మా అమ్మాయిలు ఫాల్కురికి సోమనాధుడు రచించిన బసవేస పాహిమాం (అక్షరాంక పద్యాలు నేర్చుకుంటున్నారు) వాటిలో నాలుగు పద్యాలు మాత్రమే దొరికినవి. మిగిలిన పద్యాలు దొరికిన యెడల పంపగలరు. మా పెద్ద అమ్మాయి పఠించిన పాషాణ పంచకం లింక్ కింద ఇచ్చుచున్నాను . దయచేసి మిగిలిన పద్యాలు మీ దగ్గర ఉన్న యెడల పంపగోరుచున్నాను. మీ దగ్గర లేని యెడల ఎక్కడన్నా లింక్ ఉంటె పంపగలరని మనవి .https://www.facebook.com/100001404231510/videos/3257809807609128
ఆర్యా...నమస్సులు! మీ అమ్మాయికి నా ఆశీస్సులు! నాకు కూడా మీరు తెలిపిన నాలుగు పద్యాలు మాత్రమే దొరికాయి. అయితే వాటి ప్రతిపదార్థతాత్పర్యవిశేషములతో దొరికినవి. కేవలం పద్యం పఠించడం కన్న ఆ పద్యం యొక్క అర్థం తెలుసుకొని పఠిస్తే ఇంకా అద్భుతంగా వుంటుదని భావించి, ఆ లింకులు ఈ క్రింద ఇస్తున్నాను... స్వీకరించగలరు. ఇవి శ్రీకాకుళంలోని నా మిత్రులు శ్రీ వల్లూరు మురళిగారి బ్లాగులోనివి.
అలాగే మీ వాట్సప్ చరవాణి సంఖ్య తెలిపినట్లయితే...షడ్జామడ్జఖరాడ్జ...శ్లోక పంచకము pdf...ప్రతిపదార్థయుక్తముగ పంపగలను. నా వాట్సప్ చరవాణి సంఖ్య: 6301264676 దీనికి పంపగలరు.
కృతజ్ఞతలు. మీరు పంపిన లింకులు రెండు రోజుల క్రితమే చూడడము జరిగినది. ఆ లింకుల నుండి నేను శంకరాభరణం గారి బ్లాగ్ లోకి వచ్చితిని. నా వాట్స్ అప్ నెంబర్ 919490702244 షడ్జామడ్జ పంచకం లో 4 శ్లోకాలు నేర్చుకున్నది . కానీ అవి ఎంత వరకు సరి ఐనవో తెలియదు. మీలాంటి వారి సహాయముతో మా అమ్మాయిలు మరిన్ని శ్లోకాలు నేర్చుకుంటారు
కృతజ్ఞతలండీ సర్వ జగద్రక్షకుడు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు దేవ దేవుడు శ్రీ వేంకటేశ్వర స్వామిని కీర్తిస్తూ పద్యాలు సంకలనం చేయించాలి అనుకుంటున్నాను గోవిందాక్షర శతకం : అక్షరానికి వంద పద్యాలు ఛందస్సు : మీ ఇష్టం భాష : తేట తెలుగు, సంస్కృతం , ద్విభాషా మిళితం మొదటి శతక పద్యం: (అకార పద్యాలు వంద సేకరిస్తాము) అక్షరములోని ప్రతి పదమూ "అ" తో మొదలవ్వాలి లేదా "అ కార అక్షరము" తో మొదలవ్వాలి. పద్య భావము వేంకటేశ్వరుని కీర్తిస్తూ కానీ స్వామి రూపాన్ని వర్ణిస్తూ కానీ స్వామి లీలలు తెలుపుతూ కానీ ఉండాలి. ప్రతి పదార్ధ భావాలూ కూడా పద్యముతో పాటూ తెలపాలి మాకు అందిన పద్యాల ను వీడియో సంకలనం చేస్తాము. ప్రతీ పద్యముతో పాటూ రచయిత /రచయిత్రి పేరు ముఖ చిత్రము మరియు వారి వివరాలు వీడియో లో నిఖిప్తం చేస్తాము గమనిక : ఒకరు ఎన్ని పద్యాలు అయినా రాయవచ్చు send your poems to slokalupadyalu@gmail.com / slokalu@rcsindia.co.in Whats app : 9490702244
రిప్లయితొలగించండిఆటవిడుపు సరదా పూరణ:
(జిలేబి గారికి అంకితం)
పూర్ణంబూరెల వండెదన్ ఘనముగా పూజించుచున్ మిమ్ములన్
స్వర్ణంబిచ్చెద కంది శంకరవరా! శాస్త్రంబులన్ నాకయో
వర్ణంబుల్ తెలియంగ రావు చెపుడీ వయ్యారమౌ రీతి మా
కర్ణుండే పినతండ్రి పాండవులకున్ గాంగేయుఁడే మామయౌ???
మీ అధిక్షేపాత్మకమైన ఆటవిడుపు పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి"వయ్యారమౌ రీతి నే ।కర్ణుండే..." అంటే బాగుంటుందేమో?
🙏
తొలగించండి
తొలగించండిఎన్నికల ప్రచార వృత్తాంతము (2019):
నిర్ణీతంబగు కాలమున్ జనుచు తా నిష్ణాతుడై కోవెలన్
కర్ణాలన్ సరి చుట్టుచున్ ముదమునన్ గారాబు జందెమ్ముతో
పర్ణంబుల్ వడి త్రిప్పి భారతమునన్ పల్కెన్ గదా రాహులే:
"కర్ణుండే పినతండ్రి పాండవులకున్ గాంగేయుఁడే మామయౌ"
కం//
రిప్లయితొలగించండిపర్ణంబులు చవిగొంటివ
కర్ణుఁడు పినతండ్రి గాఁడె కౌంతేయులకున్ l
వర్ణన కూడని బలుకులు
వర్ణింపగ శక్యమేన వరదుని కైనన్ ll
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండికం//
రిప్లయితొలగించండిఅర్ణము నములుచు నుంటిమి
కర్ణుఁడు పినతండ్రి గాఁడె కౌంతేయులకున్ l
వర్ణన యెటులన్ జెప్పిరి
వర్ణింపగ రాదు మాకు వరశంకరుడా ll
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండివర్ణింపరానిదౌ మది
రిప్లయితొలగించండిరార్ణవమున నీదులాడి యసదుక్తుల సం
పూర్ణుఁడు శకారుఁ డిట్లనెఁ
గర్ణుఁడు పినతండ్రి గాఁడె కౌంతేయులకున్.
😊
తొలగించండి"పూర్ణుఁడు రాహులు డిట్లనెఁ"
అనండి
తొలగించండిజీపీయెస్ వారు అదురహో
జిలేబి
😊
తొలగించండి
రిప్లయితొలగించండివర్ణమ్మేదియొ తెలియని
కర్ణుఁడు; పినతండ్రి గాఁడె కౌంతేయులకున్
కర్ణుని తల్లి పెనిమిటి? వి
వర్ణమన గలమకొ? భళి సవర్ణుడె సుమ్మీ
మీమాంస
జిలేబి
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిపూర్ణజ్ఞానవిశిష్టవేద్యవిషయస్ఫూర్తిన్ పురాణాదులన్
రిప్లయితొలగించండిచూర్ణీభూతమొనర్చితో! కవివరా? చొక్కంపు విజ్ఞానివే
కర్ణాకర్ణిగ వింటి గాని యిదియే గాధావిశేషమ్మొ? యీ
కర్ణుం డే పినతండ్రి పాండవులకున్ గాంగేయుఁడే మామయౌ?
కంజర్ల రామాచార్య
కోరుట్ల
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండి
రిప్లయితొలగించండిమా శకారుడే ( వీడూ జగణమే ) గతి
వర్ణాలెన్ని శకారుడా తెలుపగా వడ్డించు మాకో కథన్
"కర్ణుండే పినతండ్రి పాండవులకున్ గాంగేయుఁడే మామయౌ
వర్ణాలెల్ల సవర్ణముల్ తెలుసుకో బామ్మా జిలేబీ!" వెసన్,
పూర్ణంబాయెను బుర్ర పల్కులవి సంపూర్ణమ్ముగానేర్పగా
జిలేబి
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిఈ నాటి శంకరాభరణం వారి సమస్య
రిప్లయితొలగించండికర్ణుడు పినతండ్రి కాదె కౌంతేయలకున్
ఇచ్చిన పాదము కందము
నా పూరణ సీసములో
లక్ష్మణుం డెప్పుడు లవకుశు లకు పిన
తండ్రి యే భువనమున్
తరచి చూడ,
గాండీవి యా ఘటోత్కచునకు పినతండ్రి
యేగదా పరికించ నెవ్వరైన,
రామలక్ష్మణులతో రణమును చేసిన
దుష్టుడా మేఘనాధునకు కుంభ
కర్ణుడు పినతండ్రి కాదె, కౌంతేయుల
కున్ విదు రుడెపుడు కూర్మి నిచ్చు
నట్టి పినతండ్రి యే,హిరణ్యాక్షు డు పిన
తండ్రి యేగ ప్రహ్లాదుడు తలచి నంత,
ననుచు బంధుత్వములు తెల్పె తనదు శిష్య
తతులకు ముదము నొందుచు తపసి యొకడు
పౌర్ణమిఁ శుండను గ్రోలిన
రిప్లయితొలగించండిపూర్ణయ్యయె పలికెనిట్లు మూర్ఖప మాటల్
కర్ణకఠోరముగా నది
కర్ణుఁడు పినతండ్రి గాఁడె కౌంతేయులకున్.
పూర్ణారోగ్యము తోడనున్న ఖలుడే ప్రోయాలుఁ వంచించుచున్
రిప్లయితొలగించండిస్వర్ణమ్మంతయు నమ్మి మద్యము సదాపానమ్మునే చేయునా
పూర్ణేశుండనువాడు వాగెనిటులన్ మూర్ఖంబుగా జూడరా
కర్ణుండే పినతండ్రి పాండవులకున్ గాంగేయుఁడే మామయౌ
కర్ణా!కర్ణ కఠోరమైన కథలన్ ఖండించగా రమ్మురా
రిప్లయితొలగించండివర్ణింపంగ నసాధ్యమౌ కటకటా!బంధమ్ములన్ మార్చెరా
పర్ణంబుల్ గొని పైత్యమెక్కి సఖుడే వల్లించె నీరీతిగా
*కర్ణుండే పినతండ్రి పాండవులకున్ గాంగేయుఁడే మామయౌ*
తిరుక్కోవళ్ళూరు శ్రీహర్ష
వర్ణ౦బుల్ తెలియకనే
రిప్లయితొలగించండిపర్ణ౦బుల్ తినుచు దేహ భ్రా౦తియె లేకన్
వర్ణన చేయగ మొదలిడె
కర్ణుఁడు పినతండ్రి గాఁడె కౌంతేయులకున్
క్రొవ్విడి వెంకట రాజారావు:
రిప్లయితొలగించండిపూర్ణమసుని కాత్మజుడే
కర్ణుడు; పినతండ్రి గాడె కౌంతేయులకున్
కర్ణుని సహజన్ములునై
వర్ణన కెక్కిన వరీయ పాండవ పితయే?
వర్ణింప నీవియుదధియె
రిప్లయితొలగించండినిర్ణయము జనకసముండు నెమ్మిని భువిలో
పూర్ణపురుషు డేరిసఖుడు?
కర్ణుడు,పినతండ్రిగాదె,కౌంతేయులకున్ !
వర్ణాటుండొకడా సభాంగణమునన్ వాచాలతన్ జూపుచున్
రిప్లయితొలగించండివర్ణించెన్ విను భారతమ్ము నకటా బంధుత్వముల్ మార్చుచున్
"కర్ణుండే పినతండ్రి పాండవులకున్ గాంగేయుఁడే మామయౌ"
ఘూర్ణిల్లన్ మతి మద్యపానరతుడుద్ఘోషించు నెద్దేనియున్
మైలవరపు వారి పూరణ
రిప్లయితొలగించండికర్ణుండగ్రజుడగ్రజుండు పితగా గన్పట్టెడిన్ గావ., వై..
శీర్ణమ్మున్ బొనరించె సౌఖ్యముల నిస్సీ దుష్టసంసర్గియై!
స్వర్ణోక్తుల్ వచియించి మామ యన రక్షన్ జూపె భీష్ముండనన్
*కర్ణుండేపిన* తండ్రి పాండవులకున్ గాంగేయుఁడే మామయౌ "
( ఏపిన...బాధించిన )
మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి
వర్ణుండే పిత యంగరాజునకు నాపాతంగికిన్ కావునన్
రిప్లయితొలగించండికర్ణుండే పినతండ్రి పాండవులకున్, గాంగేయుఁడే మామయౌ
కర్ణున్ కన్న సవిత్రి కుంతివరుసన్ కాంచంగ ఖాయమ్ముగా
వర్ణమ్ముల్ వరుసల్ కనంగొనినచో వర్ణింప నాశ్చర్యమౌ
వర్ణుడు: సూర్యుడు, పాతంగి: యముడు
పండిత వర్యులు అంతా మీ పద్యాలు ప్రతి పదార్ధ తాత్పర్యాలు కూడా ఇస్తే బావుంటుంది
రిప్లయితొలగించండి23.07.2020
రిప్లయితొలగించండినా పూరణ ..
*కం*
కర్ణ కఠోర మగునిదియె
కర్ణుని గూర్చిటుల బల్క కలలో నైనన్
వర్ణన లిక చాలు నిటుల
*"కర్ణుఁడు పినతండ్రి గాఁడె కౌంతేయులకున్"*!!
*కళ్యాణ్ చక్రవర్తి ముంబాయి*
🙏
వర్ణింపగ ధర్మజు పిత
రిప్లయితొలగించండికర్ణుని దండ్రికి సుతుడగు కాలయముండా
కర్ణింపుము మరి యికనా
కర్ణుఁడు పినతండ్రి గాఁడె కౌంతేయులకున్
పూర్ణ మనస్కుడు గాకన్
రిప్లయితొలగించండికర్ణములవి లేని వాడు కక విక రీతిన్
తూర్ణము తా బల్కె నిటుల
కర్ణుడు పిన తండ్రి గాడె కౌంతేయుల కున్
కర్ణుడుకుంతికిసుతుడని
రిప్లయితొలగించండికర్ణములకుసోకలేద?కాంతా!నీకున్
కర్ణకఠోరములిట్లన
కర్ణుడుపినతండ్రిగాదెకౌంతేయులకున్
మిత్రులందఱకు నమస్సులు!
రిప్లయితొలగించండిపూర్ణంబైన మనంబుతోడ నెపుడున్ బోరాటమున్ మాన్ప సం
కీర్ణంబైన మనంపు టగ్రజుని సత్కృత్యంపు మార్గంబులన్
దూర్ణంబే తగఁ బూనఁజేయును వికర్ణుండే! విపూర్వంపుఁ ద
త్కర్ణుండే పినతండ్రి పాండవులకున్! గాంగేయుఁ డే మామయౌ?
మా అమ్మాయిలు ఫాల్కురికి సోమనాధుడు రచించిన బసవేస పాహిమాం (అక్షరాంక పద్యాలు నేర్చుకుంటున్నారు) వాటిలో నాలుగు పద్యాలు మాత్రమే దొరికినవి. మిగిలిన పద్యాలు దొరికిన యెడల పంపగలరు. మా పెద్ద అమ్మాయి పఠించిన పాషాణ పంచకం లింక్ కింద ఇచ్చుచున్నాను . దయచేసి మిగిలిన పద్యాలు మీ దగ్గర ఉన్న యెడల పంపగోరుచున్నాను. మీ దగ్గర లేని యెడల ఎక్కడన్నా లింక్ ఉంటె పంపగలరని మనవి .https://www.facebook.com/100001404231510/videos/3257809807609128
తొలగించండిఆర్యా...నమస్సులు! మీ అమ్మాయికి నా ఆశీస్సులు! నాకు కూడా మీరు తెలిపిన నాలుగు పద్యాలు మాత్రమే దొరికాయి. అయితే వాటి ప్రతిపదార్థతాత్పర్యవిశేషములతో దొరికినవి. కేవలం పద్యం పఠించడం కన్న ఆ పద్యం యొక్క అర్థం తెలుసుకొని పఠిస్తే ఇంకా అద్భుతంగా వుంటుదని భావించి, ఆ లింకులు ఈ క్రింద ఇస్తున్నాను... స్వీకరించగలరు. ఇవి శ్రీకాకుళంలోని నా మిత్రులు శ్రీ వల్లూరు మురళిగారి బ్లాగులోనివి.
తొలగించండి1. http://kadharachayitha.blogspot.com/2018/02/1-2-3-4.html
2. http://kadharachayitha.blogspot.com/2018/02/blog-post_26.html
3. http://kadharachayitha.blogspot.com/2018/02/blog-post_35.html
4. http://kadharachayitha.blogspot.com/2018/02/blog-post_96.html
అలాగే మీ వాట్సప్ చరవాణి సంఖ్య తెలిపినట్లయితే...షడ్జామడ్జఖరాడ్జ...శ్లోక పంచకము pdf...ప్రతిపదార్థయుక్తముగ పంపగలను.
తొలగించండినా వాట్సప్ చరవాణి సంఖ్య: 6301264676 దీనికి పంపగలరు.
కృతజ్ఞతలు. మీరు పంపిన లింకులు రెండు రోజుల క్రితమే చూడడము జరిగినది. ఆ లింకుల నుండి నేను శంకరాభరణం గారి బ్లాగ్ లోకి వచ్చితిని.
తొలగించండినా వాట్స్ అప్ నెంబర్ 919490702244
షడ్జామడ్జ పంచకం లో 4 శ్లోకాలు నేర్చుకున్నది . కానీ అవి ఎంత వరకు సరి ఐనవో తెలియదు. మీలాంటి వారి సహాయముతో మా అమ్మాయిలు మరిన్ని శ్లోకాలు నేర్చుకుంటారు
ఈ శ్లోకం కూడా నేర్పించండి...
తొలగించండిభూభృద్భ్వీట్కుధరోద్ధరోద్ధత సురద్విట్చిచ్చిరభ్రాడ్ధనుః
పృథ్వీడ్ధ్రేడ్ధృతిరోషధీడృగురు రుగ్వక్త్రక్షరేడక్షరః
హర్యక్షాధిపరాక్షసేడనుచరః సద్ధృక్తి దృగ్ధన్వభి
ద్భూజాభ్రాడధికం శ్రియం దిశతువో రామోఽభిరామోన్వహం!
[దీనిని నేను మా గురువుగారు అష్టావధాని స్వర్గీయ డా. ఇందారపు కిషన్ రావు గారు మూడుసార్లు పఠిస్తే విని నేర్చుకున్నాను.]
వర్ణింపందగ నీవికిన్ నుదధిగా వర్జింప ద్రాణాదులన్
రిప్లయితొలగించండిపూర్ణంబైన విధేయతన్ గొలువగా పుణ్యుండు దాసీజుడే
పూర్ణుండై కడదాకనిల్చిన యశోభూషుండు దాకుంతికిన్
కర్ణుండే,పినతండ్రి పాండవులకున్,గాంగేయుడే మామయౌ!
అర్ణవ గంభీరము లా
రిప్లయితొలగించండికర్ణింపుము తమిఁ బురాణ గాథలను బృహ
త్కర్ణా యౌను నిజంబే
కర్ణుఁడు పినతండ్రి గాఁడె కౌంతేయులకున్
కర్ణశ్రేయ వచో యుధిష్ఠిరుఁడు దా కాలాత్మజుండే కదా
కర్ణాఖ్యుండు సుతుండు సూర్యునకు దాఁ గాఁ, బుత్రుఁడే దండ నో
త్తీర్ణుండైన యముండు సూర్యునకుఁ గుంతీదేవి కింపారఁగాఁ,
గర్ణుండే పినతండ్రి పాండవులకున్, గాంగేయుఁడే మామయౌ
అమిత యశస్క ఆద్యయన ఇద్రుచి ఈశ్వర ఉగ్ర ఊర్జిత
తొలగించండిక్రమ ఋషభాంక ౠజిహర ఌస్తిత ౡస్మిత ఏకరుద్ర ఐం
ద్రమహిత రూప ఓమితి పదద్యుతి ఔర్వ లలాట అంబికా
సమరసభావ అఃకలిత వర్ణనుతం బసవేశ పాహిమాం!!
కృతజ్ఞతలండీ
తొలగించండిసర్వ జగద్రక్షకుడు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు దేవ దేవుడు శ్రీ వేంకటేశ్వర స్వామిని కీర్తిస్తూ పద్యాలు సంకలనం చేయించాలి అనుకుంటున్నాను గోవిందాక్షర శతకం : అక్షరానికి వంద పద్యాలు
ఛందస్సు : మీ ఇష్టం
భాష : తేట తెలుగు, సంస్కృతం , ద్విభాషా మిళితం
మొదటి శతక పద్యం: (అకార పద్యాలు వంద సేకరిస్తాము)
అక్షరములోని ప్రతి పదమూ "అ" తో మొదలవ్వాలి లేదా "అ కార అక్షరము" తో మొదలవ్వాలి.
పద్య భావము వేంకటేశ్వరుని కీర్తిస్తూ కానీ స్వామి రూపాన్ని వర్ణిస్తూ కానీ స్వామి లీలలు తెలుపుతూ కానీ ఉండాలి.
ప్రతి పదార్ధ భావాలూ కూడా పద్యముతో పాటూ తెలపాలి
మాకు అందిన పద్యాల ను వీడియో సంకలనం చేస్తాము. ప్రతీ పద్యముతో పాటూ రచయిత /రచయిత్రి పేరు ముఖ చిత్రము మరియు వారి వివరాలు వీడియో లో నిఖిప్తం చేస్తాము
గమనిక : ఒకరు ఎన్ని పద్యాలు అయినా రాయవచ్చు
send your poems to slokalupadyalu@gmail.com / slokalu@rcsindia.co.in
Whats app : 9490702244
కర్ణుండేపినతండ్రిపాండవులకున్గాంగేయుడేమామయౌ
రిప్లయితొలగించండికర్ణుండౌనుగపాండవోత్తములకున్గంజాక్షునాశీసులన్
వర్ణంబించుకజూడకౌనటగదాభ్రాతాగ్రజుండౌటసూ
కర్ణుండారయకుంతిపుత్రుడుభువిన్గాంతావిలోకించుమా
కం.
రిప్లయితొలగించండికర్ణుడు యెవరని యడుగగ
కర్ణాటకుడసహనమున కస్సున బలికెన్
కర్ణా కర్ణీ వింటిని
కర్ణుడు పైన తండ్రి గాడె కౌంతేయునకున్
వై. చంద్రశేఖర్
కర్ణుడు యెవరని / కర్ణున్డెవరని గా చదువగలరు
తొలగించండికందం
రిప్లయితొలగించండివర్ణించన్ రవి సుతులుగఁ
గర్ణుని యమునిన్ వరుసలు, కంకుని పరమై
నిర్ణయముఁ జేయు వారికి
కర్ణుఁడు పినతండ్రి గాఁడె కౌంతేయులకున్!
పండిత వర్యులు అంతా మీ పద్యాలతో పాటూ ప్రతి పదార్ధ తాత్పర్యాలు కూడా ఇస్తే బావుంటుంది. పామరులకు అర్ధం అవుతుంది
తొలగించండిశార్దూలవిక్రీడితము
రిప్లయితొలగించండిపూర్ణమ్మౌ గతి సత్యభాషణమదే పొల్పార చెప్పవ్గదే
నిర్ణేతల్ సగ పాదమే తగుననన్ నీకీ జవాబిచ్చెదన్
కర్ణుండున్ యముడున్ దినేశుసుతులై కవ్పించు ధర్మమ్మునన్
గర్ణుండే పినతండ్రి పాండవులకున్! గాంగేయుఁ డే మామయౌ?
పండిత వర్యులు అంతా మీ పద్యాలతో పాటూ ప్రతి పదార్ధ తాత్పర్యాలు కూడా ఇస్తే బావుంటుంది. పామరులకు అర్ధం అవుతుంది
రిప్లయితొలగించండికర్ణుడు రవిపుత్రుడు సమ
రిప్లయితొలగించండినిర్ణయవర్తి యము ననుజునిగతా బుట్టె సం
కీర్ణుడును ధర్మజాగ్రజ
కర్ణుడు పినతండ్రిగాడె కౌంతేయులకున్!
స్వర్ణత్రాణము దాల్చి బుట్టె నెవరో? వావేమి నందుండు తా
రిప్లయితొలగించండివర్ణింపంగ సుభద్రకున్? జయముసంప్రాప్తించెనెవ్వారికిన్?
కీర్ణమ్మౌశరతల్పుడెవ్వడట? చక్రేమౌను సౌభద్రుకున్ ?
కర్ణుండే, పినతండ్రి, పాండవులకున్, గాంగేయుడే, మామయౌ !!
According to the Harivansa Purana, Vasudeva and Nanda (who took care of Krishna during his early years as a child) were brothers
రిప్లయితొలగించండి