17, జులై 2020, శుక్రవారం

'సప్తతి'

కవిమిత్రులారా,
          ఈరోజు నా పుట్టినరోజు. కవిమిత్రులు నా 'సప్తతి ఉత్సవం' ఘనంగా చేయాలనుకున్నారు. కాని కరోనా కారణంగా ఆ అవకాశం లేకుండా పోయింది. 
          'మెతుకుసీమ సాహితీ సాంస్కృతిక సంస్థ' పూనికొని అవుసుల భానుప్రకాశ్ గారి సంపాదకత్వంలో సర్వాంగ సుందరంగా 'శంకరాభరణం' పేరుతో 240 పేజీల నా సప్తతి సంచిక సిద్ధమయింది. పరిమితంగా ఆహ్వానింప బడిన కవిమిత్రుల సమక్షంలో, మా ఆశ్రమంలోనే ఈరోజు పుస్తకావిష్కరణ జరుగనున్నది. ఈ సంచిక కోసం వ్యాసాలు, పద్యాలు వ్రాసిన అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. నా యీ సాహితీ ప్రయాణం ఇలాగే కొనసాగడానికి తగిన ఆయురారోగ్యాలను ప్రసాదించ వలసిందిగా చదువుల తల్లి సరస్వతీ దేవిని వేడుకుంటున్నాను.


26 కామెంట్‌లు:

 1. విశ్వ గురువులకు వినమ్ర నమస్సులతో జన్మదిన శుభాకాంక్షలు..

  అద్భుతః...
  🙏🙏🙏

  రిప్లయితొలగించండి
 2. శతమానమ్ భవతి శతాయుష్షు.............

  https://www.youtube.com/watch?v=lLAy8Ace8MY

  రిప్లయితొలగించండి
 3. గురువులకు వినమ్ర నమస్సులతో జన్మదిన శుభాకాంక్షలు..

  రిప్లయితొలగించండి
 4. పృచ్ఛక చక్రవర్తి, సమస్యా పూరణ సామ్రాట్ శ్రీ కంది శంకరార్యులకు సప్తతి జన్మదిన శుభాకాంక్షలు...!

  రిప్లయితొలగించండి


 5. జన్మ దిన శుభాకాంక్షలతో  చీర్సు సహిత
  జిలేబి

  రిప్లయితొలగించండి
 6. గురువుగారికి హార్దికజన్మదిన శుభాకాంక్షలు

  రిప్లయితొలగించండి
 7. *శ్రీ కంది శంకరయ్య మాస్టారు గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు*

  మీరు నిండు నూరేళ్ళు...
  ఆయురారోగ్యాలతో...
  అష్టైశ్వర్యాలతో...
  సాహితీ ప్రపంచంలో..
  అనేకానేక కీర్తి శిఖరాలను అధిరోహించాలని...
  మనస్పూర్తిగా... ఆకాంక్షిస్తున్నాను...
  మీ
  శ్రేయోభిలాషి
  గోగులపాటి కృష్ణమోహన్
  వ్యవస్థాపక అధ్యక్షుడు
  తెలుగు కవన వేదిక, మేజిరసం

  రిప్లయితొలగించండి
 8. కర్మ యోగి యతడు కవికుల తిలకుండు
  కువలయమ్ము కెల్ల గురువతండు
  శంకరాభరణపు సారథిగ నతడు
  కవుల యెదను నిలిచె ఘనుడతండు

  గురువు గారికి జన్మదిన శుభాకాంక్షలు.

  రిప్లయితొలగించండి
 9. ఆర్యా
  జన్మదినోత్సవ శుభాకాంక్షలు.

  రిప్లయితొలగించండి
 10. కవికుల శిఖామణి శ్రీ కంది శంకరయ్య గారికి జన్మదిన శుభాకాంక్షలు
  మీకు మీ కుటుంబమునకు నవ్వులే పువ్వులై మీ ఇంటి ముంగిట ముత్యాల రంగవల్లులై నిత్యనూత్న ఉషోదయంలా ఆమనిలా శరత్ జోత్స్నలా శతవసంతాలు వెలుగొందాలని సదా అభిలషిస్తూ....
  మీ అభిమాని
  నందుల మఠం శశిభూషణ సిద్ధాంతి, నంద్యాల.

  రిప్లయితొలగించండి
 11. కంది గురువులకు నమస్సులతో జన్మదిన శుభాకాంక్షలు..

  రిప్లయితొలగించండి
 12. శుభోదయం....గురుతుల్యులు, నిత్య సాహిత్య కృషీవలులు, తెలుగు తనం ఉట్టిపడే తెలుగు ఉపాధ్యాయులు, భాషావ్యాకరణాలను పదిమందికి తెలిసేలా నొప్పించక చెపుతూ ప్రపంచ మంతా మాతృభాషాభిమానుల్ని తెలుగు పద్యరచనోన్ముఖుల్ని చేసి వందలాది మందితో వేలాది పద్యాలు వ్రాయిస్తున్న తెలుగు సౌజన్య తేజం.... శ్రీ కంది శంకరయ్య గారు. నాల్గు సంవత్సరాలుగా వారితో నా పరిచయం. నిరాడంబరంగా జీవించటం, క్లుప్తంగా మాట్లాడటం వారికి ఆభరణాలు. ఆ సాధుశీలి డెబ్భైయవ జన్మదిన సంబరాలు ఈ రోజు జరుపుకోవడం ౘాల ఆనందదాయకం. వారు నిండు నూరేళ్ళూ ఆయురారోగ్యాలతో సుఖశాంతులతో తెలుగు సాహిత్య ప్రభలను తెలుగు ప్రజల కందిస్తూ వుండాలనీ.... "శంకరాభరణం" వారి జీవన రాగమై వర్ధిల్లాలని
  కోరుకుంటూ....శుభాకాంక్షలు! నమస్సులు!

  పచ్చని బృందావనివలె
  విచ్చిన నా తెనుగు తోట విరిరాగములై
  మెచ్చగ పద్యసుమమ్ముల
  గ్రుచ్చిన పూమాల వైతు గురు వర్యునకున్!

  .... శిష్ట్లా శర్మ

  రిప్లయితొలగించండి
 13. గురుదేవులకు ప్రణామములు. సప్తతి వేడుకల సందర్భంగా జన్మదిన శుభాకాంక్షలు.

  రిప్లయితొలగించండి
 14. గురుదేవులకు జన్మదిన శుభాకాంక్షలు. అసనారె

  రిప్లయితొలగించండి
 15. పుట్టితివటయీరోజున
  పుట్టినయోశంకరార్య!పృధివికిమణివై
  బిట్టుగగవితలుసిమ్ముచు
  నట్టులెగైకొనుమునాదునభివాదములన్

  రిప్లయితొలగించండి
 16. "సప్తతి" ఉత్సవమును జరుపుకొనుచున్న శ్రీ కంది శంకర గురువర్యులకు నమః పూర్వక శుభాకాంక్షలు.

  సీసము:
  ఇంటసమస్యల వెన్నియున్ననుగాని
  ఒంటిగా నెదిరించె నొక్కడగుచు
  వేల సమస్యల నిచ్చుచున్ కవులనే
  ఒంటిగా దీర్చెగా యొజ్జయగుచు
  "శంకరాభరణంపు శంకరార్యుండు" గా
  పేరునందినయట్టి "సూరి" యగుచు
  "పృచ్ఛకమణి" యయి వెరువక 'పండిన
  తల' నాట "తొలి" యవధానియగుచు

  తేటగీతి:
  కందివంశజుడయి మన కందినట్టి
  పద్య పాకము నేర్పించు వలలుడితడు
  సప్తతినిదాటి శతముగా "శంకరయ్య"
  మాత శారదా కృపతోడ మనగ వలయు.

  --గోలి.

  రిప్లయితొలగించండి
 17. సప్తత్యబ్ద పూర్ణోత్సవ సందర్భమున మీ దంపతులకు నా హృదయ పూర్వ కాభినందనలు మఱియు సంపూర్ణాయు రారోగ్య సిద్ధ్యర్థము పుత్రపౌత్రాభి వృద్ధ్యర్థము శుభాశీస్సులు!!!

  రిప్లయితొలగించండి
 18. ద్రాక్ష పాక రచన దక్షత బెంపగా
  దక్షు డనగ దానె ధర్మ విదుడు
  పద్య మందు ద్రాక్ష మద్యమునందించి
  కంది శంకరయ్య కవులఁ జెఱచు

  కొరుప్రోలు రాధాకృష్ణరావు

  రిప్లయితొలగించండి
 19. గురువుగారికి జన్మదిన శుభాకాంక్షలు.

  రిప్లయితొలగించండి
 20. ..పూజ్య గురుదేవులకు జన్మదిన శుభాకాంక్షలు.....

  రిప్లయితొలగించండి
 21. 💐💐💐💐💐💐💐
  మాన్యులు అవధాని సుకవిమిత్రులు శంకరాభరణ బృంద మార్గదర్శకులు సమస్యాపృచ్ఛకచక్రవర్తి శ్రీకంది శంకరయ్యగారికి మనఃపూర్వక సప్తతి జన్మదిన శుభాకాంక్షలు!!
  వారికి ఆ భగవంతుడు ఆయురారోగ్యైశ్వర్యసుఖసంతోషశాంతులను శుభాలను సత్వరకార్యసిద్ధిని ప్రసాదించుగాక!
  💐💐💐💐💐💐💐
  స్వస్తి!
  🙏🙏🙏🙏🙏
  మధురకవి గుండు మధుసూదన్
  శేషాద్రిహిల్స్, ఓరుగల్లు.

  రిప్లయితొలగించండి
 22. గురువులు శ్రీకందిశంకరయ్య గారికి "సప్తతి మహోత్సవ" శుభాకాంక్షలు. కార్యక్రామాన్ని వైభవంగా జరిపించిన మెతుకుసీమ సాహిత్య సంస్థకు నా అభినందనలు.

  మీజన్మదినమునందున
  రాజిల్లెనుగాదె పద్యరత్నంబులు న
  వ్యాజంబు మీదు దయ మిము
  పూజింతుము భక్తిమీర పుణ్యకవివరా!

  పద్యము గూర్పు విద్య తమ పంచన జేరి గ్రహించినాడ సం
  వేద్యము మీదు సత్కృషి వివేకములున్ ప్రతిభావిశిష్ఠతల్
  సద్యశమంది మీరు విలసత్కవనంబున చక్రవర్తియై
  పద్యసుమంపు గంధములఁ వర్ధిలఁ జేసెడు మీకు సన్నుతుల్.

  రిప్లయితొలగించండి
 23. పద్యగురువులకుజన్మదినశుభాకాంక్షలు

  రిప్లయితొలగించండి
 24. గురువు గారికి జన్మదినశుభాకాంక్షలు...

  రిప్లయితొలగించండి