7, జులై 2020, మంగళవారం

సమస్య - 3420

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"కుంతికిన్ గుంభకర్ణునకు సుత సీత"
(లేదా...)
"కుంతికిఁ గుంభకర్ణునకుఁ గూఁతురుగా జనియించె సీతయే"

41 కామెంట్‌లు:


 1. నడిరేయి సరదా పూరణ:

  సంతును కోరకే సుతుడు సంతస మీయక సంభవించెగా;
  వింతగ నిద్రబోవుటకు వేడుక గల్గెను లంకనందునన్;
  చింతలు దీర్చ భూపతికి శ్రీకర మొప్పగ ధాత్రికిన్ భళా;
  కుంతికిఁ; గుంభకర్ణునకుఁ; గూఁతురుగా జనియించె సీతయే

  రిప్లయితొలగించండి

 2. ఆటవిడుపు సరదా పూరణ:
  (జిలేబి గారికి అంకితం)

  సుంతయు జ్ఞానమొందకయె సుందరమైన పురాణ గాథలన్
  గంతులు వేసి కోతివలె కంపము నొందక శంకరార్యుకున్
  కొంతయు సిగ్గువీడుచును గోముగ పల్కెను శాస్త్రి వర్యుడే:
  "కుంతికిఁ గుంభకర్ణునకుఁ గూఁతురుగా జనియించె సీతయే"

  రిప్లయితొలగించండి
 3. తలచి నంతనెవ్వరికి సంతాన మబ్బె?
  బ్రహ్మ వరమున నిదురయె వలచె నెవని?
  జ్ఞాన యజ్ఞము యేమిచ్చె జనకు నకును?
  కుంతికిన్; గుంభకర్ణునకు; సుత సీత!

  రిప్లయితొలగించండి
 4. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

  రిప్లయితొలగించండి
 5. చింతల బాప నెవ్వరి కచింత్య వరంబిడెఁ నత్రిపుత్రుడే?
  వింతగ నిద్దురన్ వలచె వేలుపు బెద్దను జూచి యెవ్వడున్?
  క్షాంతిని దున్నగా దొరికె జ్ఞాని విదేహుకు బంధువెవ్విధిన్?
  కుంతికిఁ; గుంభకర్ణునకుఁ; గూఁతురుగా జనియించె సీతయే!!

  రిప్లయితొలగించండి
 6. బాగుగనె నూరితిరి గద బాలకులకు ,
  పాత గాథలన్ని గలిసి పచ్చడయ్యె
  శంకరా ! దాని ఫలితమీ చక్క నినుడి
  “కుంతికిన్ గుంభకర్ణునకు సుత సీత"

  రిప్లయితొలగించండి
 7. రామనవమి వేడుకలందు ప్రక్క పక్క
  మూడు వీధుల హరికథల్ వినగ నయ్యె
  గాలి వాటున మాటలు కలగలుపయి!
  కుంతికిన్ గుంభకర్ణునకు సుత సీత!

  రిప్లయితొలగించండి

 8. వాయింపులు వుండవని తలచి :)


  పైత్యము పెరిగెనో కవి వరుడొకండు
  వ్రాసె కైపద మొక్కటి వరుస గాను
  పేర్లనతికించుచున్ భళి వింతగాను
  "కుంతికిన్ గుంభకర్ణునకు సుత సీత"


  జిలేబి  రిప్లయితొలగించండి
 9. కర్ణువరమిడెనెవరికి కర్మసాక్షి
  పద్మజుండేరికొసగెనువరమునిదుర
  జన్మమొందినదెవ్వరుజనకసుతగ
  కుంతికిన్ గుంభకర్ణునకు సుత సీత

  రిప్లయితొలగించండి


 10. కందోత్పల


  "అనమానమేల నబ్జా
  నన! కుంతికిఁ గుంభకర్ణునకుఁ గూఁతురుగా
  జనియించె సీతయే! బో
  డి నిక్కమిదియే!" శకారుడే పల్కెనుగా


  జిలేబి

  రిప్లయితొలగించండి
 11. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. జనన మొందెగా నేసయ్య జనకు నింట,

   కుంతికిన్ కుంభకర్ణునకు సుత సీత,

   గణపతి జనించె గా మేరి గర్భ మందు,

   యేమి పలుకులివి? మతి పోయె గద మీకు

   నేడని పలికె పతితో వనిత వగచుచు

   తొలగించండి
 12. సంతిల దివ్య మంత్రమున సంతతి కల్గెను యద్భుతంబుగన్
  చెంతను యేన్గులున్ ధ్వనుల జేసిన నిద్దుర తీరదేరికో ?
  చింతిలి సంతు లేదనుచు సీత్యము దున్నగ మైథిలేశుకున్
  కుంతికి, గుంభకర్ణునకు, గూతురుగా జనియించె సీతయే!!


  వింతగ వార్తలెప్పుడు వీనుల బాదగ దూరదర్శనుల్
  వంతలు గట్టి పిల్లలివె వాసిగ నేర్చిరి బుద్ధి మీరగన్
  మంతన మాడిరెంతయొ మంచిగ స్నేహితులందరక్కటా
  కుంతికి గుంభకర్ణునకు గూతురుగా జనియించె సీతయే!!

  రిప్లయితొలగించండి

 13. ఇంతులలోననెవ్వరికినీభువిపాండవులుద్భవించిరో
  వింతగ నేరికిన్ నిదుర వేడగ పద్మభవుండొసంగెనో
  సంతసమందగా జనకుజాతగ నెవ్వరు జన్మమొందిరో
  కుంతికిఁ గుంభకర్ణునకుఁ గూఁతురుగా జనియించె సీతయే

  రిప్లయితొలగించండి
 14. పాండురాజెవరి పతి? రావణ విభీష
  ణులెవరికిని సోదరులట? లలన యవని
  జ గన జనకున కే వరుసయగు ననగ
  కుంతికిన్, కుంభకర్ణునకు, సుత సీత.

  రిప్లయితొలగించండి
 15. మైలవరపు వారి పూరణ

  కొంతయె మత్తు క్రమ్మినది! కూతురుగా రచియించినారలా
  కుంతికి కుంభకర్ణునకు కోమలి జానకి., నట్లుగానిచో
  వింత మరింతయయ్యెడిది! విజ్ఞత జూపిరి! కొంత సాధువే!
  కుంతికి కుంభకర్ణునకు కూతురుగా జనియించె సీతయే!!

  మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

  రిప్లయితొలగించండి
 16. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. కర్ణుడుదయించె నెవ్వారి గర్భమందు,

   రావణుండు నెవరికినగ్రజుడు మహిన,

   జన్మ నొందె నెవ్వారు నా జనకు నింట

   కుంతికిన్, కుంభకర్ణునకు,సుత సీత

   తొలగించండి
 17. "కుంతికిన్ కుంభకర్ణునకు సుత సీత
  యయ్యె గతములోని శిఖండి, యడచ పార్థు "
  ననుచు కల గంటి! టీవిలో గనిన కృష్ణు
  రాముల కథలు నిదురలో రభస జేసె !

  రిప్లయితొలగించండి


 18. కుంతికిఁ గుంభకర్ణునకుఁ గూఁతురుగా జనియించె సీతయే!
  సుంతయు ముద్దు చేసిరిక శూర్పణఖాదులు! రాముడాతడే
  గంతలు కట్టికన్నులకు కాంతను నెత్తుకు పోయె సూవె నా
  క్రాంతము చేసి చట్టనుచు ద్రావిడులన్ తుదమాడి వింతగా
  పంతము బట్టి చెప్పెనొక పామరుడేను తటాల్మటంచుపో!


  జిలేబి

  రిప్లయితొలగించండి
 19. పొంతన లేని బంధువుల పొందు యుగాంతరభేదమందు! యే
  కొంతయు నన్వయోచితమొ! కూడదు దివ్యపురాణపాత్రలం
  దంత నయోగ్యమౌ వరుస లయ్యయొ! సాధ్వికి నంటఁ గట్టి తే
  కుంతికిఁ గుంభకర్ణునకుఁ గూఁతురుగా జనియించె సీతయే?

  కంజర్ల రామాచార్య.

  రిప్లయితొలగించండి
 20. అంతటి పెద్ద గాథలకు నంతము జూడగ గోరినప్పుడున్
  కొంతయు వీలునీయకనె కూర్చొను బెట్టగ నెన్నడైననున్
  సంతతి చెప్పుచుండు నుడి చక్కగ నీ పరిపాటి యె ట్లనన్
  "కుంతికిఁ గుంభకర్ణునకుఁ గూఁతురుగా జనియించె సీతయే"

  రిప్లయితొలగించండి
 21. క్రమాలంకారంలో ---
  ధర్మ జాదుల నెవరికి తనయు లండ్రు?
  ఎవరి కగ్రజుండు రావణుo డీ యిల నగు?
  జనకు కేమగు రాముని సతియు జెపుమ?
  కుంతికిన్ ' కుంభకర్ణునకు ' సుత సీత

  రిప్లయితొలగించండి
 22. పచ్చి వెలగ పండు గళము పడ్డ రీతి!
  తెలుగు పంతులు గారికి తిరగె తలయు!
  శిష్యరత్నమీ విధిపల్క సీతెవరన |
  "కుంతికిన్ గుంభకర్ణునకు సుత సీత"

  రిప్లయితొలగించండి
 23. * శంకరాభరణం వేదిక *

  07/07/2020...మంగళవారం

  సమస్య
  ********
  కుంతికి గుంభకర్ణునకు గూతురుగా జనియించె సీతయే

  నా పూరణ. ఉ.మా.
  *** ********

  చెంతకు బిల్చినంత జని చెన్నగు బుత్రుని నిచ్చె సూర్యుడే

  స్వాంతము దుష్టముండెడు దశాననుడే కన నగ్రజుండగున్

  సంతతమున్ రహిన్ బ్రజల సాకెడు నా జనకుండుకే గదా

  కుంతికి , గుంభకర్ణునకు , కూతురుగా జనియించె సీతయే

  -- 🌱 ఆకుల శాంతి భూషణ్ 🌱
  🌷 వనపర్తి🌷

  రిప్లయితొలగించండి
 24. వింతగ భర్త గాక సరి వేల్పులఁ సంతతి గల్గె నేరికిన్
  సంతత స్వాపమగ్నతయె చక్కగ దక్కె వరంబదేరికిన్
  సంతతి లేని వారి కిల జాలున దక్కె వరంబదెద్దియో
  కుంతికిఁ, గుంభకర్ణునకుఁ, గూఁతురుగా జనియించె సీతయే

  రిప్లయితొలగించండి
 25. అంతిపురంపు కన్నియగ నంశుప తెవ్వరి కిచ్చె పుత్రునిన్?
  స్వాంతము నిద్రపై నిలచు సంతత మెవ్వరి కీ ధరిత్రిపై?
  వింతగ కూతురై కలిగి పృథ్వికి, రాము వరించె నెవ్వరో ?
  కుంతికిఁ, గుంభకర్ణునకుఁ, గూఁతురుగా జనియించె సీతయే

  రిప్లయితొలగించండి
 26. మంత్రమున సంతెవరికయ్యె మహిని నాడు
  నారునెలల నిద్ర వర మెవ్వారి కయ్యె
  చేను దున్నెడి రాజుకు చిక్క నట్టి
  *కుంతికిన్,కుంభ కర్ణునకు సుత సీత."

  రిప్లయితొలగించండి
 27. కుంతికిన్గుంభకర్ణునకుసుతసీత
  వింతయదిగాదె!వినగనువిమల!యరయ
  భారతంబునముడివెట్టియౌర!రామ
  కధను,గజిబిజిజేసిరిగదమనమ్ము

  రిప్లయితొలగించండి
 28. 07.07.2020
  అందరికీ నమస్సులు🙏🙏
  నా పూరణ..

  *తే గీ*

  మందు గ్రోలుచు నొక్కడు మాటలాడె
  వీధి నాటకమందును వింతగాను
  పట్టు లేకను గాధల పలికెనిటుల
  *"కుంతికిన్ గుంభకర్ణునకు సుత సీత"*

  (రామాయణము భారతము ఒకే సారి టీవీ లో మెగా ఎపిసోడ్స్ రావడంతో కన్ఫ్యూజన్ లో అనే ఉద్దేశ్యం తో 😊😊)

  *ఉ*

  శాంతము దూరదర్శనము చక్కగ జూపగ రెండు గ్రంధముల్
  కంతలు గట్టినట్టుగను గానక నందున పాత్రలెంచగన్
  పొంతన లేక నొక్కడిట వింతగ బల్కెను నివ్విధమ్ముగన్
  *"కుంతికిఁ గుంభకర్ణునకుఁ గూఁతురుగా జనియించె సీతయే"*

  *కళ్యాణ్ చక్రవర్తి ముంబాయి*
  🙏🙇‍♂️🙏

  రిప్లయితొలగించండి
 29. తేటగీతి
  ప్రవచనంబన యోగ్యుడు పండితుండు
  బోధఁ జేసిన భక్తులు ముక్తిఁ గనరె
  జారగుణ చిత్తు నెంచఁగ మీరి పలుకఁ
  గుంతికిన్ గుంభకర్ణునకుఁ సుత సీత!

  ఉత్పలమాల
  గంతకు తగ్గ బొంతయను కైవడిగన్ బ్రవచించ నెంచితో
  సుంతయు లేక యింగితము జోడుగఁ గైకను ధర్మరాజులన్
  వింతగఁ జెప్పు పండితుని వేడుక దెచ్చితె వాని గాథలన్
  గుంతికిఁ గుంభకర్ణునకుఁ గూఁతురుగా జనియించె సీతయే!

  రిప్లయితొలగించండి
 30. చింతనుజేయగారవినిశీఘ్రమెకర్ణుడుపుట్టెనేగదా
  స్వాంతమునందునన్జెడుగవర్తిలురావణుడన్నయేసుమా
  వంతలదీర్చకారణమువాసురగర్భమునుండిఱేనికిన్
  కుంతికి,గుంభకర్ణునకు,గూతురుగాజనియించెసీతయే

  రిప్లయితొలగించండి
 31. నెట్టులోచదువిట్టులనేర్చిరంత
  వింతవరుసలుగలుపుచువిధములేమి
  గురువుశిష్యులుపలికిరిగుణముమీరి
  కుంతికిన్కుంభకర్ణునకుసుతసీత

  రిప్లయితొలగించండి
 32. సమస్య :-
  "కుంతికిన్ గుంభకర్ణునకు సుత సీత"

  *తే.గీ**

  పాండవులెవరి పుత్రులు భరతమందు?
  రావణుండెవరిని లేపె రణము బంప?
  భువి జనకునికి దొరికిన పుత్రికెవరు?
  కుంతికిన్; గుంభకర్ణునకు; సుత సీత
  ...................✍️చక్రి

  రిప్లయితొలగించండి

 33. పిన్నక నాగేశ్వరరావు.
  ( క్రమాలంకారం )

  భాస్కరుని కృప కర్ణు డెవ్వరికి పుట్టె?
  నరయ రావణ బ్రహ్మ యెవరికి యన్న?
  జనకునకు లభించె నయోనిజ యెవరనగ
  కుంతికిన్; కుంభకర్ణునకు; సుత సీత.

  రిప్లయితొలగించండి
 34. ముద్దు ముద్దుగఁ బల్కుల నెద్దినమ్ముఁ
  బలుకు చుండ విహంగము పొలఁతి ముందు
  నంగనామణి పండ్ల నొసంగెఁ దమి శ
  కుంతికిన్ గుంభకర్ణునకు సుత సీత

  [శకుంతి = పక్షి (మగ); కుంభకర్ణునకు = పెద్ద చెవు లున్న దానికి]


  అంతము లేని దుఃఖముల నక్కట కానన వాస తప్తయే
  సంతత భర్తృ పాద యుగ సక్త విచార నిమగ్న చిత్తయే
  పొంతము మీఱ మా సతియె భూమికి, నేరను గల్గఁ బుత్రికల్
  కుంతికిఁ గుంభకర్ణునకుఁ, గూఁతురుగా జనియించె సీతయే

  రిప్లయితొలగించండి
 35. తంతువులేనివింతనికచానయునాళికగర్భమందునన్
  అంతరమెంచకుండగనురావణుతమ్మునివీర్యమెంచుచున్
  వంతలుబాయగాశిశువురామనుగాంచెనులోకమందునన్
  కుంతికికుంభకర్ణునకుఁగూతురుగాజనియించెసీతయే

  రిప్లయితొలగించండి
 36. గురువుగారికి క్షమార్పణలతో
  సంతత యాత్రలన్ గడపు శంకరవర్యులు లాకుడౌనునన్
  వింతగ బందియై మిగుల వేదననొందుచు కృంగుబాటునన్
  సుంతయు నిద్రరాకనిటు జోగుచునిచ్చె సమస్య నెవ్విధిన్
  గుంతికి గుంభకర్ణునకు గూతురుగా జనియించె సీతయే?

  జిలేబిగారికి ధన్యవాదములతో
  కందోత్పలం
  కుంతి,కుంభకర్ణులనే దంపతుల మాట (ఈ యుగంలో)
  వినుమా సఖి!చిరకాలము
  నను కుంతికి గుంభకర్ణునకు గూతురుగా
  జనియించె సీత యేవురు
  తనయుల పిమ్మట వరాలతల్లిగ వింతే!

  రిప్లయితొలగించండి
 37. ఉ:

  సుంతయు నాగలేక గనుచుండగ చిత్రము బైసుకోపునన్
  వంతుల వారి బొమ్మలకు పర్విడి సూటి జవాబు గోరగన్
  వింతగు గూఢ వాక్యముగ నేర్పడె నివ్విధి నెంత సోద్యమో
  కుంతికి ,కుంభకర్ణునకు, గూతురుగా జనియించె, సీతయే

  బైసుకోపు =Bioscope

  వై. చంద్రశేఖర్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. వింతగు గూఢ వాక్యముగ / వింతగు పద్య పాదముగ అని కూడా చెప్పవచ్చు

   తొలగించండి
 38. కొనలేదంచును చీరలన్ కినుకతో కూర్చున్న యిల్లాలికిన్
  ధనమియ్యన్ ప్రియ వల్లభుండు, కొని వస్త్రమ్ముల్ ప్రమోదమ్ముతో
  ఘనమౌ భూషణముల్ ధరించి మదిలో కాంతాళమున్ వీడి రాన్
  తన యర్ధాంగి, వివాహముం గనుటకై తానేఁగె నుత్సాహియై

  రిప్లయితొలగించండి