4, జులై 2020, శనివారం

సమస్య - 3417

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"పయ్యెదనున్ లాగువానిఁ భామిని మెచ్చెన్"
(లేదా...)
"పయ్యెద లాగు ధూర్తుని సెబాసని భామ నుతించెఁ బ్రీతితోన్"

63 కామెంట్‌లు:


 1. నడిరేయి సరదా పూరణ:

  కయ్యము జేయ గోరుచును కాంగ్రెసు పట్టపు రాణి పుత్రితో
  తియ్యని మాటలాడుచును తిక్కను లేపగ యూపినందునన్
  కుయ్యన కుండజూచి నగి కోపము హెచ్చగ "మాయ"లాడిదిన్
  పయ్యెద లాగు ధూర్తుని సెబాసని భామ నుతించెఁ బ్రీతితోన్

  రిప్లయితొలగించండి
 2. అయ్య తనమొదటి రాత్రిన
  సయ్యా టకయి పనిగొనిన సమయము నందున్
  శయ్యా గృహమున జిలిపిగ
  పయ్యెదనున్ లాగువానిఁ భామిని మెచ్చెన్

  రిప్లయితొలగించండి

 3. ఆటవిడుపు సరదా పూరణ:
  (జిలేబి గారికి అంకితం)

  విశాఖపట్నం సీనులు (1960s):

  నెయ్యము మీర ప్రేమికుని నీటుగ లాగగ బీచినందునన్
  రయ్యని వెంబడించి కడు రాగము జూపుచు నందగానిపై
  దయ్యపు రూపమున్ గొనుచు దర్పము జూపెడి చుప్పనాతిదిన్
  పయ్యెద లాగు ధూర్తుని సెబాసని భామ నుతించెఁ బ్రీతితోన్

  రిప్లయితొలగించండి
 4. చయ్యన ద్రోసి తప్పుకొని జాచి చపేటము నొక్కటిచ్చుగా
  పయ్యెద లాగు ధూర్తుని; సెబాసని భామ నుతించెఁ బ్రీతితోన్
  నెయ్యపు హద్దు మీరని వినీత మనస్కుని ప్రేమ పాత్రునిన్
  వియ్యము దోడ దగ్గరగు పేరిమి భారత సంప్రదాయమున్

  రిప్లయితొలగించండి
 5. చిన్నికృష్ణుని బాల్యక్రీడలు!
  నెయ్యము మీగడపాలను
  తయ్యారుగ నుంచ నాకుతగవని నీపౌ
  తియ్యని పాలేముద్దని
  పయ్యెదనున్ లాగువాని భామిని మెచ్చెన్

  సుయ్యని క్రాగుగ్రీష్మమున స్రుక్కుచు స్వేదము నాపలేకనే
  పయ్యద నద్దుకొంచు వడిబారగ మేడకు తాపమాపగా
  రయ్యని పైరగాలి జవరాలిని తాకగ హాయినొందుచున్
  పయ్యదలాగు ధూర్తుని సెబాసని భామ నుతించెను బ్రీతితోన్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
   మొదటి పూరణలో 'నీపౌ? "తగవని యింపౌ.." అని ఉండాలనుకుంటాను.

   తొలగించండి
  2. ధన్యవాదములు గురుదేవా!అది నీవౌ (నీవయిన),టంకణ దోషము!నమస్సులు!

   తొలగించండి 6. కయ్యములాడుచుండెపుడు... కన్నడు వెన్నను దొంగలించుగా...

  యయ్యయొ!మా కుమార్తెలను నల్లరి చేయును... ధూర్త బాలుడున్,

  దయ్యమటంచు గోపికల తల్లులు దిట్టిన.., గోప బాలలే

  నెయ్యము జేయుచుందురును నీలపు కృష్ణుని తోడ..,వెన్నునిన్

  పయ్యెద లాగు ధూర్తుని సెబాసని భామ నుతించెఁ బ్రీతితోన్

  రిప్లయితొలగించండి
 7. ఈ నాటి శంకరాభరణము వారి సమస్య

  పయ్యెదనున్ లాగువాని భామిని మెచ్చున్

  సమస్య కంద పద్య పాదము

  నా పూరణ సీసములో  పయ్యెదనున్ లాగు వాని బామిని మెచ్చు నెప్పుడి చటనని నీవు తలచి

  రయ్యన వచ్చుచు రాజ మార్గములోన. నన్ను నిలువరించ న్యాయమగునె,

  తియ్యని పాలను నెయ్యిని వెన్నను వేరుగ తెచ్చితి‌ విడువు మనగ

  ముయ్యగ నేలనో‌ పయ్యెద చాటున ‌ దొంగలనని నన్ను‌‌ దోచ వలదు


  రయ్య ,చల్ల నమ్ముకొని నే రాత్రి వేళ

  కొచ్చెద మధుర నుంచి నిక్కచ్చిగ వ్రజ

  వరుడ, విడువుము చెలిమిగ దారి‌ యీవు

  ననుచు పలికె కృష్ణుని‌ తోడ వనిత యొకతె

  రిప్లయితొలగించండి
 8. వెయ్యిన్ని మాటలన్నను
  తియ్యన్ని పలుకులతోడ తికమక బెట్టే
  నయ్యదునందున్, రాధయె,
  పయ్యెదనున్ లాగువానిఁ భామిని మెచ్చెన్!

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'వెయ్యిన్ని, తియ్యన్ని, పెట్టే' అన్నవి వ్యావహారికాలు.

   తొలగించండి
 9. కయ్యము మాయజూ దమది కక్షను బెంపగ జంపెనెవ్వనిన్?
  నయ్యడ గొల్వుగూటమిన నవ్వుల బువ్వుల మాటగల్పుచున్
  నెయ్యము భీమసే నుడన నేర్పున గీచకు దున్మివేయగా
  పయ్యెద లాగు ధూర్తుని, సెబాసని భామ నుతించెఁ బ్రీతితోన్

  కొరుప్రోలు రాధాకృష్ణారావు

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ క్రమాలంకార పూరణ బాగున్నది. అభినందనలు.
   '...గొల్వుకూటమిని' అనండి.

   తొలగించండి


 10. సయ్యాటలలో పదనిస
  లయ్యారే రాసలీలల సమయమదిగో
  నొయ్యారముగ గుసగుసల
  పయ్యెదనున్ లాగువానిఁ భామిని మెచ్చెన్!  నారదా
  వింటున్నావా :)


  జిలేబి

  రిప్లయితొలగించండి


 11. తనువెల్ల నూగిసల వా
  నిని, పయ్యెద లాగు ధూర్తుని ,సెబాసని భా
  మ నుతించెఁ బ్రీతితోన్ క్రీ
  డనపు హరిమ చేరి ముద్దిడను సయ్యాటన్


  పగలేవెన్నెలా :)


  జిలేబి

  రిప్లయితొలగించండి


 12. నిశాంతమాయె నయ్య యిదేమి విడువడే


  కయ్యపు రాసలీలల ప్రగాఢపు కౌగిలి లో సయాటలన్
  చయ్యను ముద్దులాటలె విశంకట మాయె నిశాంత మాయె నా
  నెయ్యపు మాట పోనిడిక నెమ్మిని చూపెడు ప్రాణనాథుడిన్,
  పయ్యెద లాగు ధూర్తుని, సెబాసని భామ నుతించెఁ బ్రీతితోన్!  జిలేబి

  రిప్లయితొలగించండి


 13. నెయ్యపు మాటల ఫలితం
  బయ్యరి ప్రేముడిని పుట్టె! పసిబాలుడ‌తం
  డయ్యెడు వేళను పాలకు
  పయ్యెదనున్ లాగువానిఁ భామిని మెచ్చెన్  జిలేబి

  రిప్లయితొలగించండి
 14. తియ్యని జ్ఞాపకంబులిట తీరుగ జ్ఞప్తికి తెచ్చుకొన్చు తా
  చయ్యన వీచు వీచికల జాబిలి చల్లని నిండు వెన్నెలన్
  రయ్యని రాని యా మగని రాకకు చింతిలి చెంత కంతుడా
  పయ్యెద లాగు ధూర్తుని సెబాసని భామ నుతించె బ్రీతితోన్

  రిప్లయితొలగించండి
 15. తే.గీ//
  పాశవికముగ పూతన పాలనొసఁగు
  తల్లి చనుబాలు త్రాగుచు మెల్లిగాను l
  పయ్యెదను లాగు వానిని భామ బొగిడె
  మోక్షము నొసఁగు కృష్ణుని మోముగాంచి ll

  రిప్లయితొలగించండి
 16. లీలాశుకుని స్ఫూర్తితో

  నెయ్యము మీర సుందరవినీలశరీరుని బాలకృష్ణునిన్
  తొయ్యలి గోపకాంత తన తోరపు టూరువుఁ జేర్చు నంతలో
  నెయ్యెడనో స్పృశించ, నొక యంగన ముద్దిడి చంకఁ జేర్చ నా
  పయ్యెద లాగు ధూర్తుని సెబాసని భామ నుతించెఁ బ్రీతితోన్

  కంజర్ల రామాచార్య.

  రిప్లయితొలగించండి
 17. సమస్య :-
  "పయ్యెదనున్ లాగువానిఁ భామిని మెచ్చెన్"

  *కందం**

  ఉయ్యాల నూగు బాలుడు
  చయ్యన నేడ్వంగ జనని సంకన జేర్చన్
  తియ్యని పాలకు తల్లిది
  పయ్యెదనున్ లాగువానిఁ భామిని మెచ్చెన్
  ...................✍️చక్రి

  రిప్లయితొలగించండి
 18. మైలవరపు వారి పూరణ

  నెయ్యపుమాటలేల ? రమణీయసుమమ్మును నా సపత్నియౌ
  తొయ్యలి రుక్మిణీసతికి దోపితి కొప్పున ధూర్త! యంచు దా
  కయ్యము బూన., చెంత నయగారపు పల్కుల గోముగోముగా
  పయ్యెద లాగు ధూర్తుని సెబాసని భామ నుతించెఁ బ్రీతితోన్!

  మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

  రిప్లయితొలగించండి
 19. అయ్యమ్మ ముద్దు తనయుం
  డుయ్యాలననూగుచుండ నూడ్చెడు నెపమున్
  దొయ్యలి తనదరి జేరగ
  పయ్యెదనున్ లాగువానిఁ భామిని మెచ్చెన్

  రిప్లయితొలగించండి
 20. వయ్యారపు కేరింతగ
  నెయ్యముగా సతియు పతియు నేరుపు మీరన్
  సయ్యాట లాడు చుండగ
  పయ్యెద నున్ లాగు వాని భామిని మెచ్చె న్

  రిప్లయితొలగించండి
 21. * శంకరాభరణం వేదిక *

  04/07/2020...శనివారం

  సమస్య
  ********
  పయ్యెద లాగు ధూర్తుని సెబాసని భామ నుతించె బ్రీతితోన్

  నా పూరణ. ఉ.మా.
  *** ********

  కయ్యములాడు చుండెపుడు కమ్మని వెన్నని దొంగలించు తా

  తొయ్యలి కోకలన్నియును దోచెడు ధూర్తుడ టంచు నీవు క

  న్నయ్యని దిట్టకమ్మ కడు;నా మది చోరుడు కృష్ణుడంచు నా

  పయ్యెద లాగు ధూర్తుని సెబాసని భామ నుతించె బ్రీతితోన్

  -- 🌱 ఆకుల శాంతి భూషణ్ 🌱
  🌷 వనపర్తి🌷

  రిప్లయితొలగించండి
 22. కయ్యములాడి కోపమున కాంతుని దూరుచు రోశమందునన్
  శయ్యను వీడిపోదలచు జవ్వనిఁ గాంచుచు బజ్జగింపగన్
  నెయ్యపు మాటలన్ బలికి నెచ్చెలి తోడఁ క్షమించమంచు నా
  పయ్యెద లాగు ధూర్తుని సెబాసని భామ నుతించెఁ బ్రీతితోన్

  రిప్లయితొలగించండి
 23. కయ్యములాడుచున్ సతము కన్గొని ధూర్తుడటంచు తిట్టు న
  త్తయ్యకుమారునిన్, మదిని తద్దయు ప్రీతిని మెచ్చుకొంచు బా
  వయ్యను పెండ్లియాడినది ప్రాకట మైన దినమ్మునన్ వెసన్
  పయ్యెద లాగు ధూర్తుని సెబాసని భామ నుతించెఁ బ్రీతితోన్

  రిప్లయితొలగించండి
 24. అందరికీ నమస్సులు🙏
  04.07.2020

  శంకరాభరణం సమస్య - నా పూరణ

  *కం*

  నెయ్యము తో వెడలగ నే
  కయ్యముతో కాలు దువ్వు కాంతను పతియే
  సయ్యని దూకుచు కొట్టుచు,
  *"పయ్యెదనున్ లాగువానిఁ భామిని మెచ్చెన్"!!*

  *కళ్యాణ్ చక్రవర్తి ముంబాయి*
  🙏

  రిప్లయితొలగించండి
 25. అయ్యో మకరికి జిక్కితి
  నయ్యా నను గావుమంచు నా కరి వేడన్
  చయ్యన బోయెడి పట్టున
  పయ్యెదనున్ లాగువానిఁ భామిని మెచ్చెన్

  రిప్లయితొలగించండి
 26. కందం
  కయ్యము కలహాంతరితకు
  చయ్యన విరహమ్ము నిడ విచారమునందన్
  రయ్యన మగడామె నెరిఁగి
  పయ్యెదనున్ లాగు, వానిఁ భామిని మెచ్చెన్

  రిప్లయితొలగించండి
 27. లయ్యాటలాడతనతో
  ఉయ్యాలేమనసులూగనూకోట్టంగా
  అయ్యారేమగఁడునుతా
  పయ్యెదనున్లాగువానిభామినిమెచ్చెన్

  రిప్లయితొలగించండి
 28. సయ్యాటఅనిచూచుకోవాలి, టైపుదోషము

  రిప్లయితొలగించండి
 29. సయ్యాటగ కోరిచిలిపి
  కయ్యమునకుదిగిరిరువురు కాంతుండంతన్
  చయ్యన గోముగఁ దొయ్యలి
  పయ్యెదనున్ లాగువానిఁ భామిని మెచ్చెన్

  రిప్లయితొలగించండి
 30. చయ్యన బోవలె విడుమన
  నెయ్యము తోడను వనితను నేర్పరి పట్టెన్!
  సయ్యాటకు రమ్మన హరి!
  పయ్యెదనున్ లాగువానిఁ భామిని మెచ్చెన్"

  రిప్లయితొలగించండి
 31. నెయ్యముఁజేయగామనసునేరములెంచకపర్వులెత్తగా
  అయ్యెడముగ్ధగోపికయుయావగవచ్చెనుక్రుష్ణుచెంతకున్
  కయ్యములాడకేమనసుగోరగపారముచూపువాఁడుతా
  పయ్యెదలాగుధూర్తునిసెబాసనిభామనుతించెఁబ్రీతితోన్

  రిప్లయితొలగించండి
 32. ఇయ్యెలనాగపొందునకునెన్నియుగంబులువేచియుంటినే
  డియ్యెడయొంటియైదొరికెనెంతటిభాగ్యమునాదటంచు దా
  చయ్యన పైటబట్టె పదచారికనుంగొనినడ్డగింపనా
  పయ్యెద లాగు ధూర్తుని సెబాసని భామ నుతించెఁ బ్రీతితోన్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మూడవపాదమును "చయ్యన పైటబట్టె శవసానుడు కన్గొని యడ్డగింపనా" గా చదువవలసినదిగా కోరిక

   తొలగించండి
 33. అయ్యలునమ్మలచాటున
  నెయ్యముతోనొకరికొకరునెగడుచుమిగులన్
  సయ్యాటలనడుమనదన
  పయ్యెదన్ లాగువానిభామినిమెచ్చెన్

  రిప్లయితొలగించండి
 34. వియ్యాల వారి యింటను
  వయ్యారమ్ము లొలికించు పద్మాక్షిదియౌ
  సయ్యాట లందు గెంతుచుఁ
  బయ్యెదనున్ లాగువాని భామిని మెచ్చెన్


  కయ్యము ముందు కల్గుటకుఁ గారణ మౌ నని నిశ్చయమ్ముగం
  గుయ్యని యంబికా సుతుఁడు కుందుచు నుండుట తెల్లమే యనన్
  దయ్యమ కాచు నన్ననుచు ద్రౌపది కృష్ణుని, నేవగించి యా
  పయ్యెద లాగు ధూర్తునిని బాగని, భామ నుతించెఁ బ్రీతితోన్

  రిప్లయితొలగించండి
 35. రిప్లయిలు
  1. ఉ:

   వియ్యము నొంద వెళ్ళిరట బెండ్లి కుమారుడు తల్లి తండ్రులున్
   నెయ్యపు మాటలన్ వధువు నెంపిక జేయుట నిశ్చయమ్మవన్
   రయ్యన లేచి పర్విడెడు రంభను బోలిన కన్యకా మణిన్
   పయ్యెద లాగు ధూర్తుని సెబాసని భామ నుతించె బ్రీతితోన్

   వై. చంద్రశేఖర్

   తొలగించండి
 36. చయ్యనశిక్షనీయవలెసద్గురువైననుజింతజేయకన్
  బయ్యెదలాగుధూర్తుని,సెబాసనిభామనుతించెబ్రీతితోన్
  దియ్యనిపాటపాడగనుదీగలభారతిమెచ్చుకోలుగా
  నెయ్యముగల్గుచోభువినినేరములేవియుగానరావుగా

  రిప్లయితొలగించండి
 37. ఉత్పలమాల
  అయ్యలు నిందరుండ నను నజ్ఞత నీడ్చఁగ దుశ్శసేనుడున్
  గుయ్యిడ లేనివారలుగ కూర్చొని గద్దెల వాల్చశీర్షముల్
  జయ్యన రక్షణంబునిడ శౌరిని ద్రోవది వేడె బీతి! నే
  పయ్యెద లాగు ధూర్తుని సెబాసని భామ నుతించెఁ బ్రీతితోన్?

  రిప్లయితొలగించండి
 38. నెయ్యము చూపుచు కృష్ణుడు
  తొయ్యలితో సరసమాడి తోషము పంచన్
  చెయ్యన లేచిన యంతనె
  పయ్యెదనున్ లాగు వాని భామిని మెచ్చెన్.

  రిప్లయితొలగించండి
 39. కందము:
  శయ్యను నిద్దురనుండగ
  చయ్యనతన చెంతజేరి చన్నులకొరకై
  కుయ్యనుచు మూల్గి పాలకు
  పయ్యెదనున్ లాగువానిఁ భామిని మెచ్చెన్.

  --గోలి.

  రిప్లయితొలగించండి