9, ఆగస్టు 2020, ఆదివారం

సమస్య - 3452

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"పారిపోవలెఁ గీర్తినిఁ గోరుకొనిన"

(లేదా...)
"కాలికి బుద్ధి సెప్పవలె గ్రక్కున ధీరుఁడు గీర్తిఁ గోరినన్"

82 కామెంట్‌లు:


  1. నడిరేయి సరదా పూరణ:

    నాలుగు ప్రక్కలందు గల నాణ్యపు కోవెలలందు దూరుచున్
    గోలగ కీర్తనల్ నుడివి గొప్పగ నోడగ మోడివర్యుకున్
    చాలిక వేషమంచు వడి జందెము పీకుచు పారవేయుచున్
    కాలికి బుద్ధి సెప్పవలె గ్రక్కున ధీరుఁడు గీర్తిఁ గోరినన్

    రిప్లయితొలగించండి
  2. క్రొవ్విడి వెంకట రాజారావు:

    తనదు లాభమె ముందుగ తలచు చుండి
    క్రమమగు విధము జూపక కదలు నట్టి
    కొంటె గుణముల మిత్రుల కూర్మి వీడి
    పారిపోవలె గీర్తిని గోరుకొనిన

    రిప్లయితొలగించండి
  3. 09.08.2020
    అందరికీ నమస్సులు 🙏🙏

    *సరదా పూరణ* 😀😀

    *తే గీ*

    అన్న పేరు పొందిన యొక హంతకుండు
    నాన్న నీకు తెలియదేమి నరికి జంపు
    నట్టి మనుజుల యింట నమ్మాయిని విడి
    *"పారిపోవలెఁ గీర్తినిఁ గోరుకొనిన"*

    *కళ్యాణ్ చక్రవర్తి, ముంబాయి*
    🙏🙏

    రిప్లయితొలగించండి

  4. ఆటవిడుపు సరదా పూరణ:
    (జిలేబి గారికి అంకితం)

    పోలుచు నాంజనేయు వలె పొంకము మీరగ మావొ భక్తుడై
    వాలము త్రిప్పుచున్ తనరి వంగల భూమిని కాల్చివేయుచున్
    చీలిచి చెండెదంచు భళి చిక్కగ దీదికి సీతరాముడే
    కాలికి బుద్ధి సెప్పవలె గ్రక్కున ధీరుఁడు గీర్తిఁ గోరినన్

    రిప్లయితొలగించండి
  5. ధర్మజాదులు విరటుని దరికిఁజేరి
    తలను దాచుకొనంగలేదా!బలీయ
    మైన విధి నెంచి-కాలముఁగానినాడు
    పారిపోవలెఁగీర్తినిఁగోరుకొనిన

    రిప్లయితొలగించండి
  6. ఆలియె కోపగించి క్షణమాగక తిట్లను గుమ్మరించగా
    పోలిసు వీరసామి దన ముందర వాహన మాపినంతనే
    జాలిని జూపకే తనను జంపగ వచ్చెడి కాబులీగనన్
    కాలికి బుద్ధిచెప్పవలె గ్రక్కున ధీరుడు కీర్తిగోరినన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. వరూధినీ ప్రవరాఖ్యము

      మేలిమి పైడివన్నియల మేనునుగల్గిన
      నప్సరాంగనే
      జాలిని జూపుమంచు దనజాణ తనమ్మున ప్రేమగోరగా
      జాలమునందునన్ బడక చక్కగ దాని దిరస్కరించుచున్
      కాలికి బుద్ధిచెప్పవలె గ్రక్కున ధీరుడు కీర్తిగోరినన్

      తొలగించండి
    2. రాము,కీర్తుల ప్రేమకథ

      వేరు కులమని రాముని వేరుపరచ
      కారులేదని పేదని దూరగాను
      దారిలేదిక నిద్దరు చేరి రాత్రి
      పారిపోవలె గీర్తిని గోరుకొనిన

      తొలగించండి


    3. వాటె పిటీ వరూధిని‌ :)

      "వలపుల కన్నె వచ్చిన చివాలున " నో" యని పారిపోదురే?"



      జిలేబి

      తొలగించండి
    4. మీ మూడు పూరణలు బాగున్నవి. అభినందనలు.

      తొలగించండి
    5. ధన్యవాదములు గురుదేవా! నమస్సులు! 🙏🙏🙏

      తొలగించండి
    6. @ జిలేబి గారు
      అన్నట్టు మీ బ్లాగుపేరు వరూధిని కదా! 😊😊😊

      తొలగించండి
  7. క్రొవ్విడి వెంకట రాజారావు:

    వాలకమైన వర్తనము బాగును దల్చు గుణమ్ము లెవ్వియున్
    వ్రాలకనుండు వేషమున ప్రాకుచు స్వీయఫలమ్ము లొందగన్
    వాలయమంత వెంటబడు వంచక మిత్రుల వీడనాడుచున్
    కాలికి బుద్ధి సెప్పవలె గ్రక్కున ధీరుఁడు గీర్తిఁ గోరినన్

    రిప్లయితొలగించండి
  8. దారి జూపుచు పదుగురి జేరి, వారి
    మంచి చెడుగుల యోచించి, మనసు నందు
    గూడు గట్టిన స్వార్థంపు ౙాడ విడిచి
    పారి పోవలె, గీర్తిని కోరు కొనిన!

    రిప్లయితొలగించండి
  9. మాలలు వేసి గొల్చెదరు మాన్యులు ధీరుని జూచినంతటన్
    చాలును చోద్యమంచు తెగ సవ్వడిసేతురు బుద్ధిహీనులున్!
    పాలను నీటగల్పినను పాడవునట్లగు వారి సంఘమున్
    కాలికి బుద్ధి సెప్పవలె గ్రక్కున ధీరుడు కీర్తి కోరినన్!

    ధీరుడు - ధీ బలము కలవాడు, పండితుడు
    Rohit🙏🏻🙏🏻🙏🏻

    రిప్లయితొలగించండి
  10. హరికి పూజల్ వలదిచట,నట్టి‌ వారు

    పారి పోవలె,కీర్తిని‌ కోరు కొనిన

    వారు హరనామమే సల్పి బ్రతుక‌వలయు

    ననుచు బలికె లంకేశుడు జనుల తోడ




    హరి నామ కీర్తన నా రాజ్యం లో‌ నిషేధము అని రావణాసురుడు తెలుపు‌ సందర్భంలో

    రిప్లయితొలగించండి
  11. నీతి నియమంబు వల్లించు నేతలంత
    నీడు నిచ్చుచు పేదల తోడు నిలచి
    హంగు లార్బాట ములనన్ని నడ్డు కొనుచు
    పారిపోవలెఁ గీర్తినిఁ గోరుకొనిన

    కొరుప్రోలు రాధాకృష్ణరావు

    రిప్లయితొలగించండి
  12. నీతి నియమంబు వల్లించు నేతలంత
    నీడ నిచ్చుచు పేదల తోడు నిలచి,
    హంగు లార్బాట ములవీడి ననవరతము
    పారిపోవలెఁ గీర్తినిఁ గోరుకొనిన

    కొరుప్రోలు రాధాకృష్ణరావు

    రిప్లయితొలగించండి
  13. పాడు పనులకు నెన్నడు కడు దవ్వు
    పారిపోవలెఁ, గీర్తినిఁ గోరుకొనిన
    మ౦చి పనులకు మనమున మార్గమిచ్చి
    జీవనమ్మును సఫలము చేయవలయు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      మొదటి పాదంలో గణభంగం, యతిదోషం. సవరించండి.

      తొలగించండి
  14. రిప్లయిలు
    1. వీలగునేల మొగ్గరము? భీష్మపితామహకుంభసంభవో
      ద్వేలపరాక్రమప్రకటవీరసమాహృతభీకరమ్మునన్
      చాలు బృహన్నలా? యని యశమ్మది వచ్చును జీవముండినన్
      కాలికి బుద్ధి సెప్పవలె గ్రక్కున ధీరుఁడు గీర్తిఁ గోరినన్.

      కంజర్ల రామాచార్య
      కోరుట్ల.

      తొలగించండి
    2. మీ పూరణ అద్భుతంగా ఉన్నది. అభినందనలు.

      తొలగించండి

  15. కీర్తి అనే చిగురాకుబోడి తో రమేశుడి ప్రణయ విచారము :)

    పెండ్లి యాడగాను రమేశ! పెద్దలెల్ల
    మంకు పట్టి కుదరదని మాటి మాటి
    కి తడ కట్టిరి పరుగులంకించుకొనుము
    పారిపోవలెఁ గీర్తినిఁ గోరుకొనిన!



    జిలేబి

    రిప్లయితొలగించండి

  16. మేలగు సత్పథంబునను మిక్కిలి దీక్ష జరించు చుండు స
    చ్ఛీలగుణాన్వితుండయిన క్షేమము లెంచుచునున్న దౌష్ట్యమే
    కీలకమైన ప్రాంతమున కిమ్మనరా దది చూడకుండగా
    కాలికి బుద్ధి సెప్పవలె గ్రక్కున ధీరుఁడు గీర్తిఁ గోరినన్


    రిప్లయితొలగించండి
  17. కదనరంగాన వైరులమదమునణచి
    పోరుసలిపినశత్రువు భీరువగుచు
    పారిపోవలెఁ ,గీర్తినిఁ గోరుకొనిన
    వెన్నుచూపరు యుద్ధాన వీరులెపుడు

    రిప్లయితొలగించండి
  18. విత్తమార్జింప దలచుచున్ వేడ్కగాను
    ఘన పురస్కారములసేతు మనుచు నేడు
    జగతిని వెలసి నట్టి యా సంస్థలగని
    పారిపోవలెఁ గీర్తినిఁ గోరుకొనిన

    రిప్లయితొలగించండి


  19. కందోత్పల


    కడగండ్లకు పరుగులిడక
    వడి, కాలికి బుద్ధి సెప్పవలె, గ్రక్కున ధీ
    రుఁడు గీర్తిఁ గోరినన్, తడ
    బడక నిలువవలెనటంచు పరిపూర్ణముగా


    జిలేబి

    రిప్లయితొలగించండి
  20. మైలవరపు వారి పూరణ

    ఈ కీర్తి సహజమైనది కాదు.. అని తిరస్కరించాలంటే కొంత ధైర్యం కూడా కావాలి. 🙏

    గోల యిదేమొ గాని కవికోకిలలున్ కవిచక్రవర్తులున్
    వేలకు వేలునైరి., పదివేలనిడన్ లభియించుచుండె నా..
    మాలివి., యిట్టి సంస్థలు ప్రమాదములౌ., నవి పిల్వ., మెల్లగా
    కాలికి బుద్ధి సెప్పవలె గ్రక్కున ధీరుఁడు గీర్తిఁ గోరినన్!!

    మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

    రిప్లయితొలగించండి
  21. అడుగడుగునభయపడుచునే
    బడి, కాలికి బుద్ధి సెప్పవలె గ్రక్కున ధీ
    రుఁడు గీర్తిఁగోరినన్ వెం
    బడి వచ్చెకరోనరుజకు బడులే నెలవౌ

    రిప్లయితొలగించండి
  22. అనువుగానిచోటులనిల్చి యధికులనక
    పారిపోవలెఁఁ,గీర్తినిఁగోరుకొనిన
    దైవమేజయాపజయముస్థైర్యధైర్య
    మంచుధీరుండుపోరాడునంచితముగ

    రిప్లయితొలగించండి
  23. తాలిమితోడయుద్ధమున దాయలగూల్చుచు విక్రమించుచున్
    కాలునివోలెవాలమును క్రమ్మర త్రిప్పగ శత్రు సైన్యముల్
    కాలికి బుద్ధి సెప్పవలె గ్రక్కున, ధీరుఁడు గీర్తిఁ గోరినన్
    జాలినిచూపరాదెపుడు చంపుటకున్ తన వైరి వీరులన్

    రిప్లయితొలగించండి
  24. కాలికి వేలికిన్ ముడులు గర్వితులైధనదాహులైసదా
    మేలునుగోరకే పిలిచి మృత్యుసమంబవమానపగ్నితో
    గ్రాలగజేసిగూల్చఁదిరకాసులనీసునువెళ్ళగ్రక్కుచో
    "కాలికి బుద్ధి సెప్పవలె గ్రక్కున ధీరుఁడు గీర్తిఁ గోరినన్"

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'అవమానపు టగ్ని' అనడం సాధువు. అవమాన వహ్ని... అనవచ్చు.

      తొలగించండి
  25. ఆలమునందు వైరితతి పై విజయమ్మది కష్టమైనచో
    కాలికి బుద్ధి సెప్పవలె గ్రక్కున ధీరుఁడు గీర్తిఁ గోరినన్
    వీలును బట్టి వ్యూహమును వేగముగా సరిదిద్దుకొంచు స
    త్కాలములోన పూనుకొని కయ్యము చేయ జయమ్ము కల్గు చూ

    రిప్లయితొలగించండి
  26. వ్రాసి యొకటియో రెంటినో పద్యములను,
    ముట్టజెప్ప నెంతయొకొంత, ములగచెట్టు
    పైకి నెట్టు మూర్ఖుల దరిఁ బోక, సుకవి
    పారిపోవలెఁ గీర్తినిఁ గోరుకొనిన

    రిప్లయితొలగించండి
  27. కేలకు కంకణంబులు ను కెంపుల హారము చిత్రచేలముల్
    వేలికి యుంగరంబు సరి వేడుక తీరక మేఖలంబనన్
    వేలకు వేలు డబ్బుగొని వేమరు వేసట గూర్చి బుర్ర గో
    కాలికి బుద్ధి సెప్పవలె గ్రక్కున ధీరుడు గీర్తి గోరినన్

    రిప్లయితొలగించండి



  28. దుష్టు లున్నట్టి తావు లం దుండ బోక
    *పారిపోవలె, కీర్తిని కోరుకొనిన*
    జగతి యందు మంచి పనులు చక్కగాను
    నాచరించు చుండ వలయు ననవరతము.

    గాలికి సోకు నీరుజను కట్టడి చేయక యున్నచెప్పకన్
    మాలిమితోడచెంతకును మానుగ చేరుచు హానికూర్చదా
    వీలయి నంతదూ రముగ వేగము గానిట మాస్కు దాల్చుచున్
    *"కాలికి బుద్ధి సెప్పవలె గ్రక్కున ధీరుఁడు గీర్తిఁ గోరినన్"*


    రిప్లయితొలగించండి
  29. ధైర్యసాహసములతోడపోర,యరులు
    కదనరంగానభీతినికాలుముడిచి
    పారిపోవలె,గీర్తినిగోరుకొనిన
    నెదురుదాడికినిలబడిహదముజేయి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      మొదటి పాదంలో యతిదోషం. హదము జేయి..?

      తొలగించండి
  30. చేత గానట్టి వారలు సిగ్గు చేత
    పారి పో వలె : గీర్తిని గోరు కొనిన
    నిలిచి ప్రతిభను చాటుచు నిగ్గు లొలుక
    మెప్పు నొందుచు భాసింత్రు మేటి యగుచు

    రిప్లయితొలగించండి
  31. వేలకువేలుగానరులువెంబడివచ్చుచునుండగానికన్
    గాలికిబుద్ధిసెప్పవలెగ్రక్కున,ధీరుడుకీర్తికోరినన్
    జాలినధైర్యమున్వడసిశత్రుసమూహముబంపగావలెన్
    జాలముసేయకన్దివికిచక్కటియుక్తినిబోరుజేయుచున్

    రిప్లయితొలగించండి


  32. తూలకు నిమ్మళమ్ము విడి తొందర దేల భయమ్మదేలరా?
    చాలిక సోదరా! వలదు సాధ్యము కానిది లేదదేలరా
    కాలికి బుద్ధి సెప్పవలె గ్రక్కున ధీరుఁడు? గీర్తిఁ గోరినన్
    చాలదు దానికై వలయు చాతురి పెంచుకొనంగ మేలగున్!


    జిలేబి

    రిప్లయితొలగించండి
  33. ఆలి విరాళితో బసిడి యంచుల వన్నెల చీర గోరినన్
    యేలను మాట లేక పరికింపక వేళ దుకాణమేగగా
    కాలికి బుద్ధి సెప్పవలె గ్రక్కున ధీరుఁడు గీర్తిఁ గోరినన్
    గేలిని సేయబోకుడయ కేశవుడైనను కాంత దాసుడే

    రిప్లయితొలగించండి
  34. కాలము చెల్లిపోవు నపకారుల కాతడు గాంచినంతనే
    కాలుని వోలె యాలమున గాలిడినంతనె వైరి వీరులున్
    కాలికి బుద్ధి సెప్పవలె గ్రక్కున; ధీరుఁడు గీర్తిఁ గోరినన్
    కాలగతిన్ బరాక్రమమె గాక ప్రశాంతత నిల్పు మేలుగా

    రిప్లయితొలగించండి
  35. వాలుగ కంటితోడ పసిబాలల తోడ నృశంసు తోడ గ
    య్యాళుల తోడ హీనుల కృతాత్ముల తోడ సమిత్తు కూడదే
    యాలియె యాగ్రహించి కలహమ్ముకు సిద్ధమటంచు పల్కినన్
    గాలికి బుద్ధి సెప్పవలె గ్రక్కున ధీరుఁడు గీర్తిఁ గోరినన్

    రిప్లయితొలగించండి
  36. తాళ వృక్ష మూలమ్మునఁ ద్రాగుచుండఁ
    బాలు దా నగు నిందల పాలు సుమ్ము
    దుష్టజన సమూహము నుండి కష్ట మయినఁ
    బాఱిపోవలెఁ గీర్తినిఁ గోరుకొనిన


    నేలఁ జెలంగ శత్రువులు నివ్వెఱ సెందక వీరు లెల్లరున్
    వాలి సశస్త్ర సంచయము వారిని నాజి జయించ నొప్పఁగా
    నాలము సేయ నేఁగు నపు డడ్డిడి యింతయు భీతిఁ గొల్ప నీ
    కాలికి బుద్ధి సెప్పవలె గ్రక్కున ధీరుఁడు గీర్తిఁ గోరినన్

    [గొల్పనీక + ఆలికి = గొల్పనీ కాలికి]

    రిప్లయితొలగించండి
  37. నేటికాలంపుపోకడనిజముఁదెలియ
    మాటుమలినంబుచూడగమనిషికుండు
    ధర్మసంగతిమరచిననరుడెమేటి
    పారిపోవలెకీర్తినిఁగోరుకోనిన

    రిప్లయితొలగించండి

  38. పిన్నక నాగేశ్వరరావు.

    ధూర్త మానవుల కెపుడు దూరముగను
    పారిపోవలెఁ ; గీర్తినిఁ గోరుకొనిన
    నాచరించుచు సత్కర్మ లనవరతము
    జగతి ధర్మాను వర్తియై సాగవలయు.

    రిప్లయితొలగించండి
  39. ఉ:

    కాలమె దీర్పు చెప్పు గద కానిది యేదదొ మంచి దేదనిన్
    పోలిక లెంత మాత్రమున పొందికగూర్చవు చిత్తగించగన్
    శీలము నెంచ వాలు గని శీర్షము వాల్చ ప్రవాహ మార్గమై
    కాలికి బుధ్ధి జెప్పవలె గ్రక్కున ధీరుడు కీర్తి గోరగన్

    వై. చంద్రశేఖర్

    రిప్లయితొలగించండి
  40. మేలపు మాటలన్ బలికి మిమ్ముల మిన్నగ జూతునంచునే
    పాలకులై జనాళి నిటు బాధలు పెట్టెదరంచెరంగకన్
    వేలకు వేలుగా గదలి పెద్దల జేసిరి, వారి యాగ్రహ
    జ్వాలల జిక్కకుండ పరిపాలన జేయుచు సవ్యమౌ విధిన్
    మేలొనరించుటే తిరిగి మెప్పును పొందెడి దారి నందికన్
    కాలికి బుద్ధి సెప్పవలె గ్రక్కున ధీరుఁడు గీర్తిఁ గోరినన్

    రిప్లయితొలగించండి
  41. మేలగు నార్షధర్మమును మేఁగొని జక్కగ నాచరించుచున్
    శీలము ధర్మమూ లముగ శిల్పముఁజెక్కుచు మూర్తిమంతుడై
    కాలపు రాగబం ధమున కర్మను మానక స్వార్థమూనకన్
    కాలికి బుద్ధి సెప్పవలె గ్రక్కున ధీరుఁడు గీర్తిఁ గోరినన్

    కొరుప్రోలు రాధాకృష్ణరావు

    రిప్లయితొలగించండి
  42. తేటగీతి
    ఎన్నికల ముందు వాగ్దాన మిచ్చినటులఁ
    బాలనంబున నేతవై పటిమ తోడ
    నేలినంతట దారిద్ర్యమిలను వీడి
    పారిపోవలెఁ, గీర్తినిఁ గోరుకొనిన!

    ఉత్పలమాల
    పాలన లోన జూపెదను పాటవమింపుగటంచుఁబల్క, మి
    మ్మేలిక జేసినంతఁ బ్రజ లెన్నుచు చిక్కు సమస్యలన్నిటిన్
    దేలిచి ధైర్యవంతుడుగ దీనులఁ గావఁగఁ గష్టనష్టముల్
    కాలికి బుద్ధి సెప్పవలె గ్రక్కున, ధీరుఁడుఁ గీర్తి కోరినన్

    రిప్లయితొలగించండి
  43. ప్రాణతీపిచేత బతుకవలయునన్న
    పారిపోవలెఁ గీర్తిఁగోరుకొనిన
    అవని జీవశ్చవముఁగాక నభ్యుదయపు
    పాత్ర నటియింపమేలంద్రు పార్టి బెట్టి

    రిప్లయితొలగించండి