28, ఆగస్టు 2020, శుక్రవారం

దత్తపది - 170

కవిమిత్రులారా,
పేపర్ - బుక్ - పెన్ - ఇంక్
పై పదాలను ప్రయోగిస్తూ భారతార్థంలో
మీకు నచ్చిన ఛందంలో పద్యం వ్రాయండి.

60 కామెంట్‌లు:

G P Sastry (gps1943@yahoo.com) చెప్పారు...


"శ్రీ రాముని దయ చేతను..."

నడిరేయి సరదా పూరణ:

కోపము వీడి భారతము కొండొక రీతిని వ్రాయబూనుచున్
తాపము హెచ్చగా మిగుల తప్పులు పోవగ సెల్లు ఫోనునన్
పాపయ శాస్త్రులన్ సుతులు పండుగ జేయుచు టెక్ససందునన్
పేపరు బుక్కు పెన్నులను ప్రీతిని తీసిరి యింకు పాటుతో

🙏

Raja Rao చెప్పారు...

క్రొవ్విడి వెంకట రాజారావు:

బుక్కున పేపరున్ తెఱచి పొందగు రీతిని నింకు పెన్నునన్
చక్కగ నింపి యర్జునుని సాహసకృత్యము లేర్చికూర్చుచున్
చొక్కమునైన పద్ధతిని సూతసుతుండగు కర్ణు నాజిలో
చక్కడగించు ఘట్టమును చందుగ వ్రాసె నతండు జూడుమా!

Sistla Sharma చెప్పారు...

భీముడు సైరంధ్రితో....

అలుపే పర్వదు నా మదిన్నిక సమ
స్యల్దీరునే వేగమున్
తలపున్నన్ను దహించు నీ వికృత కృ
త్యం బుక్కు దేహాన చే
తల జూపించెద నాదు శౌర్యమును స ద్యఃస్ఫూర్తి బెన్గాలినై
విలపించన్దగ దీవు జంపెదను భా
విన్నింక నా కీచకున్!


seethadevi gurram చెప్పారు...

కృష్ణుడు పాండవులతో

చక్కని గెలుపే పర్యవసానము గద
బుక్కెడు పరమాన్నము దిను ప్రొద్దు గనుము
విజయ మింకెంతొ దూరము వెళ్ళలేదు
కీర్తియన్ పెన్నిధి దొరకు కీడుదొలగు

డా. జంధ్యాల జయకృష్ణ బాపూజీ ఎం.ఏ., పి హెచ్.డి. చెప్పారు...

దత్తపది :
పేపర్ - బుక్ - పెన్ - ఇంక్ అనే పదాలతో
భారతార్థంలో ఇష్టమైన ఛందస్సులో

( వివాహమాడి కౌరవవంశరక్షణ కావించ
మని భీష్మునికి చెబుతున్న సత్యవతీదేవి )
వగపే పరుగిడె నామది
సెగలను జిమ్ముచు నుబుకుచు ; శీఘ్రమ నీవే
తగుదువు పెన్ముప్పును బా
పగ ; బరిణయమాడు భీష్మ ! వంతయు
నింకున్ .
(వగపు - శోకము ; వంత- బాధ )

తంగిరాల సుందర రఘురాం చెప్పారు...

భీమా! చంపే పర్వము
నా మల్లచఱచుట నాపు మా పెన్గొనులా
టన్! మక్కించి ఋబుక్షము
కున్ మగధాధీశు ననుపు, గొదగొను మింకన్౹౹

pks kumar చెప్పారు...

ఈ నాటి శంకరాభరణం వారి‌దత్తపది


పెన్,బుక్,ఇంకు,పేపరు


ఈ పదములతో భారతార్ధము

సీసములో నా పూరణ

ప్రేయసీ నీవల(పేపరు)గు‌లను తీయించుగా పురుషుని, యెంచి కొంటి

వే మంచి (యింకు)వ,వేగిరము గనిట్టి నర్తన శాలలో నాదు కోరి

కను తీర్చ నుంటివి గా నొకపరి తీయ
వలయు నీ ముసుగు,దీపపు వెలుగు

లోనిను చూచెద నేనని దరిచేర
వలలుడు తనపిడికిలి బిగించి

మార్కొన డు(బుక్కు)న పడెను మత్తు వదలి

కీచకుడు విస్మయము నొంది కాచు కొనుచు

(పెన్గొ)నుచు ముష్టి యుద్ధము భీకరముగ

చేసి నసువులు రయముగ బాసె నపుడ

ఇంకువ. చోటు

పెన్గొని త్రోపులాడు


పూసపాటి

కంది శంకరయ్య చెప్పారు...

ఆహా... ఇంతకాలానికి మీచేత దత్తపది వ్రాయించ గలిగాను.
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
(భారతంలో పెన్ను, ఇంకు మొదలైనవి ఉండవు కదా... అందరూ కచ్చితంగా అన్యార్థంలోనే దత్తపదాలను ప్రయోగిస్తారు అనుకొన్నా! మీరు ఈ రూట్లో వస్తారని ఊహించలేదు!)

కంది శంకరయ్య చెప్పారు...

మీరు కూడా ప్రభాకర శాస్త్రి గారి మార్గం పట్టారు.
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణ బాగున్నది. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణ బాగున్నది. అభినందనలు.
మూడవ, నాల్గవ పాదాలలో ప్రాస తప్పింది. టన్+మక్కించి=టన్మక్కించి, కున్+మగ=కున్మగ... మ,న్మ లకు ప్రాసలేదు.

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణ బాగున్నది. అభినందనలు.
"దీపపు వెలుంగు..." అనండి. లేకుంటే గణభంగం.

కంజర్ల రామాచార్య. చెప్పారు...

నిన్నటి పూరణ


వికలుండై వ్యధఁ జెంద ధర్మవిభు డావేక్షించి క్రోధాళువై
ప్రకటాటోపవిపక్షహృద్దళనతీవ్రావేశదుర్వీక్ష్యుడై
బకసంహర్త జయమ్ముఁ గోరి మదిలో, పాంచాలితో భాస్కరాం
బకునిం గొల్చిరి కృష్ణ భీములు గడున్ భక్తిన్ బ్రదర్శించుచున్.

భాస్కరాంబకుడు = శ్రీమహావిష్ణువు
(చక్షూ స్సూర్యోऽజాయత అని పురుషసూక్తం)
కృష్ణ ద్రౌపది.

కంజర్లరామాచార్య.

vsnmhari చెప్పారు...

తే.గీ.
కృష్ణ!నీదు రూ(పేపర)మోష్ణగతుల
నార్పును గ(బుక్కు)న వినుము కూర్పు మయ్య
సంధి (పెన్)యత్నమును జేసి సత్య (మింకు)
తగవు లిద్దానిచే ననె ధర్మజుండు.

Akula shanthi bhushan చెప్పారు...
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
Yajnesh చెప్పారు...

నేటి దత్తపది🙏🏻

ఆపే పరుసములిక, నీ
కోపంబుక్కారణంబు కోమలి కృష్ణా!
ఈపెన్ జీకటి కీచకుఁ
రూపింకీమట్టి గలియు రోదించకుమా!

నిన్నటి పూరణము:
శా.
ప్రకటంబయ్యెను కీచకాధముడు, పాపాత్ముండు, కామాంధుడా
సకటున్ పీడమడంచ నా వలలుతో సైరంధ్రియే వేడగా
సకలంబా హరి గాచునంచెరిగి యాసద్బాంధవున్, తోయజాం
బకునిం గొల్చిరి కృష్ణ భీములు గడున్ భక్తిన్ బ్రదర్శించుచున్

సకటుడు-దుష్టుడు (పర్యాయపద నిఘంటువు,GN Reddy 1990)
కృష్ణ-ద్రౌపది
🙏🏻🙏

Raja Rao చెప్పారు...

శ్రీ ప్రభాకర శాస్త్రి గారికి, గురువర్యులకు ఇద్దరకూ నమస్కారములు.

Zilebi చెప్పారు...


జరాసంధుని వధ

చట్టున మునుపే పర్రున
గుట్టుగ శాదమును చీల్చి కూల్చుట నేర్పెన్
కొట్టుచు గబుక్కు పెన్గొని
పట్టుచు విదళింప నింకె బార్హద్రథుడే!


జిలేబి

G P Sastry (gps1943@yahoo.com) చెప్పారు...

🙏😊

G P Sastry (gps1943@yahoo.com) చెప్పారు...

మైలవరపు వారి పూరణ

ఆపకు కంబుకంఠి! మనసాయెను నీపయి., నీదు సొంపులిం...
పే., పరుడంచునెంచకె.,రహిన్ దరి జేరవె.,మన్మథాగ్నిలో
వేపకె., నిన్ను నన్ను గలిపెన్ విధి., మాలిని! రాజ్యమంతయున్
నీపరమౌను నన్ను కరుణించిన., నింక సుఖాల దేల్చవే!!

మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి.

Akula shanthi bhushan చెప్పారు...

28, ఆగస్టు 2020, శుక్రవారం
దత్తపది - 170

పేపర్ - బుక్ - పెన్ - ఇంక్
పై పదాలను ప్రయోగిస్తూ భారతార్థంలో
మీకు నచ్చిన ఛందంలో పద్యం వ్రాయండి

నా పూరణ.
*** *** **
( శ్రీ కృష్ణుడు రాయబారిగా వెడలి కౌరవేంద్రునితో పలుకు సందర్భము .... )

తే.గీ.

వ్యర్థపు తల(పే పరు)గులు వాఱుటేల?
తగదు నీకు సుయోధన!వగలు దెచ్చు
కాదది సబ(బు.కు)రిపించు గారవమును.
మంచి తల(పెన్ను)కొని నీదు మనమునందు
పాండుసుతులదౌ భాగము వారికిడుము.
(ఇంకు) సుంత పాపములు పృథ్వీశ నీకు!

🌱 ఆకుల శాంతి భూషణ్ 🌱
🌷 వనపర్తి🌷

శంకర్జీ డబ్బీకార్ చెప్పారు...

వలపేపరువిడెనుబుకుచు
తలపేపెన్బాధనింకెతరుణీమణిరో
పిలుపేయాలస్యమునీ
తలవాకిటసౌబలుండుదాసుండగులే

కరణం రాజే శ్వర రావు చెప్పారు...

పేపరు పులియౌ నుత్తర వీరు మనసు
బుక్కు లోనున్న పుటలను పూర్తి చదివి
పెన్నిధి గ మారి భయమది వీగి పోవ
పార్థు డింకించె కురుసేన బ వర మందు

విరించి చెప్పారు...

*కీచకుడు ద్రౌపదితో మదోన్మత్తుడై పలికిన మాటలుగా* నీ తలపే పర్వేందు ము ఖీ! తాపము పెంచుచుండె కేశిని, యింకే లా, తామసము గబుక్కున . నా తారసమునకు రమ్ము నారీ ముదమున్.

Sreedhara Rao Machavolu చెప్పారు...

బుక్క గొన్నట్టి వస్త్రము వెక్కిరించ
నేల నాపెన్ కదియగ నీ కాలహరణ
మనియె యోర్మి ఇంకి యతని మనము నందు
చెలువ తలపే పరుగు లిడ సింహబలుడు

Zilebi చెప్పారు...


మళ్లీ కీచకుడేనా :)


కన్ఫరమ్ గా విరాటు కొల్వులోని వారే :)



జిలేబి

seethadevi gurram చెప్పారు...

ధన్యాస్మి గురుదేవా! నమస్సులు! 🙏🙏🙏

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణ అద్భుతంగా, మనోహరంగా ఉన్నది. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

మీ మొదటి పూరణ బాగున్నది.'కోపంబుక్కారణంబు' అనడం సాధువు కాదు.
మీ నిన్నటి పూరణ వైవిధ్యంగా, ప్రశస్తంగా ఉన్నది.
అభినందనలు.

శశిభూషణ సిద్ధాంతి నంద్యాల శ్రీ కొలను భారతి పంచాంగ కర్త చెప్పారు...

*ఇంకే *పెన్మాయ నిలువదు
బింకము వీడి నిలువుమిట వేగమె పార్థా !
కుంకల రోషం *బుక్కన్
లెంకల జేయ పగలనిట రే*పే పర్వమౌ !

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణ బాగున్నది. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

మైలవరపు వారి పూరణ అద్భుతంగా ఉన్నది.

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణ బాగున్నది. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణ బాగున్నది. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణ బాగున్నది. అభినందనలు.

శశిభూషణ సిద్ధాంతి నంద్యాల శ్రీ కొలను భారతి పంచాంగ కర్త చెప్పారు...

*బుక్కగా నతిథిగ వచ్చె నక్కసాన
కోపి దూర్వాస మౌని *పెన్ తాపమొంది
మౌనుల తల*పే పర్వములౌను కృష్ణ !
బోన మిడవేగ పడు*మింక వారిజాక్షి !

కంజర్ల రామాచార్య. చెప్పారు...

నమఃపూర్వకకృతజ్ఞతలండి.

గోలి హనుమచ్చాస్త్రి చెప్పారు...

దత్తపది : పేపర్ - బుక్ - పెన్ - ఇంక్

ద్రౌపది శ్రీకృష్ణునితో....

తేటగీతి:
బాధనోర్చితి బుక్కిట బట్టి బట్టి
సైపలేనింక మాధవా సంధియేల
క్రమ్మె పెన్మాయ దొలగించి గావుమయ్య
అనిని గెలుపే పరుగెత్తి యంద మాకు.

---గోలి.

శ్రీహర్ష చెప్పారు...

కుప్పించన్ చుబుకమ్ము నిప్పులనె యుగ్రుండౌచు భీముండనున్
తప్పెన్ ధర్మము కౌరవాధముల యుద్ధంబింక తథ్యంబగున్
తప్పున్ వే తలలింకు రక్తములు విధ్వంసంబు సృష్టించెదన్
పప్పై పోవును వారిసేన గెలుపే పర్వంగ నేనాడెదన్

తిరుక్కోవళ్ళూరు శ్రీహర్ష

A.Satyanarayana Reddy చెప్పారు...

ద్రౌపది కీచకునితో
వల *పే పర* కాంత పయిన
కలిగించును *పెను* విపత్తు గహ్వరి పైనన్
నిలుపుము జం *బుక* చేష్టలు
తొలగుము నీ *వింక* చావు దొరలక మున్నే

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణ బాగున్నది. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణ బాగున్నది. అభినందనలు.

Surya చెప్పారు...

మడుగులో దాగున్న దుర్యోధనుని బయటకు రప్పించుటకై ధర్మజుడు ...

తల(పే పర్వి)డ నటు నిటు
కలహం(బుక్క)డగ జేయ గాసారమునన్
నిలి(పెన్) నను దుర్విధనుచు
విలపించెదవేల (నింక) వెలికిన్ రమ్మా

గుండా వేంకట సుబ్బ సహదేవుడు చెప్పారు...

స్వర్గంలో అర్జునునితో ఊర్వశి..

కందం
తలపే పరుగులు వెట్టగ
వలపుబుకుచు కౌగిలింప వచ్చితి, తనువున్
మలచిన పెన్నిధుల మరు న
నలమ్మునకు రుధిరమింకు నరుడా! నీకై!!

కళ్యాణ్ చక్రవర్తి చెప్పారు...

28.08.2020
దత్తపది..

*పేపర్ - బుక్ - పెన్ - ఇంక్*
పై పదాలను ప్రయోగిస్తూ భారతార్థంలో
మీకు నచ్చిన ఛందంలో పద్యం వ్రాయండి

నా పూరణ యత్నం 🙏

*కం*

చూపే పరాయి నన నే
నోపక మనసిక నుబుకుచు నొంటరి యగునే
చూపెన్ ప్రేమను నీపై
ద్రౌపది తగు లీలలింక దాస్యమ్మిడుమా!!

*కళ్యాణ్ చక్రవర్తి ముంబాయి*
🙏

Satyanarayana Tirunahari చెప్పారు...

ఇంకనిదై స్వార్థము నా
వంక గన పరాన్నబుక్కువసుధాధీశుల్
పంకిలతలపే పరుపెన్
డొంకన బడియె కురురాజు నొంటరితుదకున్... (కృష్ణ వాక్కు)

కామేశ్వర రావు పోచిరాజు చెప్పారు...

స్వరములు జాఱ చివరను ద
నరు నిటు రేపేప రుబుకు నలి రే పేపర్
నరుఁడు నుబుక్ చాపెను పద
మరయం జాపెన్ మఱింకు నరయంగా నింక్


[నరుఁడు = అర్జునుఁడు; నలిన్ రేపు ఏపర్ ; నలి రోగము; ఏపు = బాధించు; ఏపరు: ఏపర్; ఉబుకు: ఉబుక్; చాపెను: చాపెన్; ఇంకు: ఇంక్, యిట్లు పదముల చివరి స్వరము జాఱిన యగు నని భావము]

chandrashekhar yelisetty చెప్పారు...

కం:

వలపే పరమావధిగా
వెలుగుచు కీచుకు డుబుకెడి ప్రేమను జూపెన్
ఫలితము ద్రౌపది తడబడి
కలవర మందెను మనమున కన్నీళ్ళింకన్

వై. చంద్రశేఖర్

ఆవుల చక్రపాణి యాదవ్ చెప్పారు...

దత్తపది :-
*పేపర్ - బుక్ - పెన్ - ఇంక్*
పదాలను ప్రయోగిస్తూ భారతార్థంలో
నచ్చిన ఛందంలో పద్యం

*కందం**

గెలుపే పరమావధి కా
వలెను గబుక్కుమని గెలవవలెను పెనుగులా
టలు లేక రాజ్యమబ్బదు
విలంబమేలింకను పద విజయా పోరన్
................✍️చక్రి

(యుద్ధ రంగమున నిలిచిన అర్జునునితో కృష్ణుడు)

subbarao చెప్పారు...
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
subbarao చెప్పారు...

పెన్వ లపుగల్గెనింకనేనోపలేను
భామ!రావనీదుతలపేపరగెమదిని
పూనిరానిచోనసువుగు బుక్కుమనును
నంచుబ్రాధేయపడెనునా కీచకుండు

sitharamayya solasa చెప్పారు...

ఏకచక్ర పురంబున ‘ఇంకు’వ కడ
అసురుడింక తమను బుక్కు ననుచు వగచ
బకుని తానొంటరిగ చం’పే పరు’వ ముండి
నట్టి ‘పెన్ను’ద్ది నని భీముడనున యించె

ఇంకువ = నివాసస్థలం
బుక్కు = తిను
పరువము = యౌవనము
పెన్నుద్ది = పెద్ద ఆటగాడు
అనునయించు = ఊరడించు