24, జులై 2020, శుక్రవారం

సమస్య - 3436

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"సానితోఁ జేయవలె నవధానములను"
(లేదా...)
"అవధానం బొనరింపఁగా వలెను వేశ్యాసంగతిన్ బొందుచున్"

53 కామెంట్‌లు:


 1. నడిరేయి సరదా పూరణ:

  జవరాలే చన పుట్టినింట, వ్యధతో జాగ్రత్తనున్ వీడుచున్
  రవివారమ్మున బుద్ధి గడ్డి తినగా రాజోలు పట్నమ్మునన్
  భవుడౌ వైద్యుని చెంతకేగుచునహో భండారమున్ విప్పి తా
  నవధానం బొనరింపఁగా వలెను వేశ్యాసంగతిన్ బొందుచున్

  రిప్లయితొలగించండి
 2. కవితావేశము పొంగువార రసగంగా స్నాన సంభావ్యమై
  అవధానం బొనరింపఁగా వలెను; వేశ్యాసంగతిన్ బొందుచున్
  లవలేశమ్మవమానమున్ దలపకన్ లజ్జా విహీనత్వమున్
  అవధానంబుల జేతుమంచు పలుకంగారాదు పాపాత్ములై

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'తలపక' అన్నది కళ. "...దలపకే..." అనండి.

   తొలగించండి

 3. ఆటవిడుపు సరదా పూరణ:
  (జిలేబి గారికి అంకితం)

  కవులన్ బ్రోచెడు రాయలే విరివిగా కట్నమ్ములన్ జల్లగా
  చెవులన్ బంగరు పోగులున్ గళమునన్ శృంగారమౌ భూషతో
  పవలున్ రాతిరి గానకే పలుకుచున్ పద్యమ్ములన్ ప్రీతితో
  నవధానం బొనరింపఁగా వలెను వేశ్యాసంగతిన్ బొందుచున్

  రిప్లయితొలగించండి


 4. రాబోవు శంకరాభరణము వారి అవధాన పత్రిక కై వేచి‌ :)  శంకరాభరణపు కవి శంకరార్య!
  సదనపు కవులెల్లను చేరి చంద మదియె
  మించ గాను వాట్సాపున మేల్మి మేడ
  సానితోఁ జేయవలె నవధానములను  జిలేబి

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు


  1. శంకరాభరణపు కంది శంకరయ్య,
   సదనపు కవులెల్లను చేరి చంద మదియె
   మించ గాను వాట్సాపున మేల్మి మేడ
   సానితోఁ జేయవలె నవధానములను   జిలేబి

   తొలగించండి
  2. మేడసాని వారు అనుగ్రహిస్తే అంతకంటేనా? శుభం!
   మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.

   తొలగించండి


 5. కవితా వేశములెల్ల వెల్లివిరియంగా చందమొప్పారగా
  నవధానం బొనరింపఁగా వలెను, వేశ్యాసంగతిన్ బొందుచున్
  తవికల్ వ్రాయుచు పేరడీలను కవిత్వంబంచు ప్రాకర్షికా
  కవిరాట్టుల్ వలె దీప్తినొంద వలదీ కాలమ్ములో పండితుల్  నారదా
  జిలేబి

  రిప్లయితొలగించండి
 6. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

  రిప్లయితొలగించండి
 7. ఈ నాటి శంకరా భరణము‌ వారి సమస్య

  సాని తో చేయవలె నవ ధానములను

  నా పూరణ‌ సీసములో


  అంగ రాజ్యం వర్ష విహీనమై కరువు కాటకములలో మునిగిన సమయమున ఋష్యశృంగుడు యెచట కాలు మోపిన అచ్చట వర్షములు‌ విస్తారంగా కురిసి రాజ్యం సుభిక్షంగా ఉంటుందని రోమపాదుడు తెలుసుకొని
  తన భటులను పంపి అతనిని రప్పించి మంటాడు అప్పుడు మంత్రి వారించి ఇలా పలుకుతాడు "రాజా అతను మీరు ఆనతి యిచ్చిన రాడు అతనికి ఐహిక సుఖములు తెలియవు అతనిని‌ వాని తండ్రి విభాండకుడు ఆశ్రమము నుంచి బయటకు పంపకుండా పెంచాడు అతనిలో కాము వాంఛ పెంచు నటుల స్త్రీలు కౌగిలి లో బంధించ అతను లొంగి రాగలడు ఇట్టి పనిని(చేత) ఒక్క‌ వేశ్య యే చేయగలదు కాబట్టి వేశ్యలను పంపుతాను‌ అని మంత్రి చెప్పు సందర్భం


  వర్షముల్ కలుగును వనమున నున్న వి
  భాండక తనయుడు వచ్చి కాలు

  మోప నెచట నైన, ముదముగ‌‌ పిలచిన
  రాబోడుగ తపసి,రమ్య మైన

  స్త్రీ పరి‌ష్వంగము శీఘ్రమున్ కల్పించ
  కామేఛ్ఛతో వచ్చు, గనుక‌ యిట్టి

  చేతను సాని తోచేయవలె, నవధా
  నములను బడసి వినయము తోడ


  వేద విద్య ల నెన్నియో విస్తృత ముగ

  నేర్చి నట్ఠి ఘనాపాటి, నెమ్మి‌తోడ

  నిటకు నా ఋష్య శృంగుడుని కొని‌ తెత్తు

  మనుచు రోమపాదునితోడ మంత్రి పలికె

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'ఋష్యశృంగుడుని' అన్న ప్రయోగమే పానకంలో పుడకలా ఉంది.

   తొలగించండి
  2. నిటకు నట్టి ఋష్యశృంగుని కొనితెత్తు...అంటే సరిపోతుంది.

   తొలగించండి
 8. కాంచు ! మిచటకు వచ్చిన గాంత కిపుడు
  నెలలు తొమ్మిది పూర్తిగ నిండకుండె ,
  నతిగ జాగ్రత జూపించు మనుచు మంత్ర
  సానితోఁ జేయవలె నవధానములను

  రిప్లయితొలగించండి
 9. తే.గీ//
  పుత్రకామేష్టి యాగము పూర్తిగాను
  సానితోఁ జేయవలె, నవధానములను l
  నేర్పుగా ధారణ గలిగి కూర్పుజేయ
  గౌరవింతురు సభలోన కౌరవేయ ll

  రిప్లయితొలగించండి
 10. సానియు నున్నది మేడను
  తాను దిగదు నీవు పొమ్ము దానిని ది౦పన్
  కానిచొ నచటే యు౦డుము
  సానితోఁ జేయవలె నవధానములను

  రిప్లయితొలగించండి
 11. రిప్లయిలు
  1. వేశ్యాలోలుడైన అవధాని వేశ్యతో,

   నవనీతప్రతిరూపభావవిలసన్నవ్యార్థవిస్ఫూర్తిమ
   త్కవనాసాదితపద్యపూరణలతోఁ దద్వేత్తలోహో యనన్
   వ్యవధానవ్యతిరిక్తమౌ విదితకావ్యజ్ఞాన
   సత్ప్రా శ్నికో
   క్త్యవధానం బొనరింపఁగా వలెను వేశ్యా! సంగతిన్ బొందుచున్.

   సంగతి = జ్ఞానము.

   కంజర్ల రామాచార్య.
   కోరుట్ల.

   తొలగించండి
 12. సాని యున్నది మేడను చక్కగాను
  తాను దిగదట నీవె పో దాని ది౦ప
  కానిచొ నచటె యు౦డుము కాపురమ్ము
  సానితోఁ జేయవలె నవధానములను

  రిప్లయితొలగించండి
 13. రంభగూడినకవులంత రసికులవగ
  విశ్వమంతయు వెలుగుల వీధిగాగ
  కృష్ణ శాస్త్రిని మురిపించు తృష్ణగల్గు
  సానితోజేయవలెనవధానములను
  +++++++++++++++++
  రావెల పురుషోత్తమ రావు

  రిప్లయితొలగించండి
 14. తే.గీ//
  ముద్దుముచ్చట్ల నెపుడైన పద్ధతిగల
  సానితోఁ జేయవలె, నవధానములను l
  పొరుగు దేశాల కవులతో పరువునిలుప
  కీర్తి ద్విగుణీకృత మగును కార్తికేయ ll

  రిప్లయితొలగించండి
 15. మైలవరపు వారి పూరణ

  కరోనా కష్టకాలం..

  కవిరాజా! యరచేత చూపునిది స్వర్గంబున్ ధనంబిచ్చుచో
  నవవైవిధ్యపుటాకృతుల్ గలిగి క్రన్నన్ నీ మదిన్ దోచురా!
  యవలోకింపగ సెల్లుఫోననగ వేశ్యారూపమీ కాలమం...
  దవధానం బొనరింపఁగా వలెను వేశ్యాసంగతిన్ బొందుచున్!

  రిప్లయితొలగించండి
 16. క్రొవ్విడి వెంకట రాజారావు:

  కమనుడై చరించెడివాడు కామకేళి
  సానితో జేయవలె; నవధానములను
  నిర్వహించవలెను కవి నెఱిని గల్గి
  తారతమ్యములు దెలియు తలచినంత

  రిప్లయితొలగించండి
 17. నాటి రాయలసభలోన మేటి కవిగ
  మనుచరిత ప్రబంధాభి మానధనుడు
  పేరుగాంచిన సుకవుల పెద్ద అల్ల -
  సానితో జేయవలె నవధానములను!

  రిప్లయితొలగించండి
 18. ప్రజ్ఞ గల్గియు ధారణా ప్రతిభ గల్గి
  వెల్గె గొప్పగా నవధాన విద్య యందు
  పలు ప్రశంసలు నొందిన వాడు మేడ
  సాని తో చేయవలె నవ ధా న ము లను

  రిప్లయితొలగించండి
 19. క్రొవ్విడి వెంకట రాజారావు:

  కవిగా ప్రజ్ఞనుగొన్న పండితుడు సాకల్యంబునౌ రీతితో
  చవులూరించెడి పద్యముల్ పలుకుచున్ చాతుర్యమున్ జూపుచున్
  అవధానంబొనరింపగా వలయు; వేశ్యా సంగతిన్ బొందుచున్
  వ్యవహారమ్ములొనర్చు కామనునకున్ ప్రావీణ్యమున్ కావలెన్.

  రిప్లయితొలగించండి
 20. అవలోకించుచు పృచ్ఛకా ళినన నాహార్యం పురూపంబునై
  నవభావమ్ముల పద్యపా దముల శ్రీనాట్యం బుశృంగారమై
  నవగీతమ్ముల నాశుధా రయది గానాలో లమద్యంబునై
  అవధానం బొనరింపఁగా వలెను వేశ్యాసంగతిన్ బొందుచున్

  కొరుప్రోలు రాధాకృష్ణ రావు

  రిప్లయితొలగించండి
 21. కన్న గడ్డను వదిలి నా కడుపు కోస
  రమని ఇంగ్లాండు కొచ్చితి, రాణి గారి
  నేల తెలుగు రాదెవనికి, నేనిక దొర
  సానితో జేయవలె నవధానములను

  రిప్లయితొలగించండి
 22. దేని వలన గలుగు నప్రతిష్ఠ జగతి?
  దేనిఁ దలపక సేతురే దీన సేవ?
  దేని వలన గలుగు పాండితీ విభవము?
  సానితోఁ; జేయవలె; నవధానములను

  రిప్లయితొలగించండి
 23. శంకరాభరణమనునీసాలయందు
  ప్రముఖయవధానిగాబేరువడయుమేడ
  సానితోజేయవలెనవధానములను
  నాదుకోరికయీయదినమ్ముడార్య!

  రిప్లయితొలగించండి
 24. తేనె లొలికెడు భాషయే తెలుగ టంచు
  మహిని చాటగ భాషాభి మానులెల్ల
  కవికులతిలకు డైనట్టి ఘనుడు మేడ
  సానితోఁ జేయవలె నవధానములను.

  రిప్లయితొలగించండి
 25. 24.07.2020
  అందరికీ నమస్సులు 🙏

  *తే గీ*

  తలచిన తరుణమే బిల్చి తప్పక నిల
  పదుగురు తెనుంగు దెల్సిన పండితులను
  బట్టి దెచ్చిన, యవధాని వర్య మేడ
  *"సానితోఁ జేయవలె నవధానములను"*

  *కళ్యాణ్ చక్రవర్తి ముంబాయి*🙏

  రిప్లయితొలగించండి
 26. పండితమ్మన్యుడాయనవాదులాడ
  ఏడుకోండలవెంకన్నవేడికోనగ
  తెనుగునవధానితానయ్యెమేటిమేడ
  సానితోఁజేయవలెనవధానములను

  రిప్లయితొలగించండి
 27. కవిగాబేరునుబొందునందరునుదాకావ్యమ్మువ్రాయన్దగన్
  నవధానంబొనరింపగావలెను,వేశ్యాసంగతిన్బొందుచున్
  నవహేళంబుగజూడరాదసురనెయ్యైవేళలందున్సుమా
  కవిరాడ్వర్యులపొందుపూర్వముననక్కాంతల్గదాయిచ్చిరే

  రిప్లయితొలగించండి
 28. శబ్దరత్నాకరపుఁ బరిచయము మెండు
  వ్యాకరణమును బట్టె నౌపాసనమ్ము
  తెనుఁగు పద్య రచన యందు దిట్ట యొజ్జ
  సానితోఁ జేయవలె నవధానములను


  కవి విద్వన్నుత సారవన్నయ సువిఖ్యాతాత్త గూఢార్థ భ
  వ్య వివేకద్యుతి యుక్త భావ జల సద్భంగస్థ సద్యస్స్ఫుట
  చ్ఛవిమచ్ఛబ్ద వికాస నిత్య నిజ రాజత్స్వాంత సన్నిష్ఠకై
  యవధానం బొనరింపఁగా వలెను వే శ్యాసంగతిం బొందుచున్

  [వేశ్యా +అసంగతి = వే శ్యాసంగతి]

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు  1. కవి
   విద్వన్నుత ఉన్నత విద్య
   సారవన్నయ - సారవంతము కొత్తదైన
   సువిఖ్యాతాత్త విఖ్యాతమైన
   గూఢార్థ
   భవ్య
   వివేకద్యుతి యుక్త భావ- కాంతి వంతమైన వివేకముతో కూడిన భావము
   జల ??
   సద్భంగస్థ ??
   సద్యస్స్ఫుట
   చ్ఛవిమచ్ఛబ్ద ??
   వికాస
   నిత్య
   నిజ
   రాజత్స్వాంత
   సన్నిష్ఠకై


   యవధానం బొనరింపఁగా వలెను వే శ్యాసంగతిం బొందుచున్

   [వేశ్యా +అసంగతి = వే శ్యాసంగతి]


   హమ్మయ్య

   జిలేబి

   తొలగించండి
  2. హమ్మయ్య కాలేదండి!!
   కవి విద్వత్ నుత సారవత్ నయ సువిఖ్యాత ఆత్త గూఢార్థ భవ్య వివేక భావ జల సత్ భంగ స్థ సద్యః స్ఫుట ఛవిమత్ శబ్ద వికాస నిత్య నిజ రాజత్ స్వాంత సత్ నిష్ఠకై

   తొలగించండి
 29. కవియై పద్యములన్ లిఖించుచు నుపగ్రాహ్యమ్ములన్ పొందుచున్
  వ్యవధానమ్మిడకుండ ధారగొని సవ్యంబైన స్థైర్యమ్ముతో
  నవధానం బొనరింపఁగా వలెను, వేశ్యాసంగతిన్ బొందుచున్
  వ్యవహారమ్ముల చేసినన్ సతము లభ్యమ్మౌను క్లేశమ్ములే

  రిప్లయితొలగించండి
 30. శ్రవణానందము కల్గజేయుచు సభన్ రంజింప గా జేయగా
  నవధానుల్ కడునేర్పు జూపుచు సదా హాస్యంబు బండించగా
  నవధానం బొనరింపఁగా వలెను, వేశ్యాసంఘతిన్ బొందుచున్
  గవనమ్ముల్ రచియింపగా కవులు సత్కావ్యమ్ము లై నిల్చెనే.

  రిప్లయితొలగించండి
 31. తేటగీతి
  తొలుత నాన్లైను నవధాన మొలికినంత
  నాముదాలకు పృచ్ఛకునైతి మురిసి
  వాణి దయచేత నెటులైన వరుస మేడ
  సానితోఁ జేయవలె నవధానములను

  ఒక అవధాని ఆకాంక్ష...

  మత్తేభవిక్రీడితము
  కవితాగానము సంఘసంస్కరణకై గావించ నేనెంచుచున్
  భువిలో నేరముఁ జేసి చిక్కి చెరలోఁ బొర్లాడు ఖైదీలతో
  నవధానమ్మునుఁ జేయఁ బృచ్ఛకులునై హ్లాదించ, సంకల్పమై
  యవధానం బొనరింపఁగా వలెను వేశ్యాసంగతిన్ బొందుచున్

  (సంగతి = జ్ఞానము)

  రిప్లయితొలగించండి
 32. అవనుజాతుల కెల్లసాజమగు భోగాకర్షణా తత్త్వమే
  స్తవనీయంబగు మోక్షమార్గమున నాచార్యానుసారంబుగా
  నవధానం బొనరింపగా వలయు,వేశ్యాసంగతిం బొందుచున్
  అవివేకంబున మున్గబోకు ఘనశోకాంబోధి ధ్వాంతమ్మునన్
  అవధానము =ఏకాగ్రత,సంవిత్తు,సమాధి
  గిరీశం స్వగతం
  వ్యవహారంబుల జక్కబెట్టవలయున్ వ్యాజ్యాలు వేయించుచున్
  చవటౌ శిష్యునికింగిలీషు చదువుల్ చక్కంగ నేర్పించుచున్
  భువనైకాంగన నీవెయంచు రహితో బుచ్చమ్మ బెండ్లాడు నీ
  యవధానం బొనరింపగా వలయు వేశ్యాసంగతిన్ బొందుచున్

  రిప్లయితొలగించండి
 33. ఇల్లుకదలక నింటిలోనిమడలేక
  రోజులనుగడుపుటయన్న రోతపుట్టె
  నన్నిపనులతోవేధించునట్టి నాప
  సానితోఁ జేయవలె నవధానములను

  రిప్లయితొలగించండి
 34. తే.గీ.

  తెలుగు సాహితీ లోకాన తిరుగులేని
  భువన విజయ ప్రదర్శన బూనుకొనగ
  అష్టదిగ్గజము లనన యగ్రిఅల్ల
  సానితో జేయవలె నవధానములను

  వై. చంద్రశేఖర్

  రిప్లయితొలగించండి
 35. నేరముజేసినయప్పుడు
  తరతమభేదముతెలియకదండింపదగున్
  కారెవరునుశత్రుపక్షము
  కారముగలమాటమెప్పుగలదెల్లపుడున్

  రిప్లయితొలగించండి