28, జులై 2020, మంగళవారం

సమస్య - 3440

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"చెలికి రవిక మాత్రము చాలు చీర యేల"
(లేదా...)
"మానధనాఢ్యకున్ రవిక మాత్రము చాలును చీర యేటికిన్"

47 కామెంట్‌లు:


 1. నడిరేయి సరదా పూరణ:

  చానయె ప్రీతినిన్ గొనుచు చక్కగ వచ్చియు శ్రావణమ్మునన్
  వీనుల విందుగా తనరి భీతిని చెందక పాటపాడగన్
  కానుక నీయగా మురిసి గంధము పూయుచు పేరటమ్మునన్
  మానధనాఢ్యకున్ రవిక మాత్రము చాలును చీర యేటికిన్

  రిప్లయితొలగించండి
 2. పెట్టె నిండుగ గడివిప్పనట్టి చీర
  లెన్నియో దాచినవియుండె నింక శ్రావ
  ణంబున కొనగ మాచింగు నప్పగాను
  చెలికి రవిక మాత్రము చాలు చీర యేల

  రిప్లయితొలగించండి

 3. ఆటవిడుపు సరదా పూరణ:
  (జిలేబి గారికి అంకితం)

  కోనల కోనలన్ వెదకి కొండొక వీధిని బేరమందునన్
  జానెడు బెత్తెడున్ ముతక చౌకగు నూలుది మెచ్చి తీయుచున్
  దానము చేయ నత్తయది దండుగ మాలిన తద్దినమ్మునన్
  మానధనాఢ్యకున్ రవిక మాత్రము చాలును చీర యేటికిన్?

  రిప్లయితొలగించండి
 4. తానన తందనాననచు తన్విని తీరగ జోలపాడు ప
  ద్మానన చిట్టి పాపనిడి తన్మయ మొందుచు పట్టుపావడా
  కూనకు కుట్టనెంచుచట కొల్తలిడన్ ‌సరి నిడ్వినడ్డ మీ
  మానధనాఢ్యకున్ రవిక మాత్రము చాలును చీర యేటికిన్

  రిప్లయితొలగించండి


 5. పట్టు సేల మడిప్పుల నా మయంగి పోనేండి :)  ఈ కరోన కాలములో సఖీ జిలేబి
  కానుకగ నీయగ కొనంగ కంచి పట్టు
  లేవు డబ్బులనుచు పొగు లెందు కమ్మ
  చెలికి రవిక మాత్రము చాలు చీర యేల  జిలేబి

  రిప్లయితొలగించండి
 6. వెలతులు ధరించు దుస్తుల విక్రయించు
  కొట్టు ముంగల ప్రకటన కొరకు వెలయు
  తుంటికి పయినమాత్రము దొరయు బొమ్మ
  చెలికి రవిక మాత్రము చాలు చీర యేల

  రిప్లయితొలగించండి

 7. పట్టుసేల కొనిపెట్టలేక పోతున్నా నీ కరోనా కాలములో అని వగచు సఖి తో


  కొనగా దస్కము లేదా?
  విను! మాన ధనాఢ్యకున్ రవిక మాత్రము చా
  లును చీర యేటికిన్ సఖి
  మనుకిత పడకోయి కష్టమైన తరుణముల్!  జిలేబి

  రిప్లయితొలగించండి


 8. కానుక నీయ మానసము కాదుటె ముఖ్యము? పట్టుసేలయే
  లా? నగువోతు నీపలుకు లవ్వియె చాలును నాకు నెచ్చెలీ!
  కాన సళించకోయి సఖి! కష్టపు కాలమిదాయె కాదుటే?
  మానధనాఢ్యకున్ రవిక మాత్రము చాలును చీర యేటికిన్?


  జిలేబి

  రిప్లయితొలగించండి
 9. క్రొవ్విడి వెంకట రాజారావు:

  మంచిదౌ చీర కొనుమీవు యెంచి నీదు
  చెలికి; రవిక మాత్రము చాలు చీర యేల
  పనిని చేయు పడతికంచు పలికె భర్త
  కానుకీయ గోరెడి సతి కాంక్ష దీర్చ.

  రిప్లయితొలగించండి
 10. క్రొవ్విడి వెంకట రాజారావు:

  పూనికతో నిరంతరము పొందుగ దాల్చుచు ఫాంటు షర్టులన్
  పోనిడ జేయకున్ తిరుగు పుత్తడి బొమ్మకు చక్కనైనదౌ
  కానుకనీయగోరు వడి గారముతో నిడు మెప్పుడేనియున్
  మానధనాఢ్యకున్ రవిక మాత్రము చాలును చీర యేటికిన్?

  రిప్లయితొలగించండి
 11. ఈనాటి శంకరా భరణము వారి సమస్య

  చెలికి రవిక మాత్రమె చాలు చీర యేల

  సీసములో నా పూరణము


  సాహస వీరుడు సాగర కన్య పే
  రుగల చిత్రమిది, హీరోగ వేంక

  టేషు చిత్రమున నటించ బోవుచునుండె
  చిత్రములో మన శిల్ప శెట్టి

  హీరోయినని నేను పేరు తెలిపితిని,
  సముద్ర తీరాన జరుగు చుండు

  షూటింగు లెప్పుడు, చోద్యము కాదిది
  నమ్మ వలయు మీరు నవ్వ వలదు,

  జలమున విహారము సతము జరుపును జల

  కన్య లెపుడు, తెలుసు కొమ్ము, కనుక నట్టి

  చెలికి రవిక మాత్రమె చాలు చీర యేల

  ననుచు రాఘవేంద్రుడు బల్కె వనిత తోడ


  జల కన్య లకు చీరలు ఉండవు రవికలు చాలు సినిమా షూటింగ్ జరుగుతున్న ప్పుడు కాష్ట్యూమ్ డిజైనరు తో దర్శకుడు రాఘవేంద్రరావు పలుకు సందర్భం

  రిప్లయితొలగించండి
 12. ఇ౦ట పెట్టెడు చీరల వెన్నొ కలవు
  చాల ద౦చును మరల యీ చాకిరేవ?
  నీవు చెప్పగ బోకిక చావు వచ్చె
  చెలికి రవిక మాత్రము చాలు చీర యేల?

  రిప్లయితొలగించండి
 13. పట్టు పుట్టమె కట్నంబు పెట్టినాము
  గాదె పుట్టినరోజంచు కలికి పిలువ,
  ధనము చేతను లేనట్టి తరుణమందు
  చెలికి రవిక మాత్రము చాలు చీర యేల

  రిప్లయితొలగించండి
 14. ప్రాణము నిల్పికల్పమున పారణ సేయగ లక్ష్మిదేవికిన్
  పూనిక పట్టుపా వడయు ముత్యపు దండలు కాసుపేరులున్
  కానగ నారికేళమున కల్పన సేయుచు నమ్మవారునౌ
  మానధనాఢ్యకున్ రవిక మాత్రము చాలును చీర యేటికిన్
  కొరుప్రోలు రాధాకృష్ణరావు

  రిప్లయితొలగించండి
 15. ఏరి కోరియు కొన్నట్టి యిష్టముగను
  దానికి సరి పోయెడు నట్టి ధరను గల్గి
  రంగు తో మెఱయు చు నుండి రహిని బెంచ
  చెలికి రవిక మాత్రము చాలు : చీర యేల?

  రిప్లయితొలగించండి


 16. కొత్త సమస్య :)

  చెవికి రవిక మాత్రము చాలు చీర యేల !  జిలేబి

  రిప్లయితొలగించండి
 17. ఆ నవ మోహనాంగి మనసారగ కోరగ చీర నొక్కటిన్
  మానితి గొల్వు నాటికిక మానిని దోడ దుకాణ మేగితిన్
  గానట చీరకున్ రవిక గాదను పొందిక యెన్ని జూపినన్
  మానధనాఢ్యకున్ రవిక మాత్రము చాలును చీర యేటికిన్

  రిప్లయితొలగించండి
 18. ఉ: మానవ రూప రాక్షసుడు మాన్యులు వేవురు చూచుచుండగా
  హీనమనస్కుడై యుడుపు హీనను చేయుచు నుండ, కృష్ణ తా
  దానవవైరిఁ బిల్వ దురితాత్ముడు కర్ణుడు వాగె నిట్టు లీ
  మానధనాఢ్యకున్ రవిక మాత్రము చాలును చీర యేటికిన్
  (కర్ణుడు: యిది యనేక భర్తృక గావున బంధకి యనబడు నిట్టిదానిని విగత వస్త్రను జేసి తెచ్చినను ధర్మవిరోధమ్ము లేదని కర్ణుడు వికర్ణుని వచనములపై బ్రత్యాఖ్యానమ్ము చేసె. P222, Para.229)

  రిప్లయితొలగించండి
 19. కె.వి.యస్. లక్ష్మి :

  అతివల కపుడాషాఢము ఆఫరనుచు
  పడతుల గూడి చని భార్య పట్టుచీర
  తెచ్చె నిపుడు శ్రావణమున దెచ్చెద మరి
  చెలికి రవిక మాత్రమె చాలు చీర యేల?

  రిప్లయితొలగించండి
 20. కలికి గట్టిన చీరను గట్ట బోదు
  సరిగ బెట్టెల నిండుగ సర్దె జూడు
  జిలుగు చీరలంచు బలికె జిలిపి గాను
  చెలికి రవిక మాత్రము చాలు చీర యేల
  చిలికి రాజేసెనదె యగ్గి జెప్పకేమి 😛

  రిప్లయితొలగించండి
 21. పయిటయేలమీకుసరిగాదుపడతులార
  జంకుటెందుకుమనకదిజవమునీదు
  వనితవాదింపవేరుగారారునెవరు
  చెలికిరవికమాత్రముచాలుచీరయేల

  రిప్లయితొలగించండి
 22. పెట్టె నిండుగా గలవట పెట్టినట్టి
  కోక లింటి యందు గనుక కూర్మి తోడ
  చెలికి రవిక మాత్రము చాలు చీర యేల
  వలదు కొనవలె రవికలె వలసి నన్ని

  రిప్లయితొలగించండి
 23. పెట్టెనిండుగచీరలునట్టెయుండ
  యింకకొనగనువ్యర్ధమువెంకి!నీదు
  చెలికిరవికిమాత్రముజాలుచీరయేల
  వలయుననుకొనినకొనుముచోలులిపుడు

  రిప్లయితొలగించండి
 24. కటిక పేద లర్ధాంగిని కన్నవారు!
  ఋణము తెచ్చి తనయకు చీరకొని తేగ ,
  కూతు మొగడు పలికె నిట్లు కుంది తాను!
  "చెలికి రవిక మాత్రము చాలు చీర యేల"

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. 28.07.2020 🙏

   నా పూరణ ప్రయత్నం..

   *తే గీ*

   కొంటి నెన్నియొ చీరలు కోరెననుచు
   ఇంతికింతకు మించియు నిపుడు వలదు
   తాను యడిగిన నింకను తప్పదనుచు
   *"చెలికి రవిక మాత్రము చాలు చీర యేల"*

   *కళ్యాణ్ చక్రవర్తి ముంబాయి*
   🙏

   తొలగించండి
 25. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

  రిప్లయితొలగించండి
 26. మానమెభూషణంబుననుమానమువద్దురయెట్టివేళలన్
  మానధనాఢ్యునకున్,రవికమాత్రముచాలునుచీరయేటికిన్
  మానముగల్లువారలిలమాన్యతనొందినచోలుతోడుతన్
  మేనునవేసికొందురుగమెచ్చినచీరనుగూడప్రీతితోన్

  రిప్లయితొలగించండి
 27. ముందు గలవు పండుగ లింక నిందువదన
  చాలు గద వస్త్ర మీయ నేఁ జాల నీకుఁ
  జెప్పఁ బబ్బము చిన్నది గొప్ప లేల
  చెలికి ఱవిక మాత్రము చాలు చీర యేల

  చాలును + చీర: ద్రుత సంధి నిత్యము గావున చాలును జీరగా సమస్యాపాదమును గ్రహించి చేసిన పూరణము.

  మానముఁ బ్రాణ మీవ యిల మానిని చంచల పద్మలోచనా
  కానఁగ లేను నీ యొడలు కందిన నించుక గోరు లున్న యా
  వైనముఁ గాంచఁ దెల్ల మగు భద్రముగా ధరియించుమా సతీ
  మానధనాఢ్యకున్ ఱవిక మాత్రము చాలును జీర యేటికిన్

  [జీర = గీఱ]

  రిప్లయితొలగించండి
 28. *దుర్యోధనుడు దుశ్శాసనునితో పలికిన మాటలుగా*

  బానిసలైన పాండవులు పందెము నందున నోడిపోయిరే
  మానిని ద్రౌపదిన్, సభను మాన్యులు పూజ్యులు గాంచుచుండగన్
  జానను పట్టితెమ్మిటకు చారిక వల్వల నూడ్చి వేయుమా
  మానధనాఢ్యకున్ రవిక మాత్రము చాలును చీర యేటికిన్

  రిప్లయితొలగించండి
 29. మానిని పట్టు పుట్టములె మైవడి చేయును నూలు బట్టలన్
  మేని ధరింపబోదుకద, మిక్కిలి సంపద కల్గినట్టి యా
  చానకు సంప్రదాయమని సమ్మతితోడను కానుకివ్వగా
  మానధనాఢ్యకున్ రవిక మాత్రము చాలును చీర యేటికిన్.

  రిప్లయితొలగించండి
 30. ఉ:

  కానుక లన్న నీ దినము కారణ మెంచి యొసంగు చుండనై
  కానమె పేరటమ్ము నధికాంశము చోలము లిచ్చి పుచ్చుటన్
  మానక తప్పదింక నవమానము గాదది యెంచి చూడగన్
  మానధనాఢ్యకున్ రవిక మాత్రము చాలును చీర యేటికిన్

  వై. చంద్రశేఖర్

  రిప్లయితొలగించండి
 31. తే.గే//
  ముద్దులను బంచవలెను నీ ముద్దుతీర
  చెలికి, రవిక మాత్రము చాలు చీర యేల ?
  ననకు తిట్టిపోయును జేజి ననవరతము
  మంచిమాట జెపితి నీదు మంచి కొరకు ll

  రిప్లయితొలగించండి
 32. బీరువాయందు నిండుగా చీరలుండ
  నొక్కచీరకుమాత్రముచక్కనైన
  రవిక కొదవాయెనందుచే రమ్యమైన
  చెలికి రవిక మాత్రము చాలు చీర యేల

  రిప్లయితొలగించండి
 33. చానయె చక్కగానడుప సైకిలు,మోటరు వాహనమ్ములన్
  యానమునందునన్ పదము కడ్డుతొలగంగ ప్యాంటుదాల్చగా
  మానధనాఢ్యకున్ రవికమాత్రమే చాలును చీరయేటికిన్ ?
  వానలకాలమందు పలువన్నెల కోటులనూన మేలగున్
  రవిక =మేన పైభాగమున ధరించు వస్త్రము Top,Shirt
  కోటు = వానకోటు

  రిప్లయితొలగించండి
 34. తేటగీతి
  ఈ కరోనతో రాబడులింకె భామ!
  జరుగు బాటుకైన ధనము చాలదాయె
  కనుక చేతిరుమాలుతో కానుకనఁగఁ
  జెలికి రవిక మాత్రము చాలు చీర యేల?

  ఉత్పలమాల
  ఆనక కంటికిన్ జెలఁగి యందరి రాబడి నీ కరోనయే
  పూనుచుఁ గొల్లకొట్టె, పొదుపున్ దగ నెంచక యున్నఁ గష్టమౌ
  కానుక నీయ నెచ్చెలికి ఖర్చగు, చేతి రుమాలుతో జతన్
  మానధనాఢ్యకున్ రవిక మాత్రము చాలును చీర యేటికిన్!

  రిప్లయితొలగించండి
 35. వచ్చె చుట్టపు చూపుగా వాయనముగ
  నిచ్చుటకుగాను మామూలు చీరయొకటి
  తక్కువబడెనీసారికి, తరచు వచ్చు
  చెలికి రవిక మాత్రము చాలు, చీరయేల!

  రిప్లయితొలగించండి
 36. మైలవరపు వారి పూరణ

  శ్రావణమాసపు నోములలో భాగంగా...

  భార్య.. భర్తతో.. ప్రక్కింటావిడను గురించి... అంటోంది..

  మానవజన్మమెత్తినది మాకృప నిండుగపొంది., యీమెకున్
  లేనివి సంపదల్ నగలు లే.. వెవరేమిడ వద్దువద్దనున్!
  దానగుణమ్ము మెండు వనితామణి., కైననొసంగి జూచెదన్
  మాన., ధనాఢ్యకున్ రవిక మాత్రము చాలును, చీర యేటికిన్!!

  (మా కృప.. లక్ష్మీకటాక్షం)

  ( మాన... మానను )

  (నేననుకొంటారేమో అని పైన వివరణ ఇచ్చాను ) 😃

  మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

  రిప్లయితొలగించండి