3, జులై 2020, శుక్రవారం

సమస్య - 3416

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"వానరులనుఁ గాంచి వగచఁ దగునె"
(లేదా...)
"వానర జాతిఁ గాంచి కడు వంతనుఁ జెందుట నీకు యుక్తమే"

59 కామెంట్‌లు:


 1. నడిరేయి సరదా పూరణ:

  కానగ పార్లమెంటునహ కాంగ్రెసు నేతయె కన్నుగొట్టగన్
  పూనుచు తెల్ల చీరనటు పోకిరి మాటల తిట్టు దీదినిన్
  చీనుల గంతులన్ గనుచు చీదర నొందెడి మోడివర్యుడా!
  వానర జాతిఁ గాంచి కడు వంతనుఁ జెందుట నీకు యుక్తమే?

  రిప్లయితొలగించండి
 2. ఎల్ల లోకములును గాళ్ళక్రిందఁగలవు!
  పరమ శివున కాప్త భక్తుఁడవవు
  రావణాఖ్యుఁడ విటు రాఘవులను, వారె
  వా! నరులనుఁ గాంచి వగచఁ దగునె!

  రిప్లయితొలగించండి


 3. కందోత్పల


  తృటిలో నిన్నే మరచి య
  కట! వానర జాతిఁ గాంచి కడు వంతనుఁ జెం
  దుట నీకు యుక్తమేనా
  పటపట పళ్ళుకొరుకుట నుభయులొకరేగా!


  జిలేబి

  రిప్లయితొలగించండి


 4. కందాట


  చెవులను ముక్కును గోకుచు
  ప్రవరుల మని తలచుచునరె వానరు లనుఁ గాం
  చి వగచఁ దగునె నరులు? తమ
  ప్రవర్తనలకు ప్లవగములె వైనము కాదే?


  జిలేబి

  రిప్లయితొలగించండి
 5. వనములెల్లనరుకవానరజాతికి
  ముప్పువచ్చెనేడుముదితవినవె
  నిలువనీడలేకనీరీతివచ్చెడి
  వానరులనుగాంచివగచతదగునె

  రిప్లయితొలగించండి

 6. ఆటవిడుపు సరదా పూరణ:
  (జిలేబి గారికి అంకితం)

  పూనుచు నర్ధరాత్రులను పోకిరి తీరుల దూషణమ్ములన్
  సోనియ పుత్రునిన్ తెగడి జోకులు వేసెడి శాస్త్రివర్యునిన్
  కానగ తెల్లవారగనె గాభర నొందని శంకరయ్య సార్!
  వానర జాతిఁ గాంచి కడు వంతనుఁ జెందుట నీకు యుక్తమే?

  రిప్లయితొలగించండి
 7. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

  రిప్లయితొలగించండి
 8. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

  రిప్లయితొలగించండి
 9. వచ్చిరట శిశుతుల్యులు వానర తతి

  తోడ నిచటకు ,లంకకు కీడు కలుగు,

  చెలిమి భావ్యమా? తులువా! నరులను గాంచి

  వగచ దగునె యీవనుచు రావణుడు నప్పు

  డా విభీషణున్ గని రౌద్రు డై పలికెను

  రిప్లయితొలగించండి
 10. లంకకు తెచ్చిన లలనతో కలుగు నాపద,నాశనంబుగు వంశ మిపుడు,


  గ్రుంకక ముందుగ కూరిమి‌ కోరుచు సీతను పంపుము చెలిమి తోడ,

  శంకను బడయక శరణం బనుచు రాము పాదముల్ ముదముగ పట్ట వలయు,


  బింకము రయముగ వీడంగ కలుగును శుభములు సతతము శోభ నిడుచు,

  ననుచు నీతులను విభీషణా ఘనముగ

  పలుకు చుంటివి ,తులువా! నరులను గాంచి


  వగచ దగునె యీవనుచు రావణుడు నప్పు

  డా విభీషణున్ గని రౌద్రుడై బలికెను

  రిప్లయితొలగించండి
 11. మంచిపనుల జేయ మనల విమర్శించ
  సహజమెగద, యదియె జరిగె నీకు,
  పలు విధములుగ నిను పరికించబూన, నీ
  వా నరులనుఁ గాంచి వగచఁ దగునె

  రిప్లయితొలగించండి


 12. తప్పు లెల్ల వెదకి తనలాగెవరు లేద
  నుకొనుచున్ భుజములను చరచుకొని
  పనికి మాలి నట్టి పనుల చేయుచు, వారె
  వా! నరులనుఁ గాంచి వగచఁ దగునె


  జిలేబి

  రిప్లయితొలగించండి
 13. పూని కృపాకటాక్షమును బ్రోవుము సంతతసర్వదేవస
  మ్మానితపార్వతీతనయ! మా మొర నిమ్ముల నాలకించి యీ
  మానవలోకహానికరమౌ క్రిమి కోవిడు ప్రాణిఁ గూల్చలే
  వా! నర జాతిఁ గాంచి కడు వంతనుఁ జెందుట నీకు యుక్తమే.

  కంజర్ల రామాచార్య.

  రిప్లయితొలగించండి
 14. పిరికి తనము తో విభీషణా నీవిట్లు
  లంక చెడునటంచు రంకెలేల?
  యసుర జాతి కదియె యవమానమౌర నీ
  వా నరులనుఁ గాంచి వగచఁ దగునె.

  రిప్లయితొలగించండి


 15. రోనెలతల్ గణేరువుల రొమ్ముల తేలెడు నిత్యభోగి నీ
  వా నర జాతిఁ గాంచి కడు వంతనుఁ జెందుట? నీకు యుక్తమే
  నా? నలు వైపు లన్ తిరిగి నచ్చని వారల తిట్టుటేలనో?
  మానవ మార్పు చెందుము సమాశ్రయ మైనది సత్యలోకమే


  జిలేబి

  రిప్లయితొలగించండి
 16. మానము లేక హీనవయి మాటున నుండిన సింధు దేశమా
  వానర జాతి గాంచి కడు వంతను జెందుట నీకు యుక్తమే?
  చైనలు గీనలేవిటను శాసన మెప్పుడు చేయరావు మీ
  సేనలు భారతావని చేరగ వట్టి కలల్ కనబోదువా హహా !

  రిప్లయితొలగించండి
 17. ధార్తరాష్ట్ర సుతులు ధర్మజాదుల తోడ
  భండనంబు సలుప కూడినపుడు
  క్రీడి వైముఖుడవ కృష్ణుడపుడనె బా
  వా ! నరులను గాంచి వగచ దగునె

  రిప్లయితొలగించండి
 18. * శంకరాభరణం వేదిక *

  03/07/2020...శుక్రవారం

  సమస్య
  ********
  వానర జాతి గాంచి కడు వంతను జెందుట నీకు యుక్తమే

  నా పూరణ. ఉ.మా.
  *** ********
  ( లంకలో తోటలను నాశము జేయచున్న. ఆంజనేయుని పట్టలేక వచ్చిన వానోతో రావణ బ్రహ్మ ఇలా పలుకుచున్నాడు. (

  ఉ.మా.

  ఈ నగరాన జొచ్చి కడు నిమ్ముగ సుందర నందనాలనే

  వానరు డొక్కడున్ జెలగి ధ్వంసము జేయుచు నుండ నయ్యయో!

  వానిని బట్ట భీతిగొని పారుచు వచ్చుట సిగ్గువేయదే??

  వానర జాతి గాంచి కడు వంతను జెందుట నీకు యుక్తమే?

  ( కడు నిమ్ముగ అనగా విరివిగ )

  -- 🌱 ఆకుల శాంతి భూషణ్ 🌱
  🌷 వనపర్తి🌷

  రిప్లయితొలగించండి
 19. కొంటె తనము చేత కూరిమి సరదాగ
  పరుల నేడి పింత్రు పడుచు వారు
  చిలిపి చేష్టలవియె చింత వలదు ర బా
  వా ! నరులను గాంచి వగచ దగునె?

  రిప్లయితొలగించండి
 20. మంచి మనసు నీదు, మనుజుల క్షేమంబె
  దలతు వీవు గాని దయనుమాలి
  నిన్ను వేతురు ,నిను నిందింత్రు నరులు, నీ
  వా నరులను గాంచి వగచ దగునె!

  రిప్లయితొలగించండి
 21. *విభీషణునితో రావణుని మాటలు గా*

  కానలలోన యున్న నరకాంతను తెచ్చితి మోహమంది, నే
  దానవ జాతి శ్రేష్ఠుడ, సదా మనవంశ యశస్సు కోరెడిన్
  మానధనుండ నైతిని, ప్రమాదమటంచు వచింపనేల, నీ
  వా నరజాతిఁ గాంచి కడు వంతనుఁ జెందుట నీకు యుక్తమే

  రిప్లయితొలగించండి
 22. ప్రాణము నన్నదమ్ములన ,వాలిని దున్మగ విందుసేయుచు
  న్పానము జేయుచు న్గులుకు వారల లీలల వీక్షణంబునన్
  మౌనము వీడిలక్ష్మణుడు మాన్యడురాముని చెంతజేరుచు
  "న్వానర జాతిఁ గాంచి కడు వంతనుఁ జెందుట నీకు యుక్తమే"

  కొరుప్రోలు రాధాకృష్ణారావు

  రిప్లయితొలగించండి
 23. కానలలో చరించుచును కందములన్ పలు పండ్లు గ్రోలుచున్
  జ్ఞానము లేక భూజముల కాండము లందున నాటలాడుచున్
  దానవజాతులన్ గనిన తద్దయు భీతిని పొందు. సోదరా
  వానర జాతిఁ గాంచి కడు వంతనుఁ జెందుట నీకు యుక్తమే ?

  రిప్లయితొలగించండి
 24. అందరికీ నమస్సులు..🙏
  03.07.2020

  నా పూరణ యత్నం..

  *ఆ వె*

  సాయమంద జేయ సంతసంబుగనొక
  ఉడుత వచ్చె భక్తి హృదిని నిండ
  ముక్తి బొందె తాను ముదముతో! సరిగాని
  *"వానరులనుఁ గాంచి వగచఁ దగునె"?*

  *కళ్యాణ్ చక్రవర్తి ముంబాయి*
  🙏

  రిప్లయితొలగించండి
 25. అన్నిరంగములనునారితేరినవాడు
  మానవుండుదాను మాన్యుడిలను
  వాని ప్రగతినీదువాత్సల్యగరిమ దే
  వా! నరులనుఁ గాంచి వగచఁ దగునె

  రిప్లయితొలగించండి
 26. వానరులన లోకువ యని వరము గోరు
  వేళ వారి నటుల విస్మరించి
  దానవులను పోర దునుముచుండగ నేడు
  వానరులనుఁ గాంచి వగచఁ దగునె

  రిప్లయితొలగించండి
 27. రావణాసురినితో మండోదరి అన్నట్టు
  ఆ నరవానరాదు లిల నల్పులటంచును లక్ష్యబెట్టకే
  యా నలువన్ వరంబడిగి యాజిని వానరయోధులెందరో
  సేనగ రాఘవోత్తమముని సేవలుసల్పగ విస్తుబోవుచున్
  వానర జాతిగాంచి కడువంతల నొందుట నీకుయుక్తమే?

  రిప్లయితొలగించండి
 28. ఈనరలోకమందునరు లీప్సితసిద్ధికినీదు హుండిలో
  వేనకువేల రూప్యములువేతురు కానుకలంచు నక్కటా
  కానరుసాటిమానవులకష్టములెన్నడు, నాదుకోరు దే
  వా! నర జాతిఁ గాంచి కడు వంతనుఁ జెందుట నీకు యుక్తమే

  రిప్లయితొలగించండి
 29. మానవులన్ సృజించి పరిమార్చుట పోషణ మెంచి చూడగా
  నేనె ఘటిల్ల చేయుదును నీవొక యంశయె నాకు, పోరులో
  దానవ సంతతిన్ దునిమి ధాత్రి భరమ్మును బాపు మయ్య బా
  వా! నర జాతిఁ గాంచి కడు వంతనుఁ జెందుట నీకు యుక్తమే ?

  రిప్లయితొలగించండి
 30. కోతితో నక్క...

  కానల గాల్చుచుండె నిట కల్మషముల్ ధర బెంచుచుండె సో
  పానములంచు సౌధముల పాడెలు గట్టెను ప్రాణికోటికీ
  మానము లేని జాతి మన మాన్యము లెల్లయు దోచె కోతి బా
  *వా!నర జాతిఁ గాంచి కడు వంతనుఁ జెందుట నీకు యుక్తమే*

  తిరుక్కోవళ్ళూరు శ్రీహర్ష

  రిప్లయితొలగించండి
 31. రిప్లయిలు
  1. వత్తు రెల్ల రింకఁ జత్తురు శీఘ్రమ
   బల్లిదుండ వీవు భయపడంగ
   నేల రాక్షసేంద్ర వాల ధనులె వీరు
   వానరులనుఁ గాంచి వగచఁ దగునె


   మానవు లెంచ నిప్పుడమి మాన్యులు విజ్ఞులు శక్తిమంతులున్
   దాన దయా గుణమ్ముల నుదారులు నిత్యము పర్వు లేలయా
   వానినిఁ గాంచి వెల్పలకు వానరసింహమ మూయు మింక నీ
   వా నర జాతిఁ గాంచి కడు వంతనుఁ జెందుట నీకు యుక్తమే

   [నీ వా = నీ నోరు]

   తొలగించండి
 32. వానరులనశివునియంశపువారలు
  రామబంటుగనిలరహినిజెందె
  సీతజాడకొఱకుజోతలైపోరిన
  వానరులనుగాంచివగచదగునె

  రిప్లయితొలగించండి
 33. మానవమాత్రుడాతడని మాయను బన్ని హరించి మానినిన్
  మానవరూపమందు హరి మాయను గానక లేక బోతివే
  వానరుడైన నేమి మరి వారిధి దాటెను రామ భక్తితో
  మానిని వీడుమంచు హనుమంతుడు జెప్పగ లెక్క సేయకన్
  వానరులందరున్ గలిసి వారధి గట్టిరనంగ నేడికన్
  వానర జాతిఁ గాంచి కడు వంతనుఁ జెందుట నీకు యుక్తమే

  రిప్లయితొలగించండి
 34. బ్రహ్మచారీ శతమర్కటః

  వగవ నేటి కింక బ్రతుకు భారమనుచు
  నాడు పిల్లబుట్ట నపుడెజంపి
  కోడెలనుచు బెంచ కోతిమూకలుకాగ
  వానరులనుఁ గాంచి వగచఁ దగునె

  రిప్లయితొలగించండి
 35. వానరులందుమేటిగదవాయునిపుత్రుడునాంజనేయుడే
  వానినెఱుంగుమాయికనువారధిదాటినమేటివీరుగా
  వానరజాతియంతయునుభానునివంశపుబంటులైమనన్
  వానరజాతిగాంచికడువంతనుజెందుటనీకుయుక్తమే

  రిప్లయితొలగించండి
 36. రావణునితో కుంభకర్ణుడు ....

  ఆటవెలది
  సీతఁ దెచ్చు ముందుఁ జెప్పక మాకది
  యుద్ధ భేరి మ్రోగ యురికి మిగుల
  కుంభకర్ణుఁ బిలిచి, కోదండ రాముని,
  వానరులనుఁ గాంచి వగచఁ దగునె?

  రిప్లయితొలగించండి
 37. రావణునితో కుంభకర్ణుడు ....

  ఉత్పలమాల
  మానిని సీతఁ దెచ్చుటను మాకె రిగించితె మున్ను ?గాక నీ
  వానక యుద్ధభేరులవి యాగక మ్రోగగ కుంభకర్ణు నన్
  దీనత వ్యూహమేమనఁగ దెప్పుచు రాముని సేన, సోదరా!
  వానర జాతిఁ గాంచి కడు వంతనుఁ జెందుట నీకు యుక్తమే?

  రిప్లయితొలగించండి
 38. ఉ:

  జ్ఞానివి, భారతావనిన జాగృదవస్థను గూర్చనెంచగా
  కానమె దిద్దుబాటులను గట్టిగ బట్టగ నాచరింప స
  మ్మానము బొందిరెంతగనొ మాన్య ప్రధానిగ పీవి పేర నీ
  వా ! నరజాతి గాంచి కడు వంతను జెందుట, నీకు యుక్తమే

  దిద్దుబాటు=Reforms.
  PV గారు ఆర్థిక సంస్కరణలకు ఆద్యుడని అందరికీ తెలిసిన విషయము... వారికిది యుక్తము అని వ్రాయ ప్రయత్నించాను.

  రిప్లయితొలగించండి
 39. మైలవరపు వారి పూరణ

  మాను పరాంగనేచ్ఛను., ప్రమాదము నీకని యెంత చెప్పినన్
  వీనుల నిల్పకుంటివి! వివేకము కోల్పడితీవు! రామకా..
  ర్యానురతిన్ మహాంబుధితరంగములట్లిటు దూకుచున్న యీ..
  వానర జాతిఁ గాంచి కడు వంతనుఁ జెందుట నీకు యుక్తమే!!

  మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

  రిప్లయితొలగించండి