19, జులై 2020, ఆదివారం

సమస్య - 3431

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"చీర విప్పి చూపెఁ జెలువ మతివ"
(లేదా...)
"చీరను విప్పి చూపినది చెల్వము నా సతి యెల్లవారికిన్"

59 కామెంట్‌లు:


 1. నడిరేయి సరదా పూరణ:

  భారిగ పింఛనొందగను బంజర హిల్సున నేను తీయగా
  చారెడి మోమునున్ గొనుచు జల్తరు పట్టుది చేతబట్టుచున్
  పోరుచు తోడికోడలిని పొందుగ నవ్వుచు నాడబిడ్డతో
  చీరను విప్పి చూపినది చెల్వము నా సతి యెల్లవారికిన్

  రిప్లయితొలగించండి

 2. ఆటవిడుపు సరదా పూరణ:
  (జిలేబి గారికి అంకితం)

  కోరిక తీరగా పిలిచి గుట్టుగ నుండక కంబుకంఠులన్
  తీరుగ పేరటమ్మునను తీయగ రాగము లెల్లవారలున్
  బోరును మాపగన్ తుదకు బొమ్మల కొల్వున గొల్లభామదౌ
  చీరను విప్పి చూపినది చెల్వము నా సతి యెల్లవారికిన్

  రిప్లయితొలగించండి
 3. చీరల కొట్టునందు పనిజేయు కుమారి సరోజ నవ్వుచూ
  "భారము గాక గౌరవము పైకముకున్ సరితూగు" నంచు మై
  సూరుది పట్టు యంచు నెర చుక్కలు నిండిన యాకుపచ్చదౌ
  చీరను విప్పి చూపినది చెల్వము నా సతి యెల్లవారికిన్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'నవ్వుచూ' అనడం సాధువు కాదు. "నవ్వుచున్" అనండి. 'పైకమునకున్' అనడం సాధువు. అక్కడ "పైకముతో సరితూగు" అనవచ్చు.

   తొలగించండి
 4. సమస్య :-
  "చీరను విప్పి చూపినది చెల్వము నా సతి యెల్లవారికిన్"

  *కందం**

  అతి సుందరమైనత్యు
  న్నత చీరను విప్పి చూపినది చెల్వము నా
  సతి యెల్లవారికిన్ నా
  పతి దెచ్చెననుచు మురియుచు ప్రకటించు కొనెన్
  ..‌..‌‌............✍️చక్రి

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. ఉత్పలమాలా పాదాన్ని కందంలో ఇమిడ్చిన మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   "అతిసుందరమౌ నత్యున్నత..." అనండి.

   తొలగించండి
 5. సమస్య :-
  "చీరను విప్పి చూపినది చెల్వము నా సతి యెల్లవారికిన్"

  *ఉత్పలమాల**

  కూరలు పండ్లు ధాన్యములు కొన్నను భార్యకు ప్రేమ లేదులే
  బీరము తోడ చీరనిక బేరము జేసితి భార్య ప్రేమకై
  చీరను దెచ్చిన క్షణమె చేరిన వారికి సంతసంబుగన్
  చీరను విప్పి చూపినది చెల్వము నా సతి యెల్లవారికిన్
  ..‌..‌‌............✍️చక్రి

  రిప్లయితొలగించండి
 6. ఆ.వె//
  అతివలంత గూడి పతుల నొదలివైచి
  చీరలమ్ము వాని చెంతజేరి l
  పట్టుకొన్న చీర పనికిరానివనుచు
  చీర విప్పి చూపెఁ జెలువ మతివ ll

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'వదలి'ని 'ఒదలి' అనరాదు. "పతుల నుపేక్షించి" అనండి.

   తొలగించండి
 7. ఆ.వె//
  క్రొత్తచీరనందు కోలాహలముజేసె
  కాళ్ళజెర్రిదూరి క్రమముగాను l
  పరుగుబెట్టుచుండ పట్టుట దెలియక
  చీర విప్పి చూపెఁ జెలువ మతివ ll

  రిప్లయితొలగించండి
 8. (మొన్న నా సప్తతి జన్మదినోత్సవానికి క్రొత్త బట్టలు తీసుకొమ్మని సోదరి జి. సీతాదేవి గారు, పుత్రికాసమానురాలు నమ్మి మధుబాల, మిత్రులు కోట రాజశేఖర్ గారు డబ్బులు పంపించారు. బట్టలు కొనడానికి బయటకు వెళ్ళాలంటే మా వృద్ధాశ్రమం వాళ్ళు అనుమతి ఇవ్వలేదు. నా కోరికపై భానుప్రకాశ్ దంపతులు నాకు, నా భార్యకు బట్టలు కొన్నారు. జన్మదినోత్సవంలో పెట్టిన ఆ పట్టుచీర మా ఆవిడకు నచ్చింది)
  కూరిమితోడ పంపిరదె క్రొత్తవి బట్టలకై ధనమ్ము, నేఁ
  గోరఁగ భార్యతోఁ జనెను కొట్టుకు భాను ప్రకాశు, 'సప్తతిన్'
  జేరిన బంధుమిత్రులు విశేషముగా నుతియింపఁ బెట్టినన్
  జీరను విప్పిచూపినది,చెల్వము 'నా' సతి యెల్లవారికిన్

  రిప్లయితొలగించండి
 9. భూరిగ గట్టిరో గృహము భూతల స్వర్గమనంగ; కోర్కెలున్
  తీరక గూర్చిరెన్నికగ ధీటగు నూతన వస్తుజాలమున్,
  తీరని వాస్తుకన్చు గొనితెచ్చిన కొత్తని నీటికుండలో
  చీరను విప్పి చూపినది చెల్వము నా సతి యెల్లవారికిన్

  చీర = చేప

  ****†**********************************


  వ్యాఘ్రుగ బుట్టె నీ వరుడు వాసిధనాఢ్యుగ తా ధనిష్ఠ యం
  దున్ ఘ్రుణియంగ చిత్తభజతో కరమందగ గాంచెనో సుతున్
  శీఘ్రమె విష్ణు ఋక్షమున శ్రీలను గూర్చగ నెంచిచూడ నీ
  వ్యాఘ్రము సింహమున్ గలియ వానరు డొక్కడు పుట్టె వింతగన్

  వ్యాఘ్ర = స్వకుల శ్రేష్ఠుడు.
  ధనిష్ట = ఈ నక్షత్రంలో పుట్టిన యోని సింహమగును.
  ఘ్రుణి = మెరుపు
  చిత్తభజ = చిత్తా నక్షత్రంలో పుట్టిన కన్య (పులి యోని)
  విష్ణు నక్షత్రం = శ్రవణ నక్షత్రంలో జన్మించిన కోతి యోని.

  ఈ విధంగా పై సమస్యను అనుసరించి చూడగా సింహమునకు పులికిని కోతి పుట్టినది చిత్రమే కదా !

  రిప్లయితొలగించండి
 10. వివిధ చీర లమ్ము విపణిబోవ నచట
  చీర విప్పి చూపెఁ జెలువ ; మతివ
  లందరికి వేరువేరుగ లాలసముకు
  తగిన రీతిబన్నుచు వాటి ధరలదెలిపె

  చెలువము = అందము

  రిప్లయితొలగించండి


 11. ఆరణి పట్టుచీరకొనగా మురిపెంపు విహార యాత్రలో
  చీరను విప్పి చూపినది చెల్వము నా సతి యెల్లవారికిన్
  కోరిక తీర్చె నామగడు కోమలులార యటంచు, ముద్దమం
  దారపు టౌసు మారెనుగదా పులకోద్గమ పల్లవోష్ఠియే  మా అయ్యరు గారి వ్రాలుగా
  జిలేబి

  రిప్లయితొలగించండి
 12. పూర్వ కాలమ్ము చీరలు పురుషులమ్మ
  నేడు వనితలె వ్యాపార నేతలైరి
  చీర కొనగను నే పోయి బేరమాడ
  చీర విప్పి చూపెఁ జెలువ మతివ

  రిప్లయితొలగించండి
 13. పచ్చరంగుపైన పసిడివర్ణపు పూల
  పేనవాహి నచ్చె విసుగు కొనక
  మడత విప్పి చూపు మగువ నాకనగనె
  చీర విప్పి చూపెఁ జెలువ మతివ

  రిప్లయితొలగించండి


 14. అతివలు గూడిరి దర్పో
  న్నతి! చీరను విప్పి చూపినది చెల్వము నా
  సతి యెల్లవారికిన్ గు
  బ్బెతలార విహారయాత్ర విస్మయ మిదియౌ  జిలేబి

  రిప్లయితొలగించండి
 15. ఉత్పలమాల
  శ్రీరఘు రామ కావ్యము సచిత్రముగా కను విందు జేసెడున్
  జేరిక కంచిపట్టుజరి చీరఁ బ్రశస్తమనంగ నేయఁగన్
  గూరిచి మాత జానకికిఁ గూరిమి దెచ్చితటంచు భక్తితో
  చీరను విప్పి చూపినది చెల్వము నా సతి యెల్లవారికిన్

  రిప్లయితొలగించండి
 16. రిప్లయిలు
  1. ఉ.బారెడు వెండి పల్లు నిడి పన్నుగ నేసిన పట్టు చీరనున్
   కోరి క్రయించి పిల్లలిట కూరిమి నింపుచు కాన్క నివ్వ స
   త్కారముగా దలంచి మమకారము పొంగగ పెట్టెలోని యా
   చీరను విప్పి జూపినది చెల్వము నా సతి యెల్ల వారికిన్

   తొలగించండి
 17. మైలవరపు వారి పూరణ

  చీరను జేసి యూయలగ., చిన్నకుమారు పరుండజేసి., య..
  న్నారియు వేసెడిన్ ముడుల నమ్ముచు బిడ్డడు దొర్లునంచటన్!
  కోరగ ప్రక్కయిండ్లగల కోమలులా పసివాని జూడగా
  చీరను విప్పి చూపినది చెల్వమునా సతి యెల్లవారికిన్.!!

  మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

  రిప్లయితొలగించండి


 18. బతుకు దుర్భరమ్ము పతియె కొట్టెననుచు
  చీర విప్పి చూపెఁ, జెలువ మతివ
  చూప గాను నిండు చూలాలి పైన పో
  లీసు మానవతి కులీనురాలు


  జిలేబి

  రిప్లయితొలగించండి
 19. బూరెలు లడ్డులు న్మరియు పొల్పుగ జేసిన పిండివంటలన్
  సారెకు బంపినా రుమును చక్కని చుక్కను సాగనంపుచున్,
  వేరుగ నాడబిడ్డకును బెట్టిన జక్కని యంచులన్ గలన్
  చీరను విప్పి చూపినది చెల్వము నా సతి యెల్లవారికిన్

  కొరుప్రోలు రాధాకృష్ణరావు

  రిప్లయితొలగించండి
 20. చేరిన సుందరాంగనలు స్నేహితు రాలిని వెక్కిరించుచున్
  భూరిగ ఖర్చుచేసితివి బుట్టను కుట్టగ పాత కోకకున్
  సౌరును గాంచనెంచితిమి సత్కృపఁ జూపుమటంచనంగనే
  చీరను విప్పి చూపినది చెల్వము నా సతి యెల్లవారికిన్.

  రిప్లయితొలగించండి
 21. పతియు తెఛ్చి నట్టి పట్టు చీరను మెచ్చి
  పొంగి పోయె సతియు పొల్పు గాను
  పొరుగు వారి బిల్చి మురిప మొల్కగ దాను
  చీర విప్పి జూపె జెలువ మతివ

  రిప్లయితొలగించండి
 22. సరిజేసితిని గురూజీ 🙏🙏🙏
  ✍ మల్లి సిరిపురం శ్రీశైలం,
  ఆ.వె//
  అతివలంత గూడి పతుల నుపేక్షించి
  చీరలమ్ము వాని చెంతజేరి l
  పట్టుకొన్న చీర పనికిరానివనుచు
  చీర విప్పి చూపెఁ జెలువ మతివ ll

  ఆ.వె//
  క్రొత్తచీరయందు కోలాహలముజేసె
  కాళ్ళజెర్రిదూరి క్రమముగాను l
  పరుగుబెట్టుచుండ పట్టుట దెలియక
  చీర విప్పి చూపెఁ జెలువ మతివ ll

  రిప్లయితొలగించండి
 23. 18.07.2020
  అందరికీ నమస్సులు🙏

  *ఆ వె*

  కొంగునున్న ధనము కోరగ పతితాను
  లేదు పొమ్మననుచు లేచి వెళ్లె
  వట్టి మాటలనుచు వాదన జేయగా
  *"చీర విప్పి చూపెఁ జెలువ మతివ"*

  *కళ్యాణ్ చక్రవర్తి, ముంబాయి*
  🙏😊🙏

  రిప్లయితొలగించండి
 24. చీరల నమ్మగా గృహము చేరి పసందుగ మాటలాడుచున్
  బేరములాడువారలకు పెచ్చుధరన్ కథియించి తగ్గుచున్
  కోరిన వారికిన్ వలువ కొంగు జరీని గురించి చెప్పుచున్
  చీరను విప్పి చూపినది చెల్వము నా సతి యెల్లవారికిన్

  రిప్లయితొలగించండి
 25. ధర్మవరపు చీర దార కొసగినంత
  మదిని మురిసిపోయి మగని మెచ్చి
  నిరుగుపొరుగువారి నింపుగా పిలుచుచు
  *చీర విప్పి చూపి చెరువు మతివ.*

  మరొక పూరణ

  కాంత లెల్ల చేరి కాంచీపురము నందు
  పట్టు చీరలు గొని పదిలముగను
  కొంగు చూపుమనుచు కొట్టు వారిని కోర
  *చీర విప్పి చూపె చెలువు మతివ*

  రిప్లయితొలగించండి

 26. పిన్నక నాగేశ్వరరావు.

  వారము వారమున్ వనిత వచ్చుచు
  నుండును చీరలమ్మగా
  తీరుగ నొక్క యింటికడ తెచ్చిన మూటను
  దించనచ్చటన్
  చేరిన యమ్మలక్కలకు చీరలు చూపుచు
  వాటి నాణ్యతన్
  నేరుపు మీర చెప్ప గమనించుచు దృష్టికి
  నచ్చినట్టి యా
  చీరను విప్పి చూపినది చెల్వము నా సతి
  యెల్ల వారికిన్.

  రిప్లయితొలగించండి
 27. తనదుకూతులతకుదానుకొనినయట్టి
  చీరవిప్పిచూపెచెలువమతివ
  పసిడిరంగుకలిగిపట్టుచీరనుబోలి
  ధగధగలుగమెఱపుదలిరుదాని

  రిప్లయితొలగించండి
 28. మనసుమర్మమెఱిగిమాయనుఁబోఁద్రోచి
  మరగుచున్నమదినిమాటుఁజేసి
  సాధకుండుతనకుశాంతినివెదకుచు
  చీరవిప్పిఁజూపెచెలువంతివ

  రిప్లయితొలగించండి
 29. గారము మీర చీర గొని కానుకగా నొసగంగ నామెకున్
  మేరలు దాటె సంతసము, మేలిమి బంగరు వన్నె యంచులున్
  తారల రీతి వెల్గు జలతారు మెరుంగుల కొంగు జూడుడన్
  చీరను విప్పి చూపినది చెల్వము నా సతి యెల్లవారికిన్

  రిప్లయితొలగించండి
 30. చీర కట్ట తలచె చిన్నారి యొకనాడు!
  అక్క చెంత చేరి యణుకువగను|
  చిన్న చెల్లి యడుగ చీరకట్టు విధము|
  చీర విప్పి చూపె జెలువ మతివ!

  రిప్లయితొలగించండి
 31. కారముచేడునందుగలగాంతునివాట్సపుజేరదాదగన్
  జీరనువిప్పిచూపినదిచెల్వమునాసతియెల్లవారికిన్
  మీరెనుబట్టునావలువమెచ్చిరియందఱుదానిజూచియున్
  నారయయాడవారుదమహర్షముతోడనెకొందురేగదా

  రిప్లయితొలగించండి
 32. ఈ నాటి శంకరా భరణము వారి సమస్య


  చీర విప్పి జూపె జెలువ మతివ  నర్తన శాలలో కీచకునికి భీముడు తాను కట్టుకొన్న చీర విప్పి నిజ స్వరూపము చూపు సందర్భము

  ఇచ్చిన సమస్య ఆట వెలది నా పూరణము సీసములొ


  శయ్యాగృహమునందు చంద్రికా సుమమాల
  సౌరభ ములు వెద జల్లు చుండ


  సయ్యాట లన్ కోరి జవ్వని సైరంధ్రి వచ్చెగా
  తాకోరి ననుకొని తలచి కొనుచు


  వొయ్యార ముగ మధు పుణికిని పట్టి కీ
  చకుడుమోదమ్ముతో సరస గతిని


  వెయ్యగ చెయ్యిని ,భీముడు రూపమున్
  వేగముగా(చీర విప్పిజూపె
  జెలువ మతివ) యనుకొనుచు కొలకు లాడ

  బోవ గా యెదుట బడిన పురుష పుంగ

  వునుని గాంచిన కీచక మనము లిప్త

  కాలము బెదరి గుండియ గతిని తప్పె

  రిప్లయితొలగించండి
 33. భర్త మెప్పు కన్న పడతి కేమున్నది
  పుడమి నెంచ నెందుఁ గడు ముదమ్ము
  బుజ్జగించి నాథుఁ బూర్ణచంద్రానన
  చీర విప్పి చూపెఁ జెలువ మతివ


  నారుల కెంచఁ జీర లవి నచ్చిన నాథుని నెత్తి మొత్తి తా
  రోరిమి కూల్చి కూల్చి కొన నొప్పికొనంగను జేయ వింతయే
  వారక వేఁడి వేఁడి పతిఁ బట్టుది క్రొత్తగఁ గొన్న దట్టిదౌ
  చీరను విప్పి చూపినది చెల్వము నా సతి యెల్లవారికిన్

  రిప్లయితొలగించండి
 34. పడతిభర్తతోడబట్టలకొట్టులో
  పట్టుచీరకొనగబయలుదేరె
  అన్నిచీరలందునందమైయొప్పిన
  చీర విప్పి చూపెఁ జెలువ మతివ

  రిప్లయితొలగించండి
 35. ఆటవెలది
  వనము కేగు సీత పట్టుకు రమ్మన్న
  నార చీరఁ దెచ్చి చేరి దాసి
  లక్షణమయిన దనుచు రాముఁడు మెచ్చెడు
  చీర విప్పి జూపెఁ జెలువమతివ

  రిప్లయితొలగించండి
 36. వారిజనేత్రలార్వురొకవస్త్రదుకాణముకేగి నచ్చటన్

  చీరెలుజూడనందునొక చీరెనుజూపుచునిన్నరాత్రి
  మా
  వారిటువంటిదేగొనుకవచ్చిరటంచునుజెప్పిగొప్పగా

  చీరెనువిప్పిజూపినది చెల్వమునాసతియెల్లవారికిన్

  రిప్లయితొలగించండి
 37. వారిజనేత్రలార్వురొకవస్త్రదుకాణముకేగి నచ్చటన్

  చీరెలుజూడనందునొక చీరెనుజూపుచునిన్నరాత్రి
  మా
  వారిటువంటిదేగొనుకవచ్చిరటంచునుజెప్పిగొప్పగా

  చీరెనువిప్పిజూపినది చెల్వమునాసతియెల్లవారికిన్

  రిప్లయితొలగించండి
 38. కోరికతీరనామగఁడుకొన్నదిపచ్చని పట్టుచీరయిం
  పారగ నేత్రపర్వముగపండుగరోజునదాల్తునంచునా
  వారిజనేత్రసంతసము వావిరియైవినువీధినంటగన్
  చీరను విప్పి చూపినది చెల్వము నా సతి యెల్ల వారికిన్

  రిప్లయితొలగించండి
 39. ఉ:

  సారము నెంచి భూమిగత సాగును సేయన విత్తు నాటగన్
  మారెను రూపురేఖలును మస్తుగ బెర్గిన పైరు జూడగన్
  కూరిమి లేత యెండ నట గోచరమాయెను నేలతల్లి తా
  చీరను విప్పి జూపినది చెల్వము నా సతి యెల్లవారికిన్

  వై. చంద్రశేఖర్

  రిప్లయితొలగించండి
 40. ఆగమాగమగుచు అర్ధరాతిరివచ్చె
  తాగి తందనాల తనదు మగడు
  జీర విప్పిచూపెఁ జెలువమతివ గాంచి
  మనసు జివుకుమనగ మౌనియయ్యె!

  రిప్లయితొలగించండి
 41. పుట్టిన దినమంచుఁ పుత్తెంచె వెనకాల
  మగడు దెచ్చినట్టి మడత పట్టు
  చీర విప్పిచూపెఁ జెలువమతివ యంత
  నేతగానియోర్పునునేర్పునలర!

  రిప్లయితొలగించండి
 42. మంగళూరు పట్టు మాంగళ్య షోరూము
  చీర విప్పిచూపెఁ జెలువమతివ
  మెచ్చిగట్టెయంచు మేల్మిబంగరు జరి
  కనుజిగేలుమనగ కలిగె దిష్టి!

  రిప్లయితొలగించండి
 43. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

  రిప్లయితొలగించండి