13, జులై 2020, సోమవారం

సమస్య - 3426

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"రాముఁడే రావణుండైన ప్రజకు మేలు"
(లేదా...)
"రాముఁడె రావణుండయి ధరాతల మేలుట పాడియౌఁ గదా"

69 కామెంట్‌లు:


  1. నడిరేయి సరదా పూరణ:

    దోమలు త్రోలగా తనరి తొంగుచు దిల్లిని తల్లి పుత్రుడున్
    కామము క్రోధమున్ విడిచి కాంగ్రెసు నేతయె రాజభూమినిన్
    నీమము లేని దేశమున నీటుగ పార్టిని జంపుజేయుచున్
    రాముఁడె రావణుండయి ధరాతల మేలుట పాడియౌఁ గదా

    రాజభూమి = Rajasthan

    రిప్లయితొలగించండి
  2. లడ్డకునచొచ్చిసైనికు లంత జంప
    యత్న మొనరించ చైనాకు నడ్డు దగిలి
    శాంతి పన్నాలు జెప్పని శాల్తి, యగ్గి
    రాముఁడే రావణుండైన ప్రజకు మేలు.

    శాల్తి-రూపము
    అగ్గిరాముడు-సమర్థుడు

    రిప్లయితొలగించండి

  3. నీమపు కే.వి.రెడ్డి భళి నేరుపు మీరగ నాకమందునన్
    ప్రేమను రామగాథగొని పిక్చరు తీయగ నాంధ్రభాషనున్
    గోముగ మెండు పాత్రలను గొప్పగ నాడెడు నందమూరుడౌ
    రాముఁడె రావణుండయి ధరాతల మేలుట పాడియౌఁ గదా

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు

    1. ఆటవిడుపు సరదా పూరణ:
      (జిలేబి గారికి అంకితం) 👆

      తొలగించండి
    2. రాముడుగా, రావణుడుగా నటించి మెప్పించిన ఎన్టీఆర్ ను ప్రస్తావించిన మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  4. సమస్య :-
    "రాముఁడె రావణుండయి ధరాతల మేలుట పాడియౌఁ గదా"

    *కందం**

    కటువైన మనసు గల్గిన
    యిట రాముఁడె రావణుండయి ధరాతల మే
    లుట పాడియౌఁ గదా ! హిత
    మెటులైనను జేయనెంచ యిష్టము పడరే
    ...................✍️చక్రి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఉత్పలమాల పాదాన్ని కందంలో ఇమిడ్చి చేసిన మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      "...గల్గిన నిట..." అనండి.

      తొలగించండి


  5. రాముఁడే రావణుండైన ప్రజకు మేలు
    కలుగ నా జిలేబి యతడక్షరుని పుట్టు
    కయని కొనియాడ బడునకొ? కర్మసాక్షి
    వంశమునకు కీర్తియు మరి వచ్చు భువిని?



    జిలేబి

    రిప్లయితొలగించండి


  6. కందోత్పల



    తృటికాలము తలచితి బా
    యిట రాముఁడె రావణుండయి ధరాతల మే
    లుట పాడియౌఁ గదా యని!
    తటాలు వచ్చెనదె నవ్వు తన్నుకొని సుమా!



    జిలేబి

    రిప్లయితొలగించండి
  7. నేటి శం కరాభరణము వారి సమస్య

    దుర్వ్యాపారంబెజనుల దు:ఖము ద్రోచున్

    ఇచ్చిన పాదము కందము

    నా పూరణ మహాక్కరలో

    స్వర్గ లోకములో అర్జునుని తో ఊర్వసి పలుకు పలుకులు



    ఘనముగ నగారి వరముతో బుట్టిన కౌంతేయ! పెరిగె నీ పైకోరిక ,

    తనువున ఘడియ ఘడియకును మదన తాపంబు తీవ్రమై బాధించగ

    మనసు వశము దప్పుచు నుండె, ,మగువకు మచ్చను గూర్చు దుర్య్వాపారంబె

    జనుల దు: ఖము ద్రోచునని కడు దోషంబుగ పల్కుట పాడికాదు,

    వినుము విజయా!యిచట లేవు నైతిక విలువలనుచు నూర్వసి వచించెను

    రిప్లయితొలగించండి
  8. లవకుశులు అయోధ్య నుంచి తిరిగి వచ్చి బాధతో తమ తల్లితో పలుకు సందర్భము


    గర్భ వతియగు సీతను‌ కారడవికి

    పంపెను జననీ ,ఘనుడని పలుక లేము

    రాముడే రావణుండైన ప్రజకు మేలు

    కలుగ దనుచు లవకుశులు పలికె రపుడు

    రిప్లయితొలగించండి
  9. నీమము తప్పకూడదని ,నెమ్మి ని కూర్చుచు పాలనంబు నే

    నీ మహి లోన చేతునుగ నెన్నడు, భార్యను కానల కంపగన్ ప్రజా

    క్షేమము కల్గుగా ననుచు చింతన చేయచు నుండునట్టి శ్రీ

    రాముడె రావణుం డయి ధరాతల మేలుట పాడియౌ గదా



    గర్భవతి సీతను అడవులకు పంపిన సమయములో కౌసల్య రాముని కాంచి ఆవేశముగా పలికిన పల్కులు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      రెండవ పాదంలో గణభంగం. సవరించండి.

      తొలగించండి
  10. రాముడు కృష్ణుడై వెలిగి రంజిలజేసి ప్రజాళినంతటన్
    వేమన పాత్రదాల్చి కనువిందొనరించిన నాయకుండు సం
    గ్రామము జేసి విప్రులకు గ్రాసము ద్రుంచెను; చిత్రసీమలో
    రాముఁడె, రావణుండయి ధరాతల మేలుట పాడియౌఁ గదా

    రిప్లయితొలగించండి
  11. (సీతాపరిత్యాగం కావించిన శ్రీరాముని
    గూర్చి భరతునితో నిష్ఠురమాడుతున్న శత్రుఘ్నుడు )
    ఆ మునిసన్నుతాంగుడు ; నృ
    పాగ్రణి ; మంజులభాషణుండునున్ ;
    శ్యామలకోమలాంగుడును ;
    శాంతుడు ; శాత్రవభీకరుండునున్ ;
    వామవిలోలలోచనను
    వందిత ; జానకి నంపె గానకున్
    రాముడె రావణుండయి ; ధ
    రాతల మేలుట పాడియౌ గదా !!

    రిప్లయితొలగించండి


  12. శంకరార్యుల కల! దుష్టులెల్ల రాముని లా మారి పరిపాలిస్తే ఎంత బాగుండునో నద్వందమై, ఏకం సత్ గా వెల్గు భువి కదా!


    ఆ ముని మాపు వేళ కల నాకొక టొచ్చెను కైపదమ్ముగా
    సామము గాను దోచినది చక్కటి పూరణ లెల్ల చేయనా
    రాముఖ మైన వాక్యమదె! రండి సవాలును స్వీకరించుడీ
    "రాముఁడె రావణుండయి ధరాతల మేలుట పాడియౌఁ గదా"



    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'వచ్చెను'ను 'ఒచ్చెను' అనడం వ్యావహారికం.

      తొలగించండి
  13. కనగ యవినీతి పెరిగిన కాలమ౦దు
    చక్క పాలన చేయ౦గ సాధ్యమగునె
    నేరగాళ్ళను సిక్షి౦ప ఘోరమైన
    రాముడే రావణు౦డైన ప్రజకు మేలు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      "కనగ నవినీతి... చక్కగా పాలనము జేయ సాధ్యమగునె నేరగాండ్రను శిక్షింప..."

      తొలగించండి
  14. ఉత్తరమున మేలయిన నాసత్తి జూపి
    ప్రజలు మెచ్చెడి రీతిన పాలననిడు
    రాముఁడే రావణుండైన ప్రజకు మేలు
    దక్షిణమున తలంచిరి లక్షణముగ

    రిప్లయితొలగించండి
  15. మైలవరపు వారి పూరణ

    భీముడు దుస్ససేనుఁగని భీతిని పారిననాడు., నింగిలో
    సోముడు మండుటెండలను సూర్యుని వోలె దహించునప్డుడా...
    పాములు కోరలన్ సుధలు పంచెడి కాలమునందునెంచ శ్రీ...
    రాముఁడు రావణుండయి ధరాతలమేలుట పాడియౌ కదా!

    మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మరొక పూరణ 🙏

      లంకలోని ఇద్దరు రాక్షసస్త్రీలు ఇలా అనుకొంటున్నారట..

      🙏శ్రీరామచంద్రం భజే💐🙏

      ప్రేమకు మారురూపమట., పెద్దల గాంచిన మ్రొక్కునంట., యెం..
      తో మురిపించు మాటలట., యోర్మికి దా ప్రతిరూపమంట., ఆ..
      నామమె బల్క జాలునట., న్యాయము ధర్మము దప్పడంట., యీ..
      భూమిజ లేని దుఃఖమున భోరునయేడ్చుచునుండెనంట.,శ్రీ రాముడు.,.. *వీని పాలనను* రక్తపుటేరులు పారు., లంకలో
      నేమి సుఖమ్ము పొందితిమి., ఎప్పుడు యుద్ధమటన్నభీతియే!
      నేమము దప్పి దెచ్చెనవనీతనయన్., హితులెంత చెప్పినన్
      కాముకవృత్తి మానడిక గర్వపుపాలును మెండు వీనికిన్!
      భామిని! కోరుకొందమిటు భావ్యమెయౌ గద! కొంతకాలమేన్
      రాముడు రావణుండయి ధరాతలమేలుట పాడియౌ కదా!

      మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి.

      తొలగించండి
    2. మైలవరపు వారి పూరణలు రెండూ ప్రశస్తంగా ఉన్నవి.

      తొలగించండి
  16. అష్ట కష్టాలు తప్పవీ యవని యందు
    రాముడే రావణుండైన : ప్రజకు మేలు
    రాముడే రాముడై యుండ రహి చెలంగి
    సౌఖ్య భోగాల దే లరే సంత సమున

    రిప్లయితొలగించండి
  17. నేమముతోడ పాలనము నిర్మలమౌ గతి చేయుచున్ ప్రజా
    క్షేమము కల్గజేయునట చిన్మయ రూపుడు, నీతిలేని యీ
    కాముకుడై చరించు దశకంఠని కంటెను, మేలు గల్గ యా
    రాముఁడె రావణుండయి ధరాతల మేలుట పాడియౌఁ గదా

    రిప్లయితొలగించండి
  18. ఏమర జేయుచున్ బ్రజల నేలుచు నేలిక మత్సరమ్మునన్
    నీమములెంచ కుండ ప్రతి నేతల, వారల మెచ్చు వారలన్
    బాముల పాలు చేయు నెడ పాలనమున్ తగ మార్పు జేయగా
    రాముడె రావణుండయి ధరాతల మేలుట పాడియౌ గదా!

    రిప్లయితొలగించండి
  19. రామ రాజ్యమాదర్శము రక్ష నొసగ!
    సద్గుణుండు రాముడమిత సౌమ్యశాలి!
    పోల్చ నిట్లు తగదెపుడు బుద్ధి మాలి!
    "రాముఁడే రావణుండైన ప్రజకు మేలు"

    రిప్లయితొలగించండి
  20. ఏమని యందు నేడు మతి హీనులు వేదికలెక్కి బల్కిరే
    "రాముఁడె రావణుండయి ధరాతల మేలుట పాడియౌఁ గదా"
    ఆ మహనీయ మూర్తి సుగుణాత్ముడు శ్రీ రఘురాముడే గదా
    తామసుడా మదోద్ధరు నధార్మికు గూల్చి జగమ్ము గాచెగా

    రిప్లయితొలగించండి
  21. 13.07.2020
    అందరికీ నమస్సులు🙏
    సమస్యాపూరణం..

    *తే గీ*

    లాకు డౌనున గూడను రక్ష నిడక
    మంచి జెప్పిన వినలేని మానవులకు
    మంచి నేతల యందున మార్పు వచ్చి
    *"రాముఁడే రావణుండైన ప్రజకు మేలు"*

    *కళ్యాణ్ చక్రవర్తి, ముంబాయి*
    🙏🙏

    రిప్లయితొలగించండి
  22. ఏమని జెప్పగా నగును యెంతయొనేర్పున నందమూరియే
    రాముఁడు కృష్ణుఁడై మరియు రావణ, కర్ణుడు చక్రవర్తి గా
    ధీమతి యైవెలుం గనగ ధీరుడు వైభవ తారకా మనో
    రాముఁడె రావణుండయి ధరాతల మేలుట పాడియౌఁ గదా!

    రిప్లయితొలగించండి
  23. చట్టమేమిసేయుననుచుజాఁగుతోను
    సంచరించెడిప్రజలనుసమయమెంచి
    అంకుశంబునదరుముటహానికాదు
    రాముఁడేరావణుండైనప్రజకుమేలు

    రిప్లయితొలగించండి
  24. రాముఁడుసకలసద్గుణధాముఁడిలను
    రామునాదర్శముగనెంచి నీమముగను
    సత్యమార్గానచరియించు సద్గుణాభి
    రాముఁడే రావణుండైన ప్రజకు మేలు

    రిప్లయితొలగించండి
  25. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  26. రాముడేరావణుండైనప్రజకుమేలు
    కలుగకుండగగీడునేగలుగునెపుడు
    పరమరక్కసులగుటనుబాల!వారి
    సత్వమందుననుండవుజాలిదయలు

    రిప్లయితొలగించండి
  27. లోకములు మురియు నసుర లోక మణఁగు
    మునిగణ మడరు జీవించు జన గణమ్ము
    భండనం బందు రవణమ్ము బాణ మూని
    రాముఁడే రావణుండైన ప్రజకు మేలు


    నీ మది శంక వీడు తగు నేర్పున నింపుగఁ బేర్చ శబ్దముల్
    నీమము నెంచి పద్యముల లీలఁగ నౌనిక నర్థవంతముల్
    గ్రామణి పాద మౌచితినిఁ గన్పడు గాంచుమ పండితోత్తమా
    రాముఁడె రావణుండయి ధరాతల మేలుట పాడియౌఁ గదా

    [పద విభజన: రావణుండు – రాముడె – అయి - ధరాతల మేలుట పాడియౌఁ గదా]

    రిప్లయితొలగించండి
  28. ఏక పత్నీవ్రతుడతడు శోకహారి
    సకల జనవంద్యుడతగాడు సద్గుణుండు
    రాముఁడే రావణుండైన ప్రజకు మేల
    టంచు త్రిజట చెప్పెనటయా యంగనలకు.

    రిప్లయితొలగించండి
  29. నేమము తప్పకుండ కడు నిష్ఠగ ధర్మము నిల్పువాడె యీ
    భువిని పుట్టినట్టి జనపూజ్యుడు సద్గుణ శీలియైన యా
    రాముడె రావణుండయి ధరాతలమేలుట పాడియౌఁ గదా
    భామను బంధి సేయుటను పాపపు కృత్యమె లేకపోవునే.

    రిప్లయితొలగించండి
  30. రాముడెరావణుండయిధరాతలమేలుటపాడియౌగదా
    రాముడురావణుండయినలాభమెచేకురులంకకంతకున్
    రామునిజన్మమున్నరయలంకవినాశనమొందజేయుచున్
    భూమినిరక్షజేయగనుబుట్టెనువిష్ణువురాముగాభువిన్

    రిప్లయితొలగించండి
  31. నీమములేకదాయలునుతీరునుగాదనిహానిసేయగా
    సామముపాడిగాదనుచుసాయుధహస్తముచూపునయ్యెడన్
    సేమముదేశమంతటనుసేఁగిఁదీర్చుచురాజునుండెగా
    రాముఁడెరావణుండయిధరాతలమేలుటపాడియౌగదా

    రిప్లయితొలగించండి
  32. ఉ:

    సామెత నెంచ రక్కసుడు చక్కని చుక్కల పొందుగోరుటే
    కాముకు డన్నతప్పిదము, కానెడ,సుంతయురాజ్య క్షేమమున్
    నీమము తప్పలేదు గన నెట్టుల నివ్విధి భేదమెంచనో
    రాముఁడె రావణుండయి ధరాతల మేలుట పాడియౌఁ గదా

    వై. చంద్రశేఖర్

    రిప్లయితొలగించండి
  33. తేటగీతి
    బంగరుమయంపు లంకకు లింగని మది
    నిల్పి పాండితీ ప్రభవెల్గు నేతయనఁగ
    కాముకతవీడి ధర్మవిగ్రహమనఁదగు
    రాముఁడే రావణుండైన ప్రజకు మేలు!
    ఉత్పలమాల
    హేమవినిర్మితమ్మనఁగ నింపొన గూర్చెడు లంకనేలుచున్
    సోముని భక్తుడై మఱచి సుందరరామునిఁ గుందజేసెనే
    కాముకుడౌచు నాశనము గాకను విగ్రహమైన ధర్మమే
    రాముఁడె రావణుండయి ధరాతల మేలుట పాడియౌఁ గదా

    రిప్లయితొలగించండి
  34. ఈమహి ధర్మపాలనమె ధ్యేయముగా జనియించినాడు తా
    నీమము దప్పడెన్నడును నెయ్యముజూపును సజ్జనాళిపై
    భీముడు భండనమ్మునను పేదలపాలిటి దైవ మెవ్విధిన్
    రాముడు రావణుండయి ధరాతలమేలుట పాడియౌగదా?

    రిప్లయితొలగించండి
  35. పాపులగు ఖలులను చ౦పి పాతకముల
    జేయు ద్రోహుల చంపడే శేషశాయి 
    హీను డనుభవి౦చవలెనుగా యె౦దునైన
    ఆట్టి శిక్షను  దైవమే యమలుపరచు

    రిప్లయితొలగించండి
  36. జనుల మాటల నాలించి జాలి వీడి
    పంపెనటసీతమాతను వనికి వేగ
    రాముడే రావణుండైన ప్రజకు మేలు
    కల్గునెట్లని లవకుశుల్ కలత బడిరి

    రిప్లయితొలగించండి