11, జులై 2020, శనివారం

సమస్య - 3424

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"గీత మార్చఁ గలదె గీఁతఁ గృష్ణ"
(లేదా...)
"గీతాశాస్త్రము గీఁత మార్చఁ గలదా కృష్ణా యశోదాత్మజా"

38 కామెంట్‌లు:


 1. నడిరేయి సరదా పూరణ:

  చేతుల్ మోడ్చుచు దొంగ భక్తి గొనుచున్ చెప్పంగ శ్రీసూక్తమున్
  పాతాళమ్మున క్రుంగిపోయి కడకున్ వైశాఖ మాసమ్మునన్
  ప్రీతింజెందుచు రాహులయ్య చదువన్ బీభత్సమౌ తీరునన్
  గీతాశాస్త్రము గీఁత మార్చఁ గలదా కృష్ణా యశోదాత్మజా?

  రిప్లయితొలగించండి

 2. ఆటవిడుపు సరదా పూరణ:
  (జిలేబి గారికి అంకితం)

  చేతుల్ దోపుచు బొక్కసమ్మున సదా చెండాడుచున్ పాపులన్
  నీతుల్ జెప్పుచు కర్మయోగి ననుచున్ నేతుల్ కడున్ త్రాగగన్
  మూతుల్ వాసన జైలుకంపగనయో ముమ్మారు వల్లింపగన్
  గీతాశాస్త్రము గీఁత మార్చఁ గలదా కృష్ణా యశోదాత్మజా?

  రిప్లయితొలగించండి


 3. చదివి నాను వహిని చాల మార్లయ నాదు
  గీత మార్చఁ గలదె గీఁతఁ గృష్ణ?
  పుస్తిని చదివి భళి పూర్ణము గా మార
  గలవకొ? నడవడిక కాస్త మార్చు!  జిలేబి

  రిప్లయితొలగించండి
 4. ఆ దినమున రణము నాచరించననగ ,
  నీవు బావ పార్థునికి దెలిపిన
  నీదు గీత బఠన , నాదు నొసటిపయి
  గీత మార్చఁ గలదె గీఁతఁ గృష్ణ !

  రిప్లయితొలగించండి
 5. చిత్రకారుడతడు చైతన్యవ౦తుడే
  చెప్పుకొ౦దు రతని చిత్రముగనె
  ఏమి లాభమయ్య యి౦ట తి౦డికి లేదు
  గీత మార్చగలదె గీత క్రుష్ణ

  రిప్లయితొలగించండి


 6. శ్రోతవ్యంబుగ పాడి నాము మదిలో సొక్కుల్ ఘటిల్లంగ మా
  కేతావాత ఫలమ్ము లేమి ప్రభు మా కెంతేని కష్టమ్ములే
  కాతాళించకు ప్రశ్న వేసితినిదే కామమ్ము పోలేదయా
  గీతాశాస్త్రము గీఁత మార్చఁ గలదా కృష్ణా యశోదాత్మజా!


  జిలేబి

  రిప్లయితొలగించండి
 7. భీతిన్జెందుచునర్జునుండుజయసంవేద్యున్జగన్మోహనున్
  భూతాత్మున్పరమాత్మునిన్వరదునంభోజాక్షువీక్షించుచున్
  దాతల్దండ్రులునన్నదమ్ములనుసంతానంబురక్షింపగా
  "గీతాశాస్త్రము గీఁత మార్చఁ గలదా కృష్ణా యశోదాత్మజా"

  కొరుప్రోలు రాధాకృష్ణారావు

  రిప్లయితొలగించండి
 8. మైలవరపు వారి పూరణ

  శ్రీతత్వార్థసుధాపయోధిమథనౌచిత్యప్రభూతాత్మసం....
  జాతానందసుధారసోచ్చకితశాస్త్రంబెన్నగా గీతయే!
  త్రాతా! జీవితమందునొక్కపరి నేర్వన్ బుద్ధిరాకున్నచో
  గీతాశాస్త్రము.., గీఁత మార్చఁ గలదా కృష్ణా! యశోదాత్మజా!

  మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు


  1. వామ్మో !


   శ్రీతత్వార్థసుధాపయోధిమథనౌచిత్యప్రభూతాత్మసం
   జాతానందసుధారసోచ్చకితశాస్త్రం !!!


   శ్రీ
   తత్వ
   అర్థ
   సుధ
   పయోనిధి
   మథన
   ఔచిత్య
   ప్రభూత
   ఆత్మ
   సంజాత
   ఆనంద
   సుధారస
   ఉచ్చకిత -

   శాస్త్రము !   జిలేబి

   తొలగించండి
 9. బుద్ధి మూలమయ్య బుధకోటి కంతయూ
  మంచి నెంచువాడె మాధవుండు
  జన్మ తోడ బుద్ధి సమసు వరకునుండు
  గీత మార్చఁ గలదె గీఁతఁ గృష్ణ!

  రిప్లయితొలగించండి
 10. శార్దూలవిక్రీడితము
  పాతాళమ్మునకున్ గిరీటి తలపుల్ పాఱంగఁ గర్తవ్యమన్
  జేతాడందఁగఁ జేయఁ బ్రాకి యరులన్ జెండాడు సన్నద్ధతన్
  జేతృండయ్యె రణాన! నాచరణ సంసిద్ధుండుఁ గాలేడనన్
  గీతాశాస్త్రము గీఁత మార్చఁ గలదా కృష్ణా! యశోదాత్మజా!

  రిప్లయితొలగించండి
 11. క్రీడి సంశయములు కీలక సమయాన
  మాన్పి నట్టి దైన మహిత బోధ
  గీత మార్చ గలదె గీత కృష్ణ ! యనుచు
  సంది యమ్ము వదలి చదువు డయ్య

  రిప్లయితొలగించండి
 12. హ్లాదు దండ్రి యెన్ని ఆంక్ష లిడిన గాని
  మార లేదు సుతుడు! కోరు కున్న
  వరము లున్న వాడె వాకిలిలో జచ్చె!
  గీత మార్చ గలదె గీత కృష్ణ!

  రిప్లయితొలగించండి
 13. కీడు శంకించి సౌమిత్రి నాడు వదిన

  సీతకున్ దెల్పి గీసెను గీత,మార్చ ‌‌‌‌

  గలదె గీత? కృష్ణ విధిని,లలన దాట

  కున్న నాడని ప్రశ్నించె వెన్న దొంగ


  ఉప పాండవుల మరణా నంత రము రోదించు కృష్ణ(ద్రౌపది)ని చూచి కృష్ణుడు పలుకు సందర్భము

  రిప్లయితొలగించండి
 14. ప్రవచనమ్ములనిడు పండితోత్తములకే
  చిత్తనిగ్రహమ్ము చేతకాదె!
  ఏదొ నాడు సెప్పితీవు గాని భగవ
  ద్గీత మార్చగలదె గీఁతఁ గృష్ణ!

  రిప్లయితొలగించండి
 15. ఆటవెలది
  వినిన వెంట మారి మనసార పాటించి
  కవ్వడి విజయాన నివ్వటిల్లెఁ
  మూఢత విడలేని మోహాంధుని నొసటి
  గీత మార్చఁ గలదె గీఁతఁ గృష్ణ!

  రిప్లయితొలగించండి
 16. నీతి లేని నేటి నేతల పాలన
  మేత కొంత పన్ను మోత కొంత
  రీతి లేదు పాప భీతి లేదయ నీదు
  గీత మార్చఁ గలదె గీతఁ గృష్ణ

  రిప్లయితొలగించండి
 17. ఆ.వె.

  కోట్లు కొల్లగొట్టి కొంపలు ముంచగా
  భక్తియన్న బ్రతుకు భారమయ్యె
  చరమ జీవితాన చతురత జూపింప
  గీత మార్చ గలదె గీత కృష్ణ

  వై. చంద్రశేఖర్

  రిప్లయితొలగించండి
 18. నీతిన్ జీవనయానమెట్లు కదలున్ నిర్ణీతమౌదారిలో,
  చేతమ్మందు శనైశ్చరుండు మనుచున్ చేయించ దుష్కర్మలన్
  భాతిన్ కాంచగ సాధ్యమౌన బ్రతుకున్ భాగ్యమ్ము చేకూరునా
  గీతాశాస్త్రము గీఁత మార్చఁ గలదా కృష్ణా యశోదాత్మజా?
  అసనారె

  రిప్లయితొలగించండి
 19. * శంకరాభరణం వేదిక *

  11/07/2020..శనివారం

  సమస్య. మత్తేభము
  *** ****

  "గీతాశాస్త్రము గీఁత మార్చఁ గలదా కృష్ణా యశోదాత్మజా"

  నా పూరణ. శార్ధూలము
  *** ******** *** **** **** **
  ( క్రమాలంకారణ పూరణ. )

  ఖ్యాతిన్ బోధన జేసి ధర్మముల, సుగ్రంథంబుగా నిల్చు నా

  కోతల్ కోయుచునుండు నీచమతులన్ కుంఠాత్ములన్ జక్కగా

  నీతిన్ వీడెడు వాణ్ణి మార్చ తరమౌ నీకే హరీ!మాధవా!

  గీతాశాస్త్రము..,గీత మార్చ గలదా?.,కృష్ణా! యశోదాత్మజా!
  -- 🌱 ఆకుల శాంతి భూషణ్ 🌱
  🌷 వనపర్తి🌷  రిప్లయితొలగించండి
 20. గీతమార్చగలదెగీతకృష్ణ!చెపుమ
  యేలవచ్చెనీకుబేల!శంక
  రాతమార్చుజదువగీతనునిరతము
  సందియంబువలదుసన్నుతాంగి!

  రిప్లయితొలగించండి
 21. నుదుటి రాత మార్చ నూనూగు మీసాల
  యువకుడొకడు నేర్చె, జ్యోతి శమును
  గీతసారము విన కీడు తొలగునట
  గీత మార్చఁ గలదె గీఁతఁ గృష్ణ!!

  రిప్లయితొలగించండి
 22. చంపువారలెవరు సమయునదెవ్వరు
  కార్యకారణములకర్తవీవె
  నరునినుదుటిపైన నలువతా వ్రాసిన
  గీత మార్చఁ గలదె గీఁతఁ గృష్ణ

  రిప్లయితొలగించండి
 23. ఇంచు కేని చదువ నీ భగవద్గీత
  నిత్య హృద్య దివ్య సత్య వాక్కు
  సర్వకాల దేశపర్వ సర్వగతుల
  గీత, మార్చఁ గలదె గీఁతఁ గృష్ణ

  [నా గీఁత మార్చఁ గలదా కృష్ణా!]


  వాతాగ్ని త్రిదశేశ్వ రాది సుర సంభావ్యైక దేవా వ్యధా
  వ్రా తాంభోనిధి మాన వాత్త రిపు షడ్వర్గమ్ము సంసార సం
  ఘాత స్తోమము నుత్తరించఁ దగ నో కంసఘ్న! త్వద్వాక్సుధా
  గీతాశాస్త్రము గీఁత మార్చఁ గలదా కృష్ణా యశోదాత్మజా

  రిప్లయితొలగించండి
 24. 11.07.2020
  అందరికీ నమస్సులు🙏

  నా పూరణ యత్నం..

  *ఆ వె*

  చెడ్డ మాట వినుచు జేరుచు దరికిని
  నోటు జూచి ప్రజలు యోటు వేయ
  కష్ట కాలమందు గాంచగ దేవుని
  *"గీత మార్చఁ గలదె గీఁతఁ గృష్ణ"*

  *కళ్యాణ్ చక్రవర్తి, ముంబాయి*
  🙏

  రిప్లయితొలగించండి
 25. తాతల్ దండ్రులు గూడబెట్టిరి గదా దానిన్ సుఖంబందకే
  నేతల్ నేడిటు దోచి దాచుకొనుటన్ నీమమ్ము జేబట్టిరే
  నీతిన్ వీడి ప్రజాధనమ్ము దిని మున్నీటన్ బ్రజన్ ముంచగా
  గీతాశాస్త్రము గీతఁ మార్చఁ గలదా కృష్ణా యశోదాత్మజా

  రిప్లయితొలగించండి
 26. గీతాశాస్త్రముగీతమార్చగలదాకృష్ణాయశోదాత్మజా
  గీతాశాస్త్రముమార్చుదప్పకరమా!కైదండలీడేర్చుచున్
  గీతామాతనుమానసంబునదగన్గేయంబుగాబాడీనన్
  రాతన్మార్చునుదప్పకుండగనువేళాకోళమేకాదుగా

  రిప్లయితొలగించండి
 27. మ॥
  ఆతీవ్రంబగు హింస గూర్చు రణమే! యవ్వీరులన్ జంపగా

  స్రోతమ్మై ప్రవహించు రక్తమకటా! ద్రోహాల పోగొట్టునే!

  స్వాతంత్య్రమ్మును బొంది రాజ్యములనే పాలింపగా వచ్చులే!

  గీతాశాస్త్రము గీఁత మార్చఁ గలదా! కృష్ణా! యశోదాత్మజా!

  రిప్లయితొలగించండి

 28. పిన్నక నాగేశ్వరరావు.

  సీత గీత దాట చిక్కుల బడియెను
  జూదమందు ధర్మజుండు నోడ
  నడవి బాట పట్టి రా పాండు సుతులెల్ల
  గీత మార్చగలదె గీత కృష్ణ?

  రిప్లయితొలగించండి
 29. సమస్య :-
  "గీత మార్చఁ గలదె గీఁతఁ గృష్ణ"

  *ఆ.వె**

  పనికి మాలినట్టి పనిజేయుచుండగా
  పరిణమయ్ము జేయ బాగు పడునె ?
  మనుషులీ విధమున మాయ జేసినను సం
  గీత మార్చఁ గలదె గీఁతఁ గృష్ణ ?
  ..........‌‌........✍️చక్రి

  రిప్లయితొలగించండి


 30. కాని పనులు చేసి కంసారి దలచుచు
  గొప్ప చెప్పుకొనెడి కూళుల కిల
  నంతరంగమందు నహమునిండ నుదిటి
  గీత మార్చగలదె గీత కృష్ణ.

  మరొక పూరణ


  తేనె పోసినట్లు తీయగా మాట్లాడి
  వెనుక గొయ్యి తీయు వెంగలులకు
  కాచు కొనియె నుండ కర్మఫలము వారి
  గీత మార్చ గలదె గీత కృష్ణ.

  రిప్లయితొలగించండి
 31. కదనమాడననుచు గాండీవముఁ విడువ
  వలదు వలదటంచు పలికి నీవు
  జ్ఞాన బోధ సేయు మాననీయుడ నాదు
  గీత మార్చఁ గలదె గీఁతఁ గృష్ణ?

  రిప్లయితొలగించండి
 32. నీతో వాదన చేయు శక్తిగలదే? నేనొక్క మూర్ఖుండనే
  యీ తంపిన్ వలదంచు వీడగను ప్రత్యేకమ్ము నాకోసమే
  గీతాచార్యుడవైతివోయి సఖుడా కీర్తింతు నిత్యమ్ము నే
  గీతాశాస్త్రము గీఁత మార్చఁ గలదా కృష్ణా యశోదాత్మజా?

  రిప్లయితొలగించండి
 33. ఇంతి ధనము కీర్తి భ్రాంతుల బడువాని
  వీతరాగిజేసి వింతగాను
  తాపమాపి నిత్యతత్త్వంబు బోధించి
  గీత మార్చగలదె! గీతకృష్ణ!

  చేతంబందున శుద్ధతన్ నియమమున్ శ్రీకృష్ణ జిహ్వాసుధా
  పాథోధిన్ కణమాత్రమైన దమితో పానంబు జేయంగ నీ
  వౌ తాపంబుల దీర్చుగాదె భువిలో దొల్గించి పాపమ్ములన్
  జాతీయోద్యమ నేత గాంధి బరగెన్ శాంతాత్ముడై బల్కకే
  గీతాశాస్త్రము గీతమార్చగలదా కృష్ణా!యశోదాత్మజా!

  రిప్లయితొలగించండి