9, జులై 2020, గురువారం

సమస్య - 3422

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"కవికంటెను మేలు గాదె గాడిద భువిలో"
(లేదా...)
"కవికంటెన్ బరికింప గాడిదయె మేల్గాదే భువిన్ మిత్రమా"

64 కామెంట్‌లు:


 1. నడిరేయి సరదా పూరణ:

  భవనంబందున విఱ్ఱ వీగుచునహో బంజార హిల్సందునన్
  లవలేశమ్మును పొంకమున్ విడుచుచున్ లాలిత్యమే గాననిన్
  చవిలేనట్టివి కావ్యముల్ పఱపుచున్ జంబమ్ము చూపెట్టెడిన్
  కవికంటెన్ బరికింప గాడిదయె మేల్గాదే భువిన్ మిత్రమా

  రిప్లయితొలగించండి

 2. ఆటవిడుపు సరదా పూరణ:
  (జిలేబి గారికి అంకితం)

  కవనంబందున వీసమున్ తనరుచున్ గగ్గోలు గావించుచున్
  పవలున్ రేయిని నేతలన్ మురుపుచున్ బ్రహ్మాండమౌ తీరునన్
  చెవులన్ పూలను బెట్టి కావ్యములకున్ శ్రీకారమున్ జుట్టెడిన్
  కవికంటెన్ బరికింప గాడిదయె మేల్గాదే భువిన్ మిత్రమా

  రిప్లయితొలగించండి
 3. రాముడు శివ ధనువును ద్రుంచగా ఒక్క సారి భీకర
  శబ్దములు కలుగ వీరుల కళ్ళకు చీకట్లు కమ్మాయి, కొద్ది సేపటిలో తేరుకొని చూడగా వరమాలను జానకి రాఘవుని మెడలో వేయగా చల్లనైన పూర్ణ చంద్ర బింబపు కాంతులు ఆ సభా స్ధలిలొ పగలే కలిగాయి అను భావన


  జగపతి రాఘవుండు శివ చాపము ద్రుంచగ ,భీకరంబుగా

  నిగదములా సభాస్ధలిన నెక్కొన నక్కడ కమ్మె ధ్వాంతమున్,

  వెగడుచు కన్నులన్ తెరచి వీరులు కాంచిరి దృశ్యమొక్కటిన్

  పగలు శశాంకుఁ డంబరముపై విలసిల్లెఁ గళాసమగ్రుఁడై

  మగువ ముదంబు తోడ వర మాలను రాము గళమ్మునందిడన్  గురువు గారు నమస్కారం శుభోదయము నిన్నటి పూరణ ఒక్క సారి చూసి సలహా ఇవ్వగలరు

  రిప్లయితొలగించండి


 4. అవిరతముగ పనిచేయును
  కవి! కంటెను మేలు గాదె గాడిద భువిలో
  న వరలును జావడి నదె క
  నువెట్టుకుని కాచుకొనగ నొవ్వదు నెపుడున్


  జిలేబి

  రిప్లయితొలగించండి
 5. 🙏 *గురువు గారికి నమస్కారములు*🙏
  🙏🙏🌹🌹🌹🌹

  నేటిదత్తసమస్య : -

  *_కవికంటెను మేలుగాదె గాడిద భువిలో_*

  నాపూరణప్రయత్నం : -

  రవిగాంచనివియుగాంచుచు
  కవనాంబృతములనుపంచగానువినెడి ఆ
  చెవికిరసజ్ఞతలేదా
  *కవికంటెను మేలుగాదె గాడిద భువిలో!*
  .....✍బోరెల్లి హర్ష
  కర్నూలు

  రిప్లయితొలగించండి
 6. ఆస్తమా రోగుల కౌషధం బందురు
  గాడిద పాలను ఖలము లోన


  గాడిద కాళ్ళను ఘన వాసు
  దేవుడు
  పట్టె గా నాడని పలుకు చుండు,


  సతతము గాడిద చాకిరి చేసెడు
  కష్టజీవి యనుచు కరుణ జూపు,

  గాడిద కొడుకని గారవమ్మగు నట్టి
  బిరుదునిత్తురుగాదె గరిమ‌తోడ,


  పండిత సుతుని ముదముగా పరమ శుంఠ

  యనుచు పిలుతు రెపుడిచట, కనుక యెల్ల

  కాలము కవి కంటెను మేలు గాదె గాడి

  ద భువి లోన వారెల్లరు తరచి చూడ

  రిప్లయితొలగించండి
 7. అవిరళముగ జాతి భవిత
  రవళించు నటుల కవనము వ్రాయక బోవన్
  కవిగా నపథము నడపు కు
  కవికంటెను మేలుగాదె గాడిద భువిలో

  రిప్లయితొలగించండి
 8. అగణితసౌరభమ్మును విహాయసవీథులఁ జిమ్ము పూలతో
  నెగడిన తోటలందున వినీలనభోబహిరంగణమ్ములన్
  ప్రగుణితవారిపూరణవిలాసినులై ప్రవహించుచుండ నా
  పగలు,.... శశాంకుఁ డంబరముపై విలసిల్లెఁ గళాసమగ్రుఁడై.

  ప్రవహించుచుండన్ + ఆపగలు
  ఆపగలు = నదులు

  కంజర్ల రామాచార్య.

  రిప్లయితొలగించండి
 9. కవితల్ వ్రాయుటనేర్వక
  నవిరళమౌ గ్రంథచౌర్యమవలంబమునన్
  కవినని పలికెడు కుహనా
  కవికంటెను మేలు గాదె గాడిద భువిలో

  రిప్లయితొలగించండి

 10. పనిలేక
  పని గట్టుకుని


  అవిరామమ్ముగ కైపదమ్ములకు మాహాత్మ్యమ్ములన్ చేర్చెడీ
  కవికంటెన్ బరికింప గాడిదయె మేల్గాదే భువిన్ మిత్రమా,
  వ్యవధానమ్మను మాటలేక శ్రమతో బండంత చిప్పమ్ము మూ
  పు విధానమ్ముగు రీతి నెత్తుకుని ప్రాపున్జేయు రేవళ్లకున్!  నారదా

  జిలేబి

  రిప్లయితొలగించండి
 11. అవిరళముగకృషిజేసెడు
  కవికులములనాదరించు కరుణేగనమా?
  భవితకునష్టముజేయు కు
  కవికంటెనుమేలుగాదె గాడిదభువిలో
  +++++++++++++++++
  రావెల పురుషోత్తమ రావు

  రిప్లయితొలగించండి

 12. నవచైతన్యము గల్గజేయు రచనల్.,న్యాయమ్ము ధర్మమ్మునే

  భువనంమందున నిల్ప లేని కృతులన్ మూర్ఖమ్ముగా దా లిఖిం

  చి., విషాదమ్ముల బంచు కావ్యములకున్ శ్రీకారమున్ జుట్టెడిన్

  కవికంటెన్ బరికింప గాడిదయె మేల్గాదే భువిన్ మిత్రమా!


  -- 🌱 ఆకుల శాంతి భూషణ్ 🌱
  🌷 వనపర్తి🌷  రిప్లయితొలగించండి
 13. మైలవరపు వారి పూరణ

  శివసంబద్ధముగాని భావతతితో., శృంగారబుద్ధ్యైకశ...
  బ్దవిశేషాత్మకపద్యపూరణల., ద్వంద్వార్థప్రయోగమ్ములన్
  కవినేనంచు వధాని నేనని యహంకారమ్మునన్ దిర్గు కిం...
  కవి కంటెన్ బరికింప గాడిదయె మేల్గాదే భువిన్ మిత్రమా? !!

  మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

  రిప్లయితొలగించండి
 14. క్రొవ్విడి వెంకట రాజారావు:

  అవిరళము మోస మెంచుచు
  అవినీతిని పెంచునట్టి యపకారమునౌ
  కవితల నల్లుచు సాగు కు
  కవి కంటెను మేలుగాదె గాడిద భువిలో?

  రిప్లయితొలగించండి
 15. ఎవరే భావన జేయుఁ గాక విడ లేనీ మోహమంచున్ లస
  త్కవితాకన్యను దుష్ప్రయత్నితబలాత్కారమ్మునన్
  నైజసం
  భవసౌందర్యవిలాసముం జెరచి కవ్యాఖ్యాతుడై నట్టి యా
  కవికంటెన్ బరికింప గాడిదయె మేల్గాదే భువిన్ మిత్రమా"

  కంజర్ల రామాచార్య.

  రిప్లయితొలగించండి
 16. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

  రిప్లయితొలగించండి
 17. కవియన లోకోద్ధరణకు
  నవిరళమగు కృషినిసల్పి యాకవితలతో
  భువి వెలుగంగావలెను; కు
  కవికంటెను మేలు గాదె గాడిద భువిలో!

  రిప్లయితొలగించండి
 18. రవి దేహస్వాస్థ్యంబిడఁ
  గవికిన్ మతిసుస్థత నిడ కర్తవ్యంబౌ!
  హవణించకట్లు వ్రాసెడు
  కవికంటెను మేలు గాదె గాడిద భువిలో!

  రిప్లయితొలగించండి

 19. పిన్నక నాగేశ్వరరావు.

  భవితకు నుపయోగ పడని
  కవితా లక్షణము లేని కవితల తోడన్
  కవినని గొప్పలు చెప్పు కు
  కవి కంటెను మేలు గాదె గాడిద భువిలో.

  రిప్లయితొలగించండి
 20. తవిలియు చెడు బోధించుచు
  కవనము లల్లుచు నిరతము గర్జించుచు దా
  నెవరిని వదలక మసలు కు
  కవి కంటెను మేలు గాదె గాడిద భువిలో

  రిప్లయితొలగించండి
 21. క్రొవ్విడి వెంకట రాజారావు:

  పవిదిన్ గూడని భావజాలమును చేపట్టంగగా సాగుచున్
  అవినీతి పగ నీసులన్ నిలుపు మాయామోహమౌ వాక్కులన్
  కవనమ్మందున చాటుచున్ బఱగు బింకంబెక్కువైనట్టి యా
  కవికంటెన్ బరికింప గాడిదయె మేల్గాదే భువిన్ మిత్రమా!

  రిప్లయితొలగించండి


 22. అవినయమున వర్తించెడు
  నవివేకుల పొందుగోరి యనవరతంబున్
  కవినని గొప్పలు పలుకు కు
  "*కవికంటెను మేలు గాదె గాడిద భువిలో*"

  రిప్లయితొలగించండి
 23. అందరికీ నమస్సులు 🙏
  09.07.2020

  నా పూరణ యత్నం

  *కం*

  నివసించగ జనులకు నిట
  నవకాశము లేక తాము నడుచుకు బోవన్
  నవసరమును దీర్చగనొక
  *"కవికంటెను మేలు గాదె గాడిద భువిలో"*

  *కళ్యాణ్ చక్రవర్తి, ముంబాయి*
  🙏

  రిప్లయితొలగించండి
 24. వికటకవిపేరువినగనె
  పకపకయనినవ్వుచుంద్రుప్రజలెల్లరునున్
  వికృతపుకవితలనల్లుకు
  కవికంటెనుమేలుగాదెగాడిదభువిలో

  రిప్లయితొలగించండి
 25. * శంకరాభరణం వేదిక *

  09/07/2020..గురువారం

  సమస్య
  *******
  కవికంటెన్ బరికింప గాడిదయె మేల్గాదే భువిన్ మిత్రమా!

  నా పూరణ. మత్తేభము
  *** ********

  స్తవనీయమ్మగు కబ్బముల్, పరమ గ్రంథమ్ముల్ ,విరాజిల్లు స

  త్కవనంబుల్ రచియించి సజ్జనతతిన్ క్ష్మా యందు నిర్మించుచున్

  భువి దా సత్కవిగా మెలంగక చెడున్ బోధించు హీనంపు కా

  కవికంటెన్ బరికింప గాడిదయె మేల్గాదే భువిన్ మిత్రమా!


  -- 🌱 ఆకుల శాంతి భూషణ్ 🌱
  🌷 వనపర్తి🌷  రిప్లయితొలగించండి
 26. సమస్య :-
  "కవికంటెను మేలు గాదె గాడిద భువిలో"


  *కందం**


  నవచైతన్యము నింపక
  బవరపు సమయాన కూడ భారతమాతన్
  కవనములందున తూలెడు
  కవికంటెను మేలు గాదె గాడిద భువిలో
  ..................✍️చక్రి

  రిప్లయితొలగించండి
 27. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. నవ మార్గంబుల జాతి మేల్కొలుపు విన్నాణంబు నందింపకే
   భవ బంధంబుల దెంచు సద్విధులు సద్భావంబులన్ బంచకే
   యువతన్ దప్పుడు దోవ బెట్టు విధమందున్మత్తులన్ జేసెడిన్
   కవికంటెన్ బరికింప గాడిదయె మేల్గాదే భువిన్ మిత్రమా

   తొలగించండి
 28. కవితల్ వ్రాయుచు సంఘసంస్కరణలక్ష్యంబున్ సదాకోరునా
  కవియేసత్కవిగావెలుంగునతఁడేకావ్యంబులన్ వ్రాయు నే
  డవిరామంబుగ గ్రంథచౌర్యమునకున్ యత్నంచు మాయావియౌ
  కవికంటెన్ బరికింప గాడిదయె మేల్గాదే భువిన్ మిత్రమా

  రిప్లయితొలగించండి
 29. చెవిసోకనీఁడునితరము
  చవులూరించుచుకవితలుచానకుఁజెప్పున్
  వివరములౌక్యమునెరుగని
  కవికంటెనుమేలుగాదెగాడిదభువిలో

  రిప్లయితొలగించండి
 30. అవివేకి గొలుసులం దన
  ను విచారించంగఁ గట్టను వెఱపున ఖర
  మ్ము వలికె నిట్టులు చిక్కము
  కవి కంటెను మేలు గాదె గాడిద! భువిలో

  [కవి = కళ్లెము ]


  భువి వీక్షించిన గుడ్ల గూబ వలనం బూజ్యంబు లాభం బహో
  తెవులం చేడ్వక సొమ్ము లిమ్మనక ప్రీతిన్ నిల్చి యీ గార్దభం
  బవిదూరంబున మోసి మూటలను దానర్చించు నిర్ణేజకుం
  గవి కంటెన్ బరికింప గాడిదయె మేల్గాదే భువిన్ మిత్రమా
  [కవి = గుడ్లగూబ]

  రిప్లయితొలగించండి
 31. చవిలేని కవితలం గొని
  నవకవితా రీతులంచు నతులను గోరన్
  చవకాయను గదనేడిట
  కవికంటెను మేలుగాదె గాడిదభువిలో!

  రిప్లయితొలగించండి
 32. కందం
  కవితావేశమ్ము సమా
  జ వాసికని నమ్ముటొప్పు, సాంఘిక పరమై
  న విబేధములుసిగొల్పు కు
  కవికంటెను మేలు గాదె గాడిద భువిలో!

  మత్తేభవిక్రీడితము
  కవితావేశము సంఘ సేమమునకై కాంక్షించఁ గీర్తించరే!
  పవలున్ రేయినిఁ బూని యన్యమతమున్ వర్గాల నిందించుచున్
  దవులన్ బెట్టఁగ శాంతిభద్రతల, నిర్దాక్షిణ్య హింసాలువౌ
  కవికంటెన్ బరికింప గాడిదయె మేల్గాదే భువిన్ మిత్రమా!

  రిప్లయితొలగించండి
 33. మిత్రులందఱకు నమస్సులు!

  చవులూరన్ రసముల్ గురింత్రు సుకవుల్ సద్భావితోక్తిప్రదుల్!
  కవనం బెన్నఁగ దుష్టభావయుతనిష్కాసోక్తిదుల్ కాకవుల్!
  పువు మందారము కాఁగఁ దేఁటి చనెడున్;  మోదుంగు కాఁ జన్నె? కా

  కవికంటెన్ బరికింప, గాడిదయె మేల్గాదే భువిన్ మిత్రమా!!

  రిప్లయితొలగించండి
 34. భువిలో నాసరి యెవరని
  చవిలేని రచనల తోడ జగతిని గీరన్!
  కవినని తిరిగెడి కుహనా!
  కవికంటెను మేలు గాదె గాడిద భువిలో"

  రిప్లయితొలగించండి
 35. కవితా సంచికను ఎంతో ఖర్చు కోర్చి అచ్చు వేయిస్తే అది చెత్త బుట్టకు చేరిన సందర్భము:

  మ:

  కవితా సంపుటి నచ్చువేయగొని పోగా యంత్ర కార్యాలయం
  బవకాశమ్మని దెల్పె నంత కడు లాభాపేక్ష మూల్యంబునున్
  అవుగా , యంచని వెల్లడించ ప్రతి , పాగావేసె వ్యర్థాకృతిన్
  కవికంటెన్ బరికింప గాడిదయె మేల్గాదే భువిన్ మిత్రమా

  వై. చంద్రశేఖర్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. కం:

   కవితలు వ్రాయగ సరళము
   భవితకు మనుగడ యెదుగగు భావన లిడరే
   అవసర మెంచని యెడలన
   కవి కంటెను మేలు గాదె గాడిద భువిలో

   వై. చంద్రశేఖర్

   తొలగించండి
 36. కవికంటెన్బరికింపగాడిదయెమేల్గాదేభువిన్మిత్రమా
  కవికిన్గాడిదపోలికాభువినినాగాయమ్మయేమంటివే
  యవహేళంబునుజేసితేకవిని,నయ్యారేయివేంమాటలో
  కవియేభారతదేశపుంటునికినెక్కాలంబుగాచున్గదా

  రిప్లయితొలగించండి
 37. భవుని యభిషేక మునకై
  భువనము నిండిన ఘటమును మోయగ లేకన్
  కవితలనుజెప్ప జూసెడి
  కవికంటెను మేలు గాదె గాడిద భువిలో

  రిప్లయితొలగించండి
 38. ఒక కవి సతీమణి ఆవేదన!

  అవునమ్మా!కవిరాట్టుగా బిరుదు,విద్యావేత్తయన్ బిల్పులే
  యవిరామంబుగ వ్రాయగా గృహమునన్ యన్నింట పొత్తంబులే
  సువిశాలంబగు సౌధమే యిరుకయెన్ జొచ్చంగ నెవ్వారికిన్
  లవలేశమ్మును భార్యపై తగులమున్ లాలిత్యమున్ జూప డీ
  కవికంటెన్ బరికింప గాడిదయె మేల్గాదే భువిన్ మిత్రమా!

  రిప్లయితొలగించండి
 39. చవి సంపాదనపైనఁ బాదుకొనగా, స్వాంతమ్ము దేశమ్ముదౌ
  భవితవ్యమ్మును కాంచ కుండ తనసౌభాగ్యమ్మునే కోరగా
  కవితల్ చెప్పుచు తుచ్ఛనాయకులపై కావ్యమ్ములన్ వ్రాయు కా
  కవికంటెన్ బరికింప గాడిదయె మేల్గాదే భువిన్ మిత్రమా

  రిప్లయితొలగించండి
 40. శివకేశవులను సతత
  మ్మవహేళన సేయునట్టి యవలక్షణమౌ
  కవనమునుజెప్పునట్టి కు
  కవికంటెను మేలుగాదె గాడిద భువిలో.

  రిప్లయితొలగించండి
 41. జవసత్త్వమ్ముల నింపుచున్ జనులనే జాగర్యమున్ జేసెడిన్
  గవనమ్మున్ గవి చెప్పగా వలయు సత్కార్యమ్మదే గాంచినన్
  గవనమ్మందున బూతు హింసలవె ప్రఖ్యాతమ్ముగా వ్రాయు కా
  కవికంటెన్ బరికింప గాడిదయె మేల్గాదే భువిన్ మిత్రమా.

  రిప్లయితొలగించండి