29, జులై 2020, బుధవారం

సమస్య - 3441

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"మతి లేనట్టి పవనజుని మానక గొల్తున్"
(లేదా...)
"మతి లేనట్టి మరుత్సుతున్ గొలిచెదన్ మాంగల్యముం గోరుచున్"

76 కామెంట్‌లు:

  1. మతిలేనట్టి పవనుజుని మానక కొల్తున్ ....అంటే సరిపోతుంది.

    రిప్లయితొలగించండి

  2. నడిరేయి సరదా పూరణ:

    పతితుండౌచును హస్తినా పురమునన్ భాగ్యంబు కోల్పోవగా
    స్వతహా లేకయె బుద్ధిశుద్ధి యిసుమున్ వైరాగ్య భావంబుతో
    నతిగా వాగుచు మోడినిన్ కరచుచున్ హైరాన గావించెడిన్
    మతి లేనట్టి మరుత్సుతున్ గొలిచెదన్ మాంగల్యముం గోరుచున్

    రిప్లయితొలగించండి
  3. సతి సీతజాడఁ గన్గొని
    యతిబలగర్వు దశకంఠు నదిలించిన మా
    రుతిఁ గార్యసుసాధకుని య
    మతి లేనట్టి పవనుజుని మానక కొల్తున్.

    (అమతి= మరణము)

    రిప్లయితొలగించండి

  4. ఆటవిడుపు సరదా పూరణ:
    (జిలేబి గారికి అంకితం)

    వెతలన్ సైచుచు వండిపెట్టుచునహో ప్రేమంబునొల్కించెడిన్
    సతినిన్ గోరుచు నర్ధహస్తముననున్ స్వర్గమ్ము చూపెట్టెడిన్
    పతినిన్ బొందగ పూర్వజన్మ వలనన్ బంగారు నీయంగనున్
    మతి లేనట్టి; మరుత్సుతున్ గొలిచెదన్ మాంగల్యముం గోరుచున్

    అన్వయం: "బంగారు నీయంగనున్ మతిలేనట్టి పతినిన్ బొందగ..."

    రిప్లయితొలగించండి


  5. అతియైపోయె సమస్యయె
    గతి తెలియుట లేదదెట్లు కావింతును పూ
    ర్తి! తరుణమిదియే సుమ్మీ
    మతి లేనట్టి పవనజుని మానక గొల్తున్



    జిలేబి

    రిప్లయితొలగించండి


  6. అతివల్ పుట్టల కైపరుంగులిడిరక్కా ! నేను సైతమ్ము దు
    ర్మతి లేనట్టి మరుత్సుతున్ గొలిచెదన్ మాంగల్యముం గోరుచున్,
    గతిమారంగ కరోన పోవుటకు చక్కంగాను ప్రార్థింతు స
    న్మతినీ యంగ జనాళి భీతి తొలగన్ మాలిన్యముల్ బోవగా!



    జిలేబి

    రిప్లయితొలగించండి
  7. క్రొవ్విడి వెంకట రాజారావు:

    సతి భూమిజ యునికి నెఱిగి
    రతనపు పల్కుల వచించి రఘురామునకున్
    ధృతి ప్రసాదించిన దు
    ర్మతి లేనట్టి పవనజుని మానక గొల్తున్.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      "ధృతిని ప్రసాదించిన" అనండి. లేకుంటే గణభంగం.

      తొలగించండి
    2. గురువుగారికి నమస్కారములు. పొరబాటు నాదే. 'ని' ని టైపు చెయ్యడం మరచినాను.

      తొలగించండి
  8. క్రొవ్విడి వెంకట రాజారావు:

    సతి యా భూమిజ యుండినట్టి పుడమిన్ సాంతంబుగా దెల్సియున్
    చతురత్వమ్మున లంకలో కెగిరి తా సారించి శోధించియున్
    వితమున్ జెప్పియు కౌసలేయునికి సంప్రీతుండు నైనట్టి దు
    ర్మతి లేనట్టి మరుత్సుతున్ గొలిచెదన్ మాంగల్యముం గోరుచున్


    రిప్లయితొలగించండి
  9. అతిఘోరమ్ముగ సంభవించు నటనే యాచివ్వలో సౌమిత్రి మ

    త్పతి మూర్చిల్లెన! రావణాసురుణిచే బాణమ్ము తాకంగనే,

    గతితప్పెంగద మానసమ్ము యయయో కావంగ నేలా? యస

    మ్మతి లేనట్టి మరుత్సున్ గొల్చెదన్ మాంగళ్యమున్గోరుచున్.

    (తనపతి లక్ష్మణుడు మూర్చపోయాడని తెలిస్తే ఊర్మిళ మనోభావాలు)

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      మొదటి పాదంలో గణభంగం. "మానసమ్ము+అయయో=మానస మ్మయయో" అవుతుంది. యడాగమం రాదు. "మానసమ్మె యయయో" అనవచ్చు.

      తొలగించండి
  10. నుతియి౦తునురా నిన్నే
    గతి లేరుర వేరె యెవరు కావగ నన్నున్
    సతతము యనుచును యా దు
    ర్మతి లేనట్టి పవనజుని మానక గొల్తున్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'సతతము+అనుచును' అన్నపుడు యడాగమం రాదు. "సతత మ్మనుచును" అనండి.

      తొలగించండి
  11. రతనపు గనినవలీలగ
    నతకడచిన ధీరుడైన యంజని సుతుడౌ
    యతిబలవంతుడయిన దు
    ర్మతి లేనట్టి పవనజుని మానక గొల్తున్

    రిప్లయితొలగించండి
  12. సతతము విడువక మదిలో
    రతనపు గనిదాటి లంక రఘురాముని శ్రీ
    మతి వెదకజనిన యా శ్రీ
    మతి లేనట్టి పవనుజుని మానక గొల్తున్.

    రిప్లయితొలగించండి
  13. సతతమురామునినామము
    స్తుతియించెడిభక్తవరుడుసుగుణుండునుస
    న్నుతజనవరదుఁడునగు దు
    ర్మతి లేనట్టి పవనజుని మానక గొల్తున్

    రిప్లయితొలగించండి
  14. స్తుతియింతును రఘురాముని
    హితుడౌ హనుమను సతతము హృదయము లోనన్
    ధృతి గొల్పు దైవము నహ
    మ్మతి లేనట్టి పవనజుని మానక గొల్తున్!

    రిప్లయితొలగించండి
  15. సతతంబున్ సకలార్థ సిద్ధికిని సత్సంకల్ప మీడేర నా
    తత సంక్లిష్టమున్బాపు ధీమతికి భక్తాభీష్ట సంత్రాత కూ
    జిత రామాంకిత నామ సంస్మరణ చిజ్జీవాత్మ భక్తుండు శ్రీ
    మతి లేనట్టి మరుత్సుతున్ గొలిచెదన్ మాంగల్యముం గోరుచున్

    రిప్లయితొలగించండి
  16. నత భక్తలోలుడై శ్రీ
    యుతుడగు శ్రీరామభక్తుడోర్మితొ ధృతి శ్రీ
    సతి కుశలము తెలిపిన శ్రీ
    మతి లేనట్టి పవనుజుని మానక గొల్తున్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'ఓర్మితొ' అని తో ప్రత్యయాన్ని హ్రస్వంగా ప్రయోగించరాదు. "ఓర్మిని" అనండి.

      తొలగించండి
  17. గతము నెరిగి మాత జనక
    సుతను వెతుక లంక లోనబోవన్
    వ్యతిరేకించుటకయి శ్రీ
    మతి లేనట్టి పవనజు మానక గొల్తున్

    రిప్లయితొలగించండి
  18. అతులిత భక్తిని గల్గియు
    నతు లొనరింపగ నొసగిన నాణ్యపు మాలన్
    వెతతో నటు నిటు గని స
    మ్మతి లేనట్టి పవన జుని మానక గొల్తున్

    రిప్లయితొలగించండి

  19. * శంకరాభరణం వేదిక *
    29/07/2020..బుధవారం

    సమస్య
    ********

    మతి లేనట్టి మరుత్సుతున్ గొలిచెదన్ మాంగల్యముం గోరుచున్"

    నా పూరణ. మత్తేభము
    *** ********

    స్థిత విజ్ఞుండు సుశోభితాంగుడు మదిన్ శ్రీ రామమూర్తిన్ సదా

    స్తుతులన్ జేసెడు రామబంటు జలధిన్ జోద్యంబుగా లంఘించి భూ

    సుత సీతమ్మ నెరంగినట్టి ఘనుడున్ శూరుండు ధీరుండు దు

    ర్మతి లేనట్టి మరుత్సుతున్ గొలిచెదన్ మాంగల్యముం గోరుచున్"

    -- 🌱 ఆకుల శాంతి భూషణ్ 🌱
    🌷 వనపర్తి🌷





    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      రెండవ పాదంలో గణభంగం. "చోద్యంబుగా దాటి..." అనండి.

      తొలగించండి
  20. సతిసీతను జూచి యిటకు
    నతివేగముతోడరమ్ము నయజయమనగన్
    ధృతి లంకగాల్చె జగతి కు
    మతిలేని పవనజుని మానకఁ గొల్తున్.

    రిప్లయితొలగించండి
  21. స్తుతులన్ జేయుచు భక్తితోసతతమున్ తోషమ్ముతో రాము స
    మ్మతి సాధించి యనుంగు శిష్యునిగ సమ్మానమ్ముతో వెల్గుచున్
    ధృతితో జానకి జాడతెల్పె ఘనమౌ తేజుండు సామీరి దు
    ర్మతి లేనట్టి మరుత్సుతున్ గొలిచెదన్ మాంగల్యముం గోరుచున్

    రిప్లయితొలగించండి
  22. మైలవరపు వారి పూరణ

    మతిమంతుండతిధైర్యవంతుడు హనూమంతుండుశ్రీమంతుడున్
    ధృతిమంతుండుమహోన్నతుండు గననెంతేన్ భక్తిగొల్వంగనా...
    శ్రితులన్ గాచెడి రక్షకుండు ఖలులన్ శిక్షింపనెంచన్ కృపా...
    మతి లేనట్టి మరుత్సుతున్ గొలిచెదన్ మాంగళ్యముం గోరుచున్!

    మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి.

    రిప్లయితొలగించండి
  23. అతియౌపూనికతోడను
    బతియగునారామచంద్రుపత్నినిగనుచున్
    సతియాసీతయెడలదు
    ర్మతిలేనట్టిపవనుజునిమానకగొల్తున్

    రిప్లయితొలగించండి
  24. రతనపుగని నే దాటితి ,
    నతివను నేను కనుగొంటి ,నాయువు నుపొసం
    గితి లక్ష్మణునకు నను నతి
    మతి లేనట్టి పవనుజుని మానక గొల్తున్

    నతిమతి గర్వము

    రిప్లయితొలగించండి
  25. సతిగాసేవలుఁజేసిన
    సీతకురామునివలననుసేమములేదే
    సుతుడైజనకజఁగాచిన
    మతిలేనట్టిపవనజునిమానకఁగోల్తున్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      రెండవ పాదాన్ని గురువుతో ప్రారంభించారు. "క్షితిజకు రాముని..." అనండి.

      తొలగించండి
  26. 29.07.2020
    అందరికీ నమస్సులు 🙏🙏

    నా పూరణ ప్రయత్నం..

    *కం*

    సతతము శ్రీ రామ జప
    వ్రతమును తా జేయునట్టి బ్రహ్మేశయు డే
    సతి పతి నడుమన తనకను
    *మతిలేనట్టి పవనుజుని మానక కొల్తున్*

    *కళ్యాణ్ చక్రవర్తి ముంబాయి*
    🙏🙏

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'బ్రహ్మేశయుడు'? 'నడుమన' అనరాదు, 'నడుమను' అనండి.

      తొలగించండి
    2. ధన్యోస్మి ఆర్యా🙏🙏
      బ్రహ్మేశయుడు= బ్రహ్మచారికి పర్యాయ పదము🙏

      తొలగించండి
  27. ప్రతిభావంతుడెయౌనెయీహనుమయెభ్భంగిన్ ననున్ జేర్చుగా
    పతిశ్రీయొద్దకువేగమేననుచునబ్బామామణియౌత్సాహియై
    యతియౌసంతసమొప్పగాననియెపెన్హర్షంబుతోసీతదు
    ర్మతిలేనట్టిమరుత్సుతున్ గొలిచెదన్ మాంగళ్యంబుగోరుచున్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      రెండవ పాదంలో గణభంగం. సవరించండి.

      తొలగించండి
    2. ప్రతిభావంతుడెయౌనెయీహనుమయెభ్భంగిన్ ననున్ జేర్చుగా
      పతిశ్రీయొద్దకువేగమేననుచునప్పద్మాక్షియౌత్సాహియై
      యతియౌసంతసమొప్పగాననియెపెన్హర్షంబుతోసీతదు
      ర్మతిలేనట్టిమరుత్సుతున్ గొలిచెదన్ మాంగళ్యంబుగోరుచున్

      తొలగించండి
  28. అతిబలు నంజని పుత్రుని
    హితకరునా రామ భక్తు నీశ్వర రూపున్
    ధృతిమతియైనను గానతి
    మతి లేనట్టి పవనజుని మానక గొల్తున్

    రిప్లయితొలగించండి
  29. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  30. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  31. సవరణతో

    గతము నెరిగి మాత జనక
    సుతను వెతుక లంక లోన జూడగ బోవన్
    వ్యతిరేకించుటకయి శ్రీ
    మతి లేనట్టి పవనజు మానక గొల్తున్

    రిప్లయితొలగించండి
  32. రిప్లయిలు
    1. విత తాదర్శ గుణావృత
      మతి వీ వాస్తికుఁడ వెన్న మానవ మఱి నీ
      క తగునె పలుకఁగ మాటలు
      మతి లేనట్టి, పవనజుని మానక గొల్తున్


      సతి వైదేహికి రామచంద్రునకు సత్సాంగత్య సంప్రాప్తికై
      శతవద్యోజన వార్ధి దాటిన మహోత్సాహాత్మునిన్ సంతత
      మ్మతి నిష్ఠాస్థిత చిత్త తత్పరుఁడనై యాగార్హతా దాత్రి శ్రీ
      మతి లేనట్టి మరుత్సుతుం గొలిచెదన్ మాంగల్యముం గోరుచున్

      తొలగించండి
  33. తపనాంశుండకు ఛాత్రుడై సకల శాస్త్రాలందు నిష్ణాతుడై
    సతతమ్మా రఘు రామనామమొకటే సర్వంబు గా నెంచుచున్
    ధృతితో సంద్రము దాటినట్టి ఘనుడా ధీరుండు సామీరి దు
    ర్మతి లేనట్టి మరుత్సుతున్ గొలిచెదన్ మాంగల్యముం గోరుచున్.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు

    1. సవరణతో:

      ప్రతిభావంతుని ఛాత్రుడై నిఖిలమౌ పాంచాలముల్ పొందియున్
      సతతమ్మా రఘు రామనామమొకటే సర్వంబు గా నెంచుచున్
      ధృతితో సంద్రము దాటినట్టి ఘనుడా ధీరుండు సామీరి దు
      ర్మతి లేనట్టి మరుత్సుతున్ గొలిచెదన్ మాంగల్యముం గోరుచున్.


      ...విరించి

      తొలగించండి
  34. మ:

    అతిగా వ్యాప్తి ని బొందనై కడువిషా ఘాతంబు నై యెల్లెడన్
    మతులన్ బాపు కరోన యంచనన క్షేమం బెట్టులో దోచకై
    గతిజూపింపగ భక్తితో పిలుతు కాంక్షల్ దీర తానయ్యు దుర్
    మతి లేనట్టి మరుత్సుతున్ గొలిచెదన్ మాంగల్యమున్ గోరుచున్

    వై. చంద్రశేఖర్

    రిప్లయితొలగించండి
  35. కందం
    అతి బలవంతుండంచును
    మతిఁ గల్గిన వాడటంచు మహిలో సర్వుల్
    నుతియించుటందున నస
    మ్మతి లేనట్టి పవనజుని మానక గొల్తున్

    రిప్లయితొలగించండి

  36. మత్తేభవిక్రీడితము
    మితి లేనట్టి బలంబునన్ కడలిపై మేఘాల రాదారిలో
    సతి సీతమ్మను దీక్షతో వెదుకుచున్ సాధించి లక్ష్యమ్మునే
    పతిరామయ్యకు తోడు నిల్చు పలుకుల్ వల్లించుటందే యస
    మ్మతి లేనట్టి మరుత్సుతున్ గొలిచెదన్ మాంగల్యముం గోరుచున్

    రిప్లయితొలగించండి
  37. కె.వి.యస్. లక్ష్మి:

    అతినేర్పున లంక కెగిరి
    చతురిమతో సీతజాడ చాటిన వాడై
    పతి రాముని తేర్చిన దు
    ర్మతి లేనట్టి పవనుజుని మానక గొల్తున్.

    రిప్లయితొలగించండి
  38. సతిసీత జాడదెలియగ
    ధృతి దాటెను తోయరాశి దీనతలేకే
    చ్యుతిలేని దీక్షతో, దు
    ర్మతి లేనట్టి పవనజుని మానకగొల్తున్

    రిప్లయితొలగించండి
  39. అతి దీర్ఘంబగు ద్వీపవంతము ననాయాసంబుగా దాటి భా
    సిత లంకానగరంబు జేరి చనుచున్ స్త్రీజాల మధ్యంబునన్
    సతి సీతన్ పరికించుచున్ దిరిగెడిన్
    శ్రాంతుండు చాంచల్యమౌ
    మతి లేనట్టి మరుత్సుతున్ గొలిచెదన్ మాంగల్యమున్ గోరుచున్

    శ్రాంతుడు = యోగి

    రిప్లయితొలగించండి
  40. అతులిత బలమును పొందుచు
    సతతము సవితృని గొలుచుచు జవమున విద్యల్
    మతితో నేర్చుచు నేదు
    ర్మతి లేనట్టి పవనజుని మానక గొలుతున్.

    రిప్లయితొలగించండి