు! విడువక సలుపంగ దుర్వ్యాపారం
    బె జనుల దుఃఖముఁ; ద్రోఁలు‌న్
    సుజనుల సాంగత్యము మనుజుల దోషములన్!



    జిలేబి

    రిప్లయితొలగించండి
  10. మైలవరపు వారి పూరణ

    వరూధిని....

    స్వర్వ్యాసంగమునప్సరాంగనలతో సౌఖ్యమ్ములన్ గోరుచున్
    నిర్వ్యాహారతపఃప్రవృత్తి గొనగా నీకేలరా? పిల్చుచో
    గీర్వ్యావృత్తి యదేల? పొందనగ నిష్ఖేదమ్ము., మీ భాషలో
    దుర్వ్యాపారము., క్షేమదాయకము సంతోషంబు పౌరాళికిన్ "

    మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

    రిప్లయితొలగించండి
  11. నిర్వ్యాజమ్మగు ఖలునకు
    దుర్వ్యాపారంబె! జనుల దుఃఖము ద్రోచున్
    సర్వ్యాపి సతత మిలలో
    దుర్వ్యాపార మొనరించు దుష్టుల గూల్చున్!

    రిప్లయితొలగించండి
  12. దుర్వ్య సనము చెఱచు గదర
    నిర్వ్యాపార మున నుండ నిరుపేద యగున్
    దుర్వ్యూ హంబును మఱియును
    దుర్వ్యాపారంబె జనుల దుఃఖము ద్రోచు న్

    రిప్లయితొలగించండి
  13. నిర్వ్యాజంబుగ జెప్పుచుంటి వినుమా నీ మంచినే కోరుచున్
    దుర్వ్యాసంగము మానకుంటివి గదా దోషంబగున్ మానుమా
    దుర్వ్యాపారము; క్షేమదాయకము సంతోషంబు పౌరాళికిన్
    నిర్వ్యామోహము, నిశ్చలత్వమొదవున్ నిత్యంబు ధ్యానంబునన్

    రిప్లయితొలగించండి
  14. దుర్వ్యాసంగము నొదవును
    దుర్వ్యాపారంబె; జనుల దుఃఖముఁ ద్రోఁచున్
    నిర్వ్యామోహము వినుమా
    దుర్వ్యసనమ్ములను నీవు దూరము నిడుమా

    రిప్లయితొలగించండి
  15. నేటి శం కరాభరణము వారి సమస్య

    దుర్వ్యాపారంబెజనుల దు:ఖము ద్రోచున్

    ఇచ్చిన పాదము కందము

    నా పూరణ మహాక్కరలో

    స్వర్గ లోకములో అర్జునుని తో ఊర్వసి పలుకు పలుకులు



    ఘనముగ నగారి వరముతో బుట్టిన కౌంతేయ! పెరిగె నీ పైకోరిక ,

    తనువున ఘడియ ఘడియకును మదన తాపంబు తీవ్రమై బాధించగ

    మనసు వశము దప్పుచు నుండె, ,మగువకు మచ్చను గూర్చు దుర్య్వాపారంబె

    జనుల దు: ఖము ద్రోచునని కడు దోషంబుగ పల్కుట పాడికాదు,

    వినుము విజయా!యిచట లేవు నైతిక విలువలనుచు నూర్వసి వచించెను

    రిప్లయితొలగించండి
  16. చర్వ్యంచున్ మదిలోననెంచుచు ప్రజా సంపత్తు కాజేయుటే
    దుర్వ్యాపారము, క్షేమదాయకము సంతోషంబు పౌరాళికిన్
    పూర్వ్యాచారములన్ గణించి సతమాపొంకమ్ము వర్తించుటే
    దుర్వ్యాపారము చేయువారికి సదా తోతెంచు నాదుర్గతుల్

    రిప్లయితొలగించండి
  17. అందరికీ నమస్సులు🙏

    *సమస్యే* పూరణం..😊

    దుర్వ్యాపారము జేసెడి
    దుర్వ్యాపారులకు జన్మ దుర్భర మౌనే
    దుర్వ్యసనాలకు లోనౌ
    దుర్వ్యాపారంబె జనుల దుఃఖముఁ ద్రోఁచున్"

    *కళ్యాణ్ చక్రవర్తి, ముంబాయి*
    🙏🙏

    (గురువు గారూ, అసలు ఈరోజు పూరణకు యత్నిస్తేనే ప్రశస్తం ..కదా గురువు గారు)
    🙇‍♂️🙅‍♂️🙏😊

    రిప్లయితొలగించండి
  18. కం:

    దుర్వ్యసనమ్ముల కూతము
    దుర్వ్యాఖ్యలు, గూడి బ్రతుకు, దుష్టులు జేరన్
    నిర్వ్యాపన మొందినయెడ
    దుర్వ్యాపారంబె , జనుల దుఃఖము బ్రోచున్

    వై. చంద్రశేఖర్

    రిప్లయితొలగించండి
  19. చర్వ్యాహారములు గనుము
    యుర్వ్యాహార సుసమృద్ధి కుత్సాహివియై
    పూర్వ్యమ్ము మేలు మానుము
    దుర్వ్యాపారంబె జనుల దుఃఖముఁ ద్రోఁచున్


    నిర్వ్యూహమ్మును మించు నిప్పుడమి దండింపంగ నిర్వీర్యమున్
    దుర్వ్యూహమ్ము తలంచఁ బౌర జన సందోహమ్ము భీతిల్లగన్
    నిర్వ్యాపారము కన్న మే లగును నిర్ణేతౄణ పాత్రమ్ముగా
    దుర్వ్యాపారము క్షేమదాయకము సంతోషంబు పౌరాళికిన్

    [దుర్వ్యాపరము = కష్టసాధ్య వ్యాపారము]

    రిప్లయితొలగించండి
  20. నిర్వ్యాపారులజేయును
    దుర్వ్యాపారంబె,జనులదుఃఖముద్రోచున్
    దుర్వ్యసనమురహితములే
    నిర్వ్యాపారమ్మువలననిరుపేదయగున్

    రిప్లయితొలగించండి
  21. దుర్వ్యాపారముక్షేమదాయకముసంతోషంబుపౌరాళికిన్ దుర్వ్యాపారమునష్టదాయకమునెంతోబాధగూర్చుంగదా
    నిర్వ్యాపారముగూడకష్టముకదానేమానిదామోదరా!
    దుర్వ్యాపారముజేయకుండుటనుసంతోషంబుజేకూర్చుగా

    రిప్లయితొలగించండి
  22. నిర్వ్యాజమ్మగు నీ ధరన్ ఖలున కే నీమమ్ము లేనట్టి దౌ
    దుర్వ్యాపారము! క్షేమ దాయకము, సంతోషంబు పౌరాళికిన్,
    సర్వ్యాప్తుండొన గూర్చగా దలచి తా సన్నద్ధతన్ జూపుచున్
    దుర్వ్యాపార మొనర్చు దుష్ట జనులన్ ద్రుంచున్ ముదమ్మందుచున్ !

    రిప్లయితొలగించండి

  23. పిన్నక నాగేశ్వరరావు.

    దుర్వ్యాపారము కన్నను
    నిర్వ్యా పారమ్మె మేలు నిక్కము పలుకన్
    దుర్వ్యసనమనుచు మాన్పిన
    ‍దుర్వ్యాపారంబె, జనుల దుఃఖముఁద్రోచున్.

    రిప్లయితొలగించండి
  24. కందం
    దుర్వ్యసనమ్ములఁ జదువక
    నిర్వ్యాపకు లైనవార్కి నిండగ కడుపుల్
    దుర్వ్యగ్రత నప్పటికన
    దుర్వ్యాపారంబె జనుల దుఃఖముఁ ద్రోఁచున్

    శార్దూలవిక్రీడితము
    దుర్వ్యాసంగములన్ జరించి చదువువ్ దూషించి యాపైనఁ దా
    నిర్వ్యాపారిగ నుండి భుక్తి కరువై నిర్లజ్జ తోరేగుచున్
    నిర్వ్యూఢమ్మగు రీతి నింపకడుపున్ నేర్వంగ నానాటికా
    దుర్వ్యాపారము క్షేమదాయకము సంతోషంబు పౌరాళికిన్!
    గణ

    (అప్పటికే, ఆనాటికి = ఆరోజువరకే అనగా తాత్కాలికముగ)

    రిప్లయితొలగించండి
  25. దుర్వ్యవసాయము చేయుచు
    దుర్వ్యస నమ్ములకు లొంగి తొందర పడగా
    దుర్వ్యయమవగా సర్వము
    *దుర్వ్యాపారంబె జనుల దుఃఖము ద్రోచున్.*

    రిప్లయితొలగించండి
  26. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  27. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  28. దుర్వ్యసనమ్ముల పాలై
    నిర్వ్యవహారములతోడ నీచుండవె యో
    దుర్వ్యసన శీలి! యెవ్విధి
    దుర్వ్యాపారంబె జనుల దుఃఖము ద్రోచున్?

    రిప్లయితొలగించండి
  29. ఈ ర్వ్యా ప్రాసము తోడ చెప్పెదను నేనీ పద్యమాలింపరా
    నిర్వ్యాజమ్మున సాగుమోయి యికనిన్నెవ్వండు దూషింపడే
    నిర్వ్యాపారమె మేలురా కనగ నా స్నేహంబుచే మానినన్
    దుర్వ్యాపారము, క్షేమదాయకము సంతోషంబు పౌరాళికిన్.

    రిప్లయితొలగించండి
  30. దుర్వ్యాపారులు ప్రబలిరి
    దుర్వ్యామోహమున దేశద్రోహులె యగుచున్
    నిర్వ్యాజ మైత్రి మాన్పిన
    దుర్వ్యాపారంబె,జనుల దుఃఖము ద్రోచున్

    దుర్వ్యామోహములందు జిక్కి దిరుగన్ దుచ్ఛంపు సంసర్గమున్
    దుర్వ్యాపారములన్ గులంపు యశమున్ ద్రోయంగ గూపమ్ములో
    దుర్వ్యాజ్యమ్ముల దండ్రికిన్ మనమునన్ ద్రోహమ్ముగూర్చంగ నే
    దుర్వ్యాపారము క్షేమదాయకము? సంతోషంబు పౌరాళికిన్ ?

    రిప్లయితొలగించండి