22, జులై 2020, బుధవారం

సమస్య - 3434

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"పూలు సెగలఁ బొగలఁ బుక్కిళించె"
(లేదా...)
"పూవులు మంటలం బొగలఁ బొల్తుకపై వడిఁ బుక్కిళించెరా"

78 కామెంట్‌లు:


  1. నడిరేయి సరదా పూరణ:

    నావల కాదురాయనుచు నంట్లను తోముచు చీర గుంజుచున్
    చావడి నూడ్చుచున్ కసిరి చంకను బెట్టుచు చిన్నపాపనున్
    కోవిడు రాత్రులన్ పగలు కోపము హెచ్చగ భామ దాల్చినన్
    పూవులు మంటలం బొగలఁ బొల్తుకపై వడిఁ బుక్కిళించెరా

    రిప్లయితొలగించండి
  2. ఆ.వె//
    మగని జాడలేక మగ్గుచన్న పడతి
    పట్టుపరపు జూచి తిట్టుకొనగ l
    వెక్కిరించు చుండ నొక్కసారి శిగన
    పూలు సెగలఁ బొగలఁ బుక్కిళించె ll

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      "మ్రగ్గుచున్న... సిగను..." అనండి.

      తొలగించండి

  3. ఆటవిడుపు సరదా పూరణ:
    (జిలేబి గారికి అంకితం)

    కోవిడు వైరసాదటను కొంపలు ముంచగ వేనవేలవౌ
    త్రోవను గానకే తుదకు తుమ్ముచు దగ్గుచు ముక్కుచీదుచున్
    బావురు మంచు నేడ్వగను బంగలు దీదికి మోడిజల్లినన్
    పూవులు మంటలం బొగలఁ బొల్తుకపై వడిఁ బుక్కిళించెరా

    రిప్లయితొలగించండి
  4. సీతను యెడబాసి వర్ష ఋతువు రాగా వికసించిన పూలను గాంచిన రాముడు పలుకు మాటలు

    నేటి శంకరాభరణం సమస్య

    పూలు సెగక బొగలు బుక్కిళించె


    నా పూరణ సీసములో


    సౌమిత్రి యిదెచూడు,రామ కొ రకు నామ
    నము వెతలను పొంద, సుమములన్ని

    వెక్కి రించు చునుండె, నిక్కము‌ సోదరా,
    వర్ష ఋతువు యిదె వచ్చె నిపుడు,

    పున్నాగ కుసుమముల్ మిన్నాగు లై నాట్య
    ములనాడె, మందార ములు త్యజించె

    మకరంద గంధముల్, మల్లెలు కురిపించె
    గా నగ్ని జల్లులు ఘనత తోడ,


    మొగలి పూలన్నియు సెగలు కక్కుచు నుండె
    బంతులు జాజి,చే మంతులన్ని


    పరిమళములు వీడి విరబూసి
    యెల్లడన్

    పూలు సెగల బొగలు బుక్కిళించె

    లక్ష్మణా! యని వికల మనస్కుండై రఘు

    వరుడు యేడ్చె నపుడు బాధ తోడ

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ మనోహరంగా ఉన్నది. అభినందనలు.
      "ఋతువు+ఇదె, వరుడు+ఏడ్చె' అన్నపుడు యడాగమం రాదు. 'మనస్కుండై' అంటే గణభంగం. "మనస్కుడై..." అంటే సరి!

      తొలగించండి
  5. సంతసించె దైవ సన్నిధి దొరుకంగ
    పూజ సేయ వేచె,బుట్ట లోన
    విటుడి చేతి కెక్క విలపించి వ్యధతోడ
    పూలు సెగలఁ బొగలఁ బుక్కిళించె

    రిప్లయితొలగించండి
  6. తీగబోడు లచట దీపావళి దినము
    చావడిని సొగసుగ సవరణించి
    జువ్వను వెలిగించ , చువ్వన కాగిత
    బూలు సెగలఁ బొగలఁ బుక్కిళించె

    రిప్లయితొలగించండి

  7. కందగీతి

    అబలను పూలు సెగలఁ బొగ
    లఁ బుక్కిళించె నడిరేయి లసమానంబై
    విబుధుడు వెన్నెల కురిపిం
    చి బీట లెగయంగచేసె చిత్తమును సుమీ



    జిలేబి

    రిప్లయితొలగించండి


  8. కందోత్పల


    ఎడదను వెన్నెల సడి ని
    గ్గడి పూవులు మంటలం బొగలఁ బొల్తుకపై
    వడిఁ బుక్కిళించె రాడు మ
    గడేల నో సంగడి యభిగమనపు వేళన్



    జిలేబి

    రిప్లయితొలగించండి
  9. విరహ వేదనమున ప్రియురాలు కాగగా
    ముద్దు సేయు మగని సద్దులేదు
    వెన్నెలదియె మిగుల వేడిగా తోచెనే
    పూలు సెగలఁ బొగలఁ బుక్కిళించె.

    రిప్లయితొలగించండి


  10. తావర మేది యామదిని ? తంపరపెట్టుచు మానసమ్ములో
    నావల కామవల్లభుడి యక్కస మాయె సమీరడింభముల్
    పూవులు మంటలం బొగలఁ బొల్తుకపై వడిఁ బుక్కిళించె,రా
    డే వడి వాడు ప్రేముడిని డీకొలుపంగ నిశాంత మాయెగా




    జిలేబి

    రిప్లయితొలగించండి
  11. క్రొవ్విడి వెంకట రాజారావు:

    భర్త కొఱకు మనము భారమై తమితోడ
    పలవరించినంత పతియె రాక
    విరహబాధ నొందు ప్రేయసి తలలోని
    పూలు సెగలఁ బొగలఁ బుక్కిళించె.

    రిప్లయితొలగించండి
  12. పొన్నచెట్టునీడ పున్నమిరాతిరి
    వేణుగానలోల! వేచియుంటి
    విరహమింక సైప వేగమె కరుణించు
    పూలు సెగలఁ బొగలఁ బుక్కిళించె

    రిప్లయితొలగించండి
  13. వేణుగాన లోలు ప్రేమను చిక్కిన
    బృ౦దమెల్ల చేరె బృంద వనిని 
    వేచి యు౦టిమయ్య వేగ రావయ కృష్ణ 
    పూలు సెగలఁ బొగలఁ బుక్కిళించె

    రిప్లయితొలగించండి
  14. మైలవరపు వారి పూరణ

    ఈ వెతలేమొ నీకు తరుణీ! గృహకార్యమతిన్ చరించుటల్
    సేవల మ్రగ్గుటల్ గనగ స్వేదము బిందువులౌచు చిందెడిన్
    నీ వదనమ్మునందు., గని నేనిటులందును నీదు నవ్వులన్
    పూవులు మంటలం బొగలఁ బొల్తుకపై వడిఁ బుక్కిళించెరా.!!

    మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

    రిప్లయితొలగించండి
  15. కేవల మాత్రమై నిలచు కేశములందు నలంకరించి నె
    త్తావుల జిందు మమ్మకట! దండల గ్రుచ్చియు కామకేళిలో
    రావుల కాలరాచితివి రాముని సన్నిధి జేర్చవంచు వే
    *పూవులు మంటలం బొగలఁ బొల్తుకపై వడిఁ బుక్కిళించెరా*

    తిరుక్కోవళ్ళూరు శ్రీహర్ష

    రిప్లయితొలగించండి
  16. క్రొవ్విడి వెంకట రాజారావు:

    పూవిలుకాని పూనికను పుట్టిన మోహము డెందమందునన్
    వావిరియైన వేళ తన వల్లభు రాకను గోరుచుండినన్
    ఆవడిరాని కారణము నాలి విరక్తిని జెంద నెత్తిపై
    పూవులు మంటలం బొగలఁ బొల్తుకపై వడిఁ బుక్కిళించెరా

    రిప్లయితొలగించండి
  17. పావల మల్లెపూలుగొని పానుపు పైనను జల్లి ప్రేమతో
    బావను బిల్వనేమి ప్రియభామినిఁ గూడగ రాకపోయె గా
    దే, విరహమ్ముఁ గాగితి ప్రతీక్షణమందున మున్గునత్తరిన్
    బూవులు మంటలం బొగలఁ బొల్తుకపై వడిఁ బుక్కిళించెరా

    రిప్లయితొలగించండి
  18. కార్య నిరతి యందు ఖండాo త రంబున
    పతియు నుండ మదిని సతికి నొదవె
    విరహ తాప మపుడు వింతగా దోచుచు
    పూలు సెగల బొగల బుక్కి ళించె

    రిప్లయితొలగించండి
  19. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  20. శ్రీహరి చరణముల శీఘ్రమే చేరగ |
    పూజ్యతనుచు తలుప పువ్వు లెల్ల!
    వేశ్య యింట జిక్క విలపించె వ్యధతోడ!
    "పూలు సెగలఁ బొగలఁ బుక్కిళించె"

    రిప్లయితొలగించండి

  21. * శంకరాభరణం వేదిక *
    22/07/2020...బుధవారం

    సమస్య
    ********
    పూవులు మంటలం బొగలఁ బొల్తుకపై వడిఁ బుక్కిళించెరా"

    నా పూరణ. ఉ.మా.
    *** ********

    పావని రుఖ్మిణీ సతికి పారిజ మర్పణజేయ గృష్ణుడే

    భావిని సత్యభామ కడు బాధయె జెందగ నామె కొప్పునన్

    వావిరి యున్న రాజిలని వాడిన వాసన లేని మల్లెలౌ

    పూవులు మంటలం బొగలఁ బొల్తుకపై వడిఁ బుక్కిళించెరా"


    -- 🌱 ఆకుల శాంతి భూషణ్ 🌱
    🌷 వనపర్తి🌷


    -- 🌱 ఆకుల శాంతి భూషణ్ 🌱
    🌷 వనపర్తి🌷





    రిప్లయితొలగించండి
  22. కావివి మంచిరోజులని కార్యపు మూర్తము వాయిదా పడన్
    తావిక లేక దంపతులు తాళగ లేని వియోగ బాధలో
    నా విరి తోటలో గలువ నంగజు దూపుల కోపజాలకన్
    పూవులు మంటలం బొగలఁ బొల్తుకపై వడిఁ బుక్కిళించెరా

    రిప్లయితొలగించండి
  23. విరహబాధతోడప్రేయసిపతిరాక
    కెదురుచూచిచూచియీసుతోడ
    తట్టుకొనగలేకతమినిదాదలలోని
    పూలుసెగలబొగలాబుక్కిళించె

    రిప్లయితొలగించండి
  24. పంపంచబాణుడచటపోఁడినినిలిచెను
    పరమశివునియెదుటపాఁడిఁదప్పి
    నిటలమందునగ్నినెలకోన్నశివుఁజూచ
    పూలుసెగలఁబోగలఁబుక్కిలించె

    రిప్లయితొలగించండి
  25. ఈవిరహాగ్ని నన్ను దహియించుచు నుండె మరుండు చెచ్చెరన్
    పూ విశిఖమ్ములన్ విడిచి మొహమునందున మున్గజేయగా
    నేవిధి నేభరింతునని యిక్కకుభర్తను పిల్చు చుండగా
    పూవులు మంటలం బొగలఁ బొల్తుకపై వడిఁ బుక్కిళించెరా

    రిప్లయితొలగించండి
  26. మిత్రులందఱకు నమస్సులు!

    పూవునుఁ బోలు కోమలియు, పుష్పసుగంధశరీరియైన శ్రీ
    దేవియె భక్తితో మిగుల దీక్షను లక్ష్మినిఁ గొల్చి తాను దీ
    పావళినాఁడు, మాపున జవమ్మునఁ గాల్చఁగఁ జిచ్చుబుడ్డినిం,

    బూవులు మంటలం బొగలఁ బొల్తుకపై వడిఁ బుక్కిలించెరా!

    రిప్లయితొలగించండి
  27. ఆ.వె.

    భర్త రాక గూర్చి పారాడ దినమంత
    తీపి కబురు రాత్రి దీరు ననుచు
    వినగ వేచి వేచి విసమాలు చుండగా
    పూలు సెగలఁ బొగలఁ బుక్కిళించె

    వై. చంద్రశేఖర్

    రిప్లయితొలగించండి
  28. సంతసించఁ గురియుఁ గాంత కాంతుని పైన
    శారదేందు శుద్ధ చంద్రికలను
    గాంత భర్త నంతఁ గనలఁ గన్నుల నిప్పు
    పూలు సెగలఁ బొగలఁ బుక్కిళించె


    ఆ వనితా శశీద్ధ ముఖ మంతట మారెను జూచు చుండగం
    బావన కాళికాస్య నిభ భాసిత బింబము నాఁగ నత్తరిన్
    వావిరి బొగ్గు లుంచి పొయి వంటలు సేయఁగ నిప్పు నూఁదగం
    బూవులు మంటలం బొగలఁ బొల్తుకపై వడిఁ బుక్కిళించెరా

    [కాళిక = కాళికా దేవి , బొగ్గు]

    రిప్లయితొలగించండి
  29. ఆవనజాక్షికిందగిననార్యునిగన్గొనిబెండ్లిజేయగా
    నావిభుడెంతకున్గదలియామెనుజేరకపోవుచుండగా
    బూవిలుకానిచూపులకుపూర్తిగలొంగినగారణంబునన్
    పూవులుమంటలంబొగలబొల్తుతకైవదడిబుక్కిళించెగా

    రిప్లయితొలగించండి
  30. 22.07.2020
    అందరికీ నమస్సులు 🙏

    నా పూరణ యత్నం..

    *ఆ వె*

    ఇంటి కేగెదనుచు ఇల్లాలితో బల్కి
    ఒక్క గంట యనుచు ఒట్టు బెట్టి
    అర్థ రాత్రి వచ్చి అంనందబడగనే
    *"పూలు సెగలఁ బొగలఁ బుక్కిళించె"*

    *కళ్యాణ్ చక్రవర్తి ముంబాయి*
    😊🙏

    రిప్లయితొలగించండి
  31. తీవెలనిండుగి దనరి తెల్లనిమల్లెలు తావులీనగా
    నావినువీథిలోని శశి హ్లాదముబంచుచు సందడించగా
    పూవిలుకాని బాణములు పుల్కలురేపగ స్వామిరాకనే
    పూవులు మంటలం బొగల బొల్తుకపైవడి బుక్కిలించెరా!

    మదిని దోచినట్టి మహరాజు రాకనే
    మగువ మనసు చివుకుమనగ దాను
    జడను బెట్టుకున్న జాజులు సంపెంగ
    పూలు సెగలుబొగల బుక్కిళించె

    చీమ చిటుకుమన్న శ్రీకాంతుడే యంచు
    వీథి గుమ్మమునకు వెడలిచూచు
    వేచివేచి విడుచు వేడినిట్టూర్పుల
    పూలు సెగలు బొగల బుక్కిళించె

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఆ.వె//
      మగని జాడలేక మ్రగ్గుచున్న పడతి
      పట్టుపరపు జూచి తిట్టుకొనగ l
      వెక్కిరించు చుండ నొక్కసారి సిగను
      పూలు సెగలఁ బొగలఁ బుక్కిళించె ll

      తొలగించండి
    2. మీ పూరణలు బాగున్నవి. అభినందనలు.

      తొలగించండి
  32. ద్రౌపది కౌరవ సభలో...

    ఆటవెలది
    భర్తలేవురుండఁ బ్రాజ్ఞుల ముందట
    వల్వలూడ్చు దుష్టు నిల్వరించ
    రారటంచుఁ గృష్ణునర్థించి కన్నులన్
    పూలు సెగలఁ బొగలఁ బుక్కిళించె

    ఉత్పలమాల
    ఏవురు భర్తలుండి సభ నిందరు పెద్దలు గద్దెనుండినన్
    గావఁగరారు ద్రౌపదినిఁ గర్కశుడొక్కఁడు వల్వలూడ్చగన్
    నేవె శరణ్యమంచు మదినిక్కము నమ్ముచు కృష్ణుఁ గన్నులన్
    బూవులు మంటలం బొగలఁ బొల్తుకపై వడిఁ బుక్కిళించెరా!

    రిప్లయితొలగించండి
  33. వలువలు విడిచి పరువమును మరచి నీట
    ఈలకరిచి శ్వాస ఈదులాడు
    కలికి సోయగములు కన్నయా స్విమ్మింగు
    పూలు సెగల బొగల బుక్కిళించె
    ��
    (తప్పులున్న క్షంతవ్యుణ్ణి)

    రిప్లయితొలగించండి
  34. శంకరాభరణం వారి సమస్య

    పూవులు మంటలం బొగలఁ బొల్తుకపై వడిఁ బుక్కిళించెరా

    పూరణ

    ఉత్పలమాల
    శ్రావణభక్తిభావములశ్రద్ధదివృద్ధినిపొందిపొంగగన్
    పావనకేశబంధములపందిరులట్లుసుగంధమేర్పడన్
    కోవెలఁదీపహారతులకోరి కరాబ్జములాడవిచ్చుచున్
    పూవులు మంటలం బొగలఁ బొల్తుకపై వడిఁ బుక్కిళించెరా

    గాదిరాజు మధుసూదన రాజు

    శ్రావణమాసవేళ లో పతివ్రతలైనముత్తైదువ నెలతలు భక్తిప్రపత్తులతో పూజారులిచ్చిన పూవులు తలలో పెట్టుకొని ముందే అలంకరించుకున్నపూలుతోడవడంతో పూలపందిరులవలె తయారైన కొప్పులు జడల తో హారతులకోసం చాచుతున్న హస్తపద్మములతో హారతి మంటలతో ధూపముల తాకిడికి ఎరుపెక్కుతున్న ముఖపద్మములతో ..రమణీయంగా సాకారమై కనిపిస్తున్న

    కోవెలలోని దృశ్యవర్ణన.

    గాదిరాజు మధుసూదన రాజు

    రిప్లయితొలగించండి
  35. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  36. ఆధునిక కాల కవులకు పాదాభి వందనాలు. కవులందరూ వారి వారి పద్యాలకు ప్రతి పదార్ధాలూ తాత్పర్యాలూ కూడా రాస్తే మాలాంటి పామరులకు కూడా అర్ధం అవుతుంది.

    రిప్లయితొలగించండి
  37. ద్రుపదరాజ పుత్రి దోడ్కొని రమ్మనన్
    కొప్పుబట్టితెచ్చె కొంటె సభకు
    దుస్ససేనుడంత ద్రోవది కోపాగ్ని
    పూలు సెగలఁ బొగలఁ బుక్కిళించె!
    (కోపాగ్నిపూలు మండి పొగలుగ్రక్కినట్లుజారిపడ్డాయి)

    రిప్లయితొలగించండి