2, ఆగస్టు 2020, ఆదివారం

సమస్య - 3445

కవిమిత్రులారా,
ఈ రోజు పూరింపవలసిన సమస్య ఇది...
"హరుని కరములు శంఖచక్రాంచితములు"
(లేదా...)
"హరుని కరంబులందు నలరారుచునుండెను శంఖచక్రముల్"

60 కామెంట్‌లు:


  1. నడిరేయి సరదా పూరణ:

    సరసపు రామపాదమును చక్కగ బట్టుచు నోరుగల్లునన్
    మురియుచు రేయినిన్ పవలు ముచ్చట మీరగ వందపద్యముల్
    పరువులు బెట్టి వ్రాయగను పంతము నందున కందివంశపున్
    హరుని కరంబులందు నలరారుచునుండెను శంఖచక్రముల్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ సరదా పూరణ బాగున్నది. అభినందనలు.
      మందమతి నగుచుఁ బూనితి
      నందముగాఁ బద్యశతము నటు వ్రాయఁగ నే
      మందును నా దురదృష్టము
      పందొమ్మిది పద్యములనె వ్రాసితి నయ్యో!

      తొలగించండి

  2. ఆటవిడుపు సరదా పూరణ:
    (జిలేబి గారికి అంకితం)

    చెరచగ దుఃఖమున్ తనరి చెల్లిని గూడుచు హస్తినమ్మునన్
    పరచుచు కాగితమ్మునొక పండుగ పూటను మేటి చిత్రమున్
    తెరువును తెన్నునున్ గనక తీరిక మీరగ వ్రాయ రాహులే
    హరుని కరంబులందు నలరారుచునుండెను శంఖచక్రముల్

    రిప్లయితొలగించండి
  3. క్రొవ్విడి వెంకట రాజారావు:

    అసురు లెందరో హతులైరి అజితుడు పుర
    హరుని కరముల; శంఖ చక్రము లలరె
    శేషసాయి చేతులయందు శ్రేష్టముగను
    దుష్ట సంహారమొనరించు నిష్ఠతోడ.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      ఇచ్చిన తేటగీతి సమస్యలో యతిదోషం ఉంది. ఇప్పుడు సవరించాను. దానికి అనుగుణంగా మరొక పూరణ వ్రాయండి.

      తొలగించండి
    2. గురువుగారికి నమస్కారములు. నేనూ గమనించక వ్రాసాను. ఇప్పుడు పద్యము మార్చి వ్రాసినాను.

      దనుజు లెందరినో జంపి త్రాణమిచ్చె
      హరుని కరములు; శంఖుచక్రాంచితములు
      నైన శ్రీహరి చేతులు ననవరతము
      దుష్ట సంహార మొనరించు దొడ్డవౌచు.

      తొలగించండి
  4. తిరముగ వేయియేండ్లు కడుతేకువతో కరిపోరుచున్ దుదన్
    వరదుడ కావవేయని స్తవంబును
    జేయగ దొండమెత్తి దా
    పరుగున నున్నపాటున స్వభక్తుని
    బ్రోవగ నేగెడిన్ ఝుషా
    హరుని కరంబులందు నలరారుచు నుండెను శంఖచక్రముల్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'ఝష' అకారాంత పులింగం. ఝషహరుని... అనడం సాధువు. అక్కడ "..బ్రోవగ నేగు నక్రసం।హరుని..." అనండి.

      తొలగించండి
    2. ధన్యవాదములు గురుదేవా! సవరిస్తాను. 🙏🙏🙏🙏

      తొలగించండి
    3. సవరించిన పూరణ 🙏🙏🙏

      తిరముగ వేయియేండ్లు కడుతేకువతో కరిపోరుచున్ దుదన్
      వరదుడ కావవేయని స్తవంబును
      జేయగ దొండమెత్తి దా
      పరుగున నున్నపాటున స్వభక్తుని
      బ్రోవగ నేగు నక్ర సం
      హరుని కరంబులందు నలరారుచు నుండెను శంఖచక్రముల్

      తొలగించండి
  5. క్రొవ్విడి వెంకట రాజారావు:

    విరివిగ పౌరులెల్లరను వేచిన రాక్షసులెల్ల చేడ్పడెన్
    హరుని కరంబులందు; నలరారుచు నుండెను శంఖ చక్రముల్
    స్మరగురువైన శ్రీహరి విశాల కరమ్ములయందు జూడగా
    దురితములెంచి పైకొనెడి దుర్జనజాతి వినాశమెంచుచున్.

    రిప్లయితొలగించండి
  6. వరదుడు వేంకటేశ్వరుడు వారిజనేత్రుడు నీలదేహుడున్
    మురహరి వేయినామములమూర్తియు నార్తరక్షకు
    న్నరయగ వేంకటాద్రినను నమ్మకమీకలి శోకకల్మషా
    హరుని కరంబులందు నలరారుచునుండెను శంఖచక్రముల్

    కొరుప్రోలు రాధాకృష్ణరావు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      రెండవ పాదంలో గణభంగం. సవరించండి.'కల్మషహరుని' అనడం సాధువు. "శోకదోష సంహరుని..." అనండి.

      తొలగించండి
    2. వరదుడు వేంకటేశ్వరుడు వారిజనేత్రుడు నీలదేహుడున్
      మురహరి వేయినామములమూర్తియు పెన్నిధి నార్తరక్షకు
      న్నరయగ వేంకటాద్రినను నమ్మకమీకలి శోకదోషసం
      హరుని కరంబులందు నలరారుచునుండెను శంఖచక్రముల్

      కొరుప్రోలు రాధాకృష్ణరావు

      తొలగించండి

  7. సురమునులాది సేవితుడు సుందరరూపుడు జిద్విలాసుడున్

    వరముల నిచ్చు ధార్మికుడు వారిజనేత్రుడు పద్మనాభుడున్

    సిరులనొసంగు పావనుడు శ్రేయముగూర్చెడు శ్రీనివాసుడున్

    గిరిధరుడున్ రమాసఖుడు గృష్ణుడు మాధవుడున్ సురారి సం

    హరుని కరంబులందు నలరారుచునుండెను శంఖచక్రముల్"


    -- 🌱 ఆకుల శాంతి భూషణ్ 🌱
    🌷 వనపర్తి🌷





    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      "సురుమునిసంఘ సేవితుడు..." అనండి.

      తొలగించండి


  8. శూలమలరె భక్తుల గావ సొబగులీన
    హరుని కరముల, శంఖచక్రమ్ము లలరె
    హరి కరముల గావ జగతి! హరి హరులకు
    లేదు భేదమరయగాను లేమ వినవె!


    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. తేటగీతి సమస్యలో యతి తప్పింది. సవరించాను. దానికి అనుగుణంగా మరొక పూరణ చేయండి.

      తొలగించండి


  9. కందాచంప్స్




    వినుమా శూలము గావగ
    నను, హరుని కరంబులందు నలరారుచునుం
    డెను, శంఖచక్రముల్ చే
    తను గైకొనె హరియె నన్ను తరుణీ గావన్


    జిలేబి

    రిప్లయితొలగించండి
  10. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  11. ఎవరి కరములను త్రిశూల మెపుడు ను౦డు
    ఎవరు భక్తుల కావ౦గ నెల్ల వేళ
    అలరు చు౦డును చేతుల నాయుధముల
    హరుని కరముల శంఖచక్రమ్ము లలరె

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. క్రమాలంకారంలో పూరించే మీ ప్రయత్నం ప్రశంసనీయం. కాని అన్వయలోపమున్నది. సవరించిన సమస్యకు అనుగుణంగా మరొక పూరణ వ్రాయండి.

      తొలగించండి
  12. స్థిరతరభక్తియుక్తుడయి చెప్పెను తిక్కన భేదభావముల్
    ధరపయి దాల్చరాదనుచు దాను కలన్ గనినట్టి భవ్యమౌ
    హరిహరనాథరూపమున నౌను త్రిశూలము నూర్ధ్వపుండ్రముల్
    హరుని కరంబులందు నలరారుచునుండెను శంఖచక్రముల్

    రిప్లయితొలగించండి
  13. పరముగోరి పామరుడొక పటము పయిన
    పరమముని చిత్రమొక్కటి వ్రాయబోవ
    పరవశమున త్రిశూలము బదులు మారె
    హరుని కరములు శంఖచక్రాంచితములు

    రిప్లయితొలగించండి
  14. ఉరమున కౌస్తుభంబు సుమనోహర సుందర వైజయంతి భా
    సుర గళసీమశోభిలగ సూర్యశశాంకులె చక్షులవ్వ తా
    వరసిరివేల్పుచెన్నమర భాతిని వెల్గెడు దైత్యలోక సం
    హరుని కరంబులందు నలరారుచునుండెను శంఖచక్రముల్

    రిప్లయితొలగించండి
  15. శేషశయనుండు శ్రేష్ఠుడు శ్రీధరుండు
    విశ్వరూపుడు విరజుడు విధి విలాసి
    బ్రహ్మనాభుడు భరిమ భావనుని పాప
    హరుని కరములు శంఖచక్రాంచితములు.

    రిప్లయితొలగించండి
  16. కరకగు బంధనమ్మునను కంసునిజంపగ నష్టమంబునన్
    సరగున నుద్భవించునెడ శ్రావణమందున నిందిరా మనో
    హరుని కరంబులందు నలరారుచు నుండెను శంఖచక్రముల్
    వరుసగ పద్మకుంతములు వక్షమునందున కౌస్తుభమ్మదే!

    రిప్లయితొలగించండి
  17. దురిత మొనరించు దానవ దుష్ట తతుల
    నంత మొందింప శ్రీహరి యా ఢ్యు డగుచు
    నాయధంబులు ధరియించె ననగ త్రిపుర
    హరుని కరములు శంఖ చక్రాన్వి తములు

    రిప్లయితొలగించండి
  18. భక్త సులభుడు కన్నయ్య-భామ కొఱకు
    పారిజాతముఁదెచ్చెనే సౌరు మీర!
    రుక్మిణీ దివ్య గాఢ చోరుని మనో వి
    హరుని కరములు శంఖ చక్రాంచితములు.

    రిప్లయితొలగించండి

  19. * శంకరాభరణం వేదిక *
    02/08/2020...ఆదివారం

    సమస్య
    ********
    హరుని కరంబులందు నలరారుచునుండెను శంఖచక్రముల్"

    నా పూరణ. చం.మా.
    *** ********

    సురుముని సంఘ సేవితుడు సుందరరూపుడు జిద్విలాసుడున్

    వరదుడు బక్షి వాహనుడు వారిజనేత్రుడు పద్మనాభుడున్

    నిరతము ధర్మ రక్షకుడు నిర్మల మానసుడున్ గుణాఢ్యుడున్

    కరుణ సుభక్త పాలకుడు క్ష్మాసుత కాంతుడు కార్య శూరుడున్

    సిరులనొసంగు పావనుడు శ్రేయముగూర్చెడు లోక పూజ్యుడున్

    గిరిధరుడున్ దయామయుడు గృష్ణుడు మాధవుడున్ సురారి సం

    హరుని కరంబులందు నలరారుచునుండెను శంఖచక్రముల్"


    -- 🌱 ఆకుల శాంతి భూషణ్ 🌱
    🌷 వనపర్తి🌷





    రిప్లయితొలగించండి
  20. ఉరగమె పాన్పుగా గల మహోన్నత కీర్తినిఁ గల్గినట్టి యా
    సురగణ వందితుండు పురుషోత్తము డాతడు పద్మనాభుడా
    విరజుడు విష్టర శ్రవుడు విక్రముడచ్యుతు డౌ రమా మనో
    హరుని కరంబులందు నలరారుచునుండెను శంఖచక్రముల్

    రిప్లయితొలగించండి
  21. హరిహరనాథుడాశ్రితులకండయుదండయుదోడునీడయై
    సురమునిదేవదానవులుసూరులుశూరులుసన్నుతించగా
    కరమునశూలమున్డమరుకంబమరెన్దితిపుత్రమోదసం
    "హరుని కరంబులందు నలరారుచునుండెను శంఖచక్రముల్

    రిప్లయితొలగించండి
  22. వరమిడవేడినంతరమవస్త్రమువీడకభక్తరక్షణా
    తురుడగుమాధవుండుగరిదుఃఖమణంచగనేగునంతలో
    గరుడునువిష్ణులోకముసగౌరవమొప్పగవెళ్ళెనక్రసం
    హరుని కరంబులందు నలరారుచునుండెను శంఖచక్రముల్

    రిప్లయితొలగించండి
  23. హరునికరములుశంఖచక్రాంచితములు
    హర్ష!వినుమిదిహరియునుహరులొకరిల
    గానయటులనదోషముగాదుసుమ్ము
    నంజలిఘటియింతునికనుహరిహరులకు

    రిప్లయితొలగించండి
  24. అరదము నెక్కి సాగుచును యామిని యందు
    నవేణువూదుచున్
    మరులను గొల్పి మానినుల మానసముల్ హరియించు చున్నట
    న్నిరతము పాండు పుత్రులకు నెమ్మిని కూర్చిన
    శ్రీరమా మనో
    హరుని కరంబులందు నలరారుచునుండును శంఖచక్రముల్

    రిప్లయితొలగించండి
  25. తిరుమల గుడి ప్రతిమయేదొ తీర్పుఁజేయ
    యతులు రామానుజవరుల యాజ్ఞమేఱ
    శంఖు చక్రములను ముందు చక్కఁబెట్టి
    తలుపు లనుమూసి చూడ నుదయపువేళ
    అక్కజంబయ్యె నందర కగుటను ముర
    హరుని కరములు శంఖచక్రాంచితములు!

    రిప్లయితొలగించండి
  26. హరునికరంబులందునలరారుచునుండెనుశంఖచక్రముల్
    హరియుహరుండునొక్కరనినార్షముచెప్పగవింటిమేగదా
    యరయగదోషమేదియునునట్లనలేదుగరాజశేఖరా!
    నిరతమునంజలిత్తునికనురజనాభుకుసాంబమూర్తికిన్

    రిప్లయితొలగించండి


  27. As per revised orders :)


    శూలమా భక్తులను గావ సొబగు చేరె
    హరుని కరములు, శంఖచక్రాంచితములు
    చేరెనా విష్ణువుని, దుష్టశిక్షణమ్ము,
    శిష్టరక్షణ చేయగ చిగురుబోడి!


    జిలేబి

    రిప్లయితొలగించండి
  28. కరినికాపాడగలడంతకరుణతోను
    అరినిఁదెగటార్చెనర్జునునండనుండి
    అరయలోనుండుశక్తియుహరుడుగాదె
    హరునికరములుశంఖచక్రాంచితములు

    రిప్లయితొలగించండి
  29. Sankarabharanam blogger Sankarayya questions Kavi Samrat titles for newbie poets

    RHYME AND REASON

    V V Balakrishna @Hyderabad

    Peeved over literary organisations indiscriminately awarding titles such as Kavi Samarat and Kavi Chakravarthi, a 70-year-old retired Telugu teacher and poet Kandi Sankarayya started an indefinite fast and went into self-isolation late on Friday night.

    However, scores of his disciples and friends intervened and prevailed upon Sankarayya to withdraw his indefinite fast by Saturday afternoon.
    The retired teacher felt that Telugu Birudulu (titles) were losing their significance in current times.

    The title Kavi Samrat was bestowed on Viswanatha Satyanarayana and Kavi Chakravarthi was given to another famous poet Gurram Jashuva long back. Both the literary stalwarts - Viswanatha and Jasuhva — are Sankarayya's favourite poets.
    He objects to literary organisations giving the same titles to newbie poets, who struggle to write a sentence or even a word in chaste Telugu.

    "I started an indefinite fast last night and went into self-isolation to protest the attitude of some organisations. But my friends advised me to call off the fast," Sankarayya told Express on Saturday.
    He was also upset over a literary organisation inviting theses from the public saying they would be presented with doctorates by the Governor.

    Sankarayya worked as a Telugu teacher in a Warangal school and settled in Hyderabad after retirement. He runs a blog Sankarabharanam (kandishankaraiah.blogspot.com) since 2008. He invites Telugu poems by giving out a daily topic. Language lovers from across the globe send in Telugu metered poetry (chandassu) to this popular blog.


    The New Indian Express

    రిప్లయితొలగించండి
  30. నిరతము పృథ్విపై ప్రజల నిండుమనస్సున కాచుచుండు నా
    హరి పరిపోషనమ్మునిడియర్థి భజించుచు నున్న నిచ్చతో
    దురిత మనస్కులై చెలగు ధూర్తులఁ ద్రెక్కొన రుక్మిణీ మనో
    హరుని కరంబులందు నలరారుచునుండెను శంఖచక్రముల్

    రిప్లయితొలగించండి
  31. క్రొవ్విడి వెంకట రాజారావు:

    వరములనిచ్చి నిచ్చలు నపారముగా కరుణించు దైవమై
    ధరణిని వెల్గులీనెడి శంకరుడు తానె ప్రతుష్టి నొందుచున్
    హరిహరతత్త్వ మందున ప్రకాశము నొందెడి వేళలోన నా
    హరుని కరంబులందు నలరారుచునుండును శంఖచక్రముల్.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. రెండవ పాదంలో గణదోషఁ. సవరిస్తున్నాను.

      " ధరణిని వెల్గు శంకరుడు తానె నపార ప్రతుష్టి నొందుచున్ "

      తొలగించండి
  32. హరునికరమునశూలమునజితుఁడు పుర
    హరుని కరములు శంఖచక్రాంచితములు
    హరునినిలయము శీతాద్రి; హరివశించు
    పరమపదమగువైకుంఠ పురమునందు

    రిప్లయితొలగించండి
  33. https://www.google.com/amp/s/www.newindianexpress.com/states/telangana/2020/aug/02/telugu-blogger-kandi-sankarayya-questions-kavi-samrat-titles-for-newbie-poets-2177916.amp

    రిప్లయితొలగించండి
  34. హరి రమానాథుని యమర వర వినుతుని
    లోక రక్షైక నాథుని లోకపూజ్యు
    పన్నగ వరేణ్య తల్పుని భక్త చిత్త
    హరుని కరములు శంఖచక్రాంచితములు


    హర హరులం గనంగ నగు నట్టి నరుం డిల నుండ శక్యమే
    నరవరుఁ డొక్కఁ డాత్మను ఘనమ్ముగ నూహ వహించి తెల్పెనే
    తిరముగ నెవ్వ రెవ్విధి మతిం దగఁ దల్చిన నుందు రవ్విధిన్
    హరుని కరంబులందు నలరారుచు నుండెను శంఖచక్రముల్

    రిప్లయితొలగించండి
  35. నా ప్రయత్నము :

    తేటగీతి
    స్వప్నమున్ గంటి వేకువ జామునందు
    కోవిడుదగు పాపము పండి కూల్చనెంచి
    బయలుదేరిన వైకుంఠ ప్రభువగు ముర
    హరుని కరములు శంఖచక్రాంచితములు

    చంపకమాల
    వరలుచు సూక్ష్మరూపమున వందల వేలుగ ప్రాణముల్ కొనన్
    బొరలెడు దుఃఖమున్ జెరపి మూలమునందున జంపఁ గోవిడున్
    దరలఁగ సిద్ధమై కదలు దైవమనంగను మాధవీ మనో
    హరుని కరంబులందు నలరారుచునుండును శంఖచక్రముల్

    రిప్లయితొలగించండి
  36. కరి మొఱ విని కనికరమున రయమున మ
    కరిని నుఱిమిన వరదుడు వరగుణ శుభ
    కరు డనంతుడా శ్రీ హరి నరయగ భవ
    హరుని కరముల శంఖచక్రమ్ము లలరె

    రిప్లయితొలగించండి
  37. అరయ పినాకమున్ డమరుకంబలరారుచు నుండు నెన్నడున్
    హరుని కరంబులందు; నలరారుచునుండెను శంఖచక్రముల్
    హరికి కరంబులందు; జగమంతట ధర్మము రక్ష సేయగా
    సరియగు నాయుధంబులను చక్కగ దాల్తురు వారలివ్విధిన్

    రిప్లయితొలగించండి
  38. తిరుమల నాదవేదికను దియ్యని
    త్యాగయ కీర్తనంబులన్
    చురుకగు వాద్యగోష్ఠులను చొక్కపు సుందరకాండ పాఠమున్
    మురియుచు వీనులాని వరమోక్ష మొసంగెడు నిందిరా మనో
    హరుని కరంబులందు నలరారుచు
    నుండెను శంఖచక్రముల్ !

    రిప్లయితొలగించండి
  39. చం:

    కరమును జూచి జోస్యముగ గాంచరె చక్రము శంఖు లెన్నియో
    నరునకు యెట్లు వచ్చునవి నా హరి మూలము గాక యున్నచో
    హరి హరు లొక్కటే యనరె యచ్చరువేలనొ నిశ్చయంబుగా
    హరుని కరంబులందు నలరారుచు నుండెను శంఖ చక్రముల్

    వై. చంద్రశేఖర్

    రిప్లయితొలగించండి
  40. సురనికరస్తుతిప్రథితశుంభదుదారవరప్రదాతృసుం
    దరవదనారవిందసముదంచితశోభనమూర్తిలోకభీ
    కరమధుకైటభాహృతసుఖప్రదవైదికతాళపత్రబర్హణా
    హరుని కరంబులందు నలరారుచునుండెను శంఖచక్రముల్.

    కంజర్ల రామాచార్య
    కోరుట్ల.

    రిప్లయితొలగించండి