6, జులై 2020, సోమవారం

సమస్య - 3419

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"తన్నిన నవ్వంగ నొప్పు దాప ముడుగుచున్"
(లేదా...)
"తన్నిన ధిక్కరించినను దాపము నొందక నవ్వుటొప్పగున్"

85 కామెంట్‌లు:


 1. నడిరేయి సరదా పూరణ:

  కన్నుల నెఱ్ఱ జేయుచును కంపము నొందుచు దూషణమ్ములన్
  చెన్నుగ తిట్టుచున్ మరిది చెంపలు పిండుచు వాచిపోవగన్
  పన్నుగ కాళ్ళు చేతులిడి పండుగ పూటను తోటికోడలిన్
  తన్నిన ధిక్కరించినను దాపము నొందక నవ్వుటొప్పగున్

  రిప్లయితొలగించండి
 2. అన్నుల మిన్నలు యలిగిన
  వెన్నునికే తప్పదు గద వేడుట నిక నా
  చిన్నది చిరు కోపంబున
  తన్నిన నవ్వంగ నొప్పు దాప ముడుగుచున్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'మిన్నలు+అలిగిన=మిన్న లలిగిన' అవుతుంది. యడాగమం రాదు. "మిన్నలె యలిగిన...వేడుట యిక.." అనండి.

   తొలగించండి
  2. (సవరణతో)

   అన్నుల మిన్నలె యలిగిన
   వెన్నునికే తప్పదు గద వేడుట యిక నా
   చిన్నది చిరు కోపంబున
   తన్నిన నవ్వంగ నొప్పు దాప ముడుగుచున్

   తొలగించండి
 3. దున్నల పెరిగెడి మనిషికి
  యున్నతి కల్పించదాను నుదరము కొరకై
  నెన్నో నేర్పిన గురువులు
  తన్నిన నవ్వంగ నొప్పు దాప ముడుగుచున్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'వలె' అనే అర్థంలో 'లా/ల' ప్రయోగం సాధువు కాదు. "దున్నగ" అనండి.

   తొలగించండి

 4. ఆటవిడుపు సరదా పూరణ:
  (జిలేబి గారికి అంకితం)

  నిన్ననొ మొన్న జేరుచును నీరజ నేత్రయె పాఠశాలనున్
  చిన్నది తప్పు జేయగను చిక్కులు పెట్టెడి ఛందమందునన్
  పన్నుగ కంది శంకరులు పండ్లను రుబ్బుచు కేకలేయుచున్
  తన్నిన ధిక్కరించినను దాపము నొందక నవ్వుటొప్పగున్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. ఎందుకండీ నన్ను 'బద్‌నామ్' చేస్తారు? నేనెన్నడైనా ఎవరినైనా పరుషంగా ఒక్క మాట అన్నానా?
   సరే... ఆటవిడుపు సరదా పూరణ కదా... కానీండి.
   బాగుంది కానీ... పండ్లను నూరడం విన్నాను... రుబ్బడం.. ఇది బహుశా 'జి.పి.శాస్త్రి మేడ్డిఫికల్ట్' పుస్తకంలోంచి గ్రహించిన జాతీయమై ఉంటుంది. "ఆయ్... మీరేటంటే నానూ అదే!"

   తొలగించండి
 5. అన్నిట సగభాగంబయి
  మన్నించుచు పనులుజేసి మాటలు బడునే
  చిన్నది మల్లెల కొరకై
  తన్నిన నవ్వంగ నొప్పు దాప ముడుగుచున్

  రిప్లయితొలగించండి
 6. * శంకరాభరణం వేదిక *

  06/07/2020..సోమవారం

  సమస్య
  ********
  "తన్నిన ధిక్కరించినను దాపము నొంనవ్వుటొప్పగున్

  నా పూరణ. ఉ.మా.
  *** ********
  చెన్నగు పారిజాతమును జేకొన బూనుచు సత్యభామనే

  వెన్నుని ఱొమ్ము దన్నినను... వేదన జెందక చక్రపాణి వే

  గన్నుల వేల్పునిన్ గెలిచి ఖ్యాతి సమమ్మును ధాత్రి దెచ్చి యా

  యన్నుల మిన్న సత్యకిడి యల్కను మాన్పును గాన పత్నియే

  తన్నిన ధిక్కరించినను దాపము నొందక నవ్వుటొప్పగున్

  -- 🌱 ఆకుల శాంతి భూషణ్ 🌱
  🌷 వనపర్తి🌷  రిప్లయితొలగించండి


 7. నారదా ఈ మధ్య నిశాంత ప్రేమాయణములెక్కువై పోవుచున్నవి :) కారణ మేమై వుండును ?


  వెన్నెల్లో సైకతమున
  మున్నెన్నడు కలుగనట్టి మోహమ్మున నా
  యన్నుల మిన్న జిలేబియె
  తన్నిన నవ్వంగ నొప్పు దాప ముడుగుచున్  జిలేబి
  గుండుసున్న :)

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   అయినా నిత్యబ్రహ్మచారి నారదుడేం చెప్తాడు? తన్నులు తిన్న 'అయ్యర్' గారిని అడగాలి!

   తొలగించండి


 8. ఓదార్పు కందోత్పల


  ప్రకటిత తిధపు సమయమా
  నక, తన్నిన ధిక్కరించినను దాపము నొం
  దక నవ్వుటొప్పగున్ కా
  నుకగా తలచి వలదిక కినుక ప్రియ సఖుడా  జిలేబి

  రిప్లయితొలగించండి


 9. సన్నుతి చేయగా వలయు చక్కదనమ్ముల పేర్మితోడుగా
  మిన్నగ కామసూత్రమిది ‌ మీవడ జుర్రుకొనంగ మేలు నీ
  యన్నుల మిన్న చంద్రముఖి యాసఖి నెయ్యపు వేళ నెమ్మితో
  తన్నిన ధిక్కరించినను దాపము నొందక నవ్వుటొప్పగున్!


  జిలేబి

  రిప్లయితొలగించండి
 10. నిన్నటి శంకరా భరణము వారి సమస్య

  కోమలి తలపైన రెండు కొమ్ములు పుట్టెన్


  ఇచ్చిన సమస్య కందపాదము

  నా పూరణము సీశములో


  కృష్ణుని చంపుటకు పూతన అతి సుందరవతిగా మారి పాలు ఇచ్చు నెపముతో నంద కులమునకు వస్తుంది. పూతన మరణము పొందు నపుడు జరుగు పరిణామములు ఒక్కొక్కటిగా గని నంద కులము లో జనులు పరుగిడినారు అను భావన  వ్రజవరుడు చనులన్ వాటము గాపట్టి ముదముగ వేయగ మొదటి గుటక

  భీకఱ మైనట్టి పీడను పొందుచు, రెండవ గుటకుకు గుండె గతులు

  తప్పగ చుక్కలు ద్రాపమున గని ఘోరంబుగ నచట నరచుచు పడెను

  ధరణి పై ,కోమలి తలపైన రెండు కొమ్ములు పుట్టె నెదుటి పలువరుసలు  కోరలుగ మార, రుధిరము కార నోట

  పూతన తన కోమల రూపమును వదలచు

  మరణమును పొంద భీతిల్లి పరుగు లెట్టె

  జనులు భీషణ దృశ్యమున్ కనుల గాంచి

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మంచి సన్నివేశాన్ని ఎన్నుకున్నారు పూరణకు. ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
   'జనులు' బహువచనం, 'పరుగుపెట్టె' ఏకవచనం. "పారినారు జనులు..." అందామా?

   తొలగించండి
  2. నమస్కారము గురు వర్యా‌ ధన్యవాదాలు

   తొలగించండి
 11. గురువు గారు నమస్కారం ఒకసారి పరశీలించి మీ‌ సూచనలు ఇవ్వవలెను

  రిప్లయితొలగించండి
 12. అన్నిట మిన్ననౌరసుల నాదర మొప్పగ పెద్దజేసి తా
  మెన్నియొ కష్టముల్ గరచి మేటిగ వర్ధిల మంచి నేర్పి వీ
  రెన్నటికైన మోక్షకరులేయని ప్రీతిలు తల్లిదండ్రులున్
  తన్నిన ధిక్కరించినను దాపము నొందక నవ్వుటొప్పగున్

  రిప్లయితొలగించండి
 13. కన్నయ్యా యని పిలిచెడు
  చిన్నారి తనయుండు ముద్దు జేసెడి వేళన్
  చెన్నుడు తల్లిని దండ్రిని
  తన్నిన నవ్వంగ నొప్పు దాప ముడుగుచున్

  రిప్లయితొలగించండి
 14. నిన్నటి కసి మదినుండగ
  తిన్నగ నాదరిజేరి పది నెలలు దీరిన వాడౌ
  చిన్న మనుమడెద నెక్కుచు
  తన్నిన నవ్వంగ నొప్పు , దాప ముడుగుచున్

  రిప్లయితొలగించండి
 15. తన్నినను రహూగణుడను
  మన్నీడా జడభరతుని మదమున, క్షమతో
  మన్నించె! సంయములటులఁ
  దన్నిన నవ్వంగ నొప్పు దాప ముడుగుచున్!

  రిప్లయితొలగించండి
 16. మిన్నగ ప్రేమ పంచుచును,మీదుగమిక్కిలి కోర్కెదీర్చుచున్
  ఎన్నగ కీర్తిశాలియని,యెందరుమెచ్చినపొంగిబోవకన్
  కన్నులకాంతినింపు గుణకారుడు, కృష్ణుడు భక్తులందరిన్
  తన్నిన ధిక్కరించినను,తాపమునందకనవ్వుటొప్పగున్
  **********++++++++
  రావెల పురుషోత్తమరావు

  రిప్లయితొలగించండి
 17. ముమ్మరమయ్యె సెల్ఫిఁ గొను మోహమ నేకవిధమ్ములన్ ధరన్
  గుమ్మ యొకత్తు శీర్షమున కూర్మి శుకమ్ము బిడాలశాబముల్
  నెమ్మి ధరించుచన్ గొనియె నిట్లె వృషాస్యము ముందుఁ జేకొనన్
  కొమ్ములు రెండు పుట్టినవి కోమలి శీర్షమునందుఁ గాంచఁగన్

  కంజర్ల రామాచార్య.

  రిప్లయితొలగించండి
 18. సన్ననిగాత్రధర్మమును,సంస్కృతినిండెడుపూర్ణరూపమున్
  అన్నులమిన్నగావెలుగు నాశలదీపమురామచంద్రుడే
  తిన్నగచెంతజేరిమన,తిప్పలుదీర్చెడు ధర్మమూర్తియే
  తన్నిన ధిక్కరించినను,దాపమునందకనవ్వుటొప్పగున్
  ++++++++++++++++++++++++++
  రావెల పురుషోత్తమ రావు

  రిప్లయితొలగించండి
 19. మైలవరపు వారి పూరణ

  చిన్నికృష్ణా నిన్ను జేరి కొలుతు 🙏

  *అమ్మ మనసు*

  నున్నని పాలబుగ్గలివి., నోటిని జూడుడు లక్కముంత., మా
  కన్నయ మంచివాడు., తనకై కొనిపోవడు పాలు వెన్న., మీ..
  రెన్ని వచించినన్ విననదే పనిగా., పసివాడు మిమ్ములన్
  దన్నిన ధిక్కరించినను తాపమునొందక నవ్వుటొప్పగున్!!

  మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

  రిప్లయితొలగించండి
 20. చెన్నుగసుదతీ నీ కను
  సన్నలలోమెలఁగువాడసత్యాపతినే
  నన్నదివినవా నీవిటు
  తన్నిన నవ్వంగ నొప్పు దాప ముడుగుచున్

  రిప్లయితొలగించండి
 21. అన్నుల మిన్ననున్ వలచి యక్కున జేర్చి యపారమోహసం
  పన్ననిమగ్నుడైన తరి భామిని కోరిన వస్త్రభూషలన్
  మన్ననఁ గూర్చ లేని తఱి మానిని యల్క వహించి సత్యయై
  తన్నిన ధిక్కరించినను దాపము నొందక నవ్వుటొప్పగున్

  కంజర్ల రామాచార్య.

  రిప్లయితొలగించండి
 22. మన్నన సేయుటె సరియగు
  నన్నా! తప్పనిన నమ్మ యయ్యల పలుకుల్
  మిన్నగ దీర్చెడి గురువులు
  "తన్నిన నవ్వంగ నొప్పు దాప ముడుగుచున్"

  రిప్లయితొలగించండి
 23. ఎన్నిక లందున నెవ్వరు
  తన్నిన నవ్వంగ నొప్పు దాప ముడుగుచున్
  తన్నొక పదవి వరించిన
  నన్నియు నయ్యెడ మరచియు హాయిని గనరే !

  రిప్లయితొలగించండి
 24. ఎన్నియొ కట్న కానుకలు యిచ్చి వివాహము చేసి శోభతో

  నన్ను ముదంబు నొందమని‌ నాధుని యింటికి పంపినారుగా

  నన్నత డెన్నడున్ సతిగ నాదరణమ్ముగ చూడకుండెగా

  యెన్నియొ మార్లు నా స్దితిని యేడ్చుచు తెల్పిన పల్క కుంటిరే

  తన్నిన ధిక్కరించినను దాపము నొందక నవ్వుటొప్పగున్"

  మన్నన లొందుమా యనుచు మాటల పల్కుట పాడిగాదు నా

  పన్నుల కాచునా శివుని ప్రార్ధన
  చేయ శుభంబు కల్గు గా

  మన్నన చేయు మిప్పుడని మాలిని తల్లిని గాంచి పల్కెగా

  రిప్లయితొలగించండి


 25. ఏడుకొండల వెంకట రమణా గోవిందా గోవింద !  "తిన్నగ భూలోకమునకు
  చెన్నుగ నే వెడలెదన్" వచించెను రమ! నా
  పెన్నిధి నా పతిని భ్రుగువు
  తన్నిన నవ్వంగ నొప్పు దాప ముడుగుచున్?"  జిలేబి


  రిప్లయితొలగించండి
 26. ఎన్నియొ నోములున్ వ్రతములెన్నియొ జేసిన పుణ్యలబ్ధిచే
  కన్న సుతుండటంచు కడు గారము జేయుచు పెంచుకొన్న యా
  చెన్నుడు దుర్మతుండు ఖలు చిత్తుడు మద్యము గ్రోలి మత్తులో
  తన్నిన ధిక్కరించినను దాపము నొందక నవ్వుటొప్పగున్

  రిప్లయితొలగించండి
 27. మన్నించి లోకు లెల్లరు
  నన్నెన్నుకొనెదరటంచు నమ్ముచు వాడా
  యెన్నికలను నిలువ జనులు
  తన్నిన నవ్వంగ నొప్పు దాప ముడుగుచున్

  రిప్లయితొలగించండి
 28. కన్నుయు మిన్నుయు కానక
  చెన్నుని తాచెను భృగుముని చీదర తోడన్ |
  పన్నగ శయనుడు తొణకక
  "తన్నిన నవ్వంగ నొప్పు దాప ముడుగుచున్"

  రిప్లయితొలగించండి
 29. 06.07.2020
  అందరికీ నమస్సులు🙏

  *కం*

  వెన్నెల రాతిరి సరసన
  చిన్నది తా చేర వచ్చి చిందులు వేయన్
  కన్నియ సరసమున నపుడు
  *"తన్నిన నవ్వంగ నొప్పు దాప ముడుగుచున్"*

  *కళ్యాణ్ చక్రవర్తి ముంబాయి*
  🙏

  రిప్లయితొలగించండి
 30. (ఒక తల్లి తన కొడుకుతో ...)
  నిన్నిటు బెంచె ప్రేమగను నీ యభివృద్ధినె గోరునెన్నడున్
  కన్నుల ముందు నీవిటుల గానితనమ్మున గానుపింపగా
  నిన్నిక మార్చ బూని దను నిగ్రహమంతయు గోలుపోయెనే
  నాన్నను నమ్ము నాయన, వినాశకరంబగు దీరు వీడి దా
  తన్నిన ధిక్కరించినను దాపము నొందక నవ్వుటొప్పగున్
  నాన్నకు వేరు దైవమిల నమ్ముము లేదయ లోకమందునన్

  రిప్లయితొలగించండి
 31. *శ్రీకృష్ణదేవరాయలతో నందితిమ్మన మాటలు గానూహించి*

  వెన్నుడు పారిజాతమును భీరువు రుక్మిణి కిచ్చెనంచు నా
  యన్నటఁ జెప్పగన్ మిగుల యాగ్రహ మందిన సత్యభామకున్
  గన్నులు నిప్పులన్ గురిసె కంఠము గద్గద మయ్యె, చక్రికిన్
  తన్నిన ధిక్కరించినను దాపము నొందక నవ్వుటొప్పగున్

  రిప్లయితొలగించండి
 32. ఎన్నగకరోనరక్కసి
  మిన్నంటుచుమారురూపుమెలగినగానీ
  జన్నముపరమాత్మదియని
  తన్నిననవ్వంగనోప్పుఁదాపముడుగుచున్

  రిప్లయితొలగించండి
 33. చిన్నారియుఁ దల్లిని, నా
  కన్నయ్యను నాలి సత్య, కార్షుఁడు పొలమున్
  బున్నమి రాతిరి నా చెలి
  *"తన్నిన నవ్వంగ నొప్పు దాప ముడుగుచున్"*

  (All in one 😃)

  రిప్లయితొలగించండి
 34. ఎన్నగనాగరీకముననేమనిఁజెప్పకఁజూచువారమే
  పన్నుగపార్వతీరమణిపాయకజీనునువేసినన్దుదిన్
  కన్నులుమూఁడుఁజాలవుగకాల్చగభామినిభూరితేజమున్
  తన్నినధిక్కరించిననుదాపమునోందకనవ్వుటోప్పగున్

  రిప్లయితొలగించండి
 35. ఎన్నియొ నోములన్ సలప నింపగు పుత్రుడు పుట్టెనిక్క మా
  కన్నడు చక్కగా పెరుగఁ గాంచుచు నుంటిమి మోదమింటిలో
  చెన్నుగ మాటలాడుచును చేయుచు నల్లరి, వాడు కాలితో
  తన్నిన ధిక్కరించినను దాపము నొందక నవ్వుటొప్పగున్

  రిప్లయితొలగించండి
 36. అవధానాలలో అప్రస్తుత ప్రసంగ పృచ్ఛకుని స్థితి....

  దన్నుల సాగుచున్న నవధానమునందున పృచ్ఛకుండునై
  పన్నుగ వేయగన్ జిలిపి ప్రశ్నల నా యవధాని దీటుగా
  నెన్నుచు నుత్తరంబులను నిచ్చును మాటలతోడఁ జెచ్చెరన్
  దన్నిన ధిక్కరించినను దాపము నొందక నవ్వుటొప్పగున్

  రిప్లయితొలగించండి
 37. అన్నుల మిన్నా వినుమా
  వెన్ను విఱుగఁ బడ్డఁ బాలు పితుకుచు నుండన్
  గిన్నెను గైకొని ధేనువు
  తన్నిన నవ్వంగ నొప్పు దాప ముడుగుచున్


  ఎన్నఁ దరమ్మె యేరికిని నెన్నఁడు దియ్యని పారవశ్యపుం
  గన్నని వేణుగానపుఁ బ్రకంపన ధాటి సహించ నోపునే
  మిన్నఁగ భక్తి నా నుదధి మేదిని లోకుల కంద నంత లో
  తన్నిన ధిక్కరించినను దాపము నొందక నవ్వు టొప్పగున్

  [అన్ను =పరవశమగు]

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ రెండు పూరణలు ప్రశస్తంగా, వైవిధ్యంగా ఉన్నవి. అభినందనలు.

   తొలగించండి
  2. పూజ్యులు శంకరయ్య గారికి నమఃపూర్వక ధన్యవాదములు.

   తొలగించండి
 38. అన్నెలతియలిగికృష్ణుని
  తిన్నగదానేగశయనదీమపుకడకున్
  కన్నడుపొదువునకరుగగ
  తన్నిననవ్వంగనొప్పుదాపముడుగుచున్

  రిప్లయితొలగించండి
 39. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

  రిప్లయితొలగించండి
 40. కన్నకుమారుడెయ్యెడనుగారముతోడనుగాలునెత్తుచున్
  తన్నినధిక్కరించిననుదాపమునొందకనవ్వుటొప్పగున్
  నన్నులమిన్నగాగనిననాత్మభవుంగడుబ్రేమజూచుటన్
  చిన్నవయస్కుబాలలటుజేతురుబ్రేమనుగన్నవారినిన్

  రిప్లయితొలగించండి
 41. చిన్నతనంబునందతనిచేష్టితముల్ కడుముద్దు గొల్పగా
  కన్నకుమారునెంతయునుగారముజేయుచు తల్లిదండ్రియున్
  కన్నులలోనవెట్టుకొనికావలికాతురుయాగడంబునన్
  తన్నిన ధిక్కరించినను దాపము నొందక నవ్వుటొప్పగున్

  రిప్లయితొలగించండి
 42. పన్నగ నెన్నికుట్రలను పాపపు కర్మల జేయువారలై
  కన్నుల పంటలెవ్వరును గానక యుండుచు నున్నవృద్దులే
  యెన్నగ లేక కోరికల నేమరి పాటున నైనదీరకన్
  తన్నిన ధిక్కరించినను దాపము నొందక నవ్వుటొప్పగున్!!

  రిప్లయితొలగించండి
 43. కందం
  కన్న సుతాలిని మించుచు
  మిన్నగ దౌహిత్రు నేల మెచ్చుదు మమతన్
  తిన్నగ హత్తిన గుండెకుఁ
  దన్నిన నవ్వంగ నొప్పు దాప ముడుగుచున్


  ఉత్పలమాల
  నిన్నటి కెన్న వత్సరము నేరిచె నడ్కను ముద్దుమాటలన్
  కన్న సుతాలి మించు తమకమ్మది రేగుచుఁ బట్టిపట్టిపై
  మిన్నఁగఁ గల్గునెందులకొ? మెల్లన హత్తుకొనంగ గుండెలన్
  దన్నిన ధిక్కరించినను దాపము నొందక నవ్వుటొప్పగున్!

  రిప్లయితొలగించండి
 44. ఉ:

  ఎన్నియొ పాడి యావులు మరెన్నియొ గేదెలు బెంపు సేయగన్
  చిన్నవి లేగదూడలను చేపుల రాకకు లోభబెట్టుచున్
  వెన్నుని బోలు కాపరులు వేకువ ఝామున పాలు పిండనై
  తన్నిన ధిక్కరించినను దాపము నొందక నవ్వుటొప్పగున్

  వై. చంద్రశేఖర్

  రిప్లయితొలగించండి
 45. అన్నుల మిన్నయగు సతియు
  తన్నిన నవ్వంగ నొప్పు దాప ముడుగుచున్
  మన్నించు మనుచు కోరుచు
  చిన్నగ నవ్వుచు మురారి సేవలు చేసెన్

  కన్నడు నాడుచు పాడుచు
  చిన్నగ కేరింత లిడుచు చిరునగవులతో
  వెన్నున నెక్కుచు చిలిపిగ
  తన్నిన నవ్వంగ నొప్పు దాప ముడుగుచున్

  నున్నని పాలబుగ్గల ను నొక్కుచు తల్లియు వెన్నముద్దలన్
  కన్నని నోటబెట్టుచును కౌతుక మొప్పగ బాలుడాడుచున్
  తన్నిన ధిక్కరించినను దాపము నొందక నవ్వుటొప్పగున్
  మన్నన చేయుచుండునట మానుగ బిడ్డడి నాదరించుతాన్

  రిప్లయితొలగించండి
 46. ఉ॥
  నన్నిరు లందు వేయుచును నాకము కేగిరి తల్లిదండ్రులే

  మన్నన జేయ రెవ్వరును మైత్రిని జేయగ లేరు స్నేహితుల్

  అన్నము లేక యుంటి పరమాత్ముడె సర్వము చూచు నా గతిన్

  "తన్నిన ధిక్కరించినను దాపము నొందక నవ్వుటొప్పగున్

  రిప్లయితొలగించండి