నడిరేయి సరదా పూరణ: మొత్తము నాంధ్రదేశమున మొండిగ దేవుచు శూరులెల్లరిన్చిత్తుగ నోడగొట్టగను చింతను జేయుచు సంభ్రమమ్మునన్సత్తువ కోలుపోవగను జంకుచు సిగ్గున పిల్లనిచ్చు మే నత్తనుఁ గాంచి బల్లిదుఁడు నమ్రతతోఁ బ్రణమిల్లె నత్తఱిన్
మీ సరదా పూరణ బాగున్నది. అభినందనలు.
🙏
సత్తువ గల తనయులతోమత్తెన్నడు బూనకుండ మాధవు ధ్యాసేచిత్తమునం కుంతికి, మేనత్తనుఁ గని బల్లిదుండు నమ్రుండయ్యెన్
చక్కని పూరణ. అభినందనలు.
ఆటవిడుపు సరదా పూరణ: (జిలేబి గారికి అంకితం) క్రొత్తగ జేరుచున్ ఘనుడు కూరిమి మీరగ తోటనందునన్విత్తము చేతబూనుచును వెఱ్ఱిగ మొఱ్ఱిగ ముత్తుకూరునునన్పొత్తును జేయగోరగను పొంకము జూపుచు నింటదూరెడిన్ నత్తనుఁ గాంచి బల్లిదుఁడు నమ్రతతోఁ బ్రణమిల్లె నత్తఱిన్బల్లిదుడు = పెద్ద బల్లి (garden lizard)
* బల్లిదుడు = పెద్ద బల్లి = తొండ (garden lizard)
మీ ఆటవిడుపు పూరణ బాగున్నది. అభినందనలు.'బల్లిదుడు' అన్నదానికి పెద్దబల్లి అన్న అర్థం నిఘంటువులో లేదు. "GP Sastry made easy" అన్న పుస్తకంలో ఉన్నదేమో?
🙏😊
"కొత్త పదాలు సృష్టించక పోతే భాష ఎలా పెరుగుతుంది?" అన్నాడుగా ఘటోత్కచుడు...
తత్తరపాటు లేక గడు ధైర్యముతో నెదురొడ్డి పోరునన్చిత్తును జేయు నెల్లరను సింహబలుండని పేరు పొందినన్చిత్తమునందు బెద్దలన జెల్వగు భక్తియు గౌరవమ్ము మేనత్తనుఁ గాంచి బల్లిదుఁడు నమ్రతతోఁ బ్రణమిల్లె నత్తఱిన్
మంచి పూరణ. అభినందనలు.
కొత్తగ పెండ్లి చేసుకొని కోమలి కోరిక తీర్చ సంతలోవిత్తము లెక్క సేయకయె వేడుక తీర్చెను పెన్మిటంతలోతత్తరపాటు చెందెనిదె ద్రవ్యము బోవగ దారి యందు మేనత్తను గాంచి బల్లిదుడు నమ్రతతో బ్రణమిల్లె నత్తరిన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
అత్తరి యిత్తరి చూడకకత్తిని చూపించి కుత్తుకను కోయుటకై తత్తర పడి దారిని మేనత్తనుఁ గని బల్లిదుండు నమ్రుండయ్యెన్!జిలేబి
కందోత్పలకురిమింద దేవళపు స్థలపురాణము :)పణమును గట్టెను గుడియందున, నత్తనుఁ గాంచి బల్లి దుఁడు నమ్రతతోఁ బ్రణమిల్లె నత్తఱిన్ దేవుని మహిమగ తలచి నశ్రువుల పారించెన్!జిలేబి
మీ కందోత్పల పూరణ బాగున్నది. అభినందనలు.ఈ కురిమింద దేవళం ఎక్కడిది? దాని కథా కమామీషు?
గూగులమ్మని అడిగితే ఏమీ చెప్పలేదు.
కురిమింద అంటే నత్తగుల్ల అట సో నత్త గుల్ల దేవళము జిలేబీయము :)
జిలేబిగారు!మీ ఊహ అసమంజసము కాదు!ప.గో.జిల్లాలో నత్తారామేశ్వరం అనే ఊరుందట.నత్తలు,ఇసుకతో సీతారాములచే ప్రతిష్ఠింపబడిన శివలింగము అక్కడ పూజలందుకుంటోందట!వాట్సప్ లో శర్మగారి ఉవాచ!
:) ప్రతిధ్వని రాకుండా ఎట్లా వుంటుందీ :) శర్మ గారా మజాకా యా :)జిలేబి
కురిమింద దేవాలయము లో పూజ కొత్తుపడంగ జీవితము కొందలపాటులు తీరగానదేవిత్తము లెల్ల కూడగ పవిత్రముగా జప మాచరించె మేల్చిత్తపు చింతబోవునని సేవలచేసెను దేవళమ్ములోనత్తనుఁ గాంచి బల్లిదుఁడు నమ్రతతోఁ బ్రణమిల్లె నత్తఱిన్!జిలేబి
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
చిత్తము జంతుజా లముల చిన్నయ సూరియె నిల్పినాడనన్జిత్తులమారి నక్కకథ జిల్కెను గల్పన భావబంధమైపొత్తుగ గీటకమ్ములను బోలిక బెట్టుచు బద్యమల్లగన్నత్తనుఁ గాంచి బల్లిదుఁడు నమ్రతతోఁ బ్రణమిల్లె నత్తఱిన్కొరుప్రోలు రాధాకృష్ణారావు
మైలవరపు వారి పూరణ కృత్తికయందు పుట్టితినవి., కీటకమొక్కటి నిన్ను జంపును.. త్తుత్తువి కావు మాటలివి., యోర్మిని భక్తి భజించుచుండుమా!సత్తువ యెంతగల్గినను చాలదటంచు పురోహితుండనన్ నత్తనుగాంచిబల్లిదుడునమ్రతతోఁబ్రణమిల్లెనత్తరిన్!!మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి
మైలవరపు వారి పూరణ ప్రశస్తంగా ఉన్నది.
ఇంద్రజిత్తు -జిత్తుల శూర్పణ ఖ ముఖముమొత్తముగా గాయబడ్డ ముక్కు జెవులతోనెత్తురు గార్చెడు తన మేనత్తనుఁ గని బల్లిదుండు నమ్రుండయ్యెన్
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
సత్తువ యెంత గల్గినను సంగర మందున మేటియైన తాచిత్తము ధైర్యమున్వదలి జీవము గాచగ వైరి మందలోనత్తను గాంచి బల్లిదుడు నమ్రతతో బ్రణమిల్లె నత్తరిన్కుత్తుక గోయురంచు మది కూలగ చేతులనెత్తె చిత్రమే
మీ పూరణ బాగున్నది. అభినందనలు.'వైరి మంద' దుష్టసమాసం. "వైరిసంఘమం। దత్తను..." అందామా? 'కోయురంచు'?
*కుంతిని గాంచిన కృష్ణుడు*మత్తేభమ్ముల వోలెను సత్తువ గల పుత్రులున్న శాతోదరియే బత్తిగ ప్రణమిల్లగ మే నత్తనుఁ గని బల్లిదుండు నమ్రుండయ్యెన్
మత్తున మున్గిన నొకరుడు కత్తిని గొని సతిని జంప గడగిన వేళన్ తత్తరముగ వఛ్చిన మే నత్తను గని బల్లిదుండు నమ్రుo డయ్యెన్
మత్త గజమ్ములై చెలగు మాన్యులు శత్రుభయంకరుల్ గరిష్ఠమౌ సత్తువ గల్గినట్టి సుత సంతతి గల్గిన మండయంతియే చిత్తము నందు నిత్యముము శ్రీహరిఁ గొల్చెడు పాండు పత్ని మే నత్తనుఁ గాంచి బల్లిదుఁడు నమ్రతతోఁ బ్రణమిల్లె నత్తఱిన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.మొదటి పాదంలో గణభంగం. 'మండయంతియే'?
* శంకరాభరణం వేదిక * 02/07/2020...గురువారం సమస్య********"నత్తనుఁ గాంచి బల్లిదుఁడు నమ్రతతోఁ బ్రణమిల్లె నత్తఱిన్నా పూరణ. *** ********చిత్తము వెన్నపూస గద; చెన్నగు రూపము; రంభసాటిదే!చిత్తునుజేయు మాటలచె ;శీలము గాంచ మహోన్నతమ్మె !నేసత్తెము జెప్పుచుంటి నిక సక్కటి బిడ్డకు జోడి నీవె;నీకిత్తును నిన్ను మీఱు ఘనుడెవ్వని నుర్విని గాన నన్న మేనత్తను గాంచి బల్లిదుడు నమ్రతతో బ్రణమిల్లె నత్తఱిన్ -- 🌱 ఆకుల శాంతి భూషణ్ 🌱 🌷 వనపర్తి🌷
మీ పూరణ బాగున్నది. అభినందనలు.'మాటలచె' అని చే ప్రత్యయాన్ని హ్రస్వంగా ప్రయోగించరాదు.
అత్తా వినుమిది నిక్కముసత్తెముగా చెప్పుచుంటి చంపను బావన్చిత్తమున నమ్ము మని మేనత్తనుగని బల్లిదుండు నమ్రుండయ్యెన్
అత్తకుమారులన్ కలసి యందరి మాటల నాలకించి యున్మత్తుడు రాజరాజుమది మార్చగ హస్తినకున్ జని సంధికైచిత్తము గారవమ్మడర శ్రీపతి యాపురమందు ప్రీతి మేనత్తనుఁ గాంచి బల్లిదుఁడు నమ్రతతోఁ బ్రణమిల్లె నత్తఱిన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.రెండవ పాదంలో గణభంగం. "హస్తిన కేగి సంధికై" అనండి.
గురువర్యులకు నమస్సులు. సవరణకు ధన్యవాదములు అసనారె
చిత్తరువాయెను చిన్నదినత్తనుఁ గని; బల్లిదుండు నమ్రుండయ్యెన్నత్తకు వెనుకనె యగుపడనుత్తమ శివ లింగ రూపముద్యోతితమై
అత్తనువున్ స్పృశించి తన యల్లుని రూపము మార్చినంత తానత్తనుఁ గాంచి బల్లిదుఁడు నమ్రతతోఁ బ్రణమిల్లె నత్తఱిన్"యత్త! ప్రమాణ మల్లునివి యర్హములౌ యపరాధముల్ శతం బొత్తిడి యైన సైచెదను, పొంకము వీడకు" కృష్ణు డిట్లనెన్
తత్తఱపాటులేకశుభదంబగురాజసభాంతరాళమున్చిత్తరువట్టులన్నిలిచెచైద్యునిపల్కులనాలకించుచున్చిత్తజుతండ్రిగానచటచిన్నెలవన్నెలచక్రధారియున్నత్తనుగాంచిబల్లిదుఁడునమ్రతతోఁబ్రణమిల్లెనత్తఱిన్
మీ పద్యం బాగున్నది. అభినందనలు.కొంత అన్వయలోప మున్నట్టున్నది.
సరిచేసివ్రాయుటకుప్రయత్నిస్తాను
అత్తలుసాధారణముగమెత్తగమాట్లాడుదురిలనల్లునియెడలన్ నత్తరుసాయిబుతనమేనత్తనుగనిబల్లిదుండునమ్రుండయ్యెన్
కందంచిత్తము నీ ధ్యానమ్మునగుత్తమగును చింతలుండ గోకుల కృష్ణా!సత్తమ! యిడుమన పృథ, మేనత్తనుఁ గని బల్లిదుండు నమ్రుండయ్యెన్ఉత్పలమాలమొత్తము లీలలన్నిటికి మూలము నీవుగఁ గాచి నాడవేచిత్తము నీదు ధ్యానమున జిక్కఁగఁ దోడుగ నుండఁ జింతలన్సత్తమ! కూర్చుమంచు పృథ సాదరమొప్పగఁ గృష్ణుఁ గోర మేనత్తనుఁ గాంచి బల్లిదుఁడు నమ్రతతోఁ బ్రణమిల్లె నత్తఱిన్!
అత్తరుసాయిబిచ్చటనుహైమవతీశునిభక్తురాలు,మేనత్తనుగాంచిబల్లిదుడునమ్రతతోబ్రణమిల్లెనత్తఱిన్ నత్తలుబ్రేమచూపుదురెయల్లునిబట్లనునెల్లవేళలన్ నత్తఱివారుసైతమునునాదరమిచ్చుచుమెల్గుచుందురే
అత్తకుమారులన్ కలసి యందరి మాటల నాలకించి యున్మత్తుడు రాజరాజుమది మార్చగ హస్తినకేగి సంధికైచిత్తము గారవమ్మడర శ్రీపతి యాపురమందు ప్రీతి మేనత్తనుఁ గాంచి బల్లిదుఁడు నమ్రతతోఁ బ్రణమిల్లె నత్తఱిన్
ఉత్తలపడి యున్న నరసి చిత్తంబునఁ బుట్ట జాలి శ్రీకృష్ణుండేయత్తరిఁ దగఁ గుంతిని మేనత్తనుఁ గని బల్లిదుండు నమ్రుండయ్యెన్ చిత్తము పొంగ లక్ష్మణుఁడు సీతయుఁ దోడుగ నుండఁ బ్రీతి నైమిత్తిక మౌనిదర్శనుఁడు మేఘ నిభాంగక సుప్రభా దనుస్సత్తముఁ డర్క వంశ తిమి చంద్రుఁ డగస్త్య మహర్షి సుజ్వలన్నత్తనుఁ గాంచి బల్లిదుఁడు నమ్రతతోఁ బ్రణమిల్లె నత్తఱిన్ [జ్వలత్ +నత్ +తను = జ్వలన్నత్తను]
అత్తనుతల్లిగదలచునునిత్తెము సద్వర్తనమునునెరపుచు హితమున్మెత్తగదెలిపిన తన మేనత్తనుఁ గని బల్లిదుండు నమ్రుండయ్యెన్
చిత్తము సరిగాలేదని మత్తును సేవించినట్టి మందమతియు తాక్రొత్తగ జూసినతరహానత్తనుగని బల్లిదుండు నమ్రుండయ్యెన్
అత్తా!చింతింపవలదు సత్తాగలవారు నీదు సంతానము వారుత్తములంచు బలికి మేనత్తనుగని బల్లిదుండు నమ్రుండయ్యెన్ బల్లిదుడు = శ్రీకృష్ణుడు రాయబారం విఫలమైన పిదప శ్రీకృష్ణుడు కుంతీదేవితో పొత్తులు లేవికన్ విధిగ పోరునుసల్పుటె న్యాయమౌను నీచిత్తము చిక్కబట్టుకొని చింతను మానుమటంచు బల్కి తామిత్తిని గెల్వగాదగిన మేటి సుపుత్రుల గల్గినట్టి మేనత్తనుగాంచి బల్లిదుడు నమ్రతతో బ్రణమిల్లె నత్తరిన్ రాధాదేవి శ్రీకృష్ణునకు మేనత్త అనే కథ ఆధారంగా పూరణ (కల్పన కావచ్చు)హృత్తున నందగోపకుల శ్రేష్ఠునినిల్పుచు పారవశ్యయైసొత్తును వానికిన్ దనకు సొంతము వాడను నిశ్పయంబునన్ తత్తరపాటు లేక హరితత్త్వ మెరింగిన దివ్యభావ మేనత్తనుగాంచి బల్లిదుడు నమ్రతతో ప్రణమిల్లె నత్తరిన్
చిత్తస్థైర్యము వీడక| కుత్తుక నీటను మునిగిన క్రుంగక నెపుడున్| ముత్తెమువలె తిరిగెడి మే "నత్తనుఁ గని బల్లిదుండు నమ్రుండయ్యెన్"
ఉ: చిత్తడి వాన లోన నొక చేడియ నడ్కల నాట్యమాడగన్ చిత్తము పల్లటించ నిక జేరితి ప్రక్కన బుజ్జగింపుగన్బెత్తము చేత బూని కనిపించిన నుత్తమురాలి జూడగా నత్తను గాంచి బల్లిదుడు నమ్రతతో బ్రణమిల్లె నత్తరిన్వై. చంద్రశేఖర్
సమస్య :-"నత్తనుఁ గని బల్లిదుండు నమ్రుండయ్యెన్"*కందం**అత్త కుమార్తెను కాదనికొత్తగ ప్రేమించిన చెలి కొంగున జేరెన్చిత్తమున తప్పెరిగి మేనత్తనుఁ గని బల్లిదుండు నమ్రుండయ్యెన్ ..................✍️చక్రి
రిప్లయితొలగించండినడిరేయి సరదా పూరణ:
మొత్తము నాంధ్రదేశమున మొండిగ దేవుచు శూరులెల్లరిన్
చిత్తుగ నోడగొట్టగను చింతను జేయుచు సంభ్రమమ్మునన్
సత్తువ కోలుపోవగను జంకుచు సిగ్గున పిల్లనిచ్చు మే
నత్తనుఁ గాంచి బల్లిదుఁడు నమ్రతతోఁ బ్రణమిల్లె నత్తఱిన్
మీ సరదా పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి🙏
తొలగించండిసత్తువ గల తనయులతో
రిప్లయితొలగించండిమత్తెన్నడు బూనకుండ మాధవు ధ్యాసే
చిత్తమునం కుంతికి, మే
నత్తనుఁ గని బల్లిదుండు నమ్రుండయ్యెన్
చక్కని పూరణ. అభినందనలు.
తొలగించండి
రిప్లయితొలగించండిఆటవిడుపు సరదా పూరణ:
(జిలేబి గారికి అంకితం)
క్రొత్తగ జేరుచున్ ఘనుడు కూరిమి మీరగ తోటనందునన్
విత్తము చేతబూనుచును వెఱ్ఱిగ మొఱ్ఱిగ ముత్తుకూరునునన్
పొత్తును జేయగోరగను పొంకము జూపుచు నింటదూరెడిన్
నత్తనుఁ గాంచి బల్లిదుఁడు నమ్రతతోఁ బ్రణమిల్లె నత్తఱిన్
బల్లిదుడు = పెద్ద బల్లి (garden lizard)
తొలగించండి* బల్లిదుడు = పెద్ద బల్లి = తొండ (garden lizard)
మీ ఆటవిడుపు పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి'బల్లిదుడు' అన్నదానికి పెద్దబల్లి అన్న అర్థం నిఘంటువులో లేదు. "GP Sastry made easy" అన్న పుస్తకంలో ఉన్నదేమో?
🙏😊
తొలగించండి
తొలగించండి"కొత్త పదాలు సృష్టించక పోతే భాష ఎలా పెరుగుతుంది?" అన్నాడుగా ఘటోత్కచుడు...
తత్తరపాటు లేక గడు ధైర్యముతో నెదురొడ్డి పోరునన్
రిప్లయితొలగించండిచిత్తును జేయు నెల్లరను సింహబలుండని పేరు పొందినన్
చిత్తమునందు బెద్దలన జెల్వగు భక్తియు గౌరవమ్ము మే
నత్తనుఁ గాంచి బల్లిదుఁడు నమ్రతతోఁ బ్రణమిల్లె నత్తఱిన్
మంచి పూరణ. అభినందనలు.
తొలగించండికొత్తగ పెండ్లి చేసుకొని కోమలి కోరిక తీర్చ సంతలో
రిప్లయితొలగించండివిత్తము లెక్క సేయకయె వేడుక తీర్చెను పెన్మిటంతలో
తత్తరపాటు చెందెనిదె ద్రవ్యము బోవగ దారి యందు మే
నత్తను గాంచి బల్లిదుడు నమ్రతతో బ్రణమిల్లె నత్తరిన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి
రిప్లయితొలగించండిఅత్తరి యిత్తరి చూడక
కత్తిని చూపించి కుత్తుకను కోయుటకై
తత్తర పడి దారిని మే
నత్తనుఁ గని బల్లిదుండు నమ్రుండయ్యెన్!
జిలేబి
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి
రిప్లయితొలగించండికందోత్పల
కురిమింద దేవళపు స్థలపురాణము :)
పణమును గట్టెను గుడియం
దున, నత్తనుఁ గాంచి బల్లి దుఁడు నమ్రతతోఁ
బ్రణమిల్లె నత్తఱిన్ దే
వుని మహిమగ తలచి నశ్రువుల పారించెన్!
జిలేబి
మీ కందోత్పల పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిఈ కురిమింద దేవళం ఎక్కడిది? దాని కథా కమామీషు?
గూగులమ్మని అడిగితే ఏమీ చెప్పలేదు.
తొలగించండికురిమింద అంటే నత్తగుల్ల అట సో నత్త గుల్ల దేవళము జిలేబీయము :)
తొలగించండిజిలేబిగారు!మీ ఊహ అసమంజసము కాదు!ప.గో.జిల్లాలో నత్తారామేశ్వరం అనే ఊరుందట.నత్తలు,ఇసుకతో సీతారాములచే ప్రతిష్ఠింపబడిన శివలింగము
తొలగించండిఅక్కడ పూజలందుకుంటోందట!వాట్సప్ లో శర్మగారి ఉవాచ!
తొలగించండి:) ప్రతిధ్వని రాకుండా ఎట్లా వుంటుందీ :)
శర్మ గారా మజాకా యా :)
జిలేబి
రిప్లయితొలగించండికురిమింద దేవాలయము లో పూజ
కొత్తుపడంగ జీవితము కొందలపాటులు తీరగానదే
విత్తము లెల్ల కూడగ పవిత్రముగా జప మాచరించె మేల్
చిత్తపు చింతబోవునని సేవలచేసెను దేవళమ్ములో
నత్తనుఁ గాంచి బల్లిదుఁడు నమ్రతతోఁ బ్రణమిల్లె నత్తఱిన్!
జిలేబి
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండిచిత్తము జంతుజా లముల చిన్నయ సూరియె నిల్పినాడనన్
రిప్లయితొలగించండిజిత్తులమారి నక్కకథ జిల్కెను గల్పన భావబంధమై
పొత్తుగ గీటకమ్ములను బోలిక బెట్టుచు బద్యమల్లగన్
నత్తనుఁ గాంచి బల్లిదుఁడు నమ్రతతోఁ బ్రణమిల్లె నత్తఱిన్
కొరుప్రోలు రాధాకృష్ణారావు
చక్కని పూరణ. అభినందనలు.
తొలగించండిమైలవరపు వారి పూరణ
రిప్లయితొలగించండికృత్తికయందు పుట్టితినవి., కీటకమొక్కటి నిన్ను జంపును..
త్తుత్తువి కావు మాటలివి., యోర్మిని భక్తి భజించుచుండుమా!
సత్తువ యెంతగల్గినను చాలదటంచు పురోహితుండనన్ నత్తనుగాంచిబల్లిదుడునమ్రతతోఁబ్రణమిల్లెనత్తరిన్!!
మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి
మైలవరపు వారి పూరణ ప్రశస్తంగా ఉన్నది.
తొలగించండిఇంద్రజిత్తు -
రిప్లయితొలగించండిజిత్తుల శూర్పణ ఖ ముఖము
మొత్తముగా గాయబడ్డ ముక్కు జెవులతో
నెత్తురు గార్చెడు తన మే
నత్తనుఁ గని బల్లిదుండు నమ్రుండయ్యెన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిసత్తువ యెంత గల్గినను సంగర మందున మేటియైన తా
రిప్లయితొలగించండిచిత్తము ధైర్యమున్వదలి జీవము గాచగ వైరి మందలో
నత్తను గాంచి బల్లిదుడు నమ్రతతో బ్రణమిల్లె నత్తరిన్
కుత్తుక గోయురంచు మది కూలగ చేతులనెత్తె చిత్రమే
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి'వైరి మంద' దుష్టసమాసం. "వైరిసంఘమం। దత్తను..." అందామా? 'కోయురంచు'?
*కుంతిని గాంచిన కృష్ణుడు*
రిప్లయితొలగించండిమత్తేభమ్ముల వోలెను
సత్తువ గల పుత్రులున్న శాతోదరియే
బత్తిగ ప్రణమిల్లగ మే
నత్తనుఁ గని బల్లిదుండు నమ్రుండయ్యెన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిమత్తున మున్గిన నొకరుడు
రిప్లయితొలగించండికత్తిని గొని సతిని జంప గడగిన వేళన్
తత్తరముగ వఛ్చిన మే
నత్తను గని బల్లిదుండు నమ్రుo డయ్యెన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిమత్త గజమ్ములై చెలగు మాన్యులు శత్రుభయంకరుల్ గరిష్ఠమౌ
రిప్లయితొలగించండిసత్తువ గల్గినట్టి సుత సంతతి గల్గిన మండయంతియే
చిత్తము నందు నిత్యముము శ్రీహరిఁ గొల్చెడు పాండు పత్ని మే
నత్తనుఁ గాంచి బల్లిదుఁడు నమ్రతతోఁ బ్రణమిల్లె నత్తఱిన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిమొదటి పాదంలో గణభంగం. 'మండయంతియే'?
రిప్లయితొలగించండి* శంకరాభరణం వేదిక *
02/07/2020...గురువారం
సమస్య
********
"నత్తనుఁ గాంచి బల్లిదుఁడు నమ్రతతోఁ బ్రణమిల్లె నత్తఱిన్
నా పూరణ.
*** ********
చిత్తము వెన్నపూస గద; చెన్నగు రూపము; రంభసాటిదే!
చిత్తునుజేయు మాటలచె ;శీలము గాంచ మహోన్నతమ్మె !నే
సత్తెము జెప్పుచుంటి నిక సక్కటి బిడ్డకు జోడి నీవె;నీ
కిత్తును నిన్ను మీఱు ఘనుడెవ్వని నుర్విని గాన నన్న మే
నత్తను గాంచి బల్లిదుడు నమ్రతతో బ్రణమిల్లె నత్తఱిన్
-- 🌱 ఆకుల శాంతి భూషణ్ 🌱
🌷 వనపర్తి🌷
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి'మాటలచె' అని చే ప్రత్యయాన్ని హ్రస్వంగా ప్రయోగించరాదు.
అత్తా వినుమిది నిక్కము
రిప్లయితొలగించండిసత్తెముగా చెప్పుచుంటి చంపను బావన్
చిత్తమున నమ్ము మని మే
నత్తనుగని బల్లిదుండు నమ్రుండయ్యెన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిఅత్తకుమారులన్ కలసి యందరి మాటల నాలకించి యు
రిప్లయితొలగించండిన్మత్తుడు రాజరాజుమది మార్చగ హస్తినకున్ జని సంధికై
చిత్తము గారవమ్మడర శ్రీపతి యాపురమందు ప్రీతి మే
నత్తనుఁ గాంచి బల్లిదుఁడు నమ్రతతోఁ బ్రణమిల్లె నత్తఱిన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిరెండవ పాదంలో గణభంగం. "హస్తిన కేగి సంధికై" అనండి.
గురువర్యులకు నమస్సులు. సవరణకు ధన్యవాదములు అసనారె
తొలగించండిచిత్తరువాయెను చిన్నది
రిప్లయితొలగించండినత్తనుఁ గని; బల్లిదుండు నమ్రుండయ్యెన్
నత్తకు వెనుకనె యగుపడ
నుత్తమ శివ లింగ రూపముద్యోతితమై
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిఅత్తనువున్ స్పృశించి తన యల్లుని రూపము మార్చినంత తా
రిప్లయితొలగించండినత్తనుఁ గాంచి బల్లిదుఁడు నమ్రతతోఁ బ్రణమిల్లె నత్తఱిన్
"యత్త! ప్రమాణ మల్లునివి యర్హములౌ యపరాధముల్ శతం
బొత్తిడి యైన సైచెదను, పొంకము వీడకు" కృష్ణు డిట్లనెన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండితత్తఱపాటులేకశుభదంబగురాజసభాంతరాళమున్
రిప్లయితొలగించండిచిత్తరువట్టులన్నిలిచెచైద్యునిపల్కులనాలకించుచున్
చిత్తజుతండ్రిగానచటచిన్నెలవన్నెలచక్రధారియున్
నత్తనుగాంచిబల్లిదుఁడునమ్రతతోఁబ్రణమిల్లెనత్తఱిన్
మీ పద్యం బాగున్నది. అభినందనలు.
తొలగించండికొంత అన్వయలోప మున్నట్టున్నది.
సరిచేసివ్రాయుటకుప్రయత్నిస్తాను
తొలగించండిఅత్తలుసాధారణముగ
రిప్లయితొలగించండిమెత్తగమాట్లాడుదురిలనల్లునియెడలన్
నత్తరుసాయిబుతనమే
నత్తనుగనిబల్లిదుండునమ్రుండయ్యెన్
కందం
రిప్లయితొలగించండిచిత్తము నీ ధ్యానమ్మున
గుత్తమగును చింతలుండ గోకుల కృష్ణా!
సత్తమ! యిడుమన పృథ, మే
నత్తనుఁ గని బల్లిదుండు నమ్రుండయ్యెన్
ఉత్పలమాల
మొత్తము లీలలన్నిటికి మూలము నీవుగఁ గాచి నాడవే
చిత్తము నీదు ధ్యానమున జిక్కఁగఁ దోడుగ నుండఁ జింతలన్
సత్తమ! కూర్చుమంచు పృథ సాదరమొప్పగఁ గృష్ణుఁ గోర మే
నత్తనుఁ గాంచి బల్లిదుఁడు నమ్రతతోఁ బ్రణమిల్లె నత్తఱిన్!
అత్తరుసాయిబిచ్చటనుహైమవతీశునిభక్తురాలు,మే
రిప్లయితొలగించండినత్తనుగాంచిబల్లిదుడునమ్రతతోబ్రణమిల్లెనత్తఱిన్
నత్తలుబ్రేమచూపుదురెయల్లునిబట్లనునెల్లవేళలన్
నత్తఱివారుసైతమునునాదరమిచ్చుచుమెల్గుచుందురే
అత్తకుమారులన్ కలసి యందరి మాటల నాలకించి యు
రిప్లయితొలగించండిన్మత్తుడు రాజరాజుమది మార్చగ హస్తినకేగి సంధికై
చిత్తము గారవమ్మడర శ్రీపతి యాపురమందు ప్రీతి మే
నత్తనుఁ గాంచి బల్లిదుఁడు నమ్రతతోఁ బ్రణమిల్లె నత్తఱిన్
ఉత్తలపడి యున్న నరసి
రిప్లయితొలగించండిచిత్తంబునఁ బుట్ట జాలి శ్రీకృష్ణుండే
యత్తరిఁ దగఁ గుంతిని మే
నత్తనుఁ గని బల్లిదుండు నమ్రుండయ్యెన్
చిత్తము పొంగ లక్ష్మణుఁడు సీతయుఁ దోడుగ నుండఁ బ్రీతి నై
మిత్తిక మౌనిదర్శనుఁడు మేఘ నిభాంగక సుప్రభా దను
స్సత్తముఁ డర్క వంశ తిమి చంద్రుఁ డగస్త్య మహర్షి సుజ్వల
న్నత్తనుఁ గాంచి బల్లిదుఁడు నమ్రతతోఁ బ్రణమిల్లె నత్తఱిన్
[జ్వలత్ +నత్ +తను = జ్వలన్నత్తను]
అత్తనుతల్లిగదలచును
రిప్లయితొలగించండినిత్తెము సద్వర్తనమునునెరపుచు హితమున్
మెత్తగదెలిపిన తన మే
నత్తనుఁ గని బల్లిదుండు నమ్రుండయ్యెన్
చిత్తము సరిగాలేదని
రిప్లయితొలగించండిమత్తును సేవించినట్టి మందమతియు తా
క్రొత్తగ జూసినతరహా
నత్తనుగని బల్లిదుండు నమ్రుండయ్యెన్
అత్తా!చింతింపవలదు
రిప్లయితొలగించండిసత్తాగలవారు నీదు సంతానము వా
రుత్తములంచు బలికి మే
నత్తనుగని బల్లిదుండు నమ్రుండయ్యెన్
బల్లిదుడు = శ్రీకృష్ణుడు
రాయబారం విఫలమైన పిదప శ్రీకృష్ణుడు కుంతీదేవితో
పొత్తులు లేవికన్ విధిగ పోరునుసల్పుటె న్యాయమౌను నీ
చిత్తము చిక్కబట్టుకొని చింతను మానుమటంచు బల్కి తా
మిత్తిని గెల్వగాదగిన మేటి సుపుత్రుల గల్గినట్టి మే
నత్తనుగాంచి బల్లిదుడు నమ్రతతో బ్రణమిల్లె నత్తరిన్
రాధాదేవి శ్రీకృష్ణునకు మేనత్త అనే కథ ఆధారంగా పూరణ (కల్పన కావచ్చు)
హృత్తున నందగోపకుల శ్రేష్ఠునినిల్పుచు పారవశ్యయై
సొత్తును వానికిన్ దనకు సొంతము వాడను నిశ్పయంబునన్
తత్తరపాటు లేక హరితత్త్వ మెరింగిన దివ్యభావ మే
నత్తనుగాంచి బల్లిదుడు నమ్రతతో ప్రణమిల్లె నత్తరిన్
చిత్తస్థైర్యము వీడక|
రిప్లయితొలగించండికుత్తుక నీటను మునిగిన క్రుంగక నెపుడున్|
ముత్తెమువలె తిరిగెడి మే
"నత్తనుఁ గని బల్లిదుండు నమ్రుండయ్యెన్"
ఉ:
రిప్లయితొలగించండిచిత్తడి వాన లోన నొక చేడియ నడ్కల నాట్యమాడగన్
చిత్తము పల్లటించ నిక జేరితి ప్రక్కన బుజ్జగింపుగన్
బెత్తము చేత బూని కనిపించిన నుత్తమురాలి జూడగా
నత్తను గాంచి బల్లిదుడు నమ్రతతో బ్రణమిల్లె నత్తరిన్
వై. చంద్రశేఖర్
సమస్య :-
రిప్లయితొలగించండి"నత్తనుఁ గని బల్లిదుండు నమ్రుండయ్యెన్"
*కందం**
అత్త కుమార్తెను కాదని
కొత్తగ ప్రేమించిన చెలి కొంగున జేరెన్
చిత్తమున తప్పెరిగి మే
నత్తనుఁ గని బల్లిదుండు నమ్రుండయ్యెన్
..................✍️చక్రి