14, జులై 2020, మంగళవారం

సమస్య - 3427

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"అందియల వీడనొప్పు నాట్యమున రంభ"
(లేదా...)
"మంజీరమ్ముల వీడి చేయఁదగు రంభా నాట్య మీ వేదికన్"

40 కామెంట్‌లు:


  1. నడిరేయి సరదా పూరణ:

    గంజాయిన్ గొని భాజపాల జనులే గాఢమ్ముగా సోలగన్
    కంజాతమ్మును బోలు మోము గొనుచున్ గారాబు మేకప్పుతో
    జంజాటమ్ముల వీడి దీది నగుచున్ జంబమ్ముతో వంగనున్
    మంజీరమ్ముల వీడి చేయఁదగు రంభా నాట్య మీ వేదికన్

    రిప్లయితొలగించండి

  2. మాయా వేదిక ! కందగీతి!


    అనసూయ! అందియల వీ
    డనొప్పు నాట్యమున రంభ, డంబము కాదోయ్
    వినుమీ వేదిక ఘల్లను
    తనువిచ్చి నటనము సేయ తరుణీ తానై!


    జిలేబి

    రిప్లయితొలగించండి

  3. ఆటవిడుపు సరదా పూరణ:
    (జిలేబి గారికి అంకితం)

    కంజాక్షీ! విని నాదు మాట వడిగా కంపమ్మునున్ వీడుచున్
    గంజా గుండున పాదమూనుచునహో కంగారునున్ లేపుచున్
    పంజావిప్పి ప్రియంక! యోగి ముఖమున్ బాధించి జాడించుచున్
    మంజీరమ్ముల వీడి చేయఁదగు రంభా నాట్య మీ వేదికన్

    రిప్లయితొలగించండి
  4. దేవతలగూడి గొలువును దీరియుండ
    నప్సరసలు నృత్యముజేయ నటకు జేరె
    వజ్రి పనుపున వేదికపయిన దాను
    నందియల వీడనొప్పు నాట్యమున రంభ

    రిప్లయితొలగించండి
  5. పాతయొకరోత వీడుమువాటినెల్ల
    కట్టుబొట్టున పెనుమార్పుకాననగును
    అమరలోకాన మార్పులకనుగుణముగ
    అందియల వీడనొప్పు నాట్యమున రంభ

    రిప్లయితొలగించండి
  6. మైలవరపు వారి పూరణ

    శయనైకాదశినాడు..
    ఇంద్రుడు రంభతో

    కంజాక్షుండదె నిద్రవోవ జనెనేకాదశ్యహమ్మందు., నన్
    రంజింపన్ సుమనోజ్ఞదివ్యనటనానైపుణ్యమున్ జూపుచో
    శింజానమ్మది చాలు భంగపరుపన్ శ్రీకాంతు నిద్రారతిన్!
    మంజీరమ్ముల వీడి చేయఁదగు రంభా నాట్య మీ వేదికన్!!

    మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మైలవరపు వారిది అద్భుతమైన పూరణ.

      తొలగించండి
    2. మాన్యులు గురుతుల్యులు శ్రీ నరాల రామారెడ్డి గారి ఆశీస్సులతో.... 🙏🙏

      మంజుశ్రీ! కమనీయనాట్యము గనన్ మా దేవి వేంచేసెడిన్
      రంజిల్లంగ జయంతుడామె యొడి నిద్రన్ మున్గినాడిప్పుడే.,
      శింజానమ్మది చాలు భంగపరుపన్ చిన్నారి నిద్రన్., వడిన్
      మంజీరమ్ముల వీడి చేయఁదగు రంభా ! నాట్య మీ వేదికన్!!

      మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

      తొలగించండి
  7. కొలువు నందున నాడుచు కుప్ప కూల
    పదము లందున క్షతములు బాధ పెట్ట
    దేవ వైద్యుని సూచన దివ్య మనుచు
    అందియలు వీడ నొప్పు నాట్యమున రంభ

    రిప్లయితొలగించండి
  8. రంజిల్లున్గద రంగమై నిలిచి శ్రీరాగంబు గళ్యాణియై
    ముంజేతన్గల గంకణమ్ము గద శ్రీపుణ్యంబు సంసారమై
    కంజాతమ్ములు పుత్రపౌత్రులన శ్రీగానమ్ము ముద్దుముచ్చటై
    మంజీరమ్ముల వీడి చేయఁదగు రంభా నాట్య మీ వేదికన్

    కొరుప్రోలు రాధాకృష్ణ రా వు

    రిప్లయితొలగించండి

  9. పిన్నక నాగేశ్వరరావు.

    సవ్వడులు లేక నాట్యమ్ము సలిపి మాకు
    మెండు మోదమ్ము కలిగించు నిండు సభన
    టంచు దేవేంద్రు డిచ్చిన యాజ్ఞతోడ
    నందియల వీడనొప్పు నాట్యమున రంభ.

    రిప్లయితొలగించండి
  10. రంజిల్లున్గద రంగమై నిలిచి శ్రీరాగంబు గళ్యాణియై
    ముంజేతన్గల గంకణమ్ము గద శ్రీపుణ్యంబు సంసారమై
    కంజాతమ్ములు పుత్రపౌత్రులన శ్రీగానమ్ము బంధమ్మునై
    మంజీరమ్ముల వీడి చేయఁదగు రంభా నాట్య మీ వేదికన్

    కొరుప్రోలు రాధాకృష్ణ రావు
    సరిచేసిన పద్యం

    రిప్లయితొలగించండి
  11. రంభ సినిమాలు జూడగ రసికులెల్ల!
    వేగిరపడుదు రదియేమొ వెర్రిగాను!
    క్లబ్బు డాన్సుల జేసెడి కాలమందు,
    "అందియల వీడనొప్పు నాట్యమున రంభ"

    రిప్లయితొలగించండి
  12. మేనకా! ఊర్వశీ ! అహో! మీరలింక
    *అందియల వీడనొప్పు! నాట్యమున రంభ*
    నేడపూర్వ చతురిమ రాణించె నంచు
    పలికె సురపతి నర్మగర్భంపురీతి!

    రిప్లయితొలగించండి
  13. పరమ పావనులగు ఋషి వర్యులిచట
    తపమొనర్చెడు దివ్య ప్రాంతమ్ము కాదె
    భగ్నమవకుండ కాపాడ వారి దీక్ష
    అందియల వీడనొప్పు నాట్యమున రంభ

    రిప్లయితొలగించండి
  14. కంజాతాక్షుని రాక దెల్పె మురళీ గానమ్మదే జూడవే
    రంజింపన్ మది నీదు లాస్యముల నారంభింప జాగేలనే
    మంజూషల్ మణిభూషణమ్ములను మోమాటమ్ము బోనాడుమా
    మంజీరమ్ముల వీడి చేయఁదగు రంభా నాట్య మీ వేదికన్

    రిప్లయితొలగించండి
  15. నాట్యమాడుటయగుటతోనాట్యకత్తె
    యందియలవీడనొప్పు,నాట్యమునరంభ
    యందెవేసినజేయిగానలరెదివిని
    రంభయనగనునెఱుగుమాయప్సరసగ

    రిప్లయితొలగించండి
  16. చేటుఁదెచ్చుగామనిషికిచేర్చనగలు
    దాగియున్నదిపురుగదిదాడిసేయు
    ఘల్లుఘల్లనగజ్జెలగోలవద్దు
    అందియలవీడనోప్పునాట్యమునరంభ

    రిప్లయితొలగించండి
  17. శా. గంజాయిన్ గొని పబ్బు చేరి మునుగంగా మత్తునన్, కన్నులన్
    కెంజాయల్, మదమెంతయున్ ముఖమునన్ క్రీడించగా తూలుచున్
    భంజించంగ కడంగి బల్లల నతండే, ప్రేలె నీ రీతిగన్
    మంజీరమ్ముల వీడి చేయదగు రంభా నాట్యమీ వేదిపై !

    రిప్లయితొలగించండి
  18. మంజీరా తటమందు నాకొరకు సమ్మానమ్ము నే జేయుచున్
    బంజారా తెగ వారు వింతయగునో పందెమ్మునే పెట్టిరే
    రంజింపన్ వలె నాట్యమందచటి సంరంభమ్ములో నర్తువే
    మంజీరమ్ముల వీడి చేయఁదగు రంభా నాట్య మీ వేదికన్

    రిప్లయితొలగించండి
  19. దృష్టి నాట్యమం దుంచుము దేవి యింక
    మాటి మాటికిఁ గననేల మగువ వాటి
    భామ దుశ్శంక, కాంచీ రవ సదృశమ్ము
    లందియల, వీడ నొప్పు నాట్యమున రంభ

    [అందియల = అందియలే]


    భంజాదేవి కృపా కటాక్షములు రంభా నీకు నేపారగం
    గంజాక్షీ! మృగరాజమధ్య! విలసద్గౌరాంగి! స్ఫూర్జత్ప్రభా
    మంజీరమ్ములు వే ధరించి యిఁక సంభగ్నావమర్దమ్ము లీ
    మంజీరమ్ముల వీడి చేయఁదగు రంభా నాట్య మీ వేదికన్

    [భంజా దేవి = అన్నపూర్ణా దేవి]

    రిప్లయితొలగించండి
  20. రిప్లయిలు
    1. శా:

      పింజారీ దళ మంత జేరె నకటా ప్రేమాకలాపమ్మనిన్
      గంజాయిన్ గొని తూగ, పౌరులట హంగామాను వారింపగన్
      గుంజాటమ్ముల జిక్క నేలయని రంగుల్ మార్చి నెక్కాడ హో
      మంజీరమ్ముల వీడి చేయదగు రంభా నాట్య మీ వేదికన్

      వై. చంద్రశేఖర్

      తొలగించండి
  21. రంజిల్లంగను చేయు వాద్యములనిర్వర్తించు కార్యమ్మిదే
    మంజీరమ్ముల నాదముల్ కృతకమౌ మార్గమ్ములోఁ గాంచనౌ
    కంజాక్షీ! యిటఁ జక్కగానగునలంకారమ్ముతోరమ్మికన్
    మంజీరమ్ముల వీడి చేయఁదగు రంభా నాట్య మీ వేదికన్

    రిప్లయితొలగించండి
  22. 14.07 2020
    అందరికీ నమస్సులు🙏

    *తే గీ*

    అందగత్తెను నేనను నహము తోడ
    చిత్త మందున క్రోధము చిందులేయ
    తాను నృత్యము జేయగ తలచి నపుడు
    *"అందియల వీడనొప్పు నాట్యమున రంభ"*

    *కళ్యాణ్ చక్రవర్తి ముంబాయి*
    🙏

    రిప్లయితొలగించండి
  23. మంజీరమ్ములుచూడపాతవిగదామారాముజేయంగకీ
    మంజీరమ్ములువీడిచేయదగురంభా!నాట్యమీవేదికన్
    భంజాదేవికటాక్షవీక్షణమురంభాభామదేహంబుపై
    రంజిల్లంగనునాట్యమాడుమసఖీ!రాగంబుజోలాడగా

    రిప్లయితొలగించండి

  24. తేటగీతి
    ప్రతిది నేపథ్య సంగీత మతుకుగాదె!
    తనువు సహియించనొప్పదుఁ దగదనంగ
    వైద్యుని సలహా మేరకు వల్లె యనఁగ
    నందియల వీడనొప్పు నాట్యమున రంభ

    రిప్లయితొలగించండి

  25. శార్దూలవిక్రీడితము
    సంజాతమ్మన వైపరీత్యమగుచున్ సల్పంగ పాదమ్ములున్
    బంజావిప్పును దీట దాల్చ ననినన్ భావించి నిర్మాతనెన్
    రంజిల్లన్ దగ గానమాధురుల సంరంభంబు నేపథ్యమై
    మంజీరమ్ముల వీడి చేయఁదగు రంభా నాట్య మీ వేదికన్

    రిప్లయితొలగించండి
  26. రంభ యనే గురువు శిష్యురాలితో

    వంద తప్పులతోడను కుందజేసి
    క్రిందుమీద లౌచు చెరచక్రీడ,నీకు
    నందియల వీడనొప్పు;నాట్యమున రంభ
    ముందు కుప్పిగంతులవేల బుద్ధిలేద?

    మణిప్రవాళము

    బంజారా నగమందు రాత్రి యువకుల్ బార్లందు జోడీలతో
    గంజాయిన్ దెగబీల్చుచున్ దమకమున్ గానాబజానాలతో
    జంజాటమ్ములు లేక మైకమున నెంజాయ్ జేసెడిన్ వేళలో
    మంజీరమ్ముల వీడి చేయదగు రంభానాట్య మీవేదికన్

    రిప్లయితొలగించండి