1, జులై 2020, బుధవారం

సమస్య - 3414

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"పుత్రుఁ జంపి శివుఁడు పొలఁతి నందె"
(లేదా...)
"పుత్రునిఁ జంపి శంకరుఁడు పొందెను పర్వతరాజ పుత్రికన్"

64 కామెంట్‌లు:


  1. నడిరేయి సరదా పూరణ:

    మిత్రులు కోరగా నతడు మిక్కిలి ప్రీతిని వచ్చి వ్రాలుచున్
    చిత్రపు రీతి దాగుచును చిల్కను దాపున దాచిపెట్టగన్
    శత్రుని బోలుచున్ దలచి చక్కగ భస్మము జేసి విష్ణువున్
    పుత్రునిఁ జంపి శంకరుఁడు పొందెను పర్వతరాజ పుత్రికన్

    రిప్లయితొలగించండి
  2. ద్వారమందునున్న బాలుని,పార్వతి
    పుత్రు, జంపి శివుడు పొలతినందె
    భార్య దుఃఖ మార్ప వడివడి నిచ్చెను
    గజము మోము భూత గణము మెచ్చ.

    రిప్లయితొలగించండి

  3. ఆటవిడుపు సరదా పూరణ:
    (జిలేబి గారికి అంకితం)

    గాత్రపు శ్రద్ధ వీడుచును గట్టిగ నూపిరి పట్టి కూర్చొనన్
    చిత్రపు రీతి కామమహ చిందులు వేయగ మానసమ్మునన్
    నేత్రము మోముదిన్ తెరిచి నెత్తురు కార్చక పద్మనాభునిన్
    పుత్రునిఁ జంపి శంకరుఁడు పొందెను పర్వతరాజ పుత్రికన్

    రిప్లయితొలగించండి
  4. తపము‌ భంగము కావించి తనకు మదన

    తాప మును పొసంగె ననుచు తలచి తన త్రి

    నేత్రమును‌ తెరచి చపల పుత్రు జంపి‌

    శివుడు పొలతి పొందె జగతి శివము కోరి

    రిప్లయితొలగించండి
  5. మంచు కొండ మీద మౌనికి పార్వతి
    పయిన మరులు బుట్టు పథక మందు
    విరిశరము విడిచిన విష్ణుని మానస
    పుత్రుఁ జంపి శివుఁడు పొలఁతి నందె

    రిప్లయితొలగించండి


  6. ఓ శకార! రమ్మ ఓకథ చెప్పు మా
    కంది శంకరులకు కరుణ మీర
    గాను నిపుడె విని పకాల్నమనుచు నవ్వ
    "పుత్రుఁ జంపి శివుఁడు పొలఁతి నందె


    జిలేబి

    రిప్లయితొలగించండి


  7. కందోత్పల


    రతిపతిని విరజుని నభి
    శ్రుత పుత్రునిఁ జంపి శంకరుఁడు పొందెను ప
    ర్వతరాజ పుత్రికన్ తీ
    వ్రతపము చెదరగ శరములు వాడిగ తాకన్!



    జిలేబి

    రిప్లయితొలగించండి


  8. కందాట


    అతగాడు మన్మథుడు! తీ
    వ్రతపమును చెదర్చెనతడు! పర్జన్యునభి
    శ్రుత పుత్రుఁ జంపి శివుఁడు పొ
    లఁతి నందె ననంగుడయె భళా రతిపతియే!


    జిలేబి

    రిప్లయితొలగించండి


  9. మిత్రుడతండు ప్రేమికుల మిన్నగ చేర్చెడు పుష్పబాణుడౌ!
    శత్రువు గాదతండు తన శల్యము నెక్కిడె మేలు కోరుచున్
    చిత్రము ధ్యానమున్ విడిచె చేవిడిచెన్ క్షమ! పద్మగర్భుడిన్
    పుత్రునిఁ జంపి శంకరుఁడు పొందెను పర్వతరాజ పుత్రికన్!


    జిలేబి

    రిప్లయితొలగించండి
  10. భవుని భర్తగాను బడయగ నెంచుచు
    తపము జేయుచున్న తరుణి కొరకు
    విరిశరముల వేయ విరువింటి దొర హర
    పుత్రుఁ జంపి శివుఁడు పొలఁతి నందె

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది.
      'హరపుత్రు'? "హరిపుత్రు" అని ఉండాలి కదా?

      తొలగించండి
  11. పరమశివునితపము భంగపరచుటకై
    చనియెమన్మథుండుశరములగొని
    ఫాల నేత్ర జ్వాలఁ బంకజాక్షుడు హరి
    పుత్రుఁ జంపి శివుఁడు పొలఁతి నందె

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది.
      'నేత్రజ్వాల' అన్నపుడు 'త్ర' గురువై గణభంగం. "ఫాలనేత్ర వహ్ని" అందామా?

      తొలగించండి
    2. ధన్యవాదములు గురువుగారూ!

      పరమశివునితపము భంగపరచుటకై
      చనియెమన్మథుండుశరములగొని
      ఫాల నేత్రవహ్నిఁ బంకజాక్షుడు హరి
      పుత్రుఁ జంపి శివుఁడు పొలఁతి నందె

      తొలగించండి
  12. సతి వియోగమంద సాంఖ్యము గొనుఁనట్టి
    హరుని తాక గానె మరుని శరము
    తపము చెదరి పోవ తామసమున హరి
    పుత్రు జంపి శివుడు పొలతి నందె!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది.
      '..గొనునట్టి' అన్నపుడు అరసున్న అవసరం లేదు.

      తొలగించండి
  13. ఆత్రము తోడుతన్ మదను డాతప భంగము జేయ విష్ణు స
    త్పుత్రుని జంపి శంకరుడు పొందెను పర్వతరాజ పుత్రిక
    న్శాత్రవు తారకున్ దునుమ స్వామిని బొందగ నా కుమారుడు
    న్క్షాత్రముతో సురారినిదె జంపెను లోకము హర్షమొందగన్

    రిప్లయితొలగించండి

  14. * శంకరాభరణం వేదిక *
    01/07/2020...బుధవారం

    సమస్య
    ********

    "పుత్రునిఁ జంపి శంకరుఁడు పొందెను పర్వతరాజ పుత్రికన్"

    నా పూరణ.
    *** ********
    ఆ త్రిపురాంతకుండు మహితాత్ము డుమాపతి వ్యోమకేశుడున్

    నేత్రములన్ని మూయుచును నిష్ఠగ ధ్యానము సల్పు వేళలో

    శత్రువు వోలె మన్మధుడు శంభుని దృష్ఠి మరల్చ పుష్పపుం

    పత్రము వేసినంతటను బాఢపు తాపము జేత శౌరి స

    త్పుత్రుని జంపి శంకరుడు పొందెను పర్వతరాజ పుత్రికన్

    ( పత్రము అనగా బాణము )

    -- 🌱 ఆకుల శాంతి భూషణ్ 🌱
    🌷 వనపర్తి🌷





    రిప్లయితొలగించండి
  15. తల్లి యాన తిడగ ద్వారమున నిలచి,
    అడ్డగించి నాడు హరుని సుతుడు!
    వివరమెరుగ లేక విభుడాగ్రహము జెందె|
    "పుత్రుఁ జంపి శివుఁడు పొలఁతి నందె"

    రిప్లయితొలగించండి
  16. క్షేత్రిగ నిందుశేఖరుని క్షేమయె పొందఁ దపమ్ము జేయ సా
    విత్రికి మేలుగూర్చ విలువిల్తుడు వజ్రి యనుజ్ఞమేరకై
    యాత్రము తోడజేరి విషమాక్షుఁ దపమ్మును భగ్నపర్చఁ స్త్రీ
    పుత్రునిఁ జంపి శంకరుఁడు పొందెను పర్వతరాజ పుత్రికన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది.
      'పర్చ' తరువాత అరసున్న ఎందుకు? 'శ్రీపుత్రుని' అని కదా ఉండాలి?

      తొలగించండి
  17. తారకాసుర బాధలు తాళలేక
    దేవతలు మ్రొక్కగ బయలుదేరె గిరిజ
    పూజసాగె సహకరింప బూనిన హరి
    పుత్రుఁ జంపి శివుఁడు పొలతినందె!

    రిప్లయితొలగించండి
  18. ఆత్రము తోడ నేగుచు మురారి సుతుండట వేయ తూపులన్
    శత్రువు గాను మారుచును జాగును చేయక వేసినంతనే
    మాత్రము శాంతిబూనకను మౌనము తోడను నుగ్రుడై రమా
    పుత్రుని జంపి శంకరుడు పొందెను పర్వత రాజు పుత్రికన్

    తపము చేయు చుండ త్ర్యక్షుండు సేవలు
    నంద చేయు చుండె నద్రిజయును
    వలపు తూపు లేయ వచ్చిన శ్రీహరి
    పుత్రు జంపి శివుడు పొలతి నందె.




    రిప్లయితొలగించండి
  19. మైలవరపు వారి పూరణ

    చిత్రము పూలు బాణములు., చే విలు గాంచ చెఱంకు ముక్క., బల్
    చిత్రము తుమ్మెదల్ గుణము., చేసెడి సాహసమా శివయ్యపై!
    నేత్రపు చూపు చాలునని నిప్పుల బూదినొనర్చగా రమా
    పుత్రుని చంపి శంకరుడు పొందెను పర్వతరాజపుత్రికన్!

    మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

    రిప్లయితొలగించండి
  20. వీడిసతినితానువేదననందుచు
    వీరభద్రుస్రుష్టివేగఁజేసె
    తపసుఁజేసియపుడుదమననీతినిఁజూపి
    పుత్రుఁజంపిశివుఁడుపోలతినందె

    రిప్లయితొలగించండి
  21. అందరికీ నమస్సులు 🙏
    నా పూరణ యత్నం

    *ఆ వె*

    నేనెరుగనితడిని నెవ్వడీ బాలుడు
    నెపుడు జూడ లేదు నేనిచటను
    యనుచు తలచి తాను యంతట పార్వతి
    *"పుత్రుఁ జంపి శివుఁడు పొలఁతి నందె"*

    *కళ్యాణ్ చక్రవర్తి, ముంబాయి*
    🙏🙏

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది.
      'బాలుడు+ఎపుడు=బాలునెపుడు, ఇచటను+అనుచు=ఇచట ననుచు, తాను+అంతట=తానంతట' అవుతుంది.

      తొలగించండి
  22. ఆత్రిపు రాతకుండుకడు నర్థితపమ్మును చేయుచుండ పూ
    పత్రములన్ వెసన్ విడిచె ఫాలశశాంకునిపై విలాసి తాన్
    నేత్రములున్ తొలంకగను నిండుగఁ గోపము పెచ్చరిల్ల శ్రీ
    పుత్రునిఁ జంపి శంకరుఁడు పొందెను పర్వతరాజ పుత్రికన్

    రిప్లయితొలగించండి
  23. తల్లి యాజ్ఞ నతడు తలదాల్చి నిలిచి యా
    యర్భకుండు తన్ను నడ్డగింప
    నాగ్రహించి పోరె నయ్యెడ పార్వతీ
    పుత్రు జంపి శివుడు పొలతి నందె

    రిప్లయితొలగించండి
  24. సురలుపంపనేగెసుమబాణయోధుడు
    తారకాసురునియుదయముకొఱకు
    తపముభంగమొనరతలచెడుమానస
    పుత్రుజంపిశివుడుపొలతినందె

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది.
      తారాకాసురుని ఉదయమా, కుమారస్వామి ఉదయమా?

      తొలగించండి
    2. తారకునిబొగరువదల్చుకొఱకు
      గారెండవపాదముచదువప్రార్ధన

      తొలగించండి
  25. ద్వార మందు నిలిచి వారించ వీక్షించి
    సంభ్రమమ్ము నందు సంశయమ్ము
    వీడి చిత్త మందు వేగ నలుఁగుపిండి
    పుత్రుఁ జంపి శివుఁడు పొలఁతి నందె


    గాత్ర మనో యు తాఖిల జగన్నర సంచయ మోహకార చా
    రిత్ర యశో వివర్ధన శరీర మనోజ్ఞ విలాస మూర్తి స
    ర్వత్ర జయార్థ మానస నిరాదర ణాంధ సుదర్ప తద్రమా
    పుత్రునిఁ జంపి శంకరుఁడు పొందెను బర్వతరాజ పుత్రికన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ మొదటి పూరణ ప్రశస్తంగా, రెండవ పూరణ ఉత్తమంగా ఉన్నాయి.

      తొలగించండి
    2. పూజ్యులు శంకరయ్య గారికి నమఃపూర్వక ధన్యవాదములు.

      తొలగించండి
  26. తారకాసురుని విదారణ మొనరించు
    వీరు డుద్భవించ మారునంప
    దీక్షభంగమైన దీపరమున విష్ణు
    పుత్రుజంపి శివుడు పొలతినందె

    మిత్రత,తారకాసురుని మిట్టడగించెడు జోదుజన్మకై
    చైత్రరథంబునన్ జనగ శర్వునుమాసతి జోడుగూర్చగా
    చిత్రము చిచ్చుకన్నునను చెచ్చర గాల్చుచు నీరజాక్షునిన్
    పుత్రునిజంపి శంకరుడు పొందెను పర్వతరాజ పుత్రికన్

    రిప్లయితొలగించండి
  27. మిత్రత గౌరి చెంత మిడిమేలపు మాటలు బల్కి టెక్కునన్
    చిత్రపు పూల బాణముల సేయగ శంభుని ధ్యాన భంగమున్
    శత్రువటంచు నాగ్రహపు జ్వాలలనా కుసుమాస్త్రు నిందిరా
    పుత్రునిఁ జంపి శంకరుఁడు పొందెను పర్వతరాజ పుత్రికన్

    రిప్లయితొలగించండి
  28. ఆటవెలది
    ఆత్రమంది సుర సహాయమడగ వచ్చు
    స్థాయినెరుఁగ కుండ స్థాణువు పయి
    చెరకు వింటి సామె? శిక్షనీకన సిరి
    పుత్రుఁ జంపి శివుఁడు పొలఁతి నందె


    ఉత్పలమాల
    ఆత్రము తోడ దేవతలు నందియు రమ్మని కోరుగాక పూ
    పత్రములన్ ద్రినేత్రుని తపమ్మునె భంగము జేయు స్థాయియే
    చిత్రము గాదె నీ తెగువ! శిక్షయె నీకను నట్లు మాధవీ
    పుత్రునిఁ జంపి శంకరుఁడు పొందెను పర్వతరాజ పుత్రికన్

    రిప్లయితొలగించండి
  29. ఉ:

    సత్రనిషేధమున్ సయిచి శాంతిని గోరి తపంబొనర్చ నో
    చిత్రము గాదెలోకములు శీఘ్రము నాశము జేయువాడికిన్
    ఆత్రము మీర దేవగణ మాసల దీర్చగ నెంచనా రమా
    పుత్రిని జంపి శంకరుడు పొందెను పర్వత రాజ పుత్రికన్

    సత్రము=యజ్ఞ విశేషము

    వై. చంద్రశేఖర్

    రిప్లయితొలగించండి