13, ఆగస్టు 2020, గురువారం

సమస్య - 3456

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"స్వప్నములోఁ గన్నదెల్ల వాస్తవమయ్యెన్"

(లేదా...)
"స్వప్నమునందుఁ గాంచినది వాస్తవమై ముదమందఁ జేసెరా"

72 కామెంట్‌లు:


  1. "శ్రీ రాముని దయ చేతను..."

    నడిరేయి సరదా పూరణ:

    స్వప్నపయోధ్యనున్ జనుచు చక్కగ కూర్చిన మండపమ్మునన్
    నిప్ణులు జేరి మంత్రములు నిండు మనమ్మున నుచ్చరించగా
    నప్న పరాయనున్ గనని హ్లాదము నిచ్చెడి రామునిన్ గుడిన్
    స్వప్నమునందుఁ గాంచినది వాస్తవమై ముదమందఁ జేసెరా

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు

    1. "When the question paper is tough, even the attempt is golden"

      ...Professor HN Bose, IIT Kharagpur

      తొలగించండి


    2. కందోత్పల గా మార్చేస్తే సరి :)



      అదిగో అయోధ్య గాంచితి
      నదె స్వప్నమునందుఁ గాంచినది వాస్తవమై
      ముదమందఁ జేసె రాముం
      డదే కొలువు తీరె నిడుగడల దాటి సుమా



      జిలేబి

      తొలగించండి
    3. :)

      అది డొంకతిరుగుడు వ్యవహారమే తల్లీ!

      తొలగించండి
    4. పోనీ సీసము గా మార్చండి శాస్త్రి గారు

      తొలగించండి
    5. ప్రభాకర శాస్త్రి గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'స్వప్నపు టయోధ్యనున్' అనడం సాధువు. రెండవ పాదంలో ప్రాస తప్పింది. నిపుణులను నిప్ణులు అనరాదు. "రాము కోవెలన్" అంటే బాగుంటుందేమో?
      సమస్య ఇచ్చే సమయంలో ఇది దుష్కరప్రాస అన్న ఆలోచన రాలేదు.
      ****
      జిలేబీ గారూ,
      ప్రాసక్లేశాన్ని తప్పించుకొనడానికి మీ కందోత్పల ఇతర కవిమిత్రులకు మార్గదర్శనం చేస్తుంది. బాగుంది. అభినందనలు.
      *****
      యం.వి.వి.యస్. శాస్త్రి గారూ,
      మీరు చెప్పిన సీసపద్య పూరణ కూడా ఈ క్లిష్టప్రాసకు విరుగుడు.

      తొలగించండి

  2. ఆటవిడుపు సరదా పూరణ:
    (జిలేబి గారికి అంకితం)

    స్వప్నపు సుందరిన్ గనగ చాకలి వీధిని ముత్తుకూరునన్
    నిప్ణులు గూర్చినన్ సినిమ నిక్కపు రీతిది డేరనందునన్
    గప్నుల మాని మాధురిని కమ్మగ చూడగ దేవదాసునన్
    స్వప్నమునందుఁ గాంచినది వాస్తవమై ముదమందఁ జేసెరా

    రిప్లయితొలగించండి


  3. ( అమృతభాండాన్ని తెచ్చి కద్రువకిచ్చి తన
    దాస్యం పోగొట్టిన గరుత్మంతునితో వినత )
    స్వాప్నికజీవితమ్ము తను
    వంతయు నిండె ; సుపర్ణ ! పుత్రకా !
    స్వప్నములందు గద్రువకు
    సంతసమిచ్చితిమంట ! నేటికిన్
    స్వప్నము గాదు ; దాస్యమిక
    సాంతము పోయెను నీకతమ్మునన్ ;
    స్వప్నమునందు గాంచినది
    వాస్తవమై ముదమందజేసెరా !!
    ( సుపర్ణుడు - గరుత్మంతుడు )

    రిప్లయితొలగించండి
  4. క్రొవ్విడి వెంకట రాజారావు:

    స్వప్నములో యుధిష్టిరిని సంపద లెల్లను కొల్లగొట్టుటల్
    స్వప్నముగానె యుండునని భావన సేసిన రాజరాజుకున్
    స్వప్నముగాక యా శకుని పాళిని గెల్వగజేసి వానికిన్
    స్వప్నమునందు గాంచినది వాస్తవమై ముదమొంద జేసెరా!

    రిప్లయితొలగించండి
  5. పెనుభూత మొక్కటి వేగము గానిన్ను
    కొనిపోవు చున్నట్లు, తనువు‌ నీలి

    వర్ణమై నట్లు,నా వదనము పైనున్న
    తిలకము రయముగా తొలగి‌ నట్లు

    కలగంటి ననితెల్ప వలచితి
    విగ నీవు
    సంగ్రామమును, చూడ జాల నీదు

    రూపము, స్వప్నము లోగన్న దెల్లవా
    స్తవమయ్యె నీఘోర సమర మందు,

    నీవు లేక బ్రదుకుజాల నేను భువన

    మందు కోరెద సతము‌నీ పొందు స్వర్గ

    మందు ననుచు నుత్తర అభి మన్యుని గని

    కార్చు చుండెవిడువ కుండ కంట‌ నీరు

    రిప్లయితొలగించండి


  6. స్వప్నమ్ము లెల్ల చెలి య
    స్స్వప్నుల దీవెనలగుట నిశాంతంబున నా
    స్వప్నమునకనబడగ నిధి
    స్వప్నములోఁ గన్నదెల్ల వాస్తవమయ్యెన్!


    ఎంత ఆశయో :)

    జిలేబి

    రిప్లయితొలగించండి
  7. హిప్నాటిజముము చేసెడి
    స్వప్నను పెండ్లాడినట్లు స్వప్నము గంటిన్
    స్వప్న నను గోర నిపుడు
    స్వప్నములోఁ గన్నదెల్ల వాస్తవ మయ్యెన్.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      హిప్నాటిజమును జేసెడి... అనండి.

      తొలగించండి
  8. పవికాఠిన్యముఁ ద్రోసిపుచ్చు కవివాక్పారుష్యముం గాంచి యా
    పవి లజ్జానతమౌచు ముక్కలయె, తద్వాగ్దీప్తినిం జూచి యా
    యవమానమ్మును సైపలేక పటుగాఢాంధాబ్ధినిన్ మున్గి యా
    రవి గ్రుంకెన్ నడిరేయి 'నయ్యొ తెలవారన్ దెల్లమో' నంచు తా

    కంజర్ల రామాచార్య
    కోరుట్ల

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. స్వప్నము పేదవారలకు భాగ్యసుఖమ్ముల జాడఁ దెల్పు నా
      స్వప్నము రాని వారలుకు స్వాప్నికభోగము శూన్యమేగదా!
      స్వప్న మదృష్టవంతులకు భావిసముద్భవసూచకమ్మునై
      స్వప్నమునందుఁ గాంచినది వాస్తవమై ముదమందఁ జేసెరా!

      కంజర్ల రామాచార్య
      కోరుట్ల.

      తొలగించండి
    2. మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.

      తొలగించండి


  9. కందోత్పల


    అదిగో వెంకన్న గుడి ని
    నద! స్వప్నమునందుఁ గాంచినది వాస్తవమై
    ముదమందఁ జేసె రావ
    మ్మ దరి యనుచు వేల్పు బిలిచె మందిరమునకే!



    జిలేబి

    రిప్లయితొలగించండి
  10. క్షిప్నువు లెదురొడ్డిననుఁ న
    నప్నసు పురుషున కొకగుడి నయమున గట్టన్
    స్వప్న మయోధ్యాపురినన్
    స్వప్నములోఁ గన్నదెల్ల వాస్తవమయ్యెన్!

    క్షిప్నువులు-తిరస్కరించువారు
    అనప్నస్-రూపములేనివాడు/వేదము

    రిప్లయితొలగించండి
  11. స్వప్నమునందుబాడితినివాస్తవబాధలుసంకటమ్ములున్
    స్వప్నములైనమోదమగుబంధుజనంబులునిల్లువాకిలుల్
    స్వప్నముగావెమాధవునిపాదములేదరసించితేనునా
    "స్వప్నమునందుఁ గాంచినది వాస్తవమై ముదమందఁ జేసెరా"

    రిప్లయితొలగించండి
  12. మైలవరపు వారి పూరణ

    అప్నవపూరితమ్మగు జలాశయమందు మదీయపత్ని., సం...
    దీప్నవనీతలన్ సుతులు., నేనును డిగ్గిన రీతి గాంచితిన్
    స్వప్నము., నేడు మేడపయి స్నానపుతొట్టె మునుంగుచుండగా
    స్వప్నమునందు గాంచినది వాస్తవమై ముదమందజేసెరా!!

    మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మైలవరపు వారి పూరణ ప్రశస్తంగా ఉన్నది.

      తొలగించండి
    2. అప్ + నాథుడు =అమ్నాథుడు / అబ్నాథుడు
      అప్ + మయము= అమ్మయము / అబ్మయము
      అప్ + రాశి = అబ్రాశి
      కకుప్ + అధిపతి = కకుబధిపతి
      - తత్సమచంద్రిక.

      కావున
      అప్ +నవము = అమ్నవము / అబ్నవము
      అని నా యభిప్రాయము.



      తొలగించండి
  13. స్వప్నములేముదావహముపాడెదతీయగచల్లగాసదా
    స్వప్నములేకుచేలురకుసౌఖ్యముమోదముభోగభాగ్యముల్
    స్వప్నముసేదదీర్చుమనసంతయునూరటజెందుమంచిదౌ
    "స్వప్నమునందుఁ గాంచినది వాస్తవమై ముదమందఁ జేసెరా"

    రిప్లయితొలగించండి


  14. స్వప్నము గాంచితిన్ విభుని సన్నిధి చేరగ కౌగిలించిర
    స్వప్నులు నన్ను ముద్దిడుచు స్వామియు చేర్చుకొనంగ నక్కునన్
    స్వప్నమునందుఁ గాంచినది వాస్తవమై ముదమందఁ జేసె, రా
    స్వప్నము లే ఋతంబయిన సౌఖ్యము నిత్యము సత్యమౌగదా!


    జిలేబి

    రిప్లయితొలగించండి
  15. స్వప్నము గాంచిరీ వనిని సాధన జేయగ నాటినుండి య
    స్వప్నికుడౌ రఘూత్తముని జన్మకు కారణమైన భూమినిన్
    స్వప్నము కాదు సత్యమనగ జన్మము సార్థక మొంద మోడియున్
    స్వప్నమునందు గాంచినది వాస్తవమై ముదమంద జేసెరా !

    రిప్లయితొలగించండి
  16. స్వప్నములూరకేగనరుసాధులుసంతులుయోగమందునన్
    స్వప్నములీలదర్శనముభాగ్యముగందురుభావికోసమై
    స్వప్నమెమార్గదర్శనముభవ్యకలాముడెగన్నయట్టియా
    "స్వప్నమునందుఁ గాంచినది వాస్తవమై ముదమందఁ జేసెరా"

    రిప్లయితొలగించండి
  17. స్వాప్ని కు డై జీవించుట
    స్వప్న ములను పగటి వేళ వలదందురు గా
    స్వప్నము కల్ల ల దెట్టుల
    స్వప్నము లో కన్న దెల్ల వాస్తవ మయ్యెన్?

    రిప్లయితొలగించండి
  18. అప్నయకారి కరోనా
    స్వప్నములోగన్నదెల్ల వాస్తవమయ్యెన్
    తప్నయ టీకా వచ్చెను
    ఉప్నయముగ గెల్చునిను నిరోధకశక్తిన్.

    రిప్లయితొలగించండి
  19. స్వప్నా శేషుల స్వగృహ
    స్వప్నము సాకారమౌను సరిగా నేడే
    స్వాప్నికులకు కృషి దోడై
    స్వప్నములోఁ గన్నదెల్ల వాస్తవమయ్యెన్

    రిప్లయితొలగించండి
  20. 13.08.2020
    అందరికీ నమస్సులు 🙏

    నా పూరణ యత్నం..

    *కం*

    స్వప్నములో గంటిని నే
    స్వప్న యనెడి పిల్ల యొకతి సతిగా బొందన్
    స్వప్నము గాదది దేవుడ!
    *"స్వప్నములోఁ గన్నదెల్ల వాస్తవమయ్యెన్"?*

    *కళ్యాణ్ చక్రవర్తి, ముంబాయి*
    🙏

    రిప్లయితొలగించండి
  21. స్వప్నముల గనుట సహజము
    స్వప్నములన్ గనినవెల్ల సత్కర్మలచే
    స్వాప్నికుడే సాధించిన
    స్వప్నములో గన్నదెల్ల వాస్తవమయ్యెన్

    రిప్లయితొలగించండి
  22. స్వాప్నికుడౌట జాలదిక సాధన జేసి నిరంతరాయమున్
    స్వప్నమునందుఁ గాంచినది సాధ్యము జేయు ప్రయాణమందు దు
    స్వప్నములెన్ని దోచినను జంకక సాగగ నందరందురా
    స్వప్నమునందుఁ గాంచినది వాస్తవమై ముదమందఁ జేసెరా

    రిప్లయితొలగించండి
  23. Savarana:

    ఉ||
    తృప్నుడెవండటన్న కల వృద్ధిగొనన్ నిజమొందుటం సదా
    క్షిప్నువు పట్టువస్త్రములు జేయుట దీక్షగ కష్టజీవియై
    సాప్నిని చుట్టురీతి కృషి సాధన జేసిన మాన్యజీవికిన్
    స్వప్నమునందు గాంచినది వాస్తవమై ముదమందజేసెరా

    ఆదిపూడి రోహిత్ శర్మ🙏🏻🙏🏻🙏🏻

    రిప్లయితొలగించండి
  24. కె.వి.యస్. లక్ష్మి:

    స్వప్నము నొందిన త్రిజటకు
    స్వప్నములో రావణుండు చావొందిన యా
    స్వప్నమె సాకారమ్మయి
    స్వప్నములో గన్నదెల్ల వాస్తవ మయ్యెన్.

    రిప్లయితొలగించండి
  25. గురువుగారికి నమస్కారములు. మొన్నటి పూరణ మార్చి వ్రాసాను. దయతో పరిశీలించండి.

    లోకంబందున యిట్టి తుంటరిని నాలోకింపగా జాలమే
    కోకల్ మ్రుచ్చిలి కోమలాంగనల గగ్గోలున్ పడంజేయుచున్
    తా కేరించుచు సందడిన్ తిరిగి బాధల్ పెట్టి తోషించి నా
    శ్రీకృష్ణుండపరాధి, దైవమగునె శిష్టాత్ములౌ వారికిన్?

    రిప్లయితొలగించండి
  26. స్వప్నమువచ్చెను,రాముడు
    స్వప్నంబునలంకకేగెబరివారముతోన్
    స్వప్నముజెరిగినజూడగ
    స్వప్నములోగన్నదెల్లవాస్తవమయ్యెన్

    రిప్లయితొలగించండి
  27. స్వప్నముఁ గాంచె నుత్తరయె భండనమున్ పతి దీర్ఘనిద్ర నా
    స్వప్నమె నిక్కమై మగడు స్వర్గము చేరి యొసంగె నార్తి, తా
    స్వప్నము నందు కౌరవుల చావును ద్రౌపది కాంచె నామెకున్
    స్వప్నమునందుఁ గాంచినది వాస్తవమై ముదమందఁ జేసెరా

    రిప్లయితొలగించండి
  28. స్వప్నక్కుత్రిజటకనియెను
    స్వప్నముసీతకుశుభమునుశమమునుఁగూర్చన్
    స్వాప్నికవిశదముసేయగ
    స్వప్నములోఁగన్నదెల్లవాస్తవమయ్యెన్
    స్వప్నక్కు-నిదురబోతు

    రిప్లయితొలగించండి
  29. స్వప్నమునందుగాంచితినిబంగరుకోవెలదిర్పతిన్ రమా!
    స్వప్నమునందువోలెయటసామియెవెంకనగొల్వుయుండెనే
    స్వప్నమునందుగాంచినదివాస్తవమైముదమందజేసెరా
    స్వప్నములన్నియున్మనకువచ్చునుజింతనజేయుబట్టియున్

    రిప్లయితొలగించండి
  30. ఉ:

    స్వప్నము దీర మాగురువు ఛందము నేర్వగ పట్టుబట్టి నా
    స్వప్నము రూపుమాప నొక వాడిమి దండము చేతబూన దు
    స్స్వప్నము వీడి బుద్ధిగొని సాధన జేసితి చోద్యమందగన్
    స్వప్నము నందు గాంచినది వాస్తవమై ముదమంద జేసెరా

    స్వప్నము : మా గురువు , తండ్రి, కల
    నా స్వప్నము : నిద్దురపోతు తనము
    దుస్స్వప్నము: నా కల గురువు దృష్టి లో

    వై. చంద్రశేఖర్

    రిప్లయితొలగించండి
  31. ఆప్నోతి పొందునని య
    స్వప్నుఁడు దేవత యని సురభాష వచించున్
    క్షిప్నుఁడవు కావల దిటన్
    స్వప్నములోఁ గన్నదెల్ల వాస్తవమయ్యెన్


    క్షిప్నునిఁ బోలెఁ జూడకుమ చిత్తము చెప్పిన రీతి నుందు దు
    స్స్వప్నము సత్య మై పరఁగ సంతసముం గన నెట్లు సంత తా
    స్వప్నుని నాకు దైవమ యపారపు భాగ్యము కల్గ నేర్చునే
    స్వప్నమునందుఁ గాంచినది వాస్తవమై ముదమందఁ జేసెరా

    [క్షిప్నువు = తిరస్కరించు వాఁడు]

    రిప్లయితొలగించండి
  32. స్వప్నం బూహల కలనము,
    స్వప్నము నీ కర్మ సాక్షి, సైఁచగ‌ నొకచో-
    స్వప్నము చేతన నొసగన్,
    స్వప్నములోఁ గన్నదెల్ల వాస్తవమయ్యెన్!

    సైఁచు=రుచించు

    రిప్లయితొలగించండి
  33. స్వప్నా! నీకిది తెలుసా?
    స్వప్నంబులునిజమగునట సత్యముజుమ్మీ
    స్వప్నముగంటిని వేకువ
    స్వప్నములోఁ గన్నదెల్ల వాస్తవమయ్యెన్

    రిప్లయితొలగించండి
  34. స్వప్న అనే స్నేహితురాలితో

    స్వప్నము లెన్నొగంటిమిగ సౌధము నొక్కటి గట్టగా మహిన్
    స్వాప్నికులైన వారికల సత్యముగాగను
    కారుచౌకగా
    స్వప్న ! యనేకసంస్థలు నివాసఋణ
    మ్ముల నీయగా దుదిన్
    స్వప్నము నందు గాంచినది వాస్తవమై ముదమంద జేసెరా !

    రిప్లయితొలగించండి
  35. లోకంబందున నిట్టి తుంటరిని నాలోకింపగా జాలమే
    కోకల్ మ్రుచ్చిలి కోమలాంగనల గగ్గోలున్ పడంజేయుచున్
    తాకేరించుచు సందడిన్ తిరిగి బాధల్ పెట్టి తోషించు నా
    శ్రీకృష్ణుండపరాధి, దైవమగునె శిష్టాత్ములౌ వారికిన్?

    రిప్లయితొలగించండి
  36. కందం
    స్వప్నము సాధ్యముగఁ దలఁచి
    స్వాప్నిక లోకమ్ము వీడి సత్కృషి నెంచన్
    స్వప్నము సాకారమొనర
    స్వప్నములోఁ గన్నదెల్ల వాస్తవమయ్యెన్

    ఉత్పలమాల
    స్వప్నము సాధ్యమౌ నటుల భావనఁ దోచఁగ చిత్త శుద్ధితో
    స్వాప్నిక లోకమున్ విడచి సత్కృషి నెంచుచు ముందుకేగినన్
    స్వప్నము బోలినట్లుగనె సాగఁగ దీక్ష నిరంతరాయమై
    స్వప్నమునందు గాంచినది వాస్తవమై ముదమందఁ జేసెరా!

    రిప్లయితొలగించండి