25, జులై 2020, శనివారం

సమస్య - 3437

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"కారము గల మాట మెప్పు గల దెల్లపుడున్"
(లేదా...)
"కారముఁ గల్గి యున్న కలకాలము మెత్తురు నీదు మాటలన్"

77 కామెంట్‌లు:


  1. నడిరేయి సరదా పూరణ:

    సారెలు బూరెలొందినను చాలవు నాకని పైకి పల్కుచున్
    కోరిన సేవలందగను కుత్తుక నందున ప్రేమ దాచుచున్
    తీరుగ కోడలిన్ వలచి తిక్కది లేవగ నత్తగారహో!
    కారముఁ గల్గి యున్న కలకాలము మెత్తురు నీదు మాటలన్!

    రిప్లయితొలగించండి
  2. పేరిమిఁ గూర్పఁ బఠితలకుఁ
    గూరిచి పద్దియములందుఁ గొద్దియు వ్రాయన్
    దీరుగ మంచి తెనుఁగునుడి
    కారము గల మాట మెప్పు గల దెల్లపుడున్

    రిప్లయితొలగించండి

  3. ఆటవిడుపు సరదా పూరణ:
    (జిలేబి గారికి అంకితం)

    ఘోరపు భాజపానుగని గుట్టుగ నుండక గుఱ్ఱమెక్కుచున్
    పారక కయ్యమందునను పండుగ జేయుచు మాటిమాటికిన్
    వీరుని తీరు నోడుచును భీకర రీతిని రాహులయ్యరో!
    కారముఁ గల్గి యున్న కలకాలము మెత్తురు నీదు మాటలన్!

    రిప్లయితొలగించండి
  4. క్రొవ్విడి వెంకట రాజారావు:

    తీరగు నడవడి గూడుచు
    నేరిమితో పొరుగువారి నెదుగుదలకునై
    దారిని చూపెడిదగు మమ
    కారము గలమాట మెప్పుగల దెల్లపుడున్.

    రిప్లయితొలగించండి
  5. పారమ్యమయిన వైనను
    బీరము గలుగు పలుకులను వినరెవ్వారున్
    సార రహిత మయినను మమ
    కారము గల మాట మెప్పు గల దెల్లపుడున్

    రిప్లయితొలగించండి
  6. కె.వి.యస్. లక్ష్మి:

    గురువుగారికి నమస్కారములు. నిన్నటి పూరణను పరిశీలించగలరు.

    ప్రజ్ఞతో నలరారుచు పఱగునట్టి
    గరికపాటి నాగఫణియు ఘనుడు మేడ
    సానితో జేయవలె నవధానములను
    శంకరాభరణపు పద్యశాలయందు.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. వాళ్ళు అంగీకరించాలే కానీ అంతటి అదృష్టమా?
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి

  7. * శంకరాభరణం వేదిక *
    25/07/2020..శనివారం

    సమస్య
    ********

    కారముఁ గల్గి యున్న కలకాలము మెత్తురు నీదు మాటలన్"

    నా పూరణ. ఉ.మా.
    *** ********

    గౌరవమింత లేక మమకారము జూపక రౌద్రుడై యహం

    కారము తోడ బల్కి హృది గాయమొనర్చెడు దుష్టుడా!తిర

    స్కారము నందు నీకెపుడు సంఘము నందున నట్టుగాక సం

    స్కారము గల్గి యున్న కలకాలము మెత్తురు నీదు మాటలన్

    -- 🌱 ఆకుల శాంతి భూషణ్ 🌱
    🌷 వనపర్తి🌷





    రిప్లయితొలగించండి
  8. క్రొవ్విడి వెంకట రాజారావు:

    తీరగు సత్ప్రవర్తనము తేకువ గల్గిన భాషణమ్ములన్
    జోరుగ తోడివారలను సొంపుగ పెంచెడి నేర్పు పేర్మినిన్
    కూరిమి జూపు చేష్టలను గొప్పగ జేయునదౌ మనోహరా
    కారము కల్గియున్న కలకాలము మెత్తురు నీదు మాటలన్.

    రిప్లయితొలగించండి
  9. దారుణమే తలపెట్టక
    కూరిమి గూర్చుచు పరులకు కూటికి సరియౌ
    దారులు చూపెడిదౌ మమ
    కారము గల మాట మెప్పు గల దెల్లపుడున్

    రిప్లయితొలగించండి


  10. పూరణ చేసితినిటులన్
    సారంబొప్పగ కవివర సద్భావనతో
    ప్రేరణ కలిపించెడు మమ
    కారము గల మాట మెప్పు గల దెల్లపుడున్



    జిలేబి

    రిప్లయితొలగించండి
  11. కం//
    పౌరుష వాక్కులు బలికిన
    దారుణమగు రీతి నింద దాల్చిన వానిన్ l
    భారపు మాటలనక మమ
    కారము గల మాట మెప్పు గల దెల్లపుడున్ ll

    రిప్లయితొలగించండి


  12. ధోరణి నీదు కావలె ప్రదూషితులైనను సౌమనస్వులై
    మారగ భాష కోమలము, మార్పును కోరెడు మానసమ్ముతో
    ప్రేరణ పొందునట్లు సఖి పేర్మియు మీరగ పల్కు లెల్ల స్వీ
    కారముఁ గల్గి యున్న కలకాలము మెత్తురు నీదు మాటలన్



    అయ్యేపనేనా :)


    జిలేబి

    రిప్లయితొలగించండి
  13. ప్రేరణ హనుమం తునకది
    ప్రేరణ తనలోని శక్తి బెఱుగుట కొఱకున్,
    ప్రేరణ ప్రవచన పుచమ
    త్కారము గల మాట మెప్పు గల దెల్లపుడున్
    కొరుప్రోలు రాధాకృష్ణరావు

    రిప్లయితొలగించండి


  14. కరకైననేమి సఖి యిత
    కరి కారముఁ గల్గి యున్న, కలకాలము మె
    త్తురు నీదు మాటలన్ విడు
    వరు నీ స్నేహమ్మును పదపద నిజమిదియే


    ఇతకరి కారము - హితము చేయు కరణము



    జిలేబి

    రిప్లయితొలగించండి
  15. పేరిమి చె౦తకు చేర్చుకు
    తీరుగ పాఠమ్ము చెప్పి తీర్చిన చాలున్
    నేరము నె౦చని మది మమ
    కారము గల మాట మెప్పు గల దెల్లపుడున్

    రిప్లయితొలగించండి
  16. చేఱుచు రామలక్ష్మణులజెప్పెను మాటలు మంత్రమూర్తియై
    నీరధి దాటినాడుమును నీరజ బాంధవ శిష్యరత్నమై
    క్షీరము బంచినాడుగద సీతకు నూఱడి నూఱిపోయసం
    స్కారముఁ గల్గి యున్న కలకాలము మెత్తురు నీదు మాటలన్
    కొరుప్రోలు రాధాకృష్ణరావు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. చేరుచు రామలక్ష్మణులజెప్పెను మాటలు మంత్రమూర్తియై
      నీరధి దాటినాడుమును నీరజ బాంధవ శిష్యరత్నమై
      క్షీరము బంచినాడుగద సీతను నూరడిసేయనెంచిసం
      స్కారముఁ గల్గి యున్న కలకాలము మెత్తురు నీదు మాటలన్
      కొరుప్రోలు రాధాకృష్ణరావు

      తొలగించండి
  17. ఈ రమణీయరాత్రులిట నీతరి పంపిన పూరణమ్ము సొం
    పారగ పూర్తిజేయదగ పండితు లందరు మేమెముందనన్
    పోరుచు పంపుచుందురయ ! పూరణ మేమిడ గాంచునట్టి స
    త్కారము గల్గి యున్న కలకాలము మెత్తురు నీదు మాటలన్

    సంచాలకుల వారికి నమస్సులు ! మాది పౌరోహిత్య వృత్తి. తత్కారణంగా వేకువలో పూరణ చేయలేక ఈ మధ్య పూరణలు వదిలివేశాను. మీరు వేకువజామున పంపిన పూరణలు మాత్రమే మన్నించుచున్నారు. మీరు పునః పరిశీలించి మావంటి ఔత్సాహికులకు ప్రోత్సాహమందింతురని మనవి.

    ధన్యవాదముతో
    మీ అభిమాని
    శశిభూషణ సిద్ధాంతి నంద్యాల.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. నిజమేనండీ... ఉదయం ఉన్న ఉత్సాహం, ఓపిక కాలం గడుస్తున్నకొద్ది క్షీణిస్తున్నాయి. అప్పటికీ నేను ప్రయత్నిస్తూనే ఉన్నాను. ఇకనుండి శ్రద్ధ తీసుకుంటాను.
      మీరు విన్నపంగా చేసిన పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
    2. మీ ప్రత్యుత్తరమునకు మహదానందమయినది. మీకు అనంత నమస్సులు. ధన్యవాదములు.

      తొలగించండి
  18. మైలవరపు వారి పూరణ

    భారతదేశశక్తి ప్రణవమ్మని చెప్పిరి నిత్యధార్మికా....
    చారపరాయణుల్ మునులు., చక్కగ పాలన జేయనెంచుమా !
    ప్రేరణపొందుమా., పలకరింతకు ముందు హలోలవేల? నోం..
    కారముఁ గల్గి యున్న కలకాలము మెత్తురు నీదు మాటలన్!!

    మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

    రిప్లయితొలగించండి
  19. దారినితప్పి చరించెడు
    వారికి సన్మార్గ మనెడు పథమును జూపన్
    కూరిమి విడక పలుకు సం
    స్కారము గల మాట మెప్పు గల దెల్లపుడున్

    రిప్లయితొలగించండి
  20. అందరికీ నమస్సులు 🙏🙏
    25.07.2020

    నా పూరణ యత్నం..

    *కం*

    నేరము లెంచు పలుకులిల
    భారముగను నిలిచియుండు బ్రతుకున నెపుడున్
    వారించుచు నవి నిల సం
    *"స్కారము గల మాట మెప్పు గల దెల్లపుడున్"*

    _*కళ్యాణ్ చక్రవర్తి, ముంబాయి*_

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. 25.07.2020
      అందరికీ నమస్సులు 🙏🙏

      నా పూరణ యత్నం..

      జారగ నింటను పొరబడి
      మీరక మన హద్దులన్ని మీటుచు మనసున్
      సారము గని సతి తో సహ
      *"కారము గల మాట మెప్పు గల దెల్లపుడున్"*

      *కళ్యాణ్ చక్రవర్తి, ముంబాయి*
      🙏🙏

      తొలగించండి
  21. ఈనాటి శంకరాభరణం వారి సమస్య


    కారము గల మాట మెప్పు గల దెల్లపుడున్


    కందములో సమస్య. పాదము


    నా పూరణ. సీసములో



    శ్రీ కారము‌ను వ్రాసి చేసెడి మొదటి సం
    భోధన,గురుముఖ బోధనమ్ము,

    ఓంకార సహిత వేదోఛ్చా రణము పరి
    మితముగ జరిపెడు రతి కరణము,

    సముచిత మైనట్టి సరస సం భాషణ
    చాతుర్యము, మిత భోజనము జేయు

    నుదరము,సతతము ముదముగ పతి పాద
    సేవనల్ ఘనముగా చేయు నాసి

    మ,మమకారము గల మాట మెప్పు గలదె
    ల్లపుడున్,మనమున తలచుచు జనత


    ననవ రతము, పాటించుచు ఘనత నొప్పు

    కార్య ములను చేయుచు నుండ ,గరిమ తోడ

    భరత మాత మహోజ్వల చరిత కల్గి

    దీప్తులను ప్రసరించుగా దివ్య గతిని


    ఆసిమ. = పతివ్రత

    రిప్లయితొలగించండి
  22. ఏరకమగు పొర పొచ్చ ము
    కారణమది యెంచ బోక కమ్రపు బుద్ధిన్
    తోరపు టను రాగము మమ
    కారపు గల మాట మెప్పు గల దెల్ల పుడున్

    రిప్లయితొలగించండి
  23. కారము లేని కూర నయగారముఁ జూపని ప్రేమ తొల్త శ్రీ
    కారము లేని పూజ సహకారముఁజూపని సౌహృదమ్ము ప్రా
    కారము లేని మేడ కొరగానివి చొప్పడ నేని మేలు, స
    త్కారముఁ గల్గి యున్న కలకాలము మెత్తురు నీదు మాటలన్"

    కంజర్ల రామాచార్య
    కోరుట్ల.

    రిప్లయితొలగించండి
  24. ధారుణి మోసపూరిత విధానము తోగొని పెత్తనమ్ము ధి
    క్కారము చేసినన్ ప్రజల కాంక్షల మెచ్చరు, పాలనమ్ము సం
    స్కారముతోడ చేయుచును సాగెడి చిక్కుసమస్యకున్ పరి
    ష్కారము గల్గియున్న కలకాలము మెత్తురు నీదు మాటలన్

    రిప్లయితొలగించండి
  25. కారము జల్లి నటుల నధి
    కార మదమ్మున వదరుట గాకన్ దురహం
    కారము లేక జనుల గని
    కారము గల మాట మెప్పు గల దెల్లపుడున్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు



    1. (సవరణతో)
      కారము జల్లి నటుల నధి
      కార మదమ్మున వదరుట గాకన్ దురహం
      కారము లేక జనుల కుప
      కారము గల మాట మెప్పు గల దెల్లపుడున్

      తొలగించండి
  26. చేరువయై సుభాషితము, స్నిగ్ధ మనోహర మంజలాన్వితా
    ధారము జీవనంబుగ,సుధారస సారము చిప్పిలంగ,ప
    ల్మారులు ధర్మ బద్ధముగ మైత్రికి పేరుగ నుండు మేటి సం
    స్కారముఁగల్గియున్న కలకాలము మెత్తురు నీదు మాటలన్.

    రిప్లయితొలగించండి
  27. కారముచేడుననొకయతి
    కూరిమితోనిట్లుపలికెకౌతుకమొప్పన్
    బారముజెందుటకేమమ
    కారముగలమాటమెప్పుగలదెల్లపుడున్

    రిప్లయితొలగించండి

  28. పిన్నక నాగేశ్వరరావు.

    దారిని విడి వర్తించెడు
    వారిని మార్చంగ పరుష పదముల కంటెన్
    కూరిమితో పలికెడు మమ
    కారము గల మాట మెప్పు గలదెల్లపుడున్.

    రిప్లయితొలగించండి
  29. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  30. కం.
    కోరెద పదవుల, బుంగల
    కారులలోఁ దిరుగుటన్న కమ్మనయగు నా
    పారమునఁ బ్రమాణస్వీ
    *"కారము గల మాట మెప్పు గల దెల్లపుడున్"*

    ఉ.
    కారణమేది కర్మలకు? కారకమేయది శోభఁ గూర్చు? సా
    కారము గాగ శాస్త్ర మధికారము బ్రహ్మమునన్ జరించుచున్
    గోరుచు విశ్వశాంతి నొడగూడు మమత్వము వీడి *“శంకరా*
    *"కారముఁ” గల్గి యున్న కలకాలము మెత్తురు నీదు మాటలన్"*

    - విట్టుబాబు

    రిప్లయితొలగించండి
  31. కవిమిత్రులకు నమస్కృతులు.
    కాసేపటి క్రితం జారిపడ్డాను. తల కుడిప్రక్క పారాపెట్ గోడకు తగిలి వాపు వచ్చింది. ఎడమ ముంజేతికి, కుడి భుజానికి గాయాలయ్యాయి. ప్రమాదకర పరిస్థితి లేదు. జారుతున్నపుడు కలిగిన భయం, ఆందోళన ఇంకా తగ్గలేదు.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. గురువు గారూ, సరైన జాగ్రత్తలు తీసుకోండి. త్వరగా స్థిమితపడగలరని ఆశిస్తున్నాను.

      తొలగించండి
    2. గురుదేవులకు ప్రణామములు. తగినంత విశ్రాంతి గైకొనుమని ప్రార్థన.

      తొలగించండి
  32. కె.వి.యస్. లక్ష్మి:

    కె.వి.యస్. లక్ష్మి:

    తీరుగ నెఱుగుము పార్ధా!
    కారణమేనగుదు నిపుడు కౌరవ క్షతికిన్
    పోరెంచుము యను హరి మమ
    కారముగల మాట మెప్పుగల దెల్లపుడున్.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మంచి పూరణ.
      కౌరవ క్షతికిన్ లో వ గురువు. అప్పుడు గణభంగ మండి.

      పోరెంచుము యను – పోరెంచు మను సాధువు. యడాగమము రాదు.
      పోరెంచుమ యను - అనవచ్చును.

      తొలగించండి
  33. ఈరస మేల యయ్యదియె హీనుల లక్షణమంచెఱంగుమా!
    గౌరవ మివ్వవోయి యభిఘాతుని కైనను, వారితో సదా
    కూరిమితో చరించుమిక, కోపము వీడిన చాలు, నీవు సం
    స్కారముఁ గల్గి యున్న కలకాలము మెత్తురు నీదు మాటలన్

    రిప్లయితొలగించండి
  34. రిప్లయిలు
    1. సారసనేత్రల ముందర
      బీరములను పలుకతగదు కూరిమితోడన్
      గారవమొప్పగ తగు సం
      స్కారము గల మాట మెప్పు గల దెల్లపుడున్

      తొలగించండి
  35. *కూరిమితోడన్ బదులు పేరిమితోడన్ అని చదువవలసిందిగా కోరిక

    రిప్లయితొలగించండి
  36. దూరం బౌదురు నిక్కము
    మూరి వచించినఁ దెగించి ముఖ్య సఖులిలన్
    ఘోరమ్ముయినను మఱి నీ
    కారము గల మాట మెప్పు గల దెల్లపుడున్

    [నీకు + ఆరము = నీ కారము; ఆరము = తియ్యమామిడి]


    గారము మించ దుఃఖములు కల్గుట నిక్కము మించకున్న స
    త్కారము నొవ్వ రే జనులు తథ్యము సుమ్మిది మాటలం దహం
    కారము లేశమంతయినఁ గల్గినఁ దిట్టరె హర్షవచ్చమ
    త్కారముఁ గల్గి యున్న కలకాలము మెత్తురు నీదు మాటలన్

    రిప్లయితొలగించండి
  37. 1.
    కురుక్షేత్రయుద్ధమున శ్రీకృష్ణ పరమాత్మ అర్జునునితో..

    కందం
    బీరములఁ బల్కి గతమున
    మీరుచు నని వెన్ను జూప మేలె? కలల సా
    కారమునకు పోరుకు శ్రీ
    కారము గల మాట మెప్పుఁ గల దెల్లపుడున్

    2.
    పార్టీ నేతకు శ్రేయోభిలాషుల హితవచనం...

    ఉత్పలమాల
    లేరొకొ యిట్టి నేతయనఁ బ్రీతిఁ గలుంగ వచించి యెన్నికై
    మీరక యే ప్రతిజ్ఞ ప్రజ మెచ్చెడు రీతిని పాలనంబుతో
    చేరువ నౌచు సర్వులకు సేవలఁ జేసి సమస్యలన్ బరి
    ష్కారముఁ గల్గి యున్న కలకాలము మెత్తురు నీదు మాటలన్

    రిప్లయితొలగించండి
  38. భారముగాదలంచకనుభార్గవరాముడ!యాలకించుమీ
    సూరనమాటలీయవియెసూక్తులుదప్పకయాచరించుమా
    మీరకహద్దులెప్పుడునుమేదినిచక్కటివర్తనంపుసం
    స్కారముగల్గియున్నకలకాలముమెత్తురునీదుమాటలన్

    రిప్లయితొలగించండి
  39. బీరములాడకు మెపుడున్
    వీరంగము సేయబోకు విఙ్ఞుల యెదుటన్
    కూరిమితో నాడెడు సం
    స్కారముగల మాట మెప్పుగల దెల్లపుడున్

    కేయూరాణి నభూషయంతి పురుషం

    తీరుగదాల్చెడిన్ మిగుల తెల్లని కంఠపు తారహారముల్
    మీరిన కేశసంపదయు మేనునలందిన చందనాగరుల్
    చూరగొనంగ లేవెవరి జోతలు నిత్యవిభూషణంబు సం
    స్కారము గల్గియున్న కలకాలము మెత్తురు నీదుమాటలన్

    రిప్లయితొలగించండి
  40. వారిజగర్భు రాణిఁ నిజ భావ నివేశనమందు నిల్పుచున్
    శారద చంద్రికా స్ఫురిత శాంత మనోజ్ఞ వచో విలాసమున్
    గారవమొప్ప నెల్లరి సుఖంబును గోరెడి యుత్తమంపు సం
    స్కారముఁ గల్గి యున్న కలకాలము మెత్తురు నీదు మాటలన్

    రిప్లయితొలగించండి
  41. ఉ:

    తేరగ దిర్గువారలకు దెల్పగ నాతము బొందుసంగతుల్
    నేరము రూపు మాపుటకు నెమ్మది వృత్తుల నెంచి జూపగన్
    సారము గల్గు దూషణము శస్తము గోరి కథించి రంచనిన్
    కారము గల్గి యున్న కలకాలము మెత్తురు నీదు మాటలన్

    వై. చంద్రశేఖర్

    రిప్లయితొలగించండి
  42. కారము మిరియము నూరుచు
    ఘోరముగాదిట్టు వారి గోలేమిటహో
    ఊరుస మస్య, మరిపరి
    ష్కారము గలమాట మెప్పు గల దెల్లపుడున్.

    రిప్లయితొలగించండి
  43. నేరము సేయగా భయము నేననిముందుకు బోవనేరవో
    వారసు డంచుమేము సరి వాదముసేయుచునుండగా దరిన్
    జేరియుమోముజూపి మరి చెప్పవు వాస్తవ సాక్ష్యమై పరి
    ష్కారము గల్గియున్న కలకాలముమెత్తురు నీదుమాటలన్.

    రిప్లయితొలగించండి
  44. బీరములాడుటేల కడు పేదల బాధ్యత లందున చిక్కులేర్పడన్
    దారులు జూచుటేల దరిదాపుల హద్దుల దాటబోవగన్
    మారిన కాలమందు మరి మాటల మాన్యత నొందినంతనే
    కారముఁ గల్గి యున్న కలకాలము మెత్తురు నీదు మాటలన్!!

    రిప్లయితొలగించండి
  45. నేరము లెంచక సతతము
    తీరుగ బోధనలు చేయ తెలియు చు నెల్లన్
    మారుట తథ్యము శుభసం
    త్కారము గలమాట మెప్పుగలదెల్లపుడున్.

    రిప్లయితొలగించండి
  46. ఉ॥
    భారత మందు ధర్మజుడు పాడిని కోరుచు రాయబారమున్

    శౌరిని హస్తినాపురము సంధిని జేయగ పంపు చిట్లనెన్

    "పోరిత మాపి మాతలకు పుత్రుల శోకము బాపుమా! పరి

    ష్కారముఁ గల్గి యున్న కలకాలము మెత్తురు నీదు మాటలన్"

    రిప్లయితొలగించండి