27, జులై 2020, సోమవారం

సమస్య - 3439

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"రోగులు సంపన్నులే కరోనా వలనన్"
(లేదా...)
"రోగులె భాగ్యవంతులు కరోన కురోగ నియోగమందినన్"

45 కామెంట్‌లు:

 1. బాగుగ ధనంబు గల పలు
  రోగులు సంపన్నులే, కరోనా వలనన్
  కాగా లక్షల ఖర్చులు
  రోగనివారణకు, బీదలుగ మారిరయో!

  రిప్లయితొలగించండి

 2. నడిరేయి సరదా పూరణ:

  బాగుగ చేరకే విధిగ బంజరు హిల్సున నాసుపత్రినిన్
  భోగము జేయుచున్ మిగుల ప్రొద్దున రాతిరి మందుగొట్టుచున్
  దాగుచు నింటిమధ్యమున దగ్గులు తుమ్ములు తీరిపోయినన్
  రోగులె భాగ్యవంతులు కరోన కురోగ నియోగమందినన్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు


  1. జీపీయెస్ వారు

   మీ కోసం ఓ రసవత్తరమైన "రొసొగుల్ల"


   https://youtu.be/5mUJliiqur0   Enjoy


   జిలేబి

   తొలగించండి

  2. 🙏

   చూచెదను....ధన్యవాదములు!

   మీకోసం ఇది:

   https://youtu.be/KVUlvzPfRJ8


   తొలగించండి
 3. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

  రిప్లయితొలగించండి

 4. ఆటవిడుపు సరదా పూరణ:
  (జిలేబి గారికి అంకితం)

  బాగుగ కార్పొరేటులిట వందల కోటులు కర్చుపెట్టుచున్
  రోగములెల్ల తీర్చుటకు రొప్పుచు రోజుచు కట్టిపెట్టగా
  వేగమె వైద్యశాలనహ పెక్కురు చేరగ హాయినొందరే
  రోగులె భాగ్యవంతులు కరోన కురోగ నియోగమందినన్

  రిప్లయితొలగించండి
 5. క్రొవ్విడి వెంకట రాజారావు:

  రేగుచు బాధించిననూ
  వాగడుపుల వంటివైన వ్యాధుల తోడన్
  బాగుగ మందులు గల యా
  రోగులు సంపన్నులే కరోనా వలనన్.
  (వాగడుపు= ఉదరసంబధిత వ్యాధి/ కడుపునొప్పి వటిది)

  రిప్లయితొలగించండి
 6. గురువుగారికి నమస్కారం 🙏

  ఆగముజేయగవచ్చిన
  రోగనివారణముజేయరోగముతగ్గన్
  వేగమెమందులువాడిన
  రోగులుసంపన్నులేకరోనావలనన్.

  *యస్ హన్మంతు*

  రిప్లయితొలగించండి
 7. క్రొవ్విడి వెంకట రాజారావు:

  రేగుచు బాధలన్ జొనిపి లేచెడి సాంక్రమితమ్ములైనవౌ
  వాగడుపాది రుగ్మతలు పైబడ జేయగ గాసినొందినన్
  బాగుగ మందులన్ గలిగి వ్యాధులనుండి విముక్తులయ్యెడి నా
  రోగులె భాగ్యవంతులు కరోన కురోగ నియోగమందినన్

  రిప్లయితొలగించండి
 8. కె.వి.యస్. లక్ష్మి:
  గురువుగారికి నమస్కారములు. దయతో నిన్నటి పూరణ పరిశీలించగలరు.

  ఎంచడు వరముల నొసగగ
  వంచకులకు; మాధవు డిడు వరమోక్షమ్మున్
  మంచిని వీడక నెప్పుడు
  సంచిత కర్మలు సలిపెడు సత్పురుషులకున్.

  రిప్లయితొలగించండి
 9. మూగిరి ఆస్పత్రులలో

  రోగులు,సంపన్నులే కరోనా వలనన్

  బాగుగ డబ్బులు గుంజుచు

  రోగము లేకున్నను వఠరులు
  దయ లేకన్

  రిప్లయితొలగించండి
 10. భోగులకే రోగములని
  బాగుగ భావించి యాసుపత్రుల లోనన్
  మ్రూగుచు దోచేయఁగ, నతి
  రోగులు సంపన్నులే? కరోనా వలనన్?

  రిప్లయితొలగించండి
 11. జోగివలె నెవరి తోడను
  సాగతమొందక బతుకును సాగించుటయే
  భోగముగ తలచినయెడల
  రోగులు సంపన్నులే కరోనా వలనన్

  రిప్లయితొలగించండి


 12. అనుకొంటి సుమా! కాబో
  లును రోగులె భాగ్యవంతులు కరోన కురో
  గ నియోగమందినన్ క్షణ
  మున మోక్షముగిట్టును తబముల చేయకనే  జనాలు వాయగొట్టకుంటే చాలును‌:)


  జిలేబి

  రిప్లయితొలగించండి


 13. పరుగుల వచ్చు ఆంబులెన్సు గ్రీను కలరు ంంంంంంంంంంంంంంంంంంంంంంంం
  బాగోగుల చూచుకొనన్
  వేగముగ పరుగుల నింట వేంచేసి భళా
  రే గౌరవ మర్యాదలు !
  రోగులు సంపన్నులే కరోనా వలనన్


  జిలేబి

  రిప్లయితొలగించండి
 14. రోగము వచ్చె దైవమ! కరోన యటంచును భీతి వీడుచున్
  త్రాగ వలెన్ కవోష్ణసలిలమ్ములు వక్త్రపిధానధారులై
  భోగములన్ త్యజించవలె పో! యని చింతిలు చుండ నంతతో
  రోగులె భాగ్యవంతులు కరోనకు రోగ నియోగమందినన్.

  వక్త్రపిధానము మూతిని కప్పునది మాస్క్.

  కంజర్ల రామాచార్య
  కోరుట్ల

  రిప్లయితొలగించండి
 15. బాగుగ జరుగుచు నున్నను
  రోగులు సంపన్నులే కరోనా వలనన్
  జా గేమాత్రము సేయక
  పోగా వైద్యుని దరికిని పోవుర ఆస్తుల్

  రిప్లయితొలగించండి
 16. జాగరిత లేని జనులిక
  రోగులు, సంపన్నులే కరోనా వలనన్
  వేగుచు నుండిరి నేడిల
  లో గరిబేసిగను మారి రోదించిరయో!

  రిప్లయితొలగించండి
 17. మైలవరపు వారి పూరణ:

  భోగవతీపురమ్ము విడి భూమికి జేరిన కాలసర్పమై
  యాగక స్వీయఫూత్కృతుల నందరి భీతిలజేసి.,దిక్కులన్
  మ్రోగగ మృత్యుఘంటికలు మొత్తము నాశమొనర్చె., నెట్టులీ
  రోగులె భాగ్యవంతులు ? కరోన కురోగ నియోగమందినన్!!

  మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

  రిప్లయితొలగించండి
 18. 27.07.2020
  అందరికీ నమస్సులు 🙏🙏

  నా పూరణ ప్రయత్నం..

  *కం*

  వేగముగను వీడక నీ
  రోగము నేర్పెను సుబుద్ది లోకము నెల్లన్
  సాగిన నిటులను, బుద్ధికి
  *"రోగులు సంపన్నులే కరోనా వలనన్"*

  *కళ్యాణ్ చక్రవర్తి ముంబాయి*
  🙏

  రిప్లయితొలగించండి
 19. సాగును యుద్దము లోలో
  వేగము రక్షణ వ్యవస్థ విధియై చెలగన్,
  ప్రోగుగ ప్లాస్మా గలిగిన
  రోగులు సంపన్నులే కరోనా వలనన్
  కొరుప్రోలు రాధాకృష్ణరావు

  రిప్లయితొలగించండి
 20. రోగము రాదిలెందరికి రోగము వచ్చిన మానకుండునా ?
  భోగము నిత్యమై నిలచి భోగిల భాగ్యము నెప్పుడుండునా ?
  యోగము కల్గ గర్వపడ కో మనుజా ! దగుధైర్యమూనినా
  రోగులె భాగ్యవంతులు కరోన కురోగ నియోగమందినన్"

  రిప్లయితొలగించండి
 21. సమస్య:
  రోగులె భాగ్యవంతులు కరోన కురోగ నియోగమందినన్.
  పూరణము:

  బాగుగ వృద్ధినొందమన భారత దేశము, చీనిదేశముం
  దాగిన యా కరోన యిటు దాపురిలెన్గద, భూతలంబునన్
  వేగుచు మానవాళి యిక వేగమె కోలుకొనంగ, దేవుడా!
  *రోగులె భాగ్యవంతులు కరోన కురోగ నియోగమందినన్.*

  నిన్నటి పూరణము
  ఉ.
  వంచన చేయవానరుడు వాలిని కేలను నిన్ను చేరెనే
  కాంచన కృష్ణసారమును కాండము వేయుచు కల్పుకుంటివే
  *వంచన సేయువారల కవారిత మోక్షము మాధవుం డిడున్*
  వంచకులంత జేర, నిను పాపమెరుంగని నన్నుగావడే?

  రిప్లయితొలగించండి
 22. ఆగము చేయుచుండ ప్రజనల్లకరోన రయమ్ముదేశమున్
  దాగుచునిండ్ల లోపలను తల్చుచు నుండిరి చండిఁ గావగన్
  త్యాగముచేయ ప్లాస్మగతమారడిపొంది శుభమ్ముగొన్న యా
  రోగులె భాగ్యవంతులు కరోన కురోగ నియోగమందినన్

  రిప్లయితొలగించండి
 23. ఆగని మారణ హోమము!
  రేగెను భయ, శోక, నాశ,రిక్త మనంబుల్
  సాగెను దైవారాధన!!
  రోగులు సంపన్నులే కరోనా వలనన్.

  రిప్లయితొలగించండి
 24. భోగములన్ త్యజింపవలె పూర్తిగ, కాదని మూర్ఖచిత్తులై
  రాగము పెంచు కున్ననిక రాగల కాలము వారలెల్లరుల్
  రోగులె, భాగ్యవంతులు కరోన కురోగ నియోగ మందినన్
  వేగమె యోషధీ ధరుల వేడుచు లక్షలు ధారపోతురే.

  రిప్లయితొలగించండి
 25. ఆగక పంజా విసరగ
  మూగగ రోదించు జనులు పొందిరి కలతల్
  ఏగతి పలుకగ వచ్చు ను
  రోగులు సంపన్నులే కరోనా వలనన్?

  రిప్లయితొలగించండి
 26. రేగ విషక్రిమి వెరవక
  నాగుచు గృహమందు నిరత మాధ్యాత్మికమౌ
  యోగము సాధన జేసెడి
  రోగులు సంపన్నులే కరోనా వలనన్

  రిప్లయితొలగించండి
 27. భోగములంతరించె గన భూవర పామర భేదమెంచకన్
  రేగె విషజ్వరమ్ము బలురీతుల దిప్పలు వెట్టుచుండగా
  దాగి నివేశమందు మరి దారియు గానని వారలెట్టులా
  రోగులె భాగ్యవంతులు కరోన కురోగ నియోగమందినన్

  రిప్లయితొలగించండి
 28. రోగి నయమైన పిమ్మట
  రోగనిరోధకపు శక్తి రూఢిగ గలుగన్
  సాగును టీకా ఫలితమె
  రోగులు సంపన్నులే కరోనా వలనన్.

  రిప్లయితొలగించండి
 29. భోగులుగా మారిరియా
  రోగులు సంపన్నులే కరోనా వలనన్
  వీగెనె పల్లెలు చుట్టును
  మూగెను పట్నంపు రద్ధి మోమాటములన్.

  రిప్లయితొలగించండి
 30. ఆగనికరోనదెబ్బకు
  ఏగతియోకనగలేకనేడ్వగపేదల్
  వేగమెవైద్యునికోమగల
  రోగులుసంపన్నులేకరోనావలనన్

  రిప్లయితొలగించండి
 31. సేవా దృక్పథంతో ఉచిత వైద్యసేవనందించే వైద్యులున్నప్పటికీ కార్పొరేట్ వైద్యశాలల్లోవిపరీత ధనదాహంతో భారీగా రుసుములు వసూలు చేయువారిని దృష్టిలో పెట్టుకుని చేసిన పూరణలు.

  కందం
  లాగుట నేర్చిన 'వైద్యులు'
  సాగించఁగ దోపిడీని సమయస్ఫూర్తిన్
  మూగుచు చెల్లింప జడిసి
  రోగులె, 'సంపన్నులే' కరోనా వలనన్!

  ఉత్పలమాల
  లాగుట నేర్చియున్ ధనము లాఘవమొప్పగ స్వార్థ' వైద్యులున్'
  రేగుచు లోకమంతట పరిగ్రహమౌచు జనాళిఁ జంప లో
  దాగిన ప్రాణభీతి కడుదైన్యతఁ గాసు లొసంగు చుండగన్
  రోగులె, 'భాగ్యవంతులు' కరోన కురోగ నియోగమందినన్

  రిప్లయితొలగించండి
 32. వేగిరి భువిలో పలువురు
  రోగులు సంపన్నులే కరోనా వలనన్
  సాగిరి చికిత్స కనుచును
  వేగముగా భీతి తోడ వెజ్జుల దరికిన్

  రిప్లయితొలగించండి
 33. తూఁగినఁ దుమ్మిన దగ్గిన
  నే గతి నైనను హతవిధి యిది తగులు నహో
  యా గిది ధనమా! ధాన్యమ!
  రోగులు సంపన్నులే? కరోనా వలనన్


  ఏ గతి లంచ మిచ్చిన నహీన విభుత్వ భయ మ్మొసంగినం
  దా గతి మార్చ నెంచదు సత మ్మిసు మంతయు భేద ముంచదే
  యోగము కల్గి నంతటనె యుక్త కుకీటము పేద లైననున్
  రోగులె భాగ్యవంతులు కరోన కురోగ నియోగమందినన్

  [ రోగులె భాగ్యవంతులు = భాగ్యవంతులు రోగులె]

  రిప్లయితొలగించండి
 34. ఆగాంధీహాస్పిటలుపు
  రోగులుసంపన్నులే,కరోనావలనన్
  రోగులుగాకనుమిగిలిన
  బాగునుగలవారుకూడభయమునమెలగే

  రిప్లయితొలగించండి
 35. ఉ:

  ఏగతి నైన దప్పుకొన యెంచి కరోనను పారదోలనై
  వేగమె మార్చి పద్ధతులు వెచ్చము లెంపిక జేసి వాడగన్
  బాగగు టేమి !! జాడ్యమును బాపగ తోడగు రక్ష గూర్చగన్
  రోగులె భాగ్యవంతులు కరోన కురోగి నియోగ మందునన్

  వై. చంద్రశేఖర్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. వెచ్చములు =మందులు వండుటకు కావలసిన శొంఠి పిప్పళ్ళు మొ//

   తొలగించండి
 36. వీగగయాకరోనభువివిచ్చగడెందము,సంతసంబులౌ
  రోగులెభాగ్యవంతులు,కరోనకురోగనియోగమందినన్
  వేగమెవైద్యశాలకునుభీతినిజెందకనేగుచో,నగున్
  బాగదితప్పకుండగనుభారతి!నేర్వుముముఖ్యమౌదిగా

  రిప్లయితొలగించండి
 37. సమస్య

  రోగులె భాగ్యవంతులు కరోన కురోగ నియోగమందినన్

  ఉత్పలమాల

  రోగముసంక్రమించెను కరోడ్పతివృద్ధులకా కరోన!త
  ద్రోగముహెచ్చెపోటుషుగరుండుటచేరుధిరంబునందునన్
  బాగయినట్టిరోగితనప్లాస్మనొసంగుచునిల్పెఁబ్రాణముల్
  రోగులె భాగ్యవంతులు కరోన కురోగ నియోగమందినన్

  గాదిరాజు మధుసూదన రాజు

  ఈ కరోనా కష్టకాలములో
  ఆరోగ్యభాగ్యమును దక్కించుకొన్నవారే భాగ్యవంతులు అని భావము

  రిప్లయితొలగించండి
 38. వేగమె విశ్వమంతటను విస్తృతరీతిగ వ్యాప్తినొందు నా
  రోగముదెచ్చు కీటకము రోతగ చెంతకు చేరినంతనే
  భోగములన్నియున్ విడచి పోరును సల్పెడునట్టి ధీరులౌ
  రోగులె భాగ్యవంతులు కరోన కురోగ నియోగమందినన్

  రిప్లయితొలగించండి
 39. వేగము విజృంభణము నా
  వేగముబెంచగ కరోన విశ్వంబందున్
  భోగములన్నియువిడచిన
  రోగులు సంపన్నులే కరోనా వలనన్

  రిప్లయితొలగించండి
 40. కె.వి.యస్. లక్ష్మి :

  రోగము ప్రబలిన వేళల
  వేగమె సేవలు సలిపెడి వెజ్జుల కరుణన్
  రోగము కుదురుచు నుండెడి
  రోగులు సంపన్నులే కరోనా వలనన్.

  రిప్లయితొలగించండి
 41. ఆరోగ్య మహాభాగ్యమనుచు రొప్పించెన్
  మానవుడెన్నటికి తలంచు తానారొగ్యమున్
  రొక్కమ్ దెచ్పుపెక్కు అనారోగ్యములన్
  రోగులు సంపన్నులే కరోనా వలనన్.


  -రూపనగుడి రాఘవేంద్ర ప్రసాద్
  అనంతపురం,గుంతకల్లు.


  పూజ్యనీయులైన గురువులు కవులు సాహితీవేత్తలు
  నన్ను మనస్పూర్తిగా క్షమించాలి మీ రోజు వారి సమస్యలు ఉత్తర ప్రత్యుత్తరాలు చదువుతూ నాకు తెలుగు పై ఉన్న మమకారంతో రాయాలని బుద్ది పుట్టి చందస్సు అలంకారాలు సుడులు తెలుగు గ్రామర్ అస్సలు రాకపోయినా,తొలి ప్రయత్నంగా ఏదో తోచినది వ్రాసాను,అన్ని తప్పులే అని తెలుస్తున్నది అయినా అయ్యవార్లు తప్పైతే తప్పక క్షమిస్తారని
  చిన్న ఆశతో....

  రిప్లయితొలగించండి