18, జులై 2020, శనివారం

సమస్య - 3430

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"వ్యాఘ్ర సింహములకుఁ బుట్టె వానరుండు"
(లేదా...)
"వ్యాఘ్రము సింహమున్ గలియ వానరుఁ డొక్కఁడు పుట్టె వింతగన్"

65 కామెంట్‌లు:


 1. నడిరేయి సరదా పూరణ:

  వ్యాఘ్రపు కన్యనున్ వెదికి బంధువు లందున కానరాకయో
  శీఘ్రపు రీతినిన్ కడకు సింహము గొల్లున గోలపెట్టగా
  వ్యాఘ్రము దెచ్చి రోమునను వల్లభు నీయగ దిల్లి నందునన్
  వ్యాఘ్రము సింహమున్ గలియ వానరుఁ డొక్కఁడు పుట్టె వింతగన్

  రిప్లయితొలగించండి
 2. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

  రిప్లయితొలగించండి

 3. ఆటవిడుపు సరదా పూరణ:
  (జిలేబి గారికి అంకితం)

  గాఘ్రపు నామమున్ నదికి గారవ మొప్పెడు తీరమందునన్
  గాఘ్రను చోళినిన్ గొనుచు గంతులు వేసెడి మర్కటమ్ములన్
  శీఘ్రపు పొందు చూడగను సిగ్గును వీడుచు కాననమ్మునన్
  వ్యాఘ్రము సింహమున్ గలియ; వానరుఁ డొక్కఁడు పుట్టె వింతగన్

  రిప్లయితొలగించండి
 4. శీఘ్రమె రమ్ము సేనలను చిందర వందర జేసెనాతడే
  వ్యాఘ్రము వోలె దూకి పగ వారల నందర జీల్చి చెండెనే
  వ్యాఘ్రనఖాయుధుండతడవక్రపరాక్రముడాతడే భళా
  వ్యాఘ్రము సింహమున్ గలియ వానరుఁ డొక్కఁడు పుట్టె వింతగన్

  రిప్లయితొలగించండి
 5. కాననంబే మృగములకు‌ కలను‌ తెలుపు,

  ఋక్ష రజుని‌ సౌందర్యంబు‌ ఋతుడు గాంచి

  సంగమము నొనర్చగ నేమి సంభవించె,

  వ్యాఘ్ర సింహములకు ,పుట్టె వానరుండు

  రిప్లయితొలగించండి
 6. ఋక్ష రజుడు శాప ము వలన. స్త్రీ ఐ సూర్యుడు ఇంద్రుడు సంగమము వలన‌ వాలి సుగ్రీవులకు జనన మిస్తాడు

  రిప్లయితొలగించండి


 7. వాల్టు డిస్ని చిత్రము సహవాసమైన
  వ్యాఘ్ర సింహములకుఁ బుట్టె వానరుండు
  వేయ గాను గంతులు, సన్నివేశములకు
  పిల్ల వాండ్రు పడిపడి నవ్విరి జిలేబి


  జిలేబి

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. హాలీవుడ్ వాళ్ళు ఏమైనా చూపగలరు. మీ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించండి


 8. వడివడి మొక్కలము! పరుగు
  లిడి "వ్యాఘ్రము సింహమున్ గలియ వానరుఁ డొ
  క్కఁడు పుట్టె వింతగన్" వా
  ల్టు డిస్ని చిత్రమును పిల్లలు పొడగనిరిగా  జిలేబి

  రిప్లయితొలగించండి
 9. వ్యాఘ్రమై సతి పతిపట్ల వ్యవహరించ
  చీల్చ వ్యాఘ్రంబుఁ గర్జన సేయు పతియు
  కాదె నట్టి మృగంబుల కాపురంబుఁ
  వ్యాఘ్ర సింహములకుఁ బుట్టె వానరుండు

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   "కాదె యట్టి..." అనండి.

   తొలగించండి
  2. వ్యాఘ్రమై సతి పతిపట్ల వ్యవహరించ
   చీల్చ వ్యాఘ్రంబుఁ గర్జన సేయు పతియు
   కాదె యట్టి మృగంబుల కాపురంబుఁ
   వ్యాఘ్ర సింహములకుఁ బుట్టె వానరుండు

   తొలగించండి
 10. అవని జీవుల సింకారయనెడు జంతు
  వ్యాఘ్ర సింహములకు బుట్టె-వానరుండు
  నరునకున్ పూర్వరూపంబు నరయ నిట్టి
  వింతలెన్నియో గలవు ఈ విశ్వచరిత!

  రిప్లయితొలగించండి
 11. శీఘ్రత ప్రేమ జంటకిల జీవిక లేగతి పోయినన్ సరే
  శీఘ్రమె కావలెన్ పనులు సేమము కూడిన కూడకుండినన్
  శీఘ్రపు తాళిబంధమున చేగొన సంతును వావిచెల్లకన్
  వ్యాఘ్రము సింహమున్ గలియ వానరుడొక్కడు పుట్టె వింతగన్

  రిప్లయితొలగించండి
 12. తండ్రి ఐపిఎస్ అధికారి తల్లి యట్లె
  ఐయెయెస్ అధికారిణి యయ్యుఁ గొడుకు
  పదియుఁ బాసుకాడె! జనులు పలికిరిట్లు
  వ్యాఘ్ర సింహములకుఁ బుట్టె వానరుండు!

  రిప్లయితొలగించండి
 13. శౌర్యమును జూపుటందున సాటియయ్యె
  వ్యాఘ్ర సింహములకుఁ ; బుట్టె వానరుండు
  ధరణిపయి రామబంటుగ , దనుజునుండి
  పొలతి భూమిపుత్రికకు విముక్తి జేయ

  రిప్లయితొలగించండి
 14. మైలవరపు వారి పూరణ

  అడవిని గన భీతిని గూ..
  ర్చెడు..
  వ్యాఘ్రము సింహమున్ గలియ వానరుఁ డొ
  క్కఁడు పుట్టె వింతగన్ ., మరి
  వెడ కురురాడ్జన్మమట్టివేళనె జరిగెన్!!

  మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు


  1. మైలవరపు వారు కూడా జిలేబీయమై కందోత్పలము లోనికి‌ దిగిపోయేరు :)


   వెల్కం టు ది వరల్డ్ ఆఫ్ జిలేబీ :)


   జిలేబి

   తొలగించండి
  2. మైలవరపు వారి పూరణ ప్రశస్తంగా ఉన్నది.

   తొలగించండి
 15. చెప్పిరేనాడొ బ్రహ్మము చెవిని పెట్ట
  వి౦త లెన్నియొ జగతిని వెలుగు చూచు
  న౦చు జరిగెగా నేడది అమలున౦దు
  వ్యాఘ్ర సింహములకుఁ బుట్టె వానరుండు

  రిప్లయితొలగించండి
 16. పండితునకును శుంఠ సంప్రాప్తుడగును
  బాహుబలునకు కొరగాని వాడుఁగల్గు
  వ్యాఘ్ర సింహములకుఁబుట్టె వానరుండు
  కలిని వింతలు చోద్యమై చెలగుఁగాదె!

  రిప్లయితొలగించండి
 17. తే.గీ//
  నిత్య నైమిత్తికము నందు సత్యమైన
  వైశ్వదేవ మహిమచేత వైద్యశాల l
  నందు, వింతగొలుపు నట్టి చందమునకు
  వ్యాఘ్ర సింహములకుఁ బుట్టె వానరుండు ll

  రిప్లయితొలగించండి
 18. విపిన మందున వసియించు భీకరంపు
  క్రూర మృగములకు తగవు గొప్ప గాను
  వ్యాఘ్ర సింహములకు బుట్టె : వానరంబు
  తరువు పైనుండి గాంచెను దాని నచట

  రిప్లయితొలగించండి
 19. కోరిరనుచు జాతకమును కోవిదుండు
  చెప్పెను ధనిష్ఠ దారయు చిత్త మగడు
  సంపరాయుడు చూడగా శ్రవణము గన
  వ్యాఘ్ర సింహములకుఁ బుట్టె వానరుండు

  రిప్లయితొలగించండి
 20. శీఘ్రముగన్ గనంగిటు నిశీధిని గూర్చిరి పూరణన్చు నే
  డీ "ఘ్ర"ను ప్రాస నిచ్చి రిట నేవిధి పూరణ సేయ జూడ గీ
  దుర్ "ఘ్ర" నిటేవిధిన్ కలువదోర్పుగ గూర్చగ, నిక్కమేను యీ
  వ్యాఘ్రము సింహమున్ గలియ వానరుఁ డొక్కడు పుట్టె వింతగన్

  రిప్లయితొలగించండి
 21. వాఘ్రె కుటుంబమన్న ధన వంతు లటంచు ధనిష్ఠ ధీతకున్
  వ్యాఘ్రమె యోనియౌ వరుడు వాఘ్రెకు పెండిలి చేసినంతనే
  శీఘ్రము గానుపుట్టెనొక జీవనుడే శ్రవణమ్ములో గనన్
  వ్యాఘ్రము సింహమున్ గలియ వానరుఁ డొక్కఁడు పుట్టె వింతగన్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. విరించివర్య ! వినూత్న ఊహ జేసిన మీకు జోహార్లు ! అయితే చిత్తను గూర్చియుండిన ఇంకా రసవత్తరంగా ఉండేదేమో !

   తొలగించండి
 22. వాఘ్రె కుటుంబమన్న ధన వంతు లటంచు ధనిష్ఠ ధీతకున్
  వ్యాఘ్రమె యోనియౌ వరుడు వాఘ్రెకు పెండిలి చేసినంతనే
  శీఘ్రము గానుపుట్టెనొక జీవనుడే శ్రవణమ్ములో గనన్
  వ్యాఘ్రము సింహమున్ గలియ వానరుఁ డొక్కఁడు పుట్టె వింతగన్

  రిప్లయితొలగించండి
 23. వ్యాఘ్రము కేసరిన్ లలి దవమ్మున క్రుమ్మర పుట్టె సింఘ్రి యా
  వ్యాఘ్రము సింహమున్ గలియ, వానరుఁ డొక్కఁడు పుట్టె వింతగన్
  శీఘ్రముగా చరించుచును చేయుచు కోతులఁ బోలు కృత్యముల్
  వ్యాఘ్రము వంటి వీరునకు పండిత పుత్రుడె యన్నరీతిగా  రిప్లయితొలగించండి
 24. కలియుగపుమాయచేతనుగక్ష్యకమున
  వ్యాఘ్రసింహములకుబుట్టెవానరుండు
  చూచుచుంటిమియటువంటిచోద్యములను
  వీరబ్రహ్మమువ్రాసెవిచిత్రములను

  రిప్లయితొలగించండి
 25. వ్యాఘ్రముసింహమున్గలియవానరుడొక్కడుపుట్టెవింతగన్
  వ్యాఘ్రముసింహముల్దలపబద్ధవిరోధులుగాదెజూడగా
  వ్యాఘ్రపుసంగమంబునటవానరమొక్కటిపుట్టవింతయే
  శీఘ్రపుమాటలోనటులజెప్పెనుబాలుడుతల్లడింపుతో

  రిప్లయితొలగించండి
 26. వ్యాఘ్రమైసతిపతినెప్డు వ్యగ్రఁబరుప
  శీఘ్రమేమారునాతఁడు సింగముగను
  వారి సంసారగమనమీతీరునుండ
  వ్యాఘ్ర సింహములకుఁ బుట్టె వానరుండు

  రిప్లయితొలగించండి
 27. పుట్టెను గరోన సమయించఁ బుడమి నెల్లఁ
  గన్న కొడు కైనఁ దండ్రినిఁ గాంచ రాఁడు
  కలియుగ మహిమ మేమని పలుకఁ గలను
  వ్యాఘ్ర సింహములకుఁ బుట్టె వానరుండు

  [వానరుఁడు = వన సంబంధములను భక్షించు వాఁడు]


  దఘ్రత దైవలీల లవి ధారుణి వింతలు కావె చూడ నా
  దఘ్రయ సంభ్రమమ్మది వృథాగతి యయ్యెను గాంచఁగా ననన్
  వ్యాఘ్రిని సింహినిం దమిని నామృగ రక్షణ శాల నింపుగా
  వ్యాఘ్రము సింహముం గలియ వానరుఁ డొక్కఁడు పుట్టె వింతగన్

  [ఆదఘ్ +రయ = ఆదఘ్రయ: నిరాశ వేగము; దఘ్ +రత =దఘ్రత: కాపాడ నాసక్తి]

  రిప్లయితొలగించండి
 28. నరుఁడువిజ్ఞానశాస్త్రంబుమర్మమరయ
  జీవగతులనుశోధించిచేవఁదెలిసె
  కానిదేమున్నదీరీతికాంక్షయుండ
  వ్యాఘ్రసింహములకుఁబుట్టెవానరుండు

  రిప్లయితొలగించండి
 29. తెలుగు భాషకు ఆస్ట్రేలియాలో అరుదైన గౌరవం లభించింది. అక్కడి బడుల్లో తెలుగును ఐచ్ఛిక అంశంగా చేరుస్తూ ఆస్ట్రేలియా ప్రభుత్వం కీలక ఆదేశాలిచ్చింది. దీంతో పన్నెండో తరగతి వరకు ప్రాథమిక, మాధ్యమిక పాఠశాలల్లో ఇకపై తెలుగు భాషను నేర్చుకునే అవకాశం కలగనుంది. ఈ ప్రకటన యావత్‌ ప్రపంచంలోని తెలుగు వారికి ఆనందాన్ని కలిగిస్తోంది. ఆస్ట్రేలియాలో ఇప్పటి వరకు హిందీ, పంజాబీ, తమిళ భాషలకే అక్కడి ప్రభుత్వ గుర్తింపు లభించింది. తాజాగా ఆ జాబితాలో నాలుగో భాషగా తెలుగు చేరింది. దీంతో ఆస్ట్రేలియాలోని వివిధ రాష్ట్రాల్లోని తెలుగు వారికి ప్రయోజనం కలగనుంది.తాజా ఆదేశాలతో తెలుగు భాషను ఆప్షనల్‌గా ఎంపిక చేసుకొన్న వారికి ఉత్తీర్ణతలో ఐదు పాయింట్లు అదనంగా ఇవ్వనున్నారు. ఇకపై శాశ్వత నివాసం కోసం తెలుగు భాష ఆధారంగా దరఖాస్తు చేసుకోవచ్చని ఆదేశాల్లో పేర్కొన్నారు. ఆస్ట్రేలియా ప్రభుత్వ ప్రకటన పట్ల స్థానిక తెలుగు సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి. తెలుగు సమాఖ్య సభ్యులు, తెలుగుమల్లి, భువన విజయం వంటి సాంస్కృతిక సంస్థలు ఏళ్లుగా చేస్తున్న కృషికి దక్కిన ఫలితం ఇది.

  రిప్లయితొలగించండి
 30. రిప్లయిలు
  1. ఉ:

   వ్యాఘ్రము వోలు దర్పమున వర్ధిలు భూసురు డింతియెంపికై
   వ్యాఘ్రస మెంచి చేరగొనె వక్రత గాంచెను సింహ రూపమున్
   శీఘ్రమె కోర్కెదీర గనె చిన్ని కుమారుని లోకులిట్లనన్
   వ్యాఘ్రము సింహమున్ గలియ వానరుడొక్కడు పుట్టె వింతగన్

   వై. చంద్రశేఖర్

   తొలగించండి
 31. వ్యాఘ్రుగ బుట్టె నీ వరుడు వాసిధనాఢ్యుగ తా ధనిష్ఠ యం
  దున్ ఘ్రుణియంగ చిత్తభజతో కరమందగ గాంచెనో సుతున్
  శీఘ్రమె విష్ణు ఋక్షమున శ్రీలను గూర్చగ నెంచిచూడ నీ
  వ్యాఘ్రము సింహమున్ గలియ వానరు డొక్కడు పుట్టె వింతగన్

  వ్యాఘ్ర = స్వకుల శ్రేష్ఠుడు.
  ధనిష్ట = ఈ నక్షత్రంలో పుట్టిన యోని సింహమగును.
  ఘ్రుణి = కాంతి
  చిత్తభజ = చిత్తా నక్షత్రంలో పుట్టిన కన్య (పులి యోని)
  విష్ణు నక్షత్రం = శ్రవణ నక్షత్రంలో జన్మించిన కోతి యోని.

  ఈ విధంగా పై సమస్యను అనుసరించి చూడగా సింహమునకు పులికిని కోతి పుట్టినది చిత్రమే కదా !

  రిప్లయితొలగించండి