8, జులై 2020, బుధవారం

సమస్య - 3421

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"పగలు శశి పూర్ణకళలతో నెగడె దివిని"
(లేదా...)
"పగలు శశాంకుఁ డంబరముపై విలసిల్లెఁ గళాసమగ్రుఁడై"

60 కామెంట్‌లు:


  1. నడిరేయి సరదా పూరణ:

    వెగటగు రీతి పోరుచును వెంబడి పర్వుచు కత్తి దాల్చుచున్
    నగవుచు నట్టహాసమున నాయుడు కూడుచు కుఱ్ఱ పుత్రుతో
    జగనుని స్వప్నమందు కడు జన్యము జేయుచు నాంధ్ర దేశమున్
    పగలు శశాంకుఁ డంబరముపై విలసిల్లెఁ గళాసమగ్రుఁడై...

    రిప్లయితొలగించండి

  2. ఆటవిడుపు సరదా పూరణ:
    (జిలేబి గారికి అంకితం)

    వెగటగు మేఘముల్ కనని పేరిమి కార్తిక మాసమందునన్
    నిగనిగ లాడు నాకమున నీలపు వర్ణము ప్రజ్వలించగా
    సగమగు గోళమున్ గొనుచు చక్కని సప్తమి నాడు చూడగన్
    పగలు శశాంకుఁ డంబరముపై విలసిల్లెఁ గళాసమగ్రుఁడై....

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ ఆటవిడుపు పూరణ బాగున్నది. అభినందనలు.
      చంద్రుడు కళాసమగ్రుడై శోభిల్లేది పున్నమి నాడే. సప్తమినాడు పగలు కనిపించినా పూర్ణకళలతో కాదు.

      తొలగించండి


  3. కందగీతి


    ప్రకటిత మాయెను చుర్రన
    గ కాల చక్రుండు వాడిగా శుషిరములో
    న కనంగ పగలు, శశి పూ
    ర్ణకళల తో నెగడె దివిని రాత్రి జిలేబీ!



    జిలేబీయము

    రిప్లయితొలగించండి
  4. సెగలురేపిన దినమణి చిన్నబోయె
    వగలు రగలగ తిమిరమ్ము వాలె,ముగిసె
    బగలు,శశి పూర్ణకళలతో నెగడె దివిని
    నెలత వేగెను చెలికాని తలపుతోడ!

    సెగలనురేపు దేవమణి చేరెను క్రమ్మర పశ్చిమాద్రికిన్
    వగపునుబెంచు ధ్వాంతమది వాలెను ధారుణి నంతరించుచున్
    బగలు,శశాంకు డంబరముపై విలసిల్లె గళాసమగ్రుడై
    జగమున ప్రేమభావనలు జాగృతినొందెను రాసకేళికై!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
      'ధారుణి నంతరించగా పగలు...' అంటే బాగుంటుందేమో?

      తొలగించండి
    2. ధన్యవాదములాచార్యా!ముందుగా నంతరించగా అనివ్రాసి మరల అనుమానంతో మార్చాను!

      తొలగించండి


  5. కందాచంప్స్


    భగభగ దోచె వెలుగుల దొ
    రగ పగలు; శశాంకుఁ డంబరముపై విలసి
    ల్లెఁ గళాసమగ్రుఁడై రా
    త్రి; గగన మందున జిలేబి తీరుగ విభుడే!


    జిలేబి

    రిప్లయితొలగించండి
  6. సమస్య :-
    "పగలు శశి పూర్ణకళలతో నెగడె దివిని"

    *కందం**

    భగభగల రవి బ్రహ్మాండ
    మ్ముగ వెలుగొందు పగలు; శశి పూర్ణ కళలతో
    నెగడె దివిని పౌర్ణమికిన్;
    జగమంతా నడయు వీరి జంటే తోడై
    ..................✍️చక్రి

    రిప్లయితొలగించండి
  7. సమస్య :-
    "పగలు శశి పూర్ణకళలతో నెగడె దివిని"

    *తే.గీ**

    మనసు పడినట్టి ప్రియురాలి మనసు గెలవ
    తిరిగి తిరిగి చివరకు కాళ్ళరిగిపోయె
    శుభకరమ్ము సమ్మతి చూపు చూచునంత
    పగలు శశి పూర్ణకళలతో నెగడె దివిని
    ....................✍️చక్రి

    రిప్లయితొలగించండి
  8. పున్నమి దినమునండున భువనముపయి
    దినకరుండు తనదయిన దీండ్ర జూపె
    బగలు ; శశి పూర్ణకళలతో నెగడె దివిని
    శోభలీనుచు తిమిరము సోలు నటుల

    రిప్లయితొలగించండి
  9. అంతయె నే నెఱెంగనొ? మహామతిమంతుడనైన నాకు గో
    రంత పురాణపాత్రవిషయమ్ములు, లక్ష్మియె యద్రిపుత్రి, మా
    రాంతకపుత్రికామణి సరస్వతి, శాంభవి బ్రహ్మపుత్రియౌ,
    కుంతికిఁ గుంభకర్ణునకుఁ గూఁతురుగా జనియించె సీతయే"

    కంజర్ల రామాచార్య.

    రిప్లయితొలగించండి
  10. రిప్లయిలు
    1. నిగనిగలాడు యౌవనము నీలవిశాలవిలోలనేత్రముల్
      ధగధగదాయమానసముదాహరణీయశరీరకాంతులన్
      జిగిమెయి వెన్నలన్ జెలగు చేడియ యింటఁ జరించ రాత్రియున్
      పగలు శశాంకుఁ డంబరముపై విలసిల్లెఁ గళాసమగ్రుఁడై

      కంజర్ల రామాచార్య.

      తొలగించండి
  11. అంతరిక్షమునకు నౌక యందరిగిన
    వ్యోమ గాముల కగుపించె నొక్కవింత
    పగలు శశి పూర్ణకళలతో నెగడె దివిని!
    వారికి "పగలేవెన్నెల" పాట తోచె!

    రిప్లయితొలగించండి
  12. నా పూరణ. చం.మా.
    *** ********

    సెగలను గ్రక్కుచున్ మిగుల జిత్రరథుండు వియత్తు వెల్గగన్
    బగగొని దుష్ట రాహువుయె పంకజ బాంధవు మ్రింగినంతటన్
    పగలె నిశీథమయ్యె గద!బాఢము దిగ్భ్రమచెందునట్టుగా
    బగలు శశాంకు డంబరముపై విలసిల్లె గళాసమగ్రుడై

    ( వియత్తు=ఆకాశము...చిత్రరథుడు=సూర్యుడు... నిశీథము=రాతిరి )

    -- 🌱 ఆకుల శాంతి భూషణ్ 🌱
    🌷 వనపర్తి🌷



    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ ప్రయత్నం ప్రశంసనీయమే.
      కాని సూర్యగ్రహణం అమావాస్యనాడు వస్తుంది. ఆరోజు చంద్రుడు కనిపించడం?

      తొలగించండి
  13. మనసునందునకోరికల్ మరులుకొలిపె
    డెందముననందమీవేళకందళించె
    ప్రియసమాగమసమయాన ప్రీతిమీర
    పగలు శశి పూర్ణకళలతో నెగడె దివిని

    రిప్లయితొలగించండి


  14. ప్రకృతి వింతలవెన్నియొ ప్రాకటమగు
    తనకు తానుగ తెలుప సత్త్వమగు మనకు
    పూర్ణముగ గ్రహణపు వేళ పున్నమి వలె
    పగలు శశి పూర్ణకళలతో నెగడె దివిని



    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పద్యం బాగుంది. కాని సూర్యగ్రహణం అమావాస్య నాడు సంభవిస్తుంది. ఆరోజు చంద్రుడు అసలే కనిపించడు. చంద్రగ్రహణం పున్నమినాడు అయినా పగలు కనిపించడు.

      తొలగించండి

    2. Moon is seen as the "diamond ring" in total solar eclipse:

      https://www.google.co.in/search?q=diamond+ring+solar+eclipse&client=safari&channel=iphone_bm&prmd=insv&source=lnms&tbm=isch&sa=X&ved=2ahUKEwj8-4zlurzqAhWHwzgGHT1DCsAQ_AUoAXoECA4QAQ&biw=375&bih=549#imgrc=EAik_9CuamMPOM

      తొలగించండి
  15. క్రొవ్విడి వెంకట రాజారావు:

    ఇనుడు తీక్ష్ణమై దీపించె నింగి నందు
    పగలు; శశి పూర్ణ కళలతో నెగడె దివిని
    నిండు వెన్నెల కురిసెడి నిచ్చ లందు
    భాను చంద్రు లిద్దరు కాంతివంతులె గద!

    రిప్లయితొలగించండి
  16. నగసమ కీర్తి నెల్లెడల నాడును నేడును విస్తరించె నీ
    జగమున భారతంబనగ శాంతికి నీతికి మారుపేరుగన్
    తగవుల దూరకుండ సతతంబిల నవ్య పతాకయౌచు రే
    బగలు శశాంకు డంబరముపై విలసిల్లె గళాసమగ్రుడై

    రిప్లయితొలగించండి


  17. వగచగ నెంతయో సఖియె వారిజ నేత్రయె ముద్దులందు తే
    ల్చి గడుసు గాను కంఠమున లెస్సగ హారము వేసి నాడు దా
    ని గరిమ గాంచి సంతసపు నివ్వెర బోవ జిలేబి బాపురే
    పగలు శశాంకుఁ డంబరముపై విలసిల్లెఁ గళాసమగ్రుఁడై



    జిలేబి

    రిప్లయితొలగించండి
  18. మైలవరపు వారి పూరణ

    భగభగ మండు సూర్యభగవానుని తాపము తాళలేక., సొం...
    పుగ తన చీరకొంగు ముఖమున్ గనుపట్టెడి రీతి నెత్తిపై
    తగ గొడుగో యనంగ వనితామణి దాల్చి చరింపఁ ., దోచెడిన్
    పగలు శశాంకుఁ డంబరముపై విలసిల్లెఁ గళాసమగ్రుఁడై!!

    (అంబరము... వస్త్రము)

    మైలవరపు మురళీకృష్ణ
    వెంకటగిరి.

    రిప్లయితొలగించండి
  19. దివ్య తేజస్సు తో వెల్గు దినకరుండు
    మరుగు పడె పశ్చిమాద్రిని మాసి పోయె
    పగలు : శశి పూర్ణ కళల తో నెగడె దివిని
    తార లందున రాజుయై తార సిల్లి

    రిప్లయితొలగించండి
  20. సొగసరినా మనోహరుని సుందర రూపుని పొందు గోరుచున్
    వగలొలికించు రాధ తన వద్దకు రమ్మన నామె కందకన్
    నగధరుడా నగాగ్రమున నవ్వుచు నిల్చెను జూడగా నికన్
    పగలు శశాంకుఁ డంబరముపై విలసిల్లెఁ గళాసమగ్రుఁడై

    రిప్లయితొలగించండి
  21. మనసు మెచ్చిన మగువతో మసలుచుండ|
    యెండ మారుగ పున్నమి హేల యనగ!
    ప్రేమ గుడ్డిదిటు పలుక పిచ్చిముదర!
    "పగలు శశి పూర్ణకళలతో నెగడె దివిని"

    రిప్లయితొలగించండి
  22. భగభగలాడ గ్రీష్మ ఋతు భానుడు నిప్పుల కుంపటయ్యె నీ
    ఖగవతి పెచ్చు మీరి వడగాలులు వీచెను జ్యేష్టమాసమున్
    బగలు, శశాంకుఁ డంబరముపై విలసిల్లెఁ గళాసమగ్రుఁడై
    సొగసుల నారబోయు పలు చుక్కమధ్యను తేజమొప్పగన్.

    రిప్లయితొలగించండి
  23. దినమణి వెలిగె భువనాన తేజమలర
    పగలు ,శశిపూర్ణకళలతో నెగడె దివిని
    నిశిని సకల జనమ్ములు నెమ్మి బొంద
    కలువ భామయు వేచెతా కాంతు కొరకు

    రిప్లయితొలగించండి
  24. సెగలను రేపగా యినుడు చేరితి నింటికి, చల్వ పందిరిన్
    దగదగలాడు రూపమున దార యెదుర్కొని మంచినీటితో
    తగు యుపచర్యలన్ సలప తాపమడంగగ, నాదుకండ్లకున్
    పగలు శశాంకుఁ డంబరముపై విలసిల్లెఁ గళాసమగ్రుఁడై

    రిప్లయితొలగించండి
  25. 08.07.2020
    అందరికీ నమస్సులు🙏

    నా పూరణ యత్నం..

    *తే గీ*

    రామ చంద్రుని మోమున లక్ష దీప
    కాంతులు గనిన గల్గ దే గౌరవమ్ము
    నీదు జూచిన భ్రమపడు నిక్కమిటుల
    *"పగలు శశి పూర్ణకళలతో నెగడె దివిని"*

    *కళ్యాణ్ చక్రవర్తి ముంబాయి*
    🙏

    రిప్లయితొలగించండి
  26. తేటగీతి
    మనసు మెచ్చిన నలివేణి ననుసరించి
    వేసవి నుదకమండల వేడి సెగల
    రంగుటద్దాలు దాల్చఁగ రవియె లీలఁ
    బగలు శశిపూర్ణ కళలతో నెగడె దివిని!

    చంపకమాల
    మగువ మరాళితో నుదక మండల సీమ విహారయాత్రలో
    భగభగ మండు భాస్కరుని భాసుర లీల విజృంభణమ్మునన్
    వగయమె! నీలపున్ జలువఁ బంచఁగ లీలగ కళ్లజోడునన్
    బగలు శశాంకుఁ డంబరముపై విలసిల్లెఁ గళాసమగ్రుఁడై! !


    రిప్లయితొలగించండి
  27. పరగఅష్టావధానంబుభాసురముగ
    చేయుచుండిననవధానిజేయుడయ్యె
    కాచెవెన్నెలనతనికికనులయందు
    పగలుశశిపూర్ణకళలతోనగడెదివిని

    రిప్లయితొలగించండి
  28. రాముడు శివ ధనువును ద్రుంచగా ఒక్క సారి భీకర శబ్దములు కలుగ వీరుల కళ్ళకు చీకట్లు కమ్మాయి, కొద్ది సేపటిలో తేరుకొని చూడగా వరమాలను జానకి రాఘవుని మెడలో వేయగా చల్లనైన పూర్ణ చంద్ర బింబపు కాంతులు ఆ సభా స్ధలిలొ పగలే కలిగాయి అను భావన


    జగపతి రాఘవుండు శివ చాపము ద్రుంచగ ,భీకరంబుగా

    నిగదములా సభాస్ధలిన నెక్కొన నక్కడ కమ్మె ధ్వాంతమున్,

    వెగడుచు కన్నులన్ తెరచి వీరులు కాంచిరి దృశ్యమొక్కటిన్

    పగలు శశాంకుఁ డంబరముపై విలసిల్లెఁ గళాసమగ్రుఁడై

    మగువ ముదంబు తోడ వర మాలను రాము గళమ్మునందిడన్


    రిప్లయితొలగించండి
  29. కటికచీకటియయ్యెనుగ్రహణమగుట
    పగలు,శశిపూర్ణకళలతోనెగడెదివిని
    పున్నమియగుటకారణంబుగనెఱుగుమ
    ఖదిరుకాంతులుహాయినిగలుగజేయు

    రిప్లయితొలగించండి
  30. మగలట యేవురుండ నభిమానవతిన్ సభకీడ్చు వేళలో
    వగచుచు మిన్నకుండినను పాండుకుమారుల గుండెలందునన్
    భగభగ మంట పుట్టె నటఁ వాసిగ నంకుర మంది రేగెనే
    పగలు, శశాంకుఁ డంబరముపై విలసిల్లెఁ గళాసమగ్రుఁడై .

    రిప్లయితొలగించండి
  31. కాంత హృదయమ్ము గగనమ్ము కాఁగ మించి
    కాంత కందోయి పురుడించఁ గలువల జతఁ
    గాంతుఁ డేతెంచి కన్పించఁ గనుల ముందు
    పగలు శశి పూర్ణకళలతో నెగడె దివిని


    సుగమ పథానువర్తి యయి చోద్యము మీఱఁగ నుత్సహించుచున్
    గగన విహారి కైరవ నికాయ మనస్పతి శీతరశ్మి యా
    శగ జగదేక సుందరుఁడు శారద యామిని నెల్ల జేయుచుం
    బగలు శశాంకుఁ డంబరముపై విలసిల్లెఁ గళాసమగ్రుఁడై

    రిప్లయితొలగించండి
  32. ఉ:

    తగునన యుల్లసిల్ల దరిదాపగు నుత్తమ వేధశాలకున్
    మగతను వీడ నేగితిని మారును చిత్తము నిశ్చయంబనన్
    గగనము నిండె చీకటులు గన్నుల చూడికి గోచరించెనే
    పగలు శశాంకు డంబరము పై విలసిల్లె గళా సమగ్రుడై

    వేధశాల =planetarium

    వై. చంద్రశేఖర్

    రిప్లయితొలగించండి
  33. జగమదిచీకటయ్యెనుగశాశ్వతువేగమరాహుపట్టగా
    పగలు,శశాంకుడంబరముపైవిలసిల్లెగళాసమగ్రుడై
    వగలనురేపుచుండుచునవారితప్రేమనుగల్గజేయుచున్
    బగలునుఱేయిజూడకనుబంధముగట్టిబడంగజేయుగా

    రిప్లయితొలగించండి
  34. ధగధగలాడెడిన్ దరుణి దాల్చె వినీలపు పట్టుపుట్టమున్
    సొగసుగ మేఘమాలికలు సోముని బింబము చెంగునందునన్
    జిగిబిగి యల్లికన్ దనర చేడియలెల్లరు మేలుమేలనన్
    బగలు శశాంకు డంబరముపై విలసిల్లె గళాప్రపూర్ణుడై
    అంబరమ = వస్త్రము

    రిప్లయితొలగించండి
  35. నిగమమురూపుగట్టినిలుమంచునుఁజెప్పనతండువచ్చెగా
    త్రిగుణములన్నివైదోలగిదీవనలిచ్చెజనంబుమెచ్చగా
    అగణితమేధనిల్చెనువియత్తలమంతవివేకసంపదన్
    పగలుశశాంకుడంబరముపైవిలసిల్లెకళాసమగ్రుడై

    రిప్లయితొలగించండి